Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
ఈ 60 రోజులు ఎంతో కీలకం
01-05-2018 01:57:27
 
636607366509207853.jpg
  • పోలవరం పనుల్లో వేగం పెంచండి
  • జల వనరుల శాఖకు సీఎం ఆదేశం
అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వచ్చేలోగా ఈ 60 రోజులే ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని పోలవరం కాంక్రీట్‌ పనుల్లో వేగం పెంచాలని జల వనరుల శాఖను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. సోమవారం తన నివాసంలోని గ్రీవెన్స్‌హాల్‌లో పోలవరం ప్రాజెక్టుతో సహా ఇతర ప్రాజెక్టులపై సమీక్షించారు. ముందుగా పోలవరం పనుల తీరును వర్చువల్‌ విధానంలో సమీక్షించారు. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత వేగంగా ఎర్త్‌వర్క్‌, కాం క్రీట్‌ పనులు చేపట్టి లక్ష్యాన్ని అధిగమించాలని జల వనరులశాఖను ఆదేశించారు. ప్రాధాన్య ప్రాజెక్టులనూ లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని, నీరు-ప్రగతి పనులు కూడా ముమ్మరంగా జరగాలని సీఎం నిర్దేశించారు. తాను త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని, ఆ సమయంలో ఆ జిల్లాల్లోని ప్రాధాన్య ప్రాజెక్టులను సందర్శిస్తానని చంద్రబాబు వెల్లడించారు.
 
 
కాగా, ఇప్పటి వరకూ మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.02 శాతం పూర్తయిందని జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం కుడి ప్రధాన కాలువ 89.44 శాతం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.16 శాతం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, పవర్‌ హౌస్‌ ఎర్త్‌వర్క్‌ 72.30 శాతం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు 16.40 శాతం, డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం 85.10 శాతం, జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 64.90 శాతం, రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ 60 శాతం పూర్తయినట్లు చెప్పారు.
 
పోలవరం ప్రాజెక్టు కోసం మొత్తం రూ.13,430.84 కోట్లు ఖర్చు చేయగా.. జతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.8,294.97 కోట్లు ఖర్చుచేశామని శశిభూషణ్‌ కుమార్‌ వివరించారు. ఇందులో 5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ.2,952.71 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించామన్నారు. కాగా, పోలవరం పనుల తీరుపట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

జలకేతనం!
02-05-2018 01:01:49
 
636608197126849429.jpg
  • పరుగులు తీస్తున్న పోలవరం
  • 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు
  • సాకారమవుతున్న దశాబ్దాల స్వప్నం
  • కాంక్రీట్‌ పనుల్లో ‘నవ’ శకం
  • త్రీగోర్జెస్‌ రికార్డు త్వరలోనే బద్దలు
  • పూర్తిస్థాయిలో సాగుతున్న స్పిల్‌వే నిర్మాణం
  • వేగమందుకున్న స్పిల్‌ చానల్‌ పనులు
  • ఈ నెలాఖరుకు డయాఫ్రం వాల్‌ పూర్తి
  • పనుల కోసం గోదారి మళ్లింపు
  • అక్టోబరులోనే రాతి-మట్టికట్ట పనులు మొదలు
  • పోలవరం ప్రగతిపై ప్రత్యక్ష కథనం
సుమారు 75 ఏళ్ల కిందట పురుడు పోసుకున్న ఆలోచన...
దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ప్రతిపాదన...
‘మా మనవళ్ల కాలానికైనా పూర్తయితే గొప్పే’ అని ఎద్దేవా చేసిన పెద్దలు!
‘ఇది అసాధ్యమండీ! తలా తోకా లేకుండా పనులు జరుగుతున్నాయి’ అని పెదవి విరిచిన నిపుణులు!
అన్నీ అనుమానాలు... ఎన్నో సందేహాలు... మరెన్నో ఆందోళనలు!
 
 
ఇప్పుడు అవన్నీ పటాపంచలు! ఒక అద్భుత జల దృశ్యం కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది! ఒక సమున్నత జల కేతనం సగర్వంగా ఎగురుతోంది! నదీ పరివాహక ప్రాంతాల మధ్య గీతలను చెరిపేసేలా... ఆ మూల ఉత్తరాంధ్ర నుంచి దిగువనున్న రాయలసీమ దాకా రాష్ట్ర జల ముఖ చిత్రాన్ని మార్చే దిశగా... చకచకా పోలవరం అనే మహా జలాశయం రూపుదిద్దుకుంటోంది! ఇదే వేగం, ఇదే ఒరవడి కొనసాగితే... వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి నీరు జలజలా పారనుంది! ‘పోలవరం ప్రాజెక్టు’ అనే స్వప్నం... సాకారమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ‘జాతీయ ప్రాజెక్టు’ పోలవరం ప్రగతిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా అందిస్తున్న కథనం...
 
 
(పోలవరం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)
అక్కడ అందరిలో ఒక ఉత్సాహం! ‘సాధించగలం’ అనే ధీమా! కళ్లముందు కనిపిస్తున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు... పరుగులు! రాష్ట్రానికి జల-జీవ నాడి పోలవరం ప్రాజెక్టులో సాధారణ కార్మికుడి నుంచి చీఫ్‌ ఇంజనీర్‌ దాకా అందరిలోనూ కొత్త విశ్వాసం కనిపిస్తోంది. కాంట్రాక్టు సంస్థల్లోనూ సరికొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ తన పనులు తాను చేస్తోంది. అప్పుడప్పుడు బిల్లులు అందక మందగించిన మట్టి పనిని త్రివేణీ సంస్థ వేగంగా పూర్తి చేస్తోంది. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టిన జర్మనీకి చెందిన బావర్‌ కంపెనీ... త్వరలోనే ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రాజెక్టు పటిష్ఠత కోసం కెల్లెర్‌ సంస్థ జెట్‌ గ్రౌటింగ్‌ను జెట్‌ వేగంతో చేసేస్తోంది. అన్నింటికంటే మించి... పోలవరానికే పరీక్షగా మారిన, ప్రభుత్వ సహనానికి పరీక్ష పెట్టిన కాంక్రీటు పని రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ఆర్థిక ప్రయోజనాలు పక్కనపెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాత ధరలకే కాంక్రీటు పనులు చేపట్టేందుకు ‘నవయుగ’ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ రంగంలోకి దిగిన తర్వాత మారిన పోలవరం ముఖ చిత్రమిది!
 
1tpg6--1254.jpg 
 
గో‘దారి’ మళ్లింది...
తొలుత నదీ ప్రవాహం లేని భాగంలో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. ఇప్పుడు... గోదావరి ప్రవాహం ఉన్న చోట నిర్మిస్తున్నారు. దీనికోసం నదిని కొంత మేరకు దారి మళ్లించారు. భారీ పైపులు వేసి... దానిపై ఒక కల్వర్టును నిర్మించారు. ఇదేదో తాత్కాలిక నిర్మాణం అనుకుంటే పొరపాటే! దీనిపై నుంచి భారీ టిప్పర్లు కూడా వెళ్తున్నాయి. చిన్నపాటి కల్వర్టుల నిర్మాణాలకే నెలలు, సంవత్సరాలు పడుతుండగా... పోలవరంలో భాగంగా చేపట్టిన ఈ పనిని కేవలం 43 రోజుల్లో పూర్తి చేశారు. ఇది... పనుల్లో వేగానికి నిదర్శనం!
  
 
స్పిల్‌ చానల్‌ ఇలా...
ముందే చెప్పినట్లు... పోలవరం ఒక అసాధారణ ప్రాజెక్టు. నదీ ప్రవాహంపై కాకుండా... మరోవైపున స్పిల్‌వే నిర్మించాల్సి వస్తోంది. అక్కడి నుంచే నీటిని విడుదల చేస్తారు. అంటే... నది ప్రధాన ప్రవాహ మార్గానే మారుస్తున్నారన్న మాట. స్పిల్‌వే నుంచి వచ్చే గోదావరి నీరు సుమారు కిలోమీటరు పాటు ప్రవహించి తిరిగి పాత మార్గంలోకి చేరుకుంటుంది. ఈ కిలోమీటరు పొడవునా స్పిల్‌ చానల్‌ నిర్మిస్తున్నారు. దీనికి గత నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి భూమి పూజ చేశారు. 2019 జూన్‌ నాటికి స్పిల్‌ చానల్‌ పూర్తవుతుంది.
 
 
కార్మికుల దండు
పోలవరం ప్రాజెక్టు వద్ద రాత్రింబవళ్లు జాతరే జాతర! అక్కడ సుమారు నాలుగు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సాగునీటి శాఖకు చెందిన వందమంది ఇంజనీర్లు పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన, ఉప కాంట్రాక్టు సంస్థలకు చెందిన మరో 70 మంది ఇంజనీరింగ్‌ నిపుణులు కూడా ఇక్కడ పని చేస్తున్నారు.
 
 
జెట్‌ స్పీడ్‌లో గ్రౌటింగ్‌...
రాతి పొరల లోపలి నుంచి స్పిల్‌వే కోసం కాంక్రీట్‌ వేస్తారు. అయితే... ఆ ప్రాంతంలో రాతి పొరల్లో ఎక్కడా డొల్ల (ఖాళీ) ఉండకూడదు. ఉంటే ప్రధాన నిర్మాణానికి ప్రమాదం రావొచ్చు. అందుకే, రాతి పొరల్లో ఉన్న ఖాళీలను జెట్‌ గ్రౌంటింగ్‌ ద్వారా సిమెంటు నింపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కెల్లెర్‌ సంస్థ ఈ పని చేపట్టింది. నదీ ప్రవాహం ఎగువన 50 శాతం, దిగువన 40 శాతం జెట్‌ గ్రౌటింగ్‌ పని పూర్తయింది.
 
 
వచ్చే ఏడాది జూన్‌ టార్గెట్‌
2019 జూన్‌... పోలవరం ప్రాజెక్టులో ఇది కీలక లక్ష్యం. అప్పటికి గ్రావిటీ ద్వారానే నీళ్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందిస్తున్నారు. ఆ మేరకు శ్రీశైలం నీటిని రాయలసీమకు ఉపయోగిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారానే డెల్టాకు నీరు ఇవ్వొచ్చు. పట్టిసీమతో ఐదునెలలు పంపిన నీటిని... గ్రావిటీ రూపంలో మూడు నెలల్లోనే అందించవచ్చు. దారి పొడవునా ఉండే గ్రామాలన్నింటికీ నీరిస్తూ, చెరువులన్నీ నింపుకోవచ్చు కూడా!
 
 
polawaram-7-1254.jpg 
 
చీమల బారులా టిప్పర్లు
పోలవరం ప్రాజెక్టు సైట్‌లో మట్టి, రాళ్లను తరలించే టిప్పర్లు వరుస తీరి చీమల బారును తలపిస్తున్నాయి. భారీ పొక్లెయిన్లు భీకర రొదలు చేస్తూ రాళ్లను నుజ్జు చేస్తూ వాటిని టిప్పర్లలోకి ఎత్తిపోసేస్తున్నాయి.
 
 
 
డయాఫ్రం వాల్‌ 80% పూర్తి
పోలవరం ప్రాజెక్టు కోసం 41 మీటర్ల ఎత్తులో, దాదాపు 1750 మీటర్ల పొడవునా రాతి-మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. ‘దాందేముందీ... రాళ్లూ మట్టీ వేస్తే అదే కట్ట అవుతుంది’ అనుకుంటున్నారా! ఇది అంత సులువు కాదు. అలా మట్టికట్ట వేసినప్పటికీ ఎన్నో రోజులు నిలవదు. ఎందుకంటే... కట్ట కింద ఉన్న ఇసుక కదిలిపోతుంది. దాంతోపాటు రాక్‌ఫిల్‌ డ్యామ్‌ కూడా కుంగిపోతుంది. అలా జరగకుండా మట్టికట్ట కింది నుంచి ఒక్క చుక్క కూడా నీరు అట్నుంచి ఇటు రాకుండా నదీగర్భంలోనే అతిపెద్ద గోడ కడుతున్నారు.
 
అదే... ‘డయాఫ్రమ్‌ వాల్‌’. మొత్తం ప్రాజెక్టులో ఇది అత్యంత కీలకం. ఎల్‌అండ్‌టీ-బావర్‌ కంపెనీలు సంయుక్తంగా ఈ పని చేపట్టాయి. ఇనుప చక్రాలున్న భారీ యంత్రం ఇసుకను తొలుచుకుంటూ రాతి పొర తగిలేదాకా వెళ్తుంది. రాతి పొరను కూడా మరో రెండు మీటర్లు లోపలికి తవ్వి... అక్కడి నుంచి పైదాకా ఐదు మీటర్ల వెడల్పుతో కాంక్రీట్‌ గోడను నిర్మిస్తుంది. ఈ పని ఇప్పటికి 84 శాతం పూర్తయింది. ఈ నెలాఖరుకు మొత్తం పని పూర్తవుతుందని పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ రమేశ్‌ తెలిపారు. ఆ వెంటనే ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం పనులు మొదలుపెట్టవచ్చు. దీనికోసం కాఫర్‌ డ్యాం పనులు ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది మే నాటికి ఈ పనులు పూర్తవుతాయి.
 
 polawaram-8-1254.jpg
 
‘కాంక్రీట్‌’గా కొత్త కళ...
ప్రాజెక్టుకు ప్రాణం... స్పిల్‌ వే! నీటిని అడ్డుకునేది... అవసరమైనప్పుడు, ఆ నీటిని గేట్ల ద్వారా బయటికి పంపించేది స్పిల్‌ వే ద్వారానే! పోలవరం ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఉన్నాయి. నదీ గర్భాన్ని రాతిపొరలు వచ్చేదాకా తవ్వుతూ వెళ్లి... అక్కడి నుంచి స్పిల్‌వేను నిర్మించాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇది కూడా సంక్లిష్టమే! ఎందుకంటే... ఒకవైపు కొద్దిగా పైనే రాతి పొర వచ్చింది. మరో చివరేమో... రాతి పొరకోసం ఏకంగా 80 అడుగుల లోతుకు వెళ్లక తప్పలేదు. అక్కడి నుంచి పైదాకా స్పిల్‌వే నిర్మిస్తూ రావాలి. ఇది అచ్చంగా కాంక్రీట్‌ పని! పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వాన్ని ఇది బాగా కలవరపెట్టింది. కాంక్రీట్‌ పనికి ప్రత్యేకంగా టెండర్లు పిలిచి అప్పగించాలని భావించినా... అది జరగలేదు. చివరికి... రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పాత ధరల ప్రకారమే కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చింది. ఆ తర్వాతే కాంక్రీట్‌ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం 1150 మీటర్ల పొడవునా ఉన్న 48 గేట్లతో కూడిన స్పిల్‌వే నిర్మాణం నిరాఘాటంగా, నిరంతరాయంగా సాగుతోంది.
 
 polawaram-4--1254.jpg
 
‘గేట్లు’ బిగించడమే...
పోలవరంలో అత్యంత కీలకమైన స్పిల్‌ వే నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక... గేట్లు బిగించడమే! మరి గేట్లు ఎక్కడిదాకా వచ్చాయంటారా? ఆ పని ఎప్పుడో ఒక కొలిక్కి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు రేడియల్‌ గేట్లను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారానే ఆపరేట్‌ చేయవచ్చు. ఒక్కో గేటు పొడవు 20 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు. ఒక్కో గేటు బరువు 90 టన్నులు. పోలవరం ప్రాజెక్టు పనులకు సమాంతరంగా గేట్ల తయారీ కూడా చేపట్టారు. ఒక్కొక్క గేటును సిద్ధం చేస్తూ వస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 48 గేట్లు రెడీగా ఉంటాయి. అంటే... స్పిల్‌వే పనులు పూర్తి కావడమే ఆలస్యం, రేడియల్‌ గేట్లను బిగించడమే!
 
 polavaram-2--12544.jpg
 
ఇదీపోలవరం..
పోలవరం సాధారణ ప్రాజెక్టు కాదు. రెండు కొండల మధ్య అడ్డుకట్ట వేసి, గేట్లు అమర్చగానే పూర్తయ్యేది కాదు. ఇది ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం. సాంకేతిక-సమస్యల సమాహారం. దేశంలోనే ఇలాంటి ప్రాజెక్టు మరొకటి లేదు. అక్కడి నదీ గర్భంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా... పోలవరం ప్రాజెక్టును విభిన్నంగా డిజైన్‌ చేయాల్సి వచ్చింది. సాధారణంగా... ప్రధాన నదీ ప్రవాహంపైనే ‘స్పిల్‌వే’ (గేట్లతో కూడిన కాంక్రీట్‌ నిర్మాణం) నిర్మిస్తారు. కానీ... పోలవరం వద్ద గోదావరి నది ప్రధాన ప్రవాహంలో లోతుకు పోయే కొద్దీ ఇసుకే ఉంది. ఇసుకను తీసేస్తూ.. రాతిపొర తగిలేదాకా వెళ్లి అక్కడి నుంచి స్పిల్‌వే నిర్మించడం కుదరని పని. అందుకే... ప్రధాన నదీ ప్రవాహం వద్ద రాతి-మట్టి కట్ట (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌)ను వేసి, మరోవైపున స్పిల్‌వే నిర్మిస్తున్నారు. అంటే... ప్రాజెక్టు పూర్తయిన తర్వాత... రాతి-మట్టికట్ట నుంచి స్పిల్‌ వే దాకా దాదాపు రెండున్నర కిలోమీటర్ల పొడవునా గోదావరి విస్తరిస్తుంది. స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఇలాంటి అసాధారణమైన డిజైన్‌, సంక్లిష్టతల నేపథ్యంలోనే... పోలవరం కొన్నేళ్లపాటు కలగానే మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం నేడు దానిని సాకారం చేస్తోంది.
 
 polawaram-3---1254.jpg
 
ఇక్కడి నుంచే చూడొచ్చు
పరుగులు తీయాలి... ఉరకలు వేయాలి! పోలవరంపై ముఖ్యమంత్రిది ఇదే మాట! ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికి 57 సార్లు అమరావతి నుంచే పనులను సమీక్షించారు. 24సార్లు నేరుగా పోలవరం వచ్చి పనుల ప్రగతిని పరిశీలించారు. స్పిల్‌వే పనులను పర్యవేక్షించేందుకు నవయుగ సంస్థ ప్రత్యేకంగా హిల్‌ వ్యూ వద్ద సమావేశమందిరాన్ని నిర్మించింది. ఇందులో ఒకవైపు పూర్తిగా అద్దాల గోడను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, డయాఫ్రమ్‌వాల్‌ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు.
Link to comment
Share on other sites

జల స్వప్నం... సాకారం
02-05-2018 01:13:37
 
636608204208880836.jpg
  • ఏ పని ఎంత పూర్తి!
  • కుడి ప్రధాన కాలువ 89%
  • ఎడమ ప్రధాన కాలువ 58%
  • డయాఫ్రం వాల్‌ 84%
  • స్పిల్‌ వే మట్టి తవ్వకం 73%
  • కాంక్రీట్‌ పనులు 35%
  • రేడియల్‌ గేట్ల 58%
 
 
ఇదీ చరిత్ర...!
పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఈనాటిది కాదు! 75 సంవత్సరాల కిందట... బ్రిటిష్‌ పాలకులు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ మద్రాస్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న సమయంలో అయ్యంగార్‌ అనే చీఫ్‌ ఇంజనీర్‌ ప్రాజెక్టు కోసం తొలిసారి కృషి చేశారు. అమెరికా నుంచి కార్న్‌ టెరిజాగీతోపాటు మరికొందరు ఇంజనీరింగ్‌ నిపుణులు గోదావరిపై డ్యామ్‌ను ఎక్కడ కట్టాలో పరిశీలించారు. ఇప్పుడున్న డ్యామ్‌ సైట్‌ నుంచి వందమీటర్ల దిగువన ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఉందని సూచించారు. అవన్నీ ఆలోచనల దశలోనే ఆగిపోయాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ... అప్పటికి ఈ భారీ ప్రాజెక్టును చేపట్టేంత ఆర్థిక స్థోమత రాష్ట్రానికి లేదు. ముంపుపై ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, పరిహార వివాదాలు... ఇలా రకరకాల సమస్యలు పోలవరాన్ని అటకెక్కించాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడంతో ఇప్పుడు పనులు పరుగులు తీస్తున్నాయి.
 
 
ఇదీ ‘నవ’శకం..!
నవయుగ సంస్థ కాంక్రీటు పనులను చేపట్టిన తర్వాత స్పిల్‌వే పనుల్లో స్పీడు ఇది...
 
ఇప్పటికి 2.50 లక్షల క్యూబిక్‌ మీటర్లు
మొత్తం స్పిల్‌వేలో 16.97 లక్షల క్యూబిక్‌ మీటర్లు కాంక్రీట్‌ వేయాలి. ఇందులో ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ 3.44 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసింది. ఇంకా 13.53 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసే పని ప్రభుత్వం నవయుగకు అప్పగించింది. ఫిబ్రవరి 9న రంగంలోకి దిగిన నవయుగ సంస్థ ఇప్పటికి 2.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయగలిగింది.
 
స్పిల్‌వేలోనే రెండు వేల మంది కార్మికులు
నవయుగ ఆధ్వర్యంలో ఒక్క స్పిల్‌వే పనుల్లోనే 2వేల మంది కార్మికులు పాల్గొంటున్నారు. కాంక్రీట్‌ వేయడం, రాడ్‌ బెండింగ్‌, బ్లాచింగ్‌ ప్లాంట్లు వద్ద కాంక్రీట్‌ తయారీలో యంత్రాలు, సిమెంట్‌ అప్‌లోడింగ్‌... ఇలా పలు విభాగాల్లో కార్మిక శక్తిని వినియోగిస్తున్నారు.
 
రోజుకు 1200 టన్నుల సిమెంట్‌
స్పిల్‌వే కోసం ప్రతిరోజూ 50 బల్కర్లతో 1200 టన్నుల సిమెంట్‌ను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి పోలవరం ప్రాజెక్టుకు తీసుకొస్తున్నారు. ఏ రోజుకారోజు ఆ సిమెంటును వినియోగిస్తున్నారు.
 
200 మీటర్ల వరకు టెలీబెల్ట్‌
పోలవరం స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు అత్యాధునిక యంత్రాలు వినియోగిస్తున్నారు. ఉన్నచోటి నుంచే 200 మీటర్ల దూరం వరకు కాంక్రీట్‌ను నేరుగా వేసే అతి భారీ టెలీబెల్టులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు టెలీబెల్టులు ఉండగా... కొత్తగా మరో నాలుగు తీసుకొస్తున్నారు.
 
గంటకు 1250 టన్నుల మెటల్‌
పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో వినియోగానికి పతి గంటకు 1,250 టన్నుల మెటల్‌ (కంకర)ను తయారు చేస్తున్నారు. దీనికోసం నాలుగు భారరీ క్రషర్‌ ప్లాంట్లు ఉన్నాయి. కాంక్రీట్‌ పనుల్లో వేగం పెంచాల్సినందున... మరో రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు గంటకు 1800 టన్నుల కంకర సిద్ధమవుతుందని నవయుగ మేనేజర్‌ కె.క్రాంతి తెలిపారు.
 
 
ఒక సీజన్‌ లాస్‌..!
పోలవరం ప్రాజెక్టు పనుల నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ జాప్యం చేస్తోందని .. ఆ సంస్థకు 60సీ కింద నోటీసును ఇచ్చి... స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనుల్లో అనుభవమున్న మరో సంస్థకు టెండరు అప్పగించాలని తొలుత భావించారు. 2017 వర్షాకాలం ముగిసిన వెంటనే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌తో సహా.. ఎగువ దిగువ కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు ప్రారంభిస్తే 2018 మార్చి నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించగలిగే వారు. కానీ... కాంక్రీట్‌ పనులకు ప్రత్యేకంగా టెండర్లు పిలవాలన్న రాష్ట్ర ప్రయత్నాలకు కేంద్రం సహకరించలేదు. చివరికి... 2010-11లో ట్రాన్స్‌స్ట్రాయ్‌ టెండర్‌లో పేర్కొన్న ధరలకే పనులు చేపట్టేందుకు నవయుగ ముందుకు వచ్చింది. దీనిపై చర్చలు జరుగుతుండగానే... కీలకమైన సమయం గడిచిపోయింది. ఒక నీటి సంవత్సరం వృథా అయ్యింది. 2018 మార్చి గడువు కాస్తా... 2019 మార్చికి పొడిగించాల్సి వచ్చింది.
 
సానుకూల పవనాలు
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2019 మార్చినాటికి పూర్తయ్యేనా?’ అనే ప్రశ్నలు అక్కడి ఇంజనీరింగ్‌ సిబ్బందిని వేధించేవి. ఇప్పుడు వారిలో ఇలాంటి అనుమానాలేవీ లేవు. రెండు మూడు నెలలు ఆలస్యమైనా పనులు పూర్తి కావడం ఖాయమనే మాట సర్వత్రా వినిపిస్తోంది. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులను నవయుగ సంస్థ చేపట్టాక పనుల్లో పురోగతి చాలా స్పష్టంగా కన్పిస్తోందని, లక్ష్యాలను సాధించగలమనే గురి కుదిరిందని చెబుతున్నారు.
 
భోజనం తయారు...
గతంలో ప్రాజెక్టు ప్రాంతానికి వెళితే మళ్లీ కిందకు వచ్చేదాకా తిండి, నీళ్లు దొరికేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. కార్మికుల సంఖ్య, సందర్శకుల సందడి పెరగడంతో ప్రాజెక్టు సైట్‌ వద్ద చక్కటి భోజన హోటళ్లు తెరుచుకున్నాయి.
 
 
poll-12555.jpg 
 
కూల్‌ కాంక్రీట్‌
మన ఇంటికి పిల్లర్లు, స్లాబ్‌ వేస్తే 20 రోజులపాటు క్యూరింగ్‌ చేయాలి. లేకుంటే... ‘క్రాక్స్‌’ వచ్చేస్తాయి. మరి లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంకీట్ర్‌ పని జరిగే పోలవరంలాంటి ప్రాజెక్టుల మాటేమిటి? ప్రతి 3మీటర్ల కాంక్రీట్‌కు 20 రోజులు క్యూరింగ్‌ చేస్తూ వస్తే... ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు? అందుకే... ఇక్కడ ప్రత్యేక ‘కూలింగ్‌ టెక్నాలజీ’ ఉపయోగిస్తున్నారు. కాంక్రీట్‌ను 12 నుంచి 15 డిగ్రీల వరకు చల్లార్చి ఉపయోగిస్తున్నారు. కాంక్రీట్‌ మిక్సింగ్‌ సమయంలోనే మంచు ఫలకాలను (ఫ్లేకీ ఐస్‌) పంపించి... లిక్విడ్‌ నైట్రోజన్‌తోనూ కాంక్రీట్‌ను చల్లబరుస్తారు. ఇందుకోసం పోలవరంలో ప్రత్యేకమైన ప్లాంట్లను ఏర్పాటు చేశారు. జర్మనీకి చెందిన కేటీఐ సంస్థ ఈ టెక్నాలజీని అందిస్తోంది.
 
 
త్రీగోర్జెస్‌ రికార్డు అధిగమిస్తాం!
‘‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులైన స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ను త్రీగోర్జె్‌సకంటే ఎక్కువగా వేస్తాం. 2019 మార్చి నాటికి స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు పుర్తి చేస్తాం. లక్ష్యాన్ని అధిగమిస్తాం. ఈ నెలలోనే స్పిల్‌ చానల్‌ పనులు ప్రారంభిస్తాం. ఈ కాంక్రీట్‌ పనులు క్రమంగా రోజుకు 13 వేల నుంచి 14 వేల క్యూబిక్‌ మీటర్లకు చేరుకుంటాయి. ఇందుకు సంబంధించి యంత్ర సామగ్రిని, మానవ వనరులను సిద్ధం చేశాం. నిజానికి ఇందులో ఆర్థికంగా మాకు ఎలాంటి లాభం ఉండదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు అంగీకరించాం. సాగునీటి ప్రాజెక్టుల్లో కాంక్రీట్‌ పనులు మరింత వేగంగా చేపట్టే సాంకేతిక విధానాలపై విదేశాల్లోనూ అధ్యయనం చేశాం.
- శ్రీధర్‌, నవయుగ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌
 
 
ధీమా పెరిగింది!
‘‘పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగలమన్న ధీమా పెరిగింది. కాంక్రీట్‌ పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ కట్టడాలను సకాలంలో పూర్తి చేయాలంటే ఈ రంగంలో అనుభవం కలిగిన సంస్థలను ఎంపిక చేయడం అత్యంత ప్రధానమైన టాస్క్‌. ఈ రంగంలో నిష్ణాతులను ఈ ఏడాది జూన్‌లోగా గుర్తించి.. ఎంపిక చేస్తే మిషనరీని సిద్ధం చేసుకుంటారు. 60 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిని ఆరునెలల్లో పూర్తి చేయడమంటే అంత సామాన్యమైన విషయం కాదు. నిష్ణాతులను గుర్తించి పనులు అప్పగిస్తే తప్పకుండా పనులు పూర్తవుతాయి. పోలవరం ప్రాజెక్టు సాకారమవుతుంది.’
- ప్రాజెక్టు సీఈ రమేశ్‌బాబు
 
 
 
 
మహా స్పిల్‌ వే...
పోలవరం ప్రాజెక్టు నవ్యాంధ్రకు జీవ నాడి అయితే... ఆ ప్రాజెక్టుకు గుండెలాంటిది స్పిల్‌ వే! ఆ చివరి నుంచి ఈ చివరి దాకా 48 గేట్లను అమర్చేలా స్పిల్‌ వేను నిర్మిస్తున్నారు. మొత్తం అన్ని ఖానాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
 
1tpg16-1254.jpg 
 
రండి... చూడండి!
పోలవరం ప్రాజెక్టు భారీతనం, పనులు జరుగుతున్న తీరును విద్యార్థులు, రైతులు కచ్చితంగా ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి పదేపదే పిలుపునిస్తున్నారు. ‘జరుగుతున్న మంచిని చూడండి. ఆ మంచి గురించి పది మందికి కథలు కథలుగా చెప్పండి. మంచిని ప్రోత్సహించండి’ అని సీఎం కోరారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా బస్సులు, ప్రాజెక్టు వద్ద భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. పోలవరం వస్తున్న రైతులు, సందర్శకులు ఇక్కడ జరుగుతున్న పనులను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేపర్‌లలో ప్రకటనలు చూసి నిజమా... కాదా అనే అనుమానంతో ఉన్న తామంతా నేరుగా పనులను చూసిన తరువాత పోలవరం పూర్తి కావడం తథ్యం అంటూ వారిలో వారే మాట్లాడుకుంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులలో పోలవరం తరలివస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో రైతులతోపాటు విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పోలవరం వస్తున్నారు.
 
back-ground1ff-214.jpg 
 
 
- పోలవరం
Link to comment
Share on other sites

తగ్గుతున్న ప్రవాహ ఝరి!
పడిపోతున్న గోదావరి మిగులు నీరు
2017లో సముద్రంలోకి వెళ్లింది 1093.89 టీఎంసీలే
50 ఏళ్లలో ఇది రెండోసారి
రబీలో దక్కింది 18 టీఎంసీలే
ఈనాడు - అమరావతి

గోదావరిలో ప్రవాహ ఝరి తగ్గుతోందా అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు. ఈ నీటి సంవత్సరంలో అంటే 2017 జూన్‌ ఒకటి నుంచి 2018 ఏప్రిల్‌ నెలాఖరు వరకూ కేవలం 1021 టీఎంసీల నీళ్లే సముద్రంలోకి వెళ్లాయి. ఒక సంవత్సరం మొత్తం మీద సగటున 2500 టీఎంసీలకు మించి సముద్రంలో కలుస్తూ వస్తున్న పరిస్థితులే మనకు తెలుసు. కానీ 2017 పరిస్థితి దారుణంగా ఉంది. గత 50ఏళ్ల గోదావరి చరిత్రలో 2009, 2017 సంవత్సరాలే అత్యల్ప మిగులు జలాలు నమోదైన సందర్భాలుగా ఉన్నాయి. 2009లో కేవలం 752.69 టీఎంసీలే సముద్రంలో కలిసిపోగా 2017 సంవత్సరంలో 1093.89 టీఎంసీలు సముద్రంలోకి చేరాయి. మరోవైపు వరుసగా గోదావరి డెల్టాలో రబీ సాగుకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఒక్క గోదావరి డెల్టాలోనే రెండో పంట సాగవుతూ వస్తోంది. రబీ కాలంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ఏడాది గోదావరి సహజ ప్రవాహాలు బాగా తగ్గిపోయాయి. కేవలం 18 టీఎంసీలే లభించాయని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రవాహాలను లెక్కలోకి తీసుకునే ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేస్తున్నాయి. గోదావరి పెన్నా అనుసంధానం, ఆ తర్వాత ఈ నీటిని పాలార్‌ వరకు తీసుకువెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. నదుల అనుసంధానంలో భాగంగా ఈ నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో లెక్కలు కడుతున్నాయి. అయితే ఒకటి రెండు సంవత్సరాల మార్పు సగటు లెక్కలపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ తగ్గుతున్న ప్రవాహం ఆందోళన కలిగించేదే..

ఈ రబీలో వచ్చింది కేవలం 18 టీఎంసీలే
గోదావరిలో ఈ రబీ కాలంలో కేవలం 18 టీఎంసీలనే నది సహజ ప్రవాహాలుగా లెక్కించినట్లు అధికారులు వెల్లడించారు. సీలేరు జలాశయం, బలిమెల నుంచి తీసుకున్న నీటిని కలిపితే 79 టీఎంసీలతోనే గోదావరి రబీ పంటను గట్టెక్కించినట్లు చెబుతున్నారు. మరో 10 టీఎంసీలను తాగునీరు, పరిశ్రమలు, ఆక్వా వంటి ఇతర అవసరాలకు వినియోగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2000 సంవత్సరం తర్వాత గోదావరిలో రబీ కాల ప్రవాహాలను గమనిస్తే ఈ ఏడాది అత్యంత దయనీయ పరిస్థితిగా అభివర్ణించవచ్చు. 2009-10 నీటి సంవత్సరంలో కేవలం 25.58 టీఎంసీల సహజ ప్రవాహాలు లభించగా... 2015-16లో కేవలం 24.70 టీఎంసీలు, 2017-18 నీటి సంవత్సరంలో మరీ తగ్గిపోయి అది 18 టీఎంసీలకు పడిపోయింది. దీంతో రబీ పంటను కాపాడేందుకు ఆపసోపాలు పడాల్సి వచ్చింది.

1ap-main-news13aa.jpg
Link to comment
Share on other sites

గోదారే... మా దారి!
03-05-2018 03:13:55
 
636609140394504685.jpg
  • తెలుగు రాష్ట్రాల జల సంకల్పం
  • కృష్ణాపై ఆవిరవుతున్న ఆశలు
  • గోదావరి సద్వినియోగంపై దృష్టి
  • తెలంగాణలో కాళేశ్వరం..
  • ఏపీలో పోలవరంతో ముందుకు
  •  ‘అన్నపూర్ణ’కు ముంచుకొస్తున్న ప్రమాదం
  •  రెండు అతిభారీ ప్రాజెక్టులకు శ్రీకారం
  •  అవే జలాలతో కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ
  •  రెండింటి మధ్య అనేక సారూప్యతలు
 
(అమరావతి, హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)
రెండు తెలుగు రాష్ట్రాలు... కొత్తగా ఏర్పడ్డాయి! జలమే బలం అని రెండు ప్రభుత్వాలు గుర్తించాయి. ‘జీవ నాడి’ని పట్టుకున్నాయి. తమ రాష్ట్రాలను సస్యశ్యామలం చేసేందుకు అవసరమైన ప్రాజెక్టులను పరుగులు తీయిస్తున్నాయి. ఏపీలో పోలవరం.. తెలంగాణలో కాళేశ్వరం! ఇవి రెండూ అతి భారీ ప్రాజెక్టులు. పనుల్లో పరుగులు తీస్తూ.. జాతీయ సాగునీటి రంగంలోనే సరికొత్త సృష్టిస్తున్నాయి. వ్యయం, ప్రయోజనం, సాంకేతిక వినియోగం ఇలా అనేక అంశాల్లో ఈ రెండు ప్రాజెక్టుల మధ్య ఆసక్తికరమైన అనేక సారూప్యతలు ఉన్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
‘ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణ’... ఈ పేరు రావడానికి ప్రధాన కారణం కృష్ణా నది! జీవనది గోదావరి ఉన్నప్పటికీ... ఆ నదీమతల్లి జలాలు బిరబిరా సముద్రంలో కలవడమే! కాటన్‌ మహాశయుడు కట్టిన ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే ప్రయోజనం కలుగుతోంది. అంతకుమించి గోదావరిపై ఇరు రాష్ట్రాల్లో భారీగా ‘ఆధారపడ తగిన’ సాగునీటి ప్రాజెక్టులేవీ లేవు. మనకు కృష్ణా జలాలే దిక్కు! నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలతోపాటు అనేక చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు కృష్ణమ్మే ఆధారం! కానీ.... కర్ణాటక సర్కారు కృష్ణా నదిపై కట్టిన వరుస ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాలకు ‘కృష్ణమ్మ’ కరుణ కరువైంది. దీంతో ‘గోదావరే మనకు ఆధారం’ అని రెండు రాష్ట్రాలు గుర్తించాయి. దీని ఫలితమే.. పోలవరం, కాళేశ్వరం! కృష్ణా నదికి సంబంధించి రెండు dsc_5532-path.jpgతెలుగు రాష్ట్రాల మధ్యే అనేక వివాదాలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచీ పేచీలున్నాయి. గోదావరితో ఇలాంటి సమస్య లేకపోవడం బాగా కలిసివస్తోంది. తెలంగాణ పరిధిలో గోదావరిలో కలిసే ఉప నదుల నీటి ఆధారంగా కాళేశ్వరం... భద్రాచలం దాటిన తర్వాత శబరి, ఇతర ఉపనదులతో ఉద్ధృతంగా ప్రవహించే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా పోలవరం నిర్మాణం జరుగుతోంది.
 
యుద్ధ ప్రాతిపదికన..
పోలవరం ప్రాజెక్టుది 75 సంవత్సరాల చరిత్ర! దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర విభజన తర్వాత... ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఇన్నాళ్లకు అది సాకారం దిశగా కదులుతోంది. కేంద్రం దీనికి జాతీయ హోదా ఇచ్చినప్పటికీ... దీని ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇక.. కాళేశ్వరం సరికొత్త ప్రాజెక్టు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపుల్లోంచి పుట్టింది. ఆ వెంటనే నిర్మాణ ఆచరణ మొదలైంది. విశేషమేమంటే... ఈ రెండు ప్రాజెక్టులను, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ‘చావో రేవో’ అనే స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నాయి. తమ శక్తి యుక్తులు, ఆర్థిక వనరులను సంపూర్ణంగా వినియోగిస్తున్నా రు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడిగా సీఎం చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. పేరుకు గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టే అయినప్పటికీ... పరీవాహక ప్రాంతాలతో సంబంధం లేకుండా అటు ఉత్తరాంధ్ర నుంచి దిగువన అనంతపురం జిల్లా దాకా మొత్తం రాష్ట్రానికి మేలు చేస్తుంది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని అందిస్తారు. ఇక... కాళేశ్వరం ప్రాజెక్టుతో మేడిగడ్డ నుంచి సూర్యాపేట వరకు జలాలు అందుతాయి. గోదావరి ఆధారంగా కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించి, కొత్త ఆయకట్టును సృష్టించే మహాయజ్ఞం ఈ రాష్ట్రాల్లో జరుగుతోంది. సాగునీటి ప్రాజెక్టులంటేనే... సాచివేత ధోరణి. ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. కానీ... ఈ రెండు ప్రాజెక్టుల పూర్తికి తెలుగు రాష్ట్రాలు ‘డెడ్‌లైన్‌’లు నిర్ణయించుకుని మరీ పనులు పరుగులు తీయిస్తున్నాయి. కాళేశ్వరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘాకాగా... పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌! ‘నవయుగ’ చేపట్టిన తర్వాతే పోలవరంలో కీలకమైన కాంక్రీటు పనులు వేగం పుంజుకున్నాయి.
 
ఎన్నెన్నో ప్రత్యేకతలు
కాళేశ్వరం ఎత్తిపోతల... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు! ఇదంతా ఒక సమాహారం! వీటన్నింటిలో కలిపి... రోజు కు మూడు షిఫ్టులలో, మొత్తం 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం నిత్యం 4 వేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు. 2 ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు బిహార్‌, యూపీ, బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వారే. రెండుచోట్లా స్థానికులు తక్కువే. విదేశీ సంస్థలూ ఇందులో భాగస్వాములయ్యాయి. కాళేశ్వరంలో ఏకంగా 8 దేశాలకు చెందిన సంస్థల ప్రమేయం ఉంది. పంపులు, మోటర్లను ఆస్ట్రియా, జపాన్‌, ఫిన్‌లాండ్‌ నుంచి తెప్పిస్తున్నారు. పంప్‌హౌ్‌సకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని బ్రిటన్‌కు చెందిన మెసర్స్‌ వర్ట్సిల్లా అందిస్తోంది. కాంక్రీట్‌ మిక్సర్‌ను కెనడా నుంచి, భారీ క్రేన్లను జర్మనీ నుంచి, పిల్లర్లకు వాడే సెంట్రింగ్‌ సామగ్రిని ఆస్ట్రేలియా నుంచి తెచ్చా రు. ఇక... పోలవరంలో జెట్‌ గ్రౌటింగ్‌ పనులను జర్మనీకి చెంది న కెల్లెర్‌ చేపట్టింది. నదీ గర్భంలో డయాఫ్రమ్‌ వాల్‌ను జర్మనీ కే చెందిన బావర్‌ సంస్థ నిర్మిస్తోంది. కాంక్రీట్‌ను చల్లబరిచే టెక్నాలజీని గల్ఫ్‌ దేశాలకు చెందిన సంస్థ అందిస్తోంది. ఇక... పోలవరం ప్రాజెక్టులో వాడుతున్న భారీ క్రేన్లు, ట్రిప్పర్లు, టెలీబెల్ట్‌ యంత్రాలను వివిధ దేశాల నుంచి తెప్పించారు. పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దేశంలోనే తొలిసారిగా పలు యంత్రాలను, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గట్టున ఉండే 250 మీటర్ల వరకు కాంక్రీటు వేయగల టెలీ బెల్ట్‌లను పోలవరంలో వినియోగిస్తున్నారు. కాళేశ్వరంలో 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ దూరం నుంచే కాంక్రీటు వేసే టెలీబెల్ట్‌ను వాడుతున్నారు.
 
భారీ... అతి భారీ!
పోలవరం, కాళేశ్వరం రెండూ అతిభారీ ప్రాజెక్టులే. సాంకేతికంగా సంక్లిష్టమైనవే. వీటి డిజైన్లూ ప్రత్యేకమైనవే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏకంగా 19 పంప్‌హౌ్‌సలు నిర్మిస్తున్నారు. ఇందులో 11 భూగర్భంలో ఏర్పాటవుతున్నాయి. ఇదే ప్రాజెక్టు లో భాగంగా 92 మీటర్లలోతు, 56 మీటర్ల వ్యాసార్థం ఉన్న భా రీ సర్జ్‌పూల్‌ను తవ్వారు. ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్ద సర్జ్‌పూల్‌. ఇక పోలవరం విషయానికి వస్తే... ఇక్కడ స్పిల్‌వేను, ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను ఒకే వరుసలో నిర్మిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదు. రాతి-మట్టికట్ట కింద... ప్రధాన నదీ గర్భంలో 150 అడుగుల లోతు నుం చి డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మిస్తున్నారు. ఇక... రాతి మట్టికట్టను 1750 మీటర్ల పొడవునా నిర్మిస్తారు. కింది భాగంలో దీని వెడ ల్పు 300 మీటర్ల వరకు ఉంటుంది. ఏకంగా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా ఇది నిలువరించగలదు. ప్రాజెక్టులో అతి ప్రధానమైన స్పిల్‌వేను 48 గేట్లతో నిర్మిస్తున్నారు. దీని పొడవు 1150 మీటర్లు. కాళేశ్వరం, పోలవరానికి అవసరమైన రేడియల్‌ గేట్లను ప్రాజెక్టు సైట్ల వద్దే నిర్మిస్తుండటం మరో విశేషం. ఈ 2 ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనాలోని త్రీగోర్జెస్‌ డ్యామ్‌కు మించి.. రికార్డు స్థాయిలో కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు అందించాలన్నది ఏపీ లక్ష్యం. పనులు మొదలుపెట్టిన మూడేళ్లలోనే... ఈ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం పూర్తి చేయాలన్నది తెలంగాణ సర్కారు లక్ష్యం!
Link to comment
Share on other sites

పోలవరం డిజైన్లపై కొర్రీలే!
04-05-2018 03:40:33
 
636610168494820619.jpg
అమరావతి(ఆంధ్రజ్యోతి): పోలవరం డిజైన్లపై కేంద్ర జల సంఘం కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. ప్రాజెక్టులో ప్రధానమైన, అత్యంత కీలకమైన స్పిల్‌వే బ్లాకుల నిర్మాణంలో వేగం పెరుగుతున్నా ఎలాంటి సానుకూలతా కనరావడం లేదు. గురువారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్‌ మసూద్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ ప్రతినిధులతో పాటు ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ వేమన రమేశ్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పిల్‌వే బ్లాకుల డిజైన్లను పరిశీలించిన మసూద్‌ పలు సందేహాలను లేవనెత్తారు. కాంట్రాక్టు సంస్థ, రాష్ట్ర జల వనరుల శాఖ వాటిని నివృత్తి చేసేలా డిజైన్లలో మార్పులు చేర్పులు చేసి అందజేస్తే, వాటిని పరిశీలించి సమ్మతిని తెలియజేస్తామని సీడబ్ల్యుసీ స్పష్టం చేసింది. పోలవరం డిజైన్లన్నీ ఆగస్టు నాటికి ఆమోదం పొందాల్సి ఉండటంతో సీడబ్ల్యూసీ సూచనల మేరకు డిజైన్లలో మార్పులు చేసి త్వరితగతిన అందజేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. కాఫర్‌ డ్యామ్‌, ఈసీఆర్‌ఎఫ్‌, రేడియల్‌ గేట్ల డిజైన్లపై సీడబ్ల్యుసీ పలు అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు డీలా పడ్డారు.
Link to comment
Share on other sites

Polavaram powerhouse works in full swing

Polavaram powerhouse hill excavation works under progress at the project site.

Polavaram powerhouse hill excavation works under progress at the project site

Earthworks’ component is scheduled to be completed by August, says Chief Engineer

Keeping the monsoon in view, the Polavaram authorities are busy undertaking earthworks of the powerhouse round the clock. The officials as well as the contractor have set a target of 1115.59 lakh cubic metres of earthwork of spill channel, approach channel, pilot channel, left flank, and spillway, and the daily target has been set at 1.57 lakh cubic metres. The contract for the 960 MW hydel project, to be undertaken at a cost of ₹3,220.28 crore, was awarded to Navayuga Engineering Company Ltd in December last. As per the agreement, the company has to complete civil and electro-mechanical works and AP Genco will take up the rest.

Deadline extended

According to Chief Engineer of the Polavaram project V.S. Ramesh Babu, earthworks related to the power house and the cofferdam will be completed by August this year and May 2019 respectively.

As the earthworks have not been completed till now, the deadline for concrete works of the powerhouse has been extended by another six months. Now, the Irrigation Department is doing hill excavation work, which will take up to six months. The CE said that powerhouse works will be taken up as early as possible and an action plan is being chalked out in consultation with AP Genco, Navayuga and other stakeholders.

The Navayuga Company engaged GE private limited as sub-contractor for electro-mechanical works, from January.

As far as the diaphragm wall is concerned, of the 400 panels, 314 have been completed. The jet grouting of cofferdam works are also progressing and 733 metres of lower cofferdam columns has been completed. Central Water Commission approval is awaited for cylinders of hydraulic gates, and approved has already been given to designs of a part of river sluice gate leaves. “Earthworks of head works are in full swing and we are set to meet the targets,” said the CE.

Link to comment
Share on other sites

పోలవరానికి రూ.1,089.07కోట్లు
కేంద్ర జలవనరులశాఖ పచ్చజెండా

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,089.07కోట్లు త్వరలోనే అందనున్నాయి. కేంద్ర జలవనరులశాఖ ఈ మేరకు జాతీయ జల అభివృద్ధి సంస్థకు లేఖ రాసింది. ఈ మొత్తాన్ని నాబార్డు నుంచి తీసుకుని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి విడుదల చేయాలని పేర్కొంది. వాస్తవానికి ఈ నిధులు మార్చి 31 లోగా రావాల్సి ఉంది. నాబార్డు నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఈ లోగా ఆర్థిక సంవత్సరం ముగియడంతో మురిగిపోయింది. కేంద్ర ఆర్థికశాఖ దానిని పునరుద్ధరించి నిధుల విడుదలకు అనుమతించింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...