Jump to content

polavaram


Recommended Posts

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన వ్యాప్‌కోస్‌ బృందం

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు పనుల తీరును వ్యాప్‌కోస్‌ ప్రతినిధుల బృందం బుధవారం పరిశీలించింది. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి వ్యాప్‌కోస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. నిర్దేశిత సమయానికి పనులు పూర్తిచేసే విధంగా ఈ సంస్థ ప్రణాళికలు తయారు చేయడంతో పాటు పనుల్లో నాణ్యతను పరిశీలించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక అందజేస్తుందన్నారు. బృందం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించింది. వ్యాప్‌కోస్‌ సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఈఎన్‌ ప్రసాద్‌, విశ్రాంత సీఈ గిరిధర్‌రెడ్డి, ఏకె హాండా, లీలాపవన్‌కుమార్‌, జల వనరుల శాఖ ఈఈ ఎంఎన్‌ సుధాకర్‌, డీఈ బాలకృష్ణమూర్తి పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరానికి భారీ భద్రత
10-04-2018 00:46:07
 
636589179680982476.jpg
  • ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరం
  • కట్టుదిట్టమైన భద్రతను కల్పించండి
  • ఫైబర్‌ నెట్‌తో పునరావాస కాలనీల అనుసంధానం
  • వేసవిలోగా డయాఫ్రమ్‌వాల్‌, జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తి
  • నెలకోసారి వెలిగొండ పనులపై సమీక్ష
  • వర్చువల్‌ రివ్యూలో సీఎం ఆదేశాలు
అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని, ప్రాజెక్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పనుల పర్యవేక్షణతో పాటు భద్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు వర్చువల్‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో కేంద్రీకృతమైనందున ఎలాంటి అవరోధాలూ లేకుండా శత్రుదుర్భేద్యంగా మార్చాలని, పనుల్లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలని జల వనరులశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీలను ఫైబర్‌ నెట్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. డయాఫ్రమ్‌ వాల్‌, జెట్‌ గ్రౌటింగ్‌ నిర్మాణాన్ని ఈ వేసవి అయ్యేలోగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకూ 51.1 శాతం ప్రాజెక్టు పూర్తయిందని, కుడి ప్రధాన కాలువ 89.1శాతం, ఎడమ ప్రధాన కాలువ 58.30 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
 
 
స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌కు సంబంధించి తవ్వకం పనులు 71.10 శాతం, కాంక్రీట్‌ పనులు 13.8శాతం, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం 79.40శాతం, జెట్‌ గ్రౌటింగ్‌ 68.06 శాతం, రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ 68శాతం పూర్తయిందని వివరించారు. గతవారం రోజుల్లో 1.93లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు, 21వేల క్యూబిక్‌ మీటర్ల స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయని, 38.4 మీటర్ల వరకూ డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం జరిగిందని చెప్పారు. ప్రాజెక్టులో మొత్తమ్మీద 1,116.59 లక్షల క్యూబిక్‌ మీటర్లకు గాను ఇప్పటి వరకూ 793.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.
 
 
స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకూ కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటికే 4.96 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకూ నిర్మాణం జరిగిందని తెలిపారు. రేడియల్‌ ఫ్యాబ్రికేషన్‌ 18వేల మెట్రిక్‌ టన్నులకు గాను 10,450 మెట్రిక్‌ టన్నుల వరకూ పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ మొత్తం రూ.13,364.98 కోట్లు ఖర్చు చేశామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.8229.11 కోట్లు వ్యయం చేశామని అధికారులు వివరించారు.
 
 
ఇందులో రూ.5342.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసిందని, మరో రూ. 2886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను నెలకోసారి స్వయంగా సమీక్షించాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సూచించారు. ఈ సమీక్షలో సీఎం కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు
Link to comment
Share on other sites

6 hours ago, sonykongara said:
పోలవరానికి భారీ భద్రత
10-04-2018 00:46:07
 
636589179680982476.jpg
  • ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరం
  • కట్టుదిట్టమైన భద్రతను కల్పించండి
  •  
అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని, ప్రాజెక్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పనుల పర్యవేక్షణతో పాటు భద్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు వర్చువల్‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో కేంద్రీకృతమైనందున ఎలాంటి అవరోధాలూ లేకుండా శత్రుదుర్భేద్యంగా మార్చాలని, పనుల్లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలని జల వనరులశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Ante...Jaffas and BJP vallu yedo pedda plan lone vunnaru. Project ku yemaina chesi....danni project sariga construct cheyyattledu ani TDP govt nu blame cheyyadaniki game ready avuthundachu background lo. Yenthakaina thegistaru Jaffas and BJP 

Link to comment
Share on other sites

పోలవరం అంచనాల్లో.. పెరుగుదల 2 రెట్లే
13-04-2018 02:45:48
 
636591843497843806.jpg
  •  విద్యుత్కేంద్రాల ఖర్చుతో పోల్చితే తక్కువే
  •  త్వరలోనే తుది అంచనాల ఆమోదం
  •  పోలవరం ప్రాజెక్టు అథారిటీ వెల్లడి
అమరావతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అభిప్రాయపడింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాల పెరుగుదల సహజమేనని తెలిపింది. జల విద్యుత్కేంద్రాల నిర్మాణ అంచనాలు కూడా పదేళ్ల తర్వాత.. మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంటాయని గుర్తుచేసింది. అలా చూసుకుంటే.. పోలవరం అంచనాలు రెండు రెట్లు మాత్రమే పెరిగినట్లు పీపీఏ పేర్కొంది. దీని తుది అంచనాలు వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడింది. ఇక భూ సేకరణకు చెల్లిస్తున్న పరిహారం, పునరావాసం భారీగా పెరుగుదలకు 2013 చట్టమే ప్రధాన కారణమని అంగీకరించింది. గురువారమిక్కడ రాష్ట్ర జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో పీపీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. సీఈవో ఎస్‌కే హాల్దర్‌, సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, రాష్ట్ర జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, కమిషనర్‌ రేఖారాణి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు. చీఫ్‌ ఇంజనీరు శ్రీధర్‌ తదితరులు హాజరయ్యారు. డిజైన్లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం, ప్రాజెక్టు తుది అంచనాలు, భూ సేకరణ-సహాయ పునరావాసం, ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కో్‌సకు బాధ్యతల అప్పగింత తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
 
త్వరితగతిన డిజైన్లకు ఆమోదం..
ప్రాజెక్టు డిజైన్లపై తొలుత పీపీఏ చర్చించింది. పోలవరం పనుల్లో వేగం పెరుగుతున్నందున పలు డిజైన్లకు ఏప్రిల్‌ నెలాఖరులోగా ఆమోదం పొందాల్సి ఉందని జల వనరుల శాఖ అధికారులు గుర్తుచేశారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేసేందుకు త్వరగా డిజైన్లు ఆమోదించాలని కోరతామని హాల్దర్‌ హామీ ఇచ్చారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. కమిషనర్‌ రేఖారాణి సహాయ, పునరావాసంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న పునరావాస పనుల వివరాలను చెప్పారు. 2013 భూ సేకరణ చట్టం అమల్లోకి రాకముందు తీసుకున్న భూములకు.. చట్టం అమల్లోకి వచ్చాక తీసుకున్న భూములకు పరిహారం విషయంలో భారీ వ్యత్యాసం ఉందని పీపీఏ ప్రస్తావించింది. ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని.. 2013 భూ సేకరణ చట్టం అమల్లోకి వచ్చాక పరిహారం భారీగా ఇవ్వాల్సి వస్తోందన్నారు. లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా కార్డులిచ్చే యోచనలో ఉన్నామని, ఆధార్‌తో అనుసంధానం చేద్దామనుకుంటున్నామని రేఖారాణి చెప్పారు. ప్రత్యేక కార్డులు ఇవ్వడం మంచిదేనని.. ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదని హాల్దర్‌ పేర్కొన్నారు. లక్ష మంది లబ్ధిదారుల సమాచారమంతటినీ ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆర్‌.కె.గుప్తా సూచించారు. కేంద్ర జల వనరుల శాఖ, రాష్ట్ర జల వనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వెబ్‌సైట్లలోనూ ఈ వివరాలు ఉంచాలని హాల్దర్‌ తెలిపారు.
 
 
పర్యవేక్షక సెల్‌ ఉంచాలా వద్దా?
పోలవరం పనుల్లో నాణ్యతను పర్యవేక్షించేందుకు వాప్కోస్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పర్యవేక్షక సెల్‌ (పీఎంసీ)ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే వాప్కో్‌సతో ఒప్పందం చేసుకుంటామని హాల్దర్‌ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు పర్యవేక్షక సెల్‌ ఉన్నందున.. వాప్కోస్‌ ఆధ్వర్యంలో పనిచేసే సెల్‌తో సమాంతరంగా దానిని కొనసాగించాలో వద్దో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశం భావించింది. కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి తప్పుడు ఫిర్యాదులే అత్యధికంగా వస్తున్నాయని హాల్దర్‌ అన్నారు.
 
నిధుల కొరత రానివ్వం: హాల్దర్‌
పోలవరం సాగు నీటి ప్రాజెక్టుకు నిధుల కొరత రానివ్వబోమని పీపీఏ సీఈవో హాల్దర్‌ చెప్పారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ త్వరలోనే పోలవరం తుది అంచనాలను ఆమోదిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు సాఫీగా సాగుతున్నాయని హాల్దర్‌ చెప్పారు. 2010-11 అంచనాలు రూ.16,010.45 కోట్లలో మరో రూ. 400 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి రావాల్సి ఉన్నందున నిధుల కొరత ఏర్పడుతుందేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు.. అలాంటి పరిస్థితి రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...