Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
7 minutes ago, LuvNTR said:

diaphram wall, coffer wall location ekkada aa map lo? anyone?

diaphram wall is under the main dam..i.e 'raayi matti katta'. It cannot be seen :)

coffer wall will be either side of the main dam..that too i believe they just started with jet grouting which is again beneath both the coffer walls and cannot be seen on top. Both of these involve remove gaps within sand below ground to avoid leakage of water and thereby  ensures that main dam structures itself is safe.

Link to comment
Share on other sites

6 minutes ago, LuvNTR said:

diaphram wall, coffer wall location ekkada aa map lo? anyone?

naku kuda ade doubt yeppatinuncho

and also eguva coffer dam and diguva coffer dam

my guess is Earth cum rock fill dam construct cheyyataniki ee above and below coffer dams kaduthunnaru anukunta

since its unique in nature one of the coffer dam will merge in earth cum rock fill dam

Link to comment
Share on other sites

3 minutes ago, curiousgally said:

diaphram wall is under the main dam..i.e 'raayi matti katta'. It cannot be seen :)

coffer wall will be either side of the main dam..that too i believe they just started with jet grouting which is again beneath both the coffer walls and cannot be seen on top. Both of these involve remove gaps within sand below ground to avoid leakage of water and thereby  ensures that main dam structures itself is safe.

got it annai. so diaphram wall is just beneath the raayi matti katta. upper coffer dam above the spill way. lower coffer dam is after the spill way but under spill channel. now i understood.:D

Link to comment
Share on other sites

23 minutes ago, LuvNTR said:

got it annai. so diaphram wall is just beneath the raayi matti katta. upper coffer dam above the spill way. lower coffer dam is after the spill way but under spill channel. now i understood.:D

Mana jaggu babu ee vishayam teleeka, where is diaphram wall..show me i say...this is cbn's lies ani vaagi erri pulka ayyadu.:child:

leader appatlo dialogue kottadu..adi choodalantey nuvvu bhoomi loki povaali ani :)

Link to comment
Share on other sites

12 minutes ago, curiousgally said:

Mana jaggu babu ee vishayam teleeka, where is diaphram wall..show me i say...this is cbn's lies ani vaagi erri pulka ayyadu.:child:

leader appatlo dialogue kottadu..adi choodalantey nuvvu bhoomi loki povaali ani :)

:roflmao::roflmao:leader rocks. ee modulation eppudu vaadalo correct ga telisinodu. 

Link to comment
Share on other sites

పోలవరం’ పునరావాసం భేష్‌!
28-03-2018 03:05:43
 
636578031445601337.jpg
  • ఇంటి నిర్మాణాలు బాగున్నాయి
  • నిర్వాసితులకు మంచి వసతులు
  • ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ప్రశంసలు
  • ఇదేవిషయం కేంద్రానికి నివేదిస్తాం
  • 2000కోట్ల సాయానికి సూచిస్తాం
  • ప్రాజెక్టు పునరావాస ప్రాంతాల్లో నందకుమార్‌ సాయి పర్యటన
  • నేడు సీఎం చంద్రబాబుతో భేటీ
 
అమరావతి, పోలవరం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చట్ట ప్రకారం న్యాయం జరుగుతోందని జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో చేపడుతున్న సహాయక, పునరావాస పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, ఏపీకి తక్షణ సాయంగా రూ. 2వేల కోట్లు అందించాలని కోరతామని ఆయన వెల్లడించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈ కమిషన్‌ బృందం పోలవరం మండలంలో నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస గ్రామాలైన రామన్నపాలెం, దేవరగొంది గ్రామాలను పరిశీలించింది. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న పోలవరం ఏజెన్సీలోని మాదాపురం గ్రామ గిరిజనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
 
పోలవరం నిర్మాణం మీకు ఉపయోగమా.. ఇబ్బంది కరమా.. అంటూ గ్రామస్థులను ఆరా తీశారు. నిర్వాసితులకు ఏవిధమైన నష్టపరిహారం ఇస్తారనేది మీకు తెలుసా.. చట్టం ప్రకారం మీకు అవన్నీ అందుతున్నాయా.. అని వారిని అడిగి, వారిచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందారు. తమకు కేటాయించిన భూమి కొంత వివాదాస్పదంగా ఉందని కొందరు నిర్వాసితులు చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కలెక్టర్‌కు నందకుమార్‌సాయి సూచించారు. పునరావాస గ్రామాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించిన తరువాతే ఇప్పుడున్న తమ గ్రామాలను ఖాళీ చేయాలని ఆదివాసీలకు ఆయన వివరించారు. అనంతరం పునరావాసం పునర్నిర్మాణం తీరుపై అధికారులతో ఆయన సుఽధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలను మీడియాతో నందకుమార్‌ సాయి పంచుకొన్నారు.
 
సాధ్యమైనంత సాయం చేయండి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన వారికి సాధ్యమైనంత ఎక్కువగా సాయమందించాలని జల వనరులు శాఖ ఉన్నతాధికారులు , పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు భాస్కర్‌, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాలను నంద కుమార్‌ సాయి ఆదేశించారు. దశాబ్దాలుగా ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తరలిస్తున్నప్పుడు, కొత్త ప్రాంతంలో అందరికీ ఆమోదయోగ్యమైన .. అనువైన నిర్మాణాలను .. కాలనీలను .. వాతావరణాన్ని అందించడం కష్టమేనని అంగీకరించారు. అయితే.. వీలయినంత ఎక్కువగా.. ఎక్కువ మందికి సాయమందించాలని సూచించారు.
 
ఈ సందర్భంగా తమకు పాత భూ సేకరణ చట్టం ప్రకారమే సహాయం అందుతోందంటూ 20మంది చేసిన ఫిర్యాదులను నందకుమార్‌ సాయి ప్రస్తావించారు. వారికి అదనంగా సాయమందించగలమా లేదా అని ప్రశ్నించారు. పాత చట్టం అమలులో ఉన్నప్పుడు చేసిన భూ సేకరణకు అదనంగా ఎలాంటి సహాయం అందించేందుకు సాధ్యం కాదని.. కొత్త చట్టం వారికి వర్తించదని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు వివరించారు. ఇదే సమయంలో గిరిజనులకు భూమికి భూమి కింద రెండున్నర ఎకరాలకు మించి ఇవ్వలేమా అని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ను నంద కుమార్‌సాయి ప్రశ్నించారు. చట్టంలోనే 2.7 ఎకరాలకు మించి భూమికి భూమి కింద ఇవ్వడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొన్నారని చైర్మన్‌కు ఆయన వివరించారు. అలాగైతే, ఈ చట్టంలో సవరణలు చేయాలని తాము కేంద్రానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని భాస్కర్‌ వివరించారు. తక్షణ సహాయం కింద రూ.2000 కోట్ల నిధులు ఇస్తే .. కొంతమేర పరిహారం చెల్లింపులో జాప్యం నివారించగలుగుతామని తెలిపారు. ఈ అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళతానని నందకుమార్‌ సాయి హామీ ఇచ్చారు.
 
అంతా చట్టంలో ఉన్నట్టే..
పోలవరం ప్రాజెక్టు, నిర్వాసిత సమస్యలు, పునరావాస కార్యక్రమాల తీరుపై ఎస్టీ కమిషన్‌ బృందం రాజమహేంద్రవరంలో అధికారులతో సమీక్షించింది. మంగళవారం పోలవరం ప్రాంతంలో పర్యటించి మీడియాతో మాట్లాడింది. ‘‘పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గిరిజన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందో లేదో పరిశీలించడానికి వచ్చాం. గిరిజనులు గతంలో ఏ విధంగా జీవిస్తున్నారు.. పునరావాస గ్రామాల్లో వారికి అంతకన్నా మెరుగైన జీవన కల్పించారా లేదా అనేది పరిశీలించాం. రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో చెప్పిన విధంగానే పనులు కొనసాగిస్తున్నదని నిర్ధారణకు వచ్చాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణతీరు సంతృప్తికరంగా ఉంది. పునరావాస గ్రామాల్లోని గృహాల నిర్మాణం బాగుంది. ఈ గ్రామాల్లో డ్రెయిన్లు, తాగునీరు తదితర సమస్యలను అధిగమించాల్సి ఉంది. అలాగే, గిరిజనులకు మరింత మెరుగైన వసతులు అందించాలని ప్రభుత్వాన్ని కోరాం’’ అని నందకుమార్‌ సాయి వివరించారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్‌కుమార్‌, ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఎం. వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రమేశ్‌బాబు, ఎస్టీ జాతీయ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ అనసూయనిఖి, సభ్యులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

పోలవరంలో ‘పారిశ్రామిక పట్టణం’!
ముఖ్యమంత్రికి ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ సూచన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలవరం ప్రాంతంలో ప్రత్యేకంగా ‘పారిశ్రామిక పట్టణం’ ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ నందకుమార్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి.. పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని చెప్పారు. పోలవరం, ముంపు గ్రామాల సందర్శన అనంతరం నందకుమార్‌ బుధవారం సచివాలయంలో సీఎంను కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భూమి కోల్పోతున్న గిరిజనులకు భూమి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, దీంతో పాటు సాగునీటిని కూడా అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసంతో పాటు విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ సాయంతో గిరిజనుల స్థితిగతులు మెరుగుపడ్డాయని నందకుమార్‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

ఏ అమరావతి.. పీ పోలవరం
29-03-2018 03:35:50
 
636578913518255832.jpg
  • రెండూ ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌.. పోలవరం ప్రపంచంలోనే పెద్దది
  • సహాయ,పునరావాసం వేరుకాదు
  • అవి ప్రాజెక్టులోని అంతర్భాగాలు
  • 18ఏళ్లు నిండిన స్ర్తీలకూ ప్యాకేజీ
  • తాతలనాటి ప్రాంతం వదలడాన్ని మించిన త్యాగం వేరేమీ ఉండదు
  • అందువల్ల ఆదివాసీలకు సాయం వీలైనంత ఎక్కువగా అందించాలి
  • ’ఆంధ్రజ్యోతి ’తో జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి
అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘పోలవరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దది. ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాల్సిందే. ఛత్తీస్ గఢ్‌, ఒడిసా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలుగుతుంది. అయితే.. దీని నిర్మాణం వల్ల భారీగా నష్టపోయేది గిరిజనులు. తాతలు, తండ్రుల కాలం నుంచి నివసించిన నేలనూ, గోదావరి నదినీ, మరీ ముఖ్యంగా భుక్తిని ఇచ్చే అటవీ ప్రాంతాన్నీవారు విడవాల్సి వస్తోంది. తరతరాలుగా నేల తల్లితో పెనవేసుకున్న బంధాన్ని తెంచేసుకోవడం కష్టమే. కానీ దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం గిరిజనులు త్యాగానికి సిద్ధమయ్యారు. ఈత్యాగానికి తగిన పరిహారం ఇవ్వాల్సిందే’’ అని జాతీయ గిరిజన సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి అన్నారు. రెండు రోజుల పోలవరం ప్రాంత పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం విజయవాడలో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
 
 
పోలవరం నిర్మాణం, నిర్వాసితులకు కల్పిస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను చూశాక మీకేమనిపిస్తోంది?
చాలా సంతృప్తికరంగా పనులు సాగుతున్నాయి. సహాయ పునరావాస కార్యక్రమాలను నిర్వాసితులకు చేరువ చేయడంలో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు బాగా కృషి చేస్తున్నారు. ఈ పర్యటనలో అధికారులను చూస్తే ముచ్చటేసింది. జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ అందరూ యువకులే. నిర్వాసితులకు చట్టపరిధిలో చేయగల సాయమంతా అందించాలన్న తపన వారిలో కనిపించింది.
 
 
సహాయ పునరావాసం అమలులో ఏమైనా లోటుపాట్లు కనిపించాయా ?
నిర్వాసితుల కోసం గృహాల సముదాయంతోసహా.. గుడి, చర్చి, మసీదులు వంటి ప్రార్థనా మందిరాలను నిర్మిస్తున్నారు. ఆటపాటల కోసం పార్కులను ఏర్పాటుచేస్తున్నారు. ఎన్ని చేసినా, గిరిజనుల సంస్కృతినీ, సంప్రదాయాలనూ విడదీయకుండా కాపాడాలి. కొండా కోనల్లో నివసించే గిరిజనుల సంస్కృతి మైదాన ప్రాంతాలకు వెళ్లే సరికి విచ్ఛిన్నమై పోతోంది. దూరంగా తీసుకువెళ్లి కొత్త బతుకులు బతకమంటున్నారు. ఇప్పుడు వారికి కావాల్సిందల్లా, మెరుగైన జీవన విధానం. ఇది విద్యతోనే సాధ్యం. గిరిజన బాలలకు అత్యంత మెరుగైన జీవనవిధానం కోసం సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యను అందించాలి. ఇప్పుడు కడుతున్న గృహాలు బాగానేఉన్నాయి. కానీ చిన్నవిగా ఉన్నాయి. వారి భవిష్యత్తు అవసరాలకు దోహదపడేలా అన్ని వసతులతో కూడిన గృహాలను నిర్మించి ఇవ్వాలి. ఇదే సూచనను కలెక్టర్లకూ, జల వనరుల శాఖ ఉన్నతాధికారులకూ చేశాను. అలాగే, నాణ్యతకూ ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 
సహాయ పునరావాస కార్యక్రమాలు సరిగా అందడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయా ?
ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు రాకుండా ఎలా ఉంటాయి? లక్ష మందికి పైగా నిర్వాసితులవుతున్నారు. వారిలో 54 శాతం మంది గిరిజనులే! అయితే, ఈ ఫిర్యాదులతో ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధం కలిగేందుకు వీల్లేదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. స్పిల్‌వే పనులు, స్పిల్‌ చానల్‌ పనులే కాదు.. జెట్‌ గ్రౌటింగ్‌, డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణాలను చూస్తుంటే .. ఈ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. ప్రాజెక్టు కోతకు గురికాకుండా 100 మీటర్ల దిగువకు ప్లాస్టిక్‌ కాంక్రీటుతో గోడలు కడుతున్నారు. ఈ పనితనాన్ని చూడాల్సిందే. ఏదైనా ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పుడు ఆటంకాలు కలగకుండా మట్టి, రాళ్లతో కూడిన కాపర్‌ డ్యామ్‌ అడ్డంగా కడతారు. కానీ ఇక్కడ కాపర్‌ డ్యామ్‌ను ఎగువన ,దిగువన నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు కడుతున్నారు. ఇదొక అద్భుతం.
 
 
ప్రాజెక్టుపై మీకు చాలా అవగాహన ఉంది..
అవును. నాకు చాలా అవగాహనే ఉంది. ఈ ప్రాజెక్టును 1941లో రామకృష్ణ అయ్యంగార్‌ రామపాద సాగర్‌గా రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగే చోటు దండకారణ్యం. రాముడు తనకు అవసరమైన బాణాలను తయారు చేసుకునేందుకు భద్రాచలానికి వచ్చారు. ఈ సమయంలోనే సీతాపహరణం, రాముడికి వానరులు సహకరించడం జరిగాయి. వానరులంటే కోతులు కాదు.. గిరిజనుల్లో ఒక తెగనే వానరులుగా భావించారు. ఇంతటి చరిత్ర కలిగిన పోలవరం కట్టాల్సిందే! నేను ఛత్తీ్‌సగఢ్‌ వాసినయినా, ఈ ప్రాజెక్టు పూర్తికావాలని మనసావాచా ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. పూర్తిగా నిధులన్నీ కేటాయిస్తుంది. మీకో విషయం తెలుసా! ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్‌ అనుకుంటున్నారేమో! కానేకాదు.. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం. ఈ రెండూ ఉంటేనే ఏపీ.
 
 
కేంద్రం నుంచి సహాయ పునరావాసానికి నిధులు రావడం లేదు..?
భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలన్నీ ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగమే. కేంద్రం వీటికి నిధులు ఇస్తుంది. సహాయ పునరావాస కార్యక్రమాలు ఉదారంగా ఉండాలి. 2013 భూ సేకరణ చట్టం వచ్చాక సేకరించిన భూములూ, అంతకు ముందు సేకరించిన భూములూ ఉన్నాయి. పాత వాటి విషయంలో ఏదైనా న్యాయం చేయగలమేమో చూడాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డనూ ఒకప్రత్యేక కుటుంబంగా తీసుకుని సహాయ పునరావాసాన్ని అమలు చేయాలి. అదేవిధంగా భూమికి భూమి ఇచ్చే విషయంలో 2.7 ఎకరాలకే పరిమితం చేయకుండా .. ఎంత భూమి తీసుకుంటే అంత భూమిని ఉదారంగా ఇవ్వాలని కోరుతున్నాను. ఈ రెండు అంశాలపై రాష్ట్రపతికి, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌కూ ఇచ్చే నివేదికలో సిఫారసు చేస్తాం. చట్టానికి లోబడి పోలవరం నిర్వాసితులకు పరిహారం అందుతోంది. అయితే.. సహాయ పునరావాస ప్యాకేజీల మొత్తాలను గృహ ప్రవేశాల సమయంలో ఇస్తే, చాలా బాగుంటుంది.
Link to comment
Share on other sites

వేలెత్తి చూపకుండా పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి’
02-04-2018 20:29:41
 
636582977816147533.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎవరూ వేలెత్తి చూపకుండా పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం, ఆర్ధిక కార్యకలాపాల్లో అప్రమత్తత అవసరమని, ఈ నెలాఖరు నుంచి మొదలు పెట్టే స్పిల్ చానల్ నిర్మాణం కోసం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
 
డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పనులు లక్ష్యానికి మించి... వేగంగా జరుగుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 791.17 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు జరిగాయని, స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి.. 4.65 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేశామని అధికారులు చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత.. ఇప్పటి వరకు పోలవరానికి రూ. 8,065.75 కోట్లు ఖర్చు చేశామని, కేంద్రం ఇప్పటి వరకు 5,342.26 కోట్లు ఇచ్చిందని చంద్రబాబుకు అధికారులు వివరించారు. మరో రూ. 2,723 కోట్లు రావాల్సి ఉందని అధికారులు చెప్పారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...