Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరం ప్రాజెక్టుకు.. 16లోగా కొత్త డీపీఆర్‌!
14-03-2018 03:09:00
 
  •  రెండ్రోజుల్లో జలవనరుల శాఖ ఉత్తర్వులు?
  • కేంద్ర కార్యదర్శులతో ఢిల్లీలో కీలక భేటీ
  • డీపీఆర్‌ను వెంటనే ఆమోదించాలని..
  • ఆర్థిక శాఖకు యూపీ సింగ్‌ వినతి
  • అలా చేస్తేనే నాబార్డు నుంచి రుణం
  • 1800 కోట్లు రీయింబర్స్‌కు హామీ
  • త్వరలోనే సీడబ్ల్యూసీకి సమగ్ర నివేదిక
 
అమరావతి/న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరుతో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టు కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. 16వ తేదీలోపే దీనికి ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌, జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక, జలవనరులు, జలసంఘం అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పోలవరం నిధులు, డీపీఆర్‌ ఆమోదం, భూసేకరణ, సహాయ పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
 
2017-18 ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం కొత్త డీపీఆర్‌ను ఆమోదిస్తామని కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్‌ హామీ ఇచ్చారు. ప్రాజెక్టుపై వారం వారం జరుగుతున్న సమీక్షల నివేదికను శశిభూషణ్‌ ఆయనకు అందజేశారు. పోలవరం పనుల పురోగతిని కూడా వివరించారు. డీపీఆర్‌ను త్వరితగతిన ఆమోదిస్తే ..ఆ అంచనా వ్యయాల మేరకు పనులు చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు. శశిభూషణ్‌తో ఏకీభవించిన యూపీ సింగ్‌..వెంటనే కేంద్ర ఆర్థిక కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 16లోగా పోలవరం కొత్త డీపీఆర్‌కు ఆమోదం తెలిపితే..రెండురోజుల్లో దానిపై తాము ఉత్తర్వు ఇస్తామని ఆయనతో అన్నారు. ఆ తర్వాతే నాబార్డు రుణం తీసుకునేందుకు వీలవుతుందని తెలిపారు. శశిభూషణ్‌ సమక్షంలోనే ఫోన్‌ సంభాషణ సాగడంతో..2-3 రోజుల్లో కొత్త డీపీఆర్‌పై స్పష్టత వస్తుందని రాష్ట్రం ఆశాభావంతో ఉంది. కాగా.. కేంద్ర ఆర్థిక కార్యదర్శిని దినేశ్‌కుమార్‌ కలిశారు. వారిరువురూ సంభాషిస్తున్న తరుణంలోనే శశిభూషణ్‌ కూడా అక్కడకు వెళ్లారు. పోలవరం కోసం రాష్ట్రం ఖర్చుపెట్టిన మొత్తంలో రూ.1800 కోట్లను త్వరలోనే రీయింబర్స్‌ చేస్తామని కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
 
మా గణాంకాలన్నీ పక్కా
  • 8సీడబ్ల్యూసీకి శశిభూషణ్‌ స్పష్టీకరణ
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్‌ రవికుమార్‌, సీఈ దాస్‌లతో శశిభూషణ్‌, ఈఎన్‌సీ సమావేశమయ్యారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను సమగ్రంగా వివరించి ఎట్టకేలకు ఒప్పించారు. గత డీపీఆర్‌ ప్రకారం..పోలవరం అంచనా వ్యయం రూ.10,016 కోట్లు కాగా..2013-14 ధరలకు అనుగుణంగా దానిని రూ.58వేల కోట్లకు రాష్ట్రప్రభుత్వం సవరించింది. ఇందులో రూ.33 వేలకోట్ల దాకా భూసేకరణ, పునరావాసాలకే అవుతోంది. 2005లో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఇచ్చిన రిపోర్టుకూ..ప్రస్తుతం ఏపీ ప్రభు త్వం చేపట్టిన భూ సేకరణ, సహాయ పునరావాసానికి మధ్య భారీ అంతరం ఎందుకొచ్చిందని సీడబ్ల్యూసీ మంగళవారం ప్రశ్నించింది. ‘ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో పేర్కొన్న 1,10,000 ఎకరాల నుంచి 1,60,000 ఎకరాలను ఎందుకు సేకరించాల్సి వచ్చింది? పునరావాస కుటుంబాలు 44,000 నుంచి లక్షకు పైగా ఎలా పెరిగాయి’ అని అడిగింది.
 
వీటికి శశిభూషణ్‌ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. ‘2005లో భూసేకరణ, నిర్వాసితులపై ప్రాథమిక అంచనాలు వేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో కేంద్ర జల సంఘం నిర్వహించిన ప్రాథమిక సర్వేలో ప్రాజెక్టుకు 1,10,000 ఎకరాలు సరిపోతాయని భావించింది. తర్వాత ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించాక.. రిజర్వాయరు గరిష్ఠ జలాల స్థాయి(ఎఫ్‌ఆర్‌ఎల్‌) నిల్వను లెక్కిస్తే..1,60,000 ఎకరాలకు పెరిగింది. గ్రామాల సంఖ్య 275 నుంచి 372కి చేరింది. ఇక నిర్వాసిత కుటుంబాల సంఖ్యకు వస్తే 2013కి ముందు కుటుంబం అంటే..భార్య, భర్త, అవివాహిత పిల్లలు. కానీ 2013 భూసేకరణ చట్టం వచ్చాక కుటుంబంలో 18 ఏళ్లు దాటిన వారిని ప్రత్యేకంగా నిర్వాసితులుగా చూడాల్సి వస్తోంది. అందువల్ల వీరి సంఖ్య 44,574 నుంచి 1,05,601కి చేరింది. పునరావాస వ్యయం కూడా పెరిగింది. భూముల వివరాలన్నీ ప్రభుత్వం గెజిట్‌లో కూడా ప్రచురించింది. ఇంకా ఏమైనా సందేహాలుంటే కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా గానీ, మరే ఇతర ఏజెన్సీ ద్వారా గానీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసుకోవచ్చు’ అని శశిభూషణ్‌ స్పష్టం చేశారు. అవసరమైతే తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. కొత్త చట్టం (2013) అమల్లోకి వచ్చాక భూసేకరణ వ్యయం భారీగా పెరిగిందన్నారు. ఈ వివరణతో సీడబ్ల్యూసీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన వెంటనే.. సమగ్ర నివేదికను సీడబ్ల్యూసీకి మరోసారి పంపాలని శశిభూషణ్‌ బృందం నిర్ణయించింది.
Link to comment
Share on other sites

పోలవరం బాధితులకు పరిహారం
14-03-2018 03:46:44
 
పోలవరం నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లిస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలిపారు. ఇప్పటివరకూ 1.02 లక్షల ఎకరాల సేకరణ పూర్తయిందని, మరో 60,508 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు రూ.32,500 కోట్లు అవసరమవుతుందని, ఎప్పటికప్పుడు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళుతున్నామన్నారు
Link to comment
Share on other sites

పోలవరంలో పర్యావరణ కమిటీ సమీక్ష
16-03-2018 06:08:01
 
636567772828690015.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కేంద్ర కమిటీ రెండు రోజులుగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ కరియా పెరుమాళ్‌ నేతృత్వంలోని ద్విసభ్య కమిటీ... నిబంధనలమేరకే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా? అనే అంశాలను పరిశీలిస్తోంది. కాఫర్‌డ్యామ్‌, ఎడమ ప్రధాన కాలువ పనులను సమీక్షించారు.
Link to comment
Share on other sites

11 hours ago, rk09 said:
పోలవరంలో పర్యావరణ కమిటీ సమీక్ష
16-03-2018 06:08:01
 
636567772828690015.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కేంద్ర కమిటీ రెండు రోజులుగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ కరియా పెరుమాళ్‌ నేతృత్వంలోని ద్విసభ్య కమిటీ... నిబంధనలమేరకే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా? అనే అంశాలను పరిశీలిస్తోంది. కాఫర్‌డ్యామ్‌, ఎడమ ప్రధాన కాలువ పనులను సమీక్షించారు.

 

Fitting on the way from Central Government

Link to comment
Share on other sites

పనుల్లో యమ జోరుగా..చెల్లింపుల్లో మందకొడిగానా?
18-03-2018 02:52:09
 
636569383308379855.jpg
  • పునరావాసంపై చేసిన ఖర్చు ఏది?
  • ఏపీని ప్రశ్నించిన మసూద్‌ కమిటీ
  • కేంద్రం ఇస్తే తక్షణమే చెల్లించేస్తాం
  • కమిటీకి అధికారుల సమాధానం
  • తొలిసారికీ, ఇప్పటికీ ’పోలవరం‘
  • ఊపందుకొందని మసూద్‌ వ్యాఖ్య
  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)
పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి పరిహారం చెల్లింపులు మందకొడిగా సాగుతున్నాయెందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర నిపుణుల కమిటీ ప్రశ్నించింది. పోలవరం పనుల తీరును గత రెండు రోజులుగా సమీక్షిస్తోన్న కేంద్ర జలవనరుల కమిషన్‌ సీఈవో, నిపుణుల కమిటీ చైర్మన్‌ ఎండీ మసూద్‌ హుస్సేన్‌ నేతృత్వంలోని కమిటీ శనివారం రాజమహేంద్రవరంలోని జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో మసూద్‌తో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో హాల్దర్‌, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వశరరావు రాజమండ్రిలో మసూద్‌ కమిటీని కలిశారు. 2013 భూసేకరణ చట్టం అమలు కారణంగా పరిహారం, సహాయ పునరావాస కార్యక్రమాల వ్యయం రూ.33,000 కోట్లకు పెరిగిపోవడాన్ని అధికారులు సవివరంగా కమిటీకి చెప్పారు. అయితే..ఇప్పటిదాకా రూ.4,000 కోట్లమేర మాత్రమే సహాయ పునరావాస కార్యక్రమం కింద వ్యయం చేయడంపై మసూద్‌ కమిటీ ఆరా తీసింది. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమం కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తే తక్షణమే వాటిని అర్హులైన వారికి చెల్లిస్తామని జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వివరించారు.
 
భూసేకరణ, పునరావాసంపై కేంద్ర జలసంఘం వేసిన కొర్రీలకు రాతపూర్వక సమాధానమిస్తే, కేంద్రం ఆమోదించేలా చూస్తామని కమిటీ హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనులపై మసూద్‌ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మా కమిటీ సభ్యులం గత అక్టోబరులో మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించాం. ఇప్పుడు మరోసారి పనుల పరిశీలనకు వచ్చాం. పనులు చాలా వేగవంతమయ్యాయి’’ అని మసూద్‌ పేర్కొన్నారు.
 
ఇదీ అంచనా..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనా వ్యయం రూ.57,940.86 కోట్లను వెంటనే అనుమతించాల్సిందిగా మసూద్‌ కమిటీకి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అంచనా వ్యయాలు పెరిగాయని వివరించింది. ‘‘2013-14లో భూసేకరణ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం రూ.2,934.42 కోట్లు అంచనా వేశాం. ప్రస్తుతం అది రూ.33,225.74 కోట్లకు చేరింది. హెడ్‌ వర్క్స్‌కు సంబంధించి అప్పట్లో రూ.6,600.56 కోట్లు అంచనా వేయగా అది రూ.11,388.37 కోట్లకు పెరిగింది. కుడి ప్రధాన కాలువ పనులు అంచనా అప్పట్లో రూ.2,135.08 కోట్లు ఉండగా, ఇవాళ అది రూ.4.476.09 కోట్లకు చేరింది.
 
ఎడమ ప్రధాన కాలువ పనులు అంచనా అప్పట్లో రూ.1,471.99 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.4,644.13 కోట్లకు పెరిగింది. పవర్‌ హౌస్‌ అంచనా అప్పట్లో రూ.2,868.40 కోట్లు. ఇప్పుడది రూ.4,205.66 కోట్లకు చేరింది’’ అని కమిటీ సభ్యులకు వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి.. 54 శాతం పనులు పూర్తయ్యాయని, 2019నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి పని చేస్తున్నామని అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

  • పునరావాసంపై చేసిన ఖర్చు ఏది?
  • ఏపీని ప్రశ్నించిన మసూద్‌ కమిటీ
  • కేంద్రం ఇస్తే తక్షణమే చెల్లించేస్తాం
  • కమిటీకి అధికారుల సమాధానం

Baaga pettaaru kaddiii

Ee committee members AP ki vacchi idi edo AP sontha project laa maatlaadathaaru enti ??

 

its Central project they should question Central govt - AP is just being as liaison between project and Central govt.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...