Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పిల్ల కాలువలా గో‘దారి’!
18-02-2018 02:24:20

పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతం వద్ద గోదావరి నది పిల్ల కాలువగా మారింది. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా డయా ఫ్రం వాల్‌, కాఫర్‌ డ్యామ్‌ నిర్మించే ప్రాంతం వద్ద గోదావరి ప్రవాహాన్ని తగ్గించి ప్రవాహాన్ని మళ్ళించే చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి ఒడ్డు వరకు పూడ్చేశారు. దాంతో తూర్పు గోదావరి జిల్లా అంగులూరు గ్రామం వద్ద కేవలం 120 మీటర్ల వెడల్పులో మాత్రమే గోదావరి ప్రవహిస్తోంది. వర్షాకాలంలో గోదావరి మహోగ్ర రూపాన్ని చూసి భయబ్రాంతులైన స్థానికులంతా ప్రస్తుతం కేవలం 120 మీటర్ల వెడల్పులో వెళ్తున్న గోదావరి ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -పోలవరం

Link to comment
Share on other sites

పోలవరాన్ని కానుకగా ఇస్తా
20-02-2018 01:38:49

ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సిందే
ఈరోజు నాలో విశ్వాసం పెరిగింది
పట్టిసీమ, చింతలపూడి, పురుషోత్తపట్నం ద్వారా ఈ ఏడాది 200 టీఎంసీలు ఎత్తిపోయనున్నాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
అమరావతి/ఏలూరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందేనని జల వనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాంతంలో సోమవారం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో ఆయన పనుల తీరును సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లోగా రాష్ట్ర ప్రజలకు పోలవరం ప్రాజెక్టును కానుకగా ఇస్తామని చెప్పారు.
 
లక్ష్యాల కంటే ముందుగానే పనులు పూర్తిచేయడంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులను, ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థలను సీఎం ఆదేశించారు. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనుల బాధ్యతను నవయుగ తీసుకున్నాక 2019లో పోలవరం పూర్తవుతుందన్న విశ్వాసం ఈ రోజు (సోమవారం)కలిగిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు భూ సేకరణపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ద్వారా ఈ ఏడాది 200 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నామని, ఇది రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందనీ చెప్పారు.
 
పనుల జాప్యంపై ఆగ్రహం
ప్రాజెక్టుకు సంబంధించి మట్టి తవ్వకం పనుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఉపేక్షించేది లేదని త్రివేణి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కార్తికేయపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రాంతంలో రక్షణ చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించారు. సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ట్రాన్స్‌స్ట్రాయ్‌, నవయుగ ఎండీలు పాల్గొన్నారు.
 
పోలవరానికి రూ.వెయ్యి కోట్లు
పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.1000.86 కోట్ల బిల్లులకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆమోద ముద్ర వేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్‌మెంట్‌ చేయాలని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. మరో రూ.854 కోట్ల విలువైన బిల్లులు పీపీఏ పరిశీలనలో ఉన్నాయి.

Link to comment
Share on other sites

2019 నాటికి కచ్చితంగా పోలవరం పూర్తిచేస్తాం 
నదుల అనుసంధానంతో 2 కోట్ల ఎకరాలకు సాగునీరు 
  జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.7915 కోట్లు ఖర్చుపెట్టాం 
  కేంద్రం నుంచి రూ.3వేల కోట్లు  రావాల్సి ఉంది 
  ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

ఈనాడు, ఏలూరు: పోలవరం ప్రాజెక్టును ఇప్పటికి 23 సార్లు స్వయంగా వచ్చి పరిశీలించానని.. 51 సార్లు వర్చువల్‌ తనిఖీకి వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత అధికారులు, గుత్తేదార్లుతో సమీక్ష జరిపారు. 200 టీఎంసీలు నీటిని వచ్చే సీజన్‌ నాటికి కృష్ణా, గోదావరి, విశాఖలకు తరలిస్తామన్నారు. నాగార్జున సాగర్‌ కుడికాలువ వరకూ నీరు తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నామన్నారు. నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలోని 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలనేదే లక్ష్యమన్నారు. దీనిలో 40 లక్షల ఎకరాలకు ఒక్క పోలవరం ద్వారానే అందిస్తామన్నారు. ఇప్పటికి స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌ పనులు 71 శాతం, కాంక్రీటు పనులు 14 శాతం, డయాఫ్రమ్‌వాల్‌ 89 శాతం, జెట్‌గ్రౌంటింగ్‌ 80 శాతం, గేట్లు 58 శాతం పూర్తయ్యాయన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాకా రూ.7915 కోట్లు రాష్ట్రం ఖర్చు చేయగా కేంద్రం  రూ.4932 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇంకా రూ.3 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. పాత డీపీఆర్‌ ప్రకారం రూ.16,010 కోట్లు కాగా అప్పట్లో రూ.3,800 కోట్లు ఇచ్చారని, తర్వాత రెండో డీపీఆర్‌ రూ.58 వేల కోట్లతో కేంద్రానికి నివేదించామన్నారు. దానికి అనుమతులు రావాల్సి ఉందన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేదిశగా అంతా దృష్టి సారించాలని, తాము ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజల వద్దకు వెళ్లాలనుకుంటున్నామన్నారు. దీనికోసం ప్రభుత్వపరంగా కృషిచేయాలని అధికారులు, గుత్తేదారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 మే నాటికి చిన్నచిన్న పనులు తప్ప పెద్ద పనులన్నీ పూర్తికావాల్సిందేనన్నారు. ఎడమ కాలువ పనుల తీరుపై కాలువ ఎస్‌ఈ శ్రీనివాస యాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహనిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చుచేశామని పశ్చిమగోదావరి కలెక్టర్‌ కాటంనేనిని భాస్కర్‌ వెల్లడించారు. 
పోగొండ జలాశయాన్ని ప్రారంభించిన సీఎం ఈనాడు డిజిటల్‌, భీమవరం: ప్రతి కుటుంబానికి నెలకు పదివేల రూపాయల ఆదాయం తీసుకురావాలనే కార్యక్రమానికి సాగునీటి ప్రాజెక్టులు ప్రముఖపాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలోని చింతలగూడెం సమీపంలోని పోగొండ జలాశయాన్ని చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. జలాశయం గేట్లు ఎత్తి ఎడమ కాలువకు నీరు వదిలారు.  ఈ ప్రాజెక్టుద్వారా 10వేల ఎకరాలకు నీరు అందుతుందని, 15 గ్రామాలకు చెందిన 2600 కుటుంబాలు లబ్ధిపొందుతాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 65శాతం గిరిజనులు లబ్ధి పొందడం సంతోషంగా ఉందన్నారు.
వేసవిలో ‘ఉపాధి’ వేతనాలు పెంచాలి: ఉపాధి హామీ కూలీలకు వేసవిలో వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో 20, మార్చిలో 25, ఏప్రిల్‌లో 30 శాతం అధికంగా వేతనాలు చెల్లించాలని సూచించారు. సంఘటిత మహిళా బృందాలకు అధికంగా వేతనాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కూలీల వేతనాల చెల్లింపు ఆలస్యం కాకుండా ప్రస్తుత విధానాన్ని మెరుగుపర్చాలని నిర్దేశించారు. సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం-రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశాన్ని తన నివాసం వద్ద ప్రజాదర్బారులో ముఖ్యమంత్రి నిర్వహించారు. 
ఎడమ కాలువ పనులు ఇంత దారుణమా? 
  ఎస్‌ఈ యాదవ్‌పై సీఎం మండిపాటు
ఈనాడు-అమరావతి: పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఏమాత్రం పురోగతి లేకపోవటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అన్ని ప్యాకేజీలకు సంబంధించి గుత్తేదారులందరినీ సమావేశానికి తీసుకురమ్మని చెప్పినా వారు రాకపోవడంతో ముఖ్యమంత్రికి మరీ కోపం వచ్చింది. నేను రమ్మని చెప్పినా వాళ్లు రారా... వారికి అంత అత్యవసర పనులు ఉన్నాయా? నాకే లేవా??.. అంటూ ఆగ్రహించారు. ఇది మీ పనితీరుకు నిదర్శనం, మీరు వారిని తీసుకురాలేకపోయారంటే అది మీ అసమర్థతే.. అంటూ ఎడమ కాలువ ఎస్‌ఈ యాదవ్‌పై ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్యాకేజీ వారీగా పరిశీలించి పనుల్లో పురోగతి లేకపోవడంతో ఆయన ఈ స్థాయిలో ఆగ్రహించారు. మే నెలకల్లా దాదాపు పనులన్నీ పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి వారం ఇక పోలవరం ఎడమ కాలువపై దృష్టి సారిస్తానని చెప్పారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు నీరందించే స్థాయిలో 53వ కిలోమీటరు వరకు కూడా పూర్తిస్థాయి పనులు చేయకపోవడంపైనా ఆయన అసంతృప్తి ప్రకటించారు. 
పోలవరం ప్రధాన డ్యాం పనులనూ ముఖ్యమంత్రి సమీక్షించారు. స్పిల్‌ వే కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ ప్రతినిధులు మాట్లాడారు. ఈ వారం 20వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు చేశామని, తామన్న మాటకు అనుగుణంగా ఈ నెలలో మొత్తం 40వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని పూర్తిచేస్తామని నవయుగ ఎండీ శ్రీధర్‌ సీఎంకు వివరించారు. శ్రామికులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. పెండింగు వేతనాలు చెల్లించడంతో దాదాపు 500మంది పనివారు పోలవరం నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఇతర పనుల నుంచి రప్పిస్తున్నామని, నాలుగయిదు రోజుల్లో అవసరమైన పనివారంతా వస్తారని చెప్పారు. తాము చెప్పినట్లే వచ్చే నెలలో లక్ష క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తిచేస్తామని శ్రీధర్‌ సీఎంకు వివరించారు.

Link to comment
Share on other sites

http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=8

telanagna asked center to study submergence of telangana land caused by polavaram backwater . center agreed to study its effects. 

telangana want share in pattiseema water , center agreed to discuss in apex council meeting

on one hand telagana obstructing polavaram, on another hand it is asking water share in pattiseema and polavaram(45+45 = 90 tmc). center agreed to study the issue . 

 

 

Link to comment
Share on other sites

డ్యాంలు 
అదే ఏడాది మార్చికి స్పిల్‌ వే పనులు, జూన్‌కి గేట్ల ఏర్పాటు 
  డిసెంబర్‌కు ప్రధాన డ్యాం.. 
  2019కి కాలువలకు నీరిచ్చేలా తాజా ప్రణాళిక 
ఈనాడు - అమరావతి 

పోలవరం ప్రాజెక్టులో మూడు నెలలకు పైగా అనేక అవాంతరాల అనంతరం స్పిల్‌ వే కాంక్రీటు పనులు ఊపందుకుంటున్నాయి. నవయుగ ఇంజినీరింగు కంపెనీ ఇందులో కొంత పనులు ప్రారంభించింది. అధికారికంగా పనులు అప్పగించే ప్రక్రియ సాగుతోంది. మిగిలిన స్పిల్‌ వే పనులు కూడా 60 సి కింద తొలగించి ఆసంస్థకు అప్పగించే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో  2018 జూన్‌ కల్లా కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తి చేసి నీరు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు 2019 జూన్‌ కల్లా స్పిల్‌ వే పనులు పూర్తి చేయడం, కాఫర్‌ డ్యాంలు నిర్మించి 41.5మీటర్ల స్థాయికి పనులన్నీ పూర్తి చేసి నీరు ఇచ్చేందుకు కొత్త ప్రణాళిక రూపుదిద్దుకుంది. అదే సమయంలో 2019 డిసెంబర్‌ కల్లా పోలవరం ప్రధాన డ్యాం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సందర్శించిన సందర్భంలో తాజా ప్రణాళిక, లక్ష్యాలు, ఎప్పటికి ఏది పూర్తి చేయనున్నారో పోలవరం అధికారులు తమ నివేదికలో వివరించారు.
పనులు ఇలా పూర్తి....! 
* స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లో మట్టి తవ్వకం పనులు: మొత్తం 1055 లక్షల క్యూబిక్‌ మీటర్లు- జరిగింది 775 లక్షల క్యూ.మీ...2108 డిసెంబరుకల్లా ఈ పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం. 
* స్పిల్‌ వే, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీటు పనులు : మొత్తం 16.39 లక్షల క్యూ.మీ. చేయాల్సి ఉండగా ఇంతవరకు 5.13 లక్షల క్యూ.మీ. జరిగింది 2019 మార్చికల్లా పనులు పూర్తి చేయాలనేది ప్రణాళిక 
* ప్రధాన డ్యాంలో భాగంగా గోదావరి లోపలి నుంచి పునాదివంటి డయాఫ్రం వాల్‌ పనులు చేస్తున్నారు. మొత్తం 1427 మీటర్ల పొడవునా చేయాల్సి ఉండగా 986 మీటర్లు పూర్తయింది. 2018 జూన్‌ కల్లా పూర్తి చేయాల్సి ఉంది. 
* ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించాల్సి ఉంది. దిగువ కాఫర్‌ డ్యాంలో మొత్తం 1417 మీటర్ల మేర జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తి చేయాలి. ఇంతవరకు 1098 మీటర్ల మేర పూర్తయ్యాయి. ఎగువ కాఫర్‌ డ్యాంలో 2050 మీటర్ల మేర జెట్‌ గ్రౌటింగు చేయాల్సి ఉండగా.. ఇప్పుడే పని ప్రారంభమయింది. 2018 జూన్‌ కల్లా జెట్‌ గ్రౌటింగు పనులు, 2019 జూన్‌కల్లా ఈ రెండు కాఫర్‌ డ్యాంలపైనా మట్టి నింపి కట్టలు సిద్ధం చేసే పనులు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించారు. 
* స్పిల్‌ వే కాంక్రీటు పూర్తయ్యాక వాటికి గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రేడియల్‌ గేట్లకు 18,000 మెట్రిక్‌ టన్నుల ఇనుము కావాలి. ఇంతవరకు 10,450 మెట్రిక్‌ టన్నులు సమీకరించారు. 48 గేట్ల స్కిన్‌ ప్లేట్ల తయారీ పూర్తయింది. గిర్డర్ల పనులు మూడొంతులు పూర్తయ్యాయి. ఇతరత్రా పనులు సాగుతున్నాయి.గేట్ల అమరిక 2019 జూన్‌ కల్లా పూర్తి చేయనున్నారు. 
* మట్టిరాతి కట్ట ప్రధాన డ్యాంలో రెండు చోట్ల కొండల మధ్య ఖాళీ ఉంటుంది. అది మట్టితో, రాతితో నింపి గట్టి పరచాలి. రెండుచోట్ల ఉన్న ఈ ఖాళీలను నింపాలి. ఈ పనులు 2019 మార్చి, జూన్‌ నెలలకల్లా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. 
* 2019 జూన్‌కల్లా ఈ పనులన్నీ పూర్తి చేసి డ్యాంలో నీరు నింపి కాలువల ద్వారా వదలాలనేది జలవనరులశాఖ తాజా ప్రణాళిక. 2019 డిసెంబర్‌ కల్లా ప్రధాన డ్యాం నిర్మాణం, రాతిమట్టికట్ట పనులన్నీ పూర్తి చెయ్యాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

Link to comment
Share on other sites

పోలవరానికే 13 వేల కోట్లు! 
సాగునీటికి రూ.24వేల కోట్లు? 
బడ్జెట్‌లో కేటాయించే అవకాశం 
ఈనాడు - అమరావతి 
1ap-main3a.jpg

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌(2018-19)లో సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయించనున్నట్టు  సమాచారం. ఈ రంగానికి దాదాపు రూ.24 వేల కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే అత్యధికంగా రూ.13 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తంలో పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనుల కేటాయింపులు కలిపి ఉండనున్నాయి. ఇవికాక  హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, వంశధార వంటి భారీ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మొత్తం 60 ప్రాజెక్టులు, జలసంరక్షణ పనులు, చిన్ననీటి వనరులకు కలిపి దాదాపు 11 వేల కోట్ల కేటాయించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌ కసరత్తు దాదాపు పూర్తయింది. ఈ ఏడాది జలవనరులశాఖకు తొలుత రూ.35 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తర్వాత ఆర్థికశాఖ విధించిన పరిమితి మేరకు... ప్రాధాన్యాలు రీత్యా అవసరమైన మార్పులు చేసి ప్రతిపాదనలు సమర్పించింది.

ఇప్పటికే రూ.11240 కోట్ల ఖర్చు! 
రానున్న బడ్జెట్‌లో కేటాయింపులు ప్రస్తుత సంవత్సరం ఖర్చును లెక్కలోకి తీసుకుని జరుపుతున్నట్టు కనిపిస్తోంది. 2017-18 బడ్జెట్‌లో జలవనరులశాఖకు రూ.12770.26 కోట్లు కేటాయించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు 11240.67 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు కేటాయింపులు, దానికి చేసిన ఖర్చు కూడా కలిపి ఉంది. కొత్త బడ్జెట్‌లో పోలవరం కాకుండా మిగతా ప్రాజెక్టులకు దాదాపు 11వేల కోట్లు కేటాయించేందుకు ఆర్థికశాఖ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. పోలవరానికి కేటాయించే మొత్తం మినహాయిస్తే కొత్త బడ్జెట్‌లో సాగునీటికి కేటాయింపులు పెరిగినట్లే భావించాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రమే తొలుత నిధులు ఖర్చు చేసి ఆనక కేంద్ర నుంచి రాబట్టుకోవలసి ఉంది. బడ్జెట్‌లో పోలవరానికి రూ.13వేల కోట్లు చూపినా ఆ మేరకు రాష్ట్రంపై భారం ఉండదు. పోలవరానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా కేంద్రం నుంచి రూ.2800 కోట్ల వరకు రావలసి ఉంది. సకాలంలో పోలవరం సొమ్ములు వస్తే ఆ నిధులు ఇతర ప్రాజెక్టులపై ఖర్చు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. మిగిలిన ప్రాజెక్టుల కేటాయింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఉండబోతున్నాయి. దాదాపు పూర్తి కావచ్చిన ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైనన్ని నిధులు కేటాయించనున్నారు.

Link to comment
Share on other sites

ముఖ్యాంశాలు
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో ‘పోలవరం’
02-03-2018 03:29:36
 ప్రత్యేక కథనాలు త్వరలో ప్రసారం
అమరావతి, న్యూఢిల్లీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్మాణ పనులపై ప్రత్యేక కథనాలు త్వరలో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో ప్రసారం కానున్నాయి. 2డీ, 3డీ రూపంలో 22 నిమిషాలపాటు ఈ చానల్‌ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంది. అలాగే నిర్మాణం తీరుపై ఒక పుస్తకాన్ని విడుదల చేయనుంది. డ్రోన్లు, విమానం, హెలికాప్టర్‌ను వినియోగించి ఆ చానల్‌ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించనుంది. వచ్చే మూడు నెలల్లో ఈ కార్యక్రమాలకు సంబంధించి టెలిఫిలింను రూపొందించనుంది. ఇందుకోసం రాష్ట్ర జల వనరుల శాఖ రూ.75 లక్షలు చెల్లిస్తుంది. ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశారు. సహజంగా ఈ చానల్‌ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేయదు. ప్రాయోజిత కార్యక్రమాల రూపంలోనూ ప్రభుత్వ పథకాలను చిత్రీకరించదు. కానీ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమ రూపకల్పనకు ముందుకు రావడం విశేషం.

Link to comment
Share on other sites

Guest Urban Legend
Just now, swarnandhra said:

4 months lo no progress (just 3 kanalaki centring pettaru). Pushpalu deenni kuda stop chesara?

 

last minute of the video aina chudandi 

Link to comment
Share on other sites

లక్ష్మీ కటాక్షంతోనే.. పోలవరానికి మోక్షం..! 
weg-brk7a.jpg

పోలవరం, న్యూస్‌టుడే: మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అందరిచూపులు పోలవరంపైనే ఉన్నాయి. నవ్యాంధ్ర చరితను...రైతుల జీవితాలను మార్చే ఈ కీలక ప్రాజెక్టు నిర్మాణానికి   కేంద్ర సహకారం ఇప్పటి వరకు కూడా అంతంత మాత్రంగానే ఉంది.  ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.తొమ్మిది వేల కోట్లు కేటాయించడం విశేషం. 2019 నాటికి గ్రావెటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు నీరు అందించాలన్న లక్ష్యంతో సర్కారు వడివడిగా అడుగులేస్తోంది. 2018 ఫిబ్రవరి నెల వరకు పోలవరంపై రాష్ట్రం చేసిన ఖర్చు రూ.7,918.04 కోట్లు.  కేంద్రం రూ.4,932.26 కోట్లు మాత్రమే అందజేసింది. ఇంకా రూ.2,985.78కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై చేసిన ఖర్చుకు సంబంధించి పూర్తి వివరాలు పోలవరం అథారిటీ ద్వారా కేంద్ర జలసంఘానికి నివేదించింది. రాష్ట్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా..  పునరావాసం పనులకు పెద్ద ఎత్తున వెచ్చించాల్సి ఉంటుంది.  గ్రావెటీ ద్వారా +41.15 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్టు నిర్మిస్తే భూసేకరణ, పునరావాసం కోసం రూ.2,884.66కోట్లు అవసరమవుతాయని అధికారులు లెక్కలు చూపారు. ప్రధాన డ్యామ్‌కు రూ.5,741.52కోట్లు, ఎడమ కాలువకు రూ.1500 కోట్లు చొప్పున వెచ్చించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

కాంక్రీట్‌ పనులే కీలకం 
ప్రధాన గుత్తేదారుడి నుంచి ఉపగుత్తేదారుడికి కాంక్రీట్‌, స్పిల్‌ఛానల్‌ పనులు అప్పగించారు. దాదాపు ఒక్క స్పిల్‌వేలోనే 16 లక్షల క్యూబిక్కు మీటర్ల కాంక్రీట్‌  వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు చేసింది సుమారు 6 లక్షల క్యూబిక్కు మీటర్లు మాత్రమే. మిగిలిన పది లక్షల క్యూబిక్కు మీటర్ల కాంక్రీట్‌ వేసే  పనులను వేగవంతం చేయాల్సి ఉంది. ఇప్పటికీ ప్రాజెక్టుప్రాంతంలో ఉన్న యంత్రాలతోనే కాంక్రీట్‌ పనులు కొనసాగుతున్నాయి. అనుకున్న లక్ష్యం సాధించాలంటే మరిన్ని యంత్రాలతోపాటు, కూలీలు, నిధులు సమకూర్చుకోవల్సి ఉంది.

సమయం రెండున్న నెలలే.. 
స్పిల్‌ఛానల్‌లో ఇంకా దాదాపు 1.50కోట్ల క్యూబిక్‌మీటర్ల మట్టి, రాయి తవ్వకం పనులు పూర్తి చేయాల్సి ఉంది.ఈ పనులకు ఉన్న సమయం మరో రెండున్నర నెలలే. వర్షాలు పడితే ఇక అందులో పని చేసే అవకాశం లేదు. ఈ లోగా మట్టి పని పూర్తి చేసి కాంక్రీట్‌పనులు ప్రారంభిస్తామని జల వనరుల శాఖాధికారులు చెబుతున్నారు. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం చివరిదశకు చేరుకుంది. దీనికి దిగువన ప్రారంభించిన కాఫర్‌డ్యామ్‌ పనులు చివరిదశలో ఉన్నాయి. ఇక ఎగువ కాఫర్‌డ్యామ్‌కు సంబంధించి గత నెలలోనే జెట్‌గ్రౌటింగ్‌ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి చేసి దానిపై +41.15మీటర్ల ఎత్తు వరకు రాయి, మట్టి కట్టడం పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ పని వర్షాకాలం అనంతరం ప్రారంభించాలని జల వనరుల శాఖాధికారులు నిర్ణయించారు. పనులు ఎంతో వేగంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందో అదే స్థాయిలో నిధులు విడుదల చేయాల్సి ఉంది. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రంపైన బాధ్యత ఉంది.

Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టు తాజా స్థితి :
ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 54.4% పూర్తి
కుడి ప్రధాన కాలువ 91% పూర్తి
ఎడమ ప్రధాన కాలువ 59.6% పూర్తి
హెడ్ వర్క్స్ 41.2% పూర్తి
మొత్తం తవ్వకం పనులు 70% పూర్తి
(1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 778.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి)
స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16% పూర్తి 
డయాఫ్రమ్ వాల్ 72% పూర్తి
రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తి
స్పిల్‌వే, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, గేట్లకు సంబంధించి మొత్తం 42 డిజైన్లకు గాను ఇప్పటివరకు 14 డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించింది, మరో 16 డిజైన్లను సమర్పించడం జరిగింది.

గడిచిన వారం రోజుల్లో పురోగతి వివరాలు :
లక్షా 26 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు జరిగాయి
17 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి
డయాఫ్రమ్ వాల్ 18.8 మీటర్ల వరకు నిర్మాణం పూర్తి

 

copied from 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...