Jump to content

polavaram


Recommended Posts

పోలవరం.. ఎలా? 
2019 జూన్‌లోపు 
ఇంకా రూ.44 వేల కోట్లు అవసరం 
కేంద్రం ఈ ఏడాది ఇచ్చింది రూ.979.36 కోట్లే
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నిధి నుంచి కేటాయింపులు ఉంటాయని కేంద్రం ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో పేర్కొంది. కిందటి సంవత్సరమూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ.979.36 కోట్లు. దాదాపు మరో రూ.1,053 కోట్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టును 2019 జూన్‌ కల్లా పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇచ్చిన నిధులు మినహాయిస్తే ఇంకా రూ.44 వేల కోట్లు అవసరమవుతుంది. ఏడాదిన్నరలో లేదా రెండేళ్లలో కేంద్రం ఇంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. నాబార్డు నిధితో కేంద్రం సమ్మిళితం చేసినందున నిధులకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు చెబుతున్నా... ఈ స్థాయి నిధులు రావడానికి కేంద్రం ఇంకా నాబార్డుతో పూర్తి స్థాయిలో అనుసంధానం చేయాల్సి ఉంది. కేవలం ఇంతవరకు రూ.5,700 కోట్లకు మాత్రమే కేంద్రం నాబార్డు రుణానికి అనుసంధానించింది. పోలవరం తాజా అంచనాలు కేంద్రం ఆమోదించి ఎంత మొత్తమో నిర్ణయించి ఆ నిధులు ఇవ్వాల్సి ఉంది. ప్రధాన మంత్రి చెబుతున్న స్థాయిలో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు కాకపోవడమూ చర్చనీయాంశమే. 2017 ఆగస్టు 16న కేంద్ర మంత్రి మండలి సమావేశంలో నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు రూ.23,814 కోట్లు మాత్రమే కేటాయించింది. 2020 వరకు ఈ నిధుల విడుదలకు ప్రణాళికలో చూపి ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు వచ్చింది తక్కువ... రావాల్సింది చాలా ఎక్కువ. ఈ నిధులు కేంద్రం ఎలా ఎంత మేరకు సమకూరుస్తుందనేది స్పష్టంగా తేలాల్సి ఉంది.
 

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరంలో ప్రత్యేక నిధి పెంపు
ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అత్యవసర పనుల నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధిని రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్లకు పెంచుతూ జలవనరులశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Link to comment
Share on other sites

Guest Urban Legend

source: http://www.amaravativoice.com/avnews/news/polavaram-50-virtual-review

జలవనరులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరుదైన ఘనతను సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 53 శాతం పూర్తయ్యిందని, కుడి ప్రధాన కాలువ 91%, ఎడమ ప్రధాన కాలువ 60% నిర్మాణం పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

polavarm 05022018 2
హెడ్ వర్క్స్ 39% పూర్తికాగా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 66% అయ్యిందని తెలిపారు. 71% వరకు స్పిల్‌వే, స్పిల్ చానల్ తవ్వకం పనులు, 14% మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయ్యిందని చెప్పారు. అలాగే 82 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఎర్త్‌వర్క్ తవ్వకం పనులు, 5,314 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు, 18.8 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ వారం రోజుల్లో చేపట్టినట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం రూ. 12,915.38 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చు చేసిన మొత్తం రూ. 7,779.52 కోట్లుగా చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ మొత్తంలో గతేడాది డిసెంబర్ 31 వరకు కేంద్రం రాష్ట్రానికి రూ. 4,329.06 కోట్లు ఇచ్చిందని చెప్పారు.
వరద మళ్లింపునకు సంబంధించి స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, రేడియల్ గేట్ల ఏర్పాటు, డయాఫ్రమ్ వాల్ తదితర పనులకు రూ. 4,375.73 కోట్లు వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు. 2019 కల్లా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే రూ. 1,531.53 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ. 2,844.20 కోట్లు అవసరం వుందని ముఖ్యమంత్రికి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సాధనే ధ్యేయంగా మూడున్నరేళ్ల నుంచి అహోరాత్రులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు అభినందించారు. గతంలో ఏ పాలకుడు చేయని విధంగా ప్రతి సోమవారం పోలవరం నిర్మాణం పురోగతిని పరిశీలిస్తూ, పనులను పర్యవేక్షిస్తూ, యంత్రాంగాన్ని నిర్దేశిస్తూ ప్రాజెక్టుపై తన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి చాటుకున్నారని కొనియాడారు.
Link to comment
Share on other sites

పోలవరం పనులపై 50వ సారి వర్చువల్‌ రివ్యూ
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి దేవినేని, అధికారుల అభినందనలు
మరావతి: పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష  నిర్వహించారు. పోలవరంపై 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించి రికార్డు సృష్టించారని మంత్రి దేవినేని ఉమా సీఎంను ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు సాధనే ధ్యేయంగా మూడున్నరేళ్లుగా ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని మంత్రి ఉమా అన్నారు.  గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా వారంవారం పోలవరంపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు పట్టువదలకుండా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు అభినందనలు  తెలిపారు. 
రాష్ట్రంలో జలవనరుల సంరక్షణకు, సమర్ధ నీటి నిర్వహణకు ముఖ్యమంత్రి అహోరాత్రులు అంకితమై పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. 
పోలవరం సహా 28 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రం చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని మంత్రి స్పష్టంచేశారు.

పోలవరం మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 53% పనులు పూర్తయ్యాయని,

కుడి ప్రధాన కాలువ 91%,

ఎడమ ప్రధాన కాలువ 60%

పూర్తి హెడ్‌వర్క్స్ 39% పూర్తికాగా,

డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 66% పూర్తయిందని, 

71% వరకు స్పిల్‌వే, స్పిల్ ఛానల్ తవ్వకం పనులు,

14% మేర కాంక్రీట్ నిర్మాణం జరిగిందని అధికారులు తెలిపారు. 

రేడియల్ గేట్ల ఫ్రాబ్రికేషన్ 58% పూర్తయ్యిందని  వివరించారు.

82 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఎర్త్‌వర్క్ తవ్వకం పనులు,

5,314 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు,

18.8 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిందని

 

అధికారులు సీఎంకు వివరించారు.

Link to comment
Share on other sites

పోలవరానికి రూ.603 కోట్లు 
07-02-2018 03:04:56
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): నిధుల కోసం అల్లాడుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకు రూ.603 కోట్లు విడుదలయ్యాయి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన రూ.907 కోట్లతో కలుపుకొంటే, ఇప్పటిదాకా రూ.1610 కోట్లు అందాయి. ఈమేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి మంగళవారం సాయంత్రం జల వనరుల శాఖకు సమాచారం అందినట్టు సమాచారం.

Link to comment
Share on other sites

పనులు ప్రారంభం 

పోలవరం, న్యూస్‌టుడే, అమరావతి, ఈనాడు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోకి నవయుగ అడుగుపెట్టింది. ట్రాన్స్‌ట్రాయ్‌, నవయుగ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు స్పిల్‌వే కాంక్రీట్‌ పనులను శుక్రవారం నుంచి ప్రారంభించారు. నవయుగ కంపెనీ డైరెక్టర్‌ వడ్డూరి రమేష్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్‌ రమేష్‌బాబుతో కలిసి పూజలు చేశారు. ఎస్‌ఈ రమేష్‌బాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో నవయుగకు ఉన్న బ్లాంచింగ్‌ ప్లాంట్‌లు, క్రషర్‌లు, మరిన్ని యంత్రాలు ఏప్రిల్‌కల్లా పోలవరం తరలిస్తారని చెప్పారు. అప్పటి వరకు ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి తీసుకున్న యంత్రాలతో కాంక్రీట్‌ పనులు వేగవంతం చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకూ స్పిల్‌ ఛానల్‌ తవ్వకం పనులు త్రివేణి కంపెనీ చేస్తుందని, ఇకపై వాటినీ నవయుగ చేపడుతుందని తెలియజేశారు. త్వరలో కార్మికుల వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమచేస్తామన్నారు.
రూ.1244కోట్ల పనులు నవయుగకు..! 
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే జలవనరుల శాఖ టెండర్లు పిలిచిన పనులకు సంబంధించి దాదాపు రూ.1244కోట్ల విలువైన పనిని నవయుగ సంస్థకు అప్పజెప్పేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 2015-16 ధరల ప్రకారమే వీటిని పూర్తిచేసేందుకు నవయుగ సంస్థ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పాత గుత్తేదారు ఇవే పనులకు దాదాపు రూ.1192 కోట్లు ఖర్చయ్యేదని చెబుతున్నారు. ఇప్పుడు దాదాపు 52కోట్లు అదనపు భారం పడుతోందని లెక్కిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి స్టాండింగు కమిటీ సమావేశంలో చర్చించి అనుమతినిచ్చారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర జలవనరులశాఖ నుంచి ఆర్థికశాఖ ఆమోదానికి పంపించారు. మరో రూ.900కోట్ల విలువైన పనులు కూడా ప్రధాన గుత్తేదారు నుంచి తొలగించి నవయుగకు అప్పజెప్పేందుకు వీలుగా ప్రక్రియ చేపట్టారు. 60సి కింద ఈ మేరకు ప్రధాన గుత్తేదారుకు అధికారులు నోటీసులు జారీచేశారు. వారి నుంచి సమాధానం వచ్చాక మిగిలిన ప్రక్రియ కూడా పూర్తిచేస్తారు. ఆ అంశాన్నీ రాష్ట్రస్థాయి స్టాండింగు కమిటీ ముందుంచి, ఆమోదం పొంది నవయుగ సంస్థకు అప్పగించనున్నారు.

Link to comment
Share on other sites

2019 నాటికి పోలవరానికి 48 గేట్లు 
మంత్రి దేవినేని ఉమా వెల్లడి
నందివాడ, న్యూస్‌టుడే: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్‌ స్పిల్‌వే పనులు పూర్తిచేసి, 2019 నాటికి 48 గేట్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని స్పష్టంచేశారు. శనివారం ఆయన కృష్ణా జిల్లా నందివాడ మండలంలో అరిపిరాల తారకరామ ఎత్తిపోతల పథకం ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుట్టగుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ.. ఈ ఖరీప్‌ సీజన్‌లో పట్టిసీమ ద్వారా 105 టీఎంసీల నీటిని తెచ్చామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులతో పాటు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. రెండో పంటగా మినుములు పండించిన రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో క్వింటాల్‌కు రూ.5,400 మద్దతు ధరతో 25 వేల క్వింటాళ్లు కోనుగోలు చేశామన్నారు. దొంగల్ని అందలం ఎక్కిస్తే రక్షణ ఉంటుందా రూ.లక్షల కోట్ల అవినీతి కుంభకోణంలో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చిన జగన్‌ సీఎం పదవి కోసం అర్రులు చాస్తున్నారని, దొంగలను అందలం ఎక్కిస్తే ప్రజలకు భద్రత, ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం పనులు సజావుగా సాగకుండా సుప్రీంకోర్టులో తన అనుయాయుల చేత జగన్‌ కేసులు వేయిస్తున్నట్లు ఆరోపించారు. పోలవరంలో తీస్తున్న మట్టితో ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఓ పత్రిక విలేకరి చేత గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసు వేయించారని మంత్రి ఉమా గుర్తుచేశారు.

Link to comment
Share on other sites

వచ్చేవారం పరిశీలిస్తాను: సీఎం చంద్రబాబు
12-02-2018 15:53:25

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు 51వ సారి వర్చ్యువల్ రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి దేవినేని ఉమా, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 53 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. కుడికాల్వ పనులు 91 శాతం, పోలవరం ఎడవ కాల్వ పనులు 61 శాతం, స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌, పీహెచ్‌ తవ్వకం పనులు 71 శాతం, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ పనులు 14 శాతం, పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం 68 శాతం, రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు 58 శాతం పూర్తయ్యాయని సీఎంకు అధికారులు వివరించారు.
 
కొత్త వర్క్ ఆర్డర్లను ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అధికారి శ్రీధర్అన్నారు. కొన్ని డిజైన్ల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెప్పారు. అంతేకాక నిర్దేశిత లక్ష్యాల మేరకు పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పురోగతి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. వచ్చేవారం పోలవరం పనులను పరిశీలిస్తానన్న సీఎం చంద్రబాబు చెప్పారు.

Link to comment
Share on other sites

Tఇవిగో పోలవరం వివరాలు 
వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం 
పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి దేవినేని ఉమా
ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలవరం పురోగతి, చేసిన వ్యయం తదితర పూర్తి వివరాలన్నీ ‌www.polavaram.apegov.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. పోలవరం వివరాలు ఏ వెబ్‌సైట్‌లోనూ దొరకలేదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించారని విలేకరులు ప్రస్తావించగా మంత్రి పై విధంగా స్పందించారు. సోమవారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.  ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఎవరైనా తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వం రూ.7779 కోట్లు వెచ్చిందని అన్నారు. కేంద్రం రూ.4930 కోట్లు ఇచ్చిందని, మరో రూ.2847 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. భూసేకరణ, పునరావాసం బిల్లులను కేంద్రానికి పంపామని, నాబార్డు ద్వారా ఆ నిధులను విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి తట్టుకోలేకే వైకాపా అధినేత జగన్‌ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

పోలవరం పనులు 53% పూర్తి: దేవినేని
13-02-2018 01:34:10
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు 53% పూర్తయిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సచివాలయంలో సోమవారం మాట్లాడుతూ, రాష్ట్రంలో నాలుగేళ్లలో సాగునీటి రంగానికి రూ.51వేల కోట్లు ఖర్చు చేయగా, పోలవరం ప్రాజెక్టుకే ఇప్పటి వరకూ రూ.12,910 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం రూ.4932 కోట్లు విడుదల చేయగా, రీయింబర్స్‌మెంట్‌ కింద ఇంకా రూ.2847కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. కాగా, పోలవరం ప్రధాన కుడి కాలువ పనులు 91శాతం, ఎడమ కాలువ పనులు 60శాతం, హెడ్‌ వర్క్సు 39శాతం, డ్యాం వర్క్సు, స్పిల్‌వే, ఇతర పనులు 71శాతం పూర్తయ్యాయని తెలిపారు. కాంక్రీటు పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయాలని నవ యుగ కంపెనీని ఆదేశించామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చు, పనుల వివరాలను ‘పోలవరం.ఏపీఈ.జీవోవీ.కామ్‌’ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని మంత్రి చెప్పారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend
51st Review Meeting on Polavaram and Other Projects

News Updates

The Polavaram Irrigation Project has achieved an overall progress of 53%, officials reported to the Chief Minister on the 51st review of the project, held in the Secretariat. This includes the headworks, the Right Main Canal, and the Left Main Canal. 71% of the excavation for the spillway and spill channel has been completed, i.e., 775 lakh cubic metres out of 1,055 lakh cubic metres. 30.57% of the concreting for the spillway and the stilling basin is completed, accounting for 5.01 lakh cubic metres out of 16.39 lakh cubic metres. 

The officials informed the Chief Minister that this week, 0.1 lakh cubic metre of earthwork was excavated, and 3,876 cubic metres of concrete was laid for the spillway and stilling basin. 19.6 metres of the diaphragm wall was also completed this week. Overall, 39% of the head works have been completed. Other main components of the dam that have shown consistent progress are the diaphragm wall (68%), radial gates (58%) and the jet grouting for the Cofferdam (78%). Water Resources Secretary Shashi Bhushan said that the minutes of these weekly review meetings and the project status updates are regularly updated on the Polavaram and the Water Resources Department websites. 

The Chief Minister asked the contractors in charge of the Left Main Canal to ensure faster progress and asked for a detailed plan and date of completion by next Monday. Officials from Transstroy India Ltd. informed the Chief Minister that they have transferred all the equipment and machinery for better progress. 

Secretary Shashi Bhushan said that last week ₹603 crore has been reimbursed from the Government of India, and ₹470.44 crore more has been released and reached NABARD, and will reach the state within the week. The total expenditure incurred up to December 31, 2017, is ₹12,915.38 crore. The amount reimbursed by the GoI up to February 9, 2018, is ₹4,932.26 crore. 

Out of all the 28 priority projects, 7 have been inaugurated and 6 of them will be inaugurated during the 116 days of Jalasamrakshana Udyama Spoorthi. The 6 projects are the Pogonda Reservoir in West Godavari, the Pedapalem Lift Irrigation Scheme, the Chinasana Lift Irrigation Scheme, the Owk Tunnel, Gorakallu Balancing Reservoir and the Pulikanuma Lift Irrigation Scheme. 

The Chief Minister also said that the 116-day programme must include a presentation of the progress report of the department and the impact of the projects on water levels. He spoke to all the Chief Engineers on a video conference and discussed the progress on priority as well as non-priority projects. The Korisapadu Lift Irrigation Scheme will be completed by March 31, 2018; the Gundlakamma Reservoir will be completed in the third week of February and will be inaugurated in March when there is a movement of water. Kondaveetivagu Pumping Scheme (Flood Diversion) will be ready to inaugurate in April, and the roadworks in State Highway 31 will be completed by March 31. 

The Chief Minister insisted that the progress on the Nelluru and Sangam Barrages must be made more efficient, and they should ready by June 2018 and the Purushottapatnam Lift Irrigation Scheme should be ready for inauguration by March 15, 2018. He asked officials to aim to complete the Mallemadugu Reservoir by June 2018, which was initially going to be ready in August. He also said that we need to ensure that our projects fulfill any shortage or water requirement faced by the agriculture sector and the citizens of the state. 

 

The Chief Minister requested the Forest department officials to approve all the required clearances for the Sri Balaji Reservoir, the Venugopalasagar Reservoir, and the Velugonda Project. They informed him that with 36,915 sq km, Andhra Pradesh now has 30% green cover, and standing at 1st rank, followed by Karnataka and Kerala.

Officials reported that the ground water, which is currently at 11.11m will decrease to 12.75m by May 2018. In May 2017, the ground water was much less, at 14.79m. The Chief Minister said that the aim is to reach a water level of 8m during the next season. He said that if the conservation systems and structures are in place, if there is good rainfall and if our other projects are moving forward, our water table will immediately reflect positively and he also reviewed the plan of installing Rain Water Harvesting Systems (RWHS) across all districts as a part of Neeru Chettu, a flagship programme.

Link to comment
Share on other sites

రియల్‌ టైమ్‌లో పోలవరం
13-02-2018 01:38:44
ప్రాజెక్టును ఎవరూ వేలెత్తి చూపకూడదు
కాంట్రాక్టు సంస్థలకు చంద్రబాబు ఆదేశం
లక్ష్యం అధిగమిస్తామన్న నవయుగ ఎండీ
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ‘‘పోలవరం ప్రాజె క్టు పనులు రియల్‌ టైమ్‌లో జరగాలి. సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచండి’’ అని జల వనరులశాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాంక్రీట్‌ పనుల వేగాన్ని పెంచాలని కాంట్రాక్టు సంస్థలకు నిర్దేశించారు. ఇకపై వారం వారం కాకుండా.. ప్రతి రోజూ ప్రగతి నివేదికలను తనకు పంపాలని కోరారు. వచ్చే నెల 15నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల సమగ్ర నివేదికలు ఆమోదం పొందాల్సిందేనని స్పష్టం చేశా రు. సచివాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల ను సమీక్షించారు. ‘‘పోలవరం పనులు సకాలంలో పూర్తి చేయాలి. దీనికోసం ఒక రిజిస్టర్‌ తయారు చేసుకోవాలి. రియల్‌ టైమ్‌ పద్ధతిలో పని చేయాలి. పోలవరం పనుల్లో ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండాలి. ప్రతి రోజూ ప్రోగ్రెస్‌ ఇవ్వాలి. వచ్చేవారం నాటికి మరింత ప్రగతి కావా’’లని సీఎం ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
 
ప్రాధాన్య ప్రాజెక్టుల వేగం పెంచండి
రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం ఆయన ఈ అంశంపై సమీక్షించారు. ‘‘అనంతపురంలో ప్రాధాన్య ప్రాజెక్టుల వేగాన్ని పెంచండి. మార్చి 15 నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి’’ అని ఆదేశించారు.
 
ఈ అంశంపై తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు, కాంట్రాక్టర్లతో చంద్రబాబు సమీక్షించారు. గుండ్లకమ్మ ప్రాజె క్టు పనులను, శ్రీకాకుళం జిల్లాలో వంశధార-నాగావళి నదుల అనుసంధాన విషయాలను చర్చించారు. కొండవీటివాగును ఏప్రిల్‌లో, మల్లెమడుగు ప్రాజెక్టును జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణయించిన లక్ష్యాలమేరకు 116రోజుల కాల వ్యవధిలో ప్రాధాన్యప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...