Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
7 minutes ago, AnnaGaru said:

Unless govt deposited check in bank 2013 law needs to be applicable...State calm ga undali e matter lo...court lo silent ga farmers ki support cheste saripoddi

 

Gujarat lo Narmada vallaki old lands ki 2013 icharu e madhya....

Now farmers has to submit the evidence from Guj state how they are treated and demand new compensation 

Link to comment
Share on other sites

33 minutes ago, AnnaGaru said:

Unless govt deposited check in bank 2013 law needs to be applicable...State calm ga undali e matter lo...court lo silent ga farmers ki support cheste saripoddi

 

Gujarat lo Narmada vallaki old lands ki 2013 icharu e madhya....

Gujarat lo vallu ayithe ivochu.. AP matram ivvakudadhu.. state govt medha Ela ayina anti tevali Ane alochana laga vundhi BJP ki

Link to comment
Share on other sites

4 minutes ago, Raaz@NBK said:

Gujarat lo vallu ayithe ivochu.. AP matram ivvakudadhu.. state govt medha Ela ayina anti tevali Ane alochana laga vundhi BJP ki

exact same situation, Madhya pradesh lo court ki velte 2013 prakaram ivvamani cheppindi court....

State ni bad cheyyatam tappite emi ledu akakda..

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

Unless govt deposited check in bank 2013 law needs to be applicable...State calm ga undali e matter lo...court lo silent ga farmers ki support cheste saripoddi

 

Gujarat lo Narmada vallaki old lands ki 2013 icharu e madhya....

even the article says so. people who were paid prior to 1/1/14 not just paper advertisement.

Link to comment
Share on other sites

30 minutes ago, sskmaestro said:

 

 

2 hours ago, AnnaGaru said:

well played game by center making sure AP looses valuable TWO winter months where most of the work is done...with the loss of these TWO months now 2018 gravity water plans are at risk...

 

 

Link to comment
Share on other sites

ట్రాన్స్‌ట్రాయ్‌ వాహనాల సీజ్‌ వ్యవహారంపై సీరియస్
05-01-2018 21:18:08
 
ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌ దగ్గర ట్రాన్స్‌ట్రాయ్‌ వాహనాల సీజ్‌ వ్యవహారంపై సీఎంవో సీరియస్ అయింది. సీఎంవో అధికారులు కలెక్టర్‌కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకున్నారు. కలెక్టర్‌ అనుమతి లేకుండా ప్రాజెక్ట్‌ వద్దకు దేనా బ్యాంక్‌ అధికారులు వెళ్లడంపై ఆరా తీశారు. సీఎంవో , కలెక్టర్‌ జోక్యంతో బ్యాంక్‌ అధికారులు వెనుదిరిగారు.
Link to comment
Share on other sites

 

:46:24
 
636508071854616592.jpg
  • డీడీఆర్‌సీ పచ్చజెండా
  • ఎన్‌హెచ్‌పీసీ నివేదిక తిరస్కరణ
  • తక్షణమే గ్రౌటింగ్‌ పనులకు ఆదేశం
అమరావతి/న్యూఢిల్లీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కేంద్ర జల వనరుల శాఖ ఆదేశాల మేరకు ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంపై నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చిన అధ్యయన నివేదికను ఏబీ పాండ్యా అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో జరిగిన డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ) నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. గోదావరి నది చాలా పెద్దదని.. అలాంటి నదిపై నిర్మించే ఎగువ కాఫర్‌ డ్యాం, ప్రధాన ఆనకట్ట నిర్మాణాల విషయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎగువ కాఫర్‌ డ్యాం డిజైన్లపై తాము గతంలోనే స్పష్టత ఇచ్చినందున.. ఆ డిజైన్ల మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. అంతేగాకుండా దాని నిర్మాణానికి వీలుగా జెట్‌ గ్రౌటింగ్‌ పనులు తక్షణమే ప్రారంభించాలని డీడీఆర్‌సీ ఆదేశించింది. డీడీఆర్‌సీ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు సలహాదారు భార్గవ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఎస్‌కే హల్దర్‌, కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, పీపీఏ చీఫ్‌ ఇంజనీర్‌ ఏకే ప్రధాన్‌, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ సిన్హా, సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యుపీఆర్‌ఎస్‌), కేంద్ర జల సంఘం అధికారులు, రాష్ట్ర జల వనరులశాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
 
 
సాంకేతికంగా సాధ్యం కాదు..
సమావేశంలో ఎన్‌హెచ్‌పీసీ అధ్యయన నివేదికపై సవివరంగా చర్చ జరిగింది. ఎన్‌హెచ్‌పీసీ తరఫున అధికారులెవరూ హాజరు కాలేదు. నివేదికలో పేర్కొన్న విధంగా సగం వరకే ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం, డయాఫ్రం వాల్‌ పొడిగింపుతో ప్రధాన డ్యాం నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదని రాష్ట్ర జల వనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రాజెక్టు భద్రతకు ముప్పువాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా గోదావరి లాంటి పెద్ద నదిలో సగం కాఫర్‌ డ్యాం నిర్మాణం ఆలోచనే సరికాదని విస్పష్టంగా తెలియజేసింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను నిర్మించాలంటూ గతంలో డీడీఆర్‌సీ ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్మాణాలు సాగితేనే.. ప్రధాన డ్యాంను చిత్తడి లేకుండా.. కట్టుదిట్టంగా నిర్మించగలుగుతామని స్పష్టం చేసింది. రాష్ట్ర అభిప్రాయంతో డీడీఆర్‌సీ సభ్యులంతా ఏకీభవించారు. గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంటుందని.. ఇలాంటి నదిపై భద్రతా అంశాలను పాటించకుండా.. రక్షణకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. పొదుపు చర్యలపై దృష్టిపెట్టడం సరికాదని, ఎన్‌హెచ్‌పీసీ నివేదిక నిరుపయోగమని డీడీఆర్‌సీ పేర్కొంది. ఎగువ కాఫర్‌ డ్యాంపై గతంలో తాను ఆమోదించిన డిజైన్ల మేరకే నిర్మాణాలు సాగించాలని సూచించింది. ఆ డిజైన్లను తక్షణమే సమర్పించాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. సమావేశంలో నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
 
గోదావరి ప్రవాహం 28 లక్షల క్యూసెక్కుల వేగం సహజమే. అందువల్ల ఎన్‌హెచ్‌పీసీ నివేదికలో పేర్కొన్నట్లుగా 40 మీటర్ల ఎత్తులో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించడం ఆమోదయోగ్యం కాదు. పైగా.. దీనివల్ల డ్యాంకు రక్షణ ఉండదు. 28లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకోవాలంటే.. 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్‌ డ్యాంను నిర్మించాల్సిందే.
ఎగువ కాఫర్‌ డ్యాంను జాయింట్లుగా నిర్మించడం వల్ల గోదావరి ప్రవాహాన్ని తట్టుకోలేదు. సాంకేతికంగా ఇలా నిర్మించడం సరికాదు. విడిగా నిర్మాణం జరగాల్సిందే.
ఇంతపెద్ద డ్యాం నిర్మాణంలో రూ.50 కోట్లో.. వంద కోట్లో పొదుపు చూడకూడదు. ప్రాజెక్టు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
 
3డీ ప్రయోగ ఫలితాల నివేదిక రాలేదు
పోలవరం ప్రాజెక్టు 3-డీ నమూనాను పుణే ఐఐటీ రూపొందించింది. దీనిపై ప్రయోగాలు కూడా చేసింది. ఈ ప్రయోగ సమయంలో పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులూ పరిశీలించారు. ఈ పరీక్షలకు సంబంధించి తమకు ఇంకా లిఖితపూర్వకమైన నివేదిక రాలేదని సీడబ్ల్యూసీ పేర్కొంది. నివేదిక వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన డిజైన్లన్నిటినీ ఆమోదిస్తామని స్పష్టం చేసింది.
 
ఆంధ్రజ్యోతి కథనం నిజమైంది
ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చిన నివేదికలోని అంశాలతో పోలవరం ప్రధాన ఆనకట్ట భద్రతకు ప్రమాదం తప్పదని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే కథనం ప్రచురించింది. శుక్రవారం నాటి డీడీఆర్‌సీ సమావేశంలో ఎన్‌హెచ్‌పీసీ నివేదికను తిరస్కరించే అవకాశముందని కూడా తెలిపింది. ఇదే నిజమైంది. ఇక ఎగువ కాఫర్‌ డ్యాం సహా మిగిలిన పనుల్లోనూ వేగం పెరిగేందుకు వీలు కలిగింది. గేట్ల ఏర్పాటులోనూ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని గురువారం నాటి డీడీఆర్‌సీ సమావేశం పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి తప్పించి కొత్త కాంట్రాక్టరుకు అప్పగించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం పిలిచిన టెండర్లను కూడా కేంద్రం ఆమోదించింది. గత 2-3 నెలలుగా ఏర్పడిన అవరోధాలన్నీ ఇలా ఒక్కటొక్కటిగా తొలగిపోతుండడంతో పనుల వేగంపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది.
Link to comment
Share on other sites

 

 

8 నుంచి జెట్‌ గ్రౌటింగ్‌ పనులు
06-01-2018 03:46:53
 
  • ప్రారంభించనున్న చంద్రబాబు
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంలో భాగంగా జెట్‌ గ్రౌటింగ్‌ పనులను ఈ నెల 8న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కెల్లర్‌ సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఇంకోవైపు.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులకు పిలిచిన టెండర్లను తెరిచేందుకు కేంద్ర జల వనరుల శాఖ సరేనంది. దీనికి అనుమతి ఇచ్చేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) త్వరగా సమావేశమవ్వాలని శుక్రవారం లేఖ రాసింది. ఒకట్రెండు రోజుల్లో భేటీ తేదీ ఖరారవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

కాఫర్‌ డ్యాంకు సరే 
పోలవరం డ్యాం ఆకృతుల కమిటీ ఆమోదం 
ఎన్‌హెచ్‌పీసీ ప్రతిపాదనలను తోసిపుచ్చిన నిపుణులు 
కాఫర్‌ డ్యాం ఎత్తుపై తర్వాత నిర్ణయం 
పనులు ప్రారంభించుకోవచ్చు 
పోలవరం 3డి నమూనా అధ్యయనాలపైనా చర్చ 
ఈనాడు - అమరావతి 

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంను యథాతథంగా నిర్మించుకునేందుకు ఆమోదం లభించింది. ప్రధాన డ్యాంతో జత చేయకుండా 2300 మీటర్ల పొడవునా నిర్మించుకోవచ్చని డ్యాం ఆకృతుల కమిటీ తేల్చి చెప్పింది. కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ సమర్పించిన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కాదని అందరితో చర్చించిన మీదట స్పష్టం చేసింది. జెట్‌ గ్రౌటింగ్‌ పనులు ప్రారంభించుకునేందుకు అనుమతించింది. కాఫర్‌ డ్యాం ఆకృతులు సమర్పించి ఆమోదం పొందవచ్చని సూచించింది. దీంతో రెండు నెలలుగా పెండింగులో ఉన్న ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుమతి లభించినట్లయింది. దిగువ కాఫర్‌ డ్యాంలో జెట్‌గ్రౌటింగు పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. దిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం పాండ్యా నేతృత్వంలో పోలవరం డ్యాం ఆకృతుల కమిటీ భేటీ జరిగింది. ఏపీ జలవనరులశాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు తదితరులు హాజరయ్యారు.
ఎన్‌హెచ్‌పీసీ కమిటీ నివేదికపై చర్చ 
ఈ కమిటీ నివేదికపై ఏమంటారు అని ఆకృతుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యా ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇంజినీర్‌   ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంను 100 ఏళ్లకు ఒకసారి వచ్చే 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించామని, ఇప్పుడు 25 ఏళ్ల వరదకు సమంగా నిర్మించాలనడం సమంజసం కాదని, గోదావరిలో చాలా సార్లు 28 లక్షల క్యూసెక్కులకు మించి వరద వచ్చిన అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి మధ్యలో ప్రధాన డ్యాంను, కాఫర్‌ డ్యాంతో అనుసంధానించాలని ఎన్‌హెచ్‌పీసీ చెబుతోందని, ప్రధాన నదిలో ఇలా అతకడం సరికాదని చెప్పారు. పరిమిత కాఫర్‌ డ్యాం నిర్మించుకుని ప్రధాన డ్యాం పని 4, 5 నెలల్లో పూర్తి చేసెయ్యాలనడం వాస్తవదృక్పథంతో ఆలోచిస్తే సరికాదని, ఆ పరిమిత సమయంలో ప్రధాన డ్యాం నిర్మాణానికి ఏమైనా ఇబ్బందులు ఎదురై ఆలస్యమయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. డీ వాటరింగ్‌ విషయంలోను ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. పూర్తి స్థాయిలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించుకుని, ప్రధాన డ్యాం నిర్మించుకోవడంలో అనేక వెసులుబాట్లు ఉంటాయని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ ఆకృతుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యా కేంద్ర జలసంఘానికి తెలియజేశారు. వారు ఈఎన్‌సీ వాదనతో పూర్తిగా ఏకీభవించారు. పాత విధానానికే పచ్చజెండా ఊపారు. కాఫర్‌ డ్యాం ఎత్తు విషయాన్ని స్పిల్‌ వే నిర్మాణ ప్రగతి ఆధారంగా తేలుద్దామని చెప్పారు. ఎంత మేర స్పిల్‌ వే పూర్తయిందో చూసుకుని ఆ మేరకు నీటిని నిల్వ చేసేలా కాఫర్‌ డ్యాం ఎత్తు అంశాన్ని నిర్ణయిద్దామని పేర్కొన్నారు. దిల్లీ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ రమణ, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చి స్టేషన్‌) నిపుణులు సయితం ఎన్‌హెచ్‌పీసీ ప్రతిపాదనలను తోసిపుచ్చారు.
3డి నమూనా అధ్యయనాలపైనా చర్చ 
పోలవరం ప్రాజెక్టును పుణెలోని సీఎస్‌ఎంఆర్‌ఎస్‌లో 3డి నమూనాలో రూపొందించి వివిధ అంశాలు అధ్యయనం చేశారు. వాటి వివరాలను ఈ సమావేశంలో చర్చించారు. ఆ అధ్యయనాల ప్రకారం స్పిల్‌ ఛానల్‌ ఎంత వెడల్పు ఉందో పైలట్‌ ఛానల్‌ కూడా అంతే వెడల్పు ఉండేలా మార్పులు చేయాలని సూచించారు. ఈ అధ్యయనాలకు అనుగుణంగా పోలవరం గేట్ల ట్యునియన్‌ ఆకృతులు సమర్పించాలని సూచించారు.

Link to comment
Share on other sites

పంపండి 
పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రానికి సూచించిన  కేంద్ర నిపుణుల కమిటీ 
వివరాలు అందాక భూసేకరణ, పునరావాస వ్యయంపై పరిశీలన 

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకు తాజా ధరలతో సవరించిన అంచనాలను అందజేయాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను నిర్ధారించుకొనేందుకు ఇది అవసరమని పేర్కొంది. జలసంఘం ఇప్పటికే అడిగిన పూర్తి సమాచారంతో పాటు వీటిని బలపరిచే నివేదికలతో అత్యవసరంగా ఈ అంచనాలను అందజేయాలని కోరింది. ఎనిమిది మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులతో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ రెండుసార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. రెండోసారి పర్యటన తర్వాత ఓ నివేదిక ఇచ్చిన కమిటీ, తాజాగా   మరో నివేదికను ఇచ్చింది. ఇందులో అన్ని అంశాలను వివరంగా పేర్కొంది.
ఇప్పటిదాకా ఏం జరిగిందంటే...
* 2005-06 ధరల ప్రకారం ఏపీ ప్రభుత్వం రూపొందించిన రూ.10,151.04 కోట్ల అంచనాలకు 2009లో ఆమోదం లభించింది. 
* 2010-11 ధరల ఆధారంగా సవరించిన అంచనా రూ.16,010.45 కోట్లకు జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. దీనికి 2017 మార్చిలో పెట్టుబడి అనుమతి కూడా లభించింది. 
* 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాల విలువ రూ.58,391.06 కోట్లు. ఈ అంచనాలపై జలసంఘం తన అభిప్రాయాలను వెల్లడిస్తూ కొన్ని వివరాలు కోరింది. వాటితోపాటు 2017-18 ధరల ప్రకారం అంచనాలను సవరించి పంపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ విజ్ఞప్తి చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా... 
* సవరించిన అంచనాలను రాష్ట్రంలోని షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌ ప్రకారం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికే ఎక్కువ పనులకు ఒప్పందాలు పూర్తయ్యాయి. బిల్లులు చెల్లించారు కూడా. ఇలాంటి సందర్భాల్లో 2013-14 అంచనాలోనూ, 2017-18 అంచనాలోనూ వాస్తవ వ్యయం లేదా ఒప్పందం విలువను పేర్కొనాలి. 
* ఇప్పటివరకు ఒప్పందం జరిగిన 22 ప్యాకేజీలకు సంబంధించి గుత్తేదారు పేరు, ఒప్పందం చేసుకొన్న తేదీ, పూర్తి చేయాల్సిన గడువు, ఒప్పందం విలువ, నిర్మాణ షెడ్యూలు తదితరాలను అందజేయాలి. 
* ప్రాజెక్టు పూర్తికి ప్రధాన అంశాల్లో ఇప్పటివరకు ఉన్న సరాసరి పురోగతి, మిగిలిన పనులు, ఒక్కో పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం అవసరమవుతుంది, అన్ని రకాల పనులు పూర్తి చేయడానికి ఎప్పటికి వీలవుతుందన్న అంశాలపై స్పష్టతకు రావాలి. 
* సవరించిన పనుల వివరాలు, వాటి ధరలు, కొత్త పనులు, గడువుకు సంబంధించిన వివరాలు, వీటిని ఆమోదించిన అథార్టీ ఎవరు, గుత్తేదారుల క్లెయింలు, పరిష్కారంలో భాగంగా గుత్తేదారులకు ఏమైనా చెల్లించి ఉంటే వాటి వివరాలు అందజేయాలి.
పనుల్లో వేగం పెంచాలి... 
* పోలవరం కుడి, ఎడమకాలువల పనులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడానికి నదులు, రైల్వే క్రాసింగుల వద్ద నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. ఎడమకాలువపై జాతీయ రహదారి క్రాసింగులు పది, రైల్వే క్రాసింగులు రెండున్నాయి. ఈ పనులను 2018 డిసెంబరు కల్లా పూర్తి చేస్తామన్నారు. ఆలోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఎడమకాలువలో 8, 4, 5వ ప్యాకేజీల పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వీటి వేగం పెంచాలి. 
* డిస్ట్రిబ్యూటరీ పనులకు భూసేకరణ ప్రారంభం కాలేదు. నిర్ణీత వ్యవధిలోగా దీనిని పూర్తి చేయాలి. 
* ముంపునకు సంబంధించిన అంతర్‌ రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోడానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. దీనిని పరిష్కరించడానికి  కేంద జలవనరుల మంత్రిత్వశాఖ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ జలవనరుల శాఖలతో సంప్రదింపులు చేపట్టాలి.

ధ్రువీకరణలు సమర్పించగానే నిధుల విడుదల 
* రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చుచేసిన తర్వాత కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాల్ని అందజేసిన వెంటనే జలవనరుల మంత్రిత్వశాఖ విడుదల చేస్తుంది. కాబట్టి ముందుగానే నిధులు అందుబాటులో ఉంచాలన్న ప్రసక్తి రాదు.
ప్రాజెక్టు అథార్టీ పాత్రపై స్పష్టత లేదు... 
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అథార్టీ పాత్రపై స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అథార్టీది కాదు కాబట్టి, దీని బాధ్యతను సమీక్షించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
ఏప్రిల్‌లోగా భూసేకరణ, పునరావాసం
* భూసేకరణ, పునరావాసాన్ని 2018 ఏప్రిల్‌లోగా 45.72 మీటర్ల మట్టానికి తగ్గట్లుగా పూర్తి చేస్తామన్నారు. దీనికి తగ్గట్లుగా నెల వారీ కార్యక్రమాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 
* భూసేకరణ, పునరావాసం వ్యయం రూ.2,934.41 కోట్ల నుంచి రూ.32,392.24 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు చేసిన వ్యయం పోనూ రూ.30,223.77 కోట్లు ఇంకా అవసరమవుతుంది. ఇంత ఎక్కువగా పెరగడానికి కారణం 2013 భూసేకరణ, పునరావాస చట్టమని నివేదించారు. ఇది ప్రాజెక్టు మొత్తం వ్యయంపైన, ప్రాజెక్టు సాధ్యతపైన ప్రభావం చూపుతుంది. సవరించిన అంచనాలను అందజేసిన తర్వాత దీనిని పరిశీలించాల్సి ఉంది. 
* పునరావాసానికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయలేదు. సమగ్రంగా ఇవ్వాలి. భూమికి, ఇంటికి, నష్టపోయిన ఇళ్లకు, పునరావాస ప్రయోజనాలకు, ఇతర సౌకర్యాలకు దేనికి ఎంతవుతుందన్న వివరాలు అందజేయాలి.

Link to comment
Share on other sites

పోలవరంలో సంక్రాంతి 
ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్న అంశాలు 
  పండగ నాటికి అన్ని పనులు వేగం పుంజుకునే అవకాశం 
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ నూతన సంవత్సరం కొత్త క్రాంతిని తీసుకువస్తోంది. రెండు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఏ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారో దాదాపు కేంద్ర నైపుణ్య సంస్థలు, కేంద్ర జలవనరులశాఖ సయితం ఇప్పుడు తాజాగా అందుకు మద్దతు పలికే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌కు సంబంధించి రూ.1483 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవగా వాటిని తెరిచి కొత్త గుత్తేదారుకు పని అప్పగించే దిశగా కేంద్రం నుంచి సానుకూలత వచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమై ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడమే తరువాయి. సంక్రాంతి నాటికి టెండర్లు తెరిచి.. సాంకేతిక అర్హతలు, ఆర్థిక బిడ్‌ను పరిశీలించి కొత్త గుత్తేదారుకు కీలక పనులు అప్పగిస్తారు.
పోలవరంలో ప్రస్తుతం... 
* ప్రధాన డ్యాంలో భాగమైన డయాఫ్రం వాల్‌ పనులు లక్ష్యం మేరకు సాగుతున్నాయి. 
* దిగువ కాఫర్‌ డ్యాం పనుల్లో జెట్‌ గ్రౌటింగు పనులు ప్రారంభమయ్యాయి. 
* గేట్ల తయారీ కొలిక్కి వచ్చింది. 
* మట్టి పనులు సాగుతున్నాయి. 
* ఇప్పుడు ఎగువ కాఫర్‌ డ్యాంకు కేంద్ర అనుమతి లభించడంతో ఈ పనులు వెంటనే ప్రారంభించనున్నారు. కెల్లర్‌ సంస్థ ఇందుకు అవసరమైన యంత్రపరికరాలతో సిద్ధంగా ఉంది. వారం రోజుల్లో ఎప్పుడైనా పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 
ఏ పని ఎప్పటికి ఎలా పూర్తి చేయాలో ప్రణాళిక!: సంక్రాంతి నాటికి పోలవరం ప్రాజెక్టులో రెండు పియర్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఒక గేటు అయినా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అప్పటికి సాధ్యం కాకపోయినా గణతంత్రదినోత్సవం నాటికైనా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. పోలవరం క్షేత్రంలో గేట్ల తయారీ పనుల్లో ఉన్న బెకం కంపెనీ స్పిల్‌ వే వద్ద రెండు పియర్ల మధ్య గేటు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో, ఎంత ఎత్తుకు ఏది ఏర్పాటవుతుందో వివరించేలా ఒక నమూనా ఏర్పాటు చేసింది. ఈ నెల 8న సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. కేంద్రం తేల్చాల్సిన ముఖ్యాంశాలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో ఏ పని ఎలా ఎప్పటికి పూర్తి చేయాలో ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. 2018 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడం ఎంతవరకు సాధ్యం, ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏమిటనే కసరత్తు కూడా ఆరోజు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

పోలవరం ఇక చకచకా 
ఆటంకాలు తొలగిన వేళ... పనుల్లో కళకళ 
నేడు ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులకు పూజలు 
అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంట్‌ ప్రారంభించనున్న చంద్రబాబు 
న్యూస్‌టుడే పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణ 
weg-sty1a.jpg

పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగింది. ముఖ్యంగా ఎగువ   కాఫర్‌డ్యామ్‌ నిర్మాణానికి కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వడంతో పనులను వేగిరం చేసే దిశగా జల వనరుల శాఖ అధికారులు వడివడిగా కదులుతున్నారు. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం శరవేగంగా  జరగడంతో ప్రస్తుతం అధికారులు దృష్టి అంతా ఎగువ కాఫర్‌డ్యామ్‌ నిర్మాణంపై పడింది. 
పోలవరం ప్రాజెక్టు పనులను మరింత పరుగెత్తించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం వస్తున్నారు. ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులకు పూజలు చేసి శ్రీకారం చుట్టనున్నారు. అటు డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే కృశ నిశ్చయంతో ఎల్‌అండ్‌టీ బావర్‌ కంపెనీ గోదావరి నదిపై అడ్డుకట్ట వేసుకుంటూ ముందుకు కదులుతోంది. 
స్పిల్‌వేలో కాంక్రీట్‌, స్పిల్‌ ఛానల్‌ మట్టి తవ్వకం పనులకు పిలిచిన టెండర్లను తెరవడానికి కేంద్రం అనుమతించింది. మరో వారం రోజుల్లో వాటిని తెరిచేందుకు జల వనరుల శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రధాన ఆటంకాలు తొలగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఏడాదిలో తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సందర్భంగా ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

స్టిల్లింగ్‌ బేసిన్‌ 
స్టిల్లింగ్‌ బేసిన్‌ నిర్మాణంలో 21.5×21.5 చ.మీటర్ల పరిమాణంలో 245 కాంక్రీటు దిమ్మెలు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 106 దిమ్మెల నిర్మాణం పూర్తయింది. 
లక్ష్యం : 4.43 లక్షల క్యూబిక్‌ మీటర్లు 
చేసింది: 1.15 లక్షల క్యూబిక్‌ మీటర్లు 
చేేయాల్సింది: 3.28 లక్షల క్యూబిక్‌ మీటర్లు

స్పిల్‌వే 
స్పిల్‌వే నిర్మాణంలో 53 బ్లాకులు, 47 స్తంభాలు, ఎండ్‌వాల్స్‌, నిర్మాణాలు జరగాల్సి ఉంది.దీనిలో 53 బ్లాకులకు 40 బ్లాకుల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. 47 స్తంభాలకు 31 స్తంభాలు నిర్మిస్తున్నారు. ప్రధానంగా 161 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు నూరుశాతం పూర్తయింది. 
కాంక్రీటు పనులు 
లక్ష్యం : 11.61 లక్షల క్యూబిక్‌ మీటర్లు 
చేసింది: 3.53 లక్షల క్యూబిక్‌ మీటర్లు 
చేయాల్సింది: 8.08 లక్షల క్యూబిక్‌ మీటర్లు

డయాఫ్రమ్‌వాల్‌ 
ఈ నిర్మాణం గోదావరి మధ్యన భూమి అంతర్భాగంలో 1.50 మీటర్ల వెడల్పున గోడ నిర్మాణం జరుగుతోంది. 
1427 మీటర్లు పొడవుకు గాను 848.6 మీటర్లు మేర నిర్మాణం పూర్తయింది. దీనిలో 400 ప్యానల్స్‌ నిర్మాణానికి 191 పూర్తి చేశారు. ఇంకా 209 ప్యానల్స్‌ నిర్మాణం జరగాల్సి ఉంది.

ఎగువ  కాఫర్‌డ్యామ్‌ 
డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ ప్రాంతానికి 400 మీటర్ల ఎగువన కాఫర్‌డ్యామ్‌ నిర్మాణానికి కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు వచ్చాయి. 2300 మీటర్ల పొడవునా నిర్మించే కాపర్‌డ్యామ్‌ పనులకు ముఖ్యమంత్రి నేడు పూజలు చేయనున్నారు. 
పవర్‌హౌస్‌: పునాది తవ్వకం పనులు 
లక్ష్యం: 118 లక్షల క్యూబిక్‌ మీటర్లు 
చేసింది: 94.18 లక్షల క్యూబిక్‌ మీటర్లు 
చేయాల్సింది: 23.82 లక్షల క్యూబిక్‌ మీటర్లు

స్పిల్‌  ఛానల్‌ 
స్పిల్‌ ఛానల్‌ నిర్మాణంలో 18 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీటు వేయాల్సి ఉంది. ప్రస్తుతం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది. 
మట్టి పనుల వివరాలు 
లక్ష్యం : 595 లక్షల క్యూబిక్‌మీటర్లు 
 చేసింది: 463.76 లక్షల క్యూబిక్‌మీటర్లు 
చేయాల్సింది: 131.24 లక్షల క్యూబిక్‌ మీటర్లు

అప్రోచ్‌ ఛానల్‌, 
పైలెట్‌ ఛానల్‌ (మట్టి) 
లక్ష్యం: 181 లక్షల క్యూబిక్‌ మీటర్లు 
చేసింది: 48.76 లక్షల క్యూబిక్‌ మీటర్లు 
చేయాల్సింది: 132.24 లక్షల క్యూబిక్‌ మీటర్లు

దిగువ  కాఫర్‌డ్యాం 
జెట్‌ గ్రౌటింగ్‌ పని జరుగుతోంది (భూమి లోపల ఇసుకను గట్టిపరిచే పని) 
లక్ష్యం : 1630.4 మీటర్లు పొడవు 
డిసెంబరు 2017 నాటికి చేయాల్సింది: 1055.5 మీటర్లు పొడవు 
చేసింది:  807మీటర్లు 
చేయాల్సింది: 148.5 మీటర్లు 
ఈ నిర్మాణంలో 703 కాలమ్స్‌కు 539 కాలమ్స్‌ వేయగా ఇంకా 164 నిర్మాణం జరగాల్సి ఉంది. 
బీ జంట సొరంగాలు: దేవరగొంది నుంచి మామిడిగొంది వరకు 779 మీటర్ల పొడవునా కొండల్లో సొరంగ మార్గం నిర్మాణం జరగాల్సి ఉంది. దీనిలో 750మీటర్ల మేర సొరంగాల తవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తిచేసి లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది.

రేడియల్‌ గేట్ల నిర్మాణం 
స్కిన్‌ ప్లేట్లు అమరిక: 48 (నూరుశాతం పూర్తయ్యాయి) 
ఆర్మ్‌డ్‌ గెడ్డర్లు: 384 (నూరుశాతం నిర్మాణం పూర్తయ్యాయి) 
హారిజాంటల్‌ గెడ్డర్లు : 192 (నూరుశాతం పూర్తి అయ్యాయి) 
హైడ్రాలిక్‌ సిలిండర్లు: 96 (రావాల్సి ఉంది. ఆకృతుల అనుమతులు విషయమై సీడబ్ల్యూసీ పరిశీలనలో ఉంది) 
సెల్ఫ్‌లూబ్రికేటింగ్‌ బుష్‌లు:  96కు 16 చేరుకున్నాయి. జపాన్‌ నుంచి మిగిలినవి రావాల్సి ఉంది. 
 అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంటు: గంటకు 550 క్యూబిక్‌ మీటర్ల కంకరను ఈ యంత్రం 4, 5 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలకు చల్లబరుస్తుంది. దీనిలోకి కంకర నేరుగా వెళ్లేందుకు సమీపంలోనే క్రషర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ మొత్తం కంప్యూటర్‌తో అనుసంధానం చేశారు. చల్లబడిన కంకరను నేరుగా బ్లాచింగ్‌ ప్లాంటుకు వెళ్లే విధంగా నిర్మించిన అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు.

 పి.రెగ్యులేటర్‌ : 9 గేట్ల అమరిక పూర్తయింది. పైన శ్లాబు పనులు జరుగుతున్నాయి. 
 ఈ షడిల్‌ డ్యామ్‌: రెండు కొండల నడుమ జరుగుతున్న ఈ పనుల్లో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పూర్తయింది. రాయి, మట్టి నిర్మాణం జరుగుతోంది. 
  ఎఫ్‌ షడిల్‌ డ్యామ్‌: నిర్మాణం పూర్తయింది. 
 మామిడి గొంది నుంచి తోటగొంది వరకు 800 మీటర్ల పొడవునా జంటసొరంగాల తవ్వకం పూర్తయింది. లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. 
 బండ్‌ 1, బండ్‌ 2 : తోటగొంది సమీపంలో ఆఫ్‌టెక్‌ రెగ్యులేటర్‌ను ఆనుకుని నిర్మాణాలు జరుగుతున్నాయి. 
 ఆఫ్‌టేక్‌ రెగ్యులేటర్‌ : తోటగొంది వద్ద జీరో పాయింట్‌లో ఓటి రెగ్యులేటర్‌ నిర్మాణం పూర్తి చేసి ఏడు గేట్లు పెట్టారు. దీనికి ఆనుకునే బండ్‌ 1 పని జరుగుతోంది.

కార్యాచరణకు పక్కా ప్రణాళిక 
కాంక్రీట్‌, మట్టి పనులకు సంబంధించి టెండర్లు ఖరారైన తర్వాత కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. . నిర్దేశిత గడువు లోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నాం. ఇప్పటి వరకు 30 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు అనుబంధ పనుల్లో భాగంగా జంట సొరంగాలకు సంబంధించి లైనింగ్‌కు అవసరమైన సెంట్రింగ్‌ సామగ్రి హైదరాబాద్‌లో తయారవుతోంది. ఎనిమిది నెలల్లో లైనింగ్‌ పూర్తి చేసి అప్పగిస్తామని గుత్తేదారు చెబుతున్నారు

- వీఎస్‌రమేష్‌బాబు, ఎస్‌ఈ, పోలవరం
Link to comment
Share on other sites

పోలవరాన్ని మేమే ప్రారంభిస్తాం 
071brk-rajamahn1a.jpg
రాజమహేంద్రవరం నగరం: పోలవరం కోసం మహాపాదయాత్ర పేరిట కాంగ్రెస్‌ పార్టీ ధవళేశ్వరం కాటన్‌ విగ్రహం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు చేపట్టిన పాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ సీఎం అంజయ్య ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తే.. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరా పోలవరం సాగర్‌గా నామకరణం చేసి ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారన్నారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో సుమారు రూ.5,200 కోట్లతో కుడి, ఎడమ కాల్వల నిర్మాణాలు పూర్తి చేస్తే.. నేటి ముఖ్యమంత్రి అంతా తన ఘనతే అని చాటుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఈ మూడేళ్లలో ఏ మేరకు అభివృద్ధి సాధించారంటూ ప్రశ్నించారు. 2019లో తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును తామే ప్రారంభిస్తామన్నారు.
071brk-rajamahn1c.jpg
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలోనే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిర్మించాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన అవసరం ఏముందన్నారు. పోలవరం కాంగ్రెస్‌కు మానసపుత్రిక అని, నాణ్యతతో కూడిన పనులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాడతాం అన్నారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొన్నారు.
071brk-rajamahn1b.jpg

071brk-rajamahn1d.jpg


  
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...