Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

27 Dec - Eenadu, WG Edistion

యంత్రదళం.. పోలవరానికి బలం 
అసాధ్యమైన పనుల్లో భాగస్వామ్యం 
అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం 
వీటి వల్లే నిర్మాణాలన్నీ శరవేగం 
పోలవరం, న్యూస్‌టుడే 

నదీ ప్రవాహ మార్గంలో నిర్మించే ప్రాజెక్టులకు భిన్నంగా పోలవరం సాగుతోంది. గోదావరిని పూర్తిగా దారి మళ్లించడానికి రెండు కొండల మధ్య స్పిల్‌వే, నది మధ్యలో అడ్డుకట్ట, కుడి, ఎడమ కాలువలకు నీరు వెళ్లడానికి రెగ్యులేటర్లు, సొరంగాల నిర్మాణం. ఇవన్నీ ఒక్క పోలవరానికే సొంతం. మిగిలిన ప్రాజెక్టులు నదుల ప్రవాహ మార్గాల్లో నిర్మించి వరదల సమయంలో వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వదిలి పెడుతున్నారు. కానీ.. ఏళ్ల తరబడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళ్లకపోవడానికి ప్రధాన అడ్డంకి గోదావరిపై నిర్మాణమే. భూమి లోపల కల్లా వెళ్లి రాయి, మట్టిని పైకి తీసుకొచ్చే యంత్రాలు, విదేశీ నిపుణుల పర్యవేక్షణ ఫలితంగా నేడు పనులు ఊపందుకున్నాయి.

ఫిన్‌ల్యాండ్‌ నుంచి భారీ క్రషర్‌ 
పోలవరం ప్రాజెక్టులో అన్ని నిర్మాణాలకు దాదాపు 36 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయాల్సి ఉంది. రోజుకు 17 వేల క్యూబిక్‌ మీటర్లు వేయాలి. అందుకోసం గంటకు 650 క్యూబిక్‌ మీటర్ల కంకర ఆడాలి. దాని కోసం ఫిన్‌ల్యాండ్‌ నుంచి భారీ క్రషర్‌ను రప్పించారు. ఇప్పటికే నాలుగు క్రషర్‌లు గంటకు 350 క్యూబిక్‌ మీటర్ల కంకర ఆడుతున్నాయి. ఇంకా ఏర్పాటు చేసే ప్రయత్నంలో గుత్తేదారులు ఉన్నారు.

టెలీబెల్టులు 
బ్లాచింగ్‌ ప్లాంట్‌ల నుంచి ట్రాన్స్‌షిప్‌ మిక్సర్లలో వచ్చే కాంక్రీట్‌ను స్పిల్‌వే నిర్మాణంలో వేసేందుకు టెలీ బెల్టులను ఉపయోగిస్తున్నారు. ఇవి గట్టుపై నుంచి ఎక్కడ కాంక్రీట్‌ వేయాలంటే అక్కడకు కన్వేయరు బెల్టుపై దాదాపు 28 నుంచి 36 మీటర్లు వరకు వెళ్తాయి. నాలుగు టెలీబెల్టులు పనిచేస్తున్నాయి.

అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంటు 
సాధారణంగా కాంక్రీట్‌ నిర్మాణాలు ఉష్ణోగ్రత ఎక్కువైతే బీటలు ఇస్తాయి. ప్రాజెక్టు పనుల్లో బీటలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కాంక్రీట్‌ తయారీ సమయంలో వేడి స్వభావం గల కంకరలో ఐస్‌ కలిపేవారు. గోదావరిలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. దానిని 14 డిగ్రీలకు తగ్గించేందుకు ప్రత్యేకంగా ఐస్‌ ప్లాంటులను ఏర్పాటు చేశారు. ఇకపై 2 - 3 డిగ్రీల ఉష్ణోగ్రతకు తగ్గించేందుకు అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంటు నిర్మాణం ఏర్పాటు చేశారు. ఇందులో చల్లబడిన కంకర నేరుగా కన్వెయర్‌ బెల్టు ద్వారా బ్లాచింగ్‌ ప్లాంట్‌లకు వెళ్లిపోతుంది.

కేపీ -6 గ్రౌటింగ్‌ యంత్రాలు 
కాఫర్‌డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుకను గట్టిపర్చేందుకు కేపీ -6 యంత్రాన్ని జెట్‌గ్రౌటింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. దిగువ కాఫర్‌డ్యామ్‌లో 10 మీటర్ల లోతు నుంచి ఇసుకను రాయిలా మార్చేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు. బయట బెంటోనైట్‌ అనే మిశ్రమాన్ని నీటిలో కలిపి 400 బారెల్స్‌ ఒత్తిడితో లోపలికి పంపుతారు. అది రెండు 2 మీటర్ల మేర ఇసుకను రాయిలా గట్టిపరుస్తూ ముందుకు వెళ్తుంది.

బ్లాచింగ్‌ ప్లాంట్స్‌ 
కాంక్రీట్‌ను కలిపే బ్లాచింగ్‌ ప్లాంట్‌లను మూడు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్లాంట్‌లో గంటకు 240 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ తయారవుతుంది. వాటిని నేరుగా నిర్మాణ ప్రాంతాలకు తరలించేందుకు 20 ట్రాన్స్‌షిప్‌ మిక్సర్లను వినియోగిస్తున్నారు.

వైబ్రో కంప్రెషర్‌ 
గోదావరి నదిపై నిర్మించే ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పొడవునా 20 మీటర్ల లోతులో ఇసుకను గట్టి పర్చేందుకు వైబ్రోకంప్రెషర్‌ను ఉపయోగిస్తున్నారు. గోదావరి నదికి అవతల వైపు నుంచి ఇవతల వైపు దాదాపు 1500 మీటర్ల పొడవున 300 మీటర్ల వెడల్పున 20 మీటర్ల లోతున ఇసుకను గట్టిపర్చేందుకు ఇది పనిచేస్తుంది. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా మట్టి, రాయి కట్టడానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లికుండా, కుంగిపోకుండా ఇసుకను వైబ్రో కంప్రెసర్‌ గట్టి పరుస్తుంది. ప్రస్తుతం డయాఫ్రమ్‌వాల్‌కు ఎగువన, దిగువన పది మీటర్ల పరిధిలో పని శరవేగంతో జరుగుతోంది.

అవి లేకుంటే చాలా కష్టం 
గోదావరి నదిపై నిర్మించే డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణంలో గ్రాబర్‌లు, కట్టర్‌లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 60 నుంచి వంద మీటర్ల లోతుకు వెళ్లి మట్టి, రాయిని బయటకు తీయడం మనుషులతో సాధ్యం కాదు. యంత్రాలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాయి. కాఫర్‌డ్యామ్‌ నిర్మాణంలో కేపీ -6 జెట్‌ గ్రౌటింగ్‌ యంత్రాలు రెండు పని చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దిగువ కాఫర్‌డ్యామ్‌ నిర్మాణ ప్రదేశంలో రాయిలా మారిన ఇసుకను ఆసక్తిగా ఎక్కి మరీ పరిశీలించారు. కొండలను కూడా ఎక్సావేటర్లు సునాయాసంగా పిండిచేస్తున్నాయి.

- ఎన్‌.పుల్లారావు, డయాఫ్రమ్‌వాల్‌ పర్యవేక్షక ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, పోలవరం
Link to comment
Share on other sites

పోలవరం పనులపై కేంద్రం ఆరా

27-12-2017 02:23:02

 శశిభూషణ్‌కు కేంద్ర కార్యదర్శి ఫోను

 కాఫర్‌ డ్యాం డిజైన్లపై చర్చ

 భూసేకరణ, పునరావాసంపైనా..

 ఇప్పటికీ రాని ఎన్‌హెచ్‌పీసీ నివేదిక

 రాష్ట్రప్రభుత్వం ఎదురుచూపులు

అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్మాణ పనులపై కేంద్రం ఆరా తీస్తోంది. 2019 నాటికి పనులు పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటో.. అనుసరిస్తున్న విధానాలేమిటో అడిగి తెలుసుకుంటోంది. కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్‌.. రాష్ట్ర జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో మంగళవారం ఫోన్లో సంభాషించారు. కాఫర్‌ డ్యాం డిజైన్ల ఆమోదం.. దాని ఎత్తు.. ప్రధాన ఆనకట్ట 41 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే.. నీటి నిల్వలకు తగ్గట్టుగా సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తయ్యాయా.. లేదా అని సింగ్‌ ప్రశ్నించారు. భూ సేకరణ కార్యక్రమం దాదాపు పూర్తయిందని.. పశ్చిమగోదావరి జిల్లాలో సేకరణ పనులు చాలా వరకు పూర్తయ్యాయని.. తూర్పు గోదావరిలోనూ మెజారిటీ భూ సేకరణ జరిగిపోయిందని శశిభూషణ్‌ వివరించారు. సహాయ పునరావాస కార్యక్రమాలూ పూర్తయ్యాయని తెలిపారు. మట్టి పనులపైనా సింగ్‌ ఆరా తీశారు. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయగలమన్న విశ్వాసాన్ని శశిభూషణ్‌కుమార్‌ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పనులకు సంబంధించి ఈ నెల 5వ తేదీన జరిగిన సమావేశానికి అనుగుణంగా రూ.2500 కోట్ల మేర బిల్లులను పంపామని ఈ సందర్భంగా శశిభూషణ్‌ గుర్తుచేశారు. వివరించారు. త్వరలోనే సింగ్‌ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో.. ప్రాజెక్టు పనులపై ఆయన ఆరా తీయడం ఆసక్తిని రేపుతోందని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకోవైపు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించాలా.. వేరు చేసి నిర్మించాలా.. అసలది అవసరమా లేదా.. అనే సందేహాలకు సమాధానం దొరకడం లేదు. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంపై నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) బృందం అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. నివేదికను వారంలో అందిస్తామని ఈ నెల 5న ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. ఇంతవరకు దాని అతీగతీ లేదు. మంగళవారంనాటికి నివేదిక వస్తుందని గడ్కరీ ఓఎస్డీ/సాంకేతిక సలహాదారు ఖోలాపుర్కర్‌ సమాచారం అందించారు. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు మంగళవారమంతా ఎదురుచూశారు. కానీ అందలేదు. ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ కీలక అధికారులు ఒక్కొక్కరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో హల్దర్‌, ఖోలాపుర్కర్‌ తదితరులు వచ్చారు. వీరంతా కాంక్రీట్‌ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎగువ కాఫర్‌ డ్యాంపై మాత్రం పెదవి విప్పడం లేదు. ఎన్‌హెచ్‌పీసీ నుంచి కేంద్ర జల వనరుల శాఖకు ఈ నివేదిక వెళ్తుంది. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దాని ప్రతిని పంపుతారు. అది సీఎం కార్యాలయానికి.. రాష్ట్ర జల వనరుల కార్యదర్శికి చేరుతుంది. ఈ నివేదిక వస్తే తప్ప.. ఎగువ కాఫర్‌ డ్యాం పనులకు మోక్షం కలుగదు. ఇప్పటికే.. కెల్లర్‌ సంస్థ జెట్‌ గ్రౌటింగ్‌ పనులను శరవేగంగా చేస్తోంది. కాఫర్‌ డ్యాం పనులు వరదలు వచ్చేలోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు భావిస్తుండగా.. కేంద్రం జాప్యం చేస్తుండడంతో ఆందోళన, అసహనం పెరుగుతున్నాయి.

Link to comment
Share on other sites

పోలవరం నుంచే మేలు 
కావేరితో అనుసంధానంపై వ్యాప్కోస్‌ స్పష్టీకరణ 
ఇంద్రావతి ఉప పరీవాహక ప్రాంతంలో అంత నీటి లభ్యత లేదు 
ఛత్తీస్‌గఢ్‌ నీటి వాటాపై ఆధారపడి ఇంత వ్యయం సరికాదు 
కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించనున్న వ్యాప్కోస్‌ ప్రతినిధులు 
ఈనాడు - అమరావతి

అకినేపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి మళ్లించడం కన్నా పోలవరం జలాశయం నిర్మాణం తర్వాత అక్కడి నుంచి (పైడిపాకల నుంచి) మళ్లించడమే మేలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ తేల్చి చెప్పింది. దుమ్ముగూడెంకు ఎగువన తుపాకులగూడెంకు దిగువన అకినేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి నాగార్జునసాగర్‌ జలాశయానికి పంపి అక్కడి నుంచి సోమశిల, ఆ తర్వాత కావేరి నదికి గోదావరి నీటిని మళ్లించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూఏ) ప్రతిపాదిస్తోంది. ఇది ఆచరణయోగ్యం కాదని, అందులో అనేక ఇబ్బందులున్నాయని పేర్కొంటూ ఒక తాజా నివేదికను వ్యాప్కోస్‌ రూపొందించింది. నివేదికలోని వివరాలను ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ అధికారులు కొందరికి బుధవారం వ్యాప్కోస్‌ ప్రతినిధులు వివరించారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతలు అప్పగించింది. లైడార్‌ సర్వే చేసి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని సూచించింది. ఆ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు లైడార్‌ సర్వే పూర్తి చేశారు. తాజాగా కేంద్రం గోదావరి నీటిని కావేరికి తరలించాలని భావిస్తున్న నేపథ్యంలో వారు ఈ అంశాన్నీ అధ్యయనం చేశారు. అందులోని ముఖ్యాంశాలివీ.... 
* గోదావరికి మొత్తం 12 ఉప పరీవాహక ప్రాంతాలున్నాయి. అకినేపల్లి వద్ద నుంచి నీరు తరలించాలంటే ఇంద్రావతి ఉప పరీవాహక ప్రాంతంపై ఆధారపడాలి. ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌కు 180 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 130 టీఎంసీల వాటాలున్నాయని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ తన వాటా నీటిని వాడుకుంటే ఇక్కడ గోదావరి నీటిని మళ్లించడానికి లభ్యత ఉండదు. 
* ప్రతిపాదిత ప్రాంతం దిగువన తెలంగాణ ఒక బ్యారేజీ, ఎగువన తుపాకులగూడెం వద్ద మరో ప్రాజెక్టు చేపడుతోంది. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతం రెండింటి మధ్య ఉండటంతో అక్కడ నీటిని ఎత్తిపోసేందుకు నిర్దేశించుకునే ఎత్తువద్ద కొన్ని పరిమితులున్నాయి. అవి నీటిని ఒక స్థాయి దాటి మళ్లించడానికి ఆస్కారం లేకుండా ఉన్నాయి. 
* ఛత్తీస్‌గఢ్‌ తన వాటాను వినియోగించుకుంటే అకినేపల్లి వద్ద ప్రతిపాదిత 240 టీఎంసీలు అందుబాటులో ఉండవు. జంఝావతి, పోలవరంలపై ఛత్తీస్‌గఢ్‌ న్యాయస్థానాల్లో కేసులు వేసినందున వారి నుంచి ఈ ఇబ్బందినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 
* పోలవరం నిర్మాణం తర్వాత పైడిపాకల నుంచి నీటిని ఎత్తిపోసి మళ్లించదలుచుకుంటే గోదావరిలో 75శాతం విశ్వసనీయతవద్ద 700 టీఎంసీల వరకూ నీటి లభ్యత ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక్కడ శబరి నుంచి 300 టీఎంసీలు లభిస్తున్నందున ఇక్కడ నుంచి పెన్నా ఆ తర్వాత కావేరి వరకు మళ్లింపునకు ఇబ్బందులు ఉండవు.

కాఫర్‌ డ్యాంకు ఎన్‌హెచ్‌పీసీ సరే?
28-12-2017 04:12:48
కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక
డిజైన్‌ రివ్యూ కమిటీకి పంపిన కేంద్రం
అది ఓకే చెబితే రాష్ట్రానికి సమాచారం
నేడు పోలవరంలో హామీల కమిటీ పర్యటన
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి క్రమంగా అడ్డంకులు తొలగిపోతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధాన ఆనకట్టకు ఎగువన కాఫర్‌ డ్యాంను నిర్మించేందుకు నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఈ డ్యాంను విడిగా నిర్మించాలా.. లేక ప్రధాన ఆనకట్టతో కలిపి నిర్మించాలా.. అసలిది అవసరమో కాదో తేల్చేందుకు ఎన్‌హెచ్‌పీసీకి కేంద్ర జలవనరుల శాఖ అధ్యయన బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన ఎన్‌హెచ్‌పీసీ బృందం బుధవారం తన నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ నివేదికలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి సానుకూలత తెలిపినట్లు చెబుతున్నారు. అయితే కేంద్ర జలవనరుల శాఖ.. దీని ఎత్తు తదితర అంశాలను పరిశీలించేందుకు డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీకి ఈ నివేదికను పంపినట్లు సమాచారం. ఈ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే .. త్వరలోనే ఎగువ కాఫర్‌ డ్యాంపై స్పష్టత ఇస్తూ.. రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇంకోవైపు.. గాలి ముద్దు కృష్ణమనాయుడుతో పాటు మరో నలుగురు ఎమ్మెల్సీల నేతృత్వంలోని శాసనమండలి హామీల కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది.

Link to comment
Share on other sites

పోలవరం ముంపు నుంచి రక్షణకు కరకట్ట 
నిర్మాణానికి ఏపీ ప్రతిపాదన 
ఒడిశాలో 30 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 29.12 కిలోమీటర్లు 
పీపీఏ వార్షిక ఆడిట్‌ నివేదికలో వెల్లడి 
ఈనాడు - దిల్లీ

పోలవరం కారణంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ముంపును పూర్తిగా నివారించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో శబరి, సీలేరు నదుల పొడవునా 59.12 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు పోలవరం ప్రాజెక్టు ప్రాధికారసంస్థ (పీపీఏ) తెలిపింది. కేంద్ర గిరిజన వ్యవహారాలు, సీడబ్ల్యూసీ, ఇతర అధీకృతసంస్థల నిర్దేశం మేరకు ఒడిశాలో 30 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 29.12 కిలోమీటర్ల మేర అడ్డుగోడ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించినట్లు పేర్కొంది. గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పీపీఏ 2015-16 వార్షిక ఆడిట్‌ నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించారు. ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 11 అనుమతులు వచ్చినట్లు తెలిపారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..

* పోలవరం ప్రాజెక్టుకోసం 1,83,013 ఎకరాల అటవీ, అటవీయేతర భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాల్లోని 371 నివాస ప్రాంతాలు, 221 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతాయి.

* మొత్తం 1,88,012 మంది వ్యక్తులు, 55,799 ఇళ్లు ముంపు పరిధిలోకి వస్తాయి. ఇందులో 155 నివాసప్రాంతాలు పూర్తిగా, 216 పాక్షికంగా ముంపునకు గురవుతాయి. మొత్తం 89,827 మంది గిరిజనులు పోలవరం ప్రాజెక్టువల్ల ప్రభావితం అవుతారు.

* మొత్తం 371 నివాసప్రాంతాల్లో 11 ప్రాంతాల వారికి తొలి రెండు దశల్లో పునరావాస ప్రక్రియ పూర్తయింది. 
* ఒకవేళ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోతే ఈ బృహత్తర ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు గ్రామాలు, 11,766 మంది ప్రజలు, ఒడిశాలో 8 గ్రామాలు, 6,316 మంది ప్రజలు ముంపు ప్రభావానికి గురవుతారు.

* మొత్తం 3రాష్ట్రాల్లో 40,137.11 హెక్టార్ల భూమి ప్రాజెక్టు కింద మునిగిపోతుంది. ఇందులో ఒడిశాలో 648.05 హెక్టార్లు, ఛత్తీస్‌గడ్‌లో 795.59 హెక్టార్లు ఉంది. 
* అడ్డుగోడ నిర్మాణంవల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పూర్తిగా ముంపు నివారణ సాధ్యమవుతుంది.

* ఈ కరకట్టల నిర్మాణంపై ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లలోని సంబంధిత అధికారులను కేంద్ర పర్యావరణ శాఖలోని పర్యావరణ మధింపు కమిటీ 2009 మార్చి 9నే లేఖద్వారా కోరింది. రెండు రాష్ట్రాలు ఇప్పటికీ.. ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాల్సి ఉంది.

మా సమస్యలు పరిష్కరించేంతవరకూ పోలవరం వద్దు 
ఒడిశా ఎంపీల డిమాండ్‌
ఈనాడు, దిల్లీ: ఒడిశాలోని ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించేంతవరకూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని బిజూజనతాదళ్‌ సభాపక్షనాయకుడు బతృహరి మెహతాబ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం లోక్‌సభలో ఆయన దీనిపై ప్రత్యేకంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒడిశాకు పెద్దగా విభేదాలు లేవని చెప్పారు. అదే సమయంలో ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ‘‘సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున.. సమస్య పరిష్కారం అయ్యేంతవరకూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించవద్దు’’ అని డిమాండ్‌ చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒడిశా ఎంపీలంతా లేచి పోలవరం నిర్మాణంపై నిరసన వ్యక్తంచేశారు. మరోవైపు, గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పులోని నిబంధనలమేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌ గురువారం లోక్‌సభలో తెలిపారు.
Link to comment
Share on other sites

స్పిల్‌వే పనులు మిగిలిపోయాయ్‌
కేంద్రం బిల్లులు చెల్లిస్తే లక్ష్యం మేరకు పోలవరం పూర్తి: సీఎం
వచ్చే నెలలో పోలవరానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ రాక
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాచారమూ రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ పనులు మిగిలిపోయాయని చెప్పారు. చేసిన పనులకు వెనువెంటనే కేంద్రం బిల్లులను చెల్లిస్తే లక్ష్యం మేరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం జరిగిన ప్రకాశం బ్యారేజీ 60 వసంతాల వేడుకకు ముఖ్యఅతిఽథిగా హాజరైన ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 2018 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని చెప్పారు. తనకు ప్రాజెక్టులను నిర్మించాలన్న సంకల్పంతో పాటు, వాటిని పూర్తి చేసే దృఢచిత్తమూ ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందుకే పోలవరంలో ఎదురవుతున్న సమస్యలను గురించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని గట్టిగా అడిగానన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందిస్తానన్న హామీ వచ్చినా..ఆచరణలో జాప్యం జరుగుతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రెండేళ్లుగా వర్షాభావపరిస్థితులు నెలకొన్నాయని, పట్టిసీమ నుంచి నీళ్లు రాకపోతే ప్రకాశం బ్యారేజీ వద్ద కూర్చొని 60 వసంతాల వేడుకను చేసుకునేవారమా అని ప్రశ్నించారు.
 
అప్పుడే రాజధాని అయి ఉంటే?
మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రుల రాజధాని విజయవాడలో పెట్టిఉంటే..దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచేదని, బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమ ప్రాంతంలోనూ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రకాశం బ్యారేజీకి పునాదులు వేశారని..ఆతర్వాత నీలం సంజీవరరెడ్డి దానిని ప్రారంభించారని అన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణంలో ఇంజనీర్లుగా విశిష్ట సేవలందించిన వారిని సీఎం సత్కరించారు. అంతకు మందు కృష్ణా నదికి సీఎం చంద్రబాబు హారతి ఇచ్చారు.
 
వచ్చే నెలలో పోలవరానికి గడ్కరీ
కాఫర్‌ డ్యామ్‌ డిజైన్లపై నేషనల్‌ హైడ్రో ప్రాజెక్టు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నివేదిక ఇచ్చిందని, దానిని డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ) పరిశీలిస్తోందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. జనవరి రెండో వారంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తారన్నారు. ఈఏడాది ఒక్క చుక్క కూడా ప్రకాకాం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వెళ్లలేదని ఉమా మహేశ్వరరావు అన్నారు.

ట్రాన్‌స్ట్రాయ్‌పై దివాలా పిటిషన్‌
30-12-2017 02:27:23

745 కోట్లు బకాయిపడిన కాంట్రాక్టు సంస్థ
దాంతో ట్రైబ్యునల్‌కు వెళ్లిన కెనరా బ్యాంకు
ఇక పోలవరం కాంక్రీటు పనులు కష్టమే!
అందుకే కొత్త టెండర్లు పిలిచిన ప్రభుత్వం
అయినా రెండు నెలలు ఆగాలన్న గడ్కరీ
ప్రాజెక్టును చుట్టుముడుతున్న వరుస కష్టాలు
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరందించాలన్న లక్ష్యంతో చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు వరు స కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటిదాకా ఆర్థిక కష్టాల్లో ఉం టూ.. ఒంటికాలిపై కాలం వెళ్లదీస్తున్న ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌పై కెనరా బ్యాంకు.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించింది. ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించాలని, కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని కోరింది. దీంతో ట్రాన్‌స్ట్రాయ్‌ భవితవ్యంతోపాటు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్‌ కూడా డోలాయమానంలో పడిం ది. ట్రాన్‌స్ట్రాయ్‌ తమకు రూ.725 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ఈ నెల 22 నాటికి రూ.489 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకు గ్యారంటీ కింద రూ.379 కోట్లే ఉంచిందని కెనరా బ్యాంకు పేర్కొంది.
 
కెనరా బ్యాంకు తరపున బ్యాంకు అధికారి పి. కోటేశ్వరరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ట్రైబ్యునల్‌ త్వరలోనే ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ట్రాన్‌స్ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న కాంట్రాక్టు సంస్థకు మున్ముందు బ్యాంకుల నుంచి పరపతి పుట్టే అవకాశమే ఉండ దు. అప్పుడు పోలవరంలో అత్యంత కీలకమైన కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ వంటి అతిముఖ్యమైన కాంక్రీట్‌ పనులు ముందుకు సాగవు. ఇదే జరిగితే 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరివ్వాలని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన సీఎం చంద్రబాబు.. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులకు టెండర్లు పిలిచి కొత్త సంస్థకు పనులు అప్పగించాలని భావించారు. టెండర్లను కూడా పిలిచారు. అయితే ఈ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. తాము టెండర్లను ఎందుకు పిలవాల్సి వచ్చిందో వివరించేందుకు సీఎం బృందం ఇటీవల ఢిల్లీలో జలనవరుల మంత్రి నితిన్‌ గడ్కరీనీ కలిసిన సంగతి తెలిసిందే. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ఆర్థికంగా చితికిపోయిందని, కాంక్రీటు పనుల్లో కొంత భాగం కొత్త సంస్థకు అప్పగించాలని గడ్కరీకి ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు.
 
అయితే ట్రాన్‌స్ట్రాయ్‌కు మరో రెండు నెలలు గడువిద్దామని కేంద్ర మంత్రి చెప్పారు. గోదావరికి వరదలు వచ్చేలోపే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు పూర్తిచేయాలని.. లేదంటే ఒక నీటి సంవత్సరం నష్టపోతామని చంద్రబాబు ఎంత చెప్పినా కేంద్రం వినిపించుకోలేదు. చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి వివరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దక్షిణ కొరియా పర్యటన సమయంలోనూ గడ్కరీతో ముఖ్యమంత్రి ఈ అంశంపై ఫోన్లో మాట్లాడారు. మరోపక్క కాఫర్‌డ్యాం నిర్మాణానికి కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. ఈ తరుణంలో ట్రాన్‌స్ట్రాయ్‌పై కెనరా బ్యాంకు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
 
Link to comment
Share on other sites

డ్యాం..మరికొంత కాఫర్‌ డ్యాం! 

అనుసంధానిస్తూ తొలిదశ నిర్మాణం 

42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించుకుని నీటి సరఫరా 

ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రధాన డ్యాం నిర్మాణం 

కాఫర్‌డ్యాం వ్యయమూ తగ్గుతుంది 

కేంద్రానికి ఎన్‌హెచ్‌పీసీ నివేదిక 

ఈనాడు, అమరావతి: పోలవరంలో కొంత ప్రధాన డ్యాం, మరికొంత ఎగువ కాఫర్‌ డ్యాం తొలిదశలో నిర్మించి రెండింటిని అనుసంధానించి నీటిని నిలబెట్టుకోవచ్చని జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్ర నిపుణుల బృందం (ఎన్‌హెచ్‌పీసీ) కేంద్రానికి నివేదిక సమర్పించింది. జలవనరులశాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది. ఒక సీజన్‌లో ఈ మేరకు పని పూర్తి చేసుకుని నీటిని నిలబెట్టుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన ప్రధానడ్యాం పని పూర్తి చేసుకోవచ్చని అభిప్రాయపడింది. ఇలా చేయడం వల్ల ఎగువ కాఫర్‌డ్యాం నిర్మాణంలో కొంత వ్యయం  తగ్గుతుందని ఆ బృందం పేర్కొందని విశ్వసనీయ సమాచారం. ఒక సీజన్‌లో ప్రధానడ్యాం ఒక వైపు నుంచి ఎగువ కాఫర్‌డ్యాం మరోవైపు నుంచి నిర్మించుకుంటూ వచ్చి అనుసంధానించి నీళ్లు నిలబెడతారు. 42.5 మీటర్ల ఎత్తుకే వీటిని నిర్మిస్తారు.

* పోలవరంలో తొలి ప్రణాళిక ప్రకారం స్పిల్‌వేను స్పిల్‌ఛానల్‌ స్థాయి వరకు నిర్మించుకుని ఎగువ కాఫర్‌ డ్యాంను 31 మీటర్ల ఎత్తుకు నిర్మించి ఆ తర్వాత స్పిల్‌వేను క్రెస్ట్‌ లెవల్‌ వరకు, ప్రధాన డ్యాంను పూర్తి చేసుకోవాలనేది తొలి ఆలోచన.

* ఆ తర్వాత అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎగువ కాఫర్‌డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించుకుంటే ప్రధానడ్యాం పూర్తి స్థాయిలో నిర్మించకుండానే స్పిల్‌వే, మిగిలిన పనులు పూర్తి చేసుకుని జలాశయంలో నీళ్లు నిలబెట్టి గ్రావిటీ ద్వారా 2018 జూన్‌ తర్వాత సరఫరా చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి పోలవరం ఆకృతుల కమిటీ సూత్రబద్ధంగా ఆమోదించింది.

కేంద్ర జలవిద్యుత్తు కార్పొరేషన్‌ బృందం నివేదిక ఏం చెబుతోందంటే.. 

* ప్రస్తుతం స్పిల్‌వే కాంక్రీటు పనులు వేగంగా సాగడం లేదు. ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు 42.5 మీటర్లకు పెంచుకునేందుకు అయిదు నెలల్లో స్పిల్‌వే పనులు ఎంతవరకు పూర్తవుతాయో చెప్పలేం. కాంక్రీటుపనుల ఆలస్యం వల్ల ఆ ప్రతిపాదన పూర్తి స్థాయి అమలుకు అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వారు ప్రత్యామ్నాయ ఆలోచనను తెచ్చారు.

* ఎగువ కాఫర్‌డ్యాం 42.5 మీటర్ల ఎత్తుకు, ప్రధాన డ్యాంను అంతే ఎత్తుకు నిర్మించుకునేందుకు అభ్యంతరం లేదు.

* నిజానికి ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం 2.3 కిలోమీటర్ల (దాదాపు) పొడవునా గోదావరిపై ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు ఎగువ కాఫర్‌డ్యాం 42.5 మీటర్ల ఎత్తున నిర్మించాలి.

* అలాగే ప్రధాన డ్యాం దాదాపు 1.75 కిలోమీటర్ల పొడవునా ఒరిజనల్‌ ప్రణాళిక ప్రకారం నిర్మించాలి.

* ఇప్పుడు ఎన్‌హెచ్‌పీసీ నిపుణుల ప్రతిపాదన ప్రకారం.. ప్రధాన డ్యాం, ఎగువ కాఫర్‌డ్యాం పనులు సమాంతరంగా చేసుకోవాలి. ఒక సీజన్‌లో ఇటు నుంచి అటు కొంతమేర ప్రధాన డ్యాం పూర్తి స్థాయిలో నిర్మించుకోవచ్చు. అలాగే అటునుంచి ఇటువైపు ఎగువ కాఫర్‌ డ్యాం 42.5 మీటర్లకు పూర్తి స్థాయి పొడవు లేకుండా నిర్మించాలి. ఇటునుంచి అటు కొంత పొడవు నిర్మించిన ప్రధాన డ్యాంను, ఆ గట్టు నుంచి ఈ గట్టు వైపు కొంత మేర నిర్మించిన ఎగువ కాఫర్‌డ్యాంను అనుసంధానిస్తూ మధ్యలో నిర్మాణమూ చేపడతారు. ఆ సీజన్‌లో ఇలా రెండింటి అనుసంధానంతో నీటిని నిలబెట్టి గ్రావిటీ ద్వారా సరఫరా చేస్తారు.

* ఆ తర్వాత ప్రధాన డ్యాం పూర్తి స్థాయిలో మరుసటి సీజన్‌లో నిర్మించుకోవచ్చు. 

ఇలా చేయడం వల్ల ఎగువ కాఫర్‌ డ్యాం వ్యయం కొంత మేర తగ్గుతుందని ఆ కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.

ఆకృతుల కమిటీ భేటీకి సన్నాహాలు 

ఎన్‌హెచ్‌పీసీ కమిటీ నివేదికను పోలవరం ఆకృతుల కమిటీ ముందుంచి చర్చించనున్నారు. జనవరి మొదటి వారంలో ఈ సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Link to comment
Share on other sites

56 minutes ago, swarnandhra said:

ila kattam valla original plan kante fast ga ne avutundi kani, heavy flood vacchindante ilanti atukula vyavaharam entha varaku safe oo

veella athi telivi valla east west godavari district lo 50 lakh people chanipotharu. konni vela/lakhala kotla aasti nashtam vastundi . upper coffer dam state govt plan(41.5 metre) tho kadithe  350 crores avuntundi . central government 200 kotlu save cheyyadaniki choostundi. central government voppukokapothe state govt 350 crores bear chesi kattadam better. modi , gadkari antha cunning fellows ni ekkada choodaledu. veellu dabbulu ivvaru permissions ivvaru . xxxxx jeevitham development kannaa politics mukhyamayyayi. intha daridrulaki japam chestunnaaru north(hindi belt) prajalu. ilaa ayithe interlinking of rivers 100 years padutaadi. china lo politics levu pedda projectlu kooda record time lo complete chestaaru. ikkada pani chesevaadu kannaa , cheda denge vaallu ekkuva ayyaaru.

Link to comment
Share on other sites

2 minutes ago, ravindras said:

ఎలా సాధ్యం? 
ప్రధాన, కాఫర్‌ డ్యాంలపై  ఉన్నతాధికారుల అనుమానం 
త్వరలో జరిగే ఆకృతుల కమిటీ నిర్ణయమే కీలకం 
పోలవరంలో నిర్మాణాలపై ఉత్కంఠ
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం, ఎగువ కాఫర్‌ డ్యాంలను నిర్మించుకుంటూ వచ్చి రెండింటినీ అనుసంధానం చేసి నీటిని నిలపవచ్చన్న జాతీయ జల విద్యుత్తు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణుల నివేదికపై పోలవరం ఉన్నతాధికారులు కొందరు పెదవి విరుస్తున్నారు. అది కష్టసాధ్యమేనని వారు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీసలహాదారు సంజయ్‌ కూడా ఇటీవల ప్రధాన డ్యాం, కాఫర్‌ డ్యాం అనుసంధాన నిర్మాణం అంత సులభమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంపై కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని ఆకృతుల సమీక్ష కమిటీ తీసుకునే తుది నిర్ణయమే కీలకం కానుంది. జనవరి మొదటి వారంలో ఈ కమిటీ భేటీ అయ్యే అవకాశముంది. ఎన్‌హెచ్‌పీసీ నిపుణులిచ్చిన నివేదికను కమిటీ ముందుంచి, అందులోని సాధ్యాసాధ్యాలపై కూలంకషంగా చర్చిస్తారు. ఆ తర్వాత కమిటీ తీసుకునే నిర్ణయమే కీలకమవుతుంది. 
పోలవరం ప్రాజెక్టులో ఆకృతులన్నింటికీ మొదటి నుంచీ కేంద్ర జలసంఘం ఆమోదం తీసుకుంటున్నారు. ఇందుకోసం జల సంఘంవద్ద మాజీ ఛైర్మన్‌ పాండ్యా నేతృత్వంలో నిపుణులతో ఈ ఆకృతుల సమీక్ష కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఇప్పటికే అనేక పర్యాయాలు సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. విజయవాడ, దిల్లీలోనూ భేటీలు నిర్వహించి ఆకృతులకు ఆమోదం తెలుపుతూ, మార్గదర్శకాలిస్తూ ప్రాజెక్టు పురోగతికి సహకరిస్తోంది. ఇప్పుడు ఎన్‌హెచ్‌పీసీ కొత్త ప్రతిపాదనను తెరముందుకు తేవడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆకృతుల కమిటీ ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఎన్‌హెచ్‌పీసీ అభిప్రాయం... 
ఎగువ కాఫర్‌ డ్యాంను ప్రతిపాదిత 2300 మీటర్ల పొడవునా నిర్మించాల్సిన అవసరం లేదు. దానిని, ప్రధాన డ్యాంను కొంత మేర నిర్మించి రెండింటినీ అనుసంధానిస్తే సరిపోతుంది. దీనివల్ల కాఫర్‌ డ్యాం పొడవుతోపాటు వ్యయం తగ్గుతుంది. గోదావరిలో వరద ప్రవాహం లేని ప్రాంతంలో ప్రధాన డ్యాంను నిర్మించుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత వరద లేని సమయంలో ప్రవాహాలు తక్కువగా ఉండే వైపు అటు నుంచి ఇటు ఎగువ కాఫర్‌ డ్యాంను నిర్మించుకుంటూ రావాలి. రెండింటినీ అనుసంధానించాలి.
సులభం కాదేమో..: ఉన్నతాధికారులు 
అనుసంధాన ప్రతిపాదన అంత సులభమేమీ కాదు. ప్రధాన డ్యాంలో దిగువన డయాఫ్రం వాల్‌ పద్ధతిలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో దిగువన పునాదిగా జెట్‌ గ్రౌటింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ రెండింటినీ కలపడం ఎలా అన్నది చర్చనీయాంశమే. రెండింటిలో సెంట్రల్‌ ఫిల్టర్లు, క్లే కోర్‌ను కలపడం వంటి అంశాల్లోను సవాళ్లున్నాయి.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...