Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
ఆ డిమాండ్ల సంగతి తేల్చేద్దాం!
11-12-2017 04:22:58
 
636485629825835480.jpg
  • ట్రాన్స్‌ట్రాయ్‌ 5 డిమాండ్లపై త్రిసభ్య కమిటీ భేటీ
  • నేడు పోలవరంలో మరోసారి కమిటీ భేటీ
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ లేవనెత్తిన ఐదు డిమాండ్లపై త్రిసభ్య కమిటీ కసరత్తు ప్రారంభించింది. పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌కు పిలిచిన టెండర్లపై నిర్ణయం తీసుకునే ముందు ప్రధాన కాంట్రాక్టు సంస్థ లేవనెత్తిన ఐదు ప్రధాన డిమాండ్లపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఈ నెల 5న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించిన విషయం విదితమే. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సోమవారం విజయవాడలో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు సలహాదారు దినేశ్‌ భార్గవ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుతో కూడిన త్రిసభ్య కమిటీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏకధాటిగా సమావేశమై ట్రాన్స్‌ట్రాయ్‌ ఐదు డిమాండ్లపై చర్చించింది.
 
 
తమకు వాస్తవ చెల్లింపులు జరపాలని.. ఉప కాంట్రాక్టు సంస్థలకు చెల్లిస్తున్నట్లుగా వాస్తవ వ్యయాలను తమకూ చెల్లించాలంటూ ట్రాన్స్‌ట్రాయ్‌ ఈ ఏడాది జూన్‌ 27న సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో కోరింది.
 
దీనిపై అధ్యయనం చేసేందుకు అప్పట్లోనే.. భార్గవ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుతో త్రిసభ్య కమిటీని నియమిస్తూ రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వు జారీ చేశారు. ఇటీవల స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులకు టెండర్లను పిలవడంతో ట్రాన్స్‌ట్రాయ్‌ డిమాండ్లపై పంచాయతీ కేంద్ర జల వనరుల శాఖ వద్దకు చేరింది.
 
 
దీంతో టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత నెల 27న అప్పటి జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ ఆదేశించారు. కేంద్రం రాసిన ఈ లేఖ రాజకీయంగా వేడి పుట్టించింది. ఈ నేపథ్యంలో లండన్‌ పర్యటనను ముగించుకుని వచ్చిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 5న రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ ఎండీ శ్రీధర్‌, ఇతర ఉప కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
 
ఈ సమావేశంలో.. ట్రాన్స్‌ట్రాయ్‌ లేవనెత్తిన డిమాండ్లను సమీక్షించాలని రాష్ట్ర జల వనరుల శాఖను గడ్కరీ ఆదేశించారు. ఈపీసీ విధానంలో ఒప్పందం చేసుకున్నందున.. ధరల అంచనాలను సవరించడం సాధ్యం కాదని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అయితే ఒప్పందంలో ఏముందో.. వాస్తవానికి ఏం జరుగుతుందో పరిశీలించి త్వరితగతిన నివేదికను ఇవ్వాలంటూ భార్గవను గడ్కరీ ఆదేశించారు. ఈమేరకు భార్గవ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆదివారం ట్రాన్స్‌ట్రాయ్‌తో చేసుకున్న ఒప్పందం.. ఇప్పుడు ఆ సంస్థ చేస్తున్న డిమాండ్లపై సమీక్షించింది.
 
 
ట్రాన్స్‌ట్రాయ్‌ డిమాండ్లు ఇవీ..
  • పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉప కాంట్రాక్టు సంస్థలకు చెల్లిస్తున్న మొత్తాలనే తమకూ చెల్లించాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థ డిమాండ్‌ చేస్తోంది. వాస్తవానికి ఉప కాంట్రాక్టు సంస్థకు చెల్లించే మొత్తం కంటే ప్రధాన కాంట్రాక్టు సంస్థకు చెల్లించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని పనుల్లో ప్రధాన కాంట్రాక్టు సంస్థ కంటే ఉప కాంట్రాక్టు సంస్థలకు చెల్లిస్తున్న మొత్తం అధికంగా ఉంది. 
  • కాంక్రీట్‌ ధరలు కూడా వాస్తవ చెల్లింపులే ఉండాలని ట్రాన్స్‌ట్రాయ్‌ డిమాండ్‌ చేస్తోంది. కాంక్రీట్‌ను చిల్లింగ్‌ చేసేందుకు ఐస్‌ను వినియోగించాలని ఒప్పందంలో ఉందని, చిల్లింగ్‌ యూనిట్‌ వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
  • పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు చేపడుతున్నందున ఈ వేగాన్ని అందుకునేందుకు అదనపు యంత్రాలు, మానవ వనరులను వినియోగించాల్సి వస్తున్నందున వాటి వ్యయాలనూ భరించాలని కోరుతోంది.
  • కాల్వల మట్టి పను ల కోసం ఇస్తున్న ధరలు కాకుండా డ్యామ్‌ ఆధారిత పనుల మేరకు చెల్లింపులు జరగాల ని ట్రాన్స్‌ట్రాయ్‌ కో రింది. కాల్వ తవ్వకాల కోసం ఇస్తున్నట్లుగానే డ్యామ్‌ కో సం తవ్వుతున్న మ ట్టి, ఇతర తవ్వకాలకూ చెల్లింపులు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తోంది.
Link to comment
Share on other sites

పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తా: చంద్రబాబు
11-12-2017 13:50:49
 
636485970539509510.jpg
పోలవరం: తప్పుడు ఆరోపణలతో పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడొద్దని, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు భావితరాలకు భద్రత అని గుర్తు చేశారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఎలా వస్తాయని.. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్‌ కుడికాలువకు నీరు విడుదల చేస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు ఉదారంగా కాదు బాధ్యతగా పునరావాసం కల్పిస్తామని, ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. పోలవరంలో కాంక్రీట్‌ వర్క్స్‌ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్‌ పనులు పూర్తిచేసి కాఫర్‌ డ్యాం నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు.
 
పోలవరం ప్రాజెక్ట్‌పై రూ.12,506 కోట్లు ఖర్చుచేశామని, కేంద్రం నుంచి రూ.4,390 కోట్లు..ఇంకా రూ.3200 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. పవర్‌ ప్రాజెక్ట్‌కు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని, 2013 చట్టంతో భూసేకరణ వ్యయం పది రెట్లు పెరిగిందని చెప్పారు. యూపీఏ తెచ్చిన చట్టం వల్లే పరిహారం ఖర్చు బాగా పెరిగిందని, ఆ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాలా వద్దా.. విపక్షాలు చెప్పాలన్నారు. 98 వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వస్తుందని బాబు పేర్కొన్నారు. పోలవరం వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని, శ్వేతపత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులపై ప్రతి సోమవారం సమీక్ష చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
Link to comment
Share on other sites

పోలవరాన్ని అడ్డుకుంటే చూస్తూ వూరుకోం 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 
11brk94a.jpg

పోలవరం: ఆంధ్రపదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ఈరోజు ప్రాజెక్టును సందర్శించారు. విహంగ వీక్షణం ద్వారా కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ పనులను పరిశీలించారు. పనుల తీరును ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు ముంపు మండలాలు రాకపోతే పోలవరం మన వూహకు కూడా అందేది కాదు. కాంక్రీటు పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తయితే గ్రావిటీ ద్వారా నీరందిస్తాం. పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోంది.ప్రతి సోమవారం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తున్నాం. రోజువారీ లెక్కలు చెబుతుంటే మళ్లీ శ్వేతపత్రం ఏమిటి?. ప్రాజెక్టును అడ్డుకోవద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి రాజీ పడబోం. అడ్డుకుంటే చూస్తూ వూరుకోం’ అని హెచ్చరించారు.

11brk94ab.jpg
Link to comment
Share on other sites

పోలవరానికి కేంద్రం నిధులు విడుదల
1112brk140-polavaram.jpg

విజయవాడ: నవ్యాంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో భాగంగా రూ.318.22 కోట్లు విడుదల చేసింది. పీఎంకేఎస్‌వై కింద ఈ ప్రాజెక్టుకు నాబార్డు నిధులు అందజేస్తోంది.

ఇటీవల ఈ ప్రాజెక్టు నిర్మాణం అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం సహకరించకపోతే నిర్మాణ పనుల బాధ్యతల్ని వారికే వదిలేస్తానంటూ సీఎం స్వరం పెంచడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి 15 రోజులకొకసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులు సమీక్షిస్తానని గతంలో గడ్కరీ హామీ ఇచ్చారు. మరో వైపు ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఈ నెల 22న ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్షించనున్నట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Link to comment
Share on other sites

36 minutes ago, sonykongara said:
పోలవరానికి కేంద్రం నిధులు విడుదల
1112brk140-polavaram.jpg

విజయవాడ: నవ్యాంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో భాగంగా రూ.318.22 కోట్లు విడుదల చేసింది. పీఎంకేఎస్‌వై కింద ఈ ప్రాజెక్టుకు నాబార్డు నిధులు అందజేస్తోంది.

ఇటీవల ఈ ప్రాజెక్టు నిర్మాణం అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం సహకరించకపోతే నిర్మాణ పనుల బాధ్యతల్ని వారికే వదిలేస్తానంటూ సీఎం స్వరం పెంచడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి 15 రోజులకొకసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులు సమీక్షిస్తానని గతంలో గడ్కరీ హామీ ఇచ్చారు. మరో వైపు ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఈ నెల 22న ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్షించనున్నట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Manam aligina Prathi saari - tissue paper ivvadam laa vundi(100c 200c 300c) - mana media vaallu adedo pedda motham lo oka 5K Crores icchinatlu headings 

Link to comment
Share on other sites

పోలవరం పరిధిలో మానవ హక్కుల ఉల్లంఘన 
11-12-2017 21:41:19
 
636486252842339201.jpg
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పరిధిలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోందని రాజమండ్రికి చెందిన జంబుల చౌదరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా పురుషోత్తపట్నం నిర్మాణంలో మానవ హక్కులు పూర్తిస్థాయిలో ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
 
 
ఒకవైపు పోలవరం పనులు ముమ్మరంగా జరుగుతుండగా పురుషోత్తపట్నం కట్టడం అవసరం లేదని పిటిషనర్ వివరించారు. అయితే ఇందుకు స్పందించిన సుప్రీం ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల సంఘంలోనే తేల్చుకోవాలని పిటిషన్ విచారణకు జస్టిస్ సిక్రీ ధర్మాసనం తిరస్కరించింది.
Link to comment
Share on other sites

రూపాయి అవినీతి లేకుండా పోలవరం నిర్మిస్తాం
12-12-2017 01:53:41
 
636486404254561116.jpg
  • ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సెంటిమెంటు
  • అడ్డుపడితే ఎవ్వరినైనా సహించను
  • నిర్వాసితుల ప్రయోజనాలకు విపక్షం గండి
  • గిరిజనులకు రూ.32 వేల కోట్లు చెల్లించొద్దా?
  • విపక్షాలకు సీఎం చంద్రబాబు సవాల్‌
  • పోలవరం సందర్శన.. పనులపై సమీక్ష
అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడితే ఎవ్వరినైనా సహించేది లేదని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని, పోలవరంను పూర్తి చేయడమే తన జీవిత ధ్యేయమని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి 22వ సారి వచ్చానని, సచివాలయం నుంచి 42 సార్లు వర్చువల్‌ సమీక్ష నిర్వహించానని వివరించారు. 2018 మే నాటికి డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేస్తామని, 2018లో కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించి, గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు.
 
 
పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు పోలవరం ప్రాజెక్టుపై సన్నాయి నొక్కులు నొక్కుతూ పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం రాష్ట్ర ప్రజలకు సెంటిమెంటుగా మారిందని, దానిని అడ్డుకునే వారిని ప్రజలు ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. అలాంటి వారి పట్ల తాను కూడా కఠినంగా వ్యవహరిస్తానని సీఎం హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును ఇటీవల సందర్శించిన వైసీపీ.. పనులు జరగడం లేదని, అంతా మట్టి దిబ్బలే దర్శనమిస్తున్నాయంటూ చేసిన విమర్శలపై సీఎం స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు.
 
 
పునరావాసం చెల్లించాలా..వద్దా!
‘పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాలను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా.. 2013 సహాయ, పునరావాస చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుగా మారుతున్న గిరిజనులకు పునరావాసం కల్పించాలా.. వద్దా.. ఈ ప్రశ్నకు విపక్షాలు స్పష్టమైన సమాధానం చెప్పాలి.’ అని సీఎం నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2013 నాటికి రూ.16,046 కోట్ల అయితే, అందులో రూ.2900 కోట్లు సహాయ పునరావాస కార్యక్రమాలకు, రూ.4వేల కోట్లను జల విద్యుత్కేంద్రం కోసం కేటాయించారని చంద్రబాబు వివరించారు. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక భూసేకరణ వ్యయం 10 రెట్లు పెరిగి రూ.32 వేల కోట్లకు చేరుకుందని తెలిపారు.
 
 
పోలవరం నిర్వాసిత కుటుంబాలు 98,818 ఉన్నాయని, ఒక్కో కుటుంబానికి రూ.18 లక్షల దాకా చెల్లింపులు జరిపామన్నారు. 2013 భూసేకరణ చట్టం కచ్చితంగా అమలు చేసి, ఆ చట్టం మేరకు వారికి సహాయ పునరావాసాన్ని అందజేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 2013 భూసేకరణ చట్టాన్ని తాము తీసుకు రాలేదని, ఆ చట్టాన్ని తీసుకువచ్చిన వారే ఇప్పుడు అంత ధర ఎందుకు పెరిగిందంటూ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
మిగులునూ..కరువునూ అనుసంధానిస్తాం
నదుల అనుసంధానం ద్వారా మిగులునూ.. కరువునూ అనుసంధానం చేస్తామని సీఎం ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయడం ద్వారా గోదావరి జలాలను శ్రీకాకుళం దాకా తీసుకువెళ్తామన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరందిస్తామని, శ్రీశైలంలోనే జలాలను నిల్వఉంచి కృష్ణాజలాలను రాయలసీమకు తరలిస్తామని అన్నారు. గండికోటకు 12 టీఎంసీలను వదులుతామని చెప్పారు.
Link to comment
Share on other sites

నాది ఉడుంపట్టు
పోలవరం పూర్తి చేసే సలహాలే వింటా
  అడ్డుకోవాలనుకుంటే లెక్కే చేయను
  గడ్కరీ సహకరిస్తామన్నారు..
   రమ్మంటే దిల్లీ వెళ్తా..
  గుత్తేదారుల కన్సార్టియం ఏర్పడుతోంది..
  ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే- పోలవరం
11ap-main1a.jpg

‘పోలవరంపై ఉడుంపట్టు నాది. వదిలిపెట్టను. ప్రాజెక్టును పూర్తి చేసి తీరతా..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ‘రూపాయి అవినీతి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఎవరైనా దీని నిర్మాణం పూర్తి చేసేలా సలహాలు ఇస్తే వింటా. అడ్డుకుందామని చూస్తే లెక్కే చేయను’ అని కుండబద్దలు కొట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో సోమవారం ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించాక స్పిల్‌వే వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘ప్రాజెక్టును 2019లోపు పూర్తి చేసేలా 2018కి వాలు(గ్రావిటీ) ద్వారా నీళ్లిచ్చేలా కేంద్ర మంత్రి గడ్కరీ సహకరిస్తానన్నారు. అవసరమైతే ఆయన రమ్మంటే మళ్లీ దిల్లీ వెళ్తా’ అని  ప్రకటించారు. ఎగువ కాఫర్‌డ్యాంపై శుక్రవారానికల్లా నివేదిక ఇస్తామని ఎన్‌హెచ్‌పీసీ కమిటీ పేర్కొందని చెప్పారు. పోలవరం టెండర్లు యథాతథంగా కొనసాగుతున్నాయని, ఇందుకు సమాంతరంగా ప్రధాన గుత్తేదారు కన్సార్టియం ఏర్పాటుచేసుకుని పనులను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఆ కన్సార్టియంతో పనులు చేయించే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్థిక సమస్యలపై త్రిసభ్య సంఘం చర్చిస్తోందన్నారు. గుత్తేదారుతో కుదిరిన ఒప్పందం మేరకు రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదు కదా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించగా.. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉపయోగపడని ఒప్పందం ఎందుకని ముఖ్యమంత్రి ఎదురు ప్రశ్నించారు. వైకాపా నాయకులు చెబుతున్నట్లు ఇక్కడ మట్టిదిబ్బలే ఉన్నాయా చెప్పండి? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ శ్వేతపత్రం అడిగారు.. 2018లోపు ప్రాజెక్టు పూర్తి కాదన్నారు.. మీరేమంటారని విలేకరులు ప్రశ్నించగా.. ‘అనుభవం ఉన్న నేనే తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది జగన్‌ను తీసుకొచ్చి చూపిస్తే ఏదేమిటో తెలుస్తుందా? ఒక్కసారి వచ్చి చూసి ఏదేదో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఏమనాలి? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు అడ్డుపడేవాళ్లు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పునరుద్ఘాటించారు.

2013 చట్టం అమలుచేయద్దంటారా?
శాసనసభలో అన్ని వివరాలు చెప్పాం. రోజురోజుకు ఖర్చు మారుతుంటే శ్వేతపత్రం ఎలా తెమ్మంటారు? ఎప్పటికప్పుడు అన్నీ పారదర్శకంగా వెల్లడిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అంచనాలు పెరుగుతున్నాయని గోల చేస్తున్నారని, ఇందులో భూసేకరణ పునరావాస వ్యయమే 11 రెట్లు పెరిగిందని వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి రూ.16.25 లక్షల లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. కేంద్రం రూపొందించిన 2013 చట్ట ప్రకారమే ఈ లెక్కలు కట్టామన్నారు. ‘నేను సవాలు చేస్తున్నా.. కేంద్ర చట్టాన్నే అమలు చేయవద్దంటారా?’ అని ప్రశ్నించారు. గోదావరి, వంశధార, గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానంపై కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే గోదావరి కృష్ణా అనుసంధానం పూర్తయిందని వివరించారు. పైపులైన్ల ద్వారా నాలుగు నదుల నీటిని అనుసంధానించేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నారని చెప్పారు. గడ్కరీ తమిళనాడులోని కావేరికి కూడా గోదావరి నుంచి అనుసంధానిద్దామంటున్నారని, తెలుగువారి అవసరాలు తీరాక ఇతర రాష్ట్రాలకు నీళ్లిచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పారు.

11ap-main1b.jpg

సంక్రాంతికి గేట్లు ఏర్పాటుచేయాలి
సంక్రాంతి నాటికి ఒక్క గేటు అయినా స్పిల్‌వేకు ఏర్పాటుచేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌, సలహాదారు కన్నయ్యనాయుడు, అధికారులు మరో ముగ్గురితో కమిటీ ఏర్పాటుచేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టును పరిశీలించాక అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానడ్యాం నుంచి కాలువలకు అనుసంధానంగా చేపడుతున్న పనుల్లో 65వ ప్యాకేజీకి టెండర్లు పిలవాలని ఆదేశించారు. డయాఫ్రంవాల్‌, జెట్‌ గ్రౌటింగు పనులు సాగుతున్నా కాంక్రీటు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మట్టి తవ్వకం సోమవారమే ప్రారంభమైందని అధికారులు చెప్పారు. పోలవరం పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు సహా అన్ని అంశాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 41.5 మీటర్ల ఎత్తుకు కాఫర్‌డ్యాం నిర్మించి నీటిని నిలబెడితే ఎంత భూమి ముంపులో చిక్కుకుంటుందో ఆ మేర భూమి సేకరిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మొత్తం 45.72 మీటర్ల ఎత్తుకు భూసేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

త్రిసభ్యసంఘంతో భేటీ
పోలవరంలో గుత్తేదారు కోరుతున్న రాయితీల వ్యవహారంతో పాటు ఆర్థిక సమస్యలను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై ఏర్పాటైన త్రిసభ్య సంఘం మార్గదర్శకాలు రూపొందించాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి గడ్కరీ ఒక ప్రయత్నం చేయమన్నందున ఈ అంశంపై తార్కిక ముగింపునకు రావాలని సూచించారు. త్రిసభ్య సంఘంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. మంత్రి దేవినేని ఉమా, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తాకు శశిభూషణ్‌కుమార్‌ భూసేకరణ, పునరావాసంపై వివరించారు.

Link to comment
Share on other sites

యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు
కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ
11ap-main3a.jpg

ఈనాడు, దిల్లీ: నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలనే సంకల్పంతో తాము పనిచేస్తున్నట్లు కేంద్ర జలవనరులమంత్రి నితిన్‌గడ్కరీ చెప్పారు. అందుకోసం అన్ని పనులనూ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి తగిన ఏర్పాట్లుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. తాను ఈ నెల 22న పోలవరం క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్తున్నట్లు చెప్పారు. అక్కడ జరుగుతున్న పనులను సమీక్షిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తామని, అనుకున్న సమయంలోపు పనులు పూర్తిచేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని బిల్లులు చెల్లిస్తూ పోతున్నామని, ఇకమీదట వచ్చిన బిల్లులను వచ్చినట్లుగా చెల్లిస్తామని పేర్కొన్నారు

Link to comment
Share on other sites

పోలవరం నిర్మాణంలో ఇదో కొత్తకోణం 
ఒడిశా లేఖపై చంద్రబాబు స్పందన 
12brk82a.jpg

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రస్తావన వచ్చింది. ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాసిన లేఖను సీఎం పేషీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎంలు మాట్లాడుకోవాలని ఒడిశా కోరుతోందని లేఖ సారాంశాన్ని వివరించారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పోలవరం నిర్మాణంలో ఇదో కొత్త పరిణామమన్నారు. జాతీయ ప్రాజెక్టు కావడంతో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధానిదేనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే తాను ఒడిశా సీఎంతో మాట్లాడానని, రాజకీయ ఒత్తిడి వల్లే పోలవరం విషయంలో ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు పరిస్థితి వివరించాక ఆయన మౌనంగానే ఉన్నారన్నారు.

Link to comment
Share on other sites

ఇక ఆన్‌లైన్‌లో పోలవరం లెక్కలు...
12-12-2017 14:14:59
 
636486849037350410.jpg
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు చెందిన లెక్కలన్నీ ఇక ఆన్ లైన్ పొందుపరచనున్నారు. మంగళవారం ఆయా శాఖాధిపతుల సమావేశం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... పోలవరం ప్రాజెక్టుకు చెందిన లెక్కలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చుపెట్టిన సొమ్ముతోపాటు పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు అందిన సాయం, పోలవరం పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

ప్రధానిదే బాధ్యత
13-12-2017 02:36:36
636487294013756534.jpg
  • పోలవరంపై ముఖ్యమంత్రి స్పష్టీకరణ
  • అభ్యంతరాలను కేంద్రమే పరిష్కరించాలి
  • ‘సీఎంల సమావేశం’ కొత్త మలుపు
  • ఒడిసా అనవసరంగా అడ్డుపడుతోంది
  • ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో గతంలో మాట్లాడాను
  • పోలవరం వివరాలన్నీ ఆన్‌లైన్‌లో: సీఎం
  • నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ఫోన్‌ చేయగానే నితిన్‌ గడ్కరీ ఆహ్వానం
  • ఏం చేసినా ఓకే.. ప్రాజెక్టు పూర్తయితే చాలు
  • భార్గవ కమిటీకి స్పష్టం చేసిన సీఎం
అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినా, అడ్డంకులు తలెత్తినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధాన మంత్రిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై అభ్యంతరాలున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకోవాలని ఒడిసా ప్రతిపాదించడం... ఇందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించడంపై సీఎం ఇలా స్పందించారు. మంగళవారం శాఖాధిపతుల సమావేశంలో ఉండగానే సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలు సీఎం దృష్టికి వచ్చాయి.
 
 
‘‘పోలవరం ప్రాజెక్టుపై సీఎంలు సమావేశం కావాలనడం కొత్త మలుపు. అయినా ఫర్వాలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదే. ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నాకు మిత్రుడే. కానీ, స్థానికంగా వారికుండే సమస్యలు వారికి ఉంటాయి. మరోవైపు ఛత్తీస్ గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ కూడా మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను వెళ్లి మాట్లాడాక అడ్డుపడటంలేదు. ఒడిస్సా మాత్రం అనవసరంగా అడ్డుపడుతోంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
నిజానికి... పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించడంతోపాటు అన్నిరకాల అనుమతులు ఇప్పించడం, సాంకేతిక సమస్యలను పరిష్కరించడంవంటివన్నీ కేంద్రమే చూసుకోవాలని రాష్ట్ర విభజన చట్టం చట్టం చెబుతోంది. ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రధాని అధ్యక్షతనే నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే... మొత్తం బాధ్యత ప్రధానిదే అని సీఎం చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. అలాగే పోలవరం వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూసమీకరణ, పునరావాసం, చెల్లింపులు, ఖర్చులు వివరాలన్నీ అప్‌లోడ్‌ చేయాలన్నారు. అందరూ ఈ వివరాలు అడుగుతున్నారని, ఓపెన్‌గా ఉంచితే సరిపోతుందని అన్నారు.
 
 
నేడు ఢిల్లీకి సీఎం...
మరోవైపు పోలవరం కేంద్రంగా మంగళవారం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టెండర్‌ వివాదాలు, ఆరోపణలు, అడ్డంకుల నేపథ్యంలో... మంగళవారం కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు వేగాన్ని పెంచడంపై చర్చించాల్సి ఉందని, సమయం ఇవ్వాలని కోరారు. ‘‘మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పటికిప్పుడు వచ్చినా అభ్యంతరం లేదు’’ అని గడ్కరీ బదులిచ్చారు. దీంతో... బుధవారం రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలో గడ్కరీతో భేటీకి ముహూర్తం కుదిరింది. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులకు పిలిచిన టెండర్లు, టెండర్‌ నిబంధనలు, అవగాహన ఒప్పందంలో ఉన్న అంశాలు ఇతర విషయాలపై గడ్కరీతో సమగ్రంగా చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ‘‘కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీటిని అందించాలి. 2019లో ప్రాజెక్టు పూర్తి కావాలి’’ అని గడ్కరీకి చంద్రబాబు స్పష్టం చేయనున్నారు.
 
 
దేనికైనా రెడీ...
పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా త్రిసభ్య కమిటీ ఎలాంటి ఆప్షన్‌ ఇచ్చినా తనకు సమ్మతమేనని భార్గవ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రిని కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
 
తాము ఈపీసీ కింద కాంట్రాక్టు సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నామని.. గురువారం నాడు మరోదఫా సమావేశమై, ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తామని ముఖ్యమంత్రికి భార్గవ వివరించారు. ఈ సమయంలో కమిటీ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రాధాన్యాలను స్పష్టంగా వివరించారు. ‘‘త్రిసభ్య కమిటీ ఏ ఆప్షన్‌ అయినా స్వేచ్ఛగా ఇవ్వవచ్చు. మాకు పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావడమే ముఖ్యం’’ అని తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...