Jump to content

polavaram


Recommended Posts

రేపట్నుంచే కాఫర్‌ పనులు
19-11-2017 01:35:11

    లోయర్‌ స్ర్టీమ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్న సీఎం
    పోలవరంలోనే బాబు సమీక్ష

అమరావతి, పోలవరం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో లోయర్‌ స్ర్టీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. ఈ పనులు చేపట్టుకోవచ్చంటూ కేంద్ర జలసంఘం నియమించిన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ(డీడీఆర్‌సీ) చైర్మన్‌ పాండ్యా అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది. వాస్తవానికి ఈ నెల ఆరోతేదీనే అప్పర్‌ స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన యంత్ర సామగ్రి, సాంకేతిక సిబ్బందిని కెల్లర్‌ సంస్థ సిద్ధం చేసుకున్న తరుణంలో... అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ డిజైన్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) చైర్మన్‌కు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని ఏపీకి కూడా పంపారు. ఎన్‌హెచ్‌పీసీ కమిటీ నివేదిక ఇచ్చే దాకా పనులు ప్రారంభించవద్దంటూ ఏపీకి అమర్జిత్‌ సింగ్‌ సూచించారు. దీంతో.. అప్పర్‌ స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులను ఏపీ ప్రారంభించలేదు.
 
ఇదే సమయంలో ఈ నెల 8న పాండ్యా కమిటీ సమావేశమై లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులు తక్షణమే ప్రారంభించుకోవచ్చంటూ సూచించింది. అయితే, పాండ్యా కమిటీ విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లాక... ఎన్‌హెచ్‌పీసీ సభ్యులు పర్యటించేదాకా లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టవద్దని, రెండు రోజులు ఆగుదామని నిర్దేశించింది. దీంతో... అప్పర్‌, లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభానికి ముందే నిలిచిపోయాయి. ఇదే సమయంలో... తమకు జల వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయలేదని, ఇంధన మంత్రిత్వ శాఖ ఆదేశిస్తేనే పోలవరం ప్రాంతాన్ని సందర్శించి కాఫర్‌ డ్యామ్‌పై నివేదిక ఇస్తామని ఎన్‌హెచ్‌పీసీ స్పష్టం చేస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో.. అప్పర్‌ స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఇప్పట్లో అనుమతులు వచ్చే అవకాశం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు ఆందోళన చెందాయి. గడచిన రెండు రోజులుగా పాండ్యాతో మాట్లాడేందుకు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
 
ఈ అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ శనివారం నాడు ‘‘కాఫర్‌ డ్యామ్‌తో కేంద్రం ఫుట్‌బాల్‌’’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం విదితమే. ఈ కథనం గురించి పాండ్యాకు జలవనరుల శాఖ ఉన్నతాధికారవర్గాలు వివరించాయి. అకారణంగా కేంద్రంగా అడ్డంకులు సృష్టిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందని, దానినే మీడియా కథనాలుగా ప్రచురిస్తోందని తెలిపాయి. ఇప్పట్లో అప్పర్‌ స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అమర్జిత్‌ సింగ్‌ నుంచి ఆమోదం లభించే అవకాశాలు, ఎన్‌హెచ్‌పీసీ పోలవరంలో పర్యటించేందుకు ఆస్కారం కనిపించకపోవడంతో... లోయర్‌ స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి పాండ్యా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో.. సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే సమీక్షకు సిద్ధమైన సీఎంతో లోయర్‌ స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు.
 
అప్పర్‌ స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ కోసం కూడా కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ సిద్ధమవుతోంది. కాగా.. ఈ నెలాఖరుతో కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ రిటైర్‌ అవుతున్నారు. కాఫర్‌ డ్యామ్‌పై ఆయన ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు సృష్టిస్తున్నారనే అభిప్రాయం జల వనరులశాఖలో వ్యక్తమవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలను అధికారులు తగ్గించారు. గోదావరిలో ఎగువ నుంచి వస్తున్న జలాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
రూ.1395 కోట్ల పనులకు టెండర్లు
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులకు, మట్టి తవ్వకం పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ షార్ట్‌టర్మ్‌ టెండర్లను పిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద 0 నుంచి 35వ బ్లాకు దాకా మిగిలిన కాంక్రీట్‌ పనులు, అనుబంధ పనులైన స్పిల్‌ వే మీద వంతెన, 356 మీటరు నుంచి 1540 మీటరు దాకా స్పిల్‌ చానల్‌ చైనేజ్‌, మట్టి పనులకు ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు టెండర్లను పిలిచారు. ఈ పనుల అంచనా 1395.30 కోట్లుగా పేర్కొన్నారు. టెండర్లను డిసెంబరు 4లోగా దాఖలు చేయాలి.

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరానికి మరో రూ.318 కోట్లు
దస్త్రానికి ఆర్థికశాఖ పచ్చజెండా
ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.318 కోట్లు చెల్లించడానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల్లో ఈ మేరకు ఆర్థికశాఖ క్లియర్‌ చేసినట్లు సమాచారం. గత నెలలో అందజేసిన రూ.979 కోట్లకు అదనంగా ఈ మొత్తాన్ని విడుదల చేయడానికి పచ్చజెండా ఊపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యకలాపాలకు సంబంధించి రూ.1500 కోట్ల బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపినట్లు తెలిసింది. వాటిని అథారిటీ పరిశీలించి ఆర్థికశాఖకు పంపాల్సి ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టుకు సీఈఓ లేని కారణంగా ఆ బాధ్యతలను కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ చూస్తూ వస్తున్నారు. ఆయన ఈనెలాఖరుకు పదవీవిరమణ చేయబోతున్న నేపథ్యంలో ఈ బిల్లులను పరిశీలించి, నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందోనని ఏపీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Link to comment
Share on other sites

దిగువ కాఫర్‌డ్యామ్‌ పనులకు శ్రీకారం
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దిగువ కాఫర్‌డ్యామ్‌ పనులను బుధవారం సాయంత్రం ప్రారంభించారు. రామయ్యపేట వద్ద గోదావరిపై 1300 మీటర్ల పొడవున దీని నిర్మాణానికి కేంద్ర జల సంఘం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. పది మీటర్ల లోతున జెట్‌గ్రౌటింగ్‌ పద్ధతిలో భూమిని గట్టి పర్చే పనులు చేపట్టారు. వీటిని పశ్చిమజర్మనీకి చెందిన కెల్లర్‌ సంస్థకు అప్పగించారు. కాఫర్‌డ్యామ్‌ అడుగు నుంచి నీరు లీక్‌ కాకుండా జెట్‌గ్రౌటింగ్‌ యంత్రం ద్వారా నీరు, సిమెంటు కలిపి భూమి లోపలకు పంపుతామని ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్‌ రమేష్‌బాబు చెప్పారు.

Link to comment
Share on other sites

పోలవరం భారం ఇలా తగ్గించవచ్చు
కేంద్ర కమిటీ సూచనలు
ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల తరలింపు, పునరావాస కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయో పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర కమిటీ పునరావాసం వ్యయంలో కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకునే వివిధ ప్రత్యామ్నాయాలను సూచించింది. ఒక్క భూసేకరణ, పునరావాసం కోసమే రూ.33,858 కోట్లు ఖర్చు అవుతుందని తాజా అంచనాలు. గతంలో 2934.42 కోట్లు మాత్రమే చూపగా 2013 భూసేకరణ చట్టం తర్వాత ఇది అనూహ్యంగా పెరిగిన విషయం విదితమే. మొత్తం 371 ఆవాస ప్రాంతాలను తరలించాల్సి వస్తోంది. ఇంకా 98 వేల కుటుంబాలకు కాలనీలు ఏర్పాటు చేయాలి. ఇందుకోసమే పెద్ద మొత్తంలోనూ ఖర్చు అంచనాలు రూపొందించారు. ఈ నేపథ్యంలో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి లీనా నాయర్‌, మరో ఐఏఎస్‌ అధికారి లతా కృష్ణారావు, కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరు పచోరి, అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీవాత్సవ, ప్రాజెక్టుల డిప్యూటీ డైరక్టర్‌ సంయ్‌సింగ్‌, తదితరులు రెండు రోజులు పర్యటించి అన్ని విషయాలను పరిశీలించారు. అధికారులతోను సమీక్షించారు. ఈ కాలనీల నిర్మాణంలో ఇళ్లు, రహదారులు, కాలువల నిర్మాణం,  తర కట్టడాలకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పథకాల నిధుల నుంచి చేపట్టే విషయం ఆలోచించాలని కమిటీ సభ్యులు సూచించారు. కేంద్ర పథకాల నుంచి కూడా నిధులను కాలనీలకు అనుసంధానం చేయాలన్నారు. ఇలా సమీకరిస్తే ఖర్చును కొంత మేర తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పారు. రక్షిత నీటి పథకాలకు సంబంధించి పంచాయతీరాజ్‌ నిధులను వినియోగించవచ్చన్నారు. పనుల వేగం తగ్గకుండా చూసుకోవాలని, తాము కూడా కేంద్రానికి త్వరగా నిధులు అందించేలా సూచనలు చేస్తామని, సంబంధిత శాఖలతోను తాము మాట్లాడతామని వారు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

16 minutes ago, sonykongara said:

పోలవరం భారం ఇలా తగ్గించవచ్చు
కేంద్ర కమిటీ సూచనలు
ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల తరలింపు, పునరావాస కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయో పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర కమిటీ పునరావాసం వ్యయంలో కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకునే వివిధ ప్రత్యామ్నాయాలను సూచించింది. ఒక్క భూసేకరణ, పునరావాసం కోసమే రూ.33,858 కోట్లు ఖర్చు అవుతుందని తాజా అంచనాలు. గతంలో 2934.42 కోట్లు మాత్రమే చూపగా 2013 భూసేకరణ చట్టం తర్వాత ఇది అనూహ్యంగా పెరిగిన విషయం విదితమే. మొత్తం 371 ఆవాస ప్రాంతాలను తరలించాల్సి వస్తోంది. ఇంకా 98 వేల కుటుంబాలకు కాలనీలు ఏర్పాటు చేయాలి. ఇందుకోసమే పెద్ద మొత్తంలోనూ ఖర్చు అంచనాలు రూపొందించారు. ఈ నేపథ్యంలో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి లీనా నాయర్‌, మరో ఐఏఎస్‌ అధికారి లతా కృష్ణారావు, కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరు పచోరి, అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీవాత్సవ, ప్రాజెక్టుల డిప్యూటీ డైరక్టర్‌ సంయ్‌సింగ్‌, తదితరులు రెండు రోజులు పర్యటించి అన్ని విషయాలను పరిశీలించారు. అధికారులతోను సమీక్షించారు. ఈ కాలనీల నిర్మాణంలో ఇళ్లు, రహదారులు, కాలువల నిర్మాణం,  తర కట్టడాలకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పథకాల నిధుల నుంచి చేపట్టే విషయం ఆలోచించాలని కమిటీ సభ్యులు సూచించారు. కేంద్ర పథకాల నుంచి కూడా నిధులను కాలనీలకు అనుసంధానం చేయాలన్నారు. ఇలా సమీకరిస్తే ఖర్చును కొంత మేర తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పారు. రక్షిత నీటి పథకాలకు సంబంధించి పంచాయతీరాజ్‌ నిధులను వినియోగించవచ్చన్నారు. పనుల వేగం తగ్గకుండా చూసుకోవాలని, తాము కూడా కేంద్రానికి త్వరగా నిధులు అందించేలా సూచనలు చేస్తామని, సంబంధిత శాఖలతోను తాము మాట్లాడతామని వారు పేర్కొన్నారు.

ivi emi ideas? kharchu antha state budget lo veyyadam kuda idea na?

Link to comment
Share on other sites

పోలవరం ఓ యజ్ఞం
చేయూతనిస్తే రెండేళ్లలోనే  పూర్తి చేస్తాం
ఇప్పటికి రూ.12,567 కోట్ల  పనులు పూర్తి
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టు ఒక యజ్ఞం లాంటిదని, దాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం దీనిపై ప్రత్యేక చర్చ జరిగింది. స్పీకర్‌ అనుమతితో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను శాసనసభలో ప్రత్యక్ష ప్రసారం చేయించి దాని ప్రగతిని సీఎం వివరించారు. ‘‘ఇప్పటికే రూ.12,567 కోట్లతో 51.44 శాతం పనులు పూర్తయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి   ముందే మనం రూ.5,135 కోట్లు ఖర్చు చేశాం. దాన్ని మన వాటాగా కేంద్రం పరిగణించింది. మిగిలిన రూ.7,431 కోట్లల్లో ఇప్పటివరకు రూ.4,329 కోట్లు ఇచ్చారు. మరో రూ.3,102 కోట్లు రావాల్సి ఉంది. స్పిల్‌వే కాంక్రీటు పనులు మాత్రం 11.43 శాతమే జరిగాయి. మరో గుత్తేదారును పిలుస్తున్నాం. డిసెంబరు 15లోపు అతడిని ఎంపిక చేసి ఆరేడు నెలల్లోగా ఈ పనులు పూర్తి చేస్తాం...’’ అని సీఎం వివరించారు.

మనం చేస్తామనలేదు
‘‘ ఈ ప్రాజెక్టు పనులు రాష్ట్రమే నిర్వహిస్తుందని మేం ఏరోజూ కోరలేదు. నీతిఆయోగ్‌ సూచనలు, సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వమే చేపడితే వేగంగా సాగుతాయని కేంద్రం భావించి అప్పగించింది. కేంద్రం సహకారంతో రెండేళ్లలోపే పూర్తి చేయగలం. పనుల్లో నాణ్యత లేదని, కేంద్రం వివరణ కోరిందనే వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడటం లేదు. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. గత ఆగస్టు 18న రూ.58,319.06 కోట్లతో రీవైజ్డ్‌ అంచనాలు పంపాం. ఇంతపెద్ద ప్రాజెక్టును దేశంలో సమీప భవిష్యత్తులో నిర్మించే అవకాశాలు లేవు...’’ అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. శాసనసభ్యులు, వారి నియోజకవర్గంలోని ప్రజలు అప్పుడప్పుడూ వెళ్లి ఈ ప్రాజెక్టును చూసి రావాలని ఆయన చెప్పారు.

వరి దిగుబడిలో చైనాను అధిగమించాలి: రైస్‌ కాంక్లేవ్‌ 2017 సదస్సులో ముఖ్యమంత్రి
వరి పంట దిగుబడిలో చైనాను అధిగమించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని ఫార్చూన్‌ మురళి హోటల్‌లో జరుగుతున్న రెండు రోజుల రైస్‌ కాంక్లేవ్‌ 2017 సదస్సును ఆయన బుధవారం ప్రారంభించారు. పంట దిగుబడికి అత్యుత్తమ విధానాలు, ఆవిష్కరణలు, నూతన ఆలోచనలకు రైస్‌ కాంక్లేవ్‌ సదస్సు వేదిక కావాలని సూచించారు. మన వాతావరణానికి అనుగుణంగా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఎక్కువ పంటను దిగుబడి చేసేలా రైతన్నకు శాస్త్ర సాంకేతిక వెన్నుదన్నును అందించాలన్నారు. గతంలో నెలకొన్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, విద్యుత్తు, సాగునీరు వంటి ఇబ్బందులను అధిగమించగలిగామని వివరించారు. డ్రోన్ల సాయంతో పంటలో ఎక్కడ ఏ లోపం ఉందనేది తెలుసుకునే సరికొత్త విధానాన్ని రానున్న రబీ సీజన్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.  ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి మిలిందా గేట్స్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు వ్యవసాయ రంగంలో మనకు సహకరించడానికి ముందుకు వచ్చాయన్నారు. వ్యవసాయంతో పాటూ ఉద్యాన, పాడి, మత్స్య పరిశ్రమలకూ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వాలో 40శాతం వృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ కేశినేని నాని, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌సింగ్‌, విశ్వభారతి విశ్వవిద్యాలయం ఉపకులపతి స్వప్నకుమార్‌ దత్త, ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి వి.దామోదరనాయుడు, వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ముమ్మర చర్చ
ఈనాడు, అమరావతి: పోలవరంపై శాసనసభలో జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. పోలవరంపై కేంద్రం నుంచి రావాల్సిన సాయం, ఇతరత్రా అనుమతులు పర్యవేక్షించడానికి అవసరమైతే ఒక కమిటీని నియమించాలని ధూళిపాల నరేంద్ర అన్నారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇస్తోందని.. కొన్ని పత్రికల్లో, కొన్ని వర్గాలో నిధులివ్వడం లేదంటూ ప్రచారం జరగడం విచారకరమని విష్ణుకుమార్‌ రాజు అన్నారు. పోలవరం వల్ల రాయలసీమకు ఎలాంటి లాభం జరుగుతుందో ఇప్పటికే పట్టిసీమ ద్వారా తెలుస్తోందని.. గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా శ్రీశైలం నుంచి సీమకు నీళ్లు సమృద్ధిగా వినియోగించుకోగలిగామని ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కొంతమంది కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. 

Link to comment
Share on other sites

ఎగువ కాఫర్‌ డ్యాంకూ ఓకే?
24-11-2017 00:56:34

    వారంలో పోలవరానికి ఎన్‌హెచ్‌పీసీ బృందం
    రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం
    నేడు తిరుమల రానున్న అమర్జిత్‌సింగ్‌
    ఖర్చులు, అంచనాలకు వేర్వేరు పద్దులు
    భూసేకరణ, పునరావాసానికీ విడిగానే
    రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సూచన

అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికీ అడ్డంకులు తొలగిపోనున్నాయి. వారం రోజుల్లోనే నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణుల బృందం పోలవరం వస్తున్నట్లు రాష్ట్రానికి సమాచారం అందింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌తో మాట్లాడారు. శుక్రవారం తాను తిరుమలకు కుటుంబసభ్యులతో కలసి వస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఎగువ కాఫర్‌ డ్యాం పనులు, ఎన్‌హెచ్‌పీసీ బృందం ఎప్పుడు రానుందో చర్చకు వచ్చింది. వారం రోజుల్లో ఈ బృందం వస్తుందని.. డిజైన్‌, ఎత్తుకు సంబంధించి నివేదిక ఇస్తుందని అమర్జిత్‌ చెప్పారు.
 
సీఎస్‌ ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి, జల వనరులశాఖకు చేరవేశారు. ఈ నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే.. తక్షణమే ఎగువ కాఫర్‌ డ్యాం పనులు చేపట్టేందుకు జల వనరుల శాఖ సిద్ధంగా ఉంది. తిరుమల వస్తున్న అమర్జిత్‌ శనివారం తిరుపతి సమీపంలోని రెండు సాగు నీటి ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు అంచనాలకు సంబంధించిన లెక్కలు గంపగుత్తగా కాకుండా విడివిడిగా పంపాలని రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. పోలవరం అంచనా వ్యయం 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లుగా ఉంది. తాజా ధరల ప్రకారం అది రూ.58,000 కోట్లకు చేరుకుంది. తాజా అంచనాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) గత కార్యదర్శి ఆర్‌కే గుప్తాకు రాష్ట్ర జల వనరుల శాఖ ఎప్పుడో సమర్పించింది.
 
కేంద్రానికి నిరంతరం పంపే నివేదికల తరహాలో ఈ అంచనాలను పంపింది. ఈ ఫార్మాట్‌లో కాకుండా.. పనుల వారీగా ఎంత వ్యయమవుతుందో తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని గుప్తా సూచించారు. ఆయన సూచనల మేరకు.. వ్యయ అంచనాలను అందజేశారు. వీటిని పరిశీలించిన కేంద్ర జల వనరులశాఖ.. ఇప్పటి దాకా నిర్మాణాలు చేపట్టిన పనులకు ఎంత ఖర్చయింది.. మిగిలిన పనులు చేపట్టేందుకు ఎంత వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారో వివరిస్తూ విడివిడిగా నివేదికలు పంపాలని రాష్ట్రానికి సూచించింది. భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలకు అయ్యే ఖర్చును కూడా విడిగా చూపాలని పేర్కొంది. దీంతో.. కేంద్రం కోరిన విధంగా నివేదికను సమర్పించే పనిలో రాష్ట్ర జల వనరుల శాఖ నిమగ్నమైంది.

Link to comment
Share on other sites

Yeppati nuncho oka question — especially pai nunchi ee permission and financial delays tarvatha 

-1. Right main canal lo, left main canal lo gravity dwara neellu vellali Ante dam entha yetthu vundali?

2. Pai question loni dam height lo enni tmc store cheyyotchu?

thanks in advance  

 

Link to comment
Share on other sites

My understanding.

Full Reservoir Level (FRL): It is the level corresponding to the storage which includes both inactive and active storages and also the flood storage, if provided for. In fact, this is the highest reservoir levelthat can be maintained without spillway discharge or without passing water downstream through sluice ways

Polavaram Full Reservoir Level  194 tmc   150feet Mean sea level

Active Capacity : The total amount of reservoir capacity normally available for release from a reservoir below the maximum storage level. It is total or reservoir capacity minus inactive storage capacity.

Active capacity                175tmc  (this is the water content that can be released from the spillway)

 ‘Active’ or ‘live’ storage is the portion of the reservoir that can be utilised for flood control, power production, navigation and downstream releases.

Active level   until 75TMC    135 feet ----- Right and left canals  full supply level (120 TMC can be sent through gravity to the canals)

When the water comes below the active level, the water will be released through spillway and pattiseema and purushottapatam lifts will be still used.

Please correct me if I am wrong.

 

 

 

6 hours ago, rk09 said:

Yeppati nuncho oka question — especially pai nunchi ee permission and financial delays tarvatha 

-1. Right main canal lo, left main canal lo gravity dwara neellu vellali Ante dam entha yetthu vundali?

2. Pai question loni dam height lo enni tmc store cheyyotchu?

thanks in advance  

 

 

Link to comment
Share on other sites

6 hours ago, rk09 said:

Yeppati nuncho oka question — especially pai nunchi ee permission and financial delays tarvatha 

-1. Right main canal lo, left main canal lo gravity dwara neellu vellali Ante dam entha yetthu vundali?

2. Pai question loni dam height lo enni tmc store cheyyotchu?

thanks in advance  

 

Dam has to be above 41 meters. At that height, around 60 TMC can be stored. but I believe only 30-40 TMC of it is usable.

total capacity 195 TMC

Canals usage: only the top 75 TMC

power generation->Dowleswaram: further 100 TMC

dead storage: 20 TMC

Link to comment
Share on other sites

Copied from - 

 

Some highlights 

ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌,  ఇది నదీ ప్రవాహానికి అడ్డంగా 1750 మీటర్ల పొడవు, 41 మీటర్లు ఎత్తు ఉంటుంది. కింది భాగంలో 300 మీటర్ల వెడల్పులో నిర్మిస్తారు. పైన 30 మీటర్లు ఉంటుంది. అంటే... నదీ ప్రవాహానికి 1.75 కిలోమీటర్ల పొడవున ఒక కొండనే అడ్డు వేస్తారన్న మాట. ఈ అడ్డుకట్టే నీటిని నిలిపి ఉంచుతుంది. ఇది గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఉంటుంది. గోదావరిపై ఇప్పటిదాకా వచ్చిన గరిష్ఠ వరద 30 లక్షల క్యూసెక్కుల లోపే! 

పోలవరంలో పూర్తి నిల్వ స్థాయి (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 40 మీటర్లు మాత్రమే!

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పొడవు 1150 మీటర్లు.

స్పిల్‌వేపై మొత్తం 48 గేట్లు ఉంటాయి. ఒక్కో గేటు పొడవు 20 మీటర్లు. వెడల్పు 15 మీటర్లు. మొత్తం 48 గేట్ల.  స్కిన్‌ప్లేట్‌తో కలిపి ఒక్కో గేటు బరువు 90 టన్నులు

పోలవరం ప్రాజెక్టులో భాగంగా 969 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్ర

 

పోలవరం ప్రత్యేకతలు :
-------------------------------
"గరిష్ట నీటి మట్టము" : 
+ 45.72 మీటర్లు (+ 150.00 అడుగులు)

"కనీస నీటి మట్టము" :
 + 41.15 మీటర్లు (+135.00 అడుగులు)

"క్రెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిల్ వే" : 
+ 25.72 మీటర్లు (+84.39 అడుగులు)

"ఈసీఆర్ఎఫ్ డ్యాం టాప్ బండ్ లెవెల్" : 
+ 54.00 మీటర్లు (+177.16 అడుగులు)

"గ్రాస్ స్టోరేజ్ ఆఫ్ రిజర్వాయర్" : 
194.60 టీఎంసి

"లైవ్ స్టోరేజ్" : 75.20 టీఎంసి

 

Link to comment
Share on other sites

పోల‘వరాని’కి కేంద్రం గండి!
30-11-2017 02:54:43
636476072847520475.jpg
  • స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ టెండర్లు ఆపాలని హుకుం
  • రాష్ట్రానికి కేంద్ర జలవనరుల శాఖ లేఖ
  • కాఫర్‌ డ్యామ్‌ పనుల నుంచే స్పీడ్‌ బ్రేకర్లు
  • ఎన్‌హెచ్‌పీసీ అధ్యయనం వరకు
  • ఆపాలని గత నెల ఆరంభంలో తాఖీదు
  • 2 నెలలవుతున్నా జాడ లేని ఎన్‌హెచ్‌పీసీ
  • నేటికీ ప్రారంభం కాని ఎగువ కాఫర్‌ పనులు
  • తాజాగా స్పిల్‌వే, చానల్‌ పనులకూ కొర్రీ
అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది. పోలవరం పనులను సత్వరం పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి జారీ చేసిన టెండర్లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 27న లేఖ రాసింది. గత నెల 6న ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జాతీయ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) అధ్యయనం చేసేంత వరకు పనులు ఆపాలని కేంద్రం నుంచి తాకీదు వచ్చింది.
 
 
ఇప్పటిదాకా.. ఎన్‌హెచ్‌పీసీ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు రాలేదు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులపై తీవ్ర ఆందోళన చెందుతున్న జల వనరుల శాఖకు.. ఇప్పుడు స్పిల్‌ వే, చానల్‌ టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్న కేంద్రం పదే పదే కొర్రీలేస్తూ పనులు ముందుకు సాగకుండా స్పీడ్‌ బ్రేకర్లు వేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో ఈ ఏడాది అక్టోబరు 13న నాగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అయింది.
 
 
ఈ సందర్భంగా.. పోలవరం కాంక్రీట్‌ పనులు లక్ష్యం మేరకు జరగడం లేదని, 2018కి గ్రావిటీ ద్వారా 2019కి సంపూర్ణంగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి టెండర్లు పిలుస్తామని వివరించారు. దీనిపై గతంలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ 14 శాతం మైన్‌సకు టెండర్లను కోట్‌ చేసినందున.. ఆ మొత్తానికే తాము పరిమితమవుతామని.. కొత్త ధరలను ఆమోదించేది లేదంటూ గడ్కరీ స్పష్టం చేశారు. అయితే కాంక్రీట్‌ పనుల కోసమే టెండర్లను పిలుస్తున్నందున, మైనస్‌ 14 శాతానికి మించి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం బృందం వివరించింది.
 
 
ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌తో న్యాయపరమైన, సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయేమోనని గడ్కరీ సందేహాన్ని వ్యక్తం చేశారు. అలాంటివేవీ ఎదురు కాబోవని.. ట్రాన్స్‌స్ట్రాయ్‌ కూడా ప్రభుత్వానికి సహకరిస్తుందని.. పైగా పనులు జాప్యమవుతున్నందున.. ప్రధాన కాంట్రాక్టు సంస్థకు 60-సీ నోటీసును కూడా అందజేశామని సీఎం బృందం వివరించింది. దీంతో సంతృప్తి చెందిన గడ్కరీ.. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు ఏది అవసరమో.. దానిని అమలు చేయండని సూచించారు.
 
 
అనంతరం గత నెల 25న గడ్కరీ వద్ద జరిగిన రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు జరిపిన సమావేశం మినిట్స్‌నూ రాష్ట్రానికి పంపారు. అందులో.. కొత్త టెండర్లకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్లుగా పేర్కొనడంతో రాష్ట్ర జల వనరులశాఖ.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌కు సంబంధించి మిగిలిన రూ.1395.30 కోట్ల మేర పనులు పూర్తి చేసేందుకు ఈ నెల 1న టెండర్లను పిలిచింది. ఈ టెండర్లపై కాంట్రాక్టు సంస్థల నుంచి, ఇతర సంస్థల నుంచి ఎలాంటి అభ్యంతరాలూ రాలేదు. కానీ ఈ టెండర్లను నిలుపుదల చేయాలంటూ.. ఈ నెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు కేంద్ర జల వనరుల కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌ లేఖ రాశారు.
 
 
ఈ లేఖలో ఏముందంటే ..
‘పోలవరం ప్రాజెక్టులో మిగిలిన కాంక్రీట్‌ పనులు రూ.1395 కోట్లకు టెండర్లను పిలిచారని తెలిసింది. స్పిల్‌వేలోని బ్లాక్‌ నంబరు సున్నా నుంచి 35 దాకా అనుబంధ పనులు స్టిల్లింగ్‌ బేసిన్‌, ఆప్రాన్‌, స్పిల్‌వే మీద బ్రిడ్జికి ఒక టెండరు, స్పిల్‌ చానల్‌లో చానల్‌ నంబరు 356 నుంచి 2920 దాకా మిగిలి పోయిన మట్టి తవ్వకం పనులకు, చానల్‌ నంబరు 356 నుంచి 1540 దాకా సీసీ బ్లాకు/ లైనింగ్‌ పనులకు మరో టెండరు పిలిచారని తెలిసింది. ఈ ఏడాది అక్టోబరు 13న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిగిన సమావేశం స్ఫూర్తికి భిన్నంగా ఈ టెండర్లను పిలిచారు.’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్నారు. టెండర్లను స్వీకరించేందుకు సమయం 3 వారాలకంటే తక్కువగా ఇచ్చినట్లు తాము గుర్తించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
 
 
అత్యంత విలువైన టెండర్లకు ఇంత తక్కువ సమయం ఇవ్వడం భావ్యం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం 45 రోజులైన సమయం ఇవ్వాలన్నారు. ఈ నెల 22వ తేదీ నాటికి కూడా ఈ-టెండరు నోటీసు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనిపించలేదని తెలిపారు. పైన పేర్కొన్న అంశాలన్నింటిని పరిగణనలోనికి తీసుకుంటే.. టెండరు ప్రకియను కొనసాగించడం సరికాదన్నారు. పై అంశాలన్నీ పరిష్కారమయ్యే వరకు టెండర్‌ ప్రక్రియను నిలపుదల చేయాలని పేర్కొన్నారు.
 
ఈ లేఖను పరిశీలించాక.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కిరికిరి పెడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ప్రతిబంధకాలు సృష్టిస్తే .. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం నెరవేరేలా లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. దీనిపై జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుతో సీఎం సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై సమీక్షించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...