Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

Groove joints vuntai.. Radiography test films okasari check cheyyi.. Mark numbers okati vesi vere place lo Petti test chesestharu.. fail ayina joints no kuda pass chesestharu..

 

Aa L&The vala work ela vuntundho telisu. Andhuke chepthunnanu check cheyamani :run_dog:

ivanni cheppe badulu ... ninne teesukellamanu Razayya. 

Link to comment
Share on other sites

పోలవరంలో ఇసుక సాంద్రత పెంపుదల 
7న విజయవాడలో ఆకృతుల ఆమోద కమిటీ భేటీ 
కాఫర్‌ డ్యాం ఆకృతులపైనా అదే రోజు చర్చ 
31ap-state5a.jpg

ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న ఇసుక ‘సాంద్రత’ను పెంచడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇంకా పనులు చేపట్టాల్సిన చోట ఇసుకను వివిధ పరీక్షల ద్వారా పరిశీలిస్తున్నారు. తద్వారా సాంద్రతను ఏ మేరకు పెంచవచ్చన్నది నిర్ధరించనున్నారు. దీనికి సంబంధించి దిల్లీ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ రమణ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించారు. నవంబరు 7న విజయవాడలో నిర్వహించే పోలవరం ప్రాజెక్టు ఆకృతుల ప్రత్యేక కమిటీ సమావేశంలో ఈ వివరాలను నివేదించనున్నారు. గోదావరి నదిలో మందపాటి ఇసుక పొరలు ఉన్నాయి. ఇవి భారీ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైనవి కావు. అందువల్ల ఈ పొరల సాంద్రత పెంచాల్సి ఉంటుంది. రాతి, మట్టి డ్యాం నిర్మాణంలోనే కాదు, స్పిల్‌ ఛానల్‌కు ఇరువైపులా కట్టల నిర్మాణంలోను దీనిని పెంచాల్సి ఉంటుందని గుర్తించారు. వైబ్రోకాంపాక్షన్‌ పద్ధతిలో సాంద్రతను పెంచి నిర్మాణానికి అనువుగా మలుస్తారు. ఇప్పటికే డయా ఫ్రం వాల్‌ నిర్మాణంలో ఎల్‌ అండ్‌ టీ బావర్‌ సంస్థ వైబ్రేటర్‌ ద్వారా కొంత మేర ఈ ప్రక్రియను అమలు చేస్తోంది.

కాఫర్‌ డ్యాంపై కీలక చర్చ: కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు ఈ నెల తొలివారంలోనే ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. తొలుత ప్రతిపాదన ప్రకారం 31 మీటర్లకే నిర్మించాల్సి ఉంది. దీని ఎత్తు 42 మీటర్లకు పెంచితే ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తి కాకముందే జలాశయంలో నీరు నిలబెట్టి కాలువల ద్వారా మళ్లించాలనేది ఆలోచన. ఇది జరగాలంటే 2018 జూన్‌ నాటికి స్పిల్‌ వే పనులు కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ కాఫర్‌ డ్యాంపైనా చర్చ జరగనుంది. ఈ సమావేశంలోనే గేట్ల నిర్వహణ ఆకృతులనూ ఖరారు చేయనున్నారు.

Link to comment
Share on other sites

వివాద పరిష్కార బోర్డు 
పోలవరంపై ఏర్పాటుకు మంత్రిమండలి పచ్చజెండా 
ప్రధాన గుత్తేదారుకు వరాలు 
మొబిలైజేషన్‌ అడ్వాన్సులకు మరో ఏడాది రాయితీ 
బ్యాంకు ఆఫ్‌ బరోడా నుంచి సాయం అందేలా సహకారం 
ఇంప్రెస్టు నిధి రూ.150 కోట్లకు పెంపు 
ఈనాడు - అమరావతి 
1ap-main1a.jpg

పోలవరం ప్రాజెక్టులోను వివాద పరిష్కార బోర్డు (డీఏబీ) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా వూపింది. పోలవరం గుత్తేదారుకు, జలవనరులశాఖకు మధ్య చెల్లింపులలో వచ్చే వివాదాల పరిష్కారానికి ఈ బోర్డు ఏర్పాటవుతోంది. ఇప్పటిదాకా జిల్లా సివిల్‌ కోర్టులోనే గుత్తేదారు ఇలాంటివి పరిష్కరించుకోవాల్సి ఉండేది. ఇప్పుడు కొత్తగా రాష్ట్రమంత్రి మండలి ముందు ఈ విషయం ఉంచి ఆమోదం తెలపడంతో బోర్డు ఏర్పాటుకు అవకాశం ఏర్పడినట్లయింది. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు బుధవారం రాత్రి సచివాలయంలో మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించారు. 
* ప్రస్తుత పోలవరం ప్రధాన పనుల్లో 60 సి కింద కొంత పని తొలగించి స్పిల్‌ వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ ఛానల్‌కు సంబంధించి టెండర్లు పిలుస్తారు. కొత్త ధరలతో అంచనాలు రూపొందించి టెండర్లు పిలిచి కొత్త గుత్తేదారుకు అప్పగిస్తారు. మిగిలిన పని ప్రస్తుత గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ వద్దే ఉంటుంది. 
* ట్రాన్స్‌ట్రాయ్‌కు ఇచ్చిన మొబిలైజేషన్‌ అడ్వాన్సులు మరో ఏడాది పాటు మినహాయించుకోకుండా రాయితీ ఇస్తూ నిర్ణయం, వడ్డీల్లోను కోత విధించరు. 
* పోలవరంలో రూ.150 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. రూ.50 కోట్లు ఉన్న ఈ నిధిని ఇప్పుడు రూ.150 కోట్లకు పెంచుతారు. పోలవరం పర్యవేక్షక అధికారి వద్ద ఈ నిధి ఉంటుంది. అత్యవసర చెల్లింపులు ఆలస్యం కాకుండా ఆయనే చూస్తారు. 
* బ్యాంకు ఆఫ్‌ బరోడా ద్వారా ట్రాన్స్‌ట్రాయ్‌కు ఆర్థిక సాయం లభించేలా ప్రభుత్వ సహకారం. 
* ఉపగుత్తేదారులకు ఎస్క్రో ఖాతా ఏర్పాటుచేసి నేరుగా వారికి చెల్లింపులు జరిగేలా చూడటం.

పోలవరం చూడని వాళ్లే రాళ్లేస్తున్నారు 
పోలవరం ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం 2018కి పూర్తి చేసేందుకు చాలా గట్టి పట్టుదలతో ఉందని, పోలవరం వెళ్లి ఏం జరుగుతోందో చూడని వాళ్లే రాళ్లు వేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. కేంద్రం సూచించిన పద్ధతిలోనే ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లే హడావుడిలోను పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారన్నారు. గుత్తేదారుకు ఆక్సిజన్‌ ఇవ్వాలని కేంద్ర మంత్రి సూచించారన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసుకోవాలని కేంద మంత్రి చెప్పడంతోనే డీఏబీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. పట్టిసీమపై జగన్‌ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 50శాతానికి పైగా పని జరిగిందన్నారు. పోలవరం హెడ్‌ వర్క్సులో 35శాతం జరిగిందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ.7329 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం రూ.4329 కోట్లు ఇచ్చిందన్నారు.

Link to comment
Share on other sites

  • కొన్ని పనులకు నేడు కొత్తగా టెండర్లు
  •  డయాఫ్రమ్‌ వాల్‌ 48 శాతం పూర్తి
  •  సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి/న్యూఢిల్లీ/పోలవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే, సీ చానల్‌ కాంక్రీటు పనుల్లో కొంత భాగాన్ని కొత్త సంస్థకు అప్పగించేందుకు బుధవారం టెండర్లు పిలవనున్నట్టు జల వనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. సచివాలయంలో సోమవారం పోలవరంపై వర్చువల్‌ రివ్యూను సీఎం నిర్వహించారు. సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాఫర్‌ డ్యాం డిజైన్లపై కేంద్రం నుంచి నిర్ణయం వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు డయాఫ్రమ్‌వాల్‌ పనులు 48 శాతం పూర్తయ్యాయని,. నది మధ్య డయాఫ్రమ్‌ వాల్‌ పనులు డిసెంబరు మొదటివారంలో ప్రారంభమవుతాయని చెప్పారు.
 
అగ్రిగేట్‌ చిల్లింగ్‌ ప్లాంట్‌ రెండువారాల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అనంతరం ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపైనా సీఎం సమీక్షించారు. సాగు నీటి ప్రాజెక్టుల సమీక్షా సమావేశాలను ఇక నుంచి జల వనరుల నిర్వహణా వ్యూహాల సమావేశాలుగా మార్చాలని సీఎం సూచించారు. పురుషోత్తపట్నం స్టేజ్‌-2 మోటార్లు సిద్ధమయ్యాయని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. జల వనరులశాఖలో ఇటీవల భారీగా పదోన్నతులు లభించడంతో చీఫ్‌ ఇంజనీర్లుగా నియమితులైన వారిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా సీఎం అభినందించారు. మరోవైపు పోలవరంపై రెలా స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ నేతృత్వంలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ధర్మాసనం సోమవారం విచారించింది. ఇదే అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉందికదా? మళ్లీ ఇక్కడ విచారణ ఎందుకు అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రవణ్‌ని ప్రశ్నించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
 
పోలవరంలో మట్టి పరీక్షలు
ఢిల్లీలోని సెంట్రల్‌ సాయిల్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి వచ్చిన సైంటిస్టులు స్వప్నవర్మ, కుమార్‌, ఏఆర్వో సీవీ శర్మ సోమవారం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ చానల్‌లో మట్టి పరీక్ష నిర్వహించారు. ఈ బృందం నాలుగు రోజులపాటు పోలవరంలో ఉండి పూర్తిస్థాయి మట్టి పరీక్షలు నిర్వహిస్తుంది. మట్టి నమునాలు రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకువెళ్లి అక్కడ పరీక్షించి పూర్తి నివేదికలు సీడీబ్ల్యూసీకి నివేదించనున్నారు.
Link to comment
Share on other sites

ఖర్చుకు... పనులకు పొంతనేది? 
పోలవరంలో ప్రధాన డ్యాం ఆకృతులకే కేంద్ర జలసంఘం ఆమోదాలా? 
ప్రశ్నిస్తున్న మసూద్‌ అహ్మద్‌ కమిటీ నివేదిక

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ తీరును కేంద్రం నియమించిన మసూద్‌ అహ్మద్‌ కమిటీ అధిక్షేపించింది. ఖర్చుల నమోదు, కాఫర్‌డ్యాం, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తదితర అంశాలను సూటిగా ప్రస్తావిస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ ఏప్రిల్‌ నెలలో పోలవరం ప్రాజెక్టును తొలిసారి సందర్శించి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పూర్తి పాఠం ఈనాడుకు అందింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇస్తున్న నెలవారీ నివేదికల్లో చేసిన పనికి, ఖర్చుకు పొంతన కనబడటం లేదు. ఆ నివేదికల్లో ఆర్థిక, నిర్మాణ వివరాలు ఒకదానితో మరొకటి పోల్చేందుకు వీలు లేకుండా ఉన్నాయి. ఈ నివేదికల్లో వాస్తవ ఖర్చును పేర్కొనడం లేదు. ఎంత పని జరిగిందో పేర్కొంటూ ఆ పని పరిమాణాన్ని ఆ పనికి చెల్లించే ధరతో హెచ్చు వేసి ఆ మేరకు ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నారు తప్పిస్తే వాస్తవంగా ఆ పనిపై ఎంత ఖర్చు చేశారో నివేదికలో పేర్కొనడం లేదు...’’ ఇలా ఆ నివేదిక సాగింది.

కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచాలంటే ఎన్నో పరిశీలించాలి! 
రాష్ట్ర ప్రభుత్వం కాఫర్‌ డ్యాం ఎత్తును 31 మీటర్ల నుంచి 41 మీటర్ల ఎత్తుకు పెంచి 2018 జూన్‌కల్లా పూర్తి చేయాలని ప్రతిపాదిస్తోంది. ఇందుకు స్పిల్‌ వే పనులను కూడా ముందే పూర్తి చేస్తామంటోంది. ఈ పరిస్థితుల్లో కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచడం వల్ల పెరిగే అదనపు ఆర్థికభారాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఎత్తు పెంచితే ఆ డ్యాం నిర్మాణం పూర్తయ్యేసరికి ఆ మేరకు భూసేకరణ, పునరావాస ఏర్పాట్లు పూర్తి చేయాలి. ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యాంశాల్లో ఒకటి. అలాగే స్పిల్‌ వే నిర్మాణం పూర్తి చేయడమూ కష్టసాధ్యం. ఎందుకంటే రోజువారీ చేయాల్సిన పని లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది. ఈ లక్ష్యం చేరుకోదగినంత సులభమైంది కాదు. పైగా కావాల్సినంత యంత్రసామగ్రి, కాంక్రీటు నిర్మాణానికి అవసరమైన కూలింగు ఏర్పాట్లు లేని పరిమితుల్లో ఇది మరీకష్టం. 2019కల్లా ఈ ప్రాజెక్టు పూర్తిచేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి చేయాలి. అలాంటిది ఇప్పటికీ భూసేకరణ ప్రారంభం కాలేదు. పోలవరం ప్రాజెక్టులో కేవలం ప్రధాన డ్యాం పనుల్లో మాత్రమే ఆకృతులకు సంబంధించి కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. ఎడమ, కుడి కాలువ పనుల్లో కట్టడాలకు సంబంధించిన ఆకృతులకు జలసంఘం నుంచి ఎలాంటి ఆమోదాలు పొందడం లేదు. ఇందువల్ల పనుల్లో లోపాలు కనిపిస్తున్నాయి.

పునరావాస నిధులు ముందే ఇస్తే మంచిది 
రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న ప్రకారం ఈ ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాస ఖర్చు రూ.2934.41 కోట్ల నుంచి రూ.32,392.24 కోట్లకు పెరుగుతోంది. ఈ భూసేకరణ, పునరావాస భారమే మొత్తం ప్రాజెక్టులో కీలక ప్రభావం చూపబోతోంది. ఇంత వ్యయం పెరగడం వల్ల ఆర్థికంగా ఈ ప్రాజెక్టు లాభసాటా కాదా అనేది రాష్ట్ర జలవనరులశాఖ సవరించిన అంచనాలు సమర్పించిన తర్వాతే పరీక్షించడం సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు సమర్పించి వాటి ఆమోదం పొందేలోపు ఈ ప్రాజెక్టుకు నిధుల విడుదలపై ఒక ఫార్మేట్‌ రూపొందించాలి. ఆ ప్రకారం నిధులు కేంద్రం తిరిగి చెల్లించాలి. భూసేకరణ, పునరావాస ప్రక్రియలో వేగం పెంచేందుకు వీలుగా ఇది అవసరం. మిగిలిన నిర్మాణ పనులకు సంబంధించి ప్రధానమంత్రి కృషి సంచయి యోజన నిబంధనల మేరకు నిధులు విడుదల చేయవచ్చు.

Link to comment
Share on other sites

5

గడువులోగా అసాధ్యం!
వాస్తవ విరుద్ధంగా లక్ష్యాలు
పోలవరం అథారిటీ పాత్రను పునర్‌ నిర్వచించాలి
మసూద్‌ అహ్మద్‌ కమిటీ నివేదికలో వెల్లడి
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు, కాలువల పనుల్లో రాష్ట్ర జలవనరులశాఖ పేర్కొంటున్న లక్ష్యాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని మసూద్‌ అహ్మద్‌ కమిటీ నివేదిక ఆక్షేపించింది. ప్రస్తుత పనుల తీరు లక్ష్యాల దిశగా లేదని అభిప్రాయపడింది. పైగా ఎడమ కాలువ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని, కుడి కాలువలో అనేక చోట్ల మట్టి సరిగా లేకపోవడం వల్ల లైనింగు పనులు పకడ్బందీగా చేయాల్సి ఉందని పేర్కొంది. ఈ కమిటీ ఏప్రిల్‌లో ప్రాజెక్టును సందర్శించి కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. పోలవరం ఎడమ కాలువలో 2018 మార్చి నాటికి 349 కట్టడాల పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం. ప్రస్తుత పని తీరుతో పోలిస్తే ఈ లక్ష్యం వాస్తవ విరుద్ధంగా ఉంది. నెలవారీగా ఎన్ని కట్టడాలు పూర్తి చేయాలనే లక్ష్యం ఉన్నా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఒక కట్టడమూ పూర్తికాలేదు. ఎడమ కాలువలో పనులు పూర్తి చేయాలంటే అనేక అడ్డంకులు ఉన్నాయి. రైల్వే లైనును, అనేక వాగులను, చిన్న నదులను దాటి కాలువ వెళ్తుంది. 10 చోట్ల జాతీయ రహదారిని, రెండు చోట్ల రైల్వే లైనును దాటాలి. రైల్వే లైను దాటే చోట పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా రైల్వే అధికారులకు సమర్పించాల్సి ఉంది. ఈ  పనులు   హౌరా- చెన్నై ప్రధాన రైలు మార్గంలో ఉన్నాయి. కుడి కాలువ పనుల్లో అక్కడక్కడ బంక మట్టి కనిపించింది. ఈ కాలువ లైనింగ్‌ పనులకు కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రంలో లేదా ఇతర పరిశోధన సంస్థల్లో పరిక్షించిన తర్వాత మాత్రమే మెటీరియల్‌ వినియోగించాలి.

కృష్ణాగోదావరి ప్రాంత కార్యాలయం పాత్ర ఏదీ?
అన్ని జాతీయ ప్రాజెక్టులు, ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని క్షేత్ర యూనిట్‌ల పర్యవేక్షణలో జరుగుతాయి. హైదరాబాద్‌లో ఉన్న కేంద్రజలసంఘ ప్రాంతీయ కార్యాలయం, కృష్ణా గోదావరి బేసిన్‌ కార్యాలయం(కేజీబీవో) ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ విషయంలో ఎలాంటి పాత్ర పోషించడం లేదు. కేజీబీవో ఈ ప్రాజెక్టు పర్యవేక్షణలో చురుకైన భాగస్వామి కావాలి. భూసేకరణ, పునరావాసం ఏ ఏడాది ఎంత పూర్తవుతుందన్న ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదు. ఇప్పటికే సేకరించిన భూమికి సంబంధించి నిర్వాసితులు పరిహారం పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నందున పోలవరం ప్రాజెక్టు అథారిటీ పాత్రను పునర్‌ నిర్వచించాలి.

Link to comment
Share on other sites

ముగిసిన పోలవరం మట్టి పరీక్షలు
18-11-2017 06:01:48
పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ చానల్‌లో నిర్వహిస్తున్న మట్టి పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. స్పిల్‌ చానల్‌, పైలట్‌ చానల్‌లో నాలుగు రోజులుగా ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్‌ సాయిల్‌-మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు మట్టి పరీక్షలు నిర్వహించారు. కాంక్రీట్‌ లైనింగ్‌ ఎంత మందంతో వేయాలి.. ఏటిగట్లు ఎంత సామర్థ్యంతో నిర్మించాలో ఈ పరీక్షల ఆధారంగా నిర్ధారిస్తారు. ఇప్పటికే గతంలో 27సార్లు ఈ మట్టి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం నాలుగు రోజులుగా మరో నాలుగు బోర్‌వెల్స్‌ ద్వారా ఈ పరీక్షలు చేశారు. తీసిన శాంపిల్స్‌ను ఢిల్లీ తీసుకెళ్లి తమ ల్యాబ్‌లో పూర్తిస్థాయిలో పరీక్షించి నివేదికలు ఇస్తారు. వాటిని బట్టి డిజైన్లను ఖరారు చేస్తారు. ఈ పరీక్షల్లో శాస్త్రవేత్తలు స్వప్న వర్మ, పళనికుమార్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

రూ.1395 కోట్లతో పోలవరంలో కొత్త టెండర్లు
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రధాన పనుల్లో సుమారు రూ.1395.30 కోట్ల అంచనా మేరకు కొత్త పనికి జలవనరులశాఖ టెండర్లు ఆహ్వానించింది. ఈ మేరకు ప్రాథమిక టెండరు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇ-ప్రొక్యూర్‌మెంట్‌లో ఉంచుతామని స్పష్టం చేసింది. పనులకు సంబంధించి సాంకేతిక మంజూరు లభించకపోవడంతో వివరాలు ఇంకా బయటకు వెల్లడించడం లేదు. సోమవారం పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు పోలవరం ఉన్నతాధికారులు తెలిపారు. ఇందులో కాంక్రీటు పనులతో పాటు మట్టి పనికీ టెండర్లు ఆహ్వానించారు. స్పిల్‌ వేలో సున్నా నుంచి 35వ బ్లాకు వరకు చేయాల్సిన పనిలో మిగిలిపోయిన పనికి, దానికి అనుబంధంగా సిమెంట్‌ కాంక్రీటుబ్లాకులు, లైనింగు కాంక్రీటు పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...