Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరం పనులను పరిశీలించిన ఢిల్లీ బృందం


సీతానగరం, సెప్టెంబరు 21: పోలవరం పనులను గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు వచ్చాయి.. ఏ మేరకు పనులు పూర్తయ్యాయి.. తదితర విషయాలను పరిశీలించడానికి వచ్చినట్టు ఈ సందర్భంగా బృందం ప్రతినిధులు దేవరాజు, ఆంధ్రమిత్ర తెలిపారు. అనంతరం పురుషోత్తపట్నం, గండికోట గ్రామాల వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులను కూడా వారు పరిశీలించారు.

Link to comment
Share on other sites

పోలవరానికి 2800 కోట్లు
 
 
  • వారంలో వచ్చేలా చూస్తా.. సీఎంకు గడ్కరీ హామీ
  • 1620 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లు
  • ఎన్‌హెచ్‌గా మార్పునకు వినతి
  • పెట్రో ప్రాజెక్టులపై ప్రధాన్‌తో భేటీ
  • నేడు జైట్లీ తదితరులతో సమావేశం!
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో రూ.2800 కోట్లు ఇస్తామని కేంద్ర జలవనరులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌ కార్యాలయంలో గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలోని ఇరిగేషన్‌, రహదారుల ప్రాజెక్టుల గురించి వివరించి, వాటిని పూర్తి చేయడానికి ఆర్థికంగా సహకరించాలని కోరినప్పుడు... గడ్కరీ ఈ మేరకు హామీ ఇచ్చారు. పలు జాతీయ రహదారులు, ముక్త్యాల- విజయవాడ జలమార్గం శంకుస్థాపనకు వచ్చే నెల 3వ తేదీన రాష్ట్రానికి వస్తున్నానని, ఆ సమయంలో పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శిస్తానని గడ్కరీ చెప్పారు. నిధుల విడుదలపై నాబార్డుతో చర్చించాలని, ప్రతిపాదనలు పంపిన వెంటనే నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరగా... నాబార్డుతో తాను మాట్లాడుతానని, పెండింగ్‌ నిధులు వారం రోజుల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటానని గడ్కరీ హామీ ఇచ్చారు. కాగా, జాతీయ రహదారులకు సంబంధించి ఇటీవల పాత ఎన్‌హెచ్‌-5 మీదుగా వెళ్తున్న పలు ప్రాంతాల్లో రోడ్డును ఆరు లైన్లుగా విస్తరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినందుకు చంద్రబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మరికొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారుల రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీని పెద్ద ఎత్తున మెరుగుపరుస్తున్నామని, దానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతీ ముఖ్యమైన పట్టణం, పుణ్యక్షేత్రాలు, పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలకు జాతీయ రహదారులను కనెక్ట్‌ చేయడంతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, ఒడిసా, కర్ణాటక రాష్ట్రాల్లోని ముఖ్యపట్టణాలకు కనెక్టివిటీని కల్పిస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపాదించిన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.
1620 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని గతంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించామని గుర్తు చేశారు. అంతేకాకుండా గుండుగొలను దగ్గర జాతీయ రహదారి మరమ్మతు ప్రాజెక్టు ప్యాకేజీని రద్దు చేశారని, ఈపీసీ ద్వారా కొత్తగా టెండర్లు పిలుస్తున్నారని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, రాత్రి 10 గంటలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఏపీ భవన్‌లోని సీఎం కాటేజీకి వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా రాష్ట్రంలో చేపడుతున్న పెట్రోలియం ప్రాజెక్టులు, పెట్రోలియం యూనివర్సిటీ శాశ్వత భవనాలకు నిధులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
వెంకయ్యా వస్తారు: దేవినేని
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీకి సీఎం వివరించారని మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. పోలవరం పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయని, జలమార్గానికి శంకుస్థాపన చేయడానికి కేంద్ర మంత్రిని ఆహ్వానించామని, ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొంటారని వివరించారు.
Link to comment
Share on other sites

పోలవరానికి 2,800 కోట్లు

కేంద్ర జలవనరులశాఖ మంత్రి అంగీకారం

3న ప్రాజెక్టు సందర్శన

కేంద్రమంత్రి గడ్కరీతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ

జాతీయ రహదారుల అభివృద్ధిపైనా చర్చ

ఈనాడు - దిల్లీ

25ap-main4a.jpg

పోలవరానికి రూ. 2800 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నాబార్డు ద్వారా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. సోమవారమిక్కడ కేంద్ర జలవనరులు, రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయరహదారుల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు అంశాలపై సుమారు గంటకుపైగా ఇద్దరు చర్చించారు. అక్టోబరు 3న పోలవరం పనులు పరిశీలించడానికి రావాలని సీఎం ఆహ్వానించగా గడ్కరీ వస్తానని తెలిపారు. పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేశామని, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరగా, రూ.2800 కోట్లు ఇవ్వడానికి కేంద్రమంత్రి అంగీకరించినట్లు తెలిసింది. నదుల అనుసంధానం, జలరవాణా పట్ల రాష్ట్రం ప్రభుత్వం దృక్పథాన్ని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి అంశంపైనా చర్చించారు. గుండుగొలనుకు సంబంధించిన జాతీయ రహదారి ప్యాకేజీ రద్దయిన అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఓడరేవులు, వెనకబడిన ప్రాంతాలను ప్రధాన రహదారులకు కలుపుతూ ఒక గ్రిడ్‌లా మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు ఆయనకు వివరించారు. దీంతోపాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల్లోని ముఖ్య పట్టణాలను అనుసంధానించేలా రహదారులను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి గతంలో ప్రతిపాదించిన జాబితాను పరిశీలించాలని కేంద్రమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. 1,620 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. వీటివల్ల రాష్ట్రంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగడంతోపాటు ప్రస్తుత జాతీయ రహదారులకు అవి ప్రత్యామ్నాయ కారిడార్లుగా ఉంటాయని వివరించారు.

ఆర్థికమంత్రితో భేటీ: సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతో సమావేశం ఖరారుకావాల్సిఉందని భవన్‌వర్గాలు వెల్లడించాయి.

ధర్మేంద్ర ప్రధాన్‌తో చంద్రబాబు భేటీ.. కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి సీఎం చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. సోమవారమిక్కడ ఏపీ భవన్‌లో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుతో కలసి ధర్మేంద్రప్రధాన్‌, హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ఎంకె సురానా, గెయిల్‌ సీఎండీ బీసీ త్రిపాఠి, పెట్రోలియంశాఖ కార్యదర్శులతో సీఎం భేటీ అయ్యారు. పెట్రోలియం శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు అవసరమైన నిధుల తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ సీఎండీలు సుముఖత వ్యక్తంచేశారు.

2018కల్లా పూర్తిచేస్తాం: దేవినేని.. పోలవరం ప్రాజెక్టు 2018 కల్లా పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని, ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయన్నారు.

Link to comment
Share on other sites

నిధులు పుష్కలం
 
 
636420744139768666.jpg
  • పోలవరానికి లోటు రానివ్వం.. అది జాతీయ ప్రాజెక్టు
  • వంద శాతం ఖర్చు మాదే
  • వారంలో 2871 కోట్ల విడుదల
  • చంద్రబాబుకు జైట్లీ హామీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘పోలవరానికి నిధుల కొరత రానివ్వం.. ఈ ప్రాజెక్టుకు కావలసిన నిధులను కేంద్ర బడ్జెట్‌లో కేటాయిస్తాం.. విడతల వారీగా విడుదల చేసి సకాలంలో పూర్తయ్యేందుకు సహకరిస్తాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత ఈ ఏడాది ఆగస్టు వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.7200.12 కోట్లలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రూ.4329.06 కోట్లు విడుదల చేశారని, మిగతా రూ.2871.06 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ నిధులను వారం రోజుల్లో విడుదల చేస్తామని, సంబంధింత ఫైల్‌ క్లియర్‌ అయినట్లు జైట్లీ తెలిపారు.
 
 pslhlslks.jpg
పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా నిర్మాణానికి అవసరమయ్యే 100 శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చామని, అందుచేత నిధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాల మేరకు పోలవరం నిర్మాణానికి (విద్యుత్కేంద్రానికి అయ్యే ఖర్చు మినహా) రూ.54,113.40 కోట్లు అవుతుందంటూ దానికి సంబంధించిన వివరాలను సీఎం ఆయనకు అందజేశారు. తాజా నిర్మాణ పనులపై ఓ నివేదికను కూడా సమర్పించారు. ఆయనవెంట కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి దేవినేని, ఎంపీ సీఎం రమేశ్‌ ఉన్నారు.
 
hlksghabnam.jpg 
గడ్కరీకి ప్రాజెక్టును చూపిస్తాం
అక్టోబరు 3వ తేదీన రాష్ర్టానికి వస్తున్న కేంద్ర జలవనలరుల మంత్రి నితిన్‌ గడ్కరీకి పోలవరం నిర్మాణ పనులను చూపించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. జైట్లీతో సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం సకాలంలో నిధులిస్తే నిర్ణీత గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను కూడా రాష్ర్టానికే కేంద్రం కట్టబెట్టిందని, ఏ సమయంలో ఎన్నెన్ని నిధులు కావాలో జైట్లీకి తెలియజేశానని చెప్పారు. నిధులపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. గడ్కరీ పోలవరం నిర్మాణ పనులను చూస్తే బావుంటుందన్న ఉద్దేశంతో సోమవారం ఆయనను కలిసినప్పుడు ఆహ్వానించామన్నారు.
Link to comment
Share on other sites

నిధుల వరమివ్వండి!

పోలవరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు

సవరించిన అంచనాలను ఆమోదించండి

ఫైబర్‌ గ్రిడ్‌కు జీఎస్టీ మినహాయింపునివ్వండి

జైట్లీకి చంద్రబాబు విజ్ఞప్తి

తితిదే సేవా టిక్కెట్లకు జీఎస్టీ మినహాయింపుపై కృతజ్ఞత

ఈనాడు - దిల్లీ

26ap-main1a.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు 2019 కల్లా పూర్తిస్థాయిలో పోల‘వరమివ్వాలని’ లక్ష్యంతో అత్యంత వేగంగా పనులు చేస్తున్నామని, 2018 నాటికే కాఫర్‌డ్యాంను పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా నిధులను వెంటవెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఎప్పటికప్పుడు నిధులను ఇవ్వాలని, పనులు పూర్తయిన తర్వాత రాష్ట్రం నుంచి వచ్చే బిల్లులను త్వరగా క్లియర్‌ చేయాలని కోరారు. మంగళవారమిక్కడ జైట్లీతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆయన వెంట కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ఎంపీలు సీఎం రమేశ్‌, కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప ఉన్నారు. రెవెన్యూ లోటును కేంద్ర అధికారులు రూ.4వేల కోట్లేనని చెబుతున్నారని, కానీ రూ.16వేల కోట్లు కేంద్రం విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి జైట్లీ... జల వనరులశాఖ నుంచి ప్రతిపాదనలు రాగానే ఐదారు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర అధికారులు కూర్చుని లెక్కలు తేల్చి రెవెన్యూ లోటును పూర్తిగా విడుదల చేసేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు కోరగా... జీఎస్టీ మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీటీడీ సేవా టిక్కెట్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినందుకు జైట్లీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. జైట్లీతో భేటీ అనంతరం మంత్రి దేవినేని ఉమతో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

‘పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం కేంద్ర మంత్రులు గడ్కరీ, జైట్లీతో భేటీ అయ్యా. ఈ ఏడాది ఆగస్టులో ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్రానికి పంపించాం. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 1.4.14 తర్వాత ఖర్చునే భరిస్తామని కేంద్రం చెబుతోంది. మొత్తంగా 23,814.70 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించింది. 1.4.14కు ముందు రాష్ట్రం 5,135.87 కోట్లు ఖర్చు పెట్టింది. అప్పట్లో అంచనా వ్యయం 16వేల కోట్లు. సవరించిన అంచనా ప్రకారం భూసేకరణ, ఆర్‌ఆర్‌కు రూ.33,858.45 కోట్లు అవుతోంది. హెడ్‌వర్క్స్‌కు రూ.11,637.98 కోట్లు, కుడి ప్రధాన కాలువకు రూ.3,656.14 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.4,960.83 కోట్లు అవుతోంది. పవర్‌హౌస్‌కు అయ్యే రూ.4,205.66 కోట్లను రాష్ట్రమే భరించాలని కేంద్రం అంటోంది. దానిని మినహాయిస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.54,119 కోట్లు అవుతుంది. దీనిపై ఇప్పటికే ప్రతిపాదనలు కేంద్రానికి ఇచ్చాం. కేంద్ర జల సంఘం అసెస్‌ చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టును 2019కి పూర్తి చేయాలి. కాఫర్‌ డ్యాం జూన్‌ 2018కి పూర్తి కావాలి. ఆ తర్వాత ఎర్త్‌కం డ్యాం ప్రాజెక్టు పూర్తి కావాలి. ట్రాన్స్‌ట్రాయ్‌తో పనులు కాకపోతే కొన్ని పనులను సమర్థ సంస్థకు అప్పగించి పూర్తి చేయాలని అనుకుంటున్నాం. అక్టోబరు 3న ప్రాజెక్టును చూస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులు సజావుగా సాగడానికి జల వనరులు, ఆర్థికశాఖల మంత్రులు ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి ఫాస్ట్‌ట్రాక్‌, ఆటోపైలెట్‌లో డబ్బులివ్వాలి. రెవెన్యూ లోటును పరిశీలిస్తామని తెలిపారు. ఈఏపీ క్లియర్‌ చేయాల్సిన అవసరముంది. పోలవరం పెండింగ్‌ నిధులను ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. కేంద్ర నిధులను వెంటవెంటనే ఇవ్వకపోయినా ప్రాజెక్టు ఆగకూడదని ఇప్పటివరకూ రూ.4వేల కోట్లపై వడ్డీ భరిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముందుకెళ్తున్నాం. ప్యాకేజీ ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి చాలా ఉన్నాయి. త్వరలోనే వస్తాయి. అన్నీ అమలు చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. కాకినాడలో పెట్రోకెమికల్స్‌ ఏర్పాటుపై చాలా ప్రోత్సాహకాలు అడుతున్నారు. ఈ విషయంపై కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి’ అని చంద్రబాబు వివరించారు.

సమాజంలో విద్వేషాలు కలిగించేలా వ్యవహరించొద్దు

ఆర్యవైశ్యులపై కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై చంద్రబాబు స్పందించారు. ఇతరులను కించపరిచేలా పుస్తకాలు రాయడం, వ్యాఖ్యానాలు చేయడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితులు సృష్టించకూడదని తెలిపారు. అలాంటి పుస్తకాలను ప్రచురించకూడదని, ఒకవేళ ప్రచురించినా ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. ఏపీలో ఆ పుస్తకం ఎక్కడా లభ్యం కావడం లేదని చెప్పారు.

26ap-main1b.jpg

ఎంపీలతో భేటీ.. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న ఎంపీలతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. ముగ్గురు చొప్పున ఎంపీలు ఐఏఎస్‌ అధికారులతో కలిసి ఏయే శాఖల్లో, విభాగాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి పరిష్కార దిశగా ముందుకెళ్లాలని సూచించారు.

ఏపీభవన్‌ ఆస్తుల పంపకాలపై సమీక్ష

ఏపీ భవన్‌ విభజనపై ఇటీవల కేంద్రం ఆరుగురితో కమిటీ వేసిన నేపథ్యంలో చంద్రబాబు ఎంపీలు సీఎం రమేశ్‌, కేశినేని నాని, జేసీ దివాకర్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్పలతో భేటీ అయ్యారు. ఏపీ భవన్‌ ఆస్తుల పంపకాలపై సమీక్షించారు. ప్రక్రియ సజావుగా సాగేలా ఎంపీలు సహకరించాలని సూచించారు. ప్రత్యేక కమిషనర్‌ రజత భార్గవ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

Link to comment
Share on other sites

పోలవరం నిధులపై ధీమా!
 
 
636421614771529957.jpg
  • 15 రోజుల్లో తుది అంచనాలపై స్పష్టత
  • కేంద్ర జలసంఘానికి గడ్కరీ ఆదేశం
  • జైట్లీ, గడ్కరీతో భేటీ తర్వాత సీఎంలో విశ్వాసం
  • 3న పోలవరం ప్రాజెక్టు వద్ద సమీక్ష
అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పక్కాగా నిధులు అందిస్తుందన్న ధీమా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏర్పడింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఉపరితల రవాణా, జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అనంతరం నిధుల విడుదలపై ఆయనతోపాటు రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికార వర్గాల్లోనూ విశ్వాసం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు రూ.58,319.06 కోట్ల తాజా అంచనాలపై 15 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల సంఘాన్ని గడ్కరీ ఆదేశించడంతో ఈ నమ్మకం మరింత పెరిగింది. ప్రాజెక్టుకు అనుమతులు, నిధుల మంజూరులో సానుకూలంగా ఉన్న ఉమాభారతి నుంచి జలవనరుల శాఖను తప్పించి ఇటీవల గడ్కరీకి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో సీఎం ఆయన్ను కలిసినప్పుడు.. తొలుత రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సమీక్ష జరిగింది. అనంతరం పోలవరం ప్రస్తావనకు వచ్చింది.
 
దీనిపై ప్రత్యేకంగా మాట్లాడదామని చంద్రబాబును గడ్కరీ తన చాంబర్‌లోని యాంటీరూమ్‌లోకి తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఎంపీ సీఎం రమేశ్‌ కూడా హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల ప్రవాహం సాఫీగా లేదని గడ్కరీ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఆలోచన నాటి నుంచి నేటి కార్యాచరణ దాకా సవివరంగా తెలియజేశారు. ‘రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. మొత్తం వ్యయాన్ని భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ 2014 ఏప్రిల్‌ 1వ తేదీనాటికి ఉన్న ధరలకు అనుగుణంగా వేసిన అంచనాల మేరకే భరిస్తామంటూ కటాఫ్‌ తేదీని పేర్కొన్నారు.
 
ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా కేంద్రం రూ.23,814 కోట్లు అందించాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానం కూడా చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరందించాలని, 2019 నాటికి సంపూర్ణంగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు పరుగులు తీయిస్తున్నాం’ అని వివరించారు. 1941 నుంచి 2017 దాకా చోటు చేసుకున్న పరిణామాలు, పనుల పురోగతి నివేదికను చూశాక.. పోలవరం.. కేంద్రానికి కూడా అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు అని, నిధుల కొరత రానివ్వబోమని జైట్లీ, గడ్కరీ హామీ ఇచ్చారు. ఇంకోవైపు.. అక్టోబరు 3వ తేదీన పలు కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు గడ్కరీ విజయవాడ వస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తారు. దీంతో ఆయనకూ స్పష్టత వస్తుందని సీఎం చెప్పారు.
Link to comment
Share on other sites

Crucial Land Acquisition Complete for Polavaram The state government has made yet another step forward in Polavaram Project as it has completed the Land Acquisition for Polavaram first phase in agency area of East Godavari. This will ensure that water flows from the project with a cofferdam. The government had managed to acquire 10700 acres of land for the project and 7400 people have to be rehabilitated. Most of these lands are from the mandals which were added from Telangana to Andhra Pradesh after the state division. Polavaram Multi-Purpose Irrigation Project comes with a total capacity of 194 TMC which will irrigate about Five Lakh Acres over Two Crops Every year. The Project will also generate 960MW of Hydel Power which is the cheapest available power in the market right now. Hence the project is said to be very beneficial for the state and is treated as the ‘Life Line’.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...