Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ శుక్రవారం ఉదయం సమావేశమైంది. స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న హుకుంసింగ్‌తోపాటు పార్లమెంటు సభ్యులు వి. సత్యభామ, అపురూపపద్ధార్‌, మాగంటి మురళీమోహన్‌, రాజ్యసభ సభ్యులు సర్దార్‌ బల్విందర్‌, యస్‌.బుహందర్‌, హర్షవర్ధన్‌సింగ్‌ దుంగరపు, రాపోలు ఆనంద్‌ భాస్కర్‌, ప్రదీప్‌ టమ్టా, ఏబీ స్వామి, డాక్టర్‌ సిద్ధాంత్‌ మహోపాత్ర, లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందిన నలుగురు ఉన్నతాధికారులు, వాటర్‌ రిసోర్సెస్‌కు చెందిన మరో ఐదుగురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. కాగా... పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును ఈ కమిటీ సందర్శించనుంది.

Link to comment
Share on other sites

 

 

gates ok what about blocks?? enni complete ayayi??

 

 

30 days for fitting 1 gate anta but modern machinery vasthe 10 days/gate fit cheyochu anta 

 

I think by november machinery ni akada mobilize cheyali appude emana use. we need to fit 2 gates for every 10 days appudu 6 gates/month ante minimum 9-10 months lo gates fittings avutayi almost a year anukovachu

 

But before november atleast 15-20 spillway blocks ready cheyali for fitting gates appudu people will get known how tdp working hard ani edo 2019 ante waste as fast as we can we can show people

 

inkoti main ga coffer dam tho 60tmc storage cheyochu 

 

 

idi inka start kaledu so 1st we need to complete it but mobilize it to good contractor as subcontract appude use

 

Even coffer dam ayina sare inka left canal ki vache tunnels inka 40%+ avali adi evaru cheyadam ledu and linings cheyali adi kuda cheyaledu ivi anni avali ante minimum 2020 avochu emo ani naa doubt. But atleast coffer dam kattali and we need to complete left canal by next may and tunnels appude coffer dam valla use leka pothe nothing use 

Link to comment
Share on other sites

పోలవరానికి త్వరలో రూ.979 కోట్లు

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.979 కోట్లు విడుదల చేయనుంది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన అనంతరం కేంద్రం పోలవరానికి రూ.3,349.70 కోట్లు విడుదల చేసింది. దీనికి అదనంగా రాష్ట్రం ఖర్చు చేసిన రూ.3,808.83 కోట్లను తిరిగి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అందులో ప్రస్తుతానికి రూ.979 కోట్లను నాబార్డు ద్వారా చెల్లించడానికి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఆమోదముద్ర వేశారని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రూ.5,810 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

నేడు పార్లమెంటరీ కమిటీ పోలవరం సందర్శన

ఈనాడు-అమరావతి: లోక్‌సభ సభ్యుడు హుకుంసింగ్‌ నేతృత్వంలోని పది మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీ శుక్రవారం పోలవరం ప్రాజెక్టును, పట్టిసీమ ఎత్తిపోతలను సందర్శించనుంది. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌ సహా మరో 8 మంది పార్లమెంటు సభ్యులు ఈ కమిటీలో సభ్యులు. తొలుత 21 మంది ఎంపీల కమిటీ సందర్శనకు రానున్నట్లు సమాచారం అందినా ప్రస్తుతం 10 మందే వస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టును కూడా ఈ కమిటీ సందర్శించనుంది. డాక్టర్‌ సిద్ధాంత మహాపాత్ర, అపరూప పొడ్దార్‌, సత్యప్రభ, సర్దార్‌ బల్వీందర్‌, హర్షవర్ధన్‌ సింగ్‌, రాపోలు ఆనందభాస్కర్‌, ఎ.వి.స్వామి, టి.ప్రదీప్‌ ఈ ప్రాజెక్టు సందర్శన కమిటీలో ఉన్నారు. లోక్‌సభ సచివాలయానికి చెందిన అధికారులు సైతం హాజరవుతున్నారు. వీరు శుక్రవారం ఉదయమే విజయవాడ నుంచి బయలుదేరతారు. తొలుత పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి పోలవరం కుడి కాలువలో పట్టిసీమ నీరు చేరే ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ మోడల్‌ హౌస్‌, పోలవరం స్పిల్‌ వే పనులు తదితరాలు చూసి వెనుదిరుగుతారు. శనివారం ఈ కమిటీ తోటపల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే వీరు ప్రశ్నావళి పంపారని, వాటి సమాధానాలు కోరారని సమాచారం. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తిచేస్తున్నారో తెలియజేసే సమగ్ర సమాచారాన్ని జలవనరులశాఖ అధికారులు సిద్ధం చేశారు.

Link to comment
Share on other sites

పోలవరానికి మరో 979కోట్లు
18-08-2017 02:21:47
 
636386197091869636.jpg
  • కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం
  • వెంటనే విడుదల చేయండి
  • నాబార్డ్‌కు ఉమాభారతి లేఖ
  • నేడు పార్లమెంటరీ కమిటీ రాక
 
న్యూఢిల్లీ/అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మరో రూ.979 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతికి కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఉమాభారతి.. నిధులు విడుదల చేయాలంటూ నాబార్డ్‌కు గురువారం లేఖ రాశారు. అయితే.. గతంలో ఖర్చు పెట్టిన సుమారు 3 వేల కోట్ల నిధులను విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోని కేంద్రం కేవలం రూ.979 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. తాజాగా మంజూరు చేసిన నిధులతో కలిపి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటి వరకూ రూ.4328 కోట్లు మంజూరు చేసినట్లయింది.
 
2010 -11 ధరల ప్రకారం పోలవరం నిర్మాణానికి కేంద్రం రూ.5810.72 కోట్లు వ్యయం అవుతుందని నిర్థారించింది. ఈ లెక్కల ప్రకారం పోలవరం నిర్మాణానికి ఇంకా రూ.1482 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. అయితే విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. జాతీయ ప్రాజెక్టులన్నింటికీ కేంద్రం 70 నుంచి 90 శాతం నిధులను అందిస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినందున పోలవరం నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని భరించడానికి కేంద్రం ముందుకొచ్చింది. ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా 2014 ధరల ప్రకారం పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చును 100 శాతం తామే భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
 
ఈమేరకు సవరించిన అంచనాలను పంపాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. పూర్తి స్థాయిలో లెక్కలను తయారు చేయడానికి కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈలోగా గతంలో తాము ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి ఇటీవల ఢిల్లీ వచ్చిన సీఎం చంద్రబాబు పోలవరం నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సవరించిన అంచనాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తామని జైట్లీ.. సీఎంకి హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, జాతీయ స్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణంపై అధ్యయనంలో భాగంగా హుకుంసింగ్‌ అధ్యక్షతన పది మంది పార్లమెంటు సభ్యులతో కూడిన బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నది. ఈ బృందం పోలవరం నిర్మాణ పనులనూ సమీక్షిస్తుంది. శనివారం విజయవాడలో పోలవరంపై సమీక్షను నిర్వహించిన అనంతరం ఈ కమిటీ విశాఖకు వెళ్తుంది. అక్కడ తోటపల్లి రిజర్వాయరుతోసహా పలు ప్రాజెక్టులపై కమిటీ సమీక్షిస్తుంది.
Link to comment
Share on other sites

పోలవరానికి పూర్తి సహకారం అందించండి

పార్లమెంటరీ కమిటీకి చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి: జలవనరుల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు దేశానికే ఆదర్శమని రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్లమెంటరీ కమిటీ సభ్యులు కొనియాడారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం నిర్మాణం శరవేగంగా జరిగేలా కృషి చేస్తున్నామని సీఎం వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఈరోజు విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న జలవనరుల ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఈ కమిటీ తమ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి అమరావతి చేరుకుంది. మొత్తం 19మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు అల్పాహార విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరు, పురోగతిని వివరించారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్నామని... ప్రతి నెలా మూడో సోమవారం ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందించాలని స్టాండింగ్‌ కమిటీ సభ్యులను చంద్రబాబు కోరారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...