Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
15న కాపర్‌ డ్యాం పనులు
 
636237594690288001.jpg
  • సీఎం చేతుల మీదుగా ప్రారంభం
  • జూన్ లో పోలవరంలో బాబు వారం బస
  • మంత్రి దేవినేని వెల్లడి
పోలవరం, ఫిబ్రవరి 26: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణమైన కాపర్‌ డ్యాం పనులు వచ్చేనెలలో ప్రారంభమవుతాయని జలవనరుల మంత్రి దేవినేని ఉమ చెప్పారు. గోదావరి జలాలను కుడి, ఎడమ కాలువలకు మళ్లించే ఈ కాపర్‌ డ్యాం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి 15న ప్రారంభిస్తారని తెలిపారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వచ్చిన ఆయన ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, డయాఫ్రం వాల్‌గేట్ల తయారీ పనులను పరిశీలించారు. ముందుగా డయాఫ్రం వాల్‌ పనులను తనిఖీచేశారు. దీని నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తిచేస్తారని ఎల్‌ఎంటీ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. మార్చి నుంచి మే నెలాఖరు వరకూ అతికీలకమైన సమయమని, ప్రాజెక్టు పనులు మొత్తం ఈ సమయంలోనే పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే దీని నిర్మాణంలో మూడు భారీ యంత్రాలు పనిచేస్తున్నాయని, మ రో రెండు యంత్రాలు వెయింటింగ్‌లో ఉన్నాయని ఎల్‌ఎంటీ ప్రతినిధి రవికుమార్‌ చెప్పారు. అనంతరం దేవినేని ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో అధికారులతో స మీక్ష నిర్వహించారు. ప్రతి శని, ఆదివారాల్లో జలవనరు ల కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌.. ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావుతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని చెప్పారు. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి వర్చువల్‌ తనిఖీలు నిర్వహిస్తారని, 3వ సోమవారం పోలవరం వస్తారని తెలిపారు. పనులను పరుగులు తీ యించేందుకు ముఖ్యమంత్రి పోలవరంలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తారన్నారు. జూన్‌లో వారం రోజులు ఇక్కడే బస చేస్తారని చెప్పారు. స్పిల్‌ వేలో ఇప్పటి వరకు 14 బ్లాకుల్లో కాంక్రీట్‌ వేసినట్లు చెప్పారు. వేసవిలో కాంక్రీట్‌ పనుల పూర్తికి ఎండ వేడిని తగ్గించడానికి కూలింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 42 గేట్ల తయారీకి అవసరమైన మొత్తం ఇనుము-ఉక్కును పోలవరానికే తెస్తున్నట్లు తెలిపారు. మార్చి 31కి 2 వేల టన్నులు వస్తుందని, అప్పటికల్లా రెండు గేట్లు పూర్తి స్థాయిలో తయారవుతాయని, అక్కడి నుంచి ప్రతి వా రం ఒక గేటు తయారవుతుందని చెప్పారు. డయా ఫ్రం వాల్‌ నిర్మాణం మొదటి దశలో 168 ప్యానల్స్‌లో కాంక్రీట్‌ వేయాల్సి ఉండగా ఇప్పటివరకు రెండు ప్యానల్స్‌ పూర్తయ్యాయని, ఇకనుంచి రోజుకో ప్యానల్‌లో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
 
Link to comment
Share on other sites

కాపర్ డ్యాం పనులు చురుగ్గా చేపట్టాలి: చంద్రబాబు
 
636238083471674627.jpg
అమరావతి: గోదావరిలో ప్రవాహ వేగం తగ్గినందున కాపర్ డ్యాం పనులు చురుగ్గా చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం రాకముందే పనులన్ని ఒక కొలిక్కి రావాలని ఆయన అధికారులకు సూచించారు. స్పిల్‌వే మట్టి తవ్వకం పనులు తుది దశకు చేరుకున్నాయి.
 
స్పిల్ ఛానల్ నిర్మాణానికి 19.95 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున మట్టి తవ్వకం పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. పవర్ హౌస్ పనుల్లో ఆలస్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టీ బావర్‌- ట్రాన్స్‌ట్రాయ్‌ల మధ్య ఒప్పందంతో నిధుల విడుదల్లో సమస్య తొలగిందని ఆయన అన్నారు.
 
డయాఫ్రమ్ వాల్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. స్పిల్ వేకు సంబంధించి 1.61 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం,ఎడమభాగం పనుల్లో 4.7 6 లక్షల క్యూబిక్ మీటర్లు, అప్రోచ్ ఛానల్‌కు సంబంధించి 2.17 లక్షల క్యూబిక్ మీటర్లు, పైలట్ ఛానల్‌కు సంబంధించి 0.77 లక్షల క్యూబిక్ మీటర్ల, మట్టి తవ్వకం పూర్తి చేయాలని సమీక్షలో నిర్ణయించామని ఆయన తెలిపారు.
Link to comment
Share on other sites

వేగంగా కాఫర్‌ డ్యాం
 
  • నిర్మాణ సంస్థలకు బాబు ఆదేశం
  • పోలవరం నిధులపై ప్రధానికి లేఖ
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గోదావరిలో ప్రవాహ వేగం తగ్గడంతో పోలవరం ప్రాజెక్టులో భాగమైన కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగేలా చూడాలని అధికారులు, నిర్మాణ సంస్థలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాకాలం రాకముందే పనులు కొలిక్కి రావాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులపై సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌సా్ట్రయ్‌-సబ్‌కాంట్రాక్టు సంస్థలైన ఎల్‌అండ్‌టీ, బావర్‌ మధ్య ఒప్పందం కుదిరిందని, ఇక నుంచి ఆ సంస్థల నడుమ నిధుల విడుదల సమస్య కూడా తీరుతుందని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. డయాఫ్రం వాల్‌ పనులు మరింత వేగవంతం కావడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ తవ్వకం పనులు ఎంతవరకు వచ్చాయో సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంకోవైపు.. ఎలాం టి జాప్యం లేకుండా పోలవరం నిధులను నిరంతరం విడుదల చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. లేఖ రూపకల్పన బాధ్యతను జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు అప్పగించారు. బడ్జెట్‌పై కసరత్తు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం మధ్యలోనే నాబార్డు చైర్మన్‌తో సీఎం ఫోన్లో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన లేఖ ఆధారంగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైతే అదనపు నిధులు అందించేందుకు తమకు అభ్యంతరం లేదని నాబార్డు చైర్మన్‌ చెప్పారు. ఈ నెల 20 నుంచి 26 వరకూ స్పిల్‌ వే నిర్మాణానికి సంబంధించిన 1.61లక్షల క్యూబిక్‌ మీటర్ల తవ్వకం పనులు జరిగాయి. 6.37 లక్షల క్యూబిక్‌ మీటర్ల వేర చానల్‌ , 0.73 లక్షల క్యూబిక్‌ మీటర్ల పైలెట్‌ చానల్‌ తవ్వకం పనులు జరిగాయి. 0.90 లక్షల క్యూబిక్‌ మీటర్ల అప్రోచ్‌ చానల్‌, 0.63 లక్షల క్యూబిక్‌ మీటర్ల పైలట్‌ చానల్‌ తవ్వకం పనులు పూర్తయ్యాయి.
Link to comment
Share on other sites

పోలవరంపై అక్కడికక్కడే సమీక్ష
 
హైదరాబాద్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుండడంతో.. కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. నిర్మాణ పనులకు విఘాతం కలగకుండా డ్యామ్‌సైట్‌లోనే సమీక్షలు నిరహిస్తూ.. తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు పోలవరం డ్యామ్‌ డిజైన్ల కమిటీ చైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలోని 23 మంది అధికారులతో కూడిన బృందం పనులను సమీక్షించనుంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

http://indianexpress.com/article/india/work-on-fabricating-polavaram-crest-gates-begins-4557497/

 

Work on fabricating Polavaram crest gates begins The diaphragm wall which is 1,500 metres long, 120 mts wide and 40 and 100 metres deep would the world’s biggest such wall when construction is complete.

 

The fabrication and erection work of 48 crest gates of Polavaram Project, a multi-purpose irrigation dam, will start in November.

About 300 metric tones of steel arrived today at the Gates Fabrication Centre at Polavaram Project site in West Godavari district of Andhra Pradesh. By the end of April, another 2100 MT of steel will also arrive in a phased manner, around 15,000 MT of steel would be used to make the gates. The fabrication of the gates and installation would be completed by June 2018, sources said after Chief Minister N Chandrababu Naidu held a review meeting today. Fabrication work of the 48 massive gates for the dam across river Godavari will commence this week.

 

On February 1, the construction of the diaphragm wall was started at the project site. The diaphragm wall which is 1,500 metres long, 120 mts wide and 40 and 100 metres deep would the world’s biggest such wall when construction is complete.

In the first phase, 750 metres of wall would be constructed by June end after which work will stop during monsoon. The remaining 750 metres construction would start in December and completed by June 2018. The project is on schedule and the project may be completed by end of 2018 or early 2019, officials said.

On March 3, the Union Water Resources Ministry released Rs 1,981 crores funds for the Polavaram Project. The Centre will release nearly at total of Rs 3,000 crores for the project after it was accorded national project status, and Centre agreed to fund it through loans from Nabard. The Chief Minister also reviewed all the prioritized projects including Handri-Neeva Sujala Sravanthi Project, the longest canal project in Rayalaseema; Galeru Nagari Sujala Sravanthi project in Kadapa, and Veligonda, Vamsadhara.

As a hot summer is being predicted and drought like conditions may prevail in Rayalaseema region which receives very less rainfall, the AP Government today discussed the possibility of deploying “mobile lifts’’ to pump water to drought affected areas from the nearest water body.

“As part of the drought preparedness and mitigation plan for this summer, proposals are afoot to use mobile lifts to provide water to drought affected areas. A presentation was made by the officials today in the review meeting held on Polavaram,’’ an official said.

A pipeline network will be installed to lift water from rivers, canals or any surface water Modies. The mobile lifts will help in lifting of water from one place and pump to a water shortage area during this summer to mitigate drought. The pumps would either run on electricity or diesel depending on power availability. It has been decided to take up this project on a pilot basis in the districts of Ananatapur and Kurnool. Each unit of the mobile lift will cost nearly Rs 1.5 cores and can pump 1.4 cusecs of water. The pumped water can flow about 4 kilometers through gravity.

Link to comment
Share on other sites

పోలవరం పనులు వేగవంతం
 
636249663403299176.jpg
  • ఈ వారమే కాపర్‌ డ్యామ్‌ పనులు..
  • జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ

పోలవరం, మార్చి 12 : దేశంలోనే అత్యంత నిపుణులైన ఇంజనీర్లతో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌వేలో జరుగుతున్న కాంక్రీట్‌, మట్టిపనులను, డయా ఫ్రం వాల్‌ నిర్మాణపనులను పరిశీలించారు. స్పిల్‌వే వద్ద నూతన యంత్రాలకు పూజలు చేసి ప్రారంభించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని అనుకున్న సమయంలో పూర్తిచేయాలని ట్రాన్సట్రాయ్‌ ఈడీ సాంబశివరావును ఆదేశించారు. మరిన్ని అధునాతన యంత్రాలను తీసుకువాలని సూచించారు. ప్లాస్టిక్‌ డయా ఫ్రమ్‌ వాల్‌కు అనుమతులు రావడంతో పనులు వేగవంతం చేయాలని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులను ఆదేశించారు.
ప్రాజెక్టుపై డిజైన్స కమిటీ ఆదేశాలు
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ‘‘పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. ప్రా జెక్ట్‌ డిజైనల అనుమతులకు సంబంధించి డిజైన్స కమిటీ అధ్యక్షుడు పాండ్యా ఆధ్వర్యంలో నిపుణుల బృందం రెండు రోజులుగా పోలవరంలోనే ఉండి పూర్తిస్థాయిలో పర్యవేక్షిం చి పనులపై ఆదేశాలు ఇచ్చారు. డయా ఫ్రం వాల్‌కు సం బంధించి ఎల్‌అండ్‌టీ, బోవార్‌ కంపెనీలు రెండు షిప్ట్‌లుగా 24 గంటలు పనిచేస్తున్నాయి. ప్రతీ సోమవారం సీఎం చంద్రబాబు సమీక్షిస్తూ.. ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తున్నారు. క్షేత్రస్థాయి ఇబ్బందుల పరిశీలనకు ప్రతీ వారం నేను, ప్రిన్సిపల్‌ కార్యదర్శి, ఈఎనసీ ఇక్కడే ఉంటున్నాం’ అని చెప్పారు.
ఈ వారంలో కాపర్‌ డ్యామ్‌ పనులు
గోదావరి నీటిని ముందుగా కుడి, ఎడమ కాలువలకు మళ్లించే విధంగా నిర్మించే కాపర్‌ డ్యామ్‌ పనులను ఈ వారం ప్రత్యేక కాంట్రాక్ట్‌ ఏజెన్సీకి అప్పగించనున్నారు. దీనికి సంబంధించిన డ్రాయింగ్‌లు వస్తున్నాయని, వచ్చే 70 రోజుల్లో ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయిలో పనులు చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని దేవినేని వెల్లడించారు.
పెద్ద ఇంజనీర్లు కావాలి
పోలవరం దేశంలోనే కీలక నిర్మాణమని, భవిష్యతలో ఎక్కడా నిర్మించకపోవచ్చని.. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించి పెద్ద ఇంజనీర్లుగా తయారు కావాలని మంత్రి దేవినేని విద్యార్థులకు సూచించారు. ఆదివారం గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మొత్తం ఐదు బస్సులలో విద్యార్థులు వచ్చారు. వారంతా ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించిన అనంతరం వారికి ఈఎనసీ ఎం.వెంకటేశ్వరరావు, వి.రమే్‌షబాబు ప్రాజెక్ట్‌లో కీలక అంశాలను తెలియజేశారు.
భూకంపాలను తట్టుకునేలా..:ఈఎన్‌సీ
డయా ఫ్రమ్‌ నిర్మాణానికి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చాయని జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. భూకంపాలు సంభవిస్తే ప్రాజెక్ట్‌ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఇప్పటికే ‘సీడబ్ల్యూసీఆర్‌ఎ్‌సతో టు ది డయనమిక్‌ ఎనాలసిస్‌ రీసెర్చ్‌’ చేసినట్లు చెప్పారు. స్పిల్‌వేలో బోడీ వాల్‌, రివర్‌ స్లూయిజ్‌కు సీడబ్ల్యూసీ అనుమతులు మంజూరు చేసిందన్నారు.
Link to comment
Share on other sites

పోలవరం.. సత్వరం!
 
636250465425445461.jpg
  • నాణ్యతలో రాజీవద్దు.. అవసరమైతే మెటీరియల్‌ మేమే సరఫరా చేస్తాం
  • బిల్లుల పంచాయతీ సోమవారం వద్దు
  • పోలవరం సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): పోలవరం పనులు లక్ష్యాల మేరకు సత్వరమే పూర్తికావాలని.. అయితే, నాణ్యతలో ఏమాత్రం రాజీపడేది లేదని కాంట్రాక్టు సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా భారీ యంత్రాలు, ఇతర సామగ్రిని యుద్ధ ప్రాతిపదికన తీసుకువెళ్లాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకపాత్రను పోషించే పెంటా కాంక్రీట్‌, బ్యాచింగ్‌ ప్లాంట్లు, డ్రిల్లింగ్‌-చిల్లింగ్‌ మిషనరీని ఇంకా అందుబాటులో తీసుకురాకపోవడంపై కాంట్రాక్టు సంస్థలను ప్రశ్నించారు. కేంద్ర జల వనరుల శాఖ సలహాలు సూచనల మేరకు పోలవరం డిజైన్లలో మార్పులు చేర్పులూ చేసుకోవాలని.. గేట్ల విషయంలోనూ వేగం పెంచాలని ఆదేశించారు. అవసరమైతే.. గేట్లకు అవసరమైన స్టీల్‌ను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని చెప్పారు. ఉండవల్లిలోని తన గృహంలో సోమవారం పోలవరం పనులపై సీఎం సమీక్షించారు. విర్చువల్‌ విధానం అందుబాటులో లేకపోవడంతో.. క్షేత్రస్థాయి ఇంజనీరింగ్‌ అధికారులతో టెలిఫోన్‌లో సీఎం మాట్లాడారు. ఈ సమీక్షలో మంత్రి దేవినేని ఉమా, సీఎంఓ ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ర్టాయ్‌ ఈడీ సాంబశివరావు, ఎల్‌అండ్‌టీ-బావర్‌, త్రివేణీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంక్రీట్‌, మట్టి పనుల పురోగతిని సమీక్షించారు. కాంక్రీట్‌పనుల వేగం క్రమంగా పెరుగుతున్నా.. మట్టి పనుల విషయంలో మాత్రం లక్ష్యాలను అధిగమించక పోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో తమకు రూ.100 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని త్రివేణి సంస్థ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో.. సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం పోలవరం పనుల పురోగతిపై సమీక్షను నిర్వహిస్తుంటే.. కాంట్రాక్టు సంస్థలు బిల్లుల పంచాయతీగా మార్చేస్తున్నాయని అన్నారు. తాను లక్ష్యాలను ఎందుకు అధిగమించలేదని ప్రశ్నిస్తుంటే.. బిల్లులు రావాల్సి ఉందంటూ సమీక్ష పక్కదోవపట్టేలా మాట్లాడడం సరికాదన్నారు. గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సమయంలో త్రివేణీ సంస్థ మరోదఫా ప్రధాన కాంట్రాక్టు సంస్థ నుంచి తమకు రావాల్సిన రూ.100 కోట్ల బకాయిల గురించి ప్రస్తావించించింది. బిల్లుల పంచాయతీ సోమవారం నాటి సమీక్షలో వద్దంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై ట్రాన్స్‌స్ట్రాయ్‌ సంస్థ ఈడీ సాంబశివరావును వివరణ కోరారు. తాము బిల్లులను చెల్లిస్తున్నామని.. ఫిబ్రవరి నెల బిల్లు మార్చిలో వస్తుందని వివరణ ఇచ్చారు. చంద్రబాబు సమీక్షను ముగించాక.. సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌ లక్ష్య సాధనపై కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులతో మరోసారి సమీక్షించి దిశానిర్దేశం చేశారు.
 
 
పనులు జరిగిన తీరిది
పోలవరం సమీక్షలో అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపిన సమాచారం ప్రకారం.. స్పిల్‌ చానల్‌ పనుల్లో చానల్‌ 356 నుంచి 900 మీటర్ల వరకు 73 లక్షల క్యూబిక్‌ మీటర్లను 87 రోజుల్లో చేయాల్సి ఉంది. వాటిని గత వారం 588 లక్షలు చేయాల్సి ఉండగా.. 1.85 లక్షల పనులు మాత్రమే జరిగాయి.
Link to comment
Share on other sites

 

కాంక్రీట్‌పనుల వేగం క్రమంగా పెరుగుతున్నా.. మట్టి పనుల విషయంలో మాత్రం లక్ష్యాలను అధిగమించక పోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో తమకు రూ.100 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని త్రివేణి సంస్థ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో.. సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం పోలవరం పనుల పురోగతిపై సమీక్షను నిర్వహిస్తుంటే.. కాంట్రాక్టు సంస్థలు బిల్లుల పంచాయతీగా మార్చేస్తున్నాయని అన్నారు. తాను లక్ష్యాలను ఎందుకు అధిగమించలేదని ప్రశ్నిస్తుంటే.. బిల్లులు రావాల్సి ఉందంటూ సమీక్ష పక్కదోవపట్టేలా మాట్లాడడం సరికాదన్నారు. గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సమయంలో త్రివేణీ సంస్థ మరోదఫా ప్రధాన కాంట్రాక్టు సంస్థ నుంచి తమకు రావాల్సిన రూ.100 కోట్ల బకాయిల గురించి ప్రస్తావించించింది. బిల్లుల పంచాయతీ సోమవారం నాటి సమీక్షలో వద్దంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై ట్రాన్స్‌స్ట్రాయ్‌ సంస్థ ఈడీ సాంబశివరావును వివరణ కోరారు. తాము బిల్లులను చెల్లిస్తున్నామని.. ఫిబ్రవరి నెల బిల్లు మార్చిలో వస్తుందని వివరణ ఇచ్చారు. 

 

 

Lol. evadi badha vaadidi.. :roflmao:  :roflmao:  :roflmao:

Link to comment
Share on other sites

Guest Urban Legend

Inspecting and Assessing the status of the progress of the Polavaram Project works-18th March

Inspected the Deep-cut excavation in the Polavaram Left main canal at Tetagunta village, running about 175 km, designed to carry about 11,000 cusecs of water to fill in the irrigation needs of enrouted villages and to meet the drinking water and industrial purposes of Visakhapatnam.
Instructing the Engineers to monitor the works with dedication on the daily basis to achieve weekly targets and also the representatives of the agencies to equip with necessary Resources - technical staff and extra machinery where necessary - to reach the weekly milestone set.
I've been closely monitoring investing all my efforts to release the water to the canals through Gravity by 2018 and also complete the dream project - the Vision of the Hon'ble Chief Minister Chandrababu Naidu by 2019.

 

https://www.facebook.com/DevineniUma/videos/1329334933819991/

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...