Jump to content

polavaram


Recommended Posts

పోలవరం సీడబ్ల్యూసీ డిజైన్లకు అనుమతులు
 
పోలవరం: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణానికి సంబంధించి సీడబ్ల్యూసీ డిజైన్లకు అనుమతి మంజూరు చేసింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కట్టడానికి దిగువన నిర్మించే స్పిలింగ్‌ బేసిన్‌ నిర్మాణంలో కాంక్రీట్‌ వేయడానికి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ 10 రకాల డ్రాయింగ్‌లకు అనుమతులు మంజూరు చేసింది.
Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరం బాధ్యత మాదే
 
636220259661214770.jpg
  • మరోమారు స్పష్టం చేసిన కేంద్రం
  • పెరిగిన అంచనాలు కేంద్రానికి అందలేదు
  • రాజ్యసభలో కేంద్రం వెల్లడి
 
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని, పోలవరానికి 100 శాతం నిధులను కేంద్రమే భరాయిస్తుందని, రెవెన్యూ లోటుతో పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని కూడా అందజేస్తున్నామని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. పోలవరంతో పాటు ఏపీ ప్యాకేజీలపై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఎం ఏ ఖాన్‌, వైసీపి సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజితసింగ్‌, జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌లు సమాధానమిచ్చారు.
 
ఏపీ ప్యాకేజీపై నీతి ఆయోగ్‌ 01.12.2015న ఒక నివేదికను ప్రధాని మోదీకి అందజేసినట్లు రావు పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టంతో పాటు 14వ ఆర్ధికసంఘం నివేదిక, విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టినప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన ప్రకటన, నీతి ఆయోగ్‌ నివేదిక ఆధారంగా 08.09.2016న కేంద్రం ఏపీకి ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. ఏపీ రెవెన్యూ లోటు భర్తీలో భాగంగా ఇప్పటికే రూ.3979.50 కోట్లు కేంద్రం చెల్లించిందని, మిగతా మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో ప్రతి ఏడాదీ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.2500 కోట్ల నిధులను మంజూరు చేసిందని, మరో రూ.1000 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. 01.4.2004 తర్వాత పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చును 100 శాతం కేంద్రమే భరాయిస్తుందని తెలిపారు. 2005-06 అంచనాల మేరకు పోలవరం నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.10,151.04 కోట్లు కాగా, 2010-11 అంచనాల మేరకు ఈ వ్యయం రూ.16,010.45 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. అయితే పోలవరం వ్యయంపై తాజాగా పెరిగిన అంచనాలకు సంబంధించిన నివేదిక కేంద్రానికి అందలేదని తెలిపారు.
 
ఏపీ విజ్ఞప్తి మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతలను ఆ రాష్ర్టానికే అప్పగించామని, నీతి ఆయోగ్‌ కూడా ఈ మేరకు సిఫారసు చేసిందని తెలిపారు. పోలవరానికి అయ్యే ఖర్చు మొత్తా న్ని నాబార్డ్‌ ద్వారా అందిస్తామని కేంద్ర మంత్రి సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌ తెలిపారు. ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు రూ.700 కోట్లను విడుదల చేయగా మరో రూ.1400 కోట్లను రానున్న నాలుగేళ్లలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో పలు విద్యాసంస్థలను నెలకొల్పామని వాటికి శాశ్వ త భవనాల నిర్మాణానికి కూడా నిధులను కేటాయించినట్లు తెలిపారు. పెట్రోలియం యూనివర్సిటీ, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలు తాత్కాలిక భవనాల్లో ప్రారంభమైనట్లు తెలిపారు. గుంటూరులో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిపారు.
Link to comment
Share on other sites

I doubt it...chesindi cheppukolekapote enta chesina waste..

people believe cheyyali antey results choodali, which is not possible in this term as polavaram is no small project. Unless people see a dam across and water stored its hard to make them believe of any progress made. Funny dailogue from a movie: "Adbutham jarigey mundu evaru gurthincharu, jarigaaka gurthinchalsina avasaram vundadhu" :P.   Pattiseema is supposed to show polavaram results to people because in this term pattiseema benefits ye choodagalaru people.  Polavaram benefits choodali antey inko term ivvali CBN ki. :)

Link to comment
Share on other sites

Guest Urban Legend

I doubt it...chesindi cheppukolekapote enta chesina waste..

 

 

 

e year and next yr monsoon sarigha vuntey evadu aapaledu victory ni

Link to comment
Share on other sites

మీకు గుణపాఠం నేర్పిస్తా!
 
636232360376277569.jpg
అడ్వాన్సులపై ఉన్న శ్రద్ధ పనులపై ఏదీ?
బావర్‌ కంపెనీపై సీఎం ఆగ్రహం
పోలవరం పనులపై తీవ్ర అసంతృప్తి
మట్టి పనులు సొంతంగా చేయించండి

అంతర్జాతీయ సంస్థలకు కాఫర్‌ డ్యాం
ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, లైజన్‌ ఆఫీసర్‌ను నియమించండి
జలవనరుల శాఖకు చంద్రబాబు ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అడ్వాన్సుల కోసం ఒత్తిడి చేయడంపై ఉన్న శ్రద్ధ పనులు చేయడంపై లేదంటూ పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు చేపట్టిన బావర్‌ కంపెనీ ప్రతినిధులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐ విల్‌ టీచ్‌ యూ ద లెసన్‌’ అంటూ మండిపడ్డారు. పోలవరం పనులపై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసహనం.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతివారం లక్ష్యాలను నిర్దేశిస్తున్నా వాటిలో 40 శాతం కూడా పూర్తికావడం లేదని, పనులు ఇలాగే జరిగితే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడం కష్టమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ మట్టి పనుల కోసం ప్రత్యేకంగా ఉప కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి, నేరుగా పనులు పర్యవేక్షిస్తూ నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. డయాఫ్రం వాల్‌, కాఫర్‌ డ్యాం నిర్మాణ బాధ్యతలను అంతర్జాతీయ సంస్థలకు అప్పగించాలన్నారు.

 
పోలవరానికి లైజన్‌ ఆఫీసర్‌
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సమీక్ష ప్రారంభమైన వెంటనే డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పనుల్లో వేగం, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ నిర్మాణం కోసం మట్టి తవ్వకం పనుల పురోగతిపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత కాంట్రాక్టు సంస్థలపై మండిపడ్డారు.ఇలాగైతే రెండేళ్లలో పనులు పూర్తవుతాయా అని నిలదీశారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) తెలియ జేయాల్సిన బాధ్యత లేదా అని జల వనరుల శాఖ అధికారులపైనా మండిపడ్డారు. తక్షణమే పోలవరం ప్రాజెక్టు కోసం ఒక లైజన్‌ ఆఫీసర్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ను నియమించాలని, వారు నిరంతరం పోలవరం పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సీఎంవోకు సమాచారం అందించాలని జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ను ఆదేశించారు.
 
పనుల్లో ప్రగతి ఏదీ?
పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జర్మనీ సంస్థ బావర్‌ - ఎల్‌ అండ్‌ టి తీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సమీక్షలోనూ అడ్వాన్సులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడం మినహా పనుల్లో వేగాన్ని చూపడం లేదంటూ బావర్‌ ప్రతినిధులపై మండిపడ్డారు. ఒకానొక సందర్భంలో ‘ఐ విల్‌ టీచ్‌ యు ద లెసన్‌’ అని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి రాష్ట్ర ప్రజల కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే కాంట్రాక్టు సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
   పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులు వేగంగా జరిగాయని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనుకున్న లక్ష్యం మేరకు పూర్తి చేశామని అన్నారు. కానీ పోలవరం ప్రధాన కట్టడం విషయంలో మాత్రం నిర్లక్ష్యం కన్పిస్తోందని, వారం వారం ప్రగతి ఏమాత్రం కన్పించడం లేదన్నారు. పనుల విషమంలో కఠినంగా వ్యవహరించాలని, బాధ్యతను విస్మరించిన కాంట్రాక్టు సంస్థలను తప్పించాలని శశిభూషణ్‌ కుమార్‌కు సీఎం ఆదేశించారు. స్పిల్‌ వే తవ్వకం పనులు పూర్తికాగానే, స్పిల్‌ చానల్‌కు యంత్రసామగ్రిని తరలించి పనులు మరింత వేగంగా పూర్తి చేస్తామని త్రివేణీ సంస్థ ప్రతినిధులు సీఎంకి వివరించారు. దీనిపైనా సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతివారం ఇదే చెబుతూ వస్తున్నారని మండిపడ్డారు.
 
కాంట్రాక్టు సంస్థలతో ఉన్నతాధికారుల భేటీ
పోలవరం పనుల ప్రగతిపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడడంతో సమీక్ష సమావేశం అనంతరం కాంట్రాక్టు సంస్థలతో జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌సా్ట్రయ్‌, బావర్‌ మధ్య నెలకొన్న విభేదాలను తక్షణమే పరిష్కరించుకొని, పనులు సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి సారించాలని కాంట్రాక్టు సంస్థలకు శశిభూషణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కాగా, ఈ సమీక్షలో మంత్రి దేవినేని ఉమ, జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

PV Ramesh

@RameshPV2010

#REC Board approved Rs.3,948 Crores for construction of Polavaram Hydro-electric Project. @RECLimited, @ncbn, @AndhraPradeshCM

 

Mana officer ye

Link to comment
Share on other sites

PV Ramesh

@RameshPV2010

#REC Board approved Rs.3,948 Crores for construction of Polavaram Hydro-electric Project. @RECLimited, @ncbn, @AndhraPradeshCM

 

Mana officer ye

 Also a power mottam manade as Andhra is executing it :jackson:  . CBN dobbamannadu center memu chestam ante.

Link to comment
Share on other sites

Guest Urban Legend

 Also a power mottam manade as Andhra is executing it :jackson:  . CBN dobbamannadu center memu chestam ante.

 

ivi highlight cheyyaru media ento ardham kaadhu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...