Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

అత్యధిక నాణ్యతతో ‘పోలవరం’: ఎస్‌ఈ రాజు
పోలవరం: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాంక్రీట్‌ పనులను అత్యధిక నాణ్యతతో చేస్తామని కాల్విటీ కంట్రోల్‌ ఎస్‌ఈ ఎంటీ రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీట్‌ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. బ్లాక్‌ 3, బ్లాక్‌ 4 ప్రాంతాల్లో వేసిన స్టీలు, కాంక్రీట్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో ప్రతీ నిర్మాణం కీలకమేనని, ప్రతీ విభాగంలో నూటికి నూరు శాతం నాణ్యత పాటించాల్సిదేనన్నారు. పోలవరం ప్రాజెక్టులో రోజూ సుమారు రెండు లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని జరుగుతున్నదని.. ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్‌. రమే్‌షబాబు తెలిపారు. పోలవరం స్పిల్‌వేలో కాంక్రీట్‌ పనులలో వేగం పెరిగింది. గత నెలలో సీఎం చంద్రబాబు నాయుడు కాంక్రీట్‌ పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 
 
Link to comment
Share on other sites



పోలవరం మట్టిపనులు వేగం 636209027705086816.jpg



  • సీఎం హెచ్చరికతో యంత్రాల మోహరింపు 
ఏలూరు/పోలవరం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఎర్త్‌ వర్క్‌కు సంబంధించిన పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు కొనసాగుతుండగా... ఎర్త్‌ వర్క్‌లో మాత్రం జాప్యం జరుగుతోందని సోమవారం నాటి సమీక్షలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం తో కాంట్రాక్టర్లలో భారీ స్పందన వచ్చింది. 24 గంటలు గడవకమునుపే స్పిల్‌వే వద్ద భారీ యంత్రాలను మోహరించారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పరిధిలో కోటీ 61 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ జరగాల్సి ఉండగా... ఇప్పటిదాకా కోటీ 51 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయ్యింది. ఈ నెల 29న డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నందున... మిగిలిన పది లక్షల క్యూబిక్‌మీటర్ల పనులను పూర్తి చేయడంపై కాంట్రాక్టు సంస్థలు దృష్టి పెట్టాయి.

Link to comment
Share on other sites

Guest Urban Legend

CM evenry monday warning isthey kaani pani cheyyara ....

e system maarali ....CBN bayam chupettu saami vaalaki ////ento e sari ne antha soft CM ni yekkada chudala

Link to comment
Share on other sites

1న డయాఫ్రమ్‌ వాల్‌ పనులు: దేవినేని
 
అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం డయాఫ్రం వాల్‌, గేట్ల నిర్మాణ పనులను ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నట్టు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మట్లాడారు. రెండు సీజన్లలో కాంట్రాక్టు పనులు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. మొదటి సీజన్లో 800 మీటర్లు, తర్వాత 800 క్యూబిక్‌ మీటర్లు నిర్మించేలా టాల్‌సా్ట్రయ్‌ కంపెనీతో బావర్‌, ఎల్‌అండ్‌టీసబ్‌ కాంట్రాక్టు కుదుర్చుకున్నట్టు చెప్పారు. వెయ్యి కోట్ల విలువైన యంత్ర పరికరాలను పనులు అయ్యేంతవరకు సైట్‌లోనే ఉంచేలా ఎల్‌అండ్‌టీ బావర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. 2018 జూన్‌ నాటికి గ్రావిటీతో నీరు నిల్వచేయడమే లక్ష్యమన్నారు. డాయాప్రంవాల్‌ పనుల నిర్మాణం వేగంగా జరిగేందుకు ఎల్‌అండ్‌టీ బావర్‌కు రూ.95 కోట్లు ముందస్తుగా చెల్లించడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.శ్రీకాకుళం జిల్లా వంశధార నిర్వాసితులకు ఇప్పటికే రూ.43 కోట్లు చెల్లించినట్టు మంత్రి తెలిపారు. నిర్వాసితులకు రూ.498 కోట్లు వెంటనే చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Link to comment
Share on other sites

 

పోలవరం పనులు భేష్‌: జీఎస్‌ ఝా

 

636212492100762316.jpg
హైదరాబాద్‌/ పోలవరం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్ర జల సంఘం చైర్మన్‌ జీఎస్‌ ఝా సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పోలవరం పనులను ఆయన పరిశీలించారు. పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండడం, ఫిబ్రవరి 1 నుంచి డయా ఫ్రమ్‌వాల్‌, గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా జరుగుతుండడంపై కేంద్రానికి నివేదిక అందిస్తానని వివరించారు.
Link to comment
Share on other sites

1 నుంచి డయాఫ్రమ్‌వాల్‌
 
636213337652732627.jpg
  • గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులూ ప్రారంభం
  • ఉదయం 10 గంటలకు ముహూర్తం
  • నేడు పోలవరం వర్చువల్‌ రివ్యూ రద్దు
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌, క్రస్ట్‌గేట్ల నిర్మాణ పనులకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు ఈ పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం జరిగే పూజాకార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలవరం వర్చువల్‌ రివ్యూను రద్దు చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు వద్దే సమీక్షిస్తారు.
 
దేశంలోనే అతి పెద్దది
సాగునీటి ప్రాజెక్టుల్లో... నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎ్‌ఫ)ను నిర్మిస్తారు. ఈ ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌కు దిగువన రాతి పొరల్లో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మిస్తారు. ఈ డయాఫ్రమ్‌వాల్‌లో ఎలాంటి వంకరలూ ఉండకూడదు. ఇందుకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలే కాకుండా నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన, నైపుణ్యం అవసరం. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పొడవు 1.75 కిలోమీటర్లు ఉంటుంది. దేశంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల కంటే ఇదే అతి పెద్దది. ఈ స్థాయిలో నిర్మాణ నైపుణ్యం కలిగిన సంస్థలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. అందులో జర్మనీకి చెందిన బావర్‌ ఒకటి. అందుకే... ఏపీ ప్రభుత్వం ఈ సంస్థ సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం రాతి పొరలు తగిలేదాకా వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి 100 మీటర్లలోతుకూ వెళ్లాల్సి ఉంటుంది.
 
 
రాతిపొర తగిలాక... 5 మీటర్ల వరకూ లోతుకు వెళ్లాలి. అక్కడి నుంచి డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం జరగాలి. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌సా్ట్రయ్‌కు ఉప కాంట్రాక్టు సంస్థగా ఉన్న బావర్‌- ఎల్‌అండ్‌టీ జాయింట్‌ వెంచర్‌ ఈ డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన యంత్రసామగ్రిని సన్నద్ధం చేసింది. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన మరో నిర్మాణం... క్రస్ట్‌గేట్లు. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు కలిగిన 48 క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇవి దేశంలోనే అతి పెద్దవి. ఈ గేట్లు పూర్తిగా హైడ్రాలజీ సిస్టమ్‌తో కూడి రిమోట్‌ కంట్రోల్‌తో పని చేస్తాయి. ఈ గేట్ల కోసం 15,000 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ అవసరం అవుతుంది. ఈ స్టీల్‌ను నేరుగా సరఫరా చేసేందుకు బిలాయ్‌, విశాఖ స్టీల్‌ ప్లాంట్లు అంగీకరించాయి. ఈ పనులు ప్రారంభమైతే క్రమంగా మిగిలిన పనులూ ఒకదానితర్వాత ఒకటిగా చేపట్టేందుకు వీలవుతుంది.
Link to comment
Share on other sites

పోలవరం వద్దే డిజైన్లు ఆమోదిస్తాం
 
  • సీడబ్ల్యూసీ నిర్ణయం.. 7 లేదా 9న రాక
హైదరాబాద్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు డిజైన్లను ఆమోదించే ప్రక్రియను ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోనే చేపట్టాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. ఇప్పటివరకూ ఢిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ ఈ డిజైన్ల ప్రక్రియపై సీడబ్ల్యూసీ సమీక్షిస్తూ వచ్చింది. కానీ, ఈ సారి ఏకంగా పోలవరం ప్రాజెక్టు సైట్‌లోనే డిజైన్లను పరిశీంచి, తగిన సలహాలూ సూచనలూ ఇచ్చి, ఈ మేరకు మార్పుచేసిన డిజైన్లను ఆమోదించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 7 లేదా 9న పోలవరం డిజైన్లపై సమీక్షకు సీడబ్ల్యూసీ వస్తుంది. ఈ డిజైన్ల పరిశీలన రెండు రోజులు ఉంటుంది.
 
ప్రాజెక్టు వద్ద నేడు మంత్రి ఉమ బస
డయాఫ్రమ్‌వాల్‌, క్రస్ట్‌గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులను బుధవారం సీఎం ప్రారంభించనున్నందున మంత్రి దేవినేని, అధికారులు మంగళవారం ఏర్పాట్లు పరిశీలించి.. రాత్రికి అక్కడే బస చేస్తారు.
Link to comment
Share on other sites

పోలవరంలో సంబరం
 
636215067074264584.jpg
  • డయాఫ్రమ్‌ వాల్‌, క్రస్ట్‌గేట్ల పనులకు నేడు శ్రీకారం
  • అత్యాధునిక యంత్రాలు సిద్ధం
  • సీఎంతో ప్రారంభం
పోలవరం/ఏలూరు, హైదరాబాద్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో మరో రెండు కీలక ఘట్టాలు నేడు ఆవిష్కృతం కానున్నాయి. అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌, క్రస్ట్‌గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.23 గంటలకు క్రస్ట్‌గేట్ల ఫ్యాబిక్రేషన్‌ పనులకు, 11.45 గంటలకు డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను సమీక్షించేందుకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రమే పోలవరం డ్యామ్‌ సైట్‌కు వెళ్లారు. మంగళవారం రాత్రి వారు అక్కడే బస చేశారు.
 
పనులు ఇలా జరుగుతాయి
నది అంతర్భాగంలో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మిస్తారు. దీనిపై ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మిస్తారు. ఇందుకోసం మీటరున్నర వెడల్పుతో సుమారు వంద మీటర్ల లోతు వరకూ తవ్వుతూ ముందుకెళ్లాలి. ఈ పనుల కోసం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను సిద్ధం చేశారు. ఇసుక, మట్టి వంటి వాటిని తొలగించేందుకు ట్రెంచ్‌ కట్టర్‌ను వాడతారు. ఇది గంటకు ఐదు మీటర్ల చొప్పున ముందుకు సాగుతుంది. ఎక్కడైతే రాతి పొరలు తగులుతాయో ఆ దశ నుంచి గ్రాబర్‌ అనే మరో యంత్రాన్ని వినియోగిస్తారు.
 
దీనితో రాతి పొరలను మరో మూడు మీటర్ల వరకూ తవ్వితీస్తారు. మొత్తం డయాఫ్రమ్‌ వాల్‌ పొడవు 1.75 కిలోమీటర్లు. ఇందులో తొలిదశలో 600 మీటర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాల్సి ఉంది.
 
ఈ పనుల కోసం ఇప్పటికే గోదావరి నదీ భాగంలో ఒక భారీ ట్రెంచ్‌(కందకం) తవ్వారు. కాంక్రీట్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే నాటికి ‘బెంటోనెట్‌’ అనే ప్రత్యేక ద్రావణాన్ని అంతర్భాగంలోకి పంపుతారు. బెంటోనెట్‌ వాడడం వల్ల ట్రెంచ్‌కు ఇరువైపులా ఉండే మట్టి, ఇసుక పొరలు కిందకు విరిగిపడవు. ఎరుపురంగులో ఉండే ఈ ద్రావణంలో ఒక తరహా మట్టిని మిశ్రమం చేస్తారు. దీనికిగాను సమీపంలోని బావర్‌ కంపెనీ ఎనిమిది బేసిన్‌లను ఏర్పాటు చేసింది. నిర్మాణ పనులు జరిగినన్నాళ్లూ మూడు పైపుల ద్వారా నిరవధికంగా ద్రావణాన్ని లోపలికి చేరవేస్తారు. దీంతోపాటే నిర్మాణ పనులు పూర్త య్యి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పటిష్టత కోసం ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ వాడతారు.
 
క్రస్ట్‌ గేట్ల తయారీలో 22 వేల మెట్రిక్‌ టన్నుల ఉక్కును వాడతారు. ఒక్కో గేటు 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. విశాఖ ఉక్కుతోనే ఎక్కువ క్రస్ట్‌ గేట్ల తయారీకి వీలుగా ప్రత్యేక స్టీల్‌ షీట్లను పోలవరానికి రప్పిస్తున్నారు. వాతావరణ పరంగా ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా వేసవిలో ఎక్కువ పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 
వాళ్ల కక్కుర్తి వల్లే జాప్యం: దేవినేని
కేవీపీ, జగన్‌ కమీషన్ల కక్కుర్తి వల్లే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ దండగన్న జగన్‌ మూర్ఖుడని మంత్రి విమర్శించారు. పట్టిసీమ వల్ల కృష్ణాడెల్టాలో రూ.6 వేల కోట్ల పంట పండిందన్నారు.
Link to comment
Share on other sites

పరిహారంపై అత్యాశ వద్దు: బాబు
 
636215959539881236.jpg
  • దుష్టులు, దుర్మార్గులు పోలవరాన్ని అడ్డుకుంటున్నారు 
  • రెచ్చిపోతే మనకే నష్టం.. ఎవరితోనూ రాజీపడను: సీఎం 
  • డయాఫ్రమ్‌వాల్‌, క్రస్ట్‌గేట్ల పనులకు శ్రీకారం 

ఏలూరు/పోలవరం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘వ్యవసాయంలో సంక్షోభం పోవాలి. అందుకే.. పోలవరం ప్రాజెక్టు కోసం అన్ని విధాలా కష్టపడుతున్నాం. రైతులకు ఉపయోగపడేలా పోలవరం పనులను ఒక కొలిక్కి తెస్తున్నాం. కానీ కొందరు దుష్టులు, దుర్మార్గులకు ఈ పని ఇష్టంలేనట్టుగా కనిపిస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తూ కుల, మతాలను రెచ్చగొడుతున్నారు. ఎవరైనా రెచ్చిపోతే అది మనకే నష్టం. పోలవరం ప్రాజెక్టులో కులమతాలు లేవు. ఇప్పుడు చేసే పనులన్నీ వీటికి అతీతమే. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులకు, క్రస్టు గేట్ల తయారీకి బుధవారం ఆయన లాంఛనంగా శ్రీకారం చుట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిధిలో అన్ని పనులూ ప్రారంభించామని, ఇప్పుడు ప్రాజెక్టుకు గుండెకాయ వంటి డయాఫ్రమ్‌వాల్‌ పనులను ప్రారంభించామని వ్యాఖ్యానించారు. ‘ఇది అత్యంత కీలకం. అందుకనే భారీ యంత్రాలను రప్పించాం. దుబాయ్‌లో అత్యంత ఎత్తయిన బుర్జ్‌ఖలీఫా నిర్మాణాన్ని పూర్తి చేసిన జర్మనీ కంపెనీ బావర్‌, ఎల్‌అండ్‌టీ కంపెనీలు ఇప్పుడు డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాయి. సుమారు 70 వేల చదరపు మీటర్ల డయాఫ్రమ్‌వాల్‌ పనులను ఈ ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి. 150 మీటర్లు భూగర్భంలోకి వెళ్లే యంత్రాలను తీసుకొచ్చారు. ఇసుక, మెటల్‌, వాటర్‌, బెంటినెట్‌ ద్రావణం మొత్తం కలిపితే ఒక క్యూబిక్‌ మీటర్‌కు 363 కిలోలు వాడతారు. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులను రెండుగా విడదీశాం. మొదటి భాగం ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతుంది. క్రస్టల్‌ రేడియల్‌ గేట్లు ప్రపంచంలోనే అతి పెద్ద గేట్లు. వీటి నిర్మాణానికి విశాఖ, బిలాయ్‌ ఉక్కు కర్మాగారం నుంచి స్టీలు ప్లేట్లు రప్పిస్తున్నారు’ అని అన్నారు. పోలవరానికి రెండో విడత నిధులు త్వరలో అందుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ భూసేకరణ కింద ఇంకా 27 వేల ఎకరాలు 2babu2.jpgభూమి సేకరించాల్సి ఉందని చెప్పారు. భూములు కోల్పోతున్న రైతులు అత్యాశకు పోవద్దని సీఎం అన్నారు. ‘నష్టం లేకుండా పరిహారం ఇస్తామని పదేపదే చెప్తున్నాం. 2013 భూసేకరణ చట్ట ప్యాకేజీ ఇస్తామన్నాం. కానీ ఈ లోపు కొందరు కోర్టులకు ఎక్కుతున్నారు. ఇది ఏ మాత్రమూ మంచిదికాదు. పోలవరం కోసం కోర్టుల్లో వాదనలు వినిపించుకోవాల్సి వస్తోంది. దుర్మార్గులను దూరంగా పెట్టండి. న్యాయం ఉంటే నా అంతట నేనే న్యాయం చేస్తా’ సీఎం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనూ రాజీపడే ప్రశ్నేలేదని పునరుద్ఘాటించారు. ‘ప్రజలే హైకమాండ్‌. ఇంకెవరూ లేరు’ అని స్పష్టం చేశారు. తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నవారు జైలుకు పోయారని, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, వాళ్లు మనకు ఆదర్శమా?.. అని పరోక్షంగా జగన్‌ ఉద్దేశిస్తూ ప్రశ్నించారు

Link to comment
Share on other sites

పోలవరం సీడబ్ల్యూసీ డిజైన్లకు అనుమతులు
 
పోలవరం: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణానికి సంబంధించి సీడబ్ల్యూసీ డిజైన్లకు అనుమతి మంజూరుచేసింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కట్టడానికి దిగువన నిర్మించే స్పిలింగ్‌ బేసిన్‌ నిర్మాణంలో కాంక్రీట్‌ వేయడానికి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ పది రకాల డ్రాయింగ్‌లకు అనుమతులు మంజూరు చేసింది. గత నెలలో ప్రాజెక్టు ప్రాంతానికి పరిశీలించడానికి వచ్చిన సీడబ్ల్యూసీ సీఈ ఎస్‌ఎన్ సిన్హా, డిప్యూటి డైరెక్టర్‌ శయ్యాం మహ్మద్‌ ఢిల్లీ వెళ్లి 5వ తేదీన డ్రాయింగ్‌లకు అనుమతి ఇచ్చినట్లు ప్రాజెక్టు ఈఈ కుమార్‌ తెలిపారు. తొందరలో ఈ స్పిలింగ్‌ బేసింగ్‌ ప్రాంతాన్ని జియలాజికల్‌ సర్వే ఆప్‌ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు జివికె ప్రసాద్‌ నేతృత్వంలో స్పిలింగ్‌ బేసిన్‌లో రాక్‌ నాణ్యత సంబంధించిన పరీక్షలు పూర్తిచేస్తారని తొందరలోనే ఈ ప్రాంతంలో కాంక్రీట్‌ వేస్తామని చెప్పారు. మొత్తం ఈ స్పిలింగ్‌ బేసిన్‌లో 2 లక్షల 71 వేయి క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయాల్సి ఉందన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...