Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరం స్పిల్‌వే ఆకృతులకు జలసంఘం ఆమోదం

నిర్మాణ ప్రాంతంలో పరీక్షలు జరిపిన సీనియర్‌ జియాలజిస్టు

కాంక్రీటు పనుల ప్రారంభ తేదీ త్వరలో ఖరారు

ఈనాడు, అమరావతి/పోలవరం, న్యూస్‌టుడే

15ap-main4a.jpg

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ‘స్పిల్‌వే’ ఆకృతులకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం తెలిపింది. గురువారం ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అధికారులకు వర్తమానం పంపింది. కొద్దిరోజులుగా స్పిల్‌వే ఆకృతులకు అనుమతుల కోసం కొందరు అధికారులు దిల్లీలో ఉండి మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. జలసంఘం అధికారులు బుధవారం చేసిన సూచనల మేరకు ఆకృతులకు కొన్ని మార్పులు చేయగా, గురువారం అనుమతులు లభించాయి.

పునాదుల్లో రాయికి పరీక్షలు

స్పిల్‌వే వద్ద తవ్వకాలు జరిపినప్పుడు రాతి మధ్య ‘షియర్‌ జోన్‌’ ఉన్నట్లు రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు అనుమానించారు. ఆ పరిస్థితుల్లో స్పిల్‌వే ఫౌండేషన్‌కు మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని భావించారు. గురువారం సాయంత్రం స్పిల్‌వే నిర్మాణానికి తీసిన పునాదుల్లోని రాయిని ‘భారత భూభౌతిక పరిశోధన సంస్థ(జీఎస్‌ఐ)’కు చెందిన సీనియర్‌ జియాలజిస్ట్‌ జీజేఎస్‌ ప్రసాద్‌ స్వయంగా పరీక్షించారు. సుత్తితో కొట్టి రాయి గట్టితనాన్ని తెలుసుకున్నారు. అక్కడ షియర్‌ జోన్‌ లేదని, కాంక్రీటు పనులకు, ఫౌండేషన్‌ పనులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టంచేశారు. స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో 90 శాతం గట్టిరాయి తగిలిందని, ఇలా ఉండటం అరుదని ఆయన మీడియాతో చెప్పారు. స్పిల్‌వే నిర్మించనున్న చోట మైకా, ఫిలాష్‌ పర్రా, కార్డు రాయి ఉందని, వీటిల్లో ఒక్కొక్క రాయి ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుందని వివరించారు. ప్లేట్‌లోడ్‌, పర్మియబిలిటీ పరీక్షలు చేయించాల్సిందిగా గతంలో జలవనరులశాఖ అధికారులను ఆదేశించామని, ఆ పరీక్షల నివేదికను విశ్లేషించిన తర్వాత పనులకు బ్లాక్‌ల వారీగా అనుమతులు ఇస్తామని వివరించారు. వందల ఏళ్లు ఉండాల్సిన జాతీయ ప్రాజెక్టు కావడంతో ‘జీఎస్‌ఐ’ నిబంధనల ప్రకారం పనులు చేస్తామని, ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాంక్రీట్‌ పనులపై తామే నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

ఈ నెల 19న స్పిల్‌వే కాంక్రీటు పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో తేదీ ఖరారు కానుంది. ఈ పనులను ప్రారంభించే రోజు పెద్దయెత్తున సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన వేదికను చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి.

 

పోలవరానికి రూ.5810.72 కోట్ల రుణం మంజూరు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రూ.5810.72 కోట్ల రుణం మంజూరైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వర్తమానం అందింది. సీఎం చంద్రబాబుగురువారం శాఖాధిపతుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. డిసెంబర్‌ 26న ఇందుకు సంబంధించి దిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కేంద్ర మంత్రి ఉమాభారతి, నాబార్డు అధికారులతో ఆ రోజు ఒప్పందం కుదుర్చుకుంటారు. అదే రోజు పోలవరానికి కేంద్రసాయం తొలి విడత సొమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిస్తారు. ముఖ్యమంత్రిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. 2010-11 లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.5810.72 కోట్లు ఇవ్వాల్సి ఉంది. తొలి విడతగా 2981.54 కోట్లు ఇవ్వనున్నారు. 2014 ఏప్రిల్‌ తర్వాత పోలవరంపై రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో కేంద్రం ఇచ్చిన సొమ్ములు మినహాయించగా ఇంకా రూ.1981.54 కోట్లు రావాల్సి ఉంది. దీనికి మరో రూ.1000 కోట్లు కలిపి తొలివిడతగా ఇవ్వాలని నిర్ణయంచారు.

Link to comment
Share on other sites

పోలవరం చకచకా

‘స్పిల్‌ వే’ నిర్మాణానికి అంతా సిద్ధం!

కీలక దశకు చేరిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ

వినియోగంలో భారీ ఆధునిక యంత్ర సామాగ్రి

రాత్రి.. పగలు కొనసాగుతున్న పనులు

పోలవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

16ap-main2a.jpg

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన స్పిల్‌ వే కాంక్రీటు పనులు కొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. అంతే ప్రాధాన్యమున్న ‘డయాఫ్రం వాల్‌’ నిర్మాణ పనులు జనవరిలో ఆరంభించనున్నారు. వీటికి సంబంధించిన సన్నాహకాలన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం వందలాది టిప్పర్లు, ఎక్సవేటర్లు.. అమెరికా, బెలారస్‌ల నుంచి తీసుకొచ్చిన భారీ యంత్రసామాగ్రి, వేలాది మంది పనివాళ్లతో ప్రాజెక్టు ప్రాంతం కిక్కిరిసి కనిపిస్తోంది. ఇదే వేగంతో పనులు కొనసాగితే రాబోయే కొన్నేళ్లలో ప్రాజెక్టుకు ఒకస్పష్టమైన రూపం వస్తుందనే భావన కలుగుతుంది. స్పిల్‌ వేకి, నదీమార్గాన్ని మళ్లించేందుకు కొండల్ని తొలగిస్తున్నారు. రాత్రి, పగలు పనులు సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది...?ఇన్నాళ్లూ ఏ నోట విన్నా వినిపించే సాధారణ ప్రశ్న ఇది. ఇప్పుడు పోలవరం క్షేత్రానికి వచ్చి ఎవరు చూసినా ఈ ప్రశ్న ఇక అడగరు. ఇదే వేగంతో పనులు ముందుకు సాగాలని కోరుకుంటారు.

స్పిల్‌ వే కాంక్రీట్‌కు అంతా సిద్ధం...

సాధారణంగా ఏ ప్రాజెక్టులోనైనా నది ప్రవాహ మార్గంలోనే స్పిల్‌ వే, గేట్లు, ఆ పక్కనే డ్యాం ఉంటాయి. ఇక్కడ నిర్మాణం భిన్నమైంది. భూభౌతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నదిని పక్కకు మళ్లిస్తున్నారు. గ్రామాలున్న ప్రదేశంలో స్పిల్‌ వే ఏర్పాటుచేస్తున్నారు. నదిని మళ్లించేందుకు వీలుగా కిలోమీటరు వెడల్పున ప్రత్యేకంగా కాలువలా (అప్రోచ్‌ ఛానల్‌) తవ్వుతున్నారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, పైలెట్‌ ఛానల్‌ ద్వారా తిరిగి నది తన సహజ ప్రవాహ మార్గంలో కలిసిపోతుంది. స్పిల్‌ వే పునాది నిర్మాణానికి అవసరమైన పని దాదాపు పూర్తయింది. రెండు కొండల మధ్య నిర్మించే స్పిల్‌ వే కోసం...కొండల్ని అనువుగా తొలచటం పూర్తయింది. కాంక్రీట్‌ పనుల ప్రారంభానికి జియాలజిస్టులు తుది అనుమతులిచ్చారు. స్పిల్‌ వే ఆకృతులకు కేంద్ర జలసంఘమూ అనుమతులిచ్చింది. కాంక్రీటు పని ప్రారంభం కావడమే తరువాయి.

16ap-main2b.jpg

రోజుకు 4.82 లక్షల మెట్రిక్‌ టన్నుల మట్టి తవ్వకం.. అన్ని పనులకు సంబంధించి ప్రస్తుతం రోజుకు సగటున 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వుతున్నారు. ఒక క్యూబిక్‌ మీటరు 2.41 మెట్రిక్‌ టన్నులతో సమానం. (ఒక మెట్రిక్‌ టన్నుకు వెయ్యి కేజీలు.) ఈ పనుల కోసం 111 ఎక్స్‌కవేటర్లు, 459 డంపర్లు వినియోగిస్తున్నారు. లైబర్‌ 996 మోడల్‌ ఎక్స్‌కవేటర్‌ ఇక్కడ మట్టి తవ్వకం పనుల్లో చురుగ్గా పని చేస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి యంత్రాలు రెండే ఉన్నాయని ఇక్కడి ఇంజినీర్లు చెబుతున్నారు. అందులో ఒకటి ఇక్కడ పోలవరం పనుల్లో ఉపయోగిస్తున్నారు. దీని విలువ రూ.81 కోట్లు. ఇది పని చేసేటప్పుడు గంటకు 400 లీటర్ల డీజిలు అవసరమవుతుంది. ఇందులో ఉన్న బకెట్‌ 35 క్యూబిక్‌ మీటర్ల మట్టిని ఒకేసారి తీస్తుంది. బెలాజ్‌ డంపర్లు ఆరింటిని ఇక్కడ వాడుతున్నారు. ఇది ఒక్కొక్కటి ఒకేసారి 240 టన్నుల మట్టిని తీసుకుపోతుంది. రష్యాలోని బెలారస్‌ నుంచి వీటిని తీసుకువచ్చారు.

కిలోమీటరు పొడవునా స్పిల్‌ వే.. ప్రాజెక్టులో 1.128 కిలోమీటర్ల మేర స్పిల్‌వే నిర్మించాలి. మొత్తం 17 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పోయాలి. రోజుకు 3000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పోసేలా ఏర్పాట్లు చేశారు. స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్‌, స్పిల్‌ ఛానల్‌లోనే మొత్తం 35 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయాల్సి ఉంటుంది. పెంటా కంపెనీకి చెందిన కాంక్రీటు బ్యాచింగ్‌ ప్లాంట్లు 3 తీసుకొచ్చారు. ఇవన్నీ కలిపి గంటకు 720 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పోస్తాయి.

టెలీబెల్టులు: కాంక్రీటును 150 మీటర్లు దూరం వరకు తీసుకువెళ్లి పోసే టెలీబెల్ట్‌ ఒకటి, 38 మీటర్ల దూరం వరకు తీసుకువెళ్లి కాంక్రీటు పోసే టెలీబెల్టులు మరో మూడు స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల్లో వినియోగించనున్నారు.

16ap-main2c.jpg

16ap-main2e.jpg

16ap-main2f.jpg

16ap-main2g.jpg

16ap-main2d.jpg

 
Link to comment
Share on other sites

పోలవరం కాంక్రీట్‌ పనులు వాయుదా
 
  • షియర్‌ జోన్‌ ఉండటమే కారణం 
  • దాని ప్రభావంపై జీఎస్‌ఐ అధ్యయనం 
హైదరాబాద్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఈ నెల 19న ప్రారంభం కావల్సిన పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులు వాయిదా పడ్డాయి. డ్యామ్‌ ప్రధాన కట్టడం వద్ద షియర్‌ జోన్‌ (గుల్ల రాళ్లు) కన్పించడమే ఇందుకు కారణం. వాటిని తొలగించి నేలను దృఢత్వం చేసే పనులను తక్షణమే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎ్‌సఐ) శాస్త్రవేత్త ప్రసాద్‌ సూచించారు. జీఎ్‌సఐ నివేదిక వచ్చేలోగా వాటర్‌ పర్మియాలిటీ టెస్ట్‌ చేయాలని పోలవరం చీఫ్‌ ఇంజనీరు రమేశ్‌బాబును కోరారు. వాస్తవానికి ఈ నెల 13న జరిగిన పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్షా సమయంలోనే డ్యామ్‌ ప్రధాన కట్టడం వద్ద షియర్‌ జోన్‌ కన్పించిందని సీఎం చంద్రబాబుకు జల వనరుల శాఖ ఇంజనీర్లు, ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌సా్ట్రయ్‌ తెలిపాయి. జీఎ్‌సఐ సీనియర్‌ శాస్త్రవేత్త ప్రసాద్‌ ప్రధాన డ్యామ్‌ వద్ద పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కసారిగా షియర్‌ జోన్‌ కన్పించిందని, ప్రధాన కట్టడం వద్ద గుల్లతో కూడిన రాళ్లు ఉండడం వల్ల వాటిని తొలగించి అక్కడ సిమెంట్‌ కాంక్రీటింగ్‌ చేయడమో లేదా గుల్ల రాళ్లకు సిమెంటింగ్‌ చేయడమో చేయాల్సి ఉంటుందని జల వనరుల శాఖ అధికారులు వివరించారు. జీఎ్‌సఐ శాస్త్రవేత్త ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని కాంక్రీట్‌ పనులు ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు.
 
ఈ నేపథ్యంలో షియర్‌ జోన్‌పై అధ్యయనం చేసేందుకు జీఎ్‌సఐ సీనియర్‌ శాస్త్రవేత్త ప్రసాద్‌ 15వ తేదీన వచ్చారు. షియర్‌ జోన్‌పై అధ్యయనం చేపట్టిన ప్రసాద్‌.. ఎప్పటికప్పుడు మ్యాపింగ్‌, డ్రాయింగ్‌లను రూపొందిస్తూ ప్రత్యామ్నాయంపై నివేదికలను సిద్ధం చేశారు. వాటర్‌ పర్మియాలిటీ పరీక్షలు నిర్వహించాలని చీఫ్‌ ఇంజనీరు రమేశ్‌బాబుకు సూచించారు. ఈ పరీక్షల కోసం షియర్‌ జోన్‌ ఉన్న ప్రాంతంలో బోర్‌వెల్‌ వేస్తారు. ఈ బోర్‌వెల్‌లోకి నీటిని పంపుతారు. ఈ నీరు లోపలకు ఎంత వేగంతో వెళ్తుందో లెక్కిస్తారు. భూమిలోకి నీరు వెళ్లే వేగాన్ని బట్టి.. షియర్‌జోన్‌ ప్రభావాన్ని అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న అట్టహాసంగా చేపట్టాలనుకున్న పోలవరం కాంక్రీట్‌ పనుల ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

పోలవరం కాంక్రీట్‌ పనులు వాయుదా

 

  • షియర్‌ జోన్‌ ఉండటమే కారణం 
  • దాని ప్రభావంపై జీఎస్‌ఐ అధ్యయనం 
హైదరాబాద్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఈ నెల 19న ప్రారంభం కావల్సిన పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులు వాయిదా పడ్డాయి. డ్యామ్‌ ప్రధాన కట్టడం వద్ద షియర్‌ జోన్‌ (గుల్ల రాళ్లు) కన్పించడమే ఇందుకు కారణం. వాటిని తొలగించి నేలను దృఢత్వం చేసే పనులను తక్షణమే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎ్‌సఐ) శాస్త్రవేత్త ప్రసాద్‌ సూచించారు. జీఎ్‌సఐ నివేదిక వచ్చేలోగా వాటర్‌ పర్మియాలిటీ టెస్ట్‌ చేయాలని పోలవరం చీఫ్‌ ఇంజనీరు రమేశ్‌బాబును కోరారు. వాస్తవానికి ఈ నెల 13న జరిగిన పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్షా సమయంలోనే డ్యామ్‌ ప్రధాన కట్టడం వద్ద షియర్‌ జోన్‌ కన్పించిందని సీఎం చంద్రబాబుకు జల వనరుల శాఖ ఇంజనీర్లు, ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌సా్ట్రయ్‌ తెలిపాయి. జీఎ్‌సఐ సీనియర్‌ శాస్త్రవేత్త ప్రసాద్‌ ప్రధాన డ్యామ్‌ వద్ద పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కసారిగా షియర్‌ జోన్‌ కన్పించిందని, ప్రధాన కట్టడం వద్ద గుల్లతో కూడిన రాళ్లు ఉండడం వల్ల వాటిని తొలగించి అక్కడ సిమెంట్‌ కాంక్రీటింగ్‌ చేయడమో లేదా గుల్ల రాళ్లకు సిమెంటింగ్‌ చేయడమో చేయాల్సి ఉంటుందని జల వనరుల శాఖ అధికారులు వివరించారు. జీఎ్‌సఐ శాస్త్రవేత్త ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని కాంక్రీట్‌ పనులు ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు.

 
ఈ నేపథ్యంలో షియర్‌ జోన్‌పై అధ్యయనం చేసేందుకు జీఎ్‌సఐ సీనియర్‌ శాస్త్రవేత్త ప్రసాద్‌ 15వ తేదీన వచ్చారు. షియర్‌ జోన్‌పై అధ్యయనం చేపట్టిన ప్రసాద్‌.. ఎప్పటికప్పుడు మ్యాపింగ్‌, డ్రాయింగ్‌లను రూపొందిస్తూ ప్రత్యామ్నాయంపై నివేదికలను సిద్ధం చేశారు. వాటర్‌ పర్మియాలిటీ పరీక్షలు నిర్వహించాలని చీఫ్‌ ఇంజనీరు రమేశ్‌బాబుకు సూచించారు. ఈ పరీక్షల కోసం షియర్‌ జోన్‌ ఉన్న ప్రాంతంలో బోర్‌వెల్‌ వేస్తారు. ఈ బోర్‌వెల్‌లోకి నీటిని పంపుతారు. ఈ నీరు లోపలకు ఎంత వేగంతో వెళ్తుందో లెక్కిస్తారు. భూమిలోకి నీరు వెళ్లే వేగాన్ని బట్టి.. షియర్‌జోన్‌ ప్రభావాన్ని అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న అట్టహాసంగా చేపట్టాలనుకున్న పోలవరం కాంక్రీట్‌ పనుల ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది.

 

 

 

స్పిల్‌వే వద్ద తవ్వకాలు జరిపినప్పుడు రాతి మధ్య ‘షియర్‌ జోన్‌’ ఉన్నట్లు రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు అనుమానించారు. ఆ పరిస్థితుల్లో స్పిల్‌వే ఫౌండేషన్‌కు మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని భావించారు. గురువారం సాయంత్రం స్పిల్‌వే నిర్మాణానికి తీసిన పునాదుల్లోని రాయిని ‘భారత భూభౌతిక పరిశోధన సంస్థ(జీఎస్‌ఐ)’కు చెందిన సీనియర్‌ జియాలజిస్ట్‌ జీజేఎస్‌ ప్రసాద్‌ స్వయంగా పరీక్షించారు. సుత్తితో కొట్టి రాయి గట్టితనాన్ని తెలుసుకున్నారు. అక్కడ షియర్‌ జోన్‌ లేదని, కాంక్రీటు పనులకు, ఫౌండేషన్‌ పనులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టంచేశారు.

 

 

 

ento e media ninna oka article dhaniki complete contrast ga e roju oka article .

edo okati strong ga build cheyyali

Link to comment
Share on other sites

పోలవరం నిర్మాణం ఒక స‘వాల్‌’

ఇలాంటి కట్టడం ఇంతవరకు ఎక్కడా లేదు

1500 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం.. 90 మీటర్ల లోతున గోడ నిర్మాణం

ఆపైన మట్టి, రాతి కట్ట (డ్యాం) నిర్మాణం

భారీ యంత్రపరికరాలు, మిక్సింగ్‌ ప్లాంట్లు సిద్ధం

పోలవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

17ap-main2a.jpg

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక సవాల్‌... ఏ ఇంజినీరింగు నిపుణుడిని ప్రశ్నించినా చెబుతున్న మాటిదే. కొందరి మాటల్లో చెప్పాలంటే ఈ ప్రాజెక్టు చైనాలోని త్రిగార్జెస్‌తో పోల్చదగ్గది. 50లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి అనువుగా నిర్మించిన ప్రాజెక్టు ఇంతవరకు దేశంలోనే లేదు. డయాఫ్రం వాల్‌ పద్ధతిలో పునాది నిర్మించి ఆ పైన మట్టి, రాతి డ్యాం నిర్మించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనిని ప్రభుత్వం వివిధ విభాగాలుగా విడగొట్టి ఉపగుత్తేదారులకు కొంత అప్పచెప్పించింది. ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ కొంత మట్టి పని ప్రధానమైన కాంక్రీటు పని చేస్తోంది. మట్టి తవ్వకం కొంత పనిని త్రివేణి సంస్థ చేస్తోంది. డయా ఫ్రం వాల్‌ నిర్మాణం ఎల్‌ అండ్‌ టీ బావర్‌ కంపెనీకి అప్పగించారు. ప్రధాన గుత్తేదారుసంస్థతో ఒప్పందం మేరకు వీరు ఈ పనిలోకి వచ్చారు.

17ap-main2b.jpg

డయా ఫ్రం వాల్‌...ఎక్కడ...ఎందుకు?

ప్రవాహ మార్గంలో డ్యాం, స్పిల్‌ వే కట్టడం ఏ ప్రాజెక్టులోనైనా సహజం. ఇక్కడ నది మార్గాన్ని మళ్లించి అక్కడ స్పిల్‌ వే నిర్మిస్తున్నారు. డ్యాం (మట్టి, రాతికట్ట) మాత్రం గోదావరి సహజ మార్గంలోనే కడుతున్నారు. గోదావరి మధ్యలోనే రెండు కొండలమధ్య మట్టిరాతి కట్టతో డ్యాం నిర్మిస్తారు. ఈ డ్యాం నిర్మాణంలో దిగువన పునాదిగా నిర్మించే గోడే డయా ఫ్రం వాల్‌.

* బావర్‌ కంపెనీ తన పెద్దపెద్ద కట్టర్‌లు, గ్రాబర్‌లతో నదిలోపలకు తవ్వుకుంటూ వెళ్తుంది. 1.5 మీటర్ల మందంతో ప్యానెల్‌ దింపుతారు. ఆ ప్యానెల్‌ దింపే సమయంలో ఆ పక్కన ఉన్న ఇసుక ఆ ఖాళీలోకి పడిపోకుండా బెంటనైట్‌ (బంకలాంటి ద్రావణం)తో నింపుతారు. ఆ తర్వాత ఆ స్థలంలో కాంక్రీటు పోస్తూ ఉంటే అందులోని బెంటనైట్‌ బయటకు వచ్చేస్తుంది. అంటే 1500 మీటర్ల పొడవునా 90 మీటర్ల లోతులో 1.5 మీటర్ల మందంతో నిర్మించే గోడే డయాఫ్రం వాల్‌. ప్రపంచంలోనే ఇంత పెద్ద డయాఫ్రంవాల్‌ నిర్మించలేదు. దీనిపైన మట్టిరాయి మేళవించి 300 మీటర్ల వెడల్పున డ్యాం నిర్మిస్తారు.

17ap-main2c.jpg

* డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో ప్లాస్టిక్‌ కాంక్రీటును వినియోగిస్తారు.. సిమెంట్‌ తదితరాలతో పాటు బెంటనైట్‌ కలపడం వల్ల దీన్ని ప్లాస్టిక్‌ కాంక్రీటు అంటారు. ఈ కాంక్రీటు మరీ గట్టి పడకపోవడం వల్ల భూకంపాల సమయంలో విరగకుండా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్‌ కాంక్రీటు కోసం ఇక్కడ ప్రత్యేకంగా తయారీ యూనిట్లు రెండు ఏర్పాటు చేశారు.

కాఫర్‌ డ్యాంల నిర్మాణం

రాతి, మట్టి కట్టడానికి రెండు వైపులా కాఫ¾ర్‌ డ్యాం నిర్మిస్తారు. ఆ కాఫర్‌ డ్యాం నిర్మాణం తర్వాతే రాతిమట్టితో అసలు డ్యాం నిర్మిస్తారు. కాఫర్‌ డ్యాంలు కూడా ఒక రకంగా చిన్న సైజు డ్యాం వంటివేే. ఇవి కూడా నదిలోపల 20 మీటర్ల వరకు షీట్‌పైల్స్‌ వేసి పునాది నిర్మించి ఆపైనే కాఫర్‌ డ్యాం నిర్మిస్తారు.

డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సిద్ధంగా యంత్రపరికరాలు * బావర్‌ఎంసీ128 కట్టర్‌: దీని విలువ రూ.120 కోట్లు. బావర్‌ కంపెనీ దీన్ని ప్రత్యేకంగా రూపొందించుకుంది. ఇంతవరకు కేవలం 60, 70 మీటర్ల లోతుకు వెళ్లి మాత్రమే పని చేసే పరిస్థితి. ఇప్పుడు గోదావరిలో పునాది (డయాఫ్రం వాల్‌) కోసం కొన్ని చోట్ల 100 మీటర్ల లోతుకు వెళ్లాలి ఉంటుంది. 60 మీటర్లు దాటిన తర్వాత ఇది భూమిని తవ్వుతుంది. ఈ డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో భాగంగా 2.8/1.5 మీటర్ల ప్యానెల్‌ అవసరం. దీంతో లోపలకు పంపి కాంక్రీటు పోస్తారు.

* బావర్‌ ఎంసీ96 గ్రాబర్‌: బాగా లోతుకు వెళ్లి మరీ ఇది భూమిని తవ్వుతుంది. దీని విలువ రూ.70 కోట్లు 

* బావర్‌ ఎంసీ 40 కట్టర్‌: ఇది 40, 50 మీటర్ల లోతు వరకు వెళ్లి పని చేస్తుంది. 

* చిజిలర్స్‌: గ్రాబర్‌లు మట్టిని మాత్రమే తీయగలవు. ఈ చిజిలర్స్‌ ప్రత్యేక పరిస్థితుల్లో రాయను కూడా కోయగల సామర్థ్యం కలిగి ఉంటాయి.

కాంక్రీట్‌ పనులకు సమాయత్తం పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతం ఐదు బ్లాకుల్లో కాంక్రీట్‌ వేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్‌ రమేష్‌బాబు చెప్పారు. స్పిల్‌వే ప్రాంతంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. భారత భూగర్భ పరిశోధన కేంద్రం జియాలజిస్టుల సూచనల మేరకు రాతి పొరలమధ్య నీటి (పర్మియాబిలిటీ) పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ పరీక్ష చేయడానికి దాదాపు ఏడు గంటల సమయం పడుతుందన్నారు. ఈ నెల 19నాటికి కాంక్రీట్‌ పనులకు సన్నద్ధం కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు చేస్తున్నట్లు ఎస్‌ఈ పేర్కొన్నారు. రాయి తగిలే వరకు....

17ap-main2d.jpg

నదిలో లోపలి నుంచి డయాఫ్రం వాల్‌ నిర్మించాలి. గోదావరిలో ఇసుక, మట్టి, ఆ కింద రాయి ఉంటుంది. గోదావరిలో ఎక్కడ రాయి తగులుతుందో అంత లోతుకు వెళ్లాలి. రాయి తగిలిన చోట రాయిలోకి 2 మీటర్ల లోపల నుంచి ఈ డయాఫ్రం వాల్‌ నిర్మించుకుంటూ రావాలి. గోదావరిలో కొన్ని చోట్ల 40 మీటర్ల లోతునే రాయి తగులుతోంది. మరికొన్ని చోట్ల 90 మీటర్ల లోతున రాయి ఉంది. అక్కడి నుంచి కట్టుకుంటూ రావాలి. 17ap-main2e.jpg
 
Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ... ఈనెలాఖరులో పోలవరం కాంక్రీట్‌పనుల ప్రారంభంకానున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు హాజరవుతారని మంత్రి తెలిపారు. అలాగే... పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.

Link to comment
Share on other sites

పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష

19brk92a.jpg

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కీలక దశకు చేరుకోవడంతో అత్యంత నైపుణ్యం కలిగిన వారే పనుల్లో భాగస్వాములు అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే పోలవరం సమీక్షలో భాగంగా ప్రాజెక్టు పనులపై ఆయన వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. పోలవరం పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి పనుల పురోగతిని ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ట్రాన్స్‌టాయ్‌, త్రివేణి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గడచిన వారం పనుల లక్ష్యంలో 72శాతం పూర్తి చేయగలిగామని ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ రమేష్‌కుమార్‌ ముఖ్యమంత్రికి తెలిపారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు ఈ నెల 30న ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నాబార్డ్‌ నిధులపై ఈనెల 25న స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రిలో అధికారులు చెప్పారు.

Link to comment
Share on other sites

పోలవరంపై చంద్రబాబు సమీక్ష
 
636177597608704396.jpg
అమరావతి: సచివాలయంలో పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్చువల్ ఇన్‌స్పెక్షన్ పనులను ప్రత్యక్షప్రసారంలో పరిశీలించారు. గడిచిన వారం పనుల లక్ష్యంలో 72 శాతం పూర్తి చేయగలిగామని, సీఎంకు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ రమేష్‌కుమార్ తెలియచేశారు. పోలవరం నిర్మాణానికి నాబార్డు నిధులపై ఈనెల 26న స్పష్టతవస్తుందని, ఈనెల 30న స్పిల్ వే కాంక్రీట్ పనులు ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పోలవరం నిర్మాణం కీలకదశలో నైపుణ్యం కలిగిన వారిని పనుల్లో భాగస్వాములు అయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి మంత్రి దేవినేని ఉమ, ఉన్నతాధికారులు, త్రివేణి సంస్థల ప్రతినిధులు హాజరైనారు
Link to comment
Share on other sites

పోలవరానికి 1981.54 కోట్లు
 
  • తొలివిడత నిధులు అందిస్తాం.. ఢిల్లీ రండి 
  • చంద్రబాబుకు ఉమాభారతి ఆహ్వానం 
అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం జాతీయ ప్రాజెక్టుకు తొలివిడత నాబార్డు నిధులు రూ.1981.54 కోట్లను విడుదల చేస్తున్నామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి వెల్లడించారు. ఈ నెల 26న ఢిల్లీలో ఇతర రాష్ట్రాల సాగునీటి పథకాలకు కేంద్ర సాయాన్ని అందజేస్తామని, ఇందులో పోలవరానికి అందించే సాయం కూడా ఉంటుందని.. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఆమె మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖను బుధవారం కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చదివి వినిపించారు. ఇంకోవైపు.. మంత్రులు, అధికారులూ ఒక ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘మన జీవిత కాలంలో ఇటువంటి ప్రాజెక్టును మరొకటి చూడలేం’ అని కలెక్టర్ల భేటీలో వ్యాఖ్యానించారు. పోలవరంని నిర్మాణదశలో చూడడం చారిత్రక అవకాశమన్నారు.
Link to comment
Share on other sites

30న పోలవరంలో భారీ బహిరంగ సభ
 
పోలవరం, డిసెంబరు 23: పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులను ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు ఈ నెల 30న వస్తున్న నేపథ్యంలో పోలవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు లక్ష మందితో ఏర్పాటుచేసే సభకు వాహనాల పార్కింగ్‌, భోజనాలు, సభ నిర్వహణకు వేర్వేరుగా స్థలాలను ఎంపికచేసి.. ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్‌ స్థలాన్ని శుక్రవారం నాడు తహశీల్దార్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ పరిశీలించారు.
Link to comment
Share on other sites

2018కి గ్రావిటీతో నీరు
 
  • 2019కి పోలవరం ప్రాజెక్టు మొత్తం పూర్తి
  • నిర్ణయం తీసుకుంటే ఆగేది లేదు: బాబు
  • 30న కాంక్రీట్‌ పనులకు శ్రీకారం.. భారీ సభ
  • పట్టిసీమ నీళ్లిచ్చిన సీఎంకు కృష్ణా రైతుల సత్కారం

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):  పోలవరం ప్రాజెక్టు కింద 2018కి గ్రావిటీతో నీరిస్తామని, 2019కి ప్రాజెక్టు 100 శాతం పూర్తి చేస్తామని బాబు చెప్పారు. ఇది సాకారమైతే దేశంలో ఇంత త్వరగా పూర్తయిన ప్రాజెక్టు ఇదే అవుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. పట్ట్టిసీమ నీళ్లు తాగారు కాబట్టి సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలని, కోళ్ళ పందేలు మాత్రం ఆడొద్దని చమత్కరించారు. కృష్ణా నల్లనీళ్లలో గోదావరి ఎర్రనీళ్లు కలిశాక సారం పెరిగి కృష్ణా డెల్టాలో 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందన్నారు. ఉప్పులేటి కల్పన చేరికను ఆమెపై పోటీచేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య స్వాగతించడం మంచి పరిణామమని సీఎం అభినందించారు. ఈ స్ఫూర్తి రాష్ట్రమంతటా ఉంటే వచ్చే 50 ఏళ్ల దాకా టీడీపీకి తిరుగుండదన్నారు. ఇప్పటిదాకా రెండు పార్టీల్లో ఉండి.. ఇప్పుడు మంచికోసం కలసినవారు రాష్ట్రాభివృద్ధికోసం కలసికట్టు గా పనిచేయాలని పిలుపిచ్చారు. వర్ల.. కల్పనను సోదరిగా పేర్కొన్నారు. ఇద్దరం కలసి పామర్రును అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు.
Link to comment
Share on other sites

పోలవరం కాంక్రీట్‌ పనులు 30న ప్రారంభం
 
హైదరాబాద్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పోలవరం కాంక్రీట్‌ పనులను ఈ నెల 30న అట్టహాసంగా చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు ఆ పనులను చూపించాలని నిర్ణయించింది. గతంలో కూడా.. పోలవరం కుడి ప్రధాన కాలువకు పట్టిసీమ ద్వారా ఎత్తిపోసే పథకాన్ని రాష్ట్రంలోని రైతులకు చూపించారు. ఇప్పుడూ అదే రీతిలో కాంక్రీట్‌ పనులను ప్రజలకు చూపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాగా.. కేంద్ర మంత్రి ఉమాభారతి ఆహ్వానం మేరకు 26న (సోమవారం) సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన వెంట మంత్రి ఉమామహేశ్వరరావు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు హాజరవుతారు.
Link to comment
Share on other sites

వినూత్నం.. జలపర్యాటకోత్సవం

మధ్యప్రదేశ్‌లో ఇందిరాసాగర్‌

పరీవాహకంలో పర్యాటక పండుగ

వచ్చే నెల 15 దాకా నిర్వహణ

ఈనాడు - హైదరాబాద్‌

24ap-main13a.jpg

వినూత్న పర్యాటకంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దూసుకెళ్తొంది. అందమైన లోయలు.. చల్లటి కొండ ప్రాంతాలనే జనం సందర్శిస్తారనే భావన నుంచి బయట పడాలనే సందేశంతో భారీ నీటి నిల్వల చెంత పర్యాటకాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. నర్మదా నది బ్యాక్‌ వాటర్‌లో బోటు షికారుతోపాటు అక్కడే నేలా.. నింగిని వినియోగించుకొని సాహస క్రీడలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

ఖండ్వా జిల్లాలోని నర్మదాసాగర్‌, ముండి ప్రాంతంలో నర్మదానదిపై నిర్మించిన ఇందిరాసాగర్‌ ప్రాజెక్టుతో మధ్యప్రదేశ్‌ పర్యాటకానికి మరింత వూపొచ్చింది. 950 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎటు చూసినా నీటి నిల్వలతో సముద్రాన్ని తలపించే విధంగా ఉండడం ఈ ప్రాంతం ప్రత్యేకత. ఇక్కడ రూ.10 కోట్లతో పర్యాటక భవనాన్ని నిర్మించడంతో అనేక జల క్రీడలకు వీలు చిక్కింది. ఆసియాలోనే అతి పెద్ద నీటి జలాశయంగా పేరుగాంచిన ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌కు అనుసంధానంగా భారీస్థాయిలో పర్యాటక అభివృద్ధి చేపట్టారు. 2016 ఫిబ్రవరిలో మొదటిసారిగా జలమహోత్సవాన్ని నిర్వహించారు. పదిరోజుల పాటు జరిగిన ఈ వేడుకకు దాదాపు 4 లక్షల మంది రావడంతో ఈ సారి నెల రోజులకు ఈ ఉత్సవాన్ని విస్తరించారు. 2016 డిసెంబరు 15 నుంచి 2017 జనవరి 15 వరకూ జలమహోత్సవాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ నెల 15వ తేదీన జలమహోత్సవాన్ని ప్రారంభించారు. హనువంతీయ వంటి పర్యాటక ప్రాంతం గురించి తాను కలలో కూడా వూహించలేదని.. జలమహోత్సవం పేరిట పర్యాటక పండుగ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ వేడుకుల ప్రారంభోత్సవానికి హాజరైన వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

సాహస క్రీడలతో ఉత్సాహంగా..

పతంగుల పోటీలు, టాగ్‌ ఆఫ్‌ వార్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడింగ్‌, పారాసైలింగ్‌, పారామోటరింగ్‌తో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జలాశయం మధ్యలో వాటర్‌ పారాసైలింగ్‌, మోటార్‌ బోటుపై దూసుకుపోవడం, జెట్‌స్కీ స్పీడ్‌ బోటులో సంచారం ఇలా అనేక క్రీడలకు ఇక్కడ అవకాశం కల్పించడంతో.. సందర్శకుల సంఖ్య పెరిగింది.

కొత్తఏడాదికి స్వాగతం..

జలమహోత్సవం మధ్యలోనే క్రిస్మస్‌ తదితర సెలవులు, కొత్త ఏడాది వేడుకలు రావడంతో మధ్యప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ సర్వ సౌకర్యాలతో 130 గుడారాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఏసీ సౌకర్యంతోపాటు.. డబుల్‌కాట్‌ బెడ్‌లు, ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 5 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్‌ కోర్టులు నిర్మించడంతో పాటు.. పర్యాటకులకు విడిది భవనాలు ఏర్పాటు చేశారు. జలమహోత్సవానికి 6 నుంచి 7 లక్షల మందిని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఎన్నో వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.

ఇలా చేరుకోవచ్చు..

హైదరాబాద్‌ నుంచి అజ్మీర్‌ వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కితే ఖండ్వా జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్‌లో దిగొచ్చు. అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న జలమహోత్సవానికి చేరుకోవచ్చు. అలాగే విమానంలో ఇండోర్‌ మీదుగానూ వెళ్లొచ్చు. పూర్తివివరాలకు హైదరాబాద్‌ పర్యాటక భవన్‌లోని ప్రతినిధి నెంబర్‌ 9866069000లో సంప్రదించాలి. 

 

polavaram lo kuda ela cheyyali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...