Jump to content

Prakasam Barrage Beautification


Recommended Posts

  • 2 weeks later...

Chinnappudu aa thotlu lo eetha ki velle vallam.....entho kontha running water vundedhi....last 10 yrs lo almost zero anuknta normal days lo water kindaki raavatam. Water stagnant aipoyi smell vachedi. Ippudu ila maintenance choostuntey full happies....BZA ki added beauty idi matuku. Thank you Govt.

Link to comment
Share on other sites

వెలగపూడికి బోట్‌ షికార్‌!
 
636116573007895293.jpg
  • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఏపీటీడీసీ
  • ఇప్పటికే ఓసారి ట్రైల్‌ రన్‌ నిర్వహణ
  • తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో బోటింగ్‌ యూనిట్‌
  • అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వెలగపూడికి
  • ప్రాజెక్టు సిద్ధమైతే ఏపీటీడీసీకి భారీ ఆదాయం
  • పర్యాటకులతోపాటు సచివాలయ ఉద్యోగులకూ ఉపయుక్తం
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలో పర్యాటకాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా ఏ చిన్న అవకాశం దొరికినా వెంటనే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాజధానికి పర్యాటకులను ఆకర్షించేందుకు భవానీ ఐలాండ్‌ను మరింత సుందరంగా తయారు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనితోపాటు ప్రకాశం బ్యారేజీలో బరమ్‌ పార్కు, భవానీ ఐలాండ్‌ కేంద్రంగా బోటింగ్‌ నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ బోటింగ్‌కు పర్యాటకులు భారీగా మొగ్గు చూపుతున్నారు.
 
పుష్కరాల్లో ఆదాయమే ప్రేరణ!
ప్రస్తుతం విజయవాడలో డబుల్‌ డెక్కర్‌ క్రూయిజ్‌ ఒకటి, స్పీడ్‌ క్రూయిజ్‌లు ఐదు, జెడ్‌ స్కీ ఒకటి మాత్రమే ఉన్నాయి. మరో మూడు క్రూయిజ్‌లు ఉన్నప్పటికీ అవి రిపేర్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆరు క్రూయిజ్‌లతోనే ఏపీటీడీసీకి నెలకి సుమారు రూ.25వేల ఆదాయం వస్తోంది. ఇవే క్రూయిజ్‌లతో సీజన్‌ సమయంలో ఏపీటీడీసీ మరింత ఆదాయాన్ని ఆర్జిస్తుంది. కృష్ణాపుష్కరాల సమయంలో కేవలం 12రోజుల్లోనే బోటింగ్‌ ద్వారా ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా రూ.31 లక్షల ఆదాయం కార్పొరేషన్‌కు లభించింది. దీనిని దృష్టిలో ఉంచుకునే... రాజధానిలో పర్యాటకాభివృద్ధి చేస్తే ఏపీటీడీసీకి మరింత ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా వెలగపూడికి బోట్‌లో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఏపీటీడీసీకి వచ్చింది. మూడు రోజుల కిత్రం వెలగపూడి వరకూ ఒక క్రూయిజ్‌తో ట్రయల్‌ కూడా వేశారు. వెగలపూడి ట్రిప్‌ అంటే బరమ్‌ పార్క్‌లో క్రూయిజ్‌ బయలుదేరి... భవానీ ఐలాండ్‌ మీదగా తాళ్లాయపాలెం శైవక్షేత్రం వరకూ వెళ్తుంది. అక్కడ నుంచి వెలగపూడి మూడు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఆ కాస్త దూరాన్ని రోడ్డు మార్గం బస్సులో ప్రయాణించే విధంగా కార్పొరేషన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వెలగపూడి ట్రిప్‌లో భాగంగా క్రూయిజ్‌ ద్వారా ట్రైల్‌ వేసిన అధికారులకు శైవక్షేత్రానికి వెళ్లే సరికి ఆరు కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా రీడింగ్‌ మీటర్‌ చూపించింది. పైగా మూడు గంటల సమయం పట్టింది. దీంతో, మరికొంత సామర్థ్యం ఉన్న క్రూయిజ్‌ను ఉపయోగిస్తే తక్కువ సమయంలోనే శైవక్షేత్రానికి చేరుకోవచ్చునని అధికారులు గుర్తించారు.

పుష్కర ఘాటే బోటింగ్‌ యూనిట్‌!
శైవక్షేత్రం వద్ద ప్రత్యేకంగా బోటింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదు. పుష్కరాల సమయంలో శైవక్షేత్రం వద్ద ప్రభుత్వం ఘాట్‌ను నిర్మించింది. దీనిని ఉపయోగించుకుంటే వెలగపూడి ట్రిప్‌ పేరిట పర్యాటకులను ఆకర్షించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే పర్యాటకులతోపాటు... సెక్రటేరియట్‌ ఉద్యోగులను కూడా ఏపీటీడీసీ ఆకర్షించే అవకాశం ఉంది. కేవలం ప్రయాణించే క్రూయిజ్‌లే కాకుండా అందులోనే ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేస్తే టూరిస్టులను మరింత ఆకర్షించవచ్చు. దీనిని కూడా ఏపీటీడీసీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. ప్రకాశం బ్యారేజీలో వాటర్‌ స్టోరేజీ తగ్గకుండా చూసుకోవాల్సి ఉంది. లేకపోతే భారీ క్రూయిజ్‌లు శైవక్షేత్రం వరకూ ప్రయాణించేందుకు వీలు పడదు. దీనిని ప్రభుత్వం గుర్తించి వాటర్‌ స్టోరేజీ సరిపడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...