Jump to content

హద్దులు దాటుతున్న రోబో 2 బడ్జెట్.. సెట్ 35c


swas

Recommended Posts

హద్దులు దాటుతున్న రోబో 2 బడ్జెట్.. క్లైమాక్స్ సెట్ 35 కోట్లు ..


 


Robo-2-croses-over-budget.jpg

హద్దులు దాటుతున్న రోబో 2 బడ్జెట్.. క్లైమాక్స్ సెట్ 35 కోట్లు ..

 


 



శంకర్ భారి కాదు అతి భారి బడ్జెట్ చిత్రాల దర్శకుడు . రజనీకాంత్  ఈ సూపర్ స్టార్ సినిమా కంప్లీట్ అవ్వాలి అంటే తక్కువలో తక్కువ 100 కోట్లు కావాల్సిందే .. అలాంటిది   శంకర్ , రజనీకాంత్ కాంబినేషన్ అంటే ?  రోబో కి 150 కోట్లు అయితే అప్పుడు అమ్మో అంతా అన్నారు . కాని ఆ సినిమా కలక్ట్ చేసిన వసూళ్లను చూసి  వీరి కాంబినేషన్ కి అంత ఖర్చు చేయటం లో తప్పు లేదు అనుకున్నారు .


అయితే మళ్ళి  వీరి కాంబినేషన్ లో రోబో 2 వస్తోంది . అయితే ఇంతకుముందు లా 150 కోట్లు ఈ సినిమాకి అసలు సరిపోదు. ఈ సినిమా ఖర్చు అంచనానే సుమారు 350 కోట్లు . ఈ సినిమాలో మొదట హాలీవుడ్ స్టార్ హీరో అనుకున్నప్పటికీ  బడ్జెట్  మరీ ఎక్కువ అవ్తుంది అనే ఉద్దేశం తో ఆ ఆలోచనని విరమించుకున్నారు .అందుకే ఒక టాప్ హీరో ని రజిని కి దీటుగా ఉండేలా తీసుకోవాలి అని భావించి  అక్షయ్ కుమార్ ని తీసుకున్నారు .


ఇటివల దర్శకుడు శంకర్  రోబో 2 చిత్రం యొక్క క్లైమాక్స్ ని 45  రోజుల పాటు చిత్రీకరించారు ఇందుకు గాను ఢిల్లీ లోని జవహర్ లాల్  నెహ్రు  స్టేడియం లో 35 కోట్లు ఖర్చు పెట్టి చేసారు .  ఇప్పటికే  20% మాత్రమె ఈ చిత్రం షూటింగ్ జరగగా ఇప్పటికే  80 కోట్ల వరకు ఖర్చు అయ్యినట్టు సమాచారం . దీనికి కారణం ఈ సినిమాకి పనిచేసే వారు అందరు హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే టెక్నిషియన్స్  కావటం తో బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది .


నిన్నటికి నిన్న “ఐ “ భారి కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా తీసిన శంకర్ ఇప్పుడు 350 కోట్లతో రోబో 2  తీస్తున్నాడు . కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు శంకర్ అనే అపవాదు అతని మీద రోజు రోజుకి పెరుగుతూనే ఉంది చూద్దాం ఈ చిత్రం రిజల్ట్  ఎలా ఉంటుందో … కొంచెం తేడా జరిగినా ఎన్నో  కుటుంబాలు రోడ్డు మీద  పడాల్సి వస్తుంది. ఏమండీ శంకర్ గారు వాళ్ళని గుర్తు పెట్టుకోండి  అని సాధారణ ప్రేక్షకులు అంటున్నారు .


 



Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...