Jump to content

Huge War Scenes in Goutamiputra Satakarni


sonykongara

Recommended Posts

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘బాహుబలి’ కొన్ని స్టాండర్డ్స్ ను సెట్ చేసింది. గ్రాఫిక్స్ విభాగంలో, పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ‘బాహుబలి’ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఒక రకంగా కధ కంటే కూడా సినిమా విజయానికి దోహద పడిన అంశాలు ఇవే. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా రెండవ భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది. మొదటి భాగం మాదిరే వార్ సీన్స్ ను మరింత అద్భుతంగా జక్కన్న చెక్కుతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ‘బాహుబలి’ విశేషాలు ఇలా ఉంటే, బాలకృష్ణ 100వ చిత్రం ప్రతిష్టాత్మక ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పేరుతో నిర్మితం కానున్న చారిత్రాత్మక కధలో కూడా పోరాట సన్నివేశాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. మరో వారంలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా పోరాట సన్నివేశాల గురించి హల్చల్ చేస్తున్న వార్తలు అభిమానులకు మాంచి ‘కిక్’ ఇస్తున్నాయి. కేవలం యుద్ధ సన్నివేశాల కోసమే దాదాపు 8 కోట్ల రూపాయలను మంచినీళ్ళ ప్రాయం మాదిరి ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. గ్లాడియేటర్, గేమ్ ఆఫ్ థ్రాన్స్, బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, ది మమ్మీ వంటి హాలీవుడ్ సినిమాల షూటింగ్ జరిగిన మొరాకోలోనే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా పోరాట సన్నివేశాలను చిత్రీకరణ జరుపబోతున్నారు. ఇప్పటికే ఈ లొకేషన్స్ ను నిర్మాత, ఆర్ట్ డైరెక్టర్ సందర్శించారని, అలాగే పోరాట సన్నివేశాల కోసం స్థానికంగా ఉన్న దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేసారని, తెలుగు చిత్ర సీమలో అత్యద్భుతంగా… మరో మాట చెప్పాలంటే… ‘బాహుబలి’ మించిపోయేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వార్ సీన్స్ ఉండబోతున్నాయని సినీ వర్గాల సమాచారం. యుద్ధ సన్నివేశాల కావాల్సిన ఆయుధాలు, ఇతర సామగ్రిని సప్లై చేసేందుకు హైదరాబాద్ కు చెందిన రెండు సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వగా, ఇప్పటికే అవన్నీ మొరాకో చేరిపోయాయని, దాదాపుగా నాలుగు టన్నుల మెటీరియల్ ను మొరాకోకు తరలించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితం కాబోతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఈ వార్ సీన్స్ హైలైట్ గా నిలుస్తుందని అప్పుడే ప్రచారం ఊపందుకోవడం అంటే, దర్శకుడు క్రిష్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉందని నందమూరి అభిమానులు విశ్వసిస్తున్నారు.

 

Link to comment
Share on other sites

వరుణ్ తేజ్ లాంటి హీరోను పెట్టుకుని పరిమితమైన బడ్జెట్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కంచె సినిమా తీశాడు క్రిష్. ఎన్నో లిమిటేషన్స్ మధ్య ఆ సినిమాలో వార్ సీన్స్ ను ఎంతో గొప్పగా తీర్చిదిద్ది అందరి ప్రశంసలు అందుకున్నాడు క్రిష్. ఇప్పుడతడికి బాలయ్య లాంటి మాస్ హీరో దొరికాడు. బడ్జెట్ పెంచుకునే వీలు దొరికింది. ఇక ఏమాత్రం తగ్గొద్దని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఈ సినిమాలో ఒక్క వార్ సీన్ కోసమే ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెడుతుండటం విశేషం. బాహుబలి తర్వాత తెలుగులో అత్యంత భారీగా ఉండబోతున్న వార్ సీన్ ఇదే అవుతుందని భావిస్తున్నారు.

ఈ నెల 7న మొరాకోలో చిత్రీకరించబోయే వార్ సీక్వెన్స్ తో గౌతమీపుత్ర శాతకర్ణి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సన్నివేశాల కోసం 4 టన్నుల ఆయుధాలు.. ఇతర సామగ్రిని హైదరాబాద్ నుంచి అక్కడికి తరలించినట్లు సమాచారం. అంతే కాక 800 మంది దాకా జూనియర్ ఆర్టిస్టులు కూడా అక్కడికి చేరుకున్నారట. ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి మొరాకోలోనే ఉంటూ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు.  ఒకట్రెండు  రోజుల్లో బాలయ్యతో పాటు క్రిష్ కూడా మొరాకోకు బయల్దేరే అవకాశముంది. ఈ సన్నివేశాలకు సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం నాలుగు బృందాలు పని చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Don't compare with bahubali... dani budget emiti...mana movie budget emiti....

within budget lo baga tiste good.

Link to comment
Share on other sites

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీ షూటింగ్ ఈనెల 9నుంచి షూటింగ్ మొరాకోలో జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మూడువారాలపాటు ఈ ఫిల్మ్‌కి సంబంధించిన హై‌ఓల్టేజ్ వార్ సీన్స్‌ని తెరకెక్కించనుంది యూనిట్. ఇందులోభాగంగా ఫైటర్స్‌తో కూడిన టీమ్ ఒకటి మొరాకో వెళ్లింది. అందుకు సంబంధించిన పిక్ ఇది. ఈ ఫోటోని ‘తొలివెలుగు’కు పోస్ట్ చేసింది టీమ్. నటీనటులు మాంచి ఉత్సాహంతో వున్నట్లు కనిపిస్తోంది.balakrishna00003.jpg

యూనిట్ సభ్యులు కూడా అక్కడికి వెళ్లడంతో రేపోమాపో బాలయ్య, డైరెక్టర్ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. దాదాపు 8 కోట్ల రూపాయలతో వార్ సీన్స్‌ని తెరకెక్కించనున్నట్లు టాక్. నార్మల్‌గా హిస్టరీ మూవీ అంటే.. పూజా కార్యక్రమాల తర్వాత నాలుగైదు నెలలు ఆలస్యం కావడం చూస్తూనేవున్నాం.. కానీ, ‘గౌతమిపుత్ర’ మాత్రం జెట్ స్పీడ్‌తో చిత్రీకరణ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...