Jump to content

Sagar Canals Modernization


RKumar

Recommended Posts

30రోజులు.. రూ.99కోట్లు
సాగర్‌ కాలువల ఆధునికీకరణ
క్షేత్రస్థాయికి పనుల వేగవంతం
పనులు చేయని గుత్తేదారులపై చర్యలు
ఈనాడు-గుంటూరు
amr-top2a.jpg నాగార్జునసాగర్‌ కాలువల ఆధునికీకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని పరిశీలించి జాప్యం చేస్తున్న గుత్తేదారులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈక్రమంలో మే నెలలో రూ.99.61 కోట్ల విలువైన పనులు చేయాలని లక్ష్యం విధించింది. పనులు చేయని గుత్తేదారులను తొలగించి కొత్తవారికి పనులు అప్పగిస్తోంది. 2008లో ప్రారంభమైన సాగర్‌ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన కొనసాగాయి. గత ప్రభుత్వ హయాంలో ముందస్తు అడ్వాన్సులు తీసుకున్న మేరకు కూడా పనులు చేయకుండా గుత్తేదారులు సాకులతో కాలయాపన చేశారు. రాష్ట్రవిభజన తర్వాత సాగర్‌ కాలువలకు కేటాయించిన నిధులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పంచుకున్నాయి. గత ఏడాది పనులపై సమీక్షించిన ప్రభుత్వం పనులు చేయని గుత్తేదారులను తొలగించడం, నోటీసులు ఇవ్వడంతో పనులలో కదలిక మొదలైంది. దీంతో గత ఏడాది ఏకంగా రూ.500 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులను మే 2016 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో నెలలవారీగా లక్ష్యాలు విధించి పనులు చేస్తున్నారు. మే నెలలో లింగంగుంట్ల, ఒంగోలు, జగ్గయ్యపేట సర్కిళ్ల పరిధిలో రూ.99.61కోట్ల విలువైన పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వారానికోసారి ప్రగతి సమీక్ష
నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల పరిధిలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలో నీటిపంపిణీ సంఘాల కాలువలు(డీసీ), నీటివినియోగసంఘాల కాలువలు(డబ్ల్యూఏ) యుద్ధప్రాతిపదికన ఆధునికీకరణ పూర్తిచేయాలని నిర్ణయించారు. కాలువలకు సాగునీరు విడుదల చేయనందున మే నెల మొత్తం పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో రూ.99.61కోట్ల విలువైన పనులు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయి ఇంజినీర్లు కాలువలపై తిరుగుతూ పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తిచేయించాలి. సర్కిల్‌స్థాయిలో లింగంగుంట్ల, ఒంగోలు, పులిచింతల ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్లు వారానికోసారి క్షేత్రస్థాయి ఇంజినీర్లతో పనుల ప్రగతిని సమీక్షిస్తారు. ఈనేపథ్యంలో పనుల ప్రగతికి ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం సాగర్‌ కాలువలు ఆధునికీకరణ సకాలంలో పూర్తిచేయాలని లక్ష్యం విధించడంతో జలవనరులశాఖ ఇంజినీర్లు గుత్తేదారులను అప్రమత్తం చేస్తున్నారు.

కార్యాచరణ ప్రణాళిక ఇలా...
సర్కిల్‌ మేనెలలో చేయాల్సిన పనివిలువ(రూ.కోట్లలో)
లింగంగుంట్ల 51.42
ఒంగోలు 18.13
పులిచింతల 30.06
-------------------------
మొత్తం 99.61
------------------------

నాణ్యతతో కూడిన పనులు
నాగార్జునసాగర్‌ కాలువలకు సాగునీరు విడుదల చేయనందున పనులు చేయడానికి ధీర్ఘకాలం వెసులుబాటు లభించింది. ఈనేపథ్యంలో గుత్తేదారులకు లక్ష్యాలు విధించి పనులు చేయాలని సూచించాం. ఇంజినీర్లు అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి పనులు వేగంతోపాటు నాణ్యతగా జరిగేలా చూడాలని ఆదేశించాం. కాలువల ఆధునికీకరణ పనులు ప్రారంభించిన 2009 నుంచి ఒక సీజన్‌లో రూ.500కోట్ల విలువైన పనులు చేయడం ఇదే తొలిసారి. మిగిలిన కాలువల పనులను మే, జూన్‌ నెలల్లో పూర్తిచేస్తాం.

-వీర్రాజు, ముఖ్యఇంజినీరు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు
Link to comment
Share on other sites

Guest Urban Legend

:dream:

 

nuvvu e dept anukuntaga masteru emanna info vuntey veyyochu ga e smilies ye na maaku

Link to comment
Share on other sites

Guest Urban Legend

aaa bro smileys tappa em veyadu lendi

 

 

Ayana dhee movie JP lekka.... Only expressions....

 

 

its a polite request from my side anthey ...request cheyyagalam demand cheyyalem ..

Link to comment
Share on other sites

  • 5 weeks later...
Guest Urban Legend

NENU IKKADA NIJALU CHEPTE KULLI KULLI EDUSTARU... NAA MEEDA.........

Aithey pm cheyyi masteru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...