Jump to content

Kanaka Durga Temple Master Plan


Recommended Posts

  • 4 weeks later...
  • 1 month later...
  • 3 weeks later...

మార్చి 12 నుంచి మల్లేశ్వర దర్శనం
26-12-2017 07:12:04

విజయవాడ: దుర్గామల్లే శ్వరస్వామి దేవస్థానంలో కొన్ని నెలలుగా మరమ్మతుల కారణంగా స్వయంభువు మల్లేశ్వర స్వామి దర్శనం భక్తులకు అందలేదు. మల్లేశ్వరు నికి ప్రతి రూపంగా స్ఫటిక లింగానికి శక్తిని ఆకర్పింపచేసి బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. అయినా మూల విరాట్టును దర్శించుకోలేక పోవడం భక్తులకు కొరతగానే మిగిలింది. మల్లేశ్వరాలయం పనులు త్వరగా పూర్తి చేసి భక్తుల దర్శనానికి వీలు కల్పించాలన్న విజ్ఞప్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పనులు వేగవంతం చేశారు. అయితే ఎంత వేగంగా చేసినా కింది నుంచి పునాదులు వేసుకుని పై వరకు రాతి కట్టుబడి కోసం తొలిలోనే ఏడాది సమయం పెట్టుకున్నారు. అయితే భక్తుల కోరిక మేరకు త్వరగా మల్లేశ్వరస్వామి ఆలయాన్ని భక్తుల దర్శనానికి వీలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో సగం పనులు మిగిలి ఉన్నా మార్చి 12 నుంచి తెరవనున్నారు. శృంగేరి పీఠాధిపతి మల్లేశ్వరస్వామి ఆలయ సంప్రోక్షణ, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మల్లేశ్వరాలయ ప్రాంగణం ఇక మరింత విశాలంగా కనిపించనున్నది. ప్రస్తుతం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం, నందీశ్వరుడు ఉన్న ప్రదేశం చాలా ఇరుకుగా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే భక్తులు క్యూలో ప్రవేశించి దర్శనం చేసుకుని వెనుదిరిగాల్సి ఉంది. ఇది కేవలం 15 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. ఇప్పుడు 30 అడుగుల మేరకు పెరగనున్నది. అలాగే వంద అడుగుల మేరకు పొడవు కూడా ఉండనున్నది. ఆలయం తెరిచినప్పటికి ఇంకా సగం పనులు మిగిలి ఉంటాయి. ఈ పనులను భక్తులకు ఇబ్బంది కలుగకుండా లేదా రాత్రి సమయాలలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేవస్థానం మల్లేశ్వరాలయ మరమ్మతులకు సుమారు మూడు కోట్లు వ్యయం చేస్తోంది. మిగతా కొన్ని పనులను దాతల విరాళాలతో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల మేరకు విరాళాలు సేకరించి మిగిలిన పనులను చేపట్టనున్నారు.
 
పెర్గోలా పనులు కొనసాగింపు...
అర్జునవీధిలో పెర్గోలా పనులను కొనసాగించడానికి నిర్ణయించారు. పురావస్తు శాఖ అధికారులు పెట్టిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, అక్కడ పురావ స్తుశాఖకు చెందిన గుహలకు ఎదురుగా పెర్గోలాను నిర్మించకుండా మినహాయిస్తు న్నారు. సుమారు రెండు వందల మీటర్ల పొడుగునా పెర్గోలా నిర్మాణం ఉండగా, మధ్యంలో 60-70 మీటర్ల మేరకు వదిలి అటు, ఇటు పనులు కొనసాగించనున్నా రు. అర్జునవీధిలో ఊరేగింపులు జరిగినప్పుడు భక్తులు వీక్షించేందుకు, అలాగే రోడ్డు మధ్యలో వాహనాల రద్దీలో భక్తులు ఇబ్బంది పడకుండా నడిచి వెళ్లడానికి పెర్గోలా లను నిర్మిస్తున్నారు. పురావస్తుశాఖ అడ్డంకులు చెప్పడంతో పనులు కొన్నాళ్లు నిలుపుదల చేశారు. రోడ్డుకు ఇరువైపులా మిగిలిన పెర్గోలాలు నిర్మితంకానున్నాయి.
 
వాటర్‌ ఫాల్స్‌ వద్దన్న ప్రత్యేక కమిటీ..
ఆలయంలో వివిధ పనులను పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవడానికి ఏర్పడిన ప్రత్యేక కమిటి కృత్రిమ వాటర్‌ ఫాల్స్‌ వద్దని చెప్పినట్టు తెలిసింది. తొమ్మిది పనుల పై కమిటీ తన నివేదికను నేరుగా ప్రభుత్వానికి పంపింది. ఈ నివేదికలో కొన్ని పనులకు ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని తెలిసింది. గొల్లపూడిలో గోశాలకు బదులు కాటేజీల నిర్మాణం చేయాలని కూడా కమిటీ సూచించినట్లుగా సమాచారం. సుమా రు రెండున్నర కోట్ల వ్యయంతో కాటేజీలు నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
దుర్గాఘాట్‌లో దుస్తులు మార్చుకునే రూమ్‌ ఏర్పాటు
20-05-2018 11:24:01
 
విజయవాడ: దుర్గాఘాట్‌ పరిసర ప్రాంతాలను ఇటీవల కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం పరిశీలించిన సందర్భంగా ఘాట్‌ నెలకొన్న కొన్ని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా దుర్గాఘాట్‌లో స్నానమాచరించిన భక్తులు దుస్తులు మార్చుకునే విషయంలో ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్‌ ఘాట్‌ సమీపంలో దుస్తులు మార్చుకునే గది ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు నిర్మాణ పనులు చేపట్టారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...
  • 2 weeks later...
దసరాకు ప్రణాళిక సిద్ధం
22-07-2018 07:17:04
 
636678406227283474.jpg
  • రూ.1.98కోట్లతో తొలి విడత అంచనాలకు ఆమోదం
  • ఘాట్‌రోడ్డులో ప్రైవేట్‌ వాహనాలకు రైట్‌రైట్‌
  • నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ
  • దుర్గగుడి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం
 
విజయవాడ‌: అక్టోబర్‌లో ఆరంభమయ్యే దసరా ఉత్సవాలకు దుర్గగుడి ఆలయ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. తొలివిడతలో ప్రాథమిక అం చనాలకు పచ్చజెండా ఉపారు. మొత్తం రూ.1.98 కోట్లతో వివిధ ఏర్పాట్లకు ఆమోదం తెలిపారు. దుర్గగుడి ధర్మకర్తల మండలి సమావేశం శనివారం విజయవాడలోని మాడపాటి సత్రంలో నిర్వ హించారు. మొత్తం 21 అంశాలతో రూపొందించిన అజెండాలో 20 అంశాలను ఆమోదించారు. దసరాను ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడంతో ఈసారైనా నిధులు విడుదల చేయాలని పాలకవర్గం లేఖ రాయాలని నిర్ణయించింది.
 
ఘాట్‌ రోడ్డులో ‘ప్రైవేటు’ రైట్‌రైట్‌
ఘాట్‌ రోడ్డులోకి ప్రవేశాన్ని నిషేధించిన ప్రైవేటు టాక్సీలకు పాలకవర్గ సమావేశం పచ్చజెండా ఊపించింది. కొండపైకి వెళ్లడానికి రైట్‌రైట్‌ అంది. కొండపైకి దేవస్థానం బస్సులతోపాటు భక్తుల వాహ నాలను అనుమతిస్తున్నారు. భద్రతా కారణాలరీత్యా ప్రైవేటు టాక్సీలకు అనుమతిని ఇవ్వలేదు. ఇక నుంచి ఈ టాక్సీలు కొండపైకి వెళ్లడానికి లైన్‌ క్లియర్‌ చేశారు. ట్రిప్‌నకు (అప్‌ అండ్‌ డౌన్‌) రూ.50లు వసూలు చేయాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇంతకుముందు తెల్లవారుజామున నాలు గు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలవరకు రూ.250లు వసూలు చేసేవారు. దాన్ని ఇప్పుడు ట్రిప్‌ కు రూ.50కి పరిమితం చేశారు. దత్తత దేవాలయాలైన కోదండ రామాలయం, సీతానగరంలోని వినా యకస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆల యాలను రూ.38లక్షల పునఃనిర్మించాలని నిర్ణయించారు.
 
 
ఆమోదించిన అంశాలు
  • ఇంద్రకీలాద్రికి దిగువన కేశఖండన శాల వద్ద తాత్కాలిక జట్లు సాన్నాల సదుపాయానికి రూ.1.95లక్షలు
  • భక్తులకు తాగునీటి సరఫరాకు రూ.3.30లక్షలు
  • దసరాలో ఆలయానికి వచ్చే భక్తుల కోసం తాత్కాలిక బస్సులు, డ్రైవర్లు, సూపర్ల సరఫరాకకు రూ.4.00లక్షలు
  • ఆలయానికి వచ్చే వికలాగులు, ముఖ్యఅతిథులు, ప్రసాదాల రవాణా వాహనాల సరఫరాకు రూ.12.60లక్షలు
  • 31 పీటీజడ్‌ సీసీ కెమెరాలను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి రూ.10లక్షలు
  • తాత్కాలిక మైకుల ఏర్పాటుకు రూ.7లక్షలు
  • తాత్కాలిక విద్యుద్దీకరణకు రూ.18లక్షలు
  • కొండపైన తాత్కాలిక విద్యుద్దీకరణకు రూ.27లక్షలు
  • దుర్గాఘాట్‌, దోబీ ఘాట్‌ వద్ద తాత్కాలిక సంచార మరుగుదొడ్లు ఏర్పాటుకు రూ.15లక్షలు
  • కేశనఖండన శాల, సీతమ్మవారి పాదాల ఘాట్‌ వద్ద సంచార మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.16లక్షలు
  • పద్మావతి ఘాట్‌, టీటీడీ స్థలం, పున్నమిఘాట్‌, పాల ఫ్యాక్టరీ వద్ద తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.13లక్షలు
  • దసరాలో అమ్మవారి తెప్పోత్సవ నిర్వహణలో బాణసంచాకు రూ.5లక్షలు
  • కొండకు దిగువన క్యూలైన్ల ఏర్పాటుకు రూ.20.50లక్షలు
  • కొండపైన తాత్కాలిక వాటర్‌ ప్రూఫ్‌ షామియానాలు, షెడ్లు ఏర్పాటుకు రూ.9.95లక్షలు
  • కొండపైన తాత్కాలిక క్యూ లైన్ల ఏర్పాటుకు రూ.4.30లక్షలు
  • తెప్పొత్సవం నిర్వహించే అమ్మవారి హంస వాహనానికి మరమ్మతులకు రూ.5.50లక్షలు
  • కొండకు దిగువన తాత్కాలిక వాటర్‌ ప్రూఫ్‌ షామియానాల ఏర్పాటుకు రూ.32.50లక్షలు
 
 
పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ
భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని అజెండాలోని 20 అంశాలను ఆమోదించాం. ఒకటి మాత్రమే వాయిదా వేశాం. దసరాలో తాత్కాలిక సీసీ కెమెరాలతోపాటు, శాశ్వతంగా ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి ఒక కమిటీని నియమిస్తాం. టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అన్ని శాఖల అధికారులు ఇందులో ఉంటారు.
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
దుర్గమ్మ చరిత వినరండి... 
ఆంగ్లం, తెలుగు భాషల్లో అందుబాటులోకి 
రూ.3 కోట్ల వ్యయంతో సౌండ్‌ అండ్‌ లైట్‌షో పనులు 
ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే 
gnt-sty1a.jpg

రాష్ట్ర రాజధానిలో ప్రధానమైన దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠను ఇనుమడింప చేసే విధంగా రూ.3 కోట్ల వ్యయంతో ఇంద్రకీలాద్రిపై చేపట్టిన సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం భవానీ ద్వీపంలో యాత్రికులను ఆకర్షిస్తున్న లేజర్‌ షో తరహాలోనే ఇంద్రకీలాద్రిపై భక్తుల మది దోచేందుకు సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను ఏర్పాటు చేస్తున్నారు. కోల్‌కతాకు చెందిన సంస్థకు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రూ. 8 లక్షల విలువ చేసే వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రూ.4 లక్షల వ్యయంతో వినాయకుని విగ్రహానికి పైన శ్లాబ్‌ వేసే పనులు ప్రారంభించారు. పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. ఒక వైపు రాజగోపురం, స్వర్ణ తాపడం చేసిన అమ్మవారి ఆలయం, ఉపాలయాలు, ప్రకాశం బ్యారేజీ అందాలతో లైట్‌ షోను ప్రతి రోజు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారు ఇంద్రకీలాద్రిపైన వెలసింది మొదలు ఆలయం అభివృద్ధి చెందిన తీరుపై కథనాన్ని ఆంగ్లం, తెలుగు భాషల్లో వివరించడం ద్వారా భక్తులతో పాటు విదేశీ యాత్రికులను కూడా ఆకర్షించడమే లక్ష్యంగా పనులు చేస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇప్పటికే వినాయకుని విగ్రహం కనువిందు చేస్తోంది. గతంలో ఈవో కార్యాలయం ఉన్న ప్రాంతమంతా పచ్చదనంతో అభివృద్ధి చేశారు. అక్కడే ప్రొజెక్టరు ఏర్పాటు చేసేందుకు క్యాబిన్‌ అమర్చారు. ప్రత్యేక తెరను ఏర్పాటు చేసి భక్తులకు దుర్గగుడి విశిష్టతను వివరించేందుకు రంగం సిద్ధమవుతోంది.

నెల రోజుల్లో పనులు పూర్తి:  భాస్కర్‌, దుర్గగుడి ఈఈ 
రూ.3 కోట్లతో చేపట్టిన సౌండ్‌ అండ్‌ లైట్‌ షో పనులను నెల రోజుల్లో పూర్తి చేస్తాం. కోల్‌కతాకు చెందిన సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలోని వినాయకుని విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులను దేవస్థానం చేపట్టింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేశాం. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ద్వారా అమ్మవారి విశిష్టతతో పాటు దేవస్థానం చరిత్రను వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. రాజధాని నగరంలో దుర్గమ్మ కోవెలను అందంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా సీఆర్‌డీఏ అధికారుల పర్యవేక్షణలో భవానీ గార్డెన్స్‌ నిర్మాణం చేస్తున్నాం. దీనికి సంబంధించిన పనుల ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించింది. త్వరలో పనులు చేపడతాం.

భవానీ గార్డెన్స్‌ అభివృద్ధి 
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేందుకు వీలుగా హెడ్‌వాటర్‌ వర్క్స్‌ సమీపంలో రూ.1.40 కోట్ల వ్యయంతో భవానీ గార్డెన్స్‌ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేవస్థానం అధికారులు తొలుత ఇక్కడ దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మార్గాన్ని అనుసంధానం చేసే విధంగా కాలిబాట మార్గం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే ఆ ప్రాంతం జాతీయ రహదారికి పక్కన ఒక వైపున దుర్గమ్మ కోవెల, మరొక వైపున కనకదుర్గ పైవంతెన ఉండటంతో భక్తులతో పాటు సాధారణ యాత్రికులను, నగరవాసులను కనువిందు చేసే విధంగా భవానీ గార్డెన్స్‌ ఏర్పాటు చేయాలని భావించి ఆ బాధ్యతను సీఆర్‌డీఏ (కేపిటర్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే సీఆర్‌డీఏ అధికారుల పర్యవేక్షణలో పాత బస్టాండ్‌ సమీపంలో వ్యర్థ వస్తువులతో ఆకర్షణీయంగా పార్కును అభివృద్ధి చేశారు. ప్రధాన రహదారుల్లో అభివృద్ధి చేసిన గ్రీనరీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అదే తరహాలో భవానీ గార్డెన్సు కూడా భక్తుల మదిలో నిలిచే విధంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...