Jump to content

Kanaka Durga Temple Master Plan


Recommended Posts

 

వన పరవశం

దుర్గమ్మ భక్తులకు కొత్త అనుభూతి.. కొండపైకి కొత్త మార్గం

image.jpg 

దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కొత్త అనుభూతి పంచేలా... ఇంద్రకీలాద్రిపైకి వనమార్గంలో ఎక్కి ఆధ్మాత్మిక పరవశం పొందేలా కొత్త మార్గం వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు ఉన్న రెండు మార్గాలకు తోడు.. ఈ కొత్త మార్గం భక్తులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. పూర్తిగా కొత్త తరహాలో దీన్ని రూపొందిస్తున్నారు.

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను చూసేందుకు భక్తులు ప్రస్తుతం ఘాట్‌రోడ్డు, మెట్లమార్గంలో మాత్రమే అవకాశం ఉంది. శబరిమలై అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు వనయాత్ర చేసిన తర్వాత.. అయ్యప్పను దర్శించుకొని ఎంతో అనుభూతిని పొందుతారు. ఈ తరహాలోనే దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు కొంతమేర అయినా అలాంటి వాతావరణాన్ని పెంపొందించేందుకు దుర్గగుడి రావిచెట్టు సెంటరు నుంచి ఘాట్‌రోడ్డు తొలిమలుపు వరకు కాలిబాటను నిర్మిస్తున్నారు. దీన్ని రూ.35లక్షలు వ్యయంతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. ఇంద్రకీలాద్రిపైకి ఈ మార్గానికి సంబంధించి ప్రస్తుతం ఆక్రమణలకు గురి కాని కొండప్రాంతాన్ని కేటాయించమని అటవీశాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీంతో ఇంద్రకీలాద్రి కొండ అభివృద్ధి బాధ్యత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి అప్పగించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా కనకదుర్గ పైవంతెన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు హెడ్‌వాటరు వర్క్సు, రావిచెట్టు సెంటరు కొండప్రాంతంలోని ఇళ్లను పూర్తిగా తొలిగించారు. వీరికి పునరావాసం కింద కొంతమందికి ఇళ్లు, కొంతమందికి గజం రూ.53వేలు చొప్పున నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఈ స్థలంలో దుర్గగుడి అధికారులు కాలిబాటను అభివృద్ధి చేసేందుకు పనులు ప్రారంభించారు. జనవాసాలు ఉన్నంత వరకు స్థలాన్ని వదిలి ఇతరులు ఆక్రమణలు చేయకుండా ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

కాలిబాట మార్గంలో పచ్చదనం

ఇంద్రకీలాద్రికి చేరే భక్తులకు వనయాత్ర చేసిన అనుభూతిని కలిగించేందుకు కొండప్రాంతంలో కాలిబాట నిర్మాణపు పనులను దేవస్థానం ప్రారంభించింది. ఎగుడు దిగుడుగా ఉన్న కొండ చరియలను సరిచేసి నడిచేందుకు వీలుగా మార్గాన్ని పొక్లెయిన్‌తో సరిచేస్తున్నారు. పడవల రేవు సెంటరు ప్రాంతంలో కొండ కొంత మేర తొలిగించి ఉండటంతో ఈ ప్రాంతంలో అందంగా చిన్న వంతెన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రావిచెట్టు సెంటరు నుంచి కొండపైన ఏర్పాటు చేసిన కాలిబాటలో భక్తులు నడిచి వచ్చి ఘాట్‌రోడ్డు మొదటి మలుపు వద్దకు చేరుతారు. ఈ మధ్యలో వాతావరణం ఆహ్లాదంగా ఉంచేందుకు పచ్చదనం అభివృద్ధి చేస్తారు. ఒక కిలోమీటరు మేర భక్తులు కాలిబాటలో నడవాల్సి ఉంటుంది.

దసరా నాటికి పనులు పూర్తి

- భాస్కర్‌, దుర్గగుడి ఈఈ

దసరా నాటికి ఈ కాలిబాట అభివృద్ధి పనులు పూర్తవుతాయి. దుర్గగుడి కాలిబాటతోపాటు ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా కూడా పచ్చదనం అభివృద్ధి చేస్తున్నాం. కిలోమీటరు మేర కాలిబాట ఉంటుందని గిరిప్రదక్షిణ చేసిన భక్తులు కూడా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నేరుగా ఘాట్‌రోడ్డుకు చేరే అవకాశం ఉంటుంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
సోలార్‌ దిశగా ఇంద్రకీలాద్రి..!
 
 
636340611177171783.jpg
  • దేవస్థానం అధికారులతో నెడ్‌క్యాప్‌ చర్చలు
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దేవస్థానాలకు సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటుపై ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులతో నెడ్‌క్యాప్‌ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నిటికీ ఒకే సోలార్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుని, దానిద్వారా దేవస్థానాలను అనుసంధానం చేయాలని గతంలో ప్రతిపాదించారు. ఈ విధానంలో కొన్ని సాధక బాదకాలున్న దృష్టా, ప్రభుత్వం ఈ ప్రయత్నాలను విరమించుకుంది. అన్ని ప్రధాన ఆలయాలల్లో కూడా సోలార్‌ సిస్టమ్‌ను ఎవరికివారే ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
 
దీంతో దుర్గగుడి అధికారులకు నెడ్‌క్యాప్‌ పూర్తి వివరాలతో లేఖ రాసింది. ఈ లేఖతో పాటు నెడ్‌క్యాప్‌ అధికారులు దుర్గగుడి అధికారుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే సోలార్‌ సిస్టమ్‌ ఎంతవరకు ఉపయోగం అన్నదానిపై కూడా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇటీవల దేవస్థానాలు వినియోగించే విద్యుత్‌పై ఒక్కో యూనిట్‌కు రూ.4.80 మాత్రమే ఛార్జి చేస్తున్నారు. ఇంతకముందు వరకు ఒక్కో యూనిట్‌కు రూ.7 వసూలు చేస్తూ వచ్చారు. దీంతో దుర్గగుడికి విద్యుత్‌ వినియోగపరంగా అయ్యే వ్యయంలో బాగా కలిసివచ్చింది. ఇప్పుడు దుర్గగుడికి విద్యుత్‌ వినియోగాన్ని లెక్కిస్తే సుమారు ఒకటిన్నర మెగావాట్‌ మేరకు సోలార్‌ విద్యుత్‌ అవసరం. దీనికిగాను దేవస్థానం సుమారు రూ.7.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
 
ఇంత పెద్ద మొత్తాన్ని వినియోగించి సోలార్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌కు అయ్యే వ్యయం కంటే తక్కువ అవుతుందా, ఎక్కువవుతుందా, భవిష్యత్‌ అవసరాలు ఏవిధంగా ఉండనున్నాయనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇంతపెద్ద మొత్తాన్ని వెచ్చిస్తే ఆదాయపుపన్ను మినహాయింపు ఉంటుందా లేదా అనేదానిపై కూడా సంబంధిత అధికారులతో సంప్రదిస్తున్నారు. ఏడున్నర కోట్లమేరకు వ్యయం చేస్తే ప్రభుత్వం రెండున్నర కోట్ల వరకు సబ్సిడీ ఇస్తుంది గనుక దేవస్థానం సోలార్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు.
 
అయితే ఒక్కోయూనిట్‌ను 500 మెగావాట్ల మేరకు ఏర్పాటు చేసుకుంటేనే సబ్సిడీ వస్తుందని చెబుతున్నారు. ముందుగా దేవస్థానం తగిన స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఇలా దేవస్థానం, నెడ్‌క్యాప్‌ అధికారుల మధ్య సంప్రతింపులు జరుగుతున్నాయి. రానున్నరోజుల్లో విద్యుత్‌ అవసరాలు పెరిగే అవకాశం ఉన్నదృష్ట్యా, భద్రత దృష్ట్యా సోలార్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

  • 5 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...