Jump to content

Kanaka Durga Temple Master Plan


Recommended Posts

బెజవాడ దుర్గమ్మ గుడి రూపుమారబోతోంది !
 
635974489444229812.jpg
  • ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా మార్పులు
  • మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం
  • కొండపై ఉన్న కార్యాలయాలన్నీ తరలింపు
  • ఉపాలయాలకు మెరుగులు
  • మల్లికార్జున పేటకు అన్నప్రసాద కేంద్రం
కృష్ణా పుష్కరాలనాటికి దుర్గగుడి పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌కూడా రూపుదిద్దుకుంది. ఉన్నతాధికారుల అనుమతితో ఈ ప్లాన్‌ ప్రకారమే పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి దుర్గగుడిని అభివృద్ధి చేయనున్నట్టు ఇన్‌చార్జ్‌ ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


గ్రౌండ్‌ఫ్లోర్‌లో చండీహోమం

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీమల్లేశ్వర స్వామి ఆలయం వెనుక ప్రస్తుతం ఉన్న అర్చకుల రెస్ట్‌ రూమును తీసివేసి గ్రౌండ్‌ఫ్లోర్‌లో చండీహోమం ఏర్పాటు చేయనున్నారు.
 
 
ఈశాన్యం పెంపు
దుర్గగుడికి ఈశాన్య భాగం తక్కువగా ఉంది. శివాలయం పక్కన ఈశాన్యభాగంలో అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న గదిని పూడ్చివేసి, ఈ భాగాన్ని పెంచాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
 
 
మరింత విశాలంగా శాంతి కల్యాణ మండపం
శివాలయం వెనుక ఉన్న శాంతి కల్యాణ మండప వైశాల్యాన్ని పెంచనున్నారు. దీనికోసం అక్కడ ఉన్న గోడను తీసివేసి, సగ భాగంలో గ్రిల్స్‌ ఏర్పాటు చేసి ఆ ప్రాంగణాన్ని మండపంగా తీర్చిదిద్దనున్నారు. శాంతి కల్యాణం జరిపించుకునే భక్తులకు గాలి, వెలుతురుతో పాటు కృష్ణమ్మ కూడా కనిపించే విధంగా తీర్చిదిద్దనున్నారు. ఈ కల్యాణ మండపానికి నూతన శోభ చేకూర్చేందుకు శాలహారాన్ని నిర్మించనున్నారు.
 
 
 
నిర్దేశించిన ప్రదేశంలో సైనబోర్డులు
ఇంద్రకీలాద్రిపై ఎక్కడ పడితే అక్కడ సైనబోర్డులను ఏర్పాటు చేయకుండా, నిర్దేశించిన ప్రదేశంలోనే ఇక సైనబోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
 
 
అల్ట్రామోడల్‌ టాయ్‌లెట్స్‌
ఇంద్రకీలాద్రిపై పులిహోర, లడ్డూ తయారీ కేంద్రాలకు వెళ్లే దారిలో గోపికా కృష్ణుల బొమ్మల దగ్గర ఉన్న టాయ్‌లెట్స్‌ను ఆధునికీకరించి అలా్ట్రమోడల్‌ టాయ్‌లెట్స్‌గా అభివృద్ధి చేయనున్నారు.
 
 
భవనాలను తొలగించాల్సిందే
ఇంద్రకీలాద్రిపై ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ను, భవానీ దీక్షా మండపాన్ని, పరిపాలన, అన్నప్రసాద భవనాలను తక్షణమే తొలగించనున్నారు. అలాగే శివాలయం మార్గంలో ఉన్న ఎస్టీడీ, లడ్డు ప్రసాదాల తయారీ, మెట్ల మార్గం పక్కన ఉన్న షాపును, భక్తులు బయటకు వచ్చే మార్గంలో ఉన్న వేయింగ్‌ మెషిన, కాఫీ, టీ మెషినలను తక్షణమే తొలగించాలని నిర్ణయించారు. అన్నదానం మెట్ల మార్గంలో చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి, ఆలయంలోని హుండీలకు తక్షణమే పెయింటింగ్‌లను వేయాలని నిర్ణయించారు.
 
 
ఉపాలయాలకు మెరుగులు
ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. నటరాజస్వామి ఆలయం నందున్న ధ్వజ స్తంభానికి పాలిష్‌ చేయించి, దానిచుట్టూ బ్రాస్‌ రైలింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మెట్ల పక్కన ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ను తొలగించి మొక్కలు ఏర్పాటు చేయనున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి మైకు ప్రచార కేంద్రం వరకు కొండవైపు ఉన్న గోడను సగభాగాన్ని తీసివేసి స్టెయినలెస్‌ స్టీల్‌ రైలింగ్‌ వేసి అటువైపు ఉన్న గ్రీనరీని భక్తులు వీక్షించేవిధంగా ఏర్పాటు చేయనున్నారు.
 
 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి అతిథిగృహంలోని రెండు, మూడు అంతస్ధులను దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి కార్యాలయంగా మార్చనున్నారు. నాలుగో అంతస్థువలె పశ్చిమ భాగాన లైట్‌రూఫ్‌ షెడ్‌ వేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఈవో కార్యాలయాన్ని తరలించనున్నారు. మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్థులో అన్ని పూజలను నిర్వహిస్తారు. కొండపైన ఉన్న ప్రసాదాల పోటును, కౌంటర్లను తొలగించి కొండదిగువన శ్రీశృంగేరి పీఠం వెనుక భాగంలో ఏర్పాటు చేస్తారు. అరండల్‌ సత్రాన్ని పూర్తిగా కేశఖండనశాలగా మార్చనున్నారు.
 
 
కనకదుర్గనగర్‌లో వెహికల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌
కనకదుర్గనగర్‌లో వెహికల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తారు. భక్తులు తమ వాహనాలను అక్కడే పార్కింగ్‌ చేసి అర్జున వీధి నుంచి మహామండపంలోకి ప్రవేశిస్తారు. రాజగోపురం నుంచి అమ్మవారిని దర్శించుకుని, అనంరతం మల్లేశ్వరస్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న మెట్ల మార్గం నుంచి కనకదుర్గనగర్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 
అభివృద్ధి కోసం భూసేకరణ
మల్లేశ్వర స్వామి ఆలయం మెట్లను 30 అడుగుల వెడల్పు చేయటానికి అడ్డుగా ఉన్న ఏడు ఇళ్లను, బుద్దావారి ఆలయంలో అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డంకిగా ఉన్న ఒక ఇంటిని, శృంగేరి మఠం పక్కన ఉన్న 15 ఇళ్లను తొలగించాల్సి ఉంది. ఆ ప్రాంతాన్ని భూసేకరణ కింద తీసుకోనున్నారు.

30 రోజుల్లో అన్నప్రసాద కేంద్రం తరలింపు
ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్న ప్రసాద కేంద్రాన్ని కొండ దిగువన మల్లికార్జునపేటలోని శ్రీవసంత మల్లికార్జున స్వామి దేవస్థానం వెనుక ఉన్న బుద్దావారి కల్యాణమండపంలోకి మార్చనున్నారు. కల్యాణ మండపంపైన ఒక లైట్‌ రూఫ్‌ షెల్టర్‌ను ఏర్పాటు చేసి అన్న ప్రసాద కేంద్రాన్ని 30 రోజుల్లో తరలించనున్నారు. కల్యాణమండపం పక్కన ఉన్న గుంటూరు సీతారామయ్య సత్రానికి చెందిన ఖాళీ జాగాలో (సుమారు 150 గజాలు) క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు.

రక్షణ గోడపై చిత్రాలు
ఇంద్రకీలాద్రి రక్షణ గోడపై టెర్రకోటా బ్రిక్‌ కలర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ వేసి, దానిపై ఇంద్రకీలాద్రి స్థలాపురాణం తెలిపేవిధంగా వర్ణ చిత్రాలను వేయించనున్నారు.

షాపులన్నీ మహామండపంలోకి..
ఇంద్రకీలాద్రిపై ఉన్న షాపులన్నింటినీ మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్తులోకి తరలించను న్నారు. భక్తులు నడిచే మార్గంలో వీటిని ఏర్పాటు చేస్తారు.

మహామండపానికి ఉత్తర దిశలో కోనేరు
మల్లికార్జున మహామండపానికి ఉత్తర దిశలో ఒక జలధారను, ఒక కోనేరును ల్యాండ్‌ స్కేపింగ్‌లో భాగంలో ఏర్పాటు చేయనున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

kanaka-durga-14062016.jpg

Sri Durga Malleswara Swamyvarla Devasthanam has decided to replace the electric lamps with oil lamps in the "Garbhalayam" of goddess Kanaka Durga temple atop Indrakeelari.

Oil Lamps are replaced and they are being used since yesterday. In the lines of Tirumala, only oil lamps will be used from now in "Garbhalayam" and the goddess can be seen in the lighting of oil lamps.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...
Guest Urban Legend

vehicles ndhuku ban cheyyatam ...

normal days lo antha rush em vundadhu only on festival days ban chesukovachu

Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...