sonykongara 1,618 Posted January 3, 2019 కాకినాడ ఓడరేవుకు రాచబాట సామర్లకోట-రాజానగరం రహదారి విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన ఈనాడు, అమరావతి: విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవా (వీసీఐసీ)లో కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట-రాజానగరం రహదారి విస్తరణ పనులకు ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో జిల్లాలో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపైనున్న రాజానగరం నుంచి కాకినాడ ఓడరేవుకు అనుసంధానం పెరుగుతుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న 29.6 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని 30 నెలల్లో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. అంచనా వ్యయం రూ.300.28 కోట్లు కాగా.. అందులో 21.5% నిధులను ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇవ్వనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. Share this post Link to post Share on other sites