Jump to content

Vizag-chennai Industrial Corridor


Recommended Posts

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు తొలి అడుగు

 

 
vizag-chennai-corridor-27022017.jpg
share.png

రాష్ట్రాభివృద్ధిలో కీలకం కానున్న ప్రధాన పారిశ్రామిక కారిడార్ కు తొలి అడుగుపడింది. విశాఖ-చెన్నెల మధ్య సుమారు 800 కిలోమీటర్ల పొడవున విస్తరించనున్న ఈ కారిడార్ నిర్మాణానికి తొలి విడతగా 375 మిలియన్ డాలర్ల రుణాన్ని విడుదల చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంగీకరించింది. ఈ నిధులు మార్చి మొదటి వారంలో విడుదలకానున్నాయి. దీంతో ప్రతిపాదనలకు అనుగుణంగా పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.

వాస్తవానికి దేశం తూర్పతీరం వెంబడి 2,500 కిలోమీటర్ల పొడవునా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సంకల్పించింది. అయితే విశాఖ-చెన్నెల మధ్యనున్న ప్రాధాన్యత దృష్ట్యా తొలి విడతలో దీన్ని పూర్తిచేయాలని నిర్ణయించింది, చెన్నై-విశాఖ కారిడార్ అభివృద్ధికి 631 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు బ్యాంక్ గతేడాది సెప్టెంబర్లో అంగీకరించింది. ఇందులో భాగంగానే ఇప్పడు 375 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించిన పత్రాలకు ఆమోదం తెలిపింది.

ప్రతిపాదించిన రుణం మొత్తంలో 500 మిలియన్ డాలర్లను ఈ కారిడార్లోని ప్రధాన కేంద్రాల్లో కీలకమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగించాలి. శ్రీకాళహస్తి, అమరావతి, కాకినాడ, విశాఖపట్నంలలో ఈ సదుపాయాలు కల్పిస్తారు. తొలి విడత మంజూరు చేసిన 375 మిలియన్ డాలర్లలోని 245 మిలియన్ డాలర్లను ఈ నాలుగు కేంద్రాల్లో రెండింటిపై వెచ్చిస్తారు. మిగిలిన 135 మిలియన్ డాలర్లను కారిడార్ నుండి ప్రస్తుత జాతీయ రహదార్లకు అనుసంధాన రహదార్లు, రైల్వేలైన నిర్మాణానికి కేటాయిస్తారు.

Advertisements

ఇందులో భాగంగానే కాకినాడ నుంచి జాతీయ రహదారి వరకు 29.6 కిలోమీటర్ల రహదారిని నాలుగులైనుగా విస్తరిస్తారు. అలాగే కారిడార్లో నీటి సరఫరా ప్రాజెక్ట్లకు కూడా ఈ నిధుల్ని వినియోగిస్తారు. ఏడాదిలోగా మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో కేంద్రముంది. దీని నిర్మాణంతో తూర్పతీర పారిశ్రామిక రూపురేఖలు వూరిపోతాయని రుణ మంజూరు సందర్భంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారతశాఖ అధిపతి వ్యాఖ్యానించారు. విశాఖ-చెన్నెల మధ్య ప్రస్తుతం 16 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులున్నాయి. కారిడార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే 2025 నాటికి ఈ పెట్టుబడులు 64 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఆయనపేర్కొన్నారు.

తూర్పు ప్రాంత పారిశ్రామిక కారిడార్ నిర్మాణంతో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఈ కారిడార్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్నుంచి పలు రాయితీలందుతాయి. అలాగే ఈ కారిడార్కు జాతీయ రహదార్లు, రైల్వే ప్రధాన లైన్లతో అనుసంధానముంటుంది. తీరం వెంబడి కొన్ని మధ్యతరహా పోర్టుల నిర్మాణానికి అవకాశాలొస్తాయి. ఇతర కారిడార్లతో పోలిస్తే విమానాశ్రయాలు, రేవులు, జాతీయ రహదార్లు, ప్రధాన రైలు మార్గాలకు అత్యంత చేరువలో ఉన్న కారిడార్ ఇదొక్కటే. పైగా కారిడార్ వెంబడన్నప్రాంతాల్లో ఎప్పడూ ఎలాంటి కార్మిక అశాంతి లేదు. రాజకీయ సుస్థిరత నెలకొనుంది. ఇప్పటికే చెన్నె విశాఖ కాకినాడ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలున్నాయి. చెన్నె విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నంలలో భారీ పోర్టులున్నాయి.

Link to comment
Share on other sites

విశాఖ-చెన్నై కారిడార్‌కు రూ. 2500 కోట్లు
 
 
636239002811087022.jpg
ఆంధ్రజ్యోతి: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి బారీగా నిధుల సమీకరణ జరిగింది. 2,500 కిలోమీటర్ల ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తొలిదశలో 800 కిలోమీటర్ల మీర పారిశ్రామిక అభివృద్ధి జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం-ఆసియన్ డెవలప్‌మెండ్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కారిడార్‌కు రూ. 2500 కోట్ల రుణాలు గ్రాంట్లను ఏడీబీ ఇవ్వనుంది.
 
ఈ కారిడార్ కోసం మొత్తం రూ. 6,,310 కోట్ల మిలియన్ల డాలర్ల రుణం గ్రాంట్లు ఇచ్చేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఏడీబీ అంగీకరించింది. గత వారం కేంద్రం-ఏడీబీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 8,460 కోట్లు కాగా కేంద్రం రూ. 2,150 కోట్లు, ఏడీబీ రూ. 6,310 కోట్లు ఖర్చు చేయనుంది.
Link to comment
Share on other sites

కారిడార్‌కు రూ.2500 కోట్లు
 
636239288590486651.jpg
  • విశాఖ-చెన్నై మార్గానికి ఏడీబీ నిధులు
  • 800 కి.మీ.పారిశ్రామికాభివృద్ధికి రుణం, గ్రాంటుకు అంగీకారం
  • కీలక ఒప్పందంపై సంతకాలు
  • విశాఖ, కాకినాడ, అమరావతి,ఏర్పేడు-శ్రీకాళహస్తిల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి
  • 2025కి నాలుగింతల ఉత్పత్తి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భారీ ముందడుగు పడనుంది. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం... విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి భారీగా నిధుల సమీకరణ జరిగింది. 2500 కిలోమీటర్ల ఈస్ట్‌కోస్ట్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా తొలిదశలో 800 కిలోమీటర్ల (విశాఖ-చెన్నై కారిడార్‌) మేర పారిశ్రామికాభివృద్ధి జరిపేందుకుగాను కేంద్ర ప్రభుత్వం, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కారిడార్‌కు ఏడీబీ 375 మిలియన డాలర్ల (సుమారు రూ.2500 కోట్ల) రుణాలు, గ్రాంటులు ఇవ్వనుంది. మేకిన ఇండియా విధానంలో భాగంగా దేశంలో ఉత్పత్తిని పెంచాలని, ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానంలో భాగంగా ఆసియా ఖండంలోని ప్రభావవంతమైన ప్రపంచస్థాయి ఉత్పత్తి వ్యవస్థలతో మన దేశ ఆర్థిక రంగాన్ని ముడిపెట్టాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ కారిడార్‌ అభివృద్ధి జరుగనుంది.
 
 
ఈ కారిడార్‌ కోసం మొత్తం 631 మిలియన డాలర్ల రుణం, గ్రాంటులు ఇచ్చేందుకు గతేడాది సెప్టెంబరులోనే ఏడీబీ అంగీకరించగా... కేంద్ర ప్రభుత్వం-ఏడీబీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఏడీబీ డిప్యూటీ కంట్రీ డైరెక్టర్‌ ఎల్‌బీ సొంద్జాజ, ఆంధ్రప్రదేశ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి మునివెంకటప్ప హేమ సంతకాలు చేశారు.ప్రాజెక్టు మొత్తం వ్యయం 846 మిలియన డాలర్లు కాగా.. కేంద్రం 215 మిలియన డాలర్లను ఖర్చు చేయనుంది. మిగిలినవి ఏడీబీ ఇస్తుంది. ఈ కారిడార్‌లో గుర్తించిన నాలుగు ప్రధాన కేంద్రాలు... విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, ఏర్పేడు-శ్రీకాళహస్తిల్లో కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు 500 మిలియన డాలర్లు ఖర్చు చేస్తారు.
 
ఇందుకోసం తక్షణం 245 మిలియన డాలర్లను ఏడీబీ విడుదల చేస్తుంది. కాకినాడ పోర్టు నుంచి 16వ నెంబరు జాతీయ రహదారి వరకూ ఉన్న 29.6 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని నాలుగులైన్ల రహదారిగా విస్తరించి అభివృద్ధి చేస్తారు.
 
విశాఖలో స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ను అమలు చేసి నిరంతరం నీటి సరఫరా చేస్తారు. విశాఖ, నాయుడుపేట, ఏర్పేడు-శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లకు నిరంతరం నాణ్యమైన విద్యుతను అందించేందుకు 7 సబ్‌స్టేషన్లను మెరుగుపరుస్తారు. అచ్యుతాపురం, నాయుడుపేట క్లస్టర్ల నుంచి వెలువడే పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధిచేసే వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. మరో 125 మిలియన డాలర్లను ఈ కారిడార్‌ నిర్వహణలో భాగమైన సంస్థల సామర్థ్య పెంపునకు, సులభతర వాణిజ్యం జరిగేందుకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు, పారిశ్రామికరంగ విధానాలను మెరుగుపర్చి పారిశ్రామికాభివృద్ధికి పాటుపడేందుకు ఖర్చు చేయనున్నారు.
 
 
పారిశ్రామిక క్లస్టర్లలో సమర్థవంతమైన రవాణా, నీరు, విద్యుత సరఫరా, నిపుణులైన పనివాళ్లు, పారిశ్రామిక అనుకూల విధానాలు, అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థల సమ్మేళనంతో స్థానిక ఆర్థిక రంగ బలోపేతానికి, .సులభతర వాణిజ్యాన్ని మెరుగుపర్చే విధానాలతో పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ఏడీబీ మద్దతు ఇస్తోందని ఏడీబీ డిప్యూటీ కంట్రీ డైరెక్టర్‌ ఎల్‌బీ సొంద్జాజ తెలిపారు. మేకిన ఇండియా లక్ష్యాల సాధనకు, కారిడార్‌ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చాలా కీలకమైందని కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీ రాజ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, వాతావరణ మార్పులను తట్టుకుని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు 5 మిలియన డాలర్ల గ్రాంటును కూడా ఈ సందర్భంగా ఏడీబీ మంజూరు చేసింది. కాగా, మొదటిదశ రుణానికి కాలపరిమితి 25 ఏళ్లు కాగా మరో ఐదేళ్లు పొడిగించే అవకాశాన్ని కల్పించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

పారిశ్రామిక కళహస్తి

చిత్తూరు జిల్లాలో 11,005 ఎకరాల గుర్తింపు

విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా ఏర్పాటు

ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆర్థిక సాయం

అధ్యయనం చేస్తున్న జురాన్‌

ఈనాడు - అమరావతి

1ap-main5b.jpg

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వద్ద భారీ పారిశ్రామిక ప్రాంతం(నోడ్‌)ను అభివృద్ధి చేయనున్నారు. శ్రీకాళహస్తి,-తొట్టంబేడు మండలాల మధ్య దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 11,005 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. ఈ 2 మండలాల మధ్య 16 గ్రామాల్లో ఈ భూములను సేకరించనున్నారు. ఈ భూసేకరణకు సంబంధించి పరిశ్రమల శాఖ ఉపసంఘం ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. తీరప్రాంతం వెంబడి విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవా(వీసీఐసీ)ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, శ్రీకాళహస్తి వద్ద నోడ్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం పెద్దఎత్తున భూములు అవసరమవుతాయి.

శ్రీకాళహస్తి వద్ద నోడ్‌కు కావాల్సిన భూములను ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) గుర్తించింది. శ్రీకాళహస్తి-తొట్టంబేడు మండలాల మధ్య ఇందుకు అనుకూలత ఉందని భావించింది. ముందుగా శ్రీకాళహస్తి-ఏర్పేడు మధ్య అనుకున్నా.. తరువాత తొట్టంబేడు వద్ద ఏర్పాటుచేయడం ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంటుందనే మొత్తం 16 గ్రామాల్లో ఈ భూములను గుర్తించింది. మొత్తం 11,005 ఎకరాల్లోనూ పట్టా భూములు 322.98 ఎకరాలు, 7744.81ఎకరాలు అసైన్డ్‌ భూములు, 2937.40 ఎకరాలు ప్రభుత్వ భూములున్నట్లు గుర్తించింది. భూ సేకరణకు పెద్దగా ఇబ్బందులుండవని, ఇక్కడి భూముల్లో నిర్వాసితులెవరూ లేరని, ఎవర్నీ బలవంతంగా ఖాళీచేయించే అవసరం లేదని పరిశ్రమల శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలో ఏపీఐఐసీ ప్రతిపాదనలకు ఆ శాఖ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే ఈ భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేయనుంది.

జపాన్‌ బ్యాంకు సాయం

శ్రీకాళహస్తివద్ద నోడ్‌ అభివృద్ధికి జపాన్‌కు చెందిన ఆసియాఅభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆర్థికసాయం చేయనుంది. వీసీఐసీ పథకానికి ఈ బ్యాంకు మొత్తం రూ.40,799 కోట్లు(635 మిలియన్‌ డాలర్లు) రుణం అందించనుంది. దీన్ని మూడు దశల్లో ఆ సంస్థ విడుదల చేస్తుంది. నాయుడుపేట వద్ద రూ.138 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నారు.

డ్రోన్‌ల ద్వారా సర్వే

వీఐసీఐ పథకంలో భాగంగా ఏర్పాటయే నోడ్‌ల పైన ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేస్తోంది. మొత్తం నాలుగు నోడ్‌లలో ఎలాంటి పరిశ్రమలు పెట్టవచ్చు, అక్కడి అనుకూలతలు, వనరులు తదితర అనేక అంశాలపై అధ్యయనం జరుపుతోంది. ఈ బాధ్యతలను జురాన్‌ సంస్థకు అప్పగించారు. డ్రోన్ల సాయంతో ఆ సంస్థ పరిసరాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తుంది.

Link to comment
Share on other sites

రేణిగుంట వద్ద ఎలక్ట్రానిక్స్‌ హబ్‌

వికృతమాల వద్ద 501 ఎకరాల గుర్తింపు

ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

విడుదలకానున్న రూ.111.42 కోట్లు

1500 మందికి ఉద్యోగావకాశాలు

ఈనాడు - అమరావతి

1ap-main9a.jpg

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఎలక్ట్రానిక్స్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రేణిగుంట విమానాశ్రయానికి దగ్గర్లో ఏర్పేడు మండల పరిధిలో ఉన్న వికృతమాల గ్రామంలో ఈ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ 501 ఎకరాల స్థలాన్ని కూడా ఇందుకోసం గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ కేంద్రాలను స్థాపించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయడానికి సమ్మతి తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రేణిగుంటకు సమీపంలోని వికృతమాల గ్రామం వద్ద ఎలక్ట్రానిక్స్‌ తయారీ సముదాయం(ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్కాక్చరింగ్‌ క్లస్టర్‌)ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాలకల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఇక్కడ 501.4 ఎకరాల స్థలాన్ని గుర్తించి దాన్ని ‘ఈఎంసీ’గా అభివృద్ధి చేయడానికి సిద్ధపడుతోంది. ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమకు ఇక్కడ ప్రపంచశ్రేణి ప్రమాణాలతో కూడిన సదుపాయాలు కల్పించాలనేది లక్ష్యం. 501 ఎకరాల్లో మౌలికసదుపాయాల కల్పన తదితరాలకు పోనూ 323.88 ఎకరాల్లో పరిశ్రమలకు స్థలాలు కేటాయించనున్నారు. ఈ సముదాయం అభివృద్ధికి మొత్తం రూ.235.36 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపు సగం నిధులు అందజేయనుంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం తుది ఆమోదం తెలిపింది. దాంతో ఈ క్లస్టర్‌ అభివృద్ధికి కేంద్రం నుంచీ రూ.111.42 కోట్లు విడుదల కానున్నాయి.

27 కంపెనీల దరఖాస్తు..

ఎలక్ట్రానిక్స్‌ తయారీ సముదాయం ఏర్పాటు ద్వారా 1500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పలు ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. 27 కంపెనీలు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నాయి. పరిశ్రమలశాఖ ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. మరోవైపు ఏపీఐఐసీ కూడా ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌ ప్రాంతంలో ఇప్పటికే రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఫ్యాక్టరీ షెడ్డు కూడా నిర్మించింది. త్వరలోనే ఇక్కడ పలు ప్రతిష్ఠాత్మక ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు తమ యూనిట్లను నెలకొల్పనున్నాయి.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

కాగితాల నుంచి..కార్యరంగంలోకి!

నోడ్‌ సమగ్ర నివేదిక సిద్ధం

భూసేకరణకు రూ.350 కోట్లు?

త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, తిరుపతి

శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల నడుమ నెలకొల్పనున్న భారీ పారిశ్రామిక ప్రాంతం (నోడ్‌)కు సంబంధించి సవివర నివేదిక రూపుదిద్దుకుంది. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగేముందు కాగితాలపై సమగ్ర సమాచారంతో ‘డాక్యుమెంటేషన్‌’ ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఈ నివేదిక ఆధారంగా త్వరలోనే భూసేకరణ ప్రకటన జారీ చేయనున్నారు. చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా (సీవీఐసీ)లో కీలకంగా భావిస్తున్న శ్రీకాళహస్తి నోడ్‌.. జిల్లాలో పారిశ్రామిక రంగానికి మణిహారంగా మారనుంది.

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా శ్రీకాళహస్తి-తొట్టంబేడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇందుకోసం సుమారు 11 వేల ఎకరాలు అవసరమని గుర్తించిన అధికారులు ఆ మేరకు భూసేకరణకు సిద్ధమయ్యారు. ఇందుకు రూ.350 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా రూపొందించారు. దీనిపై డాక్యుమెంటేషన్‌ సిద్ధం చేసినందున.. ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర వచ్చిన వెంటనే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయాలని యోచిస్తున్నారు. నిర్దేశించిన స్థలాన్ని ఏపీఐఐసీకి అప్పగిస్తే.. పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం కానుంది. రెవెన్యూ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం మొత్తం సేకరించాల్సిన భూమి 11 వేల ఎకరాలు కాగా.. పట్టా భూములు సుమారు 322.98 ఎకరాలు. అసైన్డ్‌ భూములు 7744.81 ఎకరాలు, ప్రభుత్వ భూములు 2937.40 ఎకరాలుగా గుర్తించారు. ఈ మొత్తం 16 గ్రామాల పరిధిలో ఉంది. పట్టా భూముల అనుభవదారులు ఎవరనేది అధికారులు రికార్డులు పరిశీలించి సిద్ధం చేశారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు ఎక్కడెక్కడ, ఎన్ని, ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఒక నివేదిక రూపొందించారు. తద్వారా నష్టపరిహారం చెల్లించేందుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రైవేటు స్థలాలతో పాటు ప్రభుత్వ, డీకేటీ భూముల్లో సేద్యం చేసుకుంటున్న వారికి సైతం పరిహారం అందించాల్సి ఉంది. ప్రస్తుతం వేలవేడు గ్రామ పరిధిలో అత్యధికంగా 2101.83, ఇనగలూరులో 1317.30 ఎకరాలను సేకరించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే భూసేకరణకు సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికే భూసేకరణకు అవసరమైన కసరత్తును సైతం అధికారులు పూర్తి చేశారు. త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసి ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించి లబ్ధిదారులకు పరిహారం చెల్లించనున్నారు. జిల్లాలోని తూర్పు ప్రాంతంలోనే సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పారిశ్రామిక వాడను ఆనుకుని హీరో మోటార్స్‌ తమ కంపెనీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వీటికి అనుసంధానంగా నోడ్‌ను అభివృద్ధి చేస్తే.. చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్‌లో ఇది కీలకం కానుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, కృష్ణపట్నం, చెన్నై పోర్టులు దగ్గరగా ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి.

Link to comment
Share on other sites

  • 5 weeks later...

రాయ్‌పూర్‌ రోడ్డుకు సమాంతరంగా రైలు మార్గం

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విశాఖ పోర్టుకు అనుసంధానం

సరకు రవాణా పెంచేలా ఎక్స్‌ప్రెస్‌ మార్గం

విశాఖ-రాయ్‌పూర్‌ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం చొరవ

ఈనాడు - అమరావతి

విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాజధానికి ఉన్న జాతీయ రహదారి బదులుగా ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని అభివృద్ధి చేసే అంశం ఓ కొలిక్కి వస్తోంది. విశాఖ-రాయ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే పచ్చజెండా వూపింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవ తీసుకొని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలతో చర్చలు ప్రారంభించింది. 500 కి.మీ. పొడవైన ఈ రోడ్డుకు సమాంతరంగా రైలు మార్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రహదారి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో పలు దఫాలు చర్చించారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలతో ఈ ప్రాజెక్టుపై చర్చించే చొరవను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొంది. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ రహదారులు, భవనాల ముఖ్యకార్యదర్శి సుమితా దావ్ర రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కార్యదర్శి, ప్రజాపనుల కార్యదర్శితో చర్చించారు. ఛత్తీస్‌గఢ్‌లో 166 కి.మీ., ఒడిశాలో 200 కి.మీ. మేర ఉండే ఈ రహదారిని తొలుత నాలుగు వరుసలుగా నిర్మిస్తారు. మరో రెండు వరుసల పెంచుకోవడంతోపాటు, సమాంతరంగా రైల్వే లైన్‌ వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం పలు సూచనలు, ప్రతిపాదనలు చేసింది.

రవాణా పార్కులు అభివృద్ధి చేద్దాం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మార్గాన్ని మలుపులు లేకుండా తిన్నగా (స్ట్రయిట్‌ అలైన్‌మెంట్‌) నిర్మించాలని చేసిన సూచనపై చర్చించారు. ఇలా చేస్తే రెండు ప్రాంతాల మధ్య దూరం కూడా కొంత మేరకు తగ్గుతుందని రెండు రాష్ట్రాల అధికారులు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి సరకు రవాణాకు విశాఖ నౌకాశ్రాయాన్ని వినియోగించుకోవడంలో ఈ రహదారి కీలకంగా మారుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ మార్గం వెంబడి రవాణా పార్కులు అభివృద్ధి చేయాలనే ఆసక్తిని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కనబరుస్తోంది. రహదారితోపాటు, రైలు మార్గం ఉంటే విశాఖ పోర్టుకు సరకు రవాణా మరింత సులభమవుతుంది. సరకు రవాణాకు కీలకమైన ఉత్తర - దక్షిణ కారిడార్‌ రోడ్డును కూడా ఈ ఎక్స్‌ప్రెస్‌ మార్గంతో అనుసంధానించే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ దృష్టిపెట్టింది. ఉత్తర దక్షిణ కారిడార్‌ను మహారాష్ట్రలోని నాగపూర్‌ దగ్గర కలిపే అవకాశాలున్నాయి. ఈ చర్చల్లో రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ ముఖ్య ఇంజినీర్‌ మనోహర్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి అనిల్‌ దీక్షిత్‌తోపాటు రైల్వే అధికారులు పాల్గొన్నారు.

సరకు రవాణాలో ఈ మార్గం కీలకం విశాఖపట్నం - రాయ్‌పూర్‌ రోడ్డు అభివృద్ధి సరకు రవాణాలో కీలకంగా మారనుంది. మన రాష్ట్రంతోపాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆ రెండు రాష్ట్రాల నుంచీ విశాఖ నౌకాశ్రయానికి అనుసంధానం పెరుగుతుంది. అలాగే ఉత్తర - దక్షిణ కారిడార్‌కు అనుసంధానించడం ద్వారా విశాఖ పోర్టుకు ఎగుమతి దిగుమతుల అవకాశాలు పెరుగుతాయి. ఈ రహదారిని విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కూ అనుసంధానించుకోవచ్చు.
- సుమితా దావ్ర, ముఖ్యకార్యదర్శి, రహదారులు-భవనాలు
Link to comment
Share on other sites

ప్రగతికి దారి

మారనున్న జిల్లా స్వరూపం

పారిశ్రామికంగా కీలకం

ముత్తుకూరు రోడ్డుకు రూ.1,690 కోట్లు

nlr-top1a.jpg

జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త పరిశ్రమలు రానున్నాయి. భవిష్యత్తులో రాకపోకలు సాగించటానికి వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా కొత్త ‘మార్గాలు’ అందుబాటులోకి రానున్నాయి. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందే కొద్దీ కృష్ణపట్నం ఓడరేవుకు వెళ్లే మార్గం అవసరం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఇరుకు మార్గంగా ఉన్న ముత్తుకూరు రోడ్డును విస్తరించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ, అమల్లోకి రాలేదు. త్వరలో దీనికి సంబంధించిన పనుల్లో కదలిక రానుంది.

ఈనాడు-నెల్లూరు

పారిశ్రామికంగా రాష్ట్రంలో జిల్లా కీలకంగా మారుతున్న తరుణంలో రోడ్డు విస్తరణ పనులను నిర్వహించటానికి కసరత్తు మొదలుపెట్టారు. దీనికి ప్రభుత్వం నుంచి రూ.1,690 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లు తయారు చేసే పనిలో ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత టెండరు పక్రియ మొదలుకానుంది. ఇదే కాకుండా నాయుడుపేట, ఓజిలి మండలాలను కలుపుతూ సాగరమాల ప్రాజెక్టు కింద మరో భారీ రహదారి నిర్మాణం కానుంది. ఇవన్నీ పూర్తయితే జిల్లా పారిశ్రామిక పరుగులు పెట్టడానికి ఆస్కారం ఉంది.

కీలకంగా మారిన రోడ్లు

విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవ, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవ జిల్లా నుంచే వెళ్లనున్నాయి. వాటికి సంబంధించి సముద్ర తీరం వెంట రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది. పోర్టును అనుసంధానం చేస్తూ భారీ రహదారుల నిర్మాణం, అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇందులో భాగంగా ఇరుకు మార్గంగా ఉన్న ముత్తుకూరు రోడ్డును విస్తరించటానికి ప్రతిపాదనలను తయారు చేశారు. కృష్ణపట్నం ఓడరేవుకు భారీ వాహనాలు వెళ్లాలంటే సాధ్యం కావటం లేదు. ఇదే సమయంలో దగదర్తి దగ్గర విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయిన తర్వాత పోర్టుకు అనుసంధానం చేయాలన్న ఆలోచన ఉంది. అక్కడిన ఉంచి కూడా వాహనాల రాకపోకలు పెరగాలంటే కచ్చితంగా ముత్తుకూరు రోడ్డును పూర్తిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. హరనాథపురం జంక్షన్‌ నుంచి ముత్తుకూరు వరకు సుమారు 22 కి.మీలు ఉంటుంది. దీన్ని నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి రూ.1,690 కోట్ల మొత్తం విడుదలైంది.

డీపీఆర్‌లు తయారు చేస్తున్నాం: కలెక్టర్‌

ముత్తుకూరు రోడ్డును నాలుగు వరుసల రహదారిగా విస్తరించటానికి డీపీఆర్‌లను తయారు చేసే పక్రియ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు చెప్పారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. భవిష్యత్తులో పారిశ్రామికీకరణ దిశగా జిల్లా రాష్ట్రంలో కీలకం కానుందని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మరికొన్ని రోడ్లను విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవకు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

ఏడీబీ చేతిలో రహదారుల భవిత
11 ప్రాజెక్టుల నివేదికల పరిశీలన
తీరం వెంబడి రోడ్ల అభివృద్ధిపై దృష్టి
వీసీఐసీ రహదారుల అంచనా వ్యయం రూ.3806 కోట్లు
ఈనాడు - అమరావతి

విశాఖపట్నం - చెన్నైల మధ్య పరిశ్రమల అభివృద్ధిలో రహదారుల విస్తరణే కీలకం. ఈ ‘పారిశ్రామిక మార్గం’లో విస్తరించాల్సిన రహదారులకు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) రుణం మంజూరుకు సుముఖత ప్రకటించింది. ఈ రుణంతో చేపట్టే పనుల్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. 11 రహదారుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ఏడీబీకి రహదారులు భవనాల శాఖ అందించింది. ఇందులో ఒక ప్రాజెక్టుకి ఇప్పటికే ఏడీబీ పచ్చజెండా వూపింది. మిగిలినవాటిని పరిశీలించి అది తుది నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఏడీబీ రుణంతో వివిధ మార్గాల్లో 372కి.మీ. మేర రహదారుల్ని రెండు నుంచి నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. సంబంధిత వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉండగా.. పనులను ఆంధ్రప్రదేశ్‌ రహదారుల అభివృద్ధి సంస్థ చేపడుతోంది.

vizag-chennai2.jpg

పారిశ్రామికవాడలకు అనుసంధానం
విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌(వీసీఐసీ)లో ఉన్న పారిశ్రామికవాడలకు అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో రాష్ట్రం స్థానాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన పెంపు కీలకమనీ, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండేళ్ల కిందట వీసీఐసీ అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో 11 రోడ్లను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, సమీపంలోని ప్రధాన నగరాల్ని అనుసంధానించేలా వీటిని విస్తరించనున్నారు. ఇందుకు అవసరమైన నిధుల్ని ఏడీబీ రుణం ద్వారా సమకూరుస్తారు. వీటిలో సామర్లకోట-రాజానగరం రహదారి ప్రతిపాదనలు, డీపీఆర్‌కు ఏడీబీ పచ్చజెండా వూపింది. ఈ రెండు వరుసల రహదారి మార్గం ఎన్‌హెచ్‌ 16కు అనుసంధానమవుతుంది. 30కి.మీ. పొడవుండే ఈ రోడ్డుకు రూ.317 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మార్గానికి ఇప్పటికే బిడ్లు దాఖలు చేశారు. తొమ్మిది రహదారులకు సంబంధించిన డీపీఆర్‌లను పూర్తిచేసి ఏడీబీకి పంపించారు. అక్కడి నుంచి ఆమోదం లభించగానే టెండర్ల దశకు వెళ్తామని అధికారవర్గాలు తెలిపాయి. ఇందుకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. 27కి.మీ. మేర ఉండే నాయుడుపేట - వెంకటగిరి మార్గానికి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు.సంబంధిత పనుల్ని ఏపీఐఐసీ చూస్తోంది. ఈ పనులతోపాటు రహదారి భద్రత వ్యవహారాలకు సంబంధించిన పనుల్నీ ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాలనుకొంటున్నారు. ఇందుకు రూ.63కోట్లు వ్యయం అవుతుంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

గడువులోగా పూర్తి చేసిన సంస్థలకు ప్రోత్సాహకాలు

పరిశీలించాలని సూచించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఈనాడు, అమరావతి: విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవ (వీసీఐసీ) మొదటి దశ పనులు 2019 మార్చిలోగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గడువు ముందే పనులు పూర్తి చేసిన సంస్థలకు ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. రూ.5,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన కారిడార్‌ పనుల్లో మొదటి విడత రూ.2.200 కోట్ల విలువైన పనుల కోసం టెండర్లు పిలిచిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రస్తావించారు. ఈ ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూడాలని సూచించారు. రెండో విడత పనులపైనా ఇప్పటి నుంచి దృష్టి సారించాలన్నారు. అమరావతి, విజయవాడలో ఇదే కారిడార్‌లో చేపట్టే పనులపైనా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే ప్రాజెక్టులో భాగంగా మహా విశాఖ నగరపాలక సంస్థ సోలార్‌ విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్‌ హరినారాయణ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...