Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

బందరులో భూసమీకరణ

33,337 ఎకరాలకు అధికార ప్రకటన జారీ

ఓడరేవుకు 5,054 ఎకరాలు

పారిశ్రామిక నడవాకు 28 వేల ఎకరాలు

ఈనాడు - అమరావతి

19ap-main6a.jpg

మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధి, అనుబంధంగా పారిశ్రామిక నడవా ఏర్పాటు కోసం అవసరమైన 33,337.67 ఎకరాల భూమిని సమీకరించేందుకు మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (మడ) ఆదివారం అర్ధరాత్రి తర్వాత భూ సమీకరణ ప్రకటన జారీ చేసింది. ఓడరేవు అభివృద్ధి కోసం 5,054.03 ఎకరాలు, పారిశ్రామిక నడవా ఏర్పాటుకు 28,283.64 ఎకరాలు సమీకరించనున్నారు. దీనిలో 14,601.96 ఎకరాలు పట్టా భూములు కాగా, 8,957.51 ఎకరాలు అసైన్డ్‌ భూములు. 9,778.20 ఎకరాలు ప్రభుత్వ భూములు. భూమిని అభివృద్ధి చేసిన తర్వాత భూ సమీకరణలో భాగస్వాములైన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. సాగునీటి లభ్యత లేని (పుంజ) భూములకు ఏడాదికి రూ.30 వేలు, సాగునీటి లభ్యత కలిగిన (నంజ) భూములకు ఏడాదికి రూ.50 వేలు చొప్పున పదేళ్ల పాటు కౌలు కింద చెల్లిస్తారు. పుంజ భూములకు చెల్లించే కౌలు ఏటా రూ.3 వేలు చొప్పున, నంజ భూములకు చెల్లించే కౌలు ఏటా రూ.5 వేలు చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. ఆక్రమిత, ఇతరత్రా భూములకు మాత్రం ఈ వార్షిక కౌలు చెల్లింపు వర్తించదు. భూ సమీకరణలో భాగంగా భూములిచ్చే రైతులకు పట్టా,

అసైన్డ్‌ భూములకు అందించే ప్యాకేజీ వివరాలను ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. భూ సమీకరణతో జీవనోపాధి కోల్పోతున్న వారు సమీకరణకు ముందు దారిద్య రేఖకు దిగువనుంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి నెలకు రూ. 2,500 చొప్పున పదేళ్ల పాటు పింఛను చెల్లిస్తారు. నోటిఫికేషన్‌ తేదీ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నవారందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తారు. పేద కుటుంబాలకు స్వయం ఉపాధి కోసం రూ.25 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు అందిస్తారు.

చట్టం ప్రకారం వెసులుబాటు కోసం.. ప్రభుత్వం తొలుత భూసేకరణకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు 12,144.86 ఎకరాల కోసం గత ఏడాది ఆగస్టు 29న సేకరణ ప్రకటన జారీ చేసింది. దీనిపై అప్పట్లో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలు రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయి. పలువురు తమ భూములను సేకరణ నుంచి మినహాయించాలని కోర్టుకు వెళ్లారు. ఇంకా విచరణలో ఉంది. దాంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం తర్జనభర్జనల అనంతరం ఏడాది జులైలో సమీకరణ ద్వారా భూములు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జారీ చేసిన సేకరణ ప్రకటన గడువు ఈ ఏడాది ఆగస్టులో పూర్తి కానుండడంతో దీన్ని మరో ఏడాది పొడిగించారు. ప్రస్తుతం సమీకరణ విధానాన్ని అనుసరిస్తున్నా.. చట్టం ప్రకారం ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంతో సేకరణ ప్రకటనను మరో 12 నెలలు పొడిగించారు.

19ap-main6b.jpg

 

19ap-main6c.jpg

Link to comment
Share on other sites

  • Replies 518
  • Created
  • Last Reply

veedu matram asalu disappoint cheyyadu. veedi babu a rojullo teluguganga kattoddu ani NTR meda gola chesadu ante chinnappudu etla sadhyam anukune vadini.

ippudu veedu asalu denikaina addam padi potunadu.

 

 

సంతకం పెడితే భూమి పోయినట్లే!
Sakshi | Updated: September 26, 2016 22:12 (IST)
సంతకం పెడితే భూమి పోయినట్లే!
మచిలీపట్నం : బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్‌ కోసం భూసమీకరణకు రంగం సిద్ధమైంది. బందరు మండలంలో 33,601 ఎకరాల భూమిని సమీకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మచిలీపట్నం డీప్‌వాటర్‌ పోర్ట్‌ మరియు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు కొరకు భూసమీకరణ పధకం భాగస్వామ్య దరఖాస్తు, ప్రమాణ పత్రం ఫారం–3 ని జేసీ గంధం చంద్రుడు సోమవారం తన చాంబర్‌లో విడుదల చేశారు. అలాగే భూసమీకరణపై అభ్యంతరాలు, అభిప్రాయాన్ని వ్యక్తీకరించటం కోసం ఫారం–2ను విడుదల చేశారు. వీటిని డెప్యూటీ కలెక్టర్లు, వీఆర్వోలకు సోమవారం సాయంత్రానికి అందజేశారు. మంగళవారం బందరు మండంలోని 27 గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామంలో డెప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్, వీఆర్వోలు అంగీకారపత్రాలు, అభ్యంతర పత్రాలు స్వీకరించనున్నారు. భూసమీకరణకు సంబంధించి అంగీకారపత్రాన్ని 16 పేజీల్లో ముద్రించగా, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఇచ్చిన దరఖాస్తును రెండు పేజీల్లో ముద్రించారు. అంగీకరపత్రానికి రశీదు, విచారణ నోటీసు అనే పేరుతో ప్రత్యేక కాలమ్‌ను ఇవ్వగా, అభ్యంతర పత్రానికి ఎలాంటి రశీదును కల్పించలేదు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది.

అంగీకారం పత్రం ఇచ్చిన మరుసటి రోజే భూమి స్వాధీనం
బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముద్రించిన ఫారం–3లో రైతులు వివరాలు నమోదు చేసి సంతకం పెడితే మరుసటి రోజే సంబంధిత భూమిని సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఫారం–3లో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అధారిటీ భూసమీకరణ పధకంలో వ్యక్తి లేదా వ్యక్తుల భాగస్వామ్యం నిమిత్తం భూమిని సమీకరించిన అనంతరం అభివృద్ధి చేసి దానిలో నిష్పత్తి ప్రకారం కొంత భూమిని పరిహారం నిమిత్తం ఇవ్వటం, ఇతర రాయితీలు ఇచ్చేందుకు అభ్యర్ధన అంటూ ముద్రించారు. రైతుల పేరు, వయసు, తండ్రి పేరు, నివాసం తదితర వివరాలు పూర్తి చేయాల్సి ఉంది. భూసమీకరణకు భూమిని ఇస్తే ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ వివరాలను ఫారం–3లో ముద్రించారు. భూమిని ఇచ్చేందుకు అంగీకరిస్తున్నానని తన పేరున ఉన్న భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధారాలను పరిశీలన, రికార్డు కోసం విచారణ సమయంలో ఒరిజినల్‌ పత్రాలను చూపుతామని అంగీకరపత్రంలో పేర్కొన్నారు.

మంత్రి, ఎంపీ సమాలోచనలు
భూసమీకరణ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అతిథిVýృహంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. పార్టీ సమీక్షా సమావేశం పేరుతో ఆర్‌అండ్‌బీ అతిథిVýృహంలో పలు దఫాలుగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవటం, ఒకరిద్దరు టీడీపీ నాయకులను ఆర్డీవో కార్యాలయానికి పంపే ప్రక్రియ కొనసాగింది. ఓ వైపు ఈ తతంగం జరుగుతుండగానే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా, లేదా గ్రామాల్లోకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశాలపై ఆరా తీస్తే పనిలో కొందరు టీడీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు.

 

టీడీపీ నాయకులు ఎంతగా ప్రలోభపెట్టినా తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు ఖరాకండిగా చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Jagan valla AP ki yenti vupayogam? Intha neecham gaa development ki addu paduthu, malli special status vaste CBn mukham chusi companies raavu, tax incentives chusi companies vastayi ani pragalpalu palukutunnadu.. aa companies ki lands yevadu istadu? Veedi pulivendula tho modalu petti govt motham lagesi vundalsindi eepatiki.. not sure why govt is giving space for him to play cheap politics and anti social element tricks in AP

Link to comment
Share on other sites

e manda antha ippudu Badar vipu paddara

 

 

51475338962_625x300.jpg

 

రైతులకు భిక్ష వేస్తారా ?

 

ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వడ్డే మండిపాటు

భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం–2 ఇవ్వండి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూ దందా
రైతుల తరుఫున పోరాటం
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి
మచిలీపట్నం :
‘భూసమీకరణలో రైతు నుంచి ఎకరం భూమి తీసుకుని 25 సెంట్ల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది... రైతులకు భిక్ష వేస్తారా?  అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. బందరు పోర్టు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూ దోపిడీని నిరసిస్తూ భూ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆశీర్వాద్‌ భవన్‌లో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ పేరుతో 33,601 ఎకరాలు తీసుకునేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తోందన్నారు. నిర్మాణానికి 760 ఎకరాలు చాలని, గతంలోనే 450 ఎకరాలకు పైగా భూమిని పోర్టు నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఇచ్చేసిందని, అయితే  ఇంత వరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. పోర్టును ప్రైవేటు సంస్థకు కాకుండా విశాఖపట్నం పోర్టు అథారిటీకి అప్పగించాలని కోరారు. ప్రభుత్వ భూదందాను అడ్డుకునేందుకు ప్రజలంతా అక్టోబరు 4వ తేదీలోగా ఎంఏడీఏ అధికారులకు ఫారం–2ను అందజేయాలని సూచించారు.

 

రాజకీయాలు పక్కన పెట్టండి
రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా రైతులు ప్రభుత్వంపై పోరాటం చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. భూములు తీసుకునేందుకు ప్రభుత్వం కులాన్ని, మతాన్ని, పార్టీని, నాయకులను ప్రయోగిస్తుందని, అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టి మంత్రులు బతిమలాడుతారని, రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భూసమీకరణకు అభ్యంతరం తెలిపే ఫారం–2 ఇవ్వకుంటే భూసమీకరణకు అంగీకరించినట్లేనన్నారు. హైకోర్టు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌ రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ భూములు కాపాడుకునేందుకు రైతులకు పోరాటమే శరణ్యమన్నారు.

Link to comment
Share on other sites

e manda antha ippudu Badar vipu paddara

 

 

51475338962_625x300.jpg

 

రైతులకు భిక్ష వేస్తారా ?

 

ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వడ్డే మండిపాటు

భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం–2 ఇవ్వండి

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూ దందా

రైతుల తరుఫున పోరాటం

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి

మచిలీపట్నం :

‘భూసమీకరణలో రైతు నుంచి ఎకరం భూమి తీసుకుని 25 సెంట్ల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది... రైతులకు భిక్ష వేస్తారా?  అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. బందరు పోర్టు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూ దోపిడీని నిరసిస్తూ భూ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆశీర్వాద్‌ భవన్‌లో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ పేరుతో 33,601 ఎకరాలు తీసుకునేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తోందన్నారు. నిర్మాణానికి 760 ఎకరాలు చాలని, గతంలోనే 450 ఎకరాలకు పైగా భూమిని పోర్టు నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఇచ్చేసిందని, అయితే  ఇంత వరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. పోర్టును ప్రైవేటు సంస్థకు కాకుండా విశాఖపట్నం పోర్టు అథారిటీకి అప్పగించాలని కోరారు. ప్రభుత్వ భూదందాను అడ్డుకునేందుకు ప్రజలంతా అక్టోబరు 4వ తేదీలోగా ఎంఏడీఏ అధికారులకు ఫారం–2ను అందజేయాలని సూచించారు.

 

రాజకీయాలు పక్కన పెట్టండి

రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా రైతులు ప్రభుత్వంపై పోరాటం చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. భూములు తీసుకునేందుకు ప్రభుత్వం కులాన్ని, మతాన్ని, పార్టీని, నాయకులను ప్రయోగిస్తుందని, అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టి మంత్రులు బతిమలాడుతారని, రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భూసమీకరణకు అభ్యంతరం తెలిపే ఫారం–2 ఇవ్వకుంటే భూసమీకరణకు అంగీకరించినట్లేనన్నారు. హైకోర్టు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌ రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ భూములు కాపాడుకునేందుకు రైతులకు పోరాటమే శరణ్యమన్నారు.

vidi champeyandi daridarapu vedava

Link to comment
Share on other sites

అడ్డుకుంటే వైసీపీ నేతలకు గాజులు తొడిగి, పసుపు పూస్తాం’

 

636110849078303094.jpg
  • పోర్టును అడ్డుకుంటే ఖబడ్దార్‌
  • గాజులు తొడిగి, పసుపు పూసి పంపిస్తాం
  • అభివృద్ధిని ఓర్వలేని వారిని తరిమే రోజులొచ్చాయ్‌
  • వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్‌
ఆంధ్రజ్యోతి-అమరావతి: మచిలీపట్నం పోర్టును అడ్డుకుంటే ఖబడ్డార్‌.. అంటూ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతలను హెచ్చరించారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు, టౌన్‌షిప్‌, పారిశ్రామికవాడ కోసం భూములిస్తామని రైతులు ముందుకొస్తుంటే వైసీపీ నేతలు కొందరు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని నేతలను తరిమికొట్టే రోజులకు దగ్గరొచ్చాయన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని, వారికి గాజులు తొడిగి, పసుపుపూసి, బొట్టుపెట్టి పంపిస్తామని హెచ్చరించారు. భూములివ్వడానికి ముందుకొస్తున్న రైతులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేత సి.రామచంద్రయ్య, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, కమ్యూనిస్టు నేతలు సమావేశాలు నిర్వహించి రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న పోర్టు అభివృద్ధికి ఆటంకపరిస్తే ఊరుకునేది లేదన్నారు.
 
 
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
రాజధానిని, పట్టిసీమను అడ్డుకున్న రీతిలోనే మచిలీపట్నం పోర్టును అడ్డుకునేందుకు రాబందుల్లాగా వాలుతున్నారని దుయ్యబట్టారు. ఒక వైపు రైతులను చైతన్యపరిచే ప్రక్రియలో అధికారులుంటే మంగళగిరి ఎమ్మెల్యే ఇక్కడకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని ఆరోపించారు. చెన్నై-విశాఖ ఇండస్ట్రీస్‌ కారిడార్‌ పరిధిలో ఇండస్ట్రియల్‌ నోడ్‌ మచిలీపట్నంలో ఏర్పాటుచేస్తామని సీఎం తెలిపారన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు వచ్చే అవకాశముందని చెప్పారు. అసైన్డ్‌ భూముల పరిహారం విషయంలోను, పట్టాల్లేకుండా ఎప్పటి నుంచో రైతులు సాగు చేసుకున్న భూముల విషయంలోను ప్రభుత్వం వారికి స్పష్టమైన హామీ ఇస్తుందని తెలిపారు.
 
 
ఈనెల 11న మచిలీపట్నం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (మడా) కార్యాలయాన్ని కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రారంభిస్తున్నామని, త్వరలో సీఎం చంద్రబాబునాయుడు మడాకు చైర్మన్‌ను కూడా నియమిస్తారని చెప్పారు. పోర్టుకు సంబంధించి ఏవైనా అర్థం కాకుంటే వచ్చి అడిగి తెలుసుకోవాలని, చెడగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హితలువ పలికారు. సింగపూర్‌ సంస్థలతో మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన చేస్తున్నామని, పోర్టు అభివృద్ధి నవయుగ కంపెనీ చేపడుతుందని తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...