Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

మచిలీపట్నం పోర్టుకు భూసమీకరణ
 
 
636048844224563779.jpg
విజయవాడ : మచిలీపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూసమీకరణ కింద భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసమీకరణ విధానాన్ని ప్రకటిస్తూ మున్సిపాలిటీ శనివారం జీవో జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం మచిలీపట్నంలోని 28 రెవెన్యూ గ్రామాల్లో భూ సమీకరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. సోమవారం నుంచి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. పోర్టుకై భూములు ఇచ్చిన మెట్ట రైతులకు ఎకరానికి వెయ్యి చదరపు గజాల నివాస స్థలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Link to comment
Share on other sites

  • Replies 518
  • Created
  • Last Reply
బందరు పోర్టుకు భూసమీకరణ
 
  • 14,427 ఎకరాల పూలింగ్‌ కోసం జీవో
  • రైతులకు రాజధాని తరహా ప్యాకేజి
  • తొలి విడతలో 2200 ఎకరాలకు రేపు నోటీస్‌
విజయవాడ, జూలై 23(ఆంధ్రజ్యోతి): బందరు పోర్టుకు మరో అడుగు ముందుకు పడింది. పదహారేళ్ల పోర్టు కల వాస్తవరూపం దాల్చబోతున్నది. బందరులో డీప్‌ వాటర్‌ పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ కోసం భూసమీకరణకు మచిలీపట్నం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ(మడా)కు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. భూసమీకరణ ద్వారా (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌) రైతుల నుంచి భూములను సమీకరిస్తామని ప్రభుత్వం అందులో పేర్కొంది. రైతుల నుంచి సమీకరించే పట్టా భూములతో పాటు అసైన్డ భూములకు కూడా రాజధాని అమరావతి కోసం ప్రకటించిన తరహాలోనే ప్యాకేజీని ప్రకటించింది. పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ కోసం మొత్తం 22,815 ఎకరాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో పోర్టు కోసం 5వేల ఎకరాలు పోనూ మిగిలిన భూమిలో పరిశ్రమలు, టౌనషి్‌ప, రిక్రియేషన వంటి ఇతర అవసరాలకు కేటాయించారు. పోర్టు, పరిశ్రమలకు అవసరమైన భూమిలో 8387 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 14,427 ఎకరాలు రైతుల చేతిలో ఉన్నాయి. మొదటి విడత మీకరణలో పోర్టు కోసం రైతుల నుంచి తీసుకోవలసిన 2,282 ఎకరాలకే ప్రభుత్వం సోమవారం నోటీసు జారీ చేయనున్నది. రైతులెవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ప్యాకేజీలు ప్రకటించారు. పోర్టు కోసం సమీకరించే భూమి బందరు మండలంలోని మంగినపూడి, తవిశపూడి, గోపువానిపాలెం, పోతేపల్లి, కరగ్రహారం, మేకవానిపాలెం గ్రామాలలో విస్తరించి ఉంది.
 
ఎకరం పట్టా భూమికి 1450 గజాలు
మాగాణి పట్టా భూములకు ఎకరానికి వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్‌, 450 గజాల కమర్షియల్‌ ప్లాట్లను ఇస్తారు. అదే మెట్ట భూముల రైతులకైతే ఎకరానికి వెయ్యి గజాలు రెసిడెన్షియల్‌, 200 గజాలు కమర్షియల్‌ ప్లాట్లు ఇస్తారు. అసైన్డ భూమి ఉన్న మాజీ సైనికులు, సమరయోధులకు మాగాణి భూమి ఎకరానికి వెయ్యి గజాల రెసిడెన్షియల్‌, 450 గజాల కమర్షియల్‌ ప్లాట్‌ ఇస్తారు. మెట్ట భూమి అయితే ఎకరానికి వెయ్యి గజాల రెసిడెన్షియల్‌, 200 గజాల కమర్షియల్‌ ప్లాట్‌ ఇస్తారు. 1954కు ముందు కేటాయించబడిన అసైన్డ భూములలో మాగాణి అయితే ఎకరానికి వెయ్యి గజాల రెసిడెన్షియల్‌, 450 గజాలు కమర్షియల్‌ ప్లాటు, మెట్ట అయితే వెయ్యి గజాల రెసిడెన్షియల్‌, 200 గజాల కమర్షియల్‌ ప్లాట్‌ కేటాయిస్తారు. 1954 తరువాత కేటాయించబడిన అసైన్డ భూములకు ప్యాకేజీని స్వల్పంగా మార్చారు. వీరికి ఎకరా మాగాణికి 800 గజాల రెసిడెన్షియల్‌, 200 గజాల కమర్షియల్‌ ప్లాట్లు, మెట్ట రైతులకు ఎకరాకు 800 గజాల రెసిడెన్షియల్‌, 100 శాతం కమర్షియల్‌ ప్లాట్లను కేటాయిస్తారు. ఇక... శివాయిజమాదార్‌ భూములకు మాగాణి అయితే ఎకరానికి 500 గజాల రెసిడెన్షియల్‌, 100 గజాలు కమర్షియల్‌ ప్లాట్లు ఇస్తారు. మెట్ట భూమికి ఎకరాకు 500 గజాల రెసిడెన్షియల్‌, 50 గజాల కమర్షియల్‌ ప్లాట్‌ ఇస్తారు. ప్రభుత్వ అభ్యంతరం లేని శివాయిజమాదార్‌ భూములు అయి ఉంటే వాటికీ ఇదేవిధంగా కేటాయిస్తారు. ఇక, భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు ఏటా ఎకరానికి మాగాణి అయితే 50 వేలు, మెట్టకు 30 వేలు చొప్పున కౌలు చెల్లిస్తుంది. నిర్మాణాలు, పౌల్ట్రీ, వృక్షాలు ఉన్నట్టు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం విలువ కట్టి చెల్లిస్తారు. భూసమీకరణకు భూములిచ్చిన ప్రాంతాల్లో నిరుపేదలకు(భూమిలేని వారు) కుటుంబానికి ప్రతి నెలా రూ.2500 చొప్పున పదేళ్లపాటు చెల్లిస్తుంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...

కసరత్తు పూర్తి

జోరందుకున్న క్రయవిక్రయాలు

నేడో, రేపో పోర్టుకు భూ సమీకరణ ప్రకటన జారీ

ఈనాడు - మచిలీపట్నం

రాజధాని అమరావతి తరహాలో మరో భారీ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. మచిలీపట్నం ఓడరేవు, పారిశ్రామిక నడవా సమీకరణ కసరత్తు పూర్తి అయింది. భూముల దస్త్రాల పరిశీలన ముగిసింది. విశాఖ - చెన్నై తీరప్రాంత నడవాలో కీలకమైన బందరు రేవు కీలకమైన అంకం ప్రారంభం కానుంది.

ఇప్పటికే 14,500 ఎకరాల భూముల దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓడరేవు, పారిశ్రామిక నడవా కోసం 36,559.45 ఎకరాలకు సంబంధించి వేర్వేరుగా ప్రకటన ఇవ్వాలని అధికారులు తొలుత భావించారు. మళ్లీ నిర్ణయం మార్చుకుని ఒకే దఫా సమీకరణకు వెళ్తే మేలని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఆది, సోమవారాల్లో ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు పోగా.. దాదాపు 25 వేల ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. నడవాకు సంబంధించి పట్టా భూములు 12 వేల ఎకరాలు, అసైన్డు 9,500 ఎకరాలు అవసరమని గుర్తించారు. పోర్టుకు 2 వేల ఎకరాల పట్టా భూమి, 1,500 ఎకరాల అసైన్డు భూమి అవసరం. రెండింటికి కలిపి 14 వేల ఎకరాలకు పైగా పట్టా భూములు సమీకరించాల్సి ఉంది. దీంతో గ్రామాల్లో స్థిరాస్తి వ్యాపారులు వాలిపోయారు. సమీకరణ పరిధిలోకి వచ్చే భూములకు ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది.

రైతులకు ఆమోదమే కానీ..

పోర్టు, పారిశ్రామిక నడవా కోసం మచిలీపట్నం ప్రాంతంలోని 21 గ్రామాల పరిధిలో 36,559.45 ఎకరాలు అవసరమని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం గత ఏడాది సేకరణకు ప్రకటన జారీ చేయడంతో రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. భూ సమీకరణ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. పరిహారాన్ని ప్రకటించింది. భూములిచ్చిన రైతులకు ఎకరాకు 1,250 గజాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వెయ్యి గజాలు ఇంటి స్థలం, 250 గజాలు వాణిజ్య స్థలం ఉంటుంది. అసైన్డ్‌ భూములకు 800, 100 గజాల నివాస, వాణిజ్య స్థలాలు దక్కనున్నాయి. ఎకరాకు ఏడాదికి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు పదేళ్ల పాటు కౌలు చెల్లించనున్నారు. వ్యవసాయ కూలీలకు నెలకు పింఛను కింద రూ. 2,500 చొప్పున పదేళ్ల పాటు ఇవ్వనున్నారు. పెద్దగా సారవంతమైన భూములు కాకపోవడంతో సమీకరణపై రైతులు సానుకూలంగానే ఉన్నారు. కేవలం వేరుసెనగ, ఆకుకూరలు మాత్రమే పండుతాయి. అయితే.. ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ కావడంతో పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ముందే అమ్మేసుకుంటే ఏకమొత్తంగా డబ్బు వస్తుందన్న ఆలోచనలో రైతులున్నారు. దీంతో ఎకరా రూ. 10 లక్షలలోపు ఉన్న ధర అమాంతం రూ. 25 లక్షలకు ఎగబాకింది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, తదితర ప్రాంతాల నుంచి పలువురు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా పూలింగ్‌లో ఉన్న భూములు కొనుగోలు చేస్తున్నారు. గోపువానిపాలెం, కరగ్రహారం, తవసిపూడి, మంగినపూడి, మేకవానిపాలెం, కాకర్లమూడి, తదితర ప్రాంతాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.

20 యూనిట్ల కింద సమీకరణ

భూసమీకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం అమరావతి తరహా విధానాన్ని అమలు చేయనుంది. మొత్తం విస్తీర్ణాన్ని 20 యూనిట్లుగా విభజించింది. ఒక్కో యూనిట్‌కు.. డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, డిప్యూటీ సర్వే ఇన్స్‌పెక్టరు, సర్వేయర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, తదితర తొమ్మిది పోస్టులను మంజూరు చేసింది. భారీగా భూమిని సమీకరించాల్సి ఉండడంతో పాటు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది కూడా అవసరం ఉంది. పరిపాలన, గణాంక, ప్రణాళిక, ఇంజినీరింగ్‌, ఉద్యానశాఖ, సామాజిక అటవీ విభాగం, తదితర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. సీపీవో, ఏడీ, బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్లు, ఈఈలు, ఆటోక్యాడ్‌ ఆపరేటర్లు, డీఎఫ్‌వో, ఈఈ, డీఈఈ, తదితరులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇతర జిల్లాల నుంచి 21 డిప్యూటీ కలెక్టర్లను డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. వీరు ఏడాది పాటు ఇక్కడ కొనసాగనున్నారు.

Link to comment
Share on other sites

బందరు ఓడరేవు భూసేకరణకు నోటిఫికేషన్‌

అమరావతి: మచిలీపట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఓడరేవు కోసం 5034 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్‌ కోసం 22,283 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ద్వారా భూసేకరణ చేయనున్నారు. భూములిచ్చిన రైతులకు రాజధాని తరహాలోనే రెండు రకాల ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఓ కేటగిరీలో వెయ్యి గజాల నివాస ప్లాట్‌, 200 గజాల వాణిజ్య ప్లాట్‌, మరో కేటగిరీలో వెయ్యి గజాల ప్లాట్‌, 450 గజాల ప్లాట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...