Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply
మెగా సిటీగా బందరు
15-02-2019 09:06:56
 
636858184171527816.jpg
  • పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమలతో సర్వతోముఖాభివృద్ధి
  • మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం
  • 161 గ్రామాలు, రెండు మున్సిపాల్టీలు, ఎనిమిది మండలాలు
  • మొత్తం 1794 చ.కి.మీ విస్తీర్ణం
బందరు అభివృద్ధి దిశగా పయనిస్తోంది. మెగా సిటీగా రూపుదాల్చ బోతోంది. బందరు, పెడనతో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలన్నీ ఈ మెగా సిటీలో అంతర్భాగం కాబోతున్నాయి. పోర్టు నిర్మాణం , పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తుండటంతో భవిష్యత్‌ అవసరాలు, ఉపయోగాలు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. దీంతో మచిలీపట్నానికి మూడు దిక్కులా ఉన్న మండలాలు, వాటి పరిధిలోని గ్రామాలు ఈ మెగా సిటీలోకి రాబోతున్నాయి. ప్రజల సమగ్ర ప్రగతే లక్ష్యంగా రూపొందించిన ఈ మాస్టర్‌ ప్లాన్‌ను ఇటీవలే ప్రభుత్వానికి ముడా వైస్‌ ఛైర్మన్‌ పి. విల్సన్‌బాబు అందజేశారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ ప్లాన్‌కు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బందరు, చుట్టుపక్కల ప్రాంతాలకు మహర్దశ పట్టబోతోంది.
 
 
(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం): ముడా పరిధిలోకి మొత్తం 161 గ్రామాలు రాబోతున్నాయి. మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు, అవనిగడ్డ, కోడూరు, గూడూరు మండలాల్లోని గ్రామాలు ముడా పరిధిలోకి వస్తున్నాయి. బందరుతో పాటు బందరు మండలంలోని 28 పంచాయతీలు, పెడన మున్సిపాల్టీతో పాటు, పెడన మండలంలో ఉన్న చేవేండ్ర, కమలాపురం, చెన్నూరు, ఉరివి, లంకలకలవగుంట, కొప్పల్లి, ముచ్చర్ల, చోడవరం, నేలకొండపల్లి, శెరివర్తర్లపల్లి, ముచ్చిలిగుంట, కొంగన్‌చర్ల, కుమ్మరిగూడెం, గురువిందగుంట, కవిపురం, దిరిశవల్లి, నందిగామ, పెనుమల్లి, పుల్లపాడు, దేవరపల్లి, జింజేరు, నందమూరు, మడక, కూడూరు, నడుపూరు, శింగరాయపాలెం(30 గ్రామాలు), గూడూరుతో పాటు గూడురు మండలంలోని అన్ని గ్రామాలు, గుడ్లవల్లేరుతో పాటు గుడ్లవల్లేరు మండలంలోని అన్ని గ్రామాలు, బంటుమిల్లితో పాటు బంటుమిల్లి మండలంలోని 19 గ్రామాలు, కృత్తివెన్నుతోపాటు కృత్తివెన్ను మండలంలోని 15 గ్రామాలు, కోడూరుతో పాటు కోడూరు మండలంలోని మాచవరం, విశ్వనాథపల్లి, పిట్టలంక, సలీమ్‌పాలెం, లింగారెడ్డిపాలెం, మందపాక, రామకృష్ణపురం గ్రామాలు, నాగాయలంకతోపాటు నాగాయలంక మండలంలోని నంగెగెడ్డ, భావదేవరపల్లి, చోడవరం, టి.కొత్తగూడెం, తలగడదీవి, కమ్మనమోలు, గణపేశ్వరం, పర్రచివర, ఏటిమొగ, ఎదురుమొండి గ్రామాలు, అవనిగడ్డతోపాటు అవని గడ్డ మండలంలోని పులిగడ్డ, ఎడ్లలంక, చిరువోలులంక, మోదుమూడి, ఆశ్వరావుపాలెం, వేకనూరు గ్రామాలు ముడా పరిధిలోకి రాబోతున్నాయి.
 
 
 
1794.63 చ.కి.మీ
మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ పరిధి మొత్తం 1794.63 చ.కి.మీలుగా ఉండబోతోంది. వాస్తవంగా ముడా పరిధి 426.16 చ.కి.మీ మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ ప్రకారం 2017 మార్చిలో మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌, బందరు మండలంలోని 29 గ్రామ పంచాయతీలు, పెడన మండలంలోని మరో గ్రామ పంచాయతీతో కలిపి ముడాను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, ఆ ఫలాలు ప్రజలకందించేందుకు అవకాశాలు (వనరులు) ఇక్కడ తక్కువగా ఉన్నాయి. దాదాపు 46 కి.మీ మేర ఈ ప్రాంతంలో సముద్ర తీరం ఉంది. 75 శాతం వ్యవసాయ భూములున్నాయి.
 
 
దీంతో ప్రభుత్వం ఆశించిన అభివృద్ధి గానీ, ప్రజలకు ఉపయోగపడే ప్రగతి గానీ ఈ తక్కువ వనరులున్న చోట సాధ్యంకాదని ముడా గుర్తించింది. పోర్టు నిర్మాణం వల్ల ఎగుమతులు, దిగుమతులకు ఈ ప్రాంతం కీలకంగా మారనుండటం, చుట్టుపక్కల క్రాకర్‌ యూనిట్‌, లాజిస్టిక్‌ సంస్థ, నాగాయలంక వద్ద రక్షణ సంబంధమైన వ్యవస్థ ఏర్పాటు కానుండటంతో ముడా పరిధిని విస్తరించేందుకు యంత్రాంగం ఆలోచన చేసి, ప్రణాళిక సిద్ధపరిచింది. దీని ప్రకారం ముడా పరిధి 1794.63 చ.కి.మీ.గా ఉండబోతోంది. మచిలీపట్నం నియోజకవర్గంలో 426చ.కి.మీ, పెడన మండలంలో 126.44చ.కి.మీ, గూడురు మండలంలో 124.70చ.కి.మీ, గుడ్లవల్లేరు మండలంలో 124చ.కి.మీ, బంటుమిల్లి మండలంలో 125.31 చ.కి.మీ, కృత్తివెన్ను మండలంలో 180.96చ.కి.మీ, కోడూరు మండలంలో 201.చ.కి.మీ, నాగయలంక మండలంలో 405చ.కి.మీ, అవనిగడ్డలో 79.68చ.కి.మీ మేర ముడా విస్తీర్ణం జరగనుంది.
 
 
విస్తృతస్థాయిలో రోడ్‌ నెట్‌ వర్క్‌
ముడా పరిధిలో విస్తృతస్థాయిలో రోడ్‌ నెట్‌ వర్క్‌ ఉండబోతోంది. ఏపీ సీఆర్‌డీఏ బార్డర్‌ను తాకుతూ, ముడా పరిధి ఉండనున్న నేపథ్యంలో రోడ్‌ కం రైల్‌ నెట్‌వర్కింగ్‌ కూడా పెద్దఎత్తున సమకూరుతోంది.
 
 
జాతీయ రహదారి 65, 214ఏ, 16, ఎస్‌హెచ్‌ -46లు ముడా పరిధిలో ఉండబోతున్నాయి. అంతేకాక రైల్‌ నెట్‌ వర్క్‌ కూడా బాగా ఉంది. ఇది కూడా ముడా ప్రగతికి దోహపడబోతోంది.
 
 
47 వేల ఎకరాల ప్రభుత్వ భూమి
వాస్తవంగా ఏధైనా పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నా, సంస్థలు నెలకొల్పాలన్నా భూమి అత్యవశ్యకం. ప్రధానంగా ప్రభుత్వ భూమి ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండానే, భూములను ఇచ్చి, అభివృద్ధికి మార్గం సుగుమం చేయవచ్చు. ఈ ఆలోచన కూడా ముడా పరిధిని విస్తరించేందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం విస్తరించబోతున్న ముడా పరిధిలో మొత్తం 3.94 లక్షల ఎకరాల భూమి ఉండగా.. వాటిలో 47 వేల ఎకరాలు(190చ.కి.మీ) మేర ప్రభుత్వ భూమి ఉంది. ఇది అతిపెద్ద భూ బ్యాంక్‌. పెడనలో 3845 ఎకరాలు, గూడురులో 21.53ఎకరాలు, గుడ్లవల్లేరు పరిధిలో 13.26ఎకరాలు, బంటుమిల్లి పరిధిలో 104.30 ఎకరాల ప్రభుత్వ భూమి, కృత్తివెన్ను పరిధిలో 15,945.84 ఎకరాలు , కోడూరులో 15,938 ఎకరాలు, నాగాయలంకలో 9,049 ఎకరాలు, అవనిగడ్డలో 1947 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమంతా పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పేందుకు ఉపయోగపడేదే.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...