Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • బందరు పోర్టుకు భూమిని సమీకరించడానికి త్వరలోనే నోటిఫికేషన్
  • 15 మంది డిప్యూటీ కలెక్టర్ల నియామకం

మచిలీపట్నం పోర్టుకు అవసరమైన 12 వేల ఎకరాల భూమిని సమీకరించడానికి త్వరలోనే నోటిఫికేషన జారీ చేయనున్నట్లు బీసీ సంక్షేమం, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రెండు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని సోమవారం హైదరాబాద్‌లో చెప్పారు. 15 మంది డిప్యూటీ కలెక్టర్లను దీని కోసం కేటాయించామని ఆయన తెలిపారు.

 

 

 

మచిలిపట్నం పోర్టుకు అవసరమైన 12 వేల ఎకరాల భూమిని సేకరించడానికి త్వరలోనే నోటిఫికేషన జారీ చేయనున్నట్లు బీసీ సంక్షేమం, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, రెండు నెలల్లో భూసేకరణ పూర్తిచేసి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. 15 మంది డిప్యూటీ కలెక్టర్లను దీనికోసం కేటాయించామన్నారు.
 
 
         మచిలిపట్నం రేవును కంటైనర్‌ పోర్టుగా అభివృద్ధి చేయడానికి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారుచేసి ఇప్పటికే పోర్టు అథారిటీకి సమర్పించామన్నారు. ఆఽధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నవ యుగ సంస్థ ఈ పోర్టు నిర్మాణ పనులను చేపడుతుందన్నారు. దుబాయ్‌లోని జభలాలీ పోర్టును పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలీ అండ్‌ సన్స్ ఆఫ్‌ షోర్‌ మెరైన సాంకేతిక నిపుణుల బృందంతో సమావేశమై పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు.

      పోర్టు నిర్మాణం, నౌకల తయారీ, మరమ్మతులు, జెట్టీల నిర్మాణం, షిప్‌ లిప్ట్‌లు, ఎగుమతులు, మెరైన సర్వీసులు తదితర అంశాలకు సంబంధించి వారి సహాయ సహకారాలను కోరామని చెప్పారు. త్వరలోనే వారు ఇక్కడకు వచ్చి మచిలీపట్నం పోర్టును సందర్శించనున్నారని మంత్రి వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • Replies 518
  • Created
  • Last Reply
  • 2 weeks later...

British valla time lo chennai tho almost equal importance vundedi. independence taruvata gali ki vadilesaru mottam.

final ga oka fihsing harbour range ki techaru.

 

If CBN can get this rolling then he will be remembered in history as econimic Cotton dora.

Land acquisition,permissions, contracting takes another 2 years.

 

If not immediately atleast in next 5 years they start coastal corridor road project.

 

Our golden days are ahead anukuni munduku kadaltame

Link to comment
Share on other sites

British valla time lo chennai tho almost equal importance vundedi. independence taruvata gali ki vadilesaru mottam.

final ga oka fihsing harbour range ki techaru.

 

If CBN can get this rolling then he will be remembered in history as econimic Cotton dora.

Land acquisition,permissions, contracting takes another 2 years.

 

If not immediately atleast in next 5 years they start coastal corridor road project.

 

Our golden days are ahead anukuni munduku kadaltame

yes bro.

Link to comment
Share on other sites

12-5-16-5-copy.pngపదేళ్లుగా పడుతూ లేస్తూ అక్కడే ఆగిపోయిన బందరు పోర్ట్ ఇక కళ్లముందు కనిపించబోతోంది. ఇన్ స్ట్రక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది. త్వరలోనే భూ సమీకరణతో పనులు మొదలవుతాయ్. మూడేళ్లలో మొదటి ఫేజ్ సిద్ధం అవుతుందంటున్న ఈ ప్రాజెక్టు యాక్టివిటీ క్రిష్ణాజిల్లా రూపురేఖలే కాదు ఏపీ తీర స్వభావాన్నే మార్చేస్తోందనిపిస్తోంది. ఎందుకంటే…


దాదాపు 12 వేల కోట్ల రూపాయల అంచనా… 4500 ఎకరాల భూములు…100 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం. ఈ అంకెలు చాలు బందరు పోర్టు స్థాయి ఏంటో చెప్పడానికి. నిరీక్షణకి తెరపడి… ఎన్నాళ్లో వేచిన ఉదయంలా పనులు తొందర్లోనే మొదలు కాబోతున్నాయ్. చైనా సంస్థ గ్వాంఝు ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ బందరు పోర్టుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. వచ్చే నెలలో భూ సమీకరణ మొదలవుతుంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ, రైతుల్ని ఒప్పించడం లాంటి కార్యక్రమాలు ఓ కొలిక్కివచ్చాయ్. రెండునెలల్లో సమీకరణ పూర్తవుతుందంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేతిలో సగానికిపైగా భూమి ఉంది. కొత్తగా సమీకరించేది 2200 ఎకరాలే. 2022 నాటికి పోర్టు పూర్తవుతుందంటున్నారు. మొదటి దశ మాత్రం మూడేళ్లలోనే ఓ కొలిక్కివస్తుందంటున్నారు. మొత్తం 26 బెర్తులున్న పోర్టులో 15 బెర్తులు మొదటి విడతలో సిద్ధమవుతాయ్. దాదాపు 45 మిలియన్ టన్నుల కార్గో రవాణాకి ఫస్ట్ పేజ్ తోనే లైన్ క్లియర్ అవుతుంది అంటున్నారు.


ఇదీ ఎఫెక్ట్…


బందరు పోర్టును ఆగమేఘాల మీద క్లియర్ చేయాలనుకోవడంలో ఓ వ్యూహం ఉంది. మూడేళ్లు మొదటి దశ కోసం అంటే… ఎన్నికలు వస్తాయనే కాదు… రాజధాని అప్పటికి గేర్ అందుకుంటుంది. అమరావతికి ఆసరా కాబోతున్నది బందరు పోర్టే కాబట్టి… సరుకు రావాణా అయినా ఇన్ ఫ్రా డెలివరీ అయినా… విదేశాలతో కనెక్టివిటీ అయినా ఇక సులభమైపోతుంది. పైగా ఇది డీప్ వాటర్ పోర్టు. 2 లక్షల టన్నుల సామర్థ్యమున్న నౌకలు కూడా ఇక్కడకి రాగల్గుతాయ్. ఇదే ఏపీలో హైయ్యెస్ట్ కెపాసిటీ. వైజాగ్ లో కూడా 1.75 టన్నుల కెపాసిటీ ఉన్న షిప్ లు మాత్రమే వచ్చే వీలుంది ఇప్పటి వరకూ. అంటే విశాఖను మించిన అండ కాబోతోంది బందరు పోర్టు తూర్పుతీరానికి.


బందరు పోర్టు వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకం. తీరంలో ఇప్పటికే పోర్టులు ఉన్నా ఇటు రాజధాని అమరావతికి అయినా… అటు తెలంగాణ కైనా బందరుపోర్టే నియరెస్ట్. అందుకే మిగతా పోర్టులతో దీన్ని పోల్చలేం. పోర్టు ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంత వేగంగా కార్యకలాపాలు జోరందుకోబోతున్నాయ్. ఏపీ అభివృద్ధిపై బందరు పోర్టు ముద్ర వేయబోతోందని సరుకు రవాణాతోపాటు… ప్రోసెసింగ్ ఇండస్ట్రీ డెవెలప్ మెంట్ కి కూడా ఇదే ముందుముందు ఆధారం అంటున్నారు. బందరు చుట్టుపక్కల 425 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో డెవలప్ మెంట్ అధారిటీని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం… బందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోర్టుతో సహా మొత్తం 10 వేల ఎకరాల భూ సమీకరణ చేసి బందరు చుట్టుపక్కల పెట్టుబడుల కేరిడార్ ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా క్రమంగా పట్టాలెక్కుతున్నాయ్. ఆ యాక్టివిటీ మొదలైతే పోర్టు ప్రాంతం ఏపీ లాజిస్టిక్ హబ్ గా నిలుస్తుందనిపిస్తోంది.


ఫైనల్ గా ఒక్కమాట. అప్పుడెప్పుడో ఆంగ్లేయుల కాలంలో బందురులో పోర్టు ఉండేదని అది అప్పటి కీలక స్థావరమని మాత్రమే ఇన్నాళ్లూ స్థానికులకి తెలుసు. ఇప్పుడు మళ్లీ అంతకు మించిన వైభవమే రాబోతోంది బందరుకి. పోర్టుతో. పోతేపల్లి, మంగినపూడి, గోపువాని పాలెం, చిలకలపూడి, కరగ్రహారం లాంటి ప్రాంతాల రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయ్. ఇన్ని దశాబ్దాల నిర్లక్ష్యం ఒక్కపెట్టున తుడిచేసినట్టు బందరు పోర్టు ఇపుడు బంపర్ ఛాన్స్ లా తగిలింది తూర్పు క్రిష్ణా ప్రాంతానికీ, అంతకు మించి ఏపీకి.


Link to comment
Share on other sites

  • 1 month later...

విజయవాడ : ఏపీ కేబినెట్‌ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమైంది. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. భూసమీకరణ ద్వారా భూమి కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు, వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకునే అవకాశం, మచిలీపట్నం పోర్టుకు, పోర్టు ఆధారిత పరిశ్రమలకు అక్కడ ఉన్న భూములను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తీసుకునే బిల్లును కేబినెట్‌ ముందుకు తీసుకువచ్చారు. అక్కడ రైతులు భూములు ఇచ్చేందుకు వెనుకాడడంతో ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో 11 సంస్థలకు భూముల కేటాయింపును కేబినెట్‌ ఎజెండాలో ప్రతిపాదించారు.

Link to comment
Share on other sites


విజయవాడ సిటీ : మచిలీపట్నం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (మడా) మాస్టర్‌ ప్లాన తయారీకి చైనాకు చెందిన జీఐఐసీ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ బృందం జాయింట్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడును బుధవారం కలసి మడాకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. జేసీ చైనా జీఐఐసీ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ ఛెనజిన నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో జాయింట్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయి వారికి మడాపై వివరించారు.

 

మచిలీపట్నం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ) వైస్‌ చైర్మన అయిన గంధం చంద్రుడు చైనా ప్రతినిధులతో మాట్లాడుతూ అత్యంత ప్రాముఖ్యం కలిగిన మచిలీపట్నం డీప్‌ వాటర్‌ పోర్టును నిర్మించేందుకు ప్రభుత్వం భూసమీకరణకు చర్యలు తీసుకుందని తెలిపారు. రాజధాని ప్రాంతా న్ని అభివృద్ధి చేస్తున్న విధంగానే మచిలీపట్నం ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమనీ, అందులో భాగంగానే మచిలీపట్నం ఏరియా అభివృద్థి సంస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

 

మచిలీపట్నం నగరంతోపాటు సమీపంలోని మరో 27 గ్రామాలు అభివృద్థి సంస్థ పరిధిలో వున్నాయన్నారు. అందులో సుమారు రెడు లక్షల 40 వేల మందికి పైగా జనాభా ఉన్నారనీ, 426.16 చ.కీ.మీ పరిధిని అభివృద్ధి చేయాల్సి వుందన్నారు. ఇందుకు అవసరమైన మాస్టర్‌ ప్లాన రూపొందించేందుకు జీఐఐసీ ఇంటర్నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన ముందుకు రావడం అభినందనీయమన్నారు. సంస్థ ప్రతినిధి బృందం గురువారం మచిలీపట్నం పోర్టు ఇండసి్ట్రయల్‌ క్యారిడార్‌ నిర్మాణానికి అనుబంధంగా మచిలీపట్నం ప్రాంతాన్ని సందర్శించాలని జేసీ కోరారు. జేసీని కలిసిన వారిలో జీఐఐసీ ఇంటర్నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులతోపాటు మచిలీపట్నం ఆర్డీవో పి.సాయిబాబు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి పాల్‌ వున్నారు.

Link to comment
Share on other sites

Source: Business Line

 

nvkrishna

 

A port all at sea

 
 
  • BL10_INDIAFILE_MAC_2615390g.jpg
    The slide of Machilipatnam port - as seen in 1953.
 
 
 

The once prosperous Machilipatnam port is now an inconsequential speck on India's coastline. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu wants to bring back its glory. Can he? G Naga Sridhar reports

 

 

Times have been testing for M Rangayya. He belongs to a family of weavers that has a 250-year-old legacy. Back then, the weaves of his forefathers travelled as far as France, thanks to the port of Masula, now known as Machilipatnam. Their Kalamkari technique of block printing had found customers far and beyond.

 

 

But for Rangayya and the rest of the 5,000 weaver-community in Pedana, a village off the port of Machilipatnam, in Andhra Pradesh, nothing remains of that past glory. “We have been finding it very difficult to live with monthly earnings ranging from ₹6,000 to ₹8,000 per weaver,’’ says the 58-year-old Rangayya, a father two girls and a son. He weaves handloom fabrics, which need hours of hard toil. To weave a 42-yard sagu, which means a length of fabric, Rangayya works 12 hours a day for five days.

 

 

In Pedana, 8 km from Machilipatnam, there are about 5,000 weavers, who continue to work on handloom weaving and use the Kalamkari technique.

 

 

The fall of the art coincided with the dwindling fortunes of the port. “I grew up hearing tales about the brisk trade and affluence weavers had long back. But I witnessed the shrinking of our business along with the decline of activity in the port,’’ says Rangayya as he takes a break from work. At present, hardly any trade takes place via the port.

 

 

Few from the younger generation want to take up the art. “Most of the weavers are not paid well and are selling to middlemen who buy cheap and with large margins,’’ says P Srinivas, owner of Shyamala Arts and Crafts and Bandar Kalamkari in Pedana. He is the only master craftsman who exports textiles to the US and Asian countries.

 

 

The number of weavers and kalamkari workers is dwindling. “Going by the ration cards in the village, we have about 1,400 people dependent on Kalamkari and 2,000 people on handloom,’’ adds Srinivas, who prefers to export his merchandise either by air, or from the Chennai port

 

 

But, of late, hopes of Rangayya, Srinivas and the rest of the community have risen. The state government headed by Chief Minister Chandrababu Naidu is expected to soon set up a development agency and initiate the process of acquiring 30,000 acres that will not only redevelop the Machilipatnam port into a new one, but make it an industrial hub.

 

 

Luckily for the otherwise sleepy port town, the proximity to the new and upcoming state capital Amaravati, which will be just 60km away, is a life saver.

 

 

BL10_IndiaFile_Mac_2615391g.jpg

 

Plans also include linking Machilipatnam with Amaravati by rail, which could further boost the prospects of the port and the population around it.

 

 

But the likes of Rangayya and Srinivas are also wary. In 2008, the then government had proposed to resurrect Machilipatnam as part of a grand plan to develop ports along its 996-km-coastline and handle 200 MT of cargo by 2020. There was little progress.

 

 

“Irrespective of the ruling party, no government has bothered to develop Machilipatnam port and town,’’ rues Srinivas. Will the new port revive their fortunes, and other businesses such as boat building, fishing, maize cultivation and salt manufactures? Can the past glory come back?

 

 

Port of call

 

 

If one travels back in time, the port hinterland dynamics in the town perched on the east coast not only looks impressive, but also lends credence to their hopes.

 

 

The magnum opus on ancient global trade in the early centuries of the Common Era - Periplus of the Erythrian Sea (The Diary of Red Sea), authored by an unknown Greek navigator - gives an account of the prosperity of Masula and its people. It was a hub of trade, especially attracting traders from the Roman Empire.  Everyday, there would be at least a dozen ships from Rome and numerous other vessels engaged in domestic trade at the harbour.

 

BL10_IndiaFile_Mac_2615392g.jpg

 

Fast forward to the modern period, the picture turns prettier. In the 17th and early 18th centuries, Masula had regular trade with domestic ports such as Madras, Pondicherry, and also with the West. The Dutch and French traders sourced and exported various types of textiles including salampores, Kalamkaris, muslins and percales. French records show that the port had significant revenue from diamond exports too.

 

 

For the European trading companies, Masula was a preferred base for exports to Bengal, Madras, as also Jeddah and other ports in the Persian Gulf, besides South-East Asia.

 

 

 

Machilipatnam was preferred because it was the only active port that connected the rich hinterlands of Andhra and Telangana with the rest of the world. The other prominent ports on the east coast included Madras and Tamralipti (in Bengal).

 

 

Apart from exports, the region also witnessed spurt in retail trade and a rise in monetary transactions.  The French struck their coin, Dabou, in 1755, and minted at least 49,000 kg of copper every year in Masulipatnam alone.

 

 

 

The French customs office, according to data from the Hyderabad Archives, made an income of ₹34, 911 in the same year. When the English took over Masulipatnam in the second half of the 18th century, the port became a base for their trade.

 

 

 

Downhill after 1947

 

 

 

This glorious era gradually declined after Independence, because of government apathy.  Even as other ports in the region, such as Kakinada and Vishakapatnam, were developed, Machilipatnam (its name had changed by the 18th century) suffered for lack of infrastructure such as dredgers and anchoring facilities.

 

 

“There was some activity even in the 1980s. But now there is nothing other than fishing boats here,” says Ch Srinivasa Rao, a supervisor at the harbour for 30 years. There was dredger till a decade ago in the harbour but it has gone now.

 

 

Today Machilipatnam port is a pale shadow of its former self. The port is poorly connected by road and a visitor will see just four-five boats at the port; not used for trade but for fishing.The famed boat building industry exists, but now builds fewer than 10 boats a year.

 

 

“Not many are building boats here now. This year, so far, only three boats have been built,” says  Aarogyam, an expert in boat building.  A new boat costs ₹30 lakh. Though the cost is almost the same in other ports in the country (such as Goa) orders have dwindled due to general poverty of fishermen, says M Rambabu, who owns two boats.

 

 

There are about 200 fishing boats operating from the port now. About a decade ago, there were over 500.

 

 

The boat building industry not only survives on demand for new boats but also maintenance of the existing ones.  In addition to fishing, tiger prawns are exported to domestic destinations and food processors.

 

 

Starting problems

 

 

While other port projects like Krishnapatnam and Gangavarm in the state have seen light after the 2008 proposal, efforts to revive the Machilipatnam port have remained stuck.  The foundation stone for the port was laid by the then Chief Minister, the late Y S Rajasekhara Reddy in 2008. Initially, the project was awarded to Maytas of the Satyam group. But after the Satyam scandal - in which the founder B Ramalinga Raju was convicted of financial irregularities - broke out in 2008, the contract was scrapped and the project was awarded to the Navayuga Engineering Company Ltd in 2010.

 

 

The company had planned to acquire 5,324 acres, but could take possession of 524 acres, hampered by political issues and confusion over the new Land Acquisition Act brought in 2013; some provisions were added to the Act and later dropped.

 

The bifurcation of Andhra Pradesh to create Telangana in June 2014, brightened the port’s prospects. The State announced plans to acquire about 14,500 acres of private land to build a new port with attached industrial corridors.

 

 

 

But this kicked off a fresh row. While people opposed the land acquisition, the Government’s political rivals raised questions. Why does the new project require so much of land? What is the justification for converting agricultural land for industrial use?

 

 

“The development of the port has been in the offing for decades. What is the guarantee that the project takes off as planned? If it is delayed, who will guarantee our lives?’’ asks VV Varaprasad, a farmer in Machilipatnam.

 

 

The Naidu Government is now banking on the land pooling model that it used successfully, though controversially, to acquire 33,000 acres to build the new capital.

 

 

port-IndiaFile3_jp_2615393g.jpg
 

Grand plans

 

 

The Government’s plan for Machilipatnam is massive. It wants to earmark 30,000 acres around Machilipatnam for various industries. According to Deputy Chief Minister KE Krishna Murthy, the State is now planning to set up a Machilipatnam Development Authority for all-round development of the region, which will include the proposed deep-sea port and port-based industries.  

 

 

 

A fresh proposal for land pooling is being prepared and is waiting for Naidu’s nod. In return for the land, the owner will get an annual gratuity of ₹25,000 to ₹30,000 for five years, apart from 1,200 sq ft of developed site (including the residential site) for each acre that is foregone. The package for tenant farmers includes a monthly pension of ₹ 2,500 and guarantee of 365 days of work under the NREGS.

 

 

Plans are also afoot to provide training to farmers in skill development to help them get other jobs in case of loss of livelihood. A final notification is awaited regarding these incentives.

 

 

 

Meanwhile, land prices in Machilipatnam have zoomed from ₹30,000 an acre to ₹50 lakh - ₹1 crore depending on the location, says A Srinivas, a local real estate businessman.

 

 

“It is both a positive and negative development. Some of the farmers now expect an appreciation in prices and are unwilling to part with their land. But unless and until land is given, how will the project take off? Without project, there will be no escalation in prices,’’ he observes.

 

 

 

Benefits

 

 

 

The construction of a new port can make a significant difference to the economy of Machilipatnam. Located between the ports of Kakinada in the north and Krishnapatnam in the south, the Machilipatnam port could lead to better connectivity on the long coastline of Andhra Pradesh.

 

 

 

In the first phase of the project, the port will have two berths expandable up to 12 with a cargo handling capacity of 7 million tonnes. This will be increased to 13 million tonnes in phase 2, with an investment of ₹1,590 crore. The project was awarded to Navayuga on a Build Own Operate and Transfer basis for a concession period of 50 years.

 

 

 

Apart from its proximity to the new capital, Machilipatnam will be the closest port to Hyderabad, capital of the landlocked state of Telangana. According to a recent study by the Federation of Andhra Pradesh and Telangana Chamber of Commerce and Industry, a port in Machilipatnam could give a boost to textiles, gems, diamonds, imitation jewellery as well as food processing industries.

 

 

The Andhra Pradesh Industrial Policy 2014-15 envisages development of industrial clusters in petrochemicals and integrated textiles, besides smart industrial townships in Visakhapatnam, Krishna, East and West Godavari districts and Machilipatnam; there are plans to develop the port to leverage the untapped potential in the region.

 

 

It is also expected to generate direct and indirect employment of over 25,000. The Andhra Pradesh government, which is seeking to provide a big push to the ports sector, is also expediting the implementation of projects at Bhavanapadu and Narsapuram ports.

 

 

 

The experience of the Gangavarm port, since the beginning of its commercial operations, shows that there is untapped potential for growth. “We reached a tonnage of 21 million tonnes last year since the commencement of operations in 2008. A new port in Machilipatnam too can cater to significant unmet shipping requirements,’’ says Pranav Choudhary, Chief Financial Officer, Gangavaram Port Ltd.

 

 

 

From the cargo handling point of view, India’s east coast is known for handling bulk cargo while the west coast is mostly used for container traffic. Cement and power sectors will stand to gain by facilitating coal imports via Machilipatnam port, adds Choudhary.

 

 

 

As the Gangavaram port has now become a gateway for eight states, Machilipatnam too can hope for a pie in the business by handling bulk cargo such as iron ore, coal, fertiliser, lime stone, bauxite, raw sugar, alumina and steel products. More interestingly, it will bring back the old glory to the port town which is now just a municipality with 1.6 lakh people.

 

 

 

“Despite being the headquarters of Krishna district, the town has always been over-shadowed by Vijayawada. A port might bring back development and recognition to Machilipatnam,’’ says A Ramakrishna, a rickshaw puller.

 

Link to comment
Share on other sites

మచిలీపట్నం ఇక మామూలుగా ఉండదుగా…


పోర్ట్ మొదలుకావడానికి ముందే బందరు భాగ్యరేఖలు మారుతున్నట్టున్నాయ్. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు పట్టాలెక్కితే చిన్నాచితక బందరు ఇక సమస్యల్ని ఉతికి ఆరేస్తుంది. ఎందుకంటే మచిలీపట్నం కొత్తగా డెవలప్ మెంట్ అథారిటీతో జూలు విదల్చబోతోంది. దానికితోడు పోర్టుకి భూసేకరణ విషయంపై కూడా కేబినెట్ దృష్టిపెట్టింది. ఇంకేమేమి మార్పులు రాబోతున్నాయంటే…


ఫిషరీస్ వర్సిటీకి గ్రీన్ సిగ్నల్, విద్యాసంస్థల కోసం కేటాయింపులు, అటు తర్వాత నియోజకవర్గాల స్థాయిలో పారిశ్రామి క్లస్టర్ల ఏర్పాటు లాంటి నిర్ణయాలతోపాటు ఇంకొన్ని మలుపులు కూడా ఉన్నాయ్ కేబినెట్ సమావేశంలో. పార్టీల కోసం రాజధానిలో భూ కేటాయింపులు చేసేందుకు సిగ్నల్ వచ్చేసింది. ఇక జగన్ తో సహా మిగతా పార్టీలు ఇప్పటికైనా రాజధానికి తరలి వస్తాయేమో చూడాలి. ఇవన్నీ సరే. డెవలప్ మెంట్ యాంగిల్లో చూస్తే మాత్రం అన్నిటికన్నా హైలైట్… మచిలీపట్నం డెవలప్ మెంట్ అధారిటీ ఏర్పాటు. ఈ దెబ్బతో ఇక బందర్ దశ తిరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే పరిధి, పర్మిషన్లు ఇచ్చే అధికారులు వస్తాయ్. తర్వాత సంస్థల ఏర్పాటు సామర్థ్యం పెరుగుతుంది. అసలే పోర్టు కూడా రూపుదిద్దుకుంటోంది కాబట్టి దానికి అనుబంధంగా సంస్థలు గోడౌన్లు బిజినెస్ క్లస్టర్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. అందుకే ఇపుడు డెవలప్ మెంట్ అధారిటీ ఏర్పాటు చేయడం అంటే ఇన్ ఫ్రా క్రియేట్ చేసే అవకాశం చిక్కుతుంది. అందుకే అంటున్నది మచిలీపట్నం ఇక మూమూలుగా ఉండదు అంటున్నది.


కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు దాదాపు రెట్టింపు చేయడంతోపాటు… పట్టిసీమను రికార్డు స్థాయిలో పూర్తిచేసిన ఇంజినీర్లకి కూడా బంపర్ బొనాంజా ఇచ్చింది కేబినెట్. ఇదో పాజిటివ్ సిగ్నల్. పనిచేసే వాళ్లకి ఫలితాలు ఇలా ఉంటాయ్ అని చూపించడం అనుకోవచ్చు. కొత్త ఆలోచనలు రేకెత్తించేలా స్కూళ్లు కాలేజీల్లో ప్రత్యేక విభాగాల ఏర్పాటు నిర్ణయాలతో కేబినెట్ ఓ కొత్త డైరెక్షన్ ఇచ్చందనే అనుకోవాలి ఏపీకి !


Link to comment
Share on other sites

 

మచిలీపట్నం ఇక మామూలుగా ఉండదుగా…

పోర్ట్ మొదలుకావడానికి ముందే బందరు భాగ్యరేఖలు మారుతున్నట్టున్నాయ్. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు పట్టాలెక్కితే చిన్నాచితక బందరు ఇక సమస్యల్ని ఉతికి ఆరేస్తుంది. ఎందుకంటే మచిలీపట్నం కొత్తగా డెవలప్ మెంట్ అథారిటీతో జూలు విదల్చబోతోంది. దానికితోడు పోర్టుకి భూసేకరణ విషయంపై కూడా కేబినెట్ దృష్టిపెట్టింది. ఇంకేమేమి మార్పులు రాబోతున్నాయంటే…

ఫిషరీస్ వర్సిటీకి గ్రీన్ సిగ్నల్, విద్యాసంస్థల కోసం కేటాయింపులు, అటు తర్వాత నియోజకవర్గాల స్థాయిలో పారిశ్రామి క్లస్టర్ల ఏర్పాటు లాంటి నిర్ణయాలతోపాటు ఇంకొన్ని మలుపులు కూడా ఉన్నాయ్ కేబినెట్ సమావేశంలో. పార్టీల కోసం రాజధానిలో భూ కేటాయింపులు చేసేందుకు సిగ్నల్ వచ్చేసింది. ఇక జగన్ తో సహా మిగతా పార్టీలు ఇప్పటికైనా రాజధానికి తరలి వస్తాయేమో చూడాలి. ఇవన్నీ సరే. డెవలప్ మెంట్ యాంగిల్లో చూస్తే మాత్రం అన్నిటికన్నా హైలైట్… మచిలీపట్నం డెవలప్ మెంట్ అధారిటీ ఏర్పాటు. ఈ దెబ్బతో ఇక బందర్ దశ తిరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే పరిధి, పర్మిషన్లు ఇచ్చే అధికారులు వస్తాయ్. తర్వాత సంస్థల ఏర్పాటు సామర్థ్యం పెరుగుతుంది. అసలే పోర్టు కూడా రూపుదిద్దుకుంటోంది కాబట్టి దానికి అనుబంధంగా సంస్థలు గోడౌన్లు బిజినెస్ క్లస్టర్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. అందుకే ఇపుడు డెవలప్ మెంట్ అధారిటీ ఏర్పాటు చేయడం అంటే ఇన్ ఫ్రా క్రియేట్ చేసే అవకాశం చిక్కుతుంది. అందుకే అంటున్నది మచిలీపట్నం ఇక మూమూలుగా ఉండదు అంటున్నది.

కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు దాదాపు రెట్టింపు చేయడంతోపాటు… పట్టిసీమను రికార్డు స్థాయిలో పూర్తిచేసిన ఇంజినీర్లకి కూడా బంపర్ బొనాంజా ఇచ్చింది కేబినెట్. ఇదో పాజిటివ్ సిగ్నల్. పనిచేసే వాళ్లకి ఫలితాలు ఇలా ఉంటాయ్ అని చూపించడం అనుకోవచ్చు. కొత్త ఆలోచనలు రేకెత్తించేలా స్కూళ్లు కాలేజీల్లో ప్రత్యేక విభాగాల ఏర్పాటు నిర్ణయాలతో కేబినెట్ ఓ కొత్త డైరెక్షన్ ఇచ్చందనే అనుకోవాలి ఏపీకి !

 

 

 

If port is completed super fast growth undi

 

vizag busy unte ikadiki divert chestaru

Link to comment
Share on other sites

kishna jilla lo antha land ivvaru. and already kollu ravindra is facing the heat frm all quarters. Machilipatnam will only be a green field port for agri commodities, dairy products and fisheries etc Navayuga ki environmental clearance took a very long time for the same reason. Krishnapatnam laga mega port cheydam impossible in krishna belt due to the fertile land and green zone around that place. 4000 Acres of Krishnapatnam port itself is still under utilized. 

 

Plans are ok but 12000 acres is tooooooo much for a port in that area and is not at all required in that belt considering the eco reasons and future generations

Link to comment
Share on other sites

  • బందరు పోర్టుకు భూసమీకరణ! 
  • ఇండస్ట్రి‌యల్‌ కారిడార్‌కు కూడా.. 
  •  దశలవారీగా 22 వేల ఎకరాలు 
  •  ఏపీ కేబినెట్‌ భేటీ నిర్ణయాలు 

అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాజధాని భూసమీకరణకు రైతుల నుంచి వచ్చిన స్పందనతో స్ఫూర్తి పొందిన రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ భూసమీకరణకు సిద్ధమవుతోంది. మచిలీపట్నం డీప్‌ వాటర్‌ పోర్టు, ఇండస్ట్రి‌యల్‌ కారిడార్‌ కోసం 22 వేల ఎకరాలను దశలవారీగా సమీకరించేందుకు శుక్రవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపారు. భూసమీకరణ చేయనున్న భూమిలో.. 14 వేల ఎకరాలు పట్టా భూమి కాగా, 8 వేల ఎకరాలు అసైన్డ్‌ భూమి. మచిలీపట్నం డీప్‌ వాటర్‌ పోర్టు, ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ కోసం మచిలీపట్నం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ) ఆధ్వర్యంలో 1.05 లక్షల ఎకరాలను గుర్తించారు. 

 
                  సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులకు తెలిపారు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సమీకరించాలని నిర్ణయించిన 22వేల ఎకరాలకు రాజధానిలో సీఆర్డీయే అనుసరించిన మార్గదర్శకాలనే అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ల్యాండ్‌పూలింగ్‌ కింద ఎకరం భూమి ఇచ్చే రైతులకు ప్రతిగా 1000 గజాల నివాస స్థలాన్ని, 200 గజాల వాణిజ్య స్థలాన్ని అభివృద్ధి చేసి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. భూ సమీకరణ ప్రక్రియను జూలై 2017లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భూసమీకరణ చేపట్టిన ప్రాంతంలో గ్రామాలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. 429 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 29 గ్రామాల్లో భూసమీకరణ చేపడుతున్నట్లు చెప్పారు.
 
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త

రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న 15,745 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలను పెంచాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం కనీస వేతనం రూ. 6,700 ఉండగా దాన్ని రూ.11,500కు పెంచాలని నిర్ణయించామని, అలాగే గరిష్ఠ వేతనం రూ. 12,000ను రూ.17,500కు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. పెరిగిన వేతనాలను వచ్చే నెల నుంచి ఇవ్వనున్నట్లు చెప్పారు. 

 
                  18,340 ఎకరాలు రెడీ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) పార్కుల నిర్మాణం కోసం 100 ఎకరాల చొప్పున కేటాయించడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పల్లె వెల్లడించారు. ఇప్పటివరకు 117 నియోజకవర్గాల్లో 100 ఎకరాలకంటే ఎక్కువ భూమిని గుర్తించామని, ఈ మొత్తం 18,340 ఎకరాలుగా తేలిందన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ త్వరితగతిన భూమిని సేకరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిపారు. ఆయా పార్కుల్లో పరిశ్రమలకు కావలసిన భూమిని లేఔట్‌ చేసి ఇస్తామన్నారు. ప్రతిచోటా వెయ్యి మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశిస్తున్నామని, పరిశ్రమలకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి వివరిచారు. ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ ఏర్పాటుకు, దానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో చాప్టర్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పల్లె చెప్పారు. ఈ సంస్థల ఏర్పాటు దేశంలోనే ఇదే మొదటిసారి అని పల్లె పేర్కొన్నారు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో రక్షణ, ఇతర మెషినరీ తయారీ యూనిట్ల కోసం ఇంజనీరింగ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పల్లె చెప్పారు. ఇప్పటికే ఏపీఐఐసీకి అప్పగించిన భూమికి తోడు మరో 120 ఎకరాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక్కడ రూ.200 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
 
ఐదు వర్సిటీలకు ఎల్‌ఓఐలు..
ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు ఆధారంగా రాష్ట్రంలో ఐదు వర్సిటీలకు లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ (ఎల్‌ఓఐ) ఇవ్వడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పల్లె చెప్పారు. వాటిలో ఎమిటి, ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ యూనివర్సిటీలు అమరావతిలో ఏర్పాటవుతాయని, సెంచూరియన్‌ యూనివర్సిటీకి విజయనగరంలో స్థలం ఉందని, ఫిషరీస్‌ అండ్‌ ఓషియన్‌ వర్సిటీ భీమవరంలో ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను 2016-17 విద్యా సంవత్సరంలోనే తాత్కాలిక క్యాంప్‌సలలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. ఒంగోలు ఐఐఐటీని ఆర్‌కె వ్యాలీలోనూ, శ్రీకాకుళం ఐఐఐటీని నూజివీడులోనూ ప్రారంభిస్తారని, ఒక్కోచోట వెయ్యి సీట్లతో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. 
 
 
 
 
పోలవరంపై ప్రతినెలా మంత్రివర్గంలో చర్చ

పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసినందుకు నిర్మాణంలో పాల్గొన్నవారందరికీ మంత్రివర్గం అభినందనలు తెలిపిందని మంత్రి పల్లె చెప్పారు. ఇంజనీర్లకు ఒక నెల జీతాన్ని ఇంక్రిమెంట్‌గా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2018కి పూర్తి చేయాలని, దీనిపై ప్రతి నెలా మంత్రివర్గంలో చర్చించాలని, ప్రతి వారం సమీక్ష జరపాలని నిర్ణయించామన్నారు. ప్రతి నెలా సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. 

 

http://www.andhrajyothy.com/artical?SID=263819

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...