Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply
ఎకరానికి రూ.25 లక్షలు.. ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
16-10-2018 14:28:24
 
636752970014491865.jpg
మచిలీపట్నం: బందరు పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూమి కొనుగోలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 2159.25 ఎకరాలు భూమి కొనుగోలు పథకం కింద తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పోర్టు నిర్మాణంపై వేగవంతంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఏడు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ముడాకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోర్టుకు అవసరమైన పట్టాభూమిని రైతులను నుంచి కొనుగోలు చేసేందుకు వీలుగా నిపుణుల కమిటీ నిర్ణయించిన ధరను, ’భూమి కొనుగోలు పథకాన్ని’ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీనికి సంబంధించి జీవో ఆర్‌.టి.నెం. 143ను ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (పోర్ట్స్‌ -1) జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, ముడా వీసీ విల్సన్‌బాబు, పోర్ట్‌ డైరెక్టర్‌(కాకినాడ)కు ఈ జీవో కాపీలను పంపిస్తూ, తదుపరి చర్యలను తీసుకోవాలని ఆదేశించింది.
 
 
రైతులతో కమిటీ చర్చలు
మచిలీపట్నం డీప్‌ పోర్టు నిర్మాణం, అభివృద్ధి నిమిత్తం మొత్తం 5292.75 ఎకరాలు అవసరమవుతుండగా, దానిలో అసైన్డ్‌ ల్యాండ్‌తో కలిపి ప్రభుత్వ భూమి మూడు వేల ఎకరాలు ఉంది. మిగిలినది పట్టాభూమి. ఈ భూమంతా రైతులు, యజమానుల చేతుల్లో ఉంది. ఈ భూమి మొత్తం మచిలీపట్నం మండల పరిధిలోని మంగినపూడి, కరగ్రహారం, గోపువానిపాలెం, తవిశపూడి గ్రామాల్లో కేంద్రీకృతమై ఉంది.
 
వాస్తవంగా ఈ భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం రైతుల ముందు రెండు అవకాశాలను ఉంచింది. భూ సేకరణ, భూ సమీకరణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిపై రైతుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీని దృష్ట్యా పోర్టు పనులను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో మచిలీపట్నం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసింది. రైతుల నుంచి భూమి తీసుకునేందుకు వీలుగా ఒక కమిటీ వేసి, రైతులతో చర్చలు జరిపి, భూమి కొనుగోలు పథకాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం నేతృత్వంలోని ఒక కమిటీ రైతులతో చర్చలు జరిపింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం రైతులతో చర్చించి, వారి అభిప్రాయాలు సేకరించి ఒక ధరను నిర్ణయించారు. రైతులకు ఏ మాత్రం అన్యాయం జరగకుండా ఎకరానికి రూ. 25 లక్షలు ఇస్తామని ఆ కమిటీ ప్రకటించింది. ఈ విషయాన్నే ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
 
 
2159.25 ఎకరాల కొనుగోలుకు ఆమోదం
నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన ధరను ప్రభుత్వం పరిశీలనకు తీసుకుంది. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన రాష్ట్ర ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (పోర్ట్స్‌ -1) బందరు పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం ప్రవేశపెట్టిన భూమి కొనుగోలు పథకాన్ని ఆమో దించింది. శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ దీనికి ఆమోద ముద్ర వేస్తూ సోమవారం జీవో నెం.143ను విడుదల చేశారు. దీని ప్రకారం నాలు గు గ్రామాల్లోని 2159.25 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. ఒక్కో ఎకరానికి రూ. 25 లక్షలను చెల్లిసారు.
 
 
22 తర్వాత నిధుల బదిలీ
ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలుకు పచ్చజెండా రావటంతో జిల్లా యంత్రాంగం భూమి కొనుగోలుకు అవసరమైన నిధుల సేకరణను వేగవంతం చేసింది. ఇప్పటికే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ఒప్పించి, రూ.200 కోట్ల నిధులను సాధించుకుంది. ఆ నిధులు ముడాకు రావటానికి వారం పడుతుంది. సీఎం దగ్గర నుంచి అన్ని చోట్లా ఆమోదం పొందిన అనంతరం సంబంధిత ఫైలు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వద్దకు చేరుకుంది. ప్రస్తుతం దసరా సెలవులు కావడం, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌ సెలవులో ఉండటంతో నిధుల మళ్లింపునకు అవకాశం లేకుండా పోయింది. పీసీబీ చైర్మన్‌ ఈ నెల 22 తర్వాత విధుల్లో చేరనున్నారు. తదనంతరం ఆయన ఈఫైలుపై సంతకం చేసి, నిధులను బదిలీ చేస్తారని తెలిసింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
పోర్టుకు రూ. 200 కోట్లు
02-11-2018 07:40:43
 
636767412450528259.jpg
మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) రూ.200 కోట్ల నిధులు ముడాకు విడుదల చేసింది. మచిలీపట్నంలోని లలితా కన్వెన్షన్‌ సెంటర్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముడా చైౖర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ సంబంధిత వివరాలను వెల్లడించారు. మంత్రి కొల్లు మాట్లాడుతూ.. బందరు పోర్టు ప్రజలందరి కల అన్నారు. పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేసి, కార్యరూపంలోకి తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబు ఆదే శాల ప్రకారం ఏపీఎండీసీ మంజూరు చేసిందన్నారు. 45 రోజుల్లోపు తిరిగి చెల్లించే విధంగా ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు.
 
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా..
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రభుత్వం పోర్టు నిర్మాణం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోందన్నారు. గతంలో ల్యాండ్‌ పూలింగ్‌కు వైసీపీ ఇబ్బందిపెట్టిందని, బందరు వచ్చిన జగన్‌ కూడా అనవసర ఆరోపణలు చేశారని మంత్రి కొల్లు మండిపడ్డారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి వస్తున్న నిధులకు ప్రతిపక్షం అడ్డుపుల్ల వేసి, కోర్టులో స్టే తెచ్చి, ఇక్కడ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. మూడే మూడు రోజుల్లో ప్రభుత్వం నిధుల మంజూరు ప్రక్రియను పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు. అలాగే బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ప్రక్రియ వేగవంతమైందని, మరో 15 రోజుల్లో ఆ నిధులు వచ్చేస్తాయని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన నగదుతో రైతుల నుంచి భూమిని కొనుగోలు చేస్తామని, ఈ ప్రక్రియను నెలరోజుల్లోపు పూర్తి చేస్తామని వివరించారు. నవంబరు నెలాఖరులోపు పోర్టు భూములను కోనుగోలు చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. డిసెంబరు 15 లోపు పనులు ప్రారంభించి, ప్రజల కలను సాకారం చేస్తామని మంత్రి తెలిపారు.
 
బందరుకు సువర్ణ అవకాశం
టీడీపీ రాష్ట్ర నేత కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ.. బందరు పోర్టు కోసం బందరు ప్రజలు ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేశారన్నారు. ప్రతిపక్షాలు.. అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బందరుకు సువర్ణవకాశం వచ్చిందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ బాబా ప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యుడు ఎల్‌.నారాయణ, చిలంకుర్తి తాతయ్య, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, పట్టణాధ్యక్షుడు ఇలియాస్‌పాషా, తదితరులు పాల్గొన్నారు.
 
పోర్టు నిర్మాణానికి అధిక ప్రాధాన్యం
ముడా చైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ, నిధులను మంజూరు చేశారని, దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పోర్టుకు ఇంతకాలం జరిగిన ప్రక్రియ ఒక ఎత్తు అని, ఇప్పుడు వచ్చిన నిధులు మరొక ఎత్తు అని అభిప్రాయపడ్డారు. బందరు ప్రాంతం అభివృద్ధికి సీఎం కృషిచేస్తూ, పోర్టు కోసం రూ. 200 కోట్లను కేటాయించడం చాలా సంతోషకరమైన అంశమని చెప్పారు.
 
వారం క్రితం కొందరు కావాలనే నిధులను అడ్డుకున్నారని, వారికి బందరు ప్రాంతం అభివృద్ధి చెందడం ఇష్టంలేదని, ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఈ నిధులతో భూమి కొనుగోలు చేసి, పనులు వేగవంతం చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు.. తనపై గురుత్వర బాధ్యతలు పెట్టారని, మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ పోర్టుకోసం ఒక బాట నిర్మించారని, ప్రస్తుతం అంతా సమన్వయంతో పోర్టు నిర్మాణానికి కృషిచేస్తామని బూరగడ్డ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

రేపటి నుంచి పోర్టు భూముల కొనుగోలు
11-11-2018 08:23:47
 
636775214254576074.jpg
  • రేపటి నుంచి ప్రారంభం
  • క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయింపు
  • స్టాంపు డ్యూటీ కూడా
  • రైతులు పన్నులు చెల్లించనవసరం లేదు
బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కొనుగోలుకు ముడా రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి వివిధ దఫాలుగా రైతుల నుంచి భూమి కొనుగోలు పథకం కింద పట్టా భూములను సేకరించబోతోంది. మొట్ట మొదట నాలుగు గ్రామాల్లో ఇద్దరు రైతుల నుంచి భూములను తీసుకుని, వారి ఖాతాలోకి నగదు జమ చేయనుంది. భూకొనుగోళ్లకు ట్యాక్స్‌ క్లియరెన్స్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానుండటంతో భూ కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు ముడా పటిష్ట కార్యాచరణ సిద్ధం చేసింది. ఖనిజా భివృద్ధి సంస్థ మంజూరు చేసిన రూ. 200 కోట్లతో ఈ భూములను కొనుగోలు చేయనుంది. 45 రోజుల్లో రైతుల నుంచి భూ సేకరణ పూర్తి చేసి, పోర్టు పనులను ప్రారం భింపచేయాలని ముడా భావిస్తోంది.
 
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం పోర్టుకు భూముల కొనుగోలు సోమవారం నుంచి ‘ముడా’ ప్రారంభించనున్నది. మొత్తం 1435 ఎకరాలు తీసుకోవాల్సి ఉండగా. తొలి వారంలో 200 ఎకరాలు కొనుగోలు చేయనుంది. పోర్టుకు అవసరమైన పట్టా భూములు మచిలీపట్నం రూరల్‌ మండల పరిధిలోని మంగినపూడి, తవిశపూడి, గోపువానిపాలెం, కర్రగ్రహారంలో ఉన్నాయి. ఆయా రైతుల వివరాలను ముడా సేకరించింది. మొదటి వారంలో ఈ నాలుగు గ్రామాల నుంచి కనీసం ఇద్దరు రైతులకు తగ్గకుండా, పది నుంచి 15 ఎకరాల వరకు తీసుకోబోతున్నారు. తర్వాత మిగతా భూములు కొనుగోలు చేయనున్నారు. 
 
మచిలీపట్నం డీప్‌ పోర్టును మొత్తం 5292 ఎకరాల్లో చేపట్టబోతున్నారు. ప్రభుత్వం మూడు వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూమిని అందించింది. అలాగే 723 ఎకరాల భూమిని ల్యాండ్‌ ఫూలింగ్‌లో రైతులు ఇచ్చారు. ఇంకా మిగిలిన పట్టా భూమిని రైతుల నుంచి తీసుకోవల్సి ఉంది. ఇందుకుగాను ప్రభుత్వం భూమి కొనుగోలు పథకంతో ముందుకు వచ్చింది. రైతులకు పెద్ద మొత్తంలో లాభం చేకూర్చే దిశగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, ముడా చైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంలు సీఎం చంద్రబాబుతో చర్చించి, ఈ పథకానికి ఆమోద ముద్ర వేయించారు. ఎకరాకు రూ. 25 లక్షలు ఇచ్చే విధంగా జీవో తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం రూ. 200 కోట్ల నగదును మంజూరు చేసింది. గత నెల 31వ తేదీన సంబంధిత జీవో విడుదల చేయటంతో పాటు, ముడా బ్యాంకు ఖాతా (ఆంరఽధాబ్యాంక్‌)లో ఆ నిధులను జమ చేసింది. అలాగే రెండు రోజుల క్రితం కేబినెట్‌ కూడా ఈ నగదు చెల్లింపులు, భూ కొను గోలుకు ఆమోద ముద్ర వేసింది.
 
పన్ను మినహాయింపు
వాస్తవంగా రైతుల నుంచి భూమి కొనుగోలు పథకం కింద భూములు తీసుకుంటున్నప్పటికీ ఇది ఒక విధంగా ల్యాండ్‌ ఎక్విజేషన్‌ కిందకే వస్తుంది. దీంతో ఈ భూముల విషయంలో క్యాపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపు రైతులకు దక్కబోతోంది. 2018 భూ సేకరణ చట్టం (ఎమెండ్‌మెంట్‌) చట్టం ప్రకారం ప్రభుత్వ అవసరాలకు భూములను తీసుకుంటే క్యాపిటల్‌ గెయిన్స్‌ (కేంద్రానికి) చెల్లించనవసరం లేదు. అలాగే రైతుల (వ్యక్తులు) నుంచి భూములు తీసుకుంటే పన్ను చెల్లించ నవసరంలేదు. వ్యవసాయ భూమి తీసు కున్నా ఇది వర్తిస్తుంది. ఒక వేళ రైతుల నుంచి కాకుండా సంస్థల నుంచి భూములు తీసుకుంటే మాత్రం పన్ను చెల్లింపులుంటాయి. ఈక్రమంలో భూమి కొనుగోలు పథకంలో తీసుకుంటున్న భూములకు ఎటువంటి పన్నులు ఉండవు. రైతుల మీద ఎటువంటి భారం ఉండదు. ఇక స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములు రిజిస్ట్రేషన్స్‌ చేయించు కున్నందుకు ముడా స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై అధికార యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా స్టాంప్‌ డ్యూటీ మిన హాయింపులు కూడా ఇచ్చారు. మంగళవారం ఉత్తర్వులు వెలువడబోతున్నట్లు తెలిసింది.
 
వచ్చే వారంలో కొనుగోళ్లు ప్రారంభిస్తాం
వచ్చే వారం నుంచి భూమి కొనుగోళ్లు ప్రారంభిస్తాం. రైతుల వివరాలు సేకరించాం. ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చేందుకు భారీ ఎత్తున నగదు ఇస్తోంది. చాలా పకడ్బందీగా భూముల కొనుగోలు ప్రక్రియ ఉంటుంది.
- బూరగడ్డ వేదవ్యాస్‌, ముడా చైర్మన్‌
 
 
పన్ను మినహాయింపు ఉంది
ప్రభుత్వం రైతుల వద్ద తీసుకునే భూములపై పన్ను మినహాయింపు ఉంది. ఇన్‌కంటాక్స్‌ చట్టం 10(37) ప్రకారం వ్యవసాయ భూములను ప్రభుత్వం సేకరణ చేస్తే రైతులకు ఇచ్చే నష్టపరిహారంపై ఆదాయ పన్ను లేదు. ఈ పన్ను మినహాయింపు వ్యక్తులకు, హిందూ అవిభక్త కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. పరిహారం పొందే వారు టాక్స్‌ కన్సల్టెంట్‌ సలహా తీసుకోవడం మంచిది.
- కేతవరపు శివకుమార్‌, ఆడిటర్‌
Link to comment
Share on other sites

డిసెంబరులో పోర్టు
22-11-2018 09:47:35
 
636784768570467393.jpg
  • శంకుస్థాపనకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
  • ఉల్లిపాలెం గ్రామదర్శినిలో చంద్రబాబు వెల్లడి
  • ఉల్లిపాలెం - భవానీపురం వంతెన ప్రారంభం
  • రైతులు సహకరించాలని పిలుపు
  • ప్రతి గ్రామం ఆరోగ్యమై భాసిల్లాలని హితవు
ఉల్లిపాలెం - భవానీపురం వంతెన ప్రారంభంతో దివిసీమ వాసుల కల నెరవేరింది. తూర్పు కృష్ణావాసుల చిరకాల స్వప్నం కూడా నెరవేరబోతోంది. వచ్చే నెలలో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం కోడూరు మండలం ఉల్లిపాలెంలో కృష్ణానదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించిన అనంతరం సీఎం ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రజల ఆశలకు అనుగుణంగా బందరు పోర్టును నిర్మిస్తామని, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం చల్లపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగించారు.
 
మచిలీపట్నం (ఆంధ్రజ్యోతి) : బందరుపోర్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోర్టు నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. కోడూరు మండలం ఉల్లిపాలెంలో కృష్ణానదిపై రూ.77కోట్లతో నిర్మించిన ఉల్లిపాలెం-భవానీపురం వంతెన, ఆ పక్కనే ఏర్పాటుచేసిన 27 అడుగుల తెలుగుతల్లి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన గ్రామదర్శినిలో సీఎం చంద్రబాబు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బందరు పోర్టు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, వలసలు తగ్గుతాయని హితవు పలికారు. పోర్టు నిర్మాణం ద్వారా తీర ప్రాంతాలను ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. మచిలీపట్నం, దివిసీమ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అద్భుతమైన వనరులు ఉన్నాయని చెప్పారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం తెలిపారు. ఇప్పటికే విజయవాడ-మచిలీపట్నం నాలుగు రహదారుల నిర్మాణం పూర్తవుతోందని పేర్కొన్నారు. ఉల్లిపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం వల్ల మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు.
 
గ్రామాలు.. ఇక ఆరోగ్యధామాలు
Untitled-11.jpg‘రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించి, సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తాం. ఆరోగ్యానికి మారుపేరుగా గ్రామాలను తీర్చిదిద్దుతాం. పట్టణాలకు మించి అద్భుతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పల్లెల్లో కల్పిస్తాం. ప్రతి గ్రామంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తాం. పల్లెల్లో చెత్త, మురుగు లేకుండా చేసి, సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గ్రామాల్లో పెద్దఎత్తున చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. అధికారులు విధి నిర్వహణలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సీఎం సూచించారు. అధికారులు బదిలీ అయినా వారి పనితనం వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయని, ప్రతి అంశమూ రాష్ట్రస్థాయిలో రికార్డు అవుతోందన్నారు.
 
అభివృద్ధి భళా..
q3n4w3r.jpgపట్టిసీమ ప్రాజెక్టు ఈ ప్రాంత దశ-దిశను మార్చిందని సీఎం తెలిపారు. పట్టిసీమ లేకపోతే కృష్ణాడెల్టాలో పంటలే పండేవికావని, తాగటానికి కూడా నీరు ఉండేది కాదని చెప్పారు. పట్టిసీమ వల్ల రాయలసీమ ప్రాంతానికి నీటిని సరఫరా చేయగలిగి అక్కడి ప్రజల కళ్లల్లో కూడా ఆనందం నింపగలిగామన్నారు. ప్రజల ఆరోగ్యం బాగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని సీఎం సూచించారు. ప్రకృతి సేద్యానికి సంబంధించి పారిస్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం దేశంలో రాష్ట్రానికి మాత్రమే అవార్డు దక్కిందన్నారు. మనుషులకు ఆధార్‌ ఉన్నట్టే.. భూమికీ భూధార్‌ ఉంటుందని సీఎం తెలిపారు. చంద్రన్న పెళ్లికానుక ద్వారా అనేక మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా ఉంటున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి, పేదవాడి ఆకలి తీర్చనున్నామని, పట్టణాల్లోనూ విరివిగా అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందిస్తున్నామన్నారు. మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
 
సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి.. : బుద్ధప్రసాద్‌
సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఏ పదవిపైనా ఆశ లేదని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఉల్లిపాలెంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని చెప్పారు. అయితే, ఉల్లిపాలెం వంతెన పూర్తవుతుందని కలలో కూడా ఊహించలేదని, సీఎం చంద్రబాబు తన కలలను సాకారం చేశారన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌ పలు సమస్యలు చెప్పగా, సీఎం వెంటనే వాటిని పరిష్కరించారు. రత్నకోడు, లింగాలకోడు, ఇరాలి మురుగు కాల్వలపై చెక్‌డ్యాంలు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే, కోడూరు ఆస్పత్రిని 24 గంటల హాస్పిటల్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు సంఘ సేవకుల సేవలను తెలియజేస్తూ రచించిన ఆపద్బాంధవులు పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
 
కలెక్టర్‌కు సీఎం ప్రశంస
జిల్లాలో వినూత్న రీతిలో ప్రభుత్వం సంక్షేమాలను అమలుపరుస్తున్న కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని కొనియాడారు. సామాజిక పింఛన్లు, చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న సంచార చికిత్స, చంద్రన్న బీమా అమలులో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం తాను పనిచేయటమే కాకుండా, అధికారులతోనూ పనిచేయించటమే ఇందుకు కారణమని సీఎం కొనియాడారు.
 
పటిష్ట బందోబస్తు
awbrwe.jpgసీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీస్‌ యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేసింది. సీఎం ఉల్లిపాలెం గ్రామ రోడ్లపై కొద్దిసేపు తిరిగారు. రక్షణపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆద్యంతం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏఆర్‌ ఏఎస్పీ ఢిల్లీ, బందరు డీఎస్పీ మహబూబ్‌ భాష, అవనిగడ్డ డీస్పీ పోతురాజు, తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
- ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...