Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

మచిలీపట్నం పోర్టులో ప్రాథమిక కార్యకలాపాలకు అనుమతి

ఈనాడు, అమరావతి: మచిలీపట్నం పోర్టు అభివృద్ధిలో భాగంగా ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టేందుకు మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. పోర్టు పరిధిలో నిర్మాణానికి అవసరమైన సర్వే తదితరాలకు అనుమతి ఇస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో ఇంధన, మౌలికవసతులు, పెట్టుబడులశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ పేర్కొన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఆమోదించిన అధీకృత ఏజెన్సీనే నియమించుకోవాలని ఉత్తర్వులో ఆదేశించారు

Link to comment
Share on other sites

  • Replies 518
  • Created
  • Last Reply
బందరు నగరం... భళా
 
636289664242213905.jpg
  • భవిష్యత్‌ బందరు..రూపురేఖలు
  • ఎంయుడీఏ మాస్టర్‌ప్లాన్‌పై పవర్‌ ప్రజంటేషన్‌ 
  • పోటాపోటీ ప్రదర్శనలు 
  • నాలుగు కంపెనీలు హాజరు 
  • వాయిదా పడిన ఫైనాన్స్‌ 
  • టెండర్ల ఓపెనింగ్‌ 
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం:
భవిష్యత్ లో మచిలీపట్నం రూపురేఖలు ఎలా ఉంటాయో పవర్‌ ప్రజంటేషన్‌ చేశారు. ఇందుకోసం నాలుగు కంపెనీలు పోటాపోటీ ప్రదర్శనలు చేశాయి.
మచిలీపట్నం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అధారిటీ (ఎంయుడిఏ) మాస్టర్‌ ప్లాన్‌ కోసం టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించగా, టెక్నికల్‌కు సంబంధించి నాలుగు టెండర్లు దాఖలయ్యాయి. వాటిని ఈనెల 18న ఓపెన్‌ చేసిన విషయం తెలిసిందే. సంబంధిత కంపెనీలు ఆయా కంపెనీలు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ వివరాలను గురువారం పవర్‌ ప్రజంటేషన్‌ చేశారు. ఎంయుడిఏ ఇవాల్యుయేషన్‌ కమిటీ సమక్షంలో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాలులో ఈ పవర్‌ ప్రజంటేషన్‌ జరిగింది. టెక్నికల్‌ టెండర్లు దాఖలు చేసిన శ్రీ కన్సల్టెంగ్‌ ఇంజనీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సిస్ర్టా బ్రూ) లియా అసోసియేట్‌ సౌత ఆసియా ప్రై.లిమిటెడ్‌ అండ్‌ సిబిఆర్‌వి సౌత ఆసియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అలాగే ఆర్‌వి అసోసియేట్స్‌ ఆర్చ్‌టెక్స్‌ ఇంజనీర్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అండ్‌ చైనా అకాడమీ ఆఫ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ కంపెనీ వీటితో పాటు రాయల్‌ హాస్కోనింగ్‌ డిహెచ్‌వి కంపెనీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు తమతమ ప్రొగ్రెసివ్‌ రిపోర్టుతో పాటు ఎంయుడీఏ రూపకల్పనతో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను పవర్‌ ప్రజంట్‌ చేశారు. ముడా ఇవాల్యుయేషన్‌ కమిటీలో సభ్యులుగా ఉన్న వీసీ ఎం.వేణుగోపాలరెడ్డితో పాటు ముడా ప్లానింగ్‌ అధికారి శిల్ప, డీటీసీపీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మణరావు, డీటీసీపీ ఓఎడీడీ విద్యులత, బందరు మునిసిపల్‌ కమిషనర్‌ జస్వంతరావు, రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఈఈ నరసింహమూర్తి సమక్షంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. మొత్తం నాలుగు కంపెనీలు టెక్నికల్‌ టెండర్లు దాఖలు చేయగా, గురువారం ప్రదర్శించిన పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా వాటిలో ఒక కంపెనీని ఇవాల్యుయేషన్‌ కమిటీ ఎంపిక చేయనుంది. పవర్‌ ప్రజంటేషన్‌కు 80 శాతం వెయిటేజీ కేటాయించారు. ఇందుకు సంబంధించి 75 మార్కులు సాధించిన కంపెనీని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 20 శాతం వెయిటేజీని ఫైనాన్స్‌ టెండర్ల ద్వారా లెక్కిస్తారు. వాటికి సంబంధించి 25 మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. కాగా, ఫైనాన్స్‌ టెండర్లు పై నాలుగు కంపెనీలు దాఖలు చేయగా, వాటిని గురువారం ఓపెన్‌ చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. తదనంతరం ఫైనాన్స్‌ టెండర్లను ఓపెన్‌ చేసే తేదీలను ప్రకటిస్తామని వీసీ వేణుగోపాలరెడ్డి తెలిపారు.
మాస్టర్‌ ప్లాన్‌ అదిరే..
టెక్నికల్‌ టెండర్లు దాఖలు చేసిన నాలుగు కంపెనీలు ప్రదర్శించిన ఎంయుడీఏ మాస్టర్‌ ప్లాన్‌ బందరు రూపురేఖలను మార్చే విధంగా ఉన్నాయి. పోర్టుతో పాటు పరిశ్రమల ఏర్పాటు, మెగా టౌన్‌షి్‌పతో పాటు మొత్తంగా ఎంయుడీఏ పరిధి 426.16 చదరపు కిలోమీటర్ల పరిధిని ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో ఈ నమూనా మాస్టర్‌ప్లాన్‌లో సూచించారు. మచిలీపట్నం అభివృద్ధి కోసం గత ఏడాది ఫిబ్రవరిలో ఎంఏడీఏ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల కొంత ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో మొత్తం మచిలీపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం దానిని ఎంయుడీఏ గా మార్చిన విషయం తెలిసిందే. దీని పరిధిలో మచిలీపట్నం మునిసిపాలిటీతో పాటు బందరు రూరల్‌ మండలంలో గల 28 గ్రామాలు, పెడన మండలం కాకర్లమూడి గ్రామం ఉంది. ఈ పరిధిలో మొత్తం జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 241207 మంది ఉన్నారు. ఎంయుడీఏ అభివృద్ధి కోసం ప్రభుత్వం 33177.78 ఎకరాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా భూములలో పోర్టు నిర్మాణంతో పాటు ఇండస్ర్టియల్‌ కారిడార్‌, మెగా టౌన్‌షిప్‌ నిర్మాణం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. వీటితో పాటు పర్యాటక, వాణిజ్య అభివృద్ధి కి ఈ ప్రాంతంలో గల అవకాశాలు, వాటిని సద్వినియోగం చేసుకునే తీరును పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా చూపారు.
Link to comment
Share on other sites

‘బృహత్‌’ అడుగులు

బిడ్లను తెరిచిన ముడా

మే, 1న కన్సెల్టెంట్‌ ఖరారు

ఈనాడు - అమరావతి

amr-top2a.jpg

బృహత్‌ప్రణాళిక తయారీ దిశగా మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ పయనిస్తోంది. ప్రణాళిక, అభివృద్ధిలో ఇది కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ తరహాలో పోర్టు, పారిశ్రామిక నడవ ప్రాంతాల్లో ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రణాళిక తయారీ కోసం అంతర్జాతీయ కన్సెల్టెంట్ల ఎంపిక కోసం బిడ్లను ఆహ్వానించారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు పాల్గొనేందుకు వీలుగా పలు దఫాలు గడువును పొడిగించారు. ఈ నెల 18న సాంకేతిక బిడ్లను తెరిచారు. అందులో సాయి కన్సెల్టింగ్‌ ఇంజినీర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, లీ అసోసియేట్స్‌, ఆర్వీ అసోసియేట్స్‌, రాయల్‌ హాస్కానింగ్‌ సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి. వీటికి అంతర్జాతీయ అనుభవం ఉండడంతో ఎంపికలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా గురువారం ఫైనాన్సియల్‌ బిడ్లను తెరిచారు. ఈ నాలుగు సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ అర్హతలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లను ఇచ్చారు. బిడ్లను ఖరారు చేసే కమిటీలో ముడ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ప్రణాళిక అధికారి శిల్ప, డీటీడీసీ జేడీ లక్ష్మణరావు, ఓఎస్‌డీ విద్యుల్లత, మున్సిపల్‌ కమిషనర్‌ జస్వంతరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ నరసింహమూర్తి ఇందులో ఉన్నారు. అధికారుల కమిటీ బిడ్లను దాఖలు చేసిన సంస్థలకు అంశాల వారీగా మార్కులు కేటాయిస్తుంది. సాంకేతిక అంశాలకు 80 శాతం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఫైనాన్సియల్‌ బిడ్లలో తక్కువ ధరకు వేసిన సంస్థకు ఈ విభాగంలో ప్రాధాన్యం ఇస్తారు. మే, 1న కన్సెల్టెంట్‌ ఎంపిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. త్వరలో ప్రణాళిక రూపకల్పన మొదలుకానుంది. ఆలస్యం కాకుండా ఉండేందుకు ముందే మచిలీపట్నం ప్రాంత ఉపగ్రహ ఛాయా చిత్రాలను ఇప్పటికే కొనుగోలు చేసింది.

పలు మండళ్ల అనువైన ప్రాంతాల ఎంపిక, వసతుల కల్పన, నడవ, రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారమే ప్రభుత్వం పట్టణ వాటికలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా రూపకల్పన చేస్తారు. సాంకేతికంగా బాగా అనుభవమున్న సంస్థకే కట్టబెట్టేలా నిబంధనలు రూపొందించారు. సాంకేతిక అంశాలకు అత్యధికంగా 80 శాతం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దశలవారీగా ఇవ్వనున్న ఈ ప్రణాళిక తుది ముసాయిదా ఒప్పందం జరిగిన ఏడాదికి అందనుంది. బందరు పట్టణంతో పాటు మరో 28 పరిసర గ్రామాలు చేరాయి.

కన్సెల్టెన్సీలో పనిచేసే సిబ్బంది నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం హోదాల వారీగా అర్హతలు, అనుభవాన్ని నిర్దేశించింది. ఈ సంస్థ రెండు రకాల ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. బృహత్‌ ప్రణాళిక, జోనల్‌ అభివృద్ధి ప్రణాళికలు అందనున్నాయి. ఇక్కడ రానున్న ఓడరేవుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సాగరమాలలో ఇది కీలకంగా మారనుంది. దీంతో 14,000 టీఈయూ సామర్థ్యంతో తీర్చిదిద్దనున్నారు. తొలిదశలో 7,000 టీఈయూ సామర్థ్యంతో సిద్ధం కానుంది. దీంతో పాటు పారిశ్రామిక నడవను 27 వేల ఎకరాలలో ఏర్పాటు చేయనున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని.. సహజవనరులు, పర్యావరణ సమతుల్యత, భూ అభివృద్ధి, జీవన ప్రమాణాలు, జనాభా, వాహన రద్దీ, గాలి, వాతావరణంలో పీడనం, తేమ వివరాలు, నేల, కాలుష్యం, తదితర అంశాలతో రేఖా చిత్రాలతో సవివరంగా రూపొందనుంది. రాబోయే 30 నుంచి 50 ఏళ్లకు తగ్గట్లుగా ఇది ఉంటుంది. అన్ని ప్రాంతాలకు రవాణా, రోడ్ల అనుసంధానం, నీటి వనరుల పరిరక్షణ, పార్కులు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక వాడ, తదితర అవసరాలకు ఏయే ప్రాంతాలు అనువైనవి. ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం అన్న అంశాలతోపాటు ఇంకా సమకూర్చాల్సిన వసతుల గురించి సలహాలు, సూచనలు అందనున్నాయి. దశలవారీగా అందనున్న ఈ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

భూ సమీకరణ వేగవంతం చేయాలి

పదిహేను రోజుల్లో పనులు పూర్తవ్వాలి: కలెక్టర్‌

kri-gen7a.jpg

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పోర్టు కోసం అవసరమై భూమి సమీకరణ ప్రక్రియ పక్షం రోజుల్లో పూర్తి చేయాలని ముడ ఛైర్మన్‌, కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ముడ కార్యాలయంలో బుధవారం ఆయన ముడ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బందరు పోర్టు కోసం ఇప్పటి వరకూ పోర్టు శాఖకు 3,014 ఎకరాలు అప్పగించామన్నారు. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం అమరావతి తరహా ప్యాకేజీ అమలు చేస్తోందన్నారు. ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. దీన్ని గమనించి రైతులు భూములిచ్చే విషయంలో సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. వీసీ వేణుగోపాలరెడ్డి ముడ ప్రణాళిక, తదితరాలను వివరించారు. ప్రణాళికాధికారి శిల్ప, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...

Tondaraga Port start cheyyandi ippati varaku vachhina lands lo, already govt. land chaala vundi.

This is very important project to get some tough seats like Machilipatnam MLA/MP, Avanigadda, Pedana towards TDP.

Link to comment
Share on other sites

Inka entha kaalam padathadi land teesukovataniki.

 

Port raavalani agitations chesthaaru, kaani land vishayam lo sahakarincharu. Machilipatnam Minister & MP ni CM should push get the lands or port.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
పోర్టు పనులు ఎప్పుడో?
 
 
636423621024645448.jpg
  • డిసెంబర్‌ దిశగా అడుగులు
  • అక్టోబరు మొదటివారంలో సీఎం సమీక్ష
(ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం)
బందరు పోర్టు పనులు ప్రారంభంపై ప్రజల్లో సందిగ్దం వీడడం లేదు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు డిసెంబరుపై ఆశలు కలిగిస్తు న్నాయి. ఈ ఏడాది చివరాంకం డిసెంబరులో 150 ఏళ్ల బందరు పండుగను పెద్దఎత్తున నిర్వహించాలనే తలంపుతో అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికా రులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలనే తలంపుతో ఉన్నారు.
 
అలాగే కృష్ణా యూని వర్సిటీ నూతన భవనాల సముదాయం రుద్రవరంలో తుది మెరుగులు దిద్దుకుం టున్నాయి. వాటిని సీఎం ప్రారంభించనున్నారు. వీటితో పాటు భవానీపురం, ఉల్లిపాలెం వంతెన ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించాలని మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. వీటన్నింటికి డిసెంబరు నెలలో ముహూర్తం కుదిరే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమా లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కావాలంటే పోర్టు నిర్మాణం సంగతి తేలాల్సి ఉంది.
 
అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ మూడేళ్ల కాలంలో రాజధాని అమరావతి, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు తదితర పనులపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదే సమయంలో బందరు పోర్టు పనులు ప్రారంభానికి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. భూముల సమస్య పరిష్కారం కాకపోవడంతో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
 
ఈ నేపథ్యంలో సీఎం బందరు రావాలంటే పోర్టు సమస్య ఒక కొలిక్కి రావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన సమక్షంలో ఈ నెలాఖరుకు జరగాల్సిన సమీక్షా సమావేశం దసరా పండుగ వల్ల అక్టోబరు మొదటి వారానికి వాయిదాపడినట్టు తెలుస్తోంది. మూడోతేదీ తరువాత సమావేశం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. సమావేశంలో భూ సమీకరణ ద్వారా ఇప్పటి వరకు రైతుల నుంచి తీసుకున్న భూములు, ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల వివరాలపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ సమావేశంలో పోర్టు భవితవ్యం తేలనుంది. అక్టోబరు, నవంబరు నెలల్లో భూముల అంశం పూర్తి చేసి పోర్టు నిర్మాణ పనులు ప్రారంభంతో కలుపుకుని బందరు పండుగ జరుపుకునే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...