Jump to content

APSRTC


Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply
డిజిటల్‌ ఆర్టీసీ
ఈ-వాలెట్‌  ప్రత్యేకం
యాప్‌తో సేవల అనుసంధానం
బస్సుల్లో  జీపీఎస్‌ వ్యవస్థ
ctr-sty1a.jpg

ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సంస్థాగత చర్యలు చేపడుతోంది.. విద్యార్థుల నుంచి దివ్యాంగులు, వృద్ధుల వరకు పలు రాయితీల ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.. ప్రయాణ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే ప్రయాణికులకు అండగా నిలిచేందుకు బీమా సౌకర్యం అందిస్తోంది.. ఎన్ని సేవలు అందిస్తున్నా టికెట్‌ రిజర్వేషన్లు.. ఏ మార్గంలో ఎన్ని బస్సులు ఉన్నాయి.. సర్వీసు సమయాలు ఏమిటి.. గమ్యస్థానానికి ఎప్పటికి చేరుతుందనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలంటే ప్రయాణికులు బస్‌ స్టేషన్‌ సమాచార కేంద్రానికి చరవాణి ద్వారా ఫోన్‌ చేసి తెలుసుకోవాలి. లేదంటే బస్టాండ్‌కు వెళ్లాలి. ఇలాంటి సమస్యలను అధిగమించి.. పోటీ ప్రపంచంలో తమ ఉనికి చాటుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.. స్మార్ట్‌ఫోన్‌, అంతర్జాలం ఉంటేచాలు ఎక్కడినుంచైనా ఆర్టీసీ బస్సుల వివరాలు.. సర్వీసులకు సంబంధించిన సమస్త సమాచారమైనా చిటికెలో తెలుసుకోవచ్చు.

న్యూస్‌టుడే, చిత్తూరు(గ్రామీణ)

ఆర్టీసీ అందిస్తున్న డిజిటల్‌ సమాచారం అంతా మీ అరచేతిలోకి రావాలంటే ముందుగా చరవాణిలోని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వెల్‌కమ్‌ టూ ఆర్టీసీ అని ఉంటుంది. ఈ విభాగంలో ఈ-టికెట్‌, ఈ-వాలెట్‌, ఏపీఎస్‌ ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌, సీటీబస్‌ ట్రాక్‌, ఆర్టీసీ గురించి, సంప్రదింపు అనే ఐచ్ఛికాలు ఉంటాయి. రెండో విభాగం ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌లో సెర్చ్‌ ఫర్‌ బస్‌స్టాప్‌, రెండు బస్సుల మధ్య గమ్యస్థానం, ట్రాక్‌ బస్‌ బై రిజర్వేషన్‌ నెంబరు, ట్రాక్‌ బస్‌ బై వెహికల్‌ నెంబరు, అత్యవసర సేవలు, మై ఫేవరేట్‌, ఫీడ్‌బ్యాక్‌, అబౌట్‌ ఏపీఎస్‌ఆర్టీసీ.. ఇలా పలు ఐచ్ఛికాలు ఉంటాయి. అత్యవసర సేవలనే ఐచ్ఛికంలోకి వెళ్తే మహిళా భద్రత, బస్సు మరమ్మతులు, వైద్య సేవలు, ప్రమాదాలపై ఫిర్యాదు అనే ఐచ్ఛికాలు ఉంటాయి. ఈ సేవలను చరవాణిలో ఎలా వినియోగించుకోవాలి.. ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

ఈ-టికెట్‌
ఆర్టీసీ యాప్‌లో వివిధ అప్లికేషన్లు కనబడతాయి. అందులో బుక్‌-టికెట్‌ మీద క్లిక్‌ చేయాలి. దానిలోనే బుక్‌ యువర్‌ టికెట్‌ యాజ్‌ గెస్ట్‌ సెలెక్ట్‌ చేయాలి. లేదా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయ్యి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. మొదటి పేజీలో మనం బయలుదేరే ఊరు, చేరాల్సిన ఊరు, ప్రయాణపు తేదీ వివరాలు నమోదు చేసి చెక్‌ అవైలబులిటీ బస్‌పై క్లిక్‌ చేస్తే ఆ రూటులో ఉన్న సర్వీసు వివరాలు కనిపిస్తాయి. మనకు అనుకూలమైన సర్వీసులను సెలెక్ట్‌ సీట్స్‌ అనే బాక్స్‌పై క్లిక్‌ చేసి బస్సు ఎక్కే, దిగే స్థానం, వర్తించే రాయితీ(క్యాట్‌ కార్డు, సీనియర్‌ సిటిజన్‌)లు నింపి షో లేఅవుట్‌ బాక్స్‌పై క్లిక్‌ చేస్తే సీటు లే-అవుట్‌ కనిపిస్తుంది. ఇందులో మనకు కావాల్సిన సీట్లను ఎంచుకుని ప్రయాణికుని పేరు.. చరవాణి సంఖ్య.. మెయిల్‌ ఐడీ వివరాలు నింపి ప్రయాణికుల పేర్లు, లింగం, వయసు పూరించి.. కంటిన్యూ అనే బాక్స్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తరవాత టికెట్‌ పూర్తి వివరాలు కనిపిస్తాయి. నచ్చిన పేమెంట్‌ గేట్‌వే ఎంచుకుని మేక్‌ పే మనీ క్లిక్‌ చేసిన తరవాత ఎంత చెల్లించాలో చెబుతుంది. అనంతరం డెబిట్‌, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ఉపయోగించి రిజర్వేషన్‌ టిక్కెట్లను.. మెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా పొందవచ్చు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రయాణ తేదీ మార్పు, రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

కియోస్కాన్‌ ఇలా..
ప్రయాణికుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సముదాయాల్లో కియోస్కాన్‌ యంత్రాన్ని అందుబాటులో ఉంచారు. తద్వారా సర్వీసులు, రిజర్వేషన్‌ వివరాలు, గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకోవచ్చు.. బస్సు ఆలస్యంగా నడిస్తే అందుకు కారణాలు.. ఏదైనా ప్రమాదం లేదా మరమ్మతుకు గురైతే సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యంత్రంలో సర్వీసు సంఖ్యను నమోదు చేస్తే.. ప్రస్తుత బస్సు స్థితి.. ఏ సమయానికి వస్తుంది.. ప్రస్తుతం ఎక్కడ ఉందనే విషయాలు సులభంగా తెలుసుకోవచ్చు. ఒక బస్సు అందుకోలేకపోతే ఆ మార్గంలో ఇంకా ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయనే సమాచారం తెరపై కనిపిస్తుంది.విచారణ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే దీన్ని సులభంగా తెలుసుకోవచ్చు.ఈ యంత్రంలో గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా బస్‌స్టేషన్‌ వివరాలు అన్నీ ఉంటాయి. నిరీక్షణ గది, విచారణ కేంద్రం, తాగునీరు, ప్లాట్‌ఫారమ్‌లు, మరుగుదొడ్లు, పలహారశాల, తినుబండారాల దుకాణాలు, బస్‌స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లే మార్గాలు.. ఇలా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

ఈ- వాలెట్‌
ఈ యాప్‌లో ఉన్న ఈ-వాలెట్‌ గుర్తును ఓపెన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ కోసం మన వివరాలు అన్నీ నమోదు చేస్తే మన ఈ వాలెట్‌ ఖాతా తెరచుకుంటుంది.అంతర్జాలం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ-వాలెట్‌ యాప్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌, రద్దు చేసుకోవచ్చు. ఈ-వాలెట్‌ ఖాతాదారుడు బుక్‌ చేసుకున్న టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే మళ్లీ క్షణంలోనే  వాపసు పొందవచ్చు. అదనపు ఖర్చు లేకుండా వేగంగా నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేటు బస్సుల్లో గేట్‌వే చెల్లింపు ఛార్జీలు 2.5శాతం ఉంటాయి. ఈ-వాలెట్‌ ఖాతాదారులకు 1.5శాతం మాత్రమే. ఈ ఖాతా ద్వారా టికెట్‌ కొని ప్రయాణం చేసేవారికి ఛార్జీలో 5శాతం నగదు రాయితీ. ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తి చేసిన వెంటనే ఈ మొత్తం వాలెట్‌ ఖాతాల్లో జమవుతోంది.

లైవ్‌ ట్రాక్‌
ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌ విభాగంలో ప్రధానంగా నాలుగు ఐచ్ఛికాలు ఉంటాయి. తాము దగ్గరలోని ఏ బస్‌స్టేషన్లు, బస్‌స్టాప్‌, రిజర్వేషన్‌ బస్సు వివరాలను జీపీఎస్‌ ద్వారా సులభంగా తెలుసుకో వచ్చు. రెండు లొకేషన్ల మధ్య ఉన్న బస్సుల వివరాలు పరిశీలించవచ్చు. అత్యవసర ఫిర్యాదు విభాగంలో మహిళా భద్రత, బస్సు స్థితిగతులు, వైద్యం, ఆర్టీసీ ఫిర్యాదులు అనే నాలుగు ఐచ్ఛికాలు ఉంటాయి.

వేధింపులు దూరం
ప్రయాణ సమయాల్లో మహిళలపై ఆకతాయిల వేధింపులను దృష్టిలో ఉంచుకుని.. యాప్‌లో ప్రత్యేక వ్యవస్థ రూపొందించింది. అదే మహిళా భద్రత. పోకిరీలు, ఆకతాయిలు ఎవరైనా మహిళల పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తే యాప్‌లోని మహిళా వేధింపులకు సంబంధించిన ఐచ్ఛికాన్ని నొక్కితేచాలు.. జీపీఎస్‌ ద్వారా క్షణాల్లో ఆ సమాచారం పోలీసు, ఆర్టీసీ అధికారులకు చేరుకుంటుంది. బస్సు ఎక్కడ ఉందనే విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. వెంటనే ఆకతాయిలు, పోకిరీల ఆట కట్టించవచ్చు.

ప్రమాదాలు, మరమ్మతులు
ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, మరమ్మతుకు గురైతే యాప్‌లో ప్రమాదాలు, మరమ్మతు అనే ఐచ్ఛికాలు ఉంటాయి. చరవాణి ద్వారా సంబంధిత డిపో మేనేజరకు డ్రైవరు, ప్రయాణికులు ఎవరైనా సమాచారం అందించే వీలుంది. వెంటనే డిపో మేనేజరు స్పందించి ఆ ప్రాంత సమీప డిపోలకు సమాచారం అందించి తక్షణ సాయం, చర్యలకు సూచనలు చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే పోలీసులు, అగ్నిమాపక యంత్రం, వైద్యాధికారులను అప్రమత్తం చేస్తారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ప్రయాణికుల సౌకర్యార్థమే..
ప్రయాణికుల సంఖ్యను పెంచడం, సంస్థాగత మార్పుల్లో భాగంగా  ఆర్టీసీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సమయం ఆదా, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం నేపథ్యంలో డిజిటల్‌ సేవలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్యా పెరిగింది. ఇప్పటికే జిల్లాలో ఉన్న 1407 సర్వీసులను వోపీఆర్‌ఎస్‌, నాన్‌ వోపీఆర్‌ఎస్‌ విధానం ద్వారా జీపీఎస్‌తో అనుసంధానం చేశాం. జీపీఎస్‌ ద్వారా బస్సు సమయం, డ్రైవర్‌/కండక్టర్‌ బాధ్యత, ఉన్నతాధికారుల సమన్వయం తదితర అంశాలు పారదర్శకంగా ఉంటాయి. సర్వీసులు, మార్గాల్లో చిన్నపాటి లోపం, తప్పులు క్షణాల్లో తెలుసుకునే వీలుంది.యాప్‌ సేవల ద్వారా ప్రయాణికులకు సమయం, నగదు ఆదా అవుతుంది. ప్రతిఒక్కరూ ఆర్టీసీ డిజిటల్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలి.

- పి.రాము, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజరు, చిత్తూరు
Link to comment
Share on other sites

Anni baney vunnayi kani labahalu vache routes lo ekkuva buses veyyakapoga vunna buses ni teesestunnaru due to pressure from few Pvt travels owned by politicians...Bangalore- Vijayawada route KSRTC, travels vallu making profits APSRTC matram Hyderaabd-Vijayawada tappiste inko route mida no concentration...

Link to comment
Share on other sites

31 minutes ago, kumar_tarak said:

Anni baney vunnayi kani labahalu vache routes lo ekkuva buses veyyakapoga vunna buses ni teesestunnaru due to pressure from few Pvt travels owned by politicians...Bangalore- Vijayawada route KSRTC, travels vallu making profits APSRTC matram Hyderaabd-Vijayawada tappiste inko route mida no concentration...

Private travels vallu accommodation provide cheyyaru, it doesn't apply same with rtc and additional drivers undali

Link to comment
Share on other sites

ఆర్టీసీలో... ఇక మినీ కార్గో
19-04-2018 08:11:51
 
636597223127029463.jpg
  • బస్సుల్లోని చివరి నాలుగు సీట్ల స్థానంలో బ్లాక్‌
  • గ్రామీణ బస్సుల్లో ఈ తరహా వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి
  • ఆంధ్రజ్యోతి డెలి‘వర్రీ’ కథనంతో ఆర్టీసీ అధికారుల్లో కదలిక
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆర్టీసీలో ప్రవేశపెట్టిన పార్శిల్స్‌ అండ్‌ కొరియర్‌ విభాగం లాభాల వేట సాగిస్తుండటంతో మినీ కార్గో దిశగా అడుగులు పడుతున్నాయి. దీని కోసం కొన్ని బస్సుల్లో కార్గో బ్లాక్స్‌ ఏర్పాటు చేయాలన్న దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల బస్సులలో ఈ తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రధానంగా వాణిజ్య ప్రాంతాల నుంచి సరుకును తీసుకెళ్లటం, ఆయా ప్రాంతాలకు సరకు, కూరగాయలు తదితరాల రవాణా వంటివి చేపట్టడానికి వీలుగా గ్రామీణ బస్సుల్లో చివరి నాలుగు సీట్లను తొలగించి వెనుక భాగం నుంచి వ్యాన్ల తరహాలో డోర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక గ్రామీణ బస్సుకు ప్రయోగాత్మకంగా కార్గో బ్లాక్‌ను ఏర్పాటు చేశారు. దీనిని పరిశీలించిన తర్వాత రానున్న రోజుల్లో మినీ కార్గో రవాణా చేపట్టనున్నారు. ప్రస్తుతం అందిస్తున్న పార్శిల్స్‌ - కొరియర్‌ సేవలను ఇక మీదట ఫ్లిప్‌కార్ట్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో సరుకు డెలివరీ బుకింగ్‌ చేపట్టే అంశంపై కూడా ఆర్టీసీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. పార్శిల్స్‌ - కొరియర్‌ సేవలకు సంబంధించి ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రచురించిన డెలి.. ‘వర్రీ’ కథనం ఆర్టీసీ ఉన్నతాధికారులలో కదలికను తెప్పించింది.
 
పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) లోని అరైవల్‌ బ్లాక్‌లోని పార్శిల్స్‌ - కొరియర్‌ విభాగంలో సమూల మార్పులు తీసుకు వచ్చారు. కాంట్రాక్టు సంస్థ గ్యాలెక్స్‌ ప్రతినిధులతో చర్చించి ప్రస్తుత గందరగోళాన్ని నివారించే పని చేపట్టారు. గతంలో రిసీవింగ్‌, డెలివరీ వంటివి గందరగోళంగా ఉండేవి.ఎవరి పార్శిల్‌ ఎక్కడ ఉండేదో తెలిసేది కాదు. ఇప్పుడీ పరిస్థితిని నివారించారు. జిల్లాలు, డిపోల వారీగా పార్శిల్స్‌ను విభజించటానికి వీలుగా భారీ ర్యాఖ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బస్‌స్టేషన్‌ ఆవరణలో తయారు చేస్తున్నారు. పూర్తయిన వాటిని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పార్శిల్‌ అండ్‌ కొరియర్‌ పాయింట్‌కు అభిముఖంగా ఉన్న నాలుగు అరైవల్‌ బ్లాక్‌లోని నాలుగు ప్లాట్‌ఫామ్స్‌ను కూడా పూర్తిగా రిసీవింగ్‌కు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ నాలుగు ప్లాట్‌ఫామ్స్‌ను ఒక పెద్ద క్యాబిన్‌లాగా విస్తరణకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. పార్శిల్స్‌ రిసీవింగ్‌ ఫ్రంట్‌ ఆఫీసును కూడా విస్తరించారు. అంతటా సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు చేశారు.
 
4.jpgఇంటికీ .. ఇక డోర్‌ డెలివరీ :
పార్శిల్స్‌ను ఇప్పటి వరకు బస్‌స్టేషన్‌లోనే తీసుకోవాల్సి వస్తోంది. ఇక మీదట వీటిని సంబంధిత వ్యక్తుల ఇంటికే పంపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో సరకును ఎగుమతి, దిగుమతి చేసుకునే వారికి ఆర్టీసీ డీ జీటీ బస్సులను ఉపయోగిస్తున్నారు. ఇవి కాకుండా చిన్నపాటి కవర్లు, పార్శిల్స్‌ను కూడా నేరుగా ఇంటికే పంపించటానికి తేలికపాటి చిన్న వాహనాలను ఉపయోగించాలని భావిస్తున్నారు. కొంత రుసుము వసూలు చేయటం ద్వారా ఈ అవకాశాన్ని కూడా కల్పించాలని భావిస్తున్నారు.
 
zdsfSDFsd.jpgఅరైవల్‌ బ్లాక్‌లో కార్గో డిస్పాచ్‌ పాయింట్‌
ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ రూ.1 కోటి నుంచి రూ.6 కోట్లకు పార్శిల్స్‌ - కొరియర్‌ ఆదాయం పెరిగింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద బస్‌స్టేషన్‌ అయిన పీఎన్‌బీఎస్‌లో పార్శిల్స్‌ - కొరియర్‌ తాకిడి తీవ్రంగా ఉంటోంది. ప్రస్తుతం పార్శిల్స్‌ను స్వీకరించటం, వాటిని డెలివరీ చేయటం, వచ్చిన వాటిని స్టాక్‌ పాయింట్‌లో ఉంచటం, వాటిని డిస్పాచ్‌ చేయటం వంటివి ఒకేచోట జరుగుతున్నాయి. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు స్వయంగా పరిశీలించిన మీదట పార్శిల్స్‌ స్వీకరించటం, వాటిని నిర్దేశిత ప్రాంతాలకు డెలివరీ చేయటం ఒకచోట, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాటిని రిసీవింగ్‌ చేసుకుని, వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగించటం వంటివి మరోచోట చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పాయింట్‌ను రిసీవింగ్‌ పాయింట్‌గా ఉంచి ఇటీవల వైస్ర్కీన్స్‌ థియేటర్‌ వెనుక ఖాళీ చేసిన హోటల్‌ స్థానంలో డిస్పాచ్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రయాణికుల కొరకు 50 కులర్లను ఏర్పాటు చేశారు

https://pbs.twimg.com/media/DbzWJuUX4AAIjsE.jpg

Link to comment
Share on other sites

ఏ రాష్ట్రంలో ఐనా ఇలా ప్రజా రవాణా వ్యవస్థలో ప్రజల సౌకర్యార్థం ఎండాకాలంలో కూలర్లు పెట్టించడం చూసారా...

What AP does today, India will do tomorrow.

https://pbs.twimg.com/media/Db1cAogVAAA0Pin.jpg

https://pbs.twimg.com/media/Db1cA7SVwAAHDFf.jpg

https://pbs.twimg.com/media/Db1cBNKV4AAJKzb.jpg

Link to comment
Share on other sites

18 minutes ago, Yaswanth526 said:

ఏ రాష్ట్రంలో ఐనా ఇలా ప్రజా రవాణా వ్యవస్థలో ప్రజల సౌకర్యార్థం ఎండాకాలంలో కూలర్లు పెట్టించడం చూసారా...

What AP does today, India will do tomorrow.

https://pbs.twimg.com/media/Db1cAogVAAA0Pin.jpg

https://pbs.twimg.com/media/Db1cA7SVwAAHDFf.jpg

https://pbs.twimg.com/media/Db1cBNKV4AAJKzb.jpg

Last year karimnagar district some depot lo pettaru express buses lo...this year no idea...

Link to comment
Share on other sites

15 minutes ago, Kedism said:

Thanks sai ...

 

 

ee corona buses antey bhayam ..choodham yentha pedathaaadhooo fare ...

 

Marathahalli ki oka service vesthey baagundhuuu ....

Super just checked in Website... 

 

Oka service vesaadhu starting from Ongole - Marathahalli - Majestic

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Students in Andhra Pradesh don’t have to stand in queue every month to get their Student Bus Passes renewed. With the new system in place, students can now avail themselves of three months’ validity bus pass or an annual bus pass for a period of 10 months

https://pbs.twimg.com/media/DeceGi8U0AE6PyF.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...