Jump to content

APSRTC


Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply

 

పోలవరంలో అతివేగం పనికి రాదు 
2020 నాటికి పూర్తవుతుంది 
ప్రాజెక్టు అథారిటీ సీఈవో సౌమిత్ర హల్దార్‌ 
21ap-main10a.jpg

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు పనుల్లో అతివేగం పనికి రాదని పోలవరం అథారిటీ సీఈవో సౌమిత్రహల్దార్‌ అభిప్రాయపడ్డారు.అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తాతో కలిసి సీఈవో తొలిసారిగా ప్రాజెక్టు పనులు సందర్శించారు. ప్రాజెక్టు నమూనాను పరిశీలించాక హిల్‌వ్యూ కొండపైకి చేరుకుని అక్కడ నుంచి స్పిల్‌వే ప్రాంతాన్ని చూశారు. పనుల గురించి ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్‌ రమేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా స్పిల్‌వే నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి పనులు పరిశీలించాక డయాఫ్రమ్‌వాల్‌, కాఫర్‌డ్యామ్‌ నిర్మాణ ప్రదేశాలను చూశారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఇంజినీర్లతో మాట్లాడారు. 2020 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీఈవో వెంట ట్రాన్స్‌స్ట్రాయ్‌ ఉపాధ్యక్షుడు కావూరి తిరుమలేశ్వరరావు, ఈఈలు ఎన్‌.పుల్లారావు, ఎం.చంద్రరావు, బుల్లియ్య తదితరులున్నారు.

సీమ జిల్లాల్లో దండిగా భూగర్భ జలాలు..: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమంతో పాటు ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రాయలసీమ జిల్లాల్లో భూగర్భ జలాలు పెరిగాయని  భూగర్భ జల, జలగణన సంచాలకులు కె.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. విజయవాడ కార్యాలయ సిబ్బందితో పాటు ఉభయగోదావరి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లతో కలిసి గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. ప్రాజెక్టు నమూనాతో పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో  మాట్లాడుతూ ఒకప్పుడు అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 25 మీటర్ల లోతున ఉండే నీరు ఇప్పుడు 15 నుంచి ఐదు మీటర్ల ఎగువకు వచ్చిందన్నారు. వర్షాలతో పాటు చెరువుల్లో పూడికతీత, పంటకుంటల నిర్మాణం, హంద్రీనీవా, గాలేరు, నగరిలకు శ్రీశైలం నుంచి నీరు రావడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్‌, విజయకుమార్‌, రంగారావు తదితరులున్నారు.


‘ఆర్టీజీఎస్‌’లో గంటసేపు రాష్ట్రపతి 
వీడియో వాల్‌, పరిష్కార వేదికలను గూర్చి వివరించనున్న ముఖ్యమంత్రి
ఈనాడు, అమరావతి: ‘ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్‌ పొందినవాళ్లు టీవీ ఆన్‌ చేసి ఉంచుకొంటే రాష్ట్రపతి ఇచ్చే సందేశాన్ని వినడంతోపాటు మాట్లాడే అవకాశం ఉంటుంది’ అన్నది రాష్ట్ర ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్న మాట. ఈ నెల 27న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫైబర్‌ గ్రిడ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం కనెక్షన్‌ ఉన్న వినియోగదారులతో సంభాషించేందుకు అవసరమైన ఏర్పాట్లను అమరావతిలో చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభ సమీపంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం తరవాత అదే ప్రాంగణంలో రాజధాని నగర నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక నమూనాలను రాష్ట్రపతి వీక్షిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనంలో సచివాలయానికి చేరుకొంటారు.

పోలవరం పనుల వీక్షణ: సచివాలయంలోని మొదటి భవనంలో ఏర్పాటు చేసిన రియల్‌టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్‌) కార్యాలయాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. ఇక్కడ దాదాపు గంటసేపు ఉండనున్నారు. కార్యాలయం ఏర్పాటు ఆవశ్యకత, ఇందుకు సంబంధించి అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరిస్తారు. 61 అడుగుల మేర ఉన్న వీడియోవాల్‌, దానిపై ఉన్న 24 స్క్రీన్ల ద్వారా వివిధ విభాగాల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నదీ చూపిస్తారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల్నీ రియల్‌టైంలో చూపించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వర్చువల్‌ తరగతి గదులను వీక్షించనున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ నుంచి వ్యవసాయ రంగం వరకూ డ్రోన్‌ పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటున్నదీ వివరిస్తారు. అనంతరం అదే కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధునాతన వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ను రాష్ట్రపతి సందర్శిస్తారు. పరిపాలనలో వచ్చే వేగం, కచ్చితత్వం, పారదర్శకతను రాష్ట్రపతికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. పరిష్కార వేదిక కోసం చేసిన ఏర్పాట్లను, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వాటి పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలను తెలియజేస్తారు.

Link to comment
Share on other sites

 

శబ్దం రాదు.. ఇంధనం అవసరం లేదు!
22-12-2017 00:56:48
 
636495010167914318.jpg
  • విజయవాడ చేరిన ఎలక్ట్రిక్‌ బస్సు
  • త్వరలో ట్రయల్‌ రన్‌
విజయవాడ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి) : ‘ఆర్టీసీ’ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ర్టిక్‌ బస్సు రానే వచ్చింది. గోల్డ్‌స్టోన్‌ కంపెనీకి చెందిన నూరు శాతం ఎలక్ర్టిక్‌ ఆధారితంగా పరుగులు తీసే ఈ బస్సును ప్రయోగాత్మకంగా ఆర్టీసీ నడపాలని నిర్ణయించింది. బుధవారం ఈ బస్సు విజయవాడ డిపో గ్యారేజీకి వచ్చింది. ఆర్టీసీ సిబ్బందికి దీని సాంకేతికతపై గోల్డ్‌స్టోన్‌ కంపెనీ సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. రిజిస్ర్టేషన్‌ పూర్తయిన తర్వాత నిర్దేశిత మార్గంలో నడపనున్నారు.
 
ట్రయల్‌ రన్‌ విజయవంతమైతే, ఆర్టీసీలో ఇక డీజిల్‌, సీఎన్‌జీ బస్సుల స్థానంలో ఎలక్ర్టికల్‌ బస్సులు అధిక సంఖ్యలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎలాంటి కర్బన ఉద్గారాలు అనేవి లేకుండా జీరో ఎమిషన్‌ సామర్థ్యం కలిగిన ఈ బస్సు నుంచి ఎలాంటి పొగ, శబ్దం రాకపోవడం విశేషం. శక్తివంతమైన బ్యాటరీలకు నాలుగు గంటల పాటు ఛార్జింగ్‌ పెడితే చాలు. ఈ బస్సు ఖరీదు రూ. 3 కోట్లు. కేంద్ర ప్రభుత్వం రూ. 85 లక్షల మేర సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో సగమైనా సబ్సిడీ ఇస్తే 1.75 కోట్లకే ఆర్టీసీకి బస్సు వచ్చే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

 

ఆర్టీసీ అమ్ముల పొదిలో ఎలక్ర్టిక్‌ బస్‌
22-12-2017 06:58:29
 
636495227186859068.jpg
  •  వందశాతం కాలుష్య, శబ్ద రహితం
  •  నాలుగు గంటల ఛార్జింగ్‌, 350కి.మీ మైలేజి
  •  రిజిస్ర్టేషన్‌ పూర్తయ్యాక ట్రయల్‌ రన్‌
  •  
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆర్టీసీ అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. ఎప్పుడా? ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న ఎలక్ర్టిక్‌ బస్సు రానే వచ్చింది. గోల్డ్‌స్టోన్‌ కంపెనీకి చెందిన ఎలక్ర్టిక్‌ బస్సు విజయవాడ డిపో గ్యారేజీలో సందడి చేస్తోంది! డీజిల్‌తో సంబంధం లేకుండా.. నూరుశాతం ఎలక్ర్టిక్‌ ఆధారితంగా మార్కెట్లోకి వచ్చిన ఈ బస్సును ప్రయోగాత్మకంగా ఆర్టీసీ నడపాలని నిర్ణయించింది. బుధవారం ఈ బస్సు విజయవాడ డిపో గ్యారేజీకి వచ్చింది. బస్సు వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ సిబ్బందికి దీని సాంకేతికతపై గోల్డ్‌స్టోన్‌ కంపెనీ సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ పూర్తయిన తర్వాత నిర్దేశిత రూట్‌లో ఆర్టీసీ ప్రయోగాత్మకంగా నడుపుతుంది. ట్రయల్‌ విజయవంతమైతే.. మరిన్ని ఎలక్ర్టికల్‌ బస్సులు వచ్చే అవకాశం ఉంది.
 
కాలుష్య రహితంగా..
కాలుష్య నగరంగా ఉన్న విజయవాడకు అవసరమైన బస్సు ఇది. ఎలాంటి కర్బన ఉద్గారాలు అనేవి లేకుండా జీరో ఎమిషన్‌ సామర్ధ్యం కలిగినది ఈ బస్సు! ఎలక్ర్టికల్‌ బస్సు కాబట్టి పొగ రాదు. దీనికి ప్రత్యేక ఇంజిన్‌ అంటూ ఏమీ ఉండదు. పూర్తిగా విద్యుత్‌రీ ఛార్జితో పనిచేస్తుంది. ఈ బస్సులో శక్తివంతమైన బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలకు నాలుగు గంటల పాటు ఛాంగ్‌ పెడతారు. విజయవాడ డిపో గ్యారేజీలోనే తాత్కాలికంగా ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.
 
సౌండ్‌లెస్‌ .. ట్రావెల్‌
ఇది పూర్తిగా శబ్ద రహిత బస్సు. ఈ బస్సు స్టార్ట్‌ చేసినది మొదలు.. ప్రయాణంలో ఎక్కడా కూడా శబ్దం రాదు. ఈ బస్సుకు డోర్స్‌ అన్నీ పడితేనే స్టార్ట్‌ అవుతుంది. బస్సు శబ్దం వినిపించదు. అసలు ప్రయాణిస్తున్నామో లేదో కూడా చాలామందికి అర్థం కాదనే చెప్పాలి. ఈ బస్సు శబ్దం చేయదు. ఏదైనా శబ్దం వస్తుందంటే అది ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి మాత్రమేనని గ్రహించాలి.
ఎలక్ర్టిల్‌ బస్సు మొత్తం సెంట్రలైజ్డ్‌ ఏసీ సదుపాయంతో ఉంటుంది. బస్సులో మొత్తం 47 సీటింగ్‌ ఉంటుంది. లోపల ఫైర్‌ ఎగ్జ్వింగషర్స్‌ ప్రతి సీటు దగ్గరా ఉంటాయి. బస్సు లోపల రెండు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. బస్సు బయట ముందు, వెనుక భాగంలో ఉండే సీసీ కెమెరాల ద్వారా బయటి వాహనాల కదలికలను డ్రైవర్‌ తన ఎదురుగా ఉన్న స్ర్కీన్‌ మీద చూడవచ్చు. డ్రైవర్‌ కాక్‌పిట్‌ ఎంతో అద్భుతంగా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణీకుల కూర్చున్న దగ్గరే స్టాప్‌ బటన్‌ ఉంటుంది. ప్రతి విండో దగ్గర ఒక హ్యామర్‌ ఏర్పాటు ఉంది. డాల్బీ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు ఉంది.
 
ట్రయల్‌ రన్‌పై మల్లగుల్లాలు
ఈ బస్సును ఏ రూట్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలన్న దానిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడు తున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అమరావతికి నడపాలన్నది ప్రతిపాదనగా ఉంది. దూరప్రాంతాలకు నడిపితే బాగుంటుందన్న వాదన కూడా వస్తోంది. ఒంగోలు , రాజమండ్రిలకు కనీస దూరం 270 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లు ఉంది. ఈ బస్సు మైలేజీని పరీక్షించాలంటే ఈ రెండు ప్రాంతాలకు నడిపితే బాగుంటుందన్న సూచన ఆర్టీసీ అధికారుల నుంచి వస్తుంది. మరికొద్ది రోజుల్లో రూట్‌ను ఆర్టీసీ అధికారులు నిర్ణయించనున్నారు.
 
రూ.3 కోట్లు ఖరీదు
ఈ బస్సు ఖరీదు రూ.3 కోట్లు. కేంద్ర ప్రభుత్వం రూ.85 లక్షల మేర సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో సగం అయినా సబ్సిడీ ఇస్తే 1.75 కోట్లకే ఆర్టీసీకి బస్సు వచ్చే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

హైదరాబాద్‌పై దృష్టిపెట్టి వైజాగ్‌ను మరిచారు

 

  • దిక్కులేని వైజాగ్‌ రూట్‌ !
  • ప్రైవేటు ఆపరేటర్లదే హవా
  • 90 శాతం వాటా ప్రైవేటు బస్సులే !
  • హైదరాబాద్‌ పైనే ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టి
  • హైదరాబాద్‌పై పట్టు తగ్గుతున్న నేపథ్యంలో.. వైజాగ్‌ రూటే కీలకం

 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులు తప్పితే, వైజాగ్‌కు బస్సులు నడిపే విషయంలో ఆర్టీసీ కృష్ణా రీజియ న్‌ నిర్లక్ష్యం కనబరుస్తోంది. హైదరాబాద్‌ తర్వాత రెండవ అత్యంత ప్రధానరూట్‌ అయిన వైజాగ్‌కు పట్టుమని పది ఏసీ బస్సులు కూడా లేవు. ఈ రూట్‌లో తొంభై శాతం ప్రై వేటు ఆపరేటర్లదే హవా! పది శాతమే ఆర్టీసీ వాటా. ఒకపక్క అంతరాష్ట్ర ఒడంబడికల ప్రకారం టీఎస్‌ ఆర్టీసీతో, ఏపీఎస్‌ఆర్‌టీసీ అవగాహన కారణంగా దశలవారీగా బస్సులను తగ్గించుకోవాల్సి వస్తోం ది. తగ్గించిన బస్సులను వైజాగ్‌ నడిపితే ఆర్టీసీ పట్టు పెంచుకునే అవకాశం ఉం టుంది. నిర్లక్ష్యానికి గురవుతున్న వైజా గ్‌ రూట్‌పై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం...

వైజాగ్‌ నుంచి విజ యవాడకు రాక పోకలు ఎక్కువ గా ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ రాకపోకలు మరింతగా పెరిగాయి. అమరావతి రాజధాని వచ్చిన తర్వాత రికార్డుస్థాయిలో వైజాగ్‌ నుంచి రాకపో కలు పెరిగాయి. విశాఖపట్నం రూట్‌లో ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ నుంచి నడిచే ఏసీ బస్సులు కేవలం ఏడు మాత్రమే! పగలు మూడు, రాత్రి నాలుగు సర్వీసు లు నడుస్తున్నాయి. పగలు ఉదయం 9 గంటలకు ఒక గరుడ శ్రేణి బస్సు, 11.20 గంటలకు ఇంద్ర బస్సు , మధ్యాహ్నం ఒంటి గంటకు గరుడ ప్లస్‌ బస్సులు నడుస్తున్నాయి. రాత్రి 8 గంటలకు ఇంద్ర, 9.20 గంటలకు ఇంద్ర, 10గంటలకు గరుడ, 11.30గంటలకు గరుడ ప్లస్‌ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. కృష్ణా రీజియన్‌ నుంచి తిరగకపోయినా పైనుంచి అయినా వస్తున్నాయను కుంటే అదీ లేదు. రాత్రి సమయంలో హైదరాబాద్‌ నుంచి రెండు బస్సులు వస్తుంటాయి. వాటికి ఇక్కడ రిజర్వేషన్‌ లేదు. హైదరాబాద్‌లోనే ఫుల్‌ అయిపోతాయి. ఒక పొటెన్షియల్‌ రూట్‌గా ఉన్న విశాఖపట్నం ప్రాంతానికి ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు నడిపే బస్సులు పట్టుమని పది కూడా లేవు. ఇదే మంటే పగలు నుంచి సాధారణ నాన్‌ ఏసీ బస్సులను 85 వరకు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. భారీ మార్జిన్‌ మిగిల్చే రూట్‌లో కనీసం 20 ఏసీ బస్సులు అయినా లేకుండా ఎలా?.

హైదరాబాద్‌ రూట్‌కు రికార్డు స్థాయిలో...

హైదరాబాద్‌ రూట్‌ కృష్ణా రీజియన్‌కు కల్పతరువు. ఉమ్మ డిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ రూట్‌లో కృష్ణా రీజియన్‌ది మోనోపలీగా ఉండేది. రికార్డుస్థాయిలో ప్రతిరోజూ 180 షెడ్యూల్స్‌ నడుపుతుంది. ప్రత్యేక సందర్భాలలో 50 నుంచి 150 వరకు స్పెషల్‌ బస్సులను కూడా ఇదే రూట్‌లో నడుపు తుంది. హైదరాబాద్‌కు మొత్తం మీద హై ఎండ్‌ బస్సు ల శ్రేణిలో అమరావతి, గరుడ ప్లస్‌, గరుడ, వెన్నెల స్లీపర్‌, ఇంద్ర వంటి ఏసీ సర్వీ సులు 50కు పైగా నడుస్తున్నా యి. ఇవి కాకుండా సూపర్‌ లగ్జరీలు అయితే వందల సం ఖ్యలో ఉంటాయి. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌లు కూడా అంతేసంఖ్యలో ఉంటాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను తీసుకు రావటం కోసం అనేక సందర్భాలలో ఆర్టీసీ అధికారులు ఇక్కడి నుంచి ఖాళీగా బస్సులను పంపించి అక్కడి ప్రయాణి కులను తీసుకు వస్తుంటారు. ఇదో వ్యాపార ఎత్తుగడ అను కోవచ్చు.

వైజాగ్‌ రూట్‌లో ప్రైవేటుదే మోనోపలి...

వైజాగ్‌ రూట్‌లో ప్రైవేటు ఆపరేటర్లదే మోనోపలీ. ప్రతి రోజూ సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు నిరంత రాయంగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ అధికారు లు కాదన్నా.. వందకు పైగా ఏసీ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రైవేటు ఆపరేటర్లు నడిపే వాటిలో 90శాతం ఏసీ బస్సులే. ఈ బస్సులన్నీ కిటకిటగా ఉంటాయి. బెంజిసర్కిల్‌ , రామవర ప్పాడు రింగ్‌ల దగ్గర రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో వైజాగ్‌కు వెళ్ళే బస్సులతో కిక్కిరిసి ఉంటాయి.

వైజాగ్‌ రూట్‌లో ఆర్టీసీ బలపడాలి

వైజాగ్‌ రూట్‌లో ఆర్టీసీ బలపడాల్సిన అవసరం ఉంది. వైజాగ్‌కు ట్రెయిన్స్‌ ఉండటం వల్ల లాభం ఉండదన్న భావనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. అలాంటప్పుడు ప్రైవేటు ఆపరేటర్లు రికార్డు స్థాయిలో బస్సులు ఎలా తిప్పుతున్నారన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే! విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌ రూట్‌పై మన పట్టుకోల్పోతున్న తరుణంలో వైజాగ్‌ రూట్‌పై ఆర్‌టీసీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో రాజమండ్రికి రాకపోకలు పెరిగాయి. దసరా సెలవుల సందర్భంలో వైజాగ్‌ వెళ్ళేవారికి తగినన్ని బస్సులు లేక రాజమండ్రి వరకు వెళ్ళి అక్కడి నుంచి సాధారణ బస్సులలో వైజాగ్‌ వెళ్ళిన ఉదంతాలు లేకపోలేదు. ప్రైవేటు ఆపరేటర్లు, క్యాబ్‌ల మార్కెట్‌ను చేజిక్కించుకోవటానికి ఆర్టీసీకి పెద్ద కష్టమేదీ కాదు.

వైజాగ్‌ రీజియన్‌తో మ్యూచువల్‌ ఆపరేషన్స్‌ నిర్వహించవచ్చు

వైజాగ్‌కు బస్సులు పెంచే విషయంలో ఇప్పటికిప్పుడు కృష్ణా రీజియన్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధత కాలేకపోతే, వైజాగ్‌ రీజియన్‌ సహకారం తీసుకోవచ్చు. కృష్ణా రీజియన్‌ ఇక్కడి నుంచి బస్సులు తిప్పితే.. రాత్రికి వైజాగ్‌లో ఉండి తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరతాయి. వైజాగ్‌ రీజియన్‌ వారు రాత్రుళ్ళు అటు నుంచి విజయవాడ నడిపితే రాత్రికి ఆ బస్సులు ఇక్కడ నిలుపుదల చేసి ఉదయాన్ని తిరిగి వైజాగ్‌ వెళ్ళే విధంగా ప్లాన్‌ చేస్తే .. క్రమేణా ఈ రూట్‌పై ఆర్టీసీ పట్టు సాధించే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
ఆర్టీసీకి తగ్గిన నష్టాలు
28-01-2018 00:46:36
 
  • రాష్ట్రంలో 15 డిపోలకు లాభాలు
  • విజయవాడ-1 డిపో ఆదాయంలో ఫస్ట్‌
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్టీసీ) నష్టాల కష్టాలను అధిగమిస్తోంది. డిసెంబరు-2016 వరకు రూ.663.15 కోట్లు నష్టాల్లో ఉన్న ఈ సంస్థ డిసెంబరు-2017కు నష్టాన్ని రూ.350.16 కోట్లకు తగ్గించగలిగింది. ఏపీఎస్‌ ఆర్టీసీకి 2016 డిసెంబరు నెలలో రూ.77.19 కోట్ల నష్టం రాగా, డిసెంబరు-2017లో రూ.67.29 కోట్లకు తగ్గించగలిగారు. ఒక్క డిసెంబరు నెలలో కార్పొరేషన్‌ బస్సులకు రూ.60.42 కోట్లు నష్టమొస్తే, ప్రైవేట్‌ అద్దె బస్సుల ద్వారా రూ.6.86 కోట్లు నష్టాలు వచ్చాయి. బస్సును ఒక కిలోమీటర్‌ నడిపితే వచ్చే ఆదాయ వ్యయాలకు సంబంధించి ఈపీకే(ఎర్నింగ్‌ ఫర్‌ కిలోమీటర్‌)ను లెక్కించారు.
 
2016 డిసెంబరులో ఈపీకే రూ.527 నష్టంలో ఉండగా, దాన్ని2017 డిసెంబరుకు రూ.297కు తగ్గించగలిగారు. ఆదాయాల్లో విజయవాడ-1 డిపో మొదటి స్థానంలో ఉంది. డిసెంబరు 2017 వరకు ఈ డిపో రూ.12.37 కోట్ల ఆదాయాన్ని గడించింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డిపో రూ.6.19 కోట్లతో రెండో ర్యాంక్‌, కాకినాడ రూ.5.72 కోట్లతో మూడో ర్యాంక్‌, విజయవాడ-ఏఎన్‌జీఆర్‌ రూ.3.70 కోట్లతో నాలుగో ర్యాంక్‌, రాజమండ్రి డిపో రూ.3.41 కోట్లతో ఐదో ర్యాంక్‌లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వరుసగా కనిగిరి, కర్నూలు, కడప, తిరుమల ఇలా 15 డిపోలు ఆదాయాలు గడిస్తుండగా మిగిలిన డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Travel at your own risk: 16 per cent APSRTC buses unfit to ferry passengers

VIJAYAWADA: At least 16 per cent of Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) buses, which have logged more than 15 lakh kilometres, are being operated on roads in violation of rules, compromising the safety of passengers and, at the same time, posing a serious threat to environment.  

According to sources, the Union ministry for transport is contemplating bringing in a law to phase out unfit/old buses (above 15 years) to bring down the pollution level. A direction in this regard has been given to the State Road Transport Authority (RTA) to identify unfit vehicles at the earliest.

A month ago, the transport department prepared a report on the status of worn-out vehicles in the State. In all, 14.07 lakh of a total 84.35 lakh vehicles in the State are identified as worn-out, but still they are plying on roads. Among them, 2,016 RTC buses that have crossed the permissible age limit, are still ferrying passengers. However, RTC officials claim that only 623 buses, which have covered 13   lakh kilometres, are being operated. They maintained that these buses were still fit to operate.

However, the transport department rules mandate maintenance of buses once a week and wheel service once in three months. Buses are required to get a road maintenance certificate every six months and fitness certificate once a year. Despite these comprehensive rules, many ‘unfit’ RTC buses continue to ferry passengers, with weekly and quarterly maintenance hardly making a difference. As per the existing rules, a bus over 10 years old and ran 12 lakh km, should be discarded.

In October 2017, Transport Minister K Atchannaidu conducted a review meeting with APSRTC officials to bring down the accident rate involving State-owned transport corporation buses. The RTC officials informed the minister that five percent of the buses (above 10 years) and 10 per cent of the buses, which travelled more than 12 lakh kilometres, were in the corporation fleet.

In response to their reply, Atchannaidu asked the officials to purchase new buses and check regularly the condition of the fleet.

“Earlier, the APSRTC used to put out of operation buses that covered 12 lakh kilometres and send them to scrap yard. But, in the last four years due to financial crisis, the corporation has converted aged vehicles into ‘Palle Velugu’ buses to operate them to rural areas,” said a member of APSRTC Employees’ Union. Currently, 50 per cent of the corporation buses have logged over 10 lakh km and 20 per cent of the fleet crossed 12 lakh km. Measures should be taken by the State Government in allocating enough funds in the budget for the purchase of new buses and bail out the corporation from the red.

APSRTC Executive Director (Engineering) A Koteswara Rao said that the State government gave its nod to purchase 1,000 new buses at an estimated cost of `250 crore in the earlier year.

In the first phase, already 439 new buses were dispatched to various bus depots in the State. The remaining 561 buses are at manufacturing level and will be added to the fleet by the end of April, he said.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...