Jump to content

APSRTC


Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply

volvo buses ee konachu kada. same price charge sesthunnappudu ticket ki same brand of bus undali. idedo kavalani commissions kosam corona konnatlu undi. Antha sarva mangala melam.

 

 

i followed RTC since 2014. There is a lot of news items written in AJ and Eenadu. It clearly mentioned that all AC coach buses are making full profits to RTC. Losses are made only by buses going to villages. So volvo bus brand is attraction to get more occupancy ani septhunna brother. It will increase image of RTC than other travels.  :dream:

 

I already predicted it....aa RTC director evado commission ki kakkurthi padi konnatlu unnadu Corona...Never late than now..buy VOLVO only..... :laughing:

Link to comment
Share on other sites

I already predicted it....aa RTC director evado commission ki kakkurthi padi konnatlu unnadu Corona...Never late than now..buy VOLVO only..... :laughing:

You mean malakondaiah??ayana chala strict officer,ayana ante chala respect istaru andaru,may be ayanaki evaro wrong guidance ichi untaru
Link to comment
Share on other sites

Guest Urban Legend

Pollution ye anukuna tyre lu kuda oodipotunaya permissions evadu istunadu veetini ammataniki :kick:

 

ninna hyd lo kanipinchindhi bagane vundhi mari :P

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎర్రబస్సుకు ఆదాయం పెరుగుతోంది!
25-06-2017 05:10:00
 
636339643872311712.jpg
 
  • తగ్గుతున్న నష్టాలు.. క్రమంగా లాభాల బాటలోకి!
  • రూ.139 కోట్ల నుంచి 46 కోట్లకు తగ్గిన నష్టాలు
  • ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు మరిన్ని కొత్త బస్సులు
అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ఎర్రబస్సు.. నష్టాల నుంచి గట్టెక్కుతోంది. నష్టాలకు కారణాలను సమీక్షించుకుని.. వాటిని క్రమంగా తగ్గించుకుంటోంది. ఈ చర్యలు ఫలితమివ్వడంతో.. క్రమంగా లాభాల బాటలో పయనిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. గతేడాది ఏప్రిల్‌, మే నెలల్తో పోల్చితే ఈ ఏడాది నష్టాలు బాగా తగ్గాయి. రాష్ట్రంలో ఉన్న 11 వేల బస్సులు రోజుకు 45 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌, మే నెలల్లో 29 కోట్ల కిలోమీటర్లు తిరిగిన ఆర్టీసీ బస్సులు రూ.777 కోట్ల కలెక్షన్లు తీసుకొచ్చాయి. ఈ ఏడాది అదే రెండు నెలల్లో 27 కోట్ల కిలోమీటర్లే తిరిగి రూ.795 కోట్లు కలెక్షన్‌ తీసుకొచ్చాయి. గతేడాది ఏప్రిల్‌-మే నెలల్లో రూ.139 కోట్లు నష్టంగా ఈ ఏడాది ఆ మొత్తం రూ.46 కోట్లకు తగ్గింది. గతేడాదితో పోల్చితే రూ.93 కోట్ల మేర నష్టాలు తగ్గాయి. మరింత శ్రమిస్తే ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్లి.. యాజమాన్యం, కార్మికులు సంతోషించే రోజు దగ్గర్లోనే ఉందని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
నష్టాల నుంచి గట్టెక్కేందుకు..!
 
ఆర్టీసీ ఎండీగా గత నవంబరులో బాధ్యతలు తీసుకున్న మాలకొండయ్య.. తొలుత సంస్థలో వృధాను అరికట్టేందుకు ఉపక్రమించారు. ఆతర్వాత జిల్లాల్లో పర్యటించి ఆపరేషన్స్‌లోనే ప్రధాన లోపం ఉందని గుర్తించారు. ప్రయాణికులు ఉన్నా లేకున్నా బస్సులను ఎందుకు తిప్పుతున్నారని అధికారుల్ని ప్రశ్నించగా.. ‘సలహాదారు’ సూచనల మేరకే అని చెప్పారు. దీంతో సలహాదారును సాగనంపి.. డిపో మేనేజర్లను రూట్ల సర్వేకు పంపారు. ప్రతి బస్సుకూ.. ప్రతి ట్రిప్పునకూ కలెక్షన్లను సమీక్షించాల్సిందిగా వారికి సూచించారు. వారిచ్చిన నివేదిక మేరకు ఈటీలు, హెచ్‌వోటీలతో చర్చించి 20 శాతంలోపు కలెక్షన్‌ వస్తోన్న ట్రిప్పులను రద్దు చేశారు. ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన పాత బస్సులను ఆపేశారు. దీనివల్ల కిలోమీటర్లు తగ్గినా.. ఆదాయం తగ్గలేదు. మరోవైపు రవాణా శాఖ అధికారులు, పోలీసుల సహకారంతో అక్రమ వాహనాలను అరికట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆదాయం కూడా పెరిగింది. ఈ జోరును ఇలాగే కొనసాగించేందుకు కొత్తగా వెయ్యి బస్సులు కొనాలని యాజమాన్యం యోచిస్తోంది. దూర ప్రాంతాలకు తిరిగే 900 ప్రైవేటు బస్సులు రద్దవడంతో.. ఏపీ నుంచి తిరుగుతున్న 600 బస్సుల స్థానంలో కొత్త బస్సులు వేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.
Link to comment
Share on other sites

మన గడ్డ మీదే ఆంధ్రా ‘తార్నాకా’!
25-06-2017 09:32:16
 
636339801229379847.jpg
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): వేలాదిమంది ఆర్టీసీ కార్మికులు.. వారి కుటుంబ సభ్యులకు.. శుభవార్త! మన గడ్డ మీదే మనవాళ్ళంతా ఇక అత్యున్నత వైద్యసేవలు పొందటానికి మార్గమేర్పడింది. మరో మూడు రోజుల్లో ‘ఆర్టీసీ’ ఆసుపత్రి అందుబాటులోకి రాబోతోంది. రాష్ట్ర రవాణా రంగానికి గుండెకాయగా ఉన్న విజయవాడలోనే ఆర్టీసీ హాస్పిటల్‌ ఏర్పాటు కావటం గమనార్హం. హైదరాబాద్‌లోని తార్నాకా తరహాలో విద్యాధరపురంలో ‘ఆర్టీసీ’ ఆసుపత్రి నూతన హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
 
 
కార్మికుల భాగస్వామ్యంతో రూ.15 కోట్లవ్యయంతో చేపట్టిన ఆసుపత్రి భవనాన్ని ఈనెల 28న రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆసియాలోనే రెండవ అతిపెద్దదైన పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌(పీఎన్‌బీఎ్‌స) కేంద్రంగా ఇప్పటికే ఆర్టీసీ హౌస్‌, ఎన్టీఆర్‌ అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌లు ఏర్పాటు జరిగాయి. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించటంతో విజయవాడ కేంద్రంగానే హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యాధరపురంలో రెండున్నర ఎకరాల విస్తీర్ణానానికి అనువుగా నిర్ణయించారు.
 
ఆర్టీసీ నిధుల సమస్య కారణంగా కార్మికుల వేతనాల నుంచి నిధులను సమకూర్చారు. దీని నిర్వహణ మాత్రం ఆర్టీసీ చేపడుతుంది. రూ.15 కోట్ల వ్యయంతో జీ+1 విధానంలో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సివిల్‌ నిర్మాణాలకు రూ.7 కోట్లు ఖర్చు కాగా.. హాస్పిటల్‌లో వివిధ విభాగాలలో ఏర్పాటు చేయబోయే అధునాతన వైద్య పరికరాలకు మిగిలిన రూ. 8 కోట్లను వెచ్చించారు. ఈ హాస్పిటల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 వేల మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు 85 వేలమంది కలిపి మొత్తం లక్షన్నర మంది వరకు వైద్యసేవలు పొందటానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తగా ప్రాంతీయంగా 13 జిల్లాల్లో మొత్తం 20 ఆర్టీసీ డిస్పెన్సరీలు ఉన్నాయి. ఈ డిస్పెన్సరీలకు వచ్చే సీరియస్‌ కేసులు విద్యాధరపురంలో ఆసుపత్రికి వస్తాయి. ఇక్కడ జనరల్‌ సర్జన్‌, ఆర్థో, ఆప్థమాలజీ, ఈఎన్‌టీ, తదితర విభాగాలు ఏర్పాటు కానున్నాయి. జనరల్‌ సర్జన్స్‌తో పాటు ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ స్థాయి కలిగిన వైద్యులను నియమిస్తున్నారు. సర్జరీలు, కీళ్ళ మార్పిడి వంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ఆసుపత్రితో రాష్ట్ర వ్యాప్తంగా 44 కార్పొరేట్‌ ఆసుపత్రులు రిఫరల్‌గా అనుసంధానమయ్యాయి. గుండె, మెదడు తదితర ప్రాణాంత జబ్బులకు సంబంధించి రిఫరల్‌ హాస్పిటల్స్‌కు పంపిస్తారు. ఆర్టీసీ ఆ ఖర్చును భరిస్తుంది.
 
సూపర్‌ స్థాయిలో అభివృద్ధి చేయాలి
మేము కోరుకున్నట్టుగా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. సూపర్‌ స్పెషాలిటీ స్థాయికి తీసుకు వెళ్ళాలని మొదటి నుంచి కోరుతున్నాం. సూపర్‌ స్థాయిలోనే ఏర్పాటు చేస్తారనుకున్నాం. అయినప్పటికీ మన ప్రాంతంలో హాస్పిటల్‌ ఏర్పాటు జరిగిందని సంతోషిస్తున్నారు. డాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి. రానున్న రోజుల్లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా అభివృద్ధి చేయాలి. - ఆర్‌.సుబ్బారావు, ఎన్‌ఎంయూ రాష్ట్ర నాయకుడు
 
విశాఖ, తిరుపతిలలో కూడా..
1995లోనే మేము విజయవాడ, విశాఖ, తిరుపతిలలో మూడు చోట్ల కేంద్ర హాస్పిటల్స్‌ ఏర్పాటు చేయమని చెప్పాం. అప్పట్లో అది జరగలేదు. ఇప్పుడైనా విజయవాడలో ఏర్పాటు చేయటం సంతోషం. ప్రస్తుతం యాభై పడకలు చేశారు. పడకల స్థాయిని ఇంకా పెంచాలి. ఎక్విప్మెంట్‌ స్థాయి పెంచాలి. మరిన్ని విభాగాలు ఏర్పాటు చేయాలి.
- ఎండీ ప్రసాద్‌, ఈయూ విజయవాడ జోనల్‌ సెక్రటరీ
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...