Jump to content

APSRTC


Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply

ee finance year lo first 2 months lo top lo vundi profits lo 75 laks

 

Previous year around 2 crores loss

 

Yes... konni marpulu chesaru routes lo kooda... Macheral to Guntrur Fast exp introduce chesaru with 5 stops.. Conductor kooda undadu.. 

Link to comment
Share on other sites

గుంటూరువాసులకు ఆర్టీసీ తీపికబురు !
 
636032468423360339.jpg
గుంటూరు నగరంలో ప్రైవేట్ సిటీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇకనుంచీ సిటీలో ఆర్టీసీ మినీ బస్సులు సందడి చేయనున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ మినీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తిరుపతి నుంచి తిరుమలకు తిరుగుతున్న బస్సులు ఈ కోవకు చెందినవే. గుంటూరు నగరంలోని బ్రాడీపేట, అరండల్‌పేట, కొత్తపేట, పట్టాభిపురం, లాలాపేట, అగ్రహారం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రైవేట్ ఆపరేటర్లకు చెందిన మినీ సిటీ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇక నుంచి ప్రభుత్వం కూడా మినీ సిటీ బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని గుంటూరులోనే ఉండటంతో ప్రయాణికుల తాకిడి పెరగనుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గుంటూరులో ఆర్టీసీ మినీ బస్సులను నడపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రతిపాదన దశలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే కొద్దిరోజుల్లోనే ఈ బస్సులు సిటీలో రయ్‌మంటూ పరుగులు తీయనున్నాయి. అయితే ఇప్పటికే రాజధాని ప్రాంతాలను కలుపుతూ మంగళగిరి- గుంటూరు, విజయవాడ-గుంటూరు మధ్య సిటీ బస్సులు నడుస్తున్న సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

అరచేతిలో ఏపీ ఆర్టీసీ సమాచారం
 
636033020731010581.jpg
ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారా..? మీరు ప్రయా ణించే మార్గంలో బస్సులు ఉన్నాయా..! సమయానికి వస్తుందా..? సీట్లు, టిక్కెట్ల కోసం పడిగాపులు పడాల్సి ఉంటుందేమోనని ఆలో చిస్తున్నారా..? ఆ అవసరం లేకుండా ఆర్టీసీ సమస్త సమాచారం ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ అరచేతిలో ఆండ్రాయిడ్‌ వెర్షన స్మార్ట్‌ఫోన ఉంటే చాలు ఒక్క క్లిక్‌తో సకల సమాచారం ఇట్టే తెలుసుకోవచ్చు. గుంటూరు (నల్లచెరువు) : ఆర్టీసీ సమాచారం అంతా మీ అరచేతిలోకి రావాలంటే ముందు మీ స్మార్ట్‌ఫోనలోని గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న ఏపీ ఎస్‌ఆర్టీసీ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకోవాలి. ఈ యాప్‌లో బుక్‌ టికెట్‌, ఈ వాలెంట్‌, ఏపీఎస్‌ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌, సిటీ బస్‌ ట్రాక్‌, నా గురించి సంస్థ ఫిర్యాదు అనే ఐచ్ఛికాలుంటాయి. వాటిని ఉపయో గించి ఆర్టీసీ అందించే పలు రకాల సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
 
టికెట్‌ నమోదు
ఈ యాప్‌ ద్వారా మీరు ప్రయాణం చేయాల నుకునే మార్గంలో బస్సుల వివరాలు, వాటి సమ య సూచిక, చార్జీలు, ఖాళీల వివరాలు తెలుసు కోవచ్చు. ఎక్కడికి వెళ్లాలన్నా టిక్కెట్‌ బుక్‌ చేసు కోవచ్చు.
 
ఈ వాలెట్‌
ఆనలైనలో టికెట్‌ రిజర్వేషన చేసుకునే వారి కోసం ఈ వాలెట్‌ సౌకర్యం తీసుకువచ్చారు. ఇందు లో ప్రయాణికుడి సెల్‌ నెంబర్‌ నమోదు చేసుకుని లాగిన అవ్వాలి. ఇందులో నమోదైన వారికి రూ.100 నగదు బహుమతి జమ చేస్తారు. ఈ వా లెట్‌ ఆనలైన ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇం దులో లావాదేవీలకు బోనస్‌ పాయింట్లు ఇచ్చి ప్ర యాణికుడికి లాభం చేకూరుస్తారు. ఇందులో బుక్‌ చేసిన టిక్కెట్‌ రద్దు చేసుకున్నా క్యాన్సిలేషన చార్జీ లు మినహాయించుకోకుండా నగదు తిరిగి ఇస్తారు.
 
ఏపీఎస్‌ ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌
ఇందులో నాలుగు ఐచ్ఛికాలు పొందుపరిచారు. ప్రయాణికుడి సమీపంలోని బస్టాండ్‌, బస్‌స్టాఫ్‌ల వివరాలు, రిజర్వేషన్ల వివరాలు ఉంటాయి. వీట న్నింటినీ జీపీఎస్‌ ద్వారా సులభంగా తెలుసుకునే ఏర్పాటుంది. రెండు లొకేషన్స మధ్యలో ఉన్న బస్సు ల వివరాలు తెలుసుకోవచ్చు. అత్యవసర ఫిర్యా దుల విభాగం ఉంది. మహిళల భద్రత, బస్సుల స్థితిగతులు, అత్యవసర వైద్యం, ఆర్టీసీ ఫిర్యాదుల విభాగం అనే నాలుగు ఐచ్ఛికాల ద్వారా ప్రయాణికుడు తనకు కావాల్సిన సేవలు పొందే సౌలభ్యం కల్పించారు.
 
ప్రమాదాలు, మరమ్మతుల సమయంలో ..
ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో మరమ్మతులకు గురైనా లేకుంటే ప్రమాదానికి లోనైనా సెల్‌లోని యాప్‌ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఇందులో ఉంది. దీనికి వెంటనే డిపో మేనేజర్‌ స్థాయి అధికారి స్పందిస్తారు. ఆ బస్సుకు దగ్గర్లోని డిపోలకు తక్షణమే సమాచారం చేరిపో తుంది. తక్షణమే సహాయక చర్యలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. ఫిర్యాదు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా వివరాలు గోప్యంగా ఉంచుతారు.
 
కియోస్క్‌తో లాభాలు
ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుల్లో కియోస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. దీని సాయంతో రిజర్వేషన్ల వివరాలు, గమ్య స్థానానికి ఎప్పుడు చేరుకోవచ్చు, బస్సు ఆలస్యంగా నడుస్తుంటే కార ణాలు, మరమ్మతులకు గురైతే సంబంధిత సమా చారం అంతా ఇందులో ఉంటుంది. ఈ యం త్రం లో బస్సు నెంబర్‌ నమోదు చేస్తే అన్ని వివరా లు అందులో వస్తాయి. మీరు వెళ్లే మార్గంలో ఇత ర బస్సుల వివరాలు చూడవచ్చు. వివిధ బస్‌ స్టేషన్స లో ఉన్న విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, విచార ణ కేంద్రాలు, తాగునీరు, ఫ్లాట్‌ఫాంల వివ రాలు ఇందులో కనిపిస్తాయి. బస్‌ స్టేషన లోపల, వెలు పలకు వెళ్లే మార్గాలు, బస్టాండ్‌లో ఫలహార శాలల వివరాలు పొందుపరిచారు.
 
వేధింపుల నివారణ కోసం ..
బస్సుల్లో మహిళలు, యువతులపై ఆకృత్యాలు, వేధింపులు అరికట్టేందుకు యాప్‌లో ప్రత్యేక ఐచ్ఛి కాన్ని పొందుపరిచారు. బస్సులో ప్రయాణించే వా రు మహిళా ఐచ్ఛికాన్ని నొక్కితే చాలు జీపీఎస్‌ విధానం ద్వారా ఆ సమాచారం క్షణాల్లో ఆర్టీసీ, పో లీస్‌, వైద్య శాఖ అధికారులకు చేరేలా ఏర్పా ట్లు చేశారు. ముందు ఆర్టీసీ వారికి సమాచారం చేరు తుంది. దాన్ని స్వీకరించిన వారు బస్సుకు సమీపం లో ఉన్న పోలీస్‌ స్టేషన అధికారికి సమాచారం చేర వేస్తారు. వారు వెంటనే చర్యలు తీసుకుంటారు. అదే విధంగా వైద్య విషయం లోనూ జరుగుతుంది.
Link to comment
Share on other sites

దటీజ్ ఏపీఎస్ ఆర్టీసీ….


నష్టాలొచ్చి నీరసపడిన టైమ్ లో ధనాధన్ దరువేస్తున్నట్టుగా ఉత్సాహంతో ఉరకలేస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. అసలు సంగతేంటో తెలిస్తే…అద్దీ ఆంధ్రా ఎఫెక్ట్… దటీజ్ ఏపీఎస్ ఆర్టీసీ అంటారు మీరు కూడా !


ఆర్టీసీ సక్సెస్ అయిన దాఖలాలు చరిత్రలో చాలా తక్కువ. లక్షాతొంభై బాధ్యతలు, రిజర్వేషన్లు, దానికితోడు గవర్నమెంట్ సంస్థకాబట్టి బండెడు నిర్లక్ష్యం బస్సు సంస్థని కుంగదీసేస్తాయ్. దేశవ్వాప్తంగా చూసినా లాభాల్లో నడిచే రోడ్డు రవాణా సంస్థలు చాలా తక్కువ. అందుకే కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు జోన్లుగా విడగొట్టి నెట్టుకొస్తున్నాయ్. అలాంటిది ఏపీ మాత్రం ఇపుడు అదుర్స్ అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏడాదిలో మూడోసారి అద్భుతమైన పాజిటివ్ ఫలితాలు సాదించి…అవునా అంటూ ఆశ్చర్యపరుస్తోంది.


సంగతేంటి అంటే… ఏపీఎస్ ఆర్టీసీ లేటెస్ట్ గా సరుకు రవాణా మొదలుపెట్టింది. అంతా కలిపి నెలన్నర కాలేదు. ఇప్పటికే 20 కోట్లకిపైగా ఆదాయంతో రికార్డులు బద్దలుకొడుతోంది. కొత్తగా ఎలాంటి ఖర్చూ లేకుండా ప్ర్రత్యేకంగా కొద్దిమంది సిబ్బందిని మాత్రం కేటాయించి సరుకు రవాణాలో సంచలనం సృష్టిస్తోంది. ఉదయం ఆరు నుంచి అర్థరాత్రి 12 వరకూ ఏ వేళలో అయినా ఏ రూట్లో అయినా సరుకు పంపుకోవచ్చు అనే సరికి ఇక కొరియర్ మీద ఆధారపడటం తగ్గించి… వేగంగా వెళుతుంది. భద్రంగా ఉంటుంది అని ఆర్టీసీవైపు వచ్చేస్తున్నాయ్ పార్శిళ్లన్నీ ! అందుకే మాంఛి రిజల్ట్ కనిపిస్తోంది. ఇంకా కొన్ని మార్పులు చేస్తామని ముందు ముందు మరింత ఆదాయం రాబోతోందని ఆర్టీలీ లెక్కేస్తోంది.


గత ఏడాదిలో ఆర్టీసీ రోడ్డెక్కించిన మూడో కొత్త ఐడియా ఇది. మొదట స్పెషల్ యాప్, సీజన్ల వారీగా సీట్ల వారీగా బుక్కింగ్ లో రాయితీలు. రెండోది బస్టాండుల్లో మినీ ప్లెక్స్ లు. ఖాళీగా ఉన్న జాగాల్ని కమర్షియల్ పాగాలు మార్చుకునేందుకు ఆర్టీసీ తిరుగులేని ఐడియా వేసే సరికి తెలంగాణ లాంటి రాష్ట్రాలు మనల్ని ఫాలో అయ్యేందుకు సిద్ధమయ్యాయ్. ఇపుడు సరుకు రవాణాతో హ్యాట్రిక్ సక్సెస్. అందుకే అంటున్నది… ఆలోచన ఉంటే ఎలాంటి అవరోధాలు అయినా అధిగమించొచ్చు అని. ఆర్టీసీ మరోసారి ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. దటీజ్ ఏపీఎస్ ఆర్టీసీ అనిపిస్తోంది.


Link to comment
Share on other sites

ఆర్టీసీలో రూ.10 వేల కనీస పింఛన్‌!
 
636040584482389237.jpg
  • సాధారణ మరణానికీ బీమా 
  • రోజుకు 10తో 10 లక్షలు చెల్లింపు 
  • కసరత్తు చేస్తున్న యాజమాన్యం 
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్‌ ప్రయోజనాలు కల్పించేందుకు ప్రస్తుతం రెండు పథకాలున్నాయి. ఎస్‌బీటీ... ఎస్‌ఆర్‌బీఎస్‌ అనే ఈ పథకాలతో ప్రస్తుతం కార్మికుడి కుటుంబానికి నెలకు ఐదారు వేల రూపాయలు అందుతున్నాయి. ఈ మొత్తంతో కార్మిక కుటుంబాల జీవనం అతికష్టమ్మీద సాగుతోంది. దీంతో కార్మిక కుటుంబాలకు మేలు చేసేవిధంగా యాజమాన్యం ఓ కొత్త ఆలోచన చేస్తోంది. వారి కోసం మెరుగైన పెన్షన్‌ స్కీము తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎస్‌బీఐ లాంటి జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు పెట్టి.. దానిపై వచ్చే వడ్డీతో రిటైర్‌ అయిన కార్మికులు, సిబ్బందికి పెన్షన్‌గా అందజేయాలని కసరత్తు చేస్తోంది. రిటైర్‌ అయిన కార్మిక కుటుంబానికి నెలకు కనీసం పది వేల రూపాయలు అందించడమే ఈ కొత్త పథకం ఉద్దేశం. కొన్నేళ్లుగా నష్టాలబాటలో ఉన్న ఆర్టీసీ.. ఏడాదికాలంగా సంస్కరణలతో కొత్తరూపు సంతరించుకొంది. అంతర్గత ఆదాయ వనరులు పెంచుకోవడంపై దృష్టి సారించి.. సైకిల్‌ స్టాండ్‌ వేలం నుంచి పార్శిల్‌, కొరియర్‌, తదితర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకొంటోంది. మరోవైపు యాజమాన్యం వేరు, కార్మికులు వేరు అన్న భావన తొలగించి సంస్థ కోసం మనందరం అనే భావన పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది.
 
కార్మికులకు ప్రయోజనం చేకూర్చడంలో భాగంగా.. కార్మికుడు నెలకు రూ.10 చెల్లిస్తే వారు ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు కుటుంబానికి పరిహారం చెల్లిస్తున్నారు. అంతేగాకుండా సాధారణ మరణానికి కూడా కనీసం రూ.5 లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం కసరత్తు చేసింది. కార్మికుడు రోజుకు రూ.5 చెల్లిస్తే ఐదు లక్షలు, రూ.10 చెల్లిస్తే పదిలక్షలు, రూ.15 చెల్లిస్తే 15లక్షలు ఇస్తామని సంస్థ చెబుతోంది. ‘సంస్థ ఆదాయాన్ని పెంచుకోవాలంటే కార్మికులు మరింత శ్రద్ధగా పనిచేయాలి. వారిని బాగా చూసుకుంటే మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. అందుకే పెన్షన్‌ పథకం తేవాలనుకుంటున్నాం.’’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
 
వాటితో కొంతే ప్రయోజనం
ప్రస్తుతం ఆర్టీసీలో రిటైర్డ్‌ అయిన కార్మికులకు రెండు పథకాలున్నాయి. వాటిలో స్టాఫ్‌ బెన్వలెంట్‌ త్రిఫ్ట్‌ ఫండ్‌ (ఎస్‌బీటీ) ద్వారా కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. సర్వీసులో ఉన్న కార్మికుడి జీతం నుంచి ప్రతి నెలా రూ.100 చొప్పున రికవరీ చేసి పదవీ విరమణ పొందేనాటికి ఆ మొత్తంతోపాటు రూ.1.50 లక్షలు అదనంగా చెల్లిస్తారు. కార్మికుడు చనిపోతే మధ్యలోనే ఆ మొత్తాన్ని అందజేస్తారు. ఇదిగాక పెన్షన్‌ కోసం ఉన్న మరో స్కీమ్‌ సర్వీస్‌ రికవరీ బెనిఫిట్‌ స్కీమ్‌ (ఎస్‌ఆర్‌బీఎస్‌). ఈ పథకం ద్వారా కార్మికుడి జీతం నుంచి ప్రతి నెలా రూ.250 కట్‌ చేస్తారు. అందులో నుంచి రూ.2800 వరకూ పెన్షన్‌ కింద చెల్లిస్తారు. 1989లో రూ.600తో ప్రారంభమైన ఈ మొత్తం ఇప్పుడు నాలుగున్నర రెట్లు పెరిగింది. అదేవిధంగా ఈపీఎస్‌ (పీఎఫ్‌) కింద చెల్లించిన సొమ్ము ద్వారా రూ.3 వేల నుంచి రూ.3500 వరకూ ప్రతి నెలా పెన్షన్‌గా ఇస్తారు. ఈ పథకాల్లో నెలకు ఐదారు వేల రూపాయలకు మించి రిటైర్డ్‌ అయిన కార్మికుడికి అందదు. అలాకాకుండా నెలకు కనీసం రూ.20 వేలు పెన్షన్‌ అందేలా చూడాలని గుర్తింపు యూనియన్‌ ఎన్‌ఎంయూ నేతలు చల్లా చంద్రయ్య, వై.శ్రీనివాసరావు, పీవీ రమణారెడ్డి, ప్రసాద్‌ బృందం యాజమాన్యాన్ని పలుమార్లు కోరింది.
 
దీనిపై స్పందించిన ఎండీ సాంబశివరావు పలు ఆర్థిక సంస్థలతో సంప్రదించి.. చివరికి ఎస్‌బీఐ పెన్షన్‌ స్కీమ్‌ బాగుందనే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. అయితే ఇందులో యాజమాన్యం వాటా ఎంత.? కార్మికుడి వాటా ఎంత.? అనేదానిపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. అవి ఫలప్రదమైతే ఆర్టీసీ కార్మికులకు కనీసం రూ.10 వేలకు తగ్గకుండా పెన్షన్‌ వచ్చే అవకాశముంది. ఈ విషయమై ఎన్‌ఎంయూ అధ్యక్షుడు చల్లా చంద్రయ్య మాట్లాడుతూ తమ వినతిపై స్పందించి పెన్షన్‌ స్కీమ్‌ తెస్తున్న ఎండీ సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు. నెలకు రూ.143 చెల్లిస్తే సాధారణ మరణానికి కూడా ఎస్‌బీఐ రూ.5లక్షలు చెల్లిస్తోందని, అందులో రెండొంతులు కార్మికుడు, ఒక వంతు యాజమాన్యం భరించాలని అన్నారు. కార్మికుడు చెల్లించేది వందలోపే ఉంటున్నందున ఎస్‌బీటీ కోసం రికవరీ చేస్తున్న రూ.100ను ఇటు మళ్లించినా అభ్యంతరం ఉండబోదన్నారు.
 
 
 
   
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...