Jump to content

SriCity


Recommended Posts

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 months later...
సిటీని సందర్శించిన ‘సోర్స్‌ ఇండియా’ ప్రతినిధుల బృందం 
ctr-gen7a.jpg

శ్రీసిటీ (వరదయ్యపాళెం) న్యూస్‌టుడే: భారతదేశంలో ఎలక్ట్రానిక్‌ తయారీదారుల కోసం పనిచేస్తున్న ప్రధానసంస్థ.. ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్సినా)కు చెందిన సోర్స్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ సప్లై చైన్‌కు చెందిన 22 మంది ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. దేశంలోని వివిధ ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల యజమానులతో కూడిన ఈ బృందం శ్రీసిటీలోని ఈఎంసీ గురించి క్షుణంగా అధ్యయనం చేయడం, వ్యాపార సామర్థ్య అంచనా, పెట్టుబడుల అవకాశాల అన్వేషణ నిమిత్తం ఇక్కడకు విచ్చేశారు. శ్రీసిటీ అధ్యక్షుడు(ఆపరేషన్స్‌) సతీష్‌కామత్‌ వీరికి సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన ఎలక్ట్రానిక్‌ పాలసీలో అందించే ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, రాయితీలు శ్రీసిటీ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో యూనిట్లను ఏర్పాటుచేయడం వల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనాలను గురించి వివరించారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరక్టరు రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ చైనా తరవాత ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా భారత్‌ విస్తరిస్తుందని, ఇందుకు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌కి గల భారీ డిమాండే ప్రధానకారణమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించడానికై శ్రీసిటీ ఒక ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ తయారీ క్లస్టరుని అభివృద్ధి చేసిందన్నారు. దేశీయ ఎగుమతి మార్కెట్‌ ఎలక్ట్రానిక్‌ సరఫరా చైన్‌ జట్టు సందర్శన తమ వ్యాపార విస్తరణకు ప్రధానమైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటన ద్వారా పలు పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడ తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేయగలరని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తమ పర్యటనలో భాగంగా ఈ బృంద ప్రతినిధులు శ్రీసిటీ అధికారులతో సమావేశమై పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీసిటీలో గల స్నేహపూర్వకవాతావరణం, అనుకూలమైన మౌలిక వసతుల పట్ల వారు సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం కింద పనిచేసే స్వతంత్ర సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ(ఏపీఈఐటీఏ) సారథ్యంలో ఈ పర్యటన సాగింది.

Link to comment
Share on other sites

శ్రీసిటీలో ఐఎఫ్‌ఎఫ్‌ ప్లాంట్‌
25-01-2018 00:50:33
 
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాకు చెందిన ఐఎ్‌ఫఎఫ్‌ (ఇంటర్‌నేషనల్‌ ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రన్సెస్‌ ) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. ఆసియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలన్న వ్యూహంలో భాగంగా శ్రీసిటీలో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది ఈ ప్లాంట్‌ 2019 ఆఖరునాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కేంద్రంలో తయారయ్యే ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విక్రయించనున్నట్టు ఐఎ్‌ఫఎఫ్‌ ఎండి ఎంజి ప్రకాష్‌ చెప్పారు. ఐఎ్‌ఫఎఫ్‌ ప్రపంచంలోని బడా కార్పొరేట్‌ సంస్థల్లో ఒకటి ఈ సంస్ధ వార్షిక అమ్మకాలు 310 కోట్ల డాలర్లు. శ్రీసిటి ప్లాంట్‌ పెట్టుబడి వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
శ్రీసిటి.. పరిశ్రమలు మేటి! 
రూ.3500 కోట్ల పెట్టుబడులతో  14 కంపెనీల ఒప్పందాలు 
విశాఖ భాగస్వామ్య సదస్సులో  ముఖ్యమంత్రి సమక్షంలో సంతకాలు 
ctr-gen7a.jpg

ఈనాడు-తిరుపతి, శ్రీసిటీ(వరదయ్యపాళెం) న్యూస్‌టుడే: విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో రూ.3500కోట్ల పెట్టుబడులతో 14 పరిశ్రమలు శ్రీసిటీలో నెలకొల్పడానికి ఆదివారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి, శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్యల సమక్షంలో ఆయా కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ స్థాపన, పారిశ్రామిక వ్యాపారానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి పిలుపుమేరకు దేశ, విదేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ పరిశ్రమలు పోటీపడుతున్నట్లు  చెప్పారు. నూతన పెట్టుబడులతో మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. 14 కంపెనీలలో చైనా-3, అమెరికా-3, జపాన్‌-2, సింగపూర్‌-1 ఉన్నాయి. మిగిలినవి మన దేశానికి చెందినవే. పరిశ్రమలన్నీ ఇంజినీరింగ్‌, సౌరశక్తి, వినిమయ వస్తువులు, లాజిస్టిక్‌, ఆహారశుద్ధి వంటి వివిధ ఉత్పత్తుల రంగానికి చెందినవి. వీటిలో 12 కంపెనీలు కొత్తవి కాగా, రెండు సంస్థలు(సీఎక్స్‌ ప్రిసిషన్‌ మరియు జడ్‌టీటీ) శ్రీసిటీలో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రాలను విస్తృతపరచటానికి ఒప్పందం చేసుకున్నాయి. పరిశ్రమల వల్ల సుమారు 4వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

‘జియో’కి జయహో:  ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ కేంద్రంగా తిరుపతి రూపుదిద్దుకుంటోంది. తాజాగా రిలయన్స్‌ సంస్థ రూ.1500 కోట్ల ప్రారంభ పెట్టుబడులతో చరవాణిలు, చిప్‌ల తయారీకి ఆదివారం విశాఖలో ఒప్పందం చేసుకుంది. రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఆస్కారం ఉంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. పరిశ్రమ స్థాపనతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
శ్రీ సిటీకి ప్రతిష్ఠాత్మక ఆసియా బ్రాండ్స్‌ అవార్డు
11-03-2018 00:17:00
 
636563281982517743.jpg
వరదయ్యపాళెం: చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్ఠాత్మక ఆసియా బ్రాండ్‌ అవార్డుతోపాటు భారత్‌లో యాభైలోపు అత్యుత్తమ సిఎఫ్ ఒ అవార్డులను శ్రీసిటీ సొంతం చేసుకుంది. వైట్‌ ఫ్రీజ్‌ ఇంటర్నేషనల్‌, యుకె ఆసియన్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ సంస్థ సంయుక్తంగా సింగపూర్‌లోని రిట్జ్‌ కార్లట్స్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ ప్రతినిధి నాగరాజన్‌ అందుకున్నారు. ఈ అవార్డులను అందుకోవడం తమకు గర్వకారణమని శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు.
 
 
వివిధ ఉత్తమ సంస్థలకు ఈ తరహా అవార్డులతో గుర్తింపు ఇవ్వడంతోపాటు వారి అభిప్రాయాలను, విజయ ప్రస్థానాలను చర్చించుకునేందుకు అవకాశం కల్పించిన వైట్‌ఫేజ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్వాహకులను రవీంద్ర సన్నారెడ్డి ప్రశంసించారు. అలాగే శ్రీసిటీ ఉన్నత ప్రమాణాలకు ఈ అవార్డు విలువైన గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 250 కంపెనీల సిఇఒలతోపాటు ఆసియా పారిశ్రామిక వేత్తలు, ప్రచార రంగ ప్రముఖులు, వివిధ పరిశ్రమలకు చెందిన కార్పొరేట్‌ సారథులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.
Link to comment
Share on other sites

Hundreds from suburb go to Andhra Pradesh for work daily

 
Yogesh Kabirdoss| TNN | Updated: Mar 12, 2018, 07:53 IST
crown.png
56
 
 
 
Hundreds from suburb go to Andhra Pradesh for work daily
CHENNAI: With a proposal to set up an industrial park near Madharpakkam mired in red tape, hundreds of youth from nearby villages are hopping across the border to Sri City in Andhra Pradesh for work every day.
The integrated business city just 10 kilometres from Madharpakkam near Gummidipoondi has emerged as a major source of employment for local youth. Jeelani, an auto rickshaw driver, said about 100 vans ferry workers to and fro on a daily basis. "At least 2000 people from rural pockets in and around Madharpakkam work in Sri City," he said.

In stark contrast, the 750-acre plot of land near Madharpakkam remains barren, with encroachments cropping up all around it, though the plan for the industrial park was put forward by SIPCOT in 2009 around the same time that Sri City was shaping up. SIPCOT observed that at least 3,500 people would get direct employment, while another 10,000 persons would receive indirect job opportunities through the project.

The Tamil Nadu government gave the go-ahead for the industrial park in Manallur and Soorapoondi villages to promote pharmaceutical and chemical industries. The entire land parcel is dry poramboke land owned by the government and did not involve any acquisition except for a one-and-a-half acre plot. The land is lying unused for about eight years as it is yet to receive environmental clearance.

Locals say the park would have also offered brisk business to traders. "The proposed industrial park at Manallur and Soorapoondi villages would have given a fillip to small traders at Madharpakkam, besides providing employment for local youth," said a local trader.

A visit to the spot revealed that hutments are mushrooming and the poramboke land is being used for farming. There is hardly any fencing and boards warning trespassers have disappeared.
 
CII Tamil Nadu state council president M Ponnuswami said the land at Manallur was vital because it would increase the land bank required for industrial purposes within a 100-km radius from Chennai. "Steps should be taken for obtaining necessary approvals quickly," he said.

When contacted, SIPCOT officials said steps are being taken to get the nod for environmental impact assessment. An official also said that notices have been issued to vacate those who have occupied a portion of the land. However, he did not give a time frame within which the industrial park would be thrown open.
Link to comment
Share on other sites

Sri City gives women a boost

 
Majority of industrial plants have hired thousands of rural women for jobs.
Manufacturing industries in the sectors of electronics, textile, food processing, toy making, etc started giving increasing preference to women. (Photo: DC)
 Manufacturing industries in the sectors of electronics, textile, food processing, toy making, etc started giving increasing preference to women. (Photo: DC)

Nellore: Gone are the days when women living in rural areas used to work as farmhands or take up some odd jobs. Today, a majority of women from Tada, Sathyavedu and Sullurpeta mandals in Nellore and Chittoor districts as well as from towns and villages from the adjacent Tamil Nadu are being recruited by industrial units in Sri City Multiproduct Special Economic Zone located in Chittoor District.

Women who used to be hired by farmers to transplant paddy or to remove weeds now have a wide field to choose from. They have been working as security guards, assembling mobile phones and making export-quality dolls, dresses and shoes among many other items. Nearly 50 per cent of the 37,000 people working in industries at Sri City are women, according to a survey conducted last year. Of them, 12,000 have been working at a popular mobile manufacturing unit, Foxconn.

With encouragement from the company managements, the shop floors of some of the food processing units like Kellogs, Everton Tea, Premium Ingredients, Lavazza Coffee, Pepsi, and Cadburys Chocolate are dominated by women from different backgrounds. Units such as Pals Plush, Mondelez, MSR Garments, KGI Clothing, Unicham, Colgate Palmolive, etc have a large women workforce. More opportunities are in the offing with six more food processing units have been gearing up to establish their units at Sri City.

According to a senior official of Sri City, C. Ravindranath, Sri City has been at the pioneering end of harnessing 'women power' on the shop floors across its several manufacturing units. The percentage of female workforce ranges a minimum of 14 to a maximum of 90 in various units in Sri City. Over 90 per cent of the workforce on the shop floor of Raising Star (Foxconn) mobile manufacturing company are women.

"Women make ideal workers because they are disciplined, loyal to the company and less likely to cause trouble or unionise. Women tend to get less bored of their work, and hence they are considered as good at work. They need to be given the opportunity" Mr Ravindranath observed. Manufacturing industries in the sectors of electronics, textile, food processing, toy making, etc started giving increasing preference to women in recruitment mainly because of their dexterity in performing repetitive functions for longer hours is one of the major reasons for hiring women.

Seema Nehra, director at Pals Plush, which makes toys in Sri City for the likes of Universal Studios, Walmart and Pottery Barn Kids, says around 80 per cent of its staff are first time workers and are women. "They are from rural areas. We train them initially. But they are comfortable with the sewing and finishing works of toy making," she says. Globalisation has the power to uproot the traditional treatment towards women to afford them an equal stance in society, Mr Ravindranath said.

Link to comment
Share on other sites

International Companies in Sri City SEZ:

Indian Companies in Sri City SEZ:

  • Shan Solar
  • Sutures India
  • TIL Healthacre
  • Amar Houseware
  • Artura
  • Astrotech Steels
  • MIMCO DFS
  • MM Polytech
  • Free World Granites

Social Infrastructure Organizations in Sri City SEZ:

Link to comment
Share on other sites

చ్చే ఏడాది చివరికల్లా శ్రీ సిటీ ప్లాంట్‌ సిద్ధం
28-03-2018 00:35:48
 
636577941487320736.jpg
  • జమ్ములో ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదన ఉపసంహరణ
  • అందుకు కేటాయించిన నిధులూ శ్రీసిటీ యూనిట్‌కే
  • బ్లూస్టార్‌ జెఎండి జె త్యాగరాజన్‌ వెల్లడి
 
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ ఎయిర్‌ కండీషనర్ల తయారీ సంస్థ బ్లూస్టార్‌ లిమిటెడ్‌ వచ్చే రెండేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు స్థాయికి పెంచుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌పైనే ప్రధానంగా ఆధారపడాలనుకుంటోంది. శ్రీ సిటీ ప్లాంట్‌ నిర్మాణం ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా ప్రారంభించనున్నట్లు, 2019 డిసెంబర్‌కల్లా సిద్ధంకావచ్చని బ్లూస్టార్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జెఎండి) బి త్యాగరాజన్‌ వెల్లడించారు. ప్లాంట్‌ ఏర్పాటు కోసం శ్రీ సిటీలో సంస్థ 20 ఎకరాల భూమిని సేకరించింది. ప్రస్తుతం బ్లూస్టార్‌ రూమ్‌ ఏసీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.50 లక్షల యూనిట్లుగా ఉంది. 2020కల్లా శ్రీ సిటీ ప్లాంట్‌ కూడా అందుబాటులోకసే వస్తే వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల యూనిట్లకు చేరుకోనుందని త్యాగరాజన్‌ వెల్లడించారు. మొదటి దశలో శ్రీ సిటీ ప్లాంట్‌ ద్వారా 2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు.
 
 
రూ.220 కోట్ల పెట్టుబడులతో శ్రీ సిటీతోపాటు జమ్ము అండ్‌ కశ్మీర్‌లో ఏసీల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు బ్లూస్టార్‌ గతంలోనే ప్రకటించింది. జమ్ము అండ్‌ కశ్మీర్‌ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన పన్ను ప్రోత్సాహకాలపై సందిగ్ధత నెలకొనడంతో ఆ ప్రయత్నాన్ని సంస్థ ఉపసంహరించుకుంది. తదుపరి బోర్డు సమావేశంలో తీర్మానించి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం ఇవ్వనున్నట్లు త్యాగరాజన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్ము ప్లాంట్‌ కోసం వెచ్చించాలనుకున్న నిధులను సైతం శ్రీ సిటీ ప్లాంట్‌ కోసమే వినియోగించనున్నట్లు వెల్లడించారు. సంస్థకు దక్షిణాదిలో ఇదే తొలి ప్లాంట్‌ కానుంది.
 
వంద కొత్త మోడళ్లు
ఏసీ మార్కెట్లో పెరుగుతున్న పోటీ తట్టుకునేందుకు బ్లూస్టార్‌ వందకు పైగా కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. అందులో 40 రకాల 3, 5 స్టార్‌ ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీ మోడళ్లు కూడా ఉన్నాయని మంగళవారం హైదాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్యాగరాజన్‌ తెలిపారు. ఈ సందర్భంగా దేశీయ ఏసీ మార్కెట్‌పై ఆయన వెల్లడించిన ముఖ్యాంశాలు..
 
2020కల్లా కోటి యూనిట్లకు ఏసీ మార్కెట్‌
ప్రస్తుతం దేశీయ ఏసీ మార్కెట్‌లో వార్షిక విక్రయాలు 55 లక్షల యూనిట్ల స్థాయికి చేరుకుంది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే మార్కెట్‌ వ్యాప్తి చాలా తక్కువ (4 శాతం) స్థాయిలో ఉంది. కాబట్టి దేశంలో ఏసీ మార్కెట్‌ భారీగా విస్తరించేందుకు అవకాశాలున్నాయి. 2020కల్లా వార్షిక విక్రయాలు కోటి యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా.
 
వచ్చే ఏడాది విక్రయాల్లో 30 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం( 2017-18)లో దేశీ ఏసీ మార్కెట్‌ 12 శాతం, సంస్థ విక్రయాలు 17 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2018-19)లో మార్కెట్‌ 15-20 శాతం, సంస్థ విక్రయాలు 25-30 శాతం వృద్ధి నమోదు చేసుకోవచ్చని అంచనా. గత ఏడాది 11.5 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటాను ఈ ఏడాదిలో 12.5 శాతానికి పెంచుకోవాలని బ్లూస్టార్‌ లక్ష్యంగా పెట్టుకుంది.
 
52 శాతం విక్రయాలు చిన్న పట్టణాల్లోనే..
సంస్థ ఏసీల్లో 52 శాతం చిన్న పట్టణాలు, నగరాల్లోనే అమ్ముడవుతున్నాయి. సంస్థ మొత్తం విక్రయాల్లో గృహ అవసరాల కోసం ఉపయోగించే ఏసీలదే 75 శాతం వాటా. కమర్షియల్‌ ఏసీల వాటా 25 శాతంగా ఉంది.
Link to comment
Share on other sites

  • 2 months later...
రీసిటీలో యూఎస్‌జి, బోరల్‌ పరిశ్రమకు భూమిపూజ
06-07-2018 00:19:22
 
636664331632732190.jpg
తడ : నెల్లూరు జిల్లా సరిహద్దులోని శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమకు గురువారం భూమిపూజ జరిగింది. అమెరికాకు చెందిన యూఎ్‌సజీ, అస్టేలియాకు చెందిన బోరల్‌ పరిశ్రమలు సంయుక్తంగా సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గురువారం ఆ పరిశ్రమ గ్రూపు సిఇఒ ప్రెడరీక్‌ డిరోగే మౌంట్‌, ఆసియా మెడిల్‌ ఈస్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాన్‌కాసే, ఇండియా ఆపరేషన్‌ సిఇఒ సుమిత్‌ డిడాని, బిడాని చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవననిర్మాణ రంగంలో ఉపయోగించే ప్లాస్టర్‌ బోర్డులను ఈ పరిశ్రమ ఆధునిక టెక్నాలజీలో తయారుచేయనున్నదని, ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు దేశీయ అవసరాలతో పాటు దక్షణాసియా దేశాల మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉంటాయని డిరోగే మౌంట్‌ అన్నారు. 24 ఎకరాలలో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ 2019 చివరినాటికి పూర్తికానున్నది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...