Jump to content

AP power sector


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 201
  • Created
  • Last Reply

Top Posters In This Topic

విద్యుత్‌ ఒప్పందాలపై సమీక్షకు కమిటీ

ఏడాదికి రూ.2 వేల కోట్ల ఖర్చు తగ్గింపు లక్ష్యం

ఈనాడు, అమరావతి: రాష్ట్రం విద్యుత్‌ మిగులులోకి చేరుకుంది. అవసరానికంటే మించి ఉన్న విద్యుత్‌ను వాడుకోలేకపోయినా దానికి డబ్బులు కట్టాల్సిందే. ఈ విధమైన చెల్లింపుల వల్ల వినియోగదారులపై భారం పడుతుంది. ఇది అనివార్యం అయిన నేపథ్యంలో కొంతైనా భారం తగ్గించుకోవాలంటే ఖర్చు తగ్గించుకోవాలి. ఇదే విషయమై మంగళవారం సచివాలయంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకట్రావు, సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో కూడిన బృందం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. వ్యయం తగ్గించుకోడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉందనే విషయమై ఆర్థికశాఖ సలహాదారు నర్సింహమూర్తి సమావేశంలో వివరించారు. దీనిలో భాగంగానే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)ను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించాలన్న నిర్ణయానికి వచ్చారు. కమిటీలో విద్యుత్‌ అధికారులతోపాటు, ఆర్థికశాఖ అధికారులు కూడా ఉంటారు. పవన, బయోమాస్‌, తదితర విద్యుత్‌ ప్రాజెక్టుల విద్యుత్‌ ధరను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయించింది. ఈఆర్‌సీ ఖరారు చేసిన పీపీఏలను పరిశీలించి వాటిలో విద్యుత్‌ రేటు తగ్గించే అవకాశాలను కమిటీ పరిశీలిస్తుంది. బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో గతంలో తీసుకున్న విద్యుత్‌ రుణాల వడ్డీ భారాన్ని తగ్గించుకోవడంపై కూడా కమిటీ దృష్టి పెడుతుంది. జెన్‌కోలో బొగ్గు రవాణా ఖర్చులు తగ్గించే ప్రయత్నాన్ని కమిటీ చేస్తుంది. మొత్తం మీద రూ.2 వేల కోట్ల మేర వ్యయం తగ్గించుకోవాలన్నది ఆశయం. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి ఏపీజెన్‌కోకు రావలసిన బకాయిల అంశాన్ని ఉమ్మడి రాష్ట్ర అంశాలపై చర్చల్లో పాల్గొంటున్న మంత్రుల కమిటీకి నివేదించాలని సమావేశంలో అనుకున్నారు.

* విద్యుత్‌ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండడంలేదు. సౌర విద్యుత్‌ రేటు భవిష్యత్‌లో రూ.2.50 పైసల దాకా తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఇక దీర్ఘకాలిక పీపీఏలు చేసుకోరాదన్న అభిప్రాయానికి సమావేశం వచ్చింది.

* ప్రభుత్వ సంస్థల విద్యుత్‌ బకాయిలపై సమావేశం చర్చించింది. నీటిపారుదలశాఖ నుంచి రావలసిన రూ.600 కోట్లను వెంటనే ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. రాయితీ రూపంలో ఇవ్వాల్సిన మరో రూ.600 కోట్ల విడుదలకూ ఆర్థికశాఖ అధికారులు అంగీకరించారు. స్థానిక సంస్థల నుంచి ప్రస్తుతం ఏనెల బిల్లు ఆ నెల వసూలు చేస్తారు. బకాయిల్లో ప్రభుత్వ అనుమతితో అపరాధ రుసుంను మినహాయిస్తారు.

* సౌర పంపుసెట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వపై సబ్సిడీ భారం తగ్గుతుంది. అందుకే సౌర పంపుసెట్లను ప్రోత్సహించాలని అనుకున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటున్న రుణంలో ఈ మేరకు ప్రతిపాదన చేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

* విద్యుత్‌ డిమాండ్‌ తక్కువ ఉన్న సమయంలో విద్యుత్‌ వాడుకునే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వాడకాన్ని పెంచవచ్చనే సూచన సమావేశంలో వచ్చింది.

విద్యుత్‌ అమ్ముతున్న ట్రాన్స్‌కో!: విద్యుత్‌ మిగులు నేపథ్యంలో భారం నుంచి బయట పడేందుకు కొంత విద్యుత్‌ అమ్మకాన్ని ట్రాన్స్‌కో చేపట్టింది. ఇందు కోసం ఒక విభాగాన్ని నెలకొల్పింది. ఇప్పటి వరకూ 200 మెగావాట్ల మేర విద్యుత్‌ను విక్రయించింది.

Link to comment
Share on other sites

లాంకోతో కుదిరిన ముసాయిదా పీపీఏ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపణీ సంస్థలు (డిస్కమ్స్‌) లాంకో కొండపల్లి విద్యుత్‌ ప్రాజెక్టు మధ్య సవరించిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) శుక్రవారంనాడు కుదిరింది. ఏపీట్రాన్స్‌కో సీఎండీ దినేష్‌ పరుచూరి సమక్షంలో డిస్కమ్స్‌, లాంకో ప్రతినిధులు ఈ ముసాయిదా పీపీఏపై సంతకాలు చేశారు. లాంకో విద్యుత్‌ను కొనే విషయమై డిస్కమ్స్‌ శనివారం ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)లో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. డీమ్డ్‌ జనరేషన్‌(విద్యుత్‌ ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా భావించే) నిబంధన లేకుండానే పీపీఏ కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

ఏపీలో విద్యుత్‌ రంగ అభివృద్ధికి భారీ రుణం

రూ.1,026.53 కోట్ల అందజేతకు ఆసియా మౌలిక వసతుల బ్యాంకు ఆమోదం

బీజింగ్‌: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ రంగ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి దాదాపు రూ.1,026.53 కోట్ల (16 కోట్ల డాలర్లు) రుణం అందజేతకు ‘ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు(ఏఐఐబీ)’ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. చైనాలోని బీజింగ్‌లో ఏఐఐబీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బ్యాంకులో చైనా అతిపెద్ద వాటాదారు కాగా, తర్వాతి స్థానంలో భారత్‌ ఉంది. భారత్‌లో చేపట్టే ప్రాజెక్టుకు ఈ బ్యాంకు రుణం మంజూరు చేయడం ఇదే ప్రథమం. ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా కార్యక్రమం అమలుకు ఏఐఐబీ ఈ రుణం మంజూరు చేసింది. ఏఐఐబీతోపాటు ఈ కార్యక్రమానికి తన వంతుగా రూ.1,539.8 కోట్లు (24 కోట్ల డాలర్లు) అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అంగీకారం తెలిపింది. నెల రోజుల్లోపు తుది ఆమోదం తెలిపే అవకాశముంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

avasaram ledu ane paristhi lo unnaru, central govt ki isthe pothundi,solarpower unit rate takkuva ayyindi ga ade effect bro.

 

no, I don't believe this article a bit. something behind scenes going on to give it to Central govt. hydal power is available round the clock day/night, cloudy/shiny for almost 70-80 days a year at the minimum. how can it be replaced with Solar/wind power? 

Link to comment
Share on other sites

no, I don't believe this article a bit. something behind scenes going on to give it to Central govt. hydal power is available round the clock day/night, cloudy/shiny for almost 70-80 days a year at the minimum. how can it be replaced with Solar/wind power? 

cbn intha kimundu kuda ede mata cheppadu

Link to comment
Share on other sites

avasaram ledu ane paristhi lo unnaru, central govt ki isthe pothundi,solarpower unit rate takkuva ayyindi ga ade effect bro.

సౌర విద్యుత్‌ నిల్వతో పెను మార్పులు

రెండో విద్యుత్‌రంగ సంస్కరణలకు ఇది శ్రీకారం

పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టుపైనా పునరాలోచన

వ్యవసాయ పంపుసెట్లన్నిటికీ సౌర విద్యుత్‌

రాష్ట్రంలో ‘పీపుల్‌ ఫస్ట్‌’ కార్యక్రమం

ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడికక్కడ సౌర విద్యుదుత్పత్తి, నిల్వ (స్టోరేజీ) పరిజ్ఞానాల్ని అభివృద్ధి చేయడం ద్వారా విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రానున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 1998లో విద్యుత్‌రంగ సంస్కరణలు తెచ్చానని, ఇప్పుడు రెండో విద్యుత్‌రంగ సంస్కరణలకు మళ్లీ తానే నాంది పలుకుతున్నానని ప్రకటించారు. దేశ, విదేశాల్లోని నిపుణుల సలహాలు తీసుకుని, వచ్చే 20 ఏళ్ల కాలానికి వ్యూహ పత్రాన్ని రూపొందిస్తామన్నారు. ఏడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన సందర్భంగా ఆయన శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్‌, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే రెండు కీలక నవకల్పనలకు అమెరికా పర్యటన దోహదం చేసినట్టు పేర్కొన్నారు. అమెరికాలోని మయో ఆస్పత్రిలో అనుసరిస్తున్న ‘పేషెంట్‌ ఫస్ట్‌’ అన్న విధానంతో తాను ఎంతో స్ఫూర్తి పొందానని, రాష్ట్రంలో ‘పీపుల్‌ ఫస్ట్‌’ కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. వచ్చే కలెక్టర్ల సదస్సులోనే దీని విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. ఆస్పత్రి, పోలీసు స్టేషన్‌, రెవెన్యూ కార్యాలయం.. ఇలా ఎక్కడైనా ప్రజలే ముందు అన్నదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమన్నారు.

సౌర విద్యుత్‌ నిల్వతో..

సౌర విద్యుత్‌ని ఎక్కడిక్కడ ఉత్పత్తి చేసి, నిల్వ చేయగలిగితే చాలా తక్కువ ధరకు విద్యుత్‌ సరఫరా చేయవచ్చునని, ధరలు పెంచాల్సిన అవసరమే ఉండదన్నారు. ఇప్పుడున్న సంప్రదాయ విద్యుదుత్పత్తి కేంద్రాల్ని మూసేయాల్సి రావొచ్చన్నారు. కొత్తగా జల విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నారు. పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టుపైనా పునరాలోచిస్తామని తెలిపారు. ప్రాజెక్టుకి అంతా సిద్ధం చేసి పెడతామని, అవసరం అనుకుంటేనే ముందుకు వెళతామన్నారు. సౌర విద్యుత్‌ ప్రస్తుతం యూనిట్‌ రూ.2.45కే వస్తోందని, జల విద్యుత్‌ ఉత్పత్తికి యూనిట్‌కి రూ.4.80 నుంచి రూ.5 వరకు ఖర్చవుతోందన్నారు.

సౌర విద్యుత్‌ని నిల్వ చేయడం గురించి జపాన్‌ వెళ్లినప్పుడే ఆలోచించాను. అయితే..నా అన్వేషణకు అమెరికా పర్యటనలో మార్గం దొరికింది. టెస్లా కొత్త ప్రయోగం చేసింది. ఇళ్లపై సౌర విద్యుత్‌ ప్యానళ్లు పెట్టి విద్యుదుత్పత్తి చేస్తారు. ఆ ఇంట్లోనే స్టోరేజి పరికరం పెడతారు. మొదటి దశలో మొత్తం వ్యవసాయ పంప్‌సెట్లకు సోలార్‌ విద్యుత్‌ అందజేస్తాం. ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. రైతులు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ని 9 గంటలు పంపుసెట్‌లకు వాడుకుంటారు. మిగతా విద్యుత్‌ను గ్రిడ్‌కి తీసుకుంటాం. కరెంటు నిల్వకు ప్రస్తుతం యూనిట్‌కి రూ.8 ఖర్చవుతోంది. పెద్ద ఎత్తున చేస్తే ధరలు తగ్గుతాయి. ఈ ప్రయోగం మొత్తం భారతదేశ ఇంధనరంగ రూపురేఖలు మార్చేస్తుంది’’ అని తెలిపారు. టెస్లాకి 8 మెగావాట్ల రెండు ప్రాజెక్టులన్ని పైలట్‌ ప్రాజెక్టులుగా అప్పగిస్తున్నామని, రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో..

పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో సమావేశమైనట్టు తెలిపారు. సిస్కో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ 1998లో తనతో కలిసి తీయించుకున్న ఫొటో చూపించారని, తన నివాసంలో విందు ఇచ్చారన్నారు. గూగుల్‌ ఎక్స్‌ కేంద్రానికి వెళ్లానన్నారు. రాష్ట్రంలో తీగలు లేకుండా బ్యాండ్‌విడ్త్‌ ఇచ్చే ప్రాజెక్టుని 2 వేల నోడ్‌లలో గూగుల్‌ చేపడుతుందన్నారు. గూగుల్‌ తన ప్రయోగాలన్నిటికీ ఆంధ్రప్రదేశ్‌ని వేదికగా చేసుకునేందుకు ఒప్పించామన్నారు. ఏపీని క్లౌడ్‌ హబ్‌గా రూపొందించేందుకు న్యుటనిక్స్‌ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న 28 ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయన్నారు.

రాక్షసులూ ఉంటారు..!

రాజధాని అమరావతిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌ సంస్థల కన్సార్టియంతో సోమవారం ఒప్పందం జరుగుతుందని, ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దాన్ని అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నించారని తెలిపారు. ‘‘దేవతల రాజధాని అమరావతి. కానీ దేవతలతో పాటు, రాక్షసులూ ఉంటారు. దేవతలకు కూడా రాక్షసుల బెడద తప్పలేదు’’ అని వ్యాఖ్యానించారు.

అయోవాతో కీలక ఒప్పందం రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికి సంబంధించి అయోవా స్టేట్‌ యూనివర్సిటీతో కీలక ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాయలసీమలో మెగా సీడ్‌పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయోవా ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయమన్నారు. వ్యవసాయ రంగంలో సహకారానికి సంబంధించి నెదర్లాండ్స్‌కి చెందిన వేగనింజెన్‌ యూనివర్సిటీతోను ఎంఓయూ చేసుకోనున్నట్టు చెప్పారు. మెగా సీడ్‌పార్కుకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అమెరికా పర్యటనలో ఎక్కువ సమయం వ్యవసాయరంగంపైనే దృష్టి పెట్టానన్నారు. తన పర్యటనలో తెలుగువారికి సంబంధించిన 55 సంఘాల సభ్యులతో సమావేశమైనట్టు తెలిపారు. యూఎస్‌ఐబీసీ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ చీఫ్‌ మినిష్టర్‌ అవార్డు అందజేసిందన్నారు. ఇల్లినాయిస్‌ 7వ డిస్ట్రిక్ట్‌ అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి డేని కె.డెవిస్‌ చేతుల మీదుగా ‘లైట్‌ ఆఫ్‌ ద లైఫ్‌-2017’ అవార్డు స్వీకరించినట్టు తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

అందరికీ విద్యుత్‌కు ప్రపంచబ్యాంకు సాయం

240 మిలియన్‌ డాలర్ల రుణానికి ఆమోదం

ఏఐఐబీ ఇంతకు ముందే 160 మిలియన్‌ డాలర్లకు అంగీకారం

171 మిలియన్‌ డాలర్లు పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అందరికీ విద్యుత్‌ ప్రాజెక్టుకు 240 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కు రుణంగా ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు బోర్డు ఇటీవల వాషింగ్టన్‌లో సమావేశమై రుణానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సమాచారం కూడా అందిందని ఇంధనశాఖ సలహాదారు కె.రంగనాథం సోమవారం ‘ఈనాడు’కు చెప్పారు. అందరికీ విద్యుత్‌ అందించాలన్న ఈ లక్ష్యానికి ప్రపంచ బ్యాంకుతోపాటు ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) రుణం అందించనుంది. ఏఐఐబీ 160 మిలియన్‌ డాలర్లకు ఇంతకు ముందే ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం మరో 171 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. మొత్తం కలిపితే 571 మిలియన్‌ డాలర్లు అవుతుంది. ప్రాజెక్టు అమలు కాలపరిమితి అయిదేళ్లు. వచ్చే ఆగస్టు నుంచి 2022 జూన్‌ వరకూ ఈ ప్రాజెక్టు ఉంటుంది. రుణంలో 600 మిలియన్‌ డాలర్లను ఏపీట్రాన్స్‌కోకు నిర్దేశించారు. విద్యుత్‌ ఉప కేంద్రాల నిర్మాణానికి ఈ మొత్తాన్ని ఏపీట్రాన్స్‌కో వినియోగించనుంది. మిగిలిన మొత్తాన్ని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌), దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌)కు కేటాయించారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్‌) ఇప్పటికే పలు పనులకు టెండర్లను పిలిచాయి. ప్రతి టెండరుకు కూడా ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఎంపిక చేసిన పట్టణాల్లో స్మార్ట్‌ గ్రిడ్‌లు, అధిక ఓల్టేజీ పంపిణీ వ్యవస్థ (హెచ్‌వీడీఎస్‌)కూ కొంత రుణాన్ని కేటాయించాలని తొలుత భావించారు. అయితే స్మార్ట్‌ మీటర్లు, హెచ్‌వీడీఎస్‌ వంటి వాటి కంటే రైతులకు లక్ష సౌర పంపుసెట్లను అందించడానికి రుణాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందుకు ప్రపంచ బ్యాంకును ఒప్పించాల్సి ఉంది.

 
Link to comment
Share on other sites

avasaram ledu ane paristhi lo unnaru, central govt ki isthe pothundi,solarpower unit rate takkuva ayyindi ga ade effect bro.

 

 

no, I don't believe this article a bit. something behind scenes going on to give it to Central govt. hydal power is available round the clock day/night, cloudy/shiny for almost 70-80 days a year at the minimum. how can it be replaced with Solar/wind power? 

పోలవరంలో విద్యుత్‌ కేంద్రానికీ ఓకే..!

02-06-2017 04:21:08

 

పోలవరం జల విద్యుత్కేంద్ర నిర్మాణానికి సిద్ధం కావాలని ఏపీ జెన్కోను ఆదేశించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండో దశ విద్యుత్‌ సంస్కరణలలో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి ఇంధనశాఖకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో 960 మెగావాట్ల జల విద్యుత్కేంద్రం నిర్మాణంతో చౌకైన విద్యుత్‌ లభిస్తుందని విద్యుత్తు సంస్థల అధికారులు చెప్పడంతో... పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మించాలన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది.
Link to comment
Share on other sites

లాంకో, స్పెక్ట్రం ప్రాజెక్టులపై ప్రజాభిప్రాయ సేకరణ!

ఈనాడు, అమరావతి: లాంకో కొండపల్లి, స్పెక్ట్రం, గోదావరి గ్యాస్‌ పవర్‌ ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను తీసుకునేందుకు అనుమతించాలన్న విద్యుత్‌ పంపిణీ సంస్థల(డిస్కమ్స్‌) విజ్ఞప్తిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) వచ్చింది. జులై ఒకటిన దీన్ని నిర్వహించాలని గురువారం నిర్ణయించింది. ఆమోదిత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) లేని నేపథ్యంలో ఈ రెండు ప్రాజెక్టుల విద్యుత్‌ను తీసుకునేందుకు ఈఆర్‌సీ అనుమతించలేదు. అయితే పీపీఏలను పదేళ్లు పొడిగించాలని ఒప్పందం చేసుకున్నామని, అందుకే విద్యుత్‌ను తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిస్కమ్స్‌ కోరాయి. లాంకోకు స్థిర ఛార్జీ రూపంలో ఏడాదికి రూ.180కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని తెలిపాయి. లాంకో, స్పెక్ట్రం, గోదావరి గ్యాస్‌ ప్రాజెక్టుల విద్యుత్‌ ఇతరులతో పోల్చినపుడు చౌకని తెలియజేశాయి.

గోవధ నిషేధాన్ని సంస్కరణగా చూడాలి: నఖ్వి ఈనాడు, హైదరాబాద్‌: గోవధ నిషేధాన్ని మతపరమైన అంశంగా కాకుండా సంస్కరణల్లో భాగంగా చూడాలని, ఇది మనోభావాలతో ముడిపడిన అంశం కూడా అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వి అన్నారు. ఎక్కడబడితే అక్కడ పశువులను ఇష్టానుసారంగా వధించడం వల్ల పర్యావరణంపై, ప్రజారోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని, అందుకే పశువుల విపణిని క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
Link to comment
Share on other sites

హమ్మయ్య.. బొగ్గు ‘మసి’ వీడింది!

కొత్త టెండరుతో తగ్గుతున్న రవాణా ఖర్చు

ఒడిశా నుంచి బొగ్గు తరలింపునకు అతి తక్కువగా టన్నుకు రూ.1094 కోట్‌ చేసిన ధాపర్‌ సంస్థ

‘కృష్ణపట్నం’ థర్మల్‌ కేంద్రానికి ఇకపై ఏడాదికి రూ.360 కోట్ల మేర మిగులు

ఈనాడు- అమరావతి

2ap-story2a.jpg

బొగ్గు రవాణాలో ‘అధిక ధర’లకు తెరపడింది! అధిక చెల్లింపులపై కేంద్రం, కాగ్‌ తప్పు పట్టిన ఏడాదికి ఎట్టకేలకు ఏపీ విద్యుత్‌ అధికారులు బొగ్గు రవాణాకు కొత్త టెండరు పిలిచారు. దీంతో ఇన్నాళ్లు చెల్లిస్తున్న ధరలో దాదాపు సగానికే ఒడిశా నుంచి కృష్ణపట్నంకు బొగ్గు సరఫరాకు అవకాశం ఏర్పడింది. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి రవాణా ఖర్చు తగ్గి, విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం తగ్గనుంది. అంతిమంగా వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.

ఒడిశాలోని మహానది కోల్‌ ఫీల్డ్స్‌ (ఎంసీఎల్‌) నుంచి కృష్ణపట్నం థర్మల్‌ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరాకు ఒప్పందం ఉంది. ఎంసీఎల్‌ ఇచ్చే ముడి బొగ్గును అక్కడే శుద్ధి చేసి పరదీప్‌ పోర్టు నుంచి సముద్రం ద్వారా కృష్ణపట్నం పోర్టుకు రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా ప్రాజెక్టుకు సరఫరా అవుతోంది. గతంలో పోటీ లేదన్న కారణంతో అధిక ధరకు సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థకు అప్పనంగా వందల కోట్ల రూపాయలు అధికంగా చెల్లిస్తున్నారని ఇంజినీర్ల సంఘం ఆందోళన వెలిబుచ్చడం, కాగ్‌ కూడా తప్పుపట్టిన నేపథ్యంలో వచ్చే రెండేళ్లకు బొగ్గు రవాణాకు ఏపీజెన్‌కో కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్టుకు ఏడు సంస్థలు పోటీ పడ్డాయి. శుక్రవారం తెరిచిన బిడ్లలో అందరి కంటే తక్కువగా కరమ్‌చంద్‌థాఫర్‌ సంస్థ టన్నుకు రూ.1,094.40కు కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. ఇన్నాళ్లు చెల్లిస్తున్న దానికంటే ఈ మొత్తం రూ.వెయ్యి తక్కువని సమాచారం. ప్రస్తుతం ఏడాదికి 36 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు టెండర్లు పిలిచారు. ఈ ప్రకారం కృష్ణపట్నంపై ఏడాదికి రూ.360 కోట్ల భారం తగ్గనుంది. కాగ్‌ తప్పుపట్టిన వెంటనే కొత్త టెండరు పిలిచినా ఇప్పటికే రూ.360 కోట్లు మిగిలేవని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బొగ్గును రవాణా చేస్తున్న గ్లోబల్‌ సంస్థ ఎల్‌1గా నిలిచిన థాఫర్‌ సంస్థ కంటే టన్నుకు 90 పైసలు అధికంగా కోట్‌ చేసినట్లు సమాచారం.

అయినా తమిళనాడు కంటే ఎక్కువే..

ఈ టెండరులో పేర్కొన్న నిబంధనల నేపథ్యంలో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పోటీలో పాల్గొనలేదు. పరదీప్‌ పోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టుకు సముద్ర రవాణాకు మాత్రమే షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ముందుకు వచ్చింది. జెన్‌కో అధికారులు ఒడిశాలోని బొగ్గు శుద్ధి కేంద్రం (వాషరీ) నుంచి పరదీప్‌ పోర్టుకు, అక్కడి నుంచి కృష్ణపట్నంకు కలిపి బొగ్గు రవాణాకు టెండరు పిలిచారు. వాషరీ నుంచి పరదీప్‌ పోర్టుకు బొగ్గు రవాణాను బాధ్యతను మరో కాంట్రాక్టరుకు అప్పగిస్తే, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఇంకా తక్కువ ధరకే బొగ్గును రవాణా చేసేదనే అభిప్రాయం ఉంది. పరదీప్‌ నుంచి కృష్ణపట్నం కంటే ఎక్కువ దూరంలో ఉన్న తమిళనాడులోని ఎన్నోర్‌కు టన్ను బొగ్గు సరఫరా ధర రూ.347 కావడం ఈ సందర్భంగా గమనార్హం

Link to comment
Share on other sites

విద్యుత్తు వెతలకు చెల్లు!
 
 
636321450025703776.jpg
  • కోతల్లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర.. అన్ని వర్గాలకూ నిరంతర విద్యుత్తు
  • లోటు నుంచి మిగులు దిశగా..
  • సౌర విద్యుత్తులో దేశానికే స్ఫూర్తి
  • గ్రామావసరాలకు స్థానికంగా గ్రిడ్‌
  • రెండో తరం విద్యుత్తు సంస్కరణలకు శ్రీకారం
(అమరావతి - ఆంధ్రజ్యోతి) గృహ విద్యుత్తు సరఫరాకు 4 నుంచి 10 గంటలపాటు అధికారిక కోతలు.. పరిశ్రమలకు వారంలో మూడు రోజులు పవర్‌ హాలిడేస్‌.. రాత్రి 10 దాటాక విద్యుత్తు వాడే పరిశ్రమలపై అపరాధ రుసుం.. వ్యవసాయ అవసరాలకు అర్థరాత్రి వేళ ఎప్పుడు విద్యుత్తు సరఫరా అవుతుందో తెలియని దుస్థితి.. ఇదీ రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు సరఫరా పరిస్థితి.
 
అలాంటి దుస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసే స్థాయికి తీసుకురావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే నవ్యాంధ్ర ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించిన కీలక రంగాల్లో విద్యుత్తు రంగం ఒకటి. తనకున్న అనుభవం, సామర్థ్యంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే రోజుకి 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు లోటులో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తు దిశగా నడిపించగలిగారు. మూడేళ్లలో విద్యుత్తురంగంలో భారీ మార్పులు జరిగాయి.
 
దేశానికే స్ఫూర్తి నవ్యాంధ్ర
రాష్ట్ర విభజన నాటికి థర్మల్‌ విద్యుదుత్పత్తిపైనా ప్రధానంగా దృష్టి ఇంధన సంస్థలు దృష్టి సారించేవి. సంప్రదాయేతర ఇంథనోత్పత్తి విధానాలైన సౌర, పవన విద్యుత్తుపై ఇంధన సంస్థలు దృష్టి సారించలేదు. దీనికి ప్రధాన కారణం సౌర, వపన విద్యుదుత్పత్తి పూర్తి సామర్థ్యం మేరకు లేకపోవడమే. ఫలితంగా వాటి విద్యుదుత్పత్తి వ్యయం అధికంగా ఉండేది. 2010 సంవత్సరానికి ముందు సౌర విద్యుత్తు యూనిట్‌ ధర రూ.17 వరకూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి.
 
2014లో సౌర విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.6.50కు తగ్గింది. దీన్ని మరింత తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కర్నూలులో ప్రపంచంలోనే అతిపెద్ద 1000 మెగావాట్ల సోలార్‌ పార్కుకు శ్రీకారం చుట్టారు. దీంతో ప్రస్తుతం సౌర విద్యుత్తు యూనిట్‌ ధర రూ.3.16కు దిగి వచ్చింది. కేంద్రం సోలార్‌ యూనిట్‌ ధరను రూ.4.50గా నిర్ధారించింది. అంతకంటే ఎక్కువ వ్యయం అయితే.. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద భరించేందుకు సిద్ధమైంది. కానీ కేంద్రం ప్రకటించిన ధర కంటే తక్కువకే యూనిట్‌ రూ.3.16కే ఏపీలో సౌర విద్యుత్తు లభిస్తుండటం దేశాన్ని నివ్వెర పరచింది.
 
రాష్ట్రంలో సోలార్‌ విప్లవం
సీఎం చంద్రబాబు ఈ ఏడాది మేలో అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటన రాష్ట్రంలో సోలార్‌ విప్లవానికి నాందీ పలికిందనడంలో అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా 18000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే, రాష్ట్రంలోనే 4800 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఇంధనశాఖ సిద్ధమైంది. ఇలాంటి సమయంలో సీఎం అమెరికా పర్యటన జరిగింది.
 
ఆ పర్యటనలో భాగంగా ‘టెస్లా’ సంస్థ సోలార్‌ విద్యుత్తును బ్యాటరీలో నిల్వ చేయడాన్ని సీఎం గుర్తించారు. ఇప్పటి వరకు సోలార్‌ విద్యుత్తు వినియోగానికి ఉన్న ప్రధాన అవరోధం దాన్ని నిల్వ చేయలేకపోవడమే. సీఎం పర్యటనలో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తిపై సీఎం మరింత దృష్టి సారించారు. ప్రతి గ్రామంలోనూ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్తును నిల్వ చేసి గ్రామావసరాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
 
రెండో తరం సంస్కరణల దిశగా..
చంద్రబాబు 1998లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్తు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తాజాగా రెండోతరం విద్యుత్తు సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు ఆయన సమాయత్తమయ్యారు. గతంలో విద్యుత్తు రంగమంటే ఒకే వ్యవస్థ ఉండేది. దానిని విభజించి.. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లుగా చేశారు. దీంతో సంస్థల వారీగా బాధ్యతలతోపాటు పనితీరు మెరుగుపడింది. ఇప్పుడు మరింత మెరుగైన విధానాలు అవలంభిస్తూ అత్యాధిక సాంకేతిక నైపుణ్యాలను జోడించి జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లను లాభాల బాటలో నడిపించేందుకు కార్చాచరణ సిద్ధమవుతోంది.
 
అందులో భాగంగానే గ్రామానికో గ్రిడ్‌ను ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును వినియోగిస్తే భవిష్యత్తులో ప్రసార, పంపిణీ నష్టాలు ఉండవని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సోలార్‌ విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.2.44, పవన విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.3.46గా ఉంది. సంప్రదాయ విద్యుత్తు ఉత్పత్తికంటే సంప్రదాయేతర విద్యుత్తు ఉత్పత్తిపైనే దృష్టి సారించడం ద్వారా విద్యుత్తు సంస్థలను లాభాల బాట పట్టించే వీలుందని ఇంధన సంస్థలు చెబుతున్నాయి.
ఎల్‌ఈడీ వీధి దీపాల అమరికతో ఖ్యాతి
హుద్‌హుద్‌ తుఫానుతో విశాఖ నగరమంతా అతలాకుతలమైంది. విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలిపోయింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏడు రోజుల్లోనే విద్యుత్తు వ్యవస్థను ఇంధన శాఖ గాడిలో పెట్టింది. అదే సమయంలో రాష్ట్రంలో గృహాలకు ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది. ఈ ఎల్‌ఈడీ దీపాలను వీధి దీపాలుగా ఎందుకు వాడకూడదన్న ఆలోచన సీఎం చంద్రబాబుకు వచ్చింది. తన ఆలోచనను ప్రయోగాత్మకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇందుకు కేంద్రంతోనూ సంప్రదింపులు జరిపారు.
 
ఈ వినూత్న ఆలోచనకు కేంద్ర విద్యుత్తు శాఖ నుంచి సంపూర్ణ సహకారం అందజేస్తామని పియూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. విశాఖనగరంలో వినూత్నంగా చేపట్టిన ఎల్‌ఈడీ వీధి దీపాలు విశాఖకు కొత్త శోభను తీసుకు వస్తే ఈ విధానం దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. అందరికీ విద్యుత్తు పథకంలో ఆంరఽధప్రదేశ్‌ ముందంజలో ఉంది. రాష్ట్రంలో ప్రతి గ్రామానికీ విద్యుత్తు సరఫరా చేయడంలోనూ ఏపీదే అగ్రస్థానం. దీన్‌దయాల్‌ గ్రామీణ విద్యుద్దీకరణ పథకంలో భాగంగా గ్రామాల్లోని 100 శాతం ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు.
 
పోలవరంతో విద్యుత్తు వరం: పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా 960 మెగావాట్ల జల విద్యుత్కేంద్రాన్ని నిర్మించేందుకు ఏపీ జెన్‌కో సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను త్వరలోనే ఖరారు చేసేందుకు జెన్‌కో సిద్ధమవుతోంది.
 
వ్యవసాయ పంప్‌ సెట్లు మార్పిడి: రాష్ట్రంలోని 15 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు సంబంధించి సామర్థ్యం లేని మోటార్ల స్థానంలో పొదుపుగా విద్యుత్తును వినియోగించే పంప్‌సెట్లను ఉచితంగా మార్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ఇంధన శాఖ ప్రారంభించింది. ఈ పంప్‌ సెట్లను దశల వారీగా మార్చనున్నది. దీనివల్ల రాష్ట్రంలో రైతులందరికీ సామర్థ్యంతో కూడిన పంప్‌ సెట్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్తు వినియోగం తగ్గనుంది.
 
పాదయాత్ర స్ఫూర్తి!
కళ్ల ముందు చేతికొచ్చిన పంట. కాపాడుకోవాలంటే నీరు ఉండాలి. నీటి కోసం బోరు వంక చూడాలి. బోరు ఆడాలంటే కరెంటు ఉండాలి. అక్కడే అసలు చిక్కు. కరెంటు ఎప్పుడొస్తుందో తెలియదు. పగలైతే ఎంతసేపైనా పొలం వద్దే ఉండొచ్చు. కానీ అర్థరాత్రి వేళ పొలం వద్ద నిద్ర అంటే పాముతో చెలగాటమే. అయినా ఎందరో రైతులు చేతికొచ్చిన కొడుకులాంటి పంటను చంపుకోలేక తమ ప్రాణాలను పణంగా పెట్టి పొలంబాట పట్టారు. ‘మీ కోసం’ పాదయాత్రలో నాటి ప్రతిపక్ష నేత.. నేటి సీఎం చంద్రబాబును కదిలించిన సన్నివేశం ఇది. అధికారంలోకి వచ్చిన తక్షణం రైతన్నకు ఈ దుస్థితిని తప్పించాలని నిర్ణయించుకున్నారాయన. అన్ని అవరోధాలను అధిగమించి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయగలిగారు.
 
 
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...