Jump to content

AP power sector


Recommended Posts

ఇంధన పొదుపులో ఏపీ టాప్‌
06-08-2018 02:21:57
 
636691189158302219.jpg
  •  కేంద్ర విద్యుత్‌శాఖ సూచీలో అగ్రస్థానం
  •  జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ సత్తా
  •  ఇంధన శాఖ అధికారులకు సీఎం ప్రశంస
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి జాతీయ స్థాయిలో సత్తాచాటింది. కేంద్ర విద్యుత్‌ శాఖ తొలిసారిగా విడుదల చేసిన రాష్ట్ర ఇంధన పొదుపు సన్నద్ధత సూచీలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇంధన పొదుపు కార్యక్రమాల అమలు విషయంలో ప్రపంచ బ్యాంకు ఏపీని ఇప్పటికే నంబర్‌వనగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ ఇంధన పొదుపు సంస్థ (బీఈఈ), నీతి ఆయోగ్‌ సంయుక్తంగా రూపొందించిన సూచీలోనూ ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. బీఈఈ 63 ప్రామాణికాల ఆధారంగా ఈ సూచీని రూపొందించింది. భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, రవాణా, వ్యవసాయం, డిస్కంలలో ఇంధన సామర్థ్య ఫలితాలను అంచనా వేసి దీన్ని రూపొందించారు.
 
దేశవ్యాప్తంగా ఏపీకి అగ్రస్థానం దక్కగా... కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. . భవనాలు, ఇళ్లు, డిస్కంలు, పరిశ్రమల్లో పీఏటీ (పెర్ఫామ్‌, అచీవ్‌, ట్రేడ్‌) పథకం ద్వారా ఏపీ ఇంధన పొదుపు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇతర రాష్ర్టాలు బీఈఈ సూచించిన ఒకటి రెండు పథకాలకే పరిమితం కాగా.. ఏపీతోపాటు టాప్‌లో ఉన్న ఐదు రాష్ర్టాలు మాత్రం వాటి సొంత పథకాలను కూడా అమలు చేస్తున్నాయని బీఈఈ కొనియాడింది. కాగా... ఏపీ అమరావతి మాస్టర్‌ప్లాన్‌, డిజైన్‌కుగాను గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ప్లాటినం అవార్డు దక్కించుకున్న విషయాన్ని కూడా బీఈఈ తన సూచీ నివేదికలో ప్రశంసించిందని సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
 
ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ... ఇంధన సామర్థ్యానికి సంబంధించి జపాన్‌ లాంటి దేశాల్లో వాడే అత్యాధునిక టెక్నాలజీని ఇక్కడా అమలు చేయాలని సీఎం పునరుద్ఘాటించారు. విద్యుత్‌ రంగంలో ఏపీ ఇప్పటికే అద్భుత పనితీరు కనబరచిందని, 84 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుందని మంత్రి కళావెంకట్రావు చెప్పారు. సూచీ విడుదల సందర్భంగా అలయెన్స్‌ ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఎకానమీ (ఏఈఈఈ) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సతీ్‌షకుమార్‌ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అందరికంటే ముందుగా ఇంధన పొదుపు ప్రభావాన్ని 2014లోనే అంచనా వేసిందన్నారు.
 
అందుకే అన్ని వర్గాలకూ అందుబాటు ధరలో నిరంతర విద్యుత్‌ సరఫరా చేయగలుగుతుందని కొనియాడారు. రూ.10లకే గృహ వినియోగదారులకు 2 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు అందించిన రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటులో ఏపీని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు ప్రక్రియ ఇంధన పొదుపులో సరికొత్త చరిత్ర సృష్టిస్తోందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ఇంధనశాఖ మంత్రి కళావెంకట్రావు, సీఎం పేషీ అధికారులు, ఇంధనశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • Replies 201
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Andhra Pradesh is No.1 in Energy Efficiency! Give a battered and betrayed state like AP to a visionary Chief Minister like NCBN and he transforms it into a powerhouse that tops the charts in every sphere AP emerged as the front runner at the national level for its energy efficiency initiatives as per the State Energy Efficiency Preparedness Index released by the Bureau of Energy Efficiency (BEE) of the Ministry of Power and NITI Aayog.

The BEE and NITI Aayog evaluated 63 indicators, including State regulations, adoption of energy efficiency initiatives, energy savings and other key parameters "AP, as a frontrunner, has several programmes in place for promoting energy efficiency in municipalities, DISCOMs, industries and buildings through PAT scheme. However, the State could improve programmes for energy efficiency in the transport sector,” the index said.

https://pbs.twimg.com/media/Dj-9jKrV4AA4Yoz.jpg

“We have to research, examine and adopt the advanced technologies coming up worldwide on the energy efficiency front. The new technologies in advanced countries like Japan have to be taken into consideration for adopting them in the Micro, Small & Medium Enterprise (MSME) sector, which helps in employment generation & economic development,”CBN always said to officials and the results show.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
విద్యుత్‌ రంగంలో ఏపీ ట్రెండ్‌ సెట్టర్‌
27-09-2018 03:35:24
 
  •  ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన వల్ల అనేక ఇబ్బందులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో జాతీయస్థాయిలో ట్రెండ్‌ సెట్టర్‌గా మారి ఇతరులకు ఆదర్శంగా నిలిచిందని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో పనితీరు, సరఫరా ప్రాజెక్టులు, అవార్డుల సాధన తదితర అంశాలపై విజయానంద్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సరఫరా, పంపిణీ నష్టాలను సింగిల్‌ డిజిట్‌కు తగ్గించి జాతీయస్థాయిలో రికార్డు సృష్టించామని విజయానంద్‌ చెప్పారు. నష్టాలను 5-6 శాతానికి పరిమితం చేసేందుకు సరఫరా రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ట్రాన్స్‌కో నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి రాబోయే రెండు మూడేళ్లలో నష్టాలను నియంత్రించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్‌ పరచూరి, ఉమాపతి, డైరక్టర్లు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...