Jump to content

AP power sector


Recommended Posts

ఇంధన రంగంలో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’
 
636102781999314846.jpg
  • ఎక్కడి నుంచైనా విద్యుత్ వినియోగం
  • ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ దినేశ్‌ పరుచూరి
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఇంధన రంగంలోనూ ఒక చోట ఉత్పత్తి చేసిన విద్యుతను దేశంలో ఎక్కడి నుంచైనా వినియోగించుకునేందుకు వీలుగా ‘‘ప్లగ్‌ అండ్‌ ప్లే’’ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌ పరుచూరి అన్నారు. విద్యుత సరఫరా (ట్రాన్స్‌మిషన్‌) నెట్‌వర్క్‌ను అవసరం ఉన్నా లేకున్నా వేసుకొని పోవడం మంచి విధానం కాదని, డిమాండ్‌ ఉన్న చోట నెట్‌వర్క్‌ను పెంచాలని సూచించారు. గోవాలో శుక్రవారం ‘‘ఐపీపీఏఐ రెగ్యులేటర్లు, విధానకర్తల పునశ్చరణ 2016’’ సదస్సు జరిగింది. ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐపీపీఏఐ), కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏపీ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్కింగ్‌లో ముందంజలో ఉందని ప్రశంసించాయి. సదస్సులో దినేశ్‌ పరుచూరి కీలకోపన్యాసం చేశారు. ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుత్తును ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేశాక దేశంలో ఎక్కడ నుంచైనా వాడుకునేలా ఉండాలన్నారు. అదేవిధంగా 2022నాటికి 1,75,000 మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పత్తిని దేశవ్యాప్తంగా లక్ష్యం నిర్దేశించుకున్నామని, దీనిని దేశంలో ఎక్కడైనా వాడుకునేందుకు వీలుగా ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌ ఏపీలోనే ఉందన్నారు.
Link to comment
Share on other sites

  • Replies 201
  • Created
  • Last Reply

Top Posters In This Topic



దీర్ఘకాలిక పీపీఏలొద్దు


636103655559681808.jpg


  • వినియోగదారుడిపై మోయలేని భారం
  • వ్యూహాత్మక తప్పిదం కూడా..
  • ఒప్పందం 5-12 ఏళ్లకు మించొద్దు
  • డిస్కమ్‌లకు ఏపీఈఆర్‌సీ స్పష్టీకరణ
హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘విద్యుత్ రంగంలో సాంకేతికంగా అత్యాధునిక విధానాలు వస్తున్నాయి. మిగులు విద్యుత దిశగా రాష్ట్రాలు వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో మున్ముందు ధరలు తగ్గుతాయి. ఇలాం టి తరుణంలో 20 నుంచి 25 ఏళ్ల పాటు ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలతో దీర్ఘకాల విద్యుత కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటే.. వినియోగదారుడిపై మోయలేని భారం వేసినట్లే. పాతికేళ్ల దీర్ఘకాల కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదమని గ్రహించాలి. ఈ విధానాన్ని సమర్థించుకోలేరు. 20-25 ఏళ్ల పరిహారాన్ని దీర్ఘకాలం పాటు చెల్లించాల్సి వస్తుంది. విద్యుత రంగంలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు వస్తూ ధరలు తగ్గుతున్న పరిస్థితుల్లో .. ధరలు ఎక్కువ చెల్లించాల్సి వచ్చే ఇలాంటి సంప్రదాయ పీపీఏలను ఎవరూ సమర్థించరు. ఇకపై విద్యుత పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లకూ, వినియోగదారులకూ లబ్ధి చేకూర్చేలా 5 నుంచి 12 ఏళ్ల మధ్యలోనే పీపీఏలు చేసుకోవాలి. 12 ఏళ్ల లోపు పీపీఏలను డిస్కమ్‌లు చేసుకోవచ్చు. కానీ ముందస్తుగా మా అనుమతి తప్పనిసరి’’ అని డిస్కమ్‌లకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది. రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటలూ విద్యుతను సరఫరా చేయాల్సి ఉన్నందున.. 2,400 మెగావాట్ల విద్యుతను కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) బొగ్గు లింకేజీతోనూ.. 1000 మెగావాట్ల విద్యుత పూర్తిగా విదేశీ బొగ్గుతోనూ ఉత్పత్తి చేసే సంస్థల నుంచి బిడ్డింగ్‌ ద్వారా సేకరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీఈఆర్‌సీని దక్షిణ ప్రాంత విద్యుత పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అభ్యర్థించారు. ఆధునిక విద్యుత సరఫరా ఒప్పందంలో భాగంగా.. డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఓన్డ్‌ అండ్‌ ఆపరేట్‌ (డీబీఎ్‌ఫబీవోవో) విధానంలో టెండర్‌లో ఎల్‌-1గా నిలిచిన సంస్థతో విద్యుత కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని కోరారు. ఈ అంశంపై ఈ ఏడాది మార్చి 2వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ.. 18 దఫాలు ఏపీఈఆర్‌సీ అనుమతిని కోరుతూ ఎస్‌పీడీసీఎల్‌ లేఖలు రాసింది. ఈ లేఖలపై మండలి సుదీర్ఘంగా ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లు ఈపీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌లకు 3 పేజీల లేఖ ద్వారా భవిష్యత కార్యాచరణను నిర్దేశించింది. ఈ ఏడాది నవంబరు 16 నుంచి స్వదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేసే 2400 మెగావాట్ల విద్యుతను, ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి పూర్తిగా విదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేసే 1000 మెగావాట్ల విద్యుతను సేకరించేందుకు బిడ్లను పిలిచి.. లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌(ఎల్‌ఓఏ)ను ఇవ్వాల్సి ఉన్నందున.. ఆమోదం కావాలని కోరడంపై ఏపీఈఆర్‌సీ తన అభిప్రాయం తెలిపింది. ముందుగా.. 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి సంబంధించిన బిడ్లలో ఎల్‌-1 వచ్చిన సంస్థతో 600 మెగావాట్లకు గాను 2016-17 ఆర్థిక సంవత్సరానికే పీపీఏ చేసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే 2400 మెగావాట్ల స్వదేశీ బొగ్గుతో విద్యుదుత్పత్తి చేసే సంస్థతో 2018-19కి గాను 400 మెగావాట్ల మేరకే పీపీఏ కుదుర్చుకోవాలని.. ఆ తర్వాత వచ్చే డిమాండ్‌ ఆధారంగా తమ అనుమతితో ఒప్పందాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యుత అవసరాలు, సరఫరా, పంపిణీలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఆధారంగా కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. 2016-17, 2017-18కు సంబంధించిన డిమాండ్‌ను 2017 ఏప్రిల్‌ నెలాఖరులో సమీక్షించాక.. విద్యుత సేకరణపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.

Link to comment
Share on other sites

విద్యుత్ పథకాలకు రూ.3,845 కోట్ల రుణం
 
  • ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయ ఆమోదం
హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అభివృద్ధి పథకాల కోసం రూ.3,845 కోట్ల రుణాన్ని ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు అందజేసేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. విజయవాడలో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్లు, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్‌వై దొర, నాయక్‌ పాల్గొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్‌కు రూ.2,185 కోట్లు, ఈపీడీసీఎల్‌కు రూ.1,060కోట్లు, ట్రాన్కోకు రూ.600 కోట్లు రుణం మంజూరు చేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. అదేవిధంగా తిరుపతిని ఇటీవల కేంద్రం స్మార్ట్‌ సిటీగా ప్రకటించిన నేపథ్యంలో నగర అభివృద్ధి కోసం మరో రూ.450 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకుంటోంది. తిరుపతిలో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వైరింగ్‌ చేసేందుకు రూ.360 కోట్లు, ఐటీ పరిజ్ఞానం కోసం రూ.50 కోట్లు, స్మార్ట్‌ మీటర్ల కోసం రూ.40 కోట్లు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సమ్మతించింది.
Link to comment
Share on other sites

చైనా ప్రభుత్వ సంస్థలతో ట్రాన్స్‌కో ఒప్పందం!
 
636115746081374297.jpg
  • రాష్ట్రానికి అందుబాటులో సానీ స్మార్ట్‌ గ్రిడ్‌ టెక్నాలజీ 
  • సోలార్‌జై్‌సతో ఈడీబీ, నెడ్‌క్యాప్‌ ఒప్పందం 

హైదరాబాద్‌/అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): చైనా ప్రభుత్వరంగ దిగ్గజ ఇంధన సంస్థలతో ఏపీ ట్రాన్స్‌కో కీలక ఒప్పందం చేసుకోనుంది. శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చైనా ప్రభుత్వ రంగ సంస్థ ‘సానీ’ ప్రతినిధులు భేటీ అయ్యారు. సీఎంవో ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌, ఇన్‌క్యాప్‌ ఎండీ కమలాకరబాబు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ణకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంధన సరఫరా, పంపిణీ అంశాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాల ఉత్పత్తిలో ముందంజలో ఉన్న సానీ గ్రూప్‌.. ట్రాన్స్‌కోతో కలసి దేశవ్యాప్తంగా ఇంధన రంగంలో సాంకేతిక నైపుణ్యాలను విస్తరించేందుకు ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించింది. స్మార్ట్‌ మీటర్లు, స్మార్ట్‌ గ్రిడ్‌, స్మార్ట్‌ మైక్రో గ్రిడ్‌ల ఉత్పత్తిలో సానీ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ గ్రిడ్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ద్వారా.. విద్యుత పంపిణీ, సరఫరాలో నాణ్యత పెంచాలని ట్రాన్స్‌కో భావిస్తోంది. అయితే.. తమ ఉత్పత్తులను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు వీలుగా ఏపీ ట్రాన్స్‌కోతో కలసి వ్యాపారం నిర్వహిస్తామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని సానీ పేర్కొంది. దీనికి చంద్రబాబు ఆమోదించారు. రెండు కంపెనీలు సంయుక్త కమిటీని నియమించుకుని.. అధ్యయనం జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. కాగా.. సౌర, పవన విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించాలని ‘సానీ’ ప్రతినిధులు సీఎంను కోరారు. అవసరమైన ప్రతిపాదనలతో వస్తే మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైటర్‌ కంపెనీ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని శనివారం కలిశారు. అర్బన్‌ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనపై చర్చించారు. ఫైళ్ల డిజిటలైజేషన్‌, అమరావతిలో అద్భుతమైన లాండ్‌ స్కేపింగ్‌, రహదారుల నిర్వహణ వంటి అంశాలపై సమీక్షించారు. ఇంకోవైపు.. రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తిని పెంచేందుకు వీలుగా చైనాకు చెందిన సోలార్‌జైస్‌, ఆర్థికాభివృద్ధి మండలి, నెడ్‌క్యాప్‌ ఒప్పందం చేసుకున్నాయి.

 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 3 weeks later...

India adds 5,400 MW wind power capacity in 2016-17 The country added over 5,400 MW of wind energy capacity in 2016-17, beating its own target of 4,000 MW.

 
NTPC-762x435.jpg

The country added over 5,400 MW of wind energy capacity in 2016-17, beating its own target of 4,000 MW.

"Ministry of New and Renewable Energy (MNRE) has set another record in the wind power capacity addition by adding over 5,400 MW in 2016-17 against the target of 4,000 MW," the ministry said in a statement today.

According to the statement, this surpassed the previous higher capacity addition of 3,423 MW achieved in 2015-16.

The leading states in wind power capacity addition during 2016-17 were Andhra Pradesh (2,190 MW), Gujarat (1,275 MW) and Karnataka (882 MW).

Madhya Pradesh, Rajasthan, Tamil Nadu, Maharashtra, Telangana and Kerala reported 357 MW, 288 MW, 262 MW, 118 MW, 23 MW and 8 MW wind power capacity addition respectively during 2016-17. These figures are tentative, the statement added.

During 2016-17, MNRE took various policy initiatives in the wind energy sector, including introduction of bidding, re-powering policy, draft wind-solar hybrid policy and new guidelines for development of wind power projects.
Link to comment
Share on other sites

రాష్ట్రమంతా స్మార్ట్‌ పవర్‌ గ్రిడ్‌!
 
  • ఇక థర్మల్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఆపేయండి
  • ఐదేళ్ల వరకు కొత్త ప్రాజెక్టులు వద్దు.. చంద్రబాబు దిశానిర్ధేశం
అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్‌తో ఉందని, ఇకపై కొత్తగా థర్మల్‌ పాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దని, విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించేందుకు కృషి చేయాలని ఇంధన శాఖ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రమంతా స్మార్ట్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని, మిషన్‌ లెర్నింగ్‌, డ్రోన్‌ టెక్నాలజీ ఊతంతో నష్టాలను నియంత్రించాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఇంధన శాఖపై సమగ్ర సమీక్షను సీఎం నిర్వహించారు. ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కళావెంకట్రావు, ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వంపైనా విద్యుత్తు సంస్థలపైనా భారంపడేలా థర్మల్‌ విద్యుత్కేంద్రాల నిర్మాణం చేపట్టవద్దు. నిర్మాణం చివరి దశలో ఉన్న థర్మల్‌ ప్రాజెక్టులు మినహా కొత్తగా థర్మల్‌ ప్లాంట్ల జోలికి వెళ్లొద్ద్దు. ఐదేళ్ల వరకూ ఇదే విధానాన్ని కొనసాగించండి’ అని సీఎం ఆదేశించారు. కాగా, 27, 28 తేదీల్లో రాష్ట్రాల విద్యుత శాఖ మంత్రుల సదస్సు విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
Link to comment
Share on other sites

ప్రపంచ బ్యాంకు ‘విద్యుత్తు’ రుణానికి కేంద్రం పూచీ!

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు సరఫరా కోసం ప్రపంచ బ్యాంకు అందించే రుణానికి పూచీదారుగా కేంద్రం ఉండనుంది. ఈ రుణంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య దిల్లీలో మంగళవారం తుది చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్చల్లో రాష్ట్ర ఉన్నతాధికారులు, కేంద్ర ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు. జూన్‌లో రుణం మంజూరయ్యే అవకాశముంది. రుణం కేంద్రానికి వస్తుంది. కేంద్రం తనకు వచ్చిన మొత్తాన్ని రాష్ట్రానికి ఇస్తుంది. మొత్తం 400 మిలియన్‌ డాలర్ల రుణం అందుతుంది. ఇందులో 240 మిలియన్‌ డాలర్లు ప్రపంచ బ్యాంకు, 160 మిలియన్‌ డాలర్లు ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఇవ్వనుంది. ఇందులో 100 మిలియన్‌ డాలర్లు ఏపీట్రాన్స్‌కోకు నిర్దేశించగా మిగిలింది రెండు డిస్కమ్స్‌కు కేటాయించారు. ప్రపంచ బ్యాంకు షరతులపై అంగీకారం కుదిరినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...