Jump to content

health city in Amaravati


Recommended Posts

అమరావతిలో హెల్త‌్‌కేర్ సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగులు
 
635970084760776124.jpg
విజయవాడ : అమరావతిలో రూ.వెయ్యి కోట్లతో హెల్త్‌కేర్ సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా హెల్త్‌కేర్ ప్రాజెక్టుకు జూన్ నెలలో శంకుస్థాపన జరుగనుంది. ఐయూఐహెచ్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ ప్రాజెక్టును చేపట్టారు.
 
ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం, వెయ్యి పడకల మెగా ఆస్పత్రి ఏర్పాటు కానుంది. వీటికి అనుబంధంగా మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ యూనిట్, మెడికల్ డేటా అనలిటిక్స్ సెంటర్, వైద్య సంబంధిత విభాగాలు, పరిశోధన, శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తారు. ఈ విభాగాలు అన్ని కలిపి హెల్త్ కేర్ సిటీగా వ్యవహరిస్తారు. ఈ మెగా ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి ప్రారంభించడానికి ఐయూఐహెచ్ సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా ఐయూఐహెచ్ ప్రతినిధులు బృందం ఈనెల 24, 25 తేదీల్లో అమరావతిలో పర్యటించనుంది. ప్రధాన మంత్రి మోదీ గతేడాది బ్రిటన్ పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా ఐయూఐహెచ్ హెల్త్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
 
ఇందులో భాగంగా దేశంలో మొత్తం 11 మెగా మెడికల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులకు అమరావతిని హెడ్‌క్వార్టర్‌గా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అమరావతిలో హెల్త్ కేర్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఏర్పాటు అయ్యే 11 ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, ఇతర విభాగాలకు అమరావతి కేంద్ర కార్యాలయంగా ఉంటుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగడమే కాకుండా అవసరమైన వైద్య పరికరాల తయారీ కూడా అమరావతిలో జరుగనుంది. అమరావతిలో హెల్త్‌ కేర్ సిటీ ప్రాజెక్టుకు లండన్‌లోని విఖ్యాత కింగ్స్ ఆస్పత్రి భాగస్వామిగా ఉంటుంది.
 
ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి డిజైన్లు, నిర్మాణదారు ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. ఏపీ ఎకనామిక్ డెవలెప్‌మెంట్ బోర్డు ద్వారా సంబంధిత వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, వైద్య, ఆరోగ్యశాఖలకు ఇప్పటికే అందించారు. ఈనెల 25 నుంచి అమరావతిలో పర్యటించనున్న యూకే బృందం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానుంది. ప్రాజెక్టు కోసం కేటాయించే 150 ఎకరాల స్థలంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. చివరగా 26న సీఎం చంద్రబాబుతో భేటీ కానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

జూన్‌లో అమరావతికి మోదీ రాక
 
635973168064755251.jpg
  • 1100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
  • చంద్రబాబుతో ఇండో-యూకే ప్రతినిధుల సమావేశం
  • 2 లక్షల జాబులొస్తాయ్‌: సీఎం
విజయవాడ, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఏపీకి రానున్నారు. వచ్చే జూన్‌లో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆయన పర్యటించనున్నారు. బ్రిటన్‌కు చెందిన ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కింగ్స్‌ కాలేజి సహకారంతో అమరావతిలో నిర్మించే ప్రపంచ స్థాయి ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రూ.వెయ్యి కోట్ల ఖర్చుతో.. 1100 పడకలతో ఈ అధునాతన ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఈ ఆసుపత్రికి జూన్‌ 5 ప్రధాని శంకుస్థాపన చేస్తారని, ఆరోజు వీలుకాని పక్షంలో జూన్‌ 9న కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవరం ఒక ప్రకటనలో తెలిపింది.
 
ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా దేశంలో 11 ఆసుపత్రులను ఇండో-యూకే ఏర్పాటు చేస్తున్నది. వీటికి కేంద్ర కార్యాలయంగా అమరావతిని ఎంచుకుంది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి కింగ్స్‌ కాలేజి- ఏపీ గతంలో ఒప్పందం చేసుకున్నాయి. దీనిపై చర్చించేందుకు ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కింగ్స్‌ ప్రతినిధులు మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ కాన్సె్‌ప్టను ఇండో-యూకే ప్రతినిధులు సీఎంకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.
 
ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలుచేస్తున్న ఎన్టీఆర్‌ వైద్య సేవ, ఇతర కార్యక్రమాలను సీఎం వారికి వివరించారు. యూకేలో ప్రభుత్వ వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో కింగ్స్‌ కాలేజి నిర్మించే 11 వైద్య విజ్ఞాన సంస్థలకు అమరావతి ఆసుపత్రి కేంద్రం కానుందని చెప్పారు. 11 సంస్థల కేంద్ర కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటైతే రెండు లక్షల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అందువల్ల అమరావతిలో నిర్మించే అధునాతన ఆసుపత్రి ఐకానిక్‌గా ఉండాలని, సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా భవనాల నిర్మాణం ఉండాలని చెప్పారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


జూన్‌లో అమరావతికి మోదీ రాక

 

eedendhuku ....matti neeru testhademo malli

Link to comment
Share on other sites

అమరావతి కింగ్స్‌ హెల్త్‌ కేర్‌’లో భాగస్వామ్యం 
 
635978394421756438.jpg
  • మంత్రి కామినేనికి తెలుగు వైద్యుల హమీ
హైదరాబాద్‌, మే 2:‘అమరావతి కింగ్స్‌ హెల్త్‌ కేర్‌’ ప్రాజెక్టులో సేవలందించేందుకు లండన్‌లోని 80 మంది తెలుగు వైద్యులు ముందుకువచ్చారు. ఈమేరకు లండన్‌లో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివా్‌సకు వారు హామీ ఇచ్చారు. మరో 80 మంది వైద్యులను కూడా భాగస్వాములను చేస్తామని కింగ్స్‌ కాలేజీ ఆసుపత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ కె.వేణు చెప్పారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...