Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply

సాగునీటికి పైపులైన్ల వ్యవస్థ..

ముందుగా చిన్ననీటి పారుదలపై దృష్టిపెట్టాలి

అధ్యయనానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఈనాడు, అమరావతి: రాజస్థాన్‌ తరహాలో రాష్ట్రంలో పైపులైన్ల ద్వారా నీటి పారుదల వ్యవస్థను నెలకొల్పేందుకు అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో నీరు-ప్రగతి ఉద్యమం నిర్వహణపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పైపులైన్ల ఏర్పాటు వల్ల ఉపరితల నీరు వృథాను అరికట్టవచ్చని, ముందుగా చిన్ననీటి పారుదలకు ఈ విధానాన్ని వినియోగించాలని సీఎం సూచించారు. అన్ని జిల్లాల్లో భూగర్భజల మట్టాన్ని మూడు మీటర్ల దిగువకు తేవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. రుతుపవనాలకు ముందు 8మీటర్లు, వానలు పడ్డాక 3మీటర్లకు భూగర్భ జలాలను తీసురావాలని ఆదేశించారు. 3.41 లక్షల పంటకుంటలు జాతికి అంకితం చేయడం దేశ చరిత్రలోనే రికార్డన్నారు. వీటికి అదనంగా మరో 6.60లక్షలు తవ్వాలని సూచించారు.పనులన్నింటిపై అందరికీ స్పష్టత ఉండేలా జియోట్యాగింగ్‌ చేయాలని సూచించారు. నీరు-ప్రగతి ఉద్యమం 90రోజుల భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలని, నీటి సంఘాలు, జన్మభూమి సభ్యులు సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పనిగా విద్యార్థులు భాగస్వాములు కావాలని, ఇందుకు వారిని జాగృతం చేయాల్సిన బాధ్యత అధ్యాపకులు, ఉపకులపతులపై ఉందన్నారు. రూ.3లక్షలలోపు వ్యయమయ్యే చెక్‌డ్యాంల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తామని, రూ.3-రూ.10లక్షల విలువైన వాటిని జలవనరుల శాఖ చేపట్టాలని, రూ.10లక్షలు మించిన చెక్‌డ్యాంల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. పండ్లతోటల్లో పంటకుంటల తవ్వకాన్ని ఉద్యానశాఖ ముమ్మరం చేయాలని, ఇందుకు రైతులను ప్రోత్సాహించాలని సూచించారు.

ఆగస్టు 15కల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు ఆగస్టు 15 కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. తూర్పుగోదావరి, విశాఖజిల్లాలకు సాగు,తాగు నీరందించే ఈ ప్రాజెక్టును గడువులోపు పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సోమవారం ఉదయం సీఎం సచివాలయం నుంచి వర్చువల్‌ తనిఖీ చేశారు. అనంతరం ప్రధాన ప్రాజెక్టుల పనుల తీరుపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నవంబరు నాటికి పోలవరం స్పిల్‌ వే 14మీటర్లకు నిర్మించేలా లక్ష్యం ఏర్పాటు చేసుకుని పని చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. తవ్వకం పనులు నిర్దేశిత సమయానికి పూర్తి కాకపోవడంపై ముఖ్యమంత్రి గుత్తేదారు ప్రతినిధులను ప్రశ్నించారు. యంత్రపరికరాల తరలింపు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పని ప్రణాళికలో కొద్ది పాటి మార్పులు చేస్తున్నామని, ప్రాజెక్టు గడువులో ఎలాంటి మార్పులేకుండా పనిప్రణాళికలో ఇలాంటి మార్పులు చేస్తున్నామన్నారు. సాంకేతిక, సాంకేతికేతర సిబ్బంది 3,386 మంది పోలవరం పనుల్లో పాల్గొంటున్నారని చీఫ్‌ ఇంజినీరు రమేష్‌ చెప్పారు. తొలుత కేంద్ర కమిటీ పరిశీలనపై చర్చ జరిగింది. హంద్రీనీవా, వెలిగొండ, గుండ్లకమ్మ, తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల పురోగతిపైనా సీఎం సమీక్షించారు. తోటపల్లిలో ఈ ఏడాది పూర్తి ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. గుండ్లకమ్మలో కాలువ నిర్మాణంపై ప్రశ్నించిన సీఎం ఇక్కడ 37 ఎకరాల భూ సేకరణపై అధికారులతో మాట్లాడారు. గుండ్లకమ్మ నుంచి సంగం బ్యారేజికి నీళ్లు మళ్లించే ప్రణాళికలపై దృష్టి సారించాలని సూచించారు. రాయలసీమకు ముచ్చుమర్రి, శ్రీశైలం ప్రాజెక్టులు జీవనాడి వంటివన్ని పరిస్థితిని బట్టి అవసరమయినప్పుడు నీటిని ఒక చోట నుంచి మరో చోటకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగు టెండర్ల ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని చెప్పారు. సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
Link to comment
Share on other sites

Guest Urban Legend

పట్టిసీమ ఎత్తిపోతల పథాకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అంతేవేగంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును సాకారం చేస్తోంది. ఈ ఆగస్టు 15న పురుషోత్తపట్నం ప్రాజెక్టును ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు సాగు-తాగు నీరు అందించడమే తమ ప్రథమ కర్తవ్యం కావాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రాధామ్య ప్రాజెక్టుల నిర్మాణంపై జిల్లాలవారీగా అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గుండ్లకమ్మ కాలువల నిర్మాణం పూర్తయి, నీటి విడుదలకు సిద్ధంగా వుండటంపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గుండ్లకమ్మ నుంచి సంగం బ్యారేజ్ వరకు నీటిని తీసుకువెళ్లి పెన్నాతో అనుసంధానించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పూల సుబ్బయ్య వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు వేగవంతం చేసేందుకు డిజైన్లు త్వరితగతిన ఆమోదం పొందేలా చూడాలని అన్నారు. చంపావతి, నాగావళి, వంశధార అనుసంధానం ఎంతవేగంగా పూర్తి చేయగలిగితే ఉత్తరాంధ్రకు అంత ప్రయోజనకరమని చెప్పారు.

హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1లో భాగంగా ప్రధాన కాలువ విస్తరణ పనులు వర్షాకాలం ప్రారంభం నాటికి పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 కింద నాగసముద్రం, పుట్టపర్తి దగ్గర ప్రధాన కాలువ కోసం నిర్మిస్తున్న రైల్వే వంతెనలను ఈ నెలాఖరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని చెప్పారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అయితే, రాయలసీమకు శ్రీశైలం-ముచ్చుమర్రి ప్రాజెక్టులు జీవనాడిగా నిలుస్తాయని, వీటిని సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.

 

polavaram

 

ప్రమాదరహిత ప్రాంతంగా పోలవరం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులకు సూచించారు. పోలవరం నిర్మాణ ప్రాంతం నుంచి పనులు జరుగుతున్న తీరును చీఫ్ ఇంజినీర్ రమేష్ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం విధుల్లో 3,386 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పాల్గొంటున్నారని చీఫ్ ఇంజినీర్ తెలుపగా, పోలవరం పనుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి భద్రత ఎంతో ముఖ్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశీలించారు.

తవ్వకం పనులు నిర్దేశిత సమయానికి పూర్తికాకపోవడంపై నిర్మాణ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి ప్రశ్నించగా, యంత్రపరికరాల తరలింపు, వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాకాలం వచ్చేలోగా తవ్వకం పనుల లక్ష్యాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేస్తున్నామని అధికారులు వివరించారు. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం మాత్రం నిర్దేశిత సమయానికి పూర్తయ్యేలా, ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూస్తున్నామని తెలియజేశారు.

ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 23 వరకు స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు 14,452 క్యూబిక్ మీటర్ల వరకు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా 5,512 క్యూబిక్ మీటర్ల మేర పనులు జరిగాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మరో 26.8 మీటర్లు పూర్తయ్యింది. గతవారం స్పిల్ చానల్‌కు సంబంధించి 6.26 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తికాగా, లెఫ్ట్ ఫ్లాంక్ 29 వేల క్యూబిక్ మీటర్లు, అప్రోచ్ చానల్ 54 వేల క్యూబిక్ మీటర్లు, పైలెట్ చానల్ 49 వేల క్యూబిక్ మీటర్ల వరకు పనులు జరిగాయి. మొత్తంమ్మీద ఏప్రిల్ 24 నాటికి స్పిల్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్ తవ్వకం పనులు ఇంకా 37.11% మిగిలివున్నాయి.

సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరావు, ట్రాన్స్‌ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

source : http://www.amaravativoice.com/te/news/purushottapatnam-will-be-completed-by-august-15th

Link to comment
Share on other sites

మరో జలాశయం!!

‘చిన కాట్రగడ్డ’ వద్ద ఆనకట్ట..!

నేడు ఇంజినీరింగు అధికారులతో మంత్రి అచ్చెన్న పరిశీలన

ఈనాడు - శ్రీకాకుళం

టెక్కలి, సారవకోట మండలాల్లోని పలు ఎత్తైన గ్రామాలకు సాగు నీరు అందించే మరో పథకం తెరమీదికి వచ్చింది. పాతపట్నం సమీపంలోని చుట్టూ ఎత్తైన కొండలను ఆనుకుని చిన కాట్రాగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన అది. ఈ నిర్మాణం వల్ల 0.3 శ.కో.ఘ.అ. జలాశయం ఆవిర్భవిస్తుంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంజినీరింగు అధికారుతో చర్చించారు. శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించనున్నారు.

టెక్కలి మండలం లింగాలవలస తదితర గ్రామాలకు సాగునీటి సదుపాయం గగనంగా మారటంతో చినకాట్రగడ ప్రాంతం గురించి రైతులు వివరించారు. గతంలో అక్కడ పర్లాఖెముండి రాజుల కాలంలో సుమారు అరవైమీటర్ల వెడల్పున చెక్‌డ్యామ్‌ నిర్మించి దానికి ఒక స్లూయిజ్‌ అమర్చారు. తరవాత క్రమంగా శిధిలావస్థకు చేరింది. దాన్నే ఆనకట్టగా రూపాంతరం చేస్తే తమ గ్రామంతో సహా పరిసరాల్లోని పలు గ్రామాల ఆయకట్టుకు సాగునీరుఅందుతుందని విన్నవించారు. ఇక్కడ చుట్టూ దాదాపు ఏడెనిమిది కొండలు ఉన్నాయి. అవన్నీ కనీసం 600 మీటర్ల నుంచి గరిష్ఠంగా 1540 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. 4.16 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించాయి. కొండల మధ్య నుంచి జలం జాలువారే ప్రాంతంలోనే స్లూయిజ్‌ ఉండేది. దాని స్థానే ఆనకట్టను నిర్మిస్తే సుమారు 0.3 శ.కో.ఘ.అ. నీటిని నిల్వ చేయొచ్చని ఇంజినీరింగు అధికారులు సూచనప్రాయంగా అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణం పూర్తయితే సారవకోట మండలంలో అయిదు గ్రామాలు, టెక్కలి మండలంలోని పది గ్రామాల పరిధిలో సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే అవకాశాలున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఆనకట్ట నిర్మాణానికి అనువైన సానుకూలతలను వ్యక్తీకరించేందుకు పరిశోధన బాధ్యతలు అప్పగించే ముందు తనే స్వయంగా ఇంజినీరింగు అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించాలని మంత్రి అచ్చెన్నాయుడు నిర్ణయానికి వచ్చారు. ‘ఆనకట్ట నిర్మాణంతో సుమారు 0.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే జలాశయాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈఈలు, డీఈఈలతో పాటు రైతులతో కలిసి వెళ్లి పరిశీలించేందుకు వెళ్తున్నాం. చివరిగా అధికారులు ఆమోదిస్తే పరిశోధన చేయించి అవసరమైన ప్రతిపాదనల రూపకల్పన ద్వారా ఆనకట్ట నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి అచ్చెన్నాయుడు ‘ఈనాడు’తో చెప్పారు.

Link to comment
Share on other sites

అత్యంత ప్రాధాన్యంగా జలవనరుల ప్రాజెక్టులు

కలెక్టర్‌ కె.ధనుంజయరెడ్డి

పాత శ్రీకాకుళం, న్యూస్‌టుడే: జిల్లాలో జలవనరుల ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని కలెక్టర్‌ కె.ధనుంజయరెడ్డి ఆదేశించారు. జిల్లాలోని జలవనరుల ప్రాజెక్టుల పనులు, భూసేకరణ ప్రక్రియలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలవనరుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసుకోవడం ద్వారా జిల్లా సస్యశ్యామలం కావడానికి, తద్వారా జిల్లా పురోభివృద్ధికి భాగస్వాములు కావాలని అధికారులను కోరారు. వేలాది ఎకరాల భూసేకరణ జరిగిందని, అన్ని ప్రాజెక్టులకు కలిపి మరో ఐదువందల ఎకరాలకు మాత్రమే పెండింగులో ఉందని చెప్పారు. దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేయాలన్నారు. సంవత్సరాలుగా చేస్తున్న పనుల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయని, వాటిని తమ అనుభవాలతో చక్కని మార్గాలు అన్వేషించి పరిష్కరించాలని హితవు పలికారు. జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దానిని వాస్తవ రూపంలోకి తీసుకురావాలని కోరారు. నిత్యం సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తే రైతులు నమ్మకంతో పంటలు వేసేందుకు ముందుకువస్తారని పేర్కొన్నారు. వ్యవసాయం పెరిగినప్పుడే తలసరి ఆదాయం పెరగడానికి అవకాశం కలుగుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సాగునీటి వనరుల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. జిల్లాలో ఇన్ని వనరులు, మార్గాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో అట్టడుగున కొనసాగడం సరికాదని, ఇకపై అలా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ ఒక్క అధికారి వెనకంజ వేయకూడదని, సకాలంలో పనులు పూర్తి కావాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. తోటపల్లి ప్రాజెక్టుకు దాదాపుగా కేవలం 63 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయాల్సి ఉందని, దానిని పది రోజుల్లో పూర్తి చేయాలని, చట్టం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఖరీఫ్‌ రానున్న అరవై రోజుల్లో ప్రారంభం అవుతుందని, ఈ అన్ని రోజులను అత్యంత ప్రాధాన్య దినాలుగా భావించి పనులు పూర్తి చేయాలన్నారు. ఇకపై ప్రతివారం సమీక్షిస్తానని, అందులో ప్రగతి కనిపించాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ కె.వి.ఎన్‌.చక్రధరబాబు, ఆర్డీఓలు బలివాడ దయానిధి, ఎం.వెంకటేశ్వరరావు, ఆర్‌.గున్నయ్య, వంశధార, తోటపల్లి ప్రాజెక్టుల పర్యవేక్షక ఇంజనీరులు బి.అప్పలనాయుడు, డోల తిరుమలరావు, భూసేకరణ అధికారులు పి.గోవర్ధనరావు, జె.సీతారామారావు, జలవనరుల శాఖ ఇ.ఇ.లు బి.రవీంద్ర, రామచంద్రరావు, పి.శ్రీహరి, సీతంనాయుడు, అప్పలనాయుడు, డి.పి.ప్రదీX,తý తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

సాగునీటికి భగీరథ ప్రయత్నం

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

skl-gen6a.jpg

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు భగీరథ ప్రయత్నం చేపట్టామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం లింగాలవలస పంచాయతీ పరిధిలో కాట్రగడ రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించారు. పటిష్ట భద్రత నడుమ ఎనిమిది కిలోమీటర్లకు పైగా నడిచి సంబంధిత స్థలాన్ని, చిత్రపటాలను పరిశీలించారు. అక్కడ చెక్‌డ్యాం నిర్మిస్తే ఎంత మేర నీరు నిల్వ అవుతుంది, ముంపు సమస్య ఏదైనా ఎదురవుతుందా అన్న విషయాలపై అధికారులతో చర్చించారు. వంశధార డీఈ శేఖర్‌బాబు రిజర్వాయర్‌ స్థితిగతులను వివరించారు. టెక్కలి, పాతపట్నం అటవీశాఖ రేంజర్లు సంజయ్‌, సోమశేఖరరావులతో మాట్లాడి రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో నిర్మాణంలో ఇబ్బందులపై చర్చించారు. ఇన్‌వెస్టిగేషన్‌ ఈఈ త్రినాథ్‌, ఇరిగేషన్‌ ఈఈ రవీంద్ర, వంశధార ఈఈ శ్రీహరిలతో మాట్లాడి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. అనంతరం హరిపురం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఇక్కడకు రమ్మని ఎవరూ అడగలేదని, సాగునీరిప్పించాలని ఎవరూ కోరలేదని, పత్రికలో వచ్చిన కథనాన్ని చదివి పరిశీలిద్దామని ఇక్కడకు వచ్చానని అన్నారు. జిల్లాలో నీటి వనరులను సద్వినియోగం చేసుకోలేక భూములున్నా ప్రజలు వలసబాట పడుతున్నారని, అందుకే సాగునీటి కల్పనకు దీక్షబూని చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామన్నారు. మూడేళ్లలో 12 లిఫ్ట్‌ ఇరిగేషన్లు తెప్పించామని, పనులను శరవేగంతో జరిపిస్తున్నామని అన్నారు. అప్పయ్యదొర ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు శ్రీకారం చుడితే కాంగ్రెస్‌ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిందని, మళ్లీ తాము ఇటీవల పరిశీలించి దాన్ని పూర్తిచేసేందుకు శపథం బూనామని అన్నారు. ప్రాజెక్టు పూర్తవ్వడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లింగాలవలసలో మిగిలిన భూములకు సైతం నీరందేలా ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రాజకీయాలు శాశ్వతం కాదని. చేసిన పనులు మాత్రమే తరతరాలు గుర్తుంచుకుంటారని అన్నారు. ఓట్ల వరకే రాజకీయాలని, ఓట్ల తర్వాత అభివృద్దే రాజకీయంగా పనిచేస్తున్నామని వివరించారు. కులాలతో రాజకీయం జరగదని, ప్రతి ఒక్కరూ మారాలని హితవుపలికారు. అనంతరం లింగాలవలస వద్ద స్థానిక నేతలు, అధికారులతో సమావేశమయ్యారు. బీ® Ôకార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఎల్‌ఎల్‌ నాయుడు, వంశధార ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడు మల్లా బాలకృష్ణ, టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు కర్నిక సుప్రియ, ఆర్డీవో వెంకటేశ్వరరావు, కోటబొమ్మాళి పీఏసీఎస్‌ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, టెక్కలి మండల పరిషత్తు ఉపాధ్యక్షులు హనుమంతు రామకృష్ణ, కోటబొమ్మాళి ఎంపీపీ తర్రా రామకృష్ణ, బగాది శేషగిరిరావు, తహసీల్దార్‌ అప్పలరాజు, ఎంపీడీవో రవీంద్రకుమార్‌, పి.అజయ్‌కుమార్‌, రవీంద్ర, ఎం.రాము, గాంధీ, పట్టాభి, బి.రామారావు, వాసుదేవరావు, తవుడు, తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  శరవేగంతో నౌతళ ఎత్తిపోతల పథకం నిర్మాణం

నౌతళ(సారవకోట), న్యూస్‌టుడే: నౌతళ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి చివరి వారంలో పథకం ట్యాంకు పైకప్పు నిర్మాణ పనులు జరుగుతుండగా కూలిపోయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఈఈ లక్ష్మీపతి, ఇతర అధికారులు హుటాహుటిన చేరుకొని అప్పట్లో పరిశీలించారు. గుత్తేదారు కోల్‌కతా నుంచి అనుభవజ్ఞులను తెప్పించి తిరిగి ట్యాంకు పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో ట్యాంకు పైకప్పు పనులు పూర్తి చేసేందుకు వీలుగా సెంట్రింగ్‌ పనులు చురుగ్గా చేపడుతున్నారు. గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు డీఈఈ సింహాచలం తెలిపారు. కూలిపోయిన సెంట్రింగ్‌ను పూర్తిస్థాయిలో తొలగించి కొత్త సెంట్రింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 21 అడుగుల ఎత్తులో పైకప్పు నిర్మాణ పనులు జరగాల్సి ఉండగా సెంట్రింగ్‌ రాడ్డులకు సపోర్టులను ఏర్పాటు చేసి పనులు పూర్తి చేస్తున్నారు. సుమారు రూ. 24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం నుంచి రానున్న ఖరీఫ్‌ పంటకు సాగునీరదించడానికి మొదట అధికారులు నిర్ణయించినప్పటికీ నిర్మాణ పనుల్లో జాప్యంతో సకాలంలో నీరు విడుదలయ్యే పరిస్థితి లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో పథకం నుంచి నీరు విడుదలయ్యే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి ఖరీఫ్‌నకు సాగునీరందించడానికి నిర్ణయించినట్లు డీఈఈ సింహాచలం తెలిపారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Veligonda Project Works on Fast Track
I, following the footsteps of our Leader Hon’ble Chief Minister Nara Chandrababu Naidu, not giving any space to delay the Project Works, travelled by Loco to inspect the first tunnel works of Veligonda Project. After leaving strict instructions to the Officers and contract agencies I had Review on the progress of the Project works. As a part of visiting the districts, I had visited the Fibre gate check dam constructed @ Rs.32 lakhs on Ullavanka gully at Moosapet Village, Udayagiri mandal.

 

check dam @ullavanka gully moosapet village udayagiri mandal

18221688_1374900142596803_61028615298168

 

 

veligonda project tunnel

 

18301686_1374900409263443_60257366289055

 

 

 

more pic : https://www.facebook.com/DevineniUma/posts/1374901935929957

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

Veligonda Project Works on Fast Track

I, following the footsteps of our Leader Hon’ble Chief Minister Nara Chandrababu Naidu, not giving any space to delay the Project Works, travelled by Loco to inspect the first tunnel works of Veligonda Project. After leaving strict instructions to the Officers and contract agencies I had Review on the progress of the Project works. As a part of visiting the districts, I had visited the Fibre gate check dam constructed @ Rs.32 lakhs on Ullavanka gully at Moosapet Village, Udayagiri mandal.

 

check dam @ullavanka gully moosapet village udayagiri mandal

18221688_1374900142596803_61028615298168

 

more pic : https://www.facebook.com/DevineniUma/posts/1374901935929957

 

 

 

 

Video :

 

 

Check dams - results as expected

I experienced one of the most wonderful moments in my life filled with Excitement that my Emotions of Joy flooded in the form of water stored at the Check dams as I said the other day, It Rains and Your lands will be Wet, at the meeting held at Ullavanka gully at Moosapet Village, Udayagiri mandal. Every Accomplishment starts with the decision to TRY.

 

Video :

https://www.facebook.com/DevineniUma/videos/1378045072282310/

Link to comment
Share on other sites

కేంద్ర పథకంలోకి 8 ప్రాజెక్టులు

ఏర్పాట్లు చేస్తున్న జలవనరులశాఖ

వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసేందుకు చర్యలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద చేపట్టి.. ఇంకా పూర్తి కాని 8 సాగునీటి ప్రాజెక్టులను తాజాగా కేంద్ర పథకం కాడ్వమ్‌లో (కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌- ఆయకట్టు అభివృద్ధి, నీటి నిర్వహణ) చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు రూ.1,154 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో కాడ్వమ్‌ కింద వీటిని చేర్చి కేంద్ర సాయం పొందేందుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సంచయి యోజన పథకంలో భాగంగానే కాడ్వమ్‌ చేపడుతోంది.

* ఆంధ్రప్రదేశ్‌లో 8 సాగునీటి ప్రాజెక్టులను గతంలోనే సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద చేర్చారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ పథకాన్ని సమీక్షించి విధివిధానాలు మార్చి ప్రధానమంత్రి కృషి సంచయి యోజనగా రూపాంతరం చేసింది. అందులో మన రాష్ట్రంలోని ప్రాజెక్టులూ ఉన్నాయి.

* రాష్ట్రం విడిపోయే నాటికి 8 ప్రాజెక్టులు వివిధ తరహాల్లో కేంద్రం నుంచి నిధుల వాటా పొందుతూ ఉన్నాయి. కొన్ని ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో ఉండడం, కొన్ని గిరిజన పాంతాల్లో ఉండడంతో వాటికి సంబంధించి కేంద్ర, రాష్ట్రాల వాటా నిష్పత్తి భిన్నంగా ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడో చేపట్టినందున గతంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన వ్యయంపై 20శాతం వరకు పెంచి 2012 ధరల మేరకు సాయం చేసేందుకు అంగీకరించింది. కొత్త ప్రభుత్వం రాకముందే ఈ హామీ లభించింది.

* గత ఏడాది మార్చిలో ఈ పథకాల అంచనాలను సవరించగా కేంద్ర వాటాగా రూ.111.10 కోట్లు రావాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై రూ.789.10 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తేలింది. 2017-18 నాటికి వీటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. కేంద్రం తన వాటా నిధులను నాబార్డు ద్వారా అందించేందుకు అంగీకరించింది. రాష్ట్ర వాటా కూడా తన ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు నాబార్డు నుంచి రుణంగా తీసుకునే ఏర్పాట్లు చేసింది. మద్దిగడ్డ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయినందున మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి మార్చి నెలలోనే కేంద్రం, నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. 2016-17ఆర్థిక సంవత్సరంలోనే వీటికి గరిష్ఠంగా కేంద్రం సాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వీటి కేటాయింపులు పెంచాలని కేంద్ర జలవనరులశాఖ మార్గనిర్దేశం చేసింది. మార్చిలో ఈ ప్రతిపాదన రావడంతో అప్పటికప్పుడు బడ్జెట్‌ కేటాయింపులు పెంచలేకపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో కేవలం కేంద్రం నుంచి రూ.7.643 కోట్లు ఒక్క ముసురుమిల్లి ప్రాజెక్టుకు మాత్రమే దక్కింది.

* ఈ ఏడాది బడ్జెట్‌లో ముసురుమిల్లి, ఎర్రకాలువ ప్రాజెక్టులకు తప్ప మిగిలిన వాటికి రూ.898.68 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. తాజాగా కేంద్రం ఈ 8 ప్రాజెక్టులను కాడ్వమ్‌లోకి తీసుకుని నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కృషి సంచయి యోజనలోనే కాడ్వమ్‌ కింద వీటికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికలు సమర్పించమని కోరింది. ఇప్పటికే గుండ్లకమ్మను కాడ్వమ్‌లో చేర్చారు. తోటపల్లి బ్యారేజి ప్రాజెక్టునూ ఇందులో చేర్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. మిగిలిన ఆరు ప్రాజెక్టులు కూడా 2017 జూన్‌లోగా కాడ్వమ్‌లోకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Hon' CM explained in detail the river inter-linking plan of Andhra Pradesh at the 2nd day of District Collectors Conference.DAwWCWtV0AIKc4L.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...