Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
అనుపు - కొప్పనూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో రెండో దశ పూర్తి చేసి 10 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని వాగ్దానం చేశారు. వరికపూడిశెల పూర్తి చేసి 30 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నది. ఇందుకోసం రూ.240 కోట్ల నిధులు అవసరమౌతాయన్నారు. హైడ్రాలజీ, అటవీ, కేంద్ర అనుమతులు తీసుకొచ్చి కచ్ఛితంగా పథకం పూర్తి చేసి దుర్గి, వెల్దుర్తి మండలాలకు నీటికొరత లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు సాయంతో సాగర్‌ ఆధునికీకరణకు మంజూరైన రూ.2,693 కోట్లలో ఇప్పటికే రూ.484 కోట్లు ఖర్చు చేయడం వలన నీటి సమస్యలు చాలావరకు తీరిపోయాయని చెప్పారు. బుగ్గవాగుని జలవనరుల శాఖ ఈఎన్‌సీతో పరిశీలింప చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా దాని సామర్థ్యం పెంచుతామని హామీ ఇచ్చారు.
 
గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా వైకుంఠపురం, బొల్లాపల్లి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి అయితే రాష్ట్రంలో కరువు అంటూ లేకుండా పోతుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, ఎన్‌ఎస్‌పీ పీసీ చైర్మన్‌ గుంటుపల్లి భుజంగరాయల్‌, మాచర్ల టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కుర్రి పున్నారెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ జీ కోటేశ్వరరావు, కలెక్టర్‌ కోన శశిధర్‌, జేసీ ఇంతియాజ్‌, డీపీవో అరుణ, రూరల్‌ ఎస్‌పీ సీహెచ్‌ వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
 
2009 తర్వాత సాగర్‌ జలాశయం పూర్తిగా నిండింది. ఇది ఓ చరిత్ర.. వైకుంఠపురంలో బ్యారేజీ నిర్మించి గోదావరి నీటిని సాగర్‌ ఆయకట్టుకు తీసుకువస్తాం. వైకుంఠపురం, బొల్లాపల్లి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి అయితే రాష్ట్రంలో కరువు
అంటూ లేకుండా పోతుంది.
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
 
 
శ్రీశైలం, సాగర్‌ వద్ద కృష్ణమ్మ తల్లికి హారతి ఇవ్వడం సంతోషకరం. ఏ సీఎం కూడా ఇలా ఒకే రోజున రెండు ప్రాజెక్టుల వద్ద కృష్ణానదికి హారతి ఇవ్వలేదు. ప్రకృతితో ప్రజలను మమేకం చేసేందుకు సీఎం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. భవిష్యత్తుతరాల కోసం ప్రతీ ఒక్కరూ తమ గ్రామాల్లో జలవనరులకు హారతి పట్టాలి. 
- మంత్రి దేవినేని
 
 
కొన్నేళ్ల తర్వాత సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేసినందుకు రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. బుగ్గవాగు ఆధునికీకరణ గురించి అధికారులు చెప్పే మాటలు నమ్మొద్దు. దాని సామర్థ్యం పెంచితే ఇక్కడ మరో ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసుకొని సాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చు. జెర్రివాగు ఎత్తిపోతల పథకం చేపట్టాలి. వినుకొండకు గ్రావిటీ ద్వారా నీరు అందించే ప్రాజెక్టుకు రూ.650 కోట్ల నిధులు మంజూరు చేయాలి. దుర్గిలో మార్కెట్‌యార్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరపాలి. వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.
- ఎంపీ రాయపాటి
Link to comment
Share on other sites

కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం జాతికి అంకితం
17-09-2018 09:57:17
 
636727750338368123.jpg
  • ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • రాజధానికి ముంపు ముప్పు లేదని ప్రకటన
  • అనుసంధానం జరిగిన చోట జల హారతి
  • రూ.400 కోట్లతో రెండో దశ పనులు చేపడతామని ప్రకటన
  • గుంటూరు చానల్‌ పొడిగింపు పైనా హామీ
 
రాజధానికి ముంపు సమస్య తీరిపోయింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని వరదనీటితో ముంచేస్తున్న కొండవీటి వాగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. నీరు నదిలో కలిసే డిశ్చార్జ్‌ పాయింట్‌ వద్ద జలసిరికి హారతినిచ్చారు. రాజధానికి ఇక ముంపు ఉండబోదని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజీకి వచ్చే నెలలో శంకుస్థాపన చేసి, ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.
 
 
గుంటూరు: అమరావతి రాజధానిలోని ఉండవల్లిలో నూతనంగా నిర్మించిన కొండవీటివాగు వరదనీటి ఎత్తిపోతల పథకం మోటార్లకు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్విచ్‌ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి కృష్ణానదికి హారతి పట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ జిల్లాకు పలు వరాలను ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజ్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. అక్కడ 10 టీఎంసీల నీటిని నిల్వబెడతామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్‌ దిగువున చౌడవరం వద్ద మరో బ్యారేజ్‌ నిర్మించి నీటిని నిల్వ చేసి పంటలకు, తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు దిగువ నుంచి కృష్ణానది అంతర్ధానం వరకు రెండు వైపులా నీరు ఉండేలా చూస్తామన్నారు. కొండవీటి వాగు వరదనీటి ఎత్తిపోతల పథకం తొలిదశ నిర్మాణానికి రూ.222 కోట్లు ఖర్చు చేశామని, దీనివలన వాగు నుంచి ప్రస్తుతానికి ఐదు వేల క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయవచ్చన్నారు.
 
మరో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ ద్వారా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లించ వచ్చన్నారు. రోజుకు ఒక టీఎంసీ నీటిని ఈ స్కీం ద్వారా ఎత్తిపోయవచ్చని తెలిపారు. రెండో దశలో లాం వద్ద నుంచే మరో 5,250 క్యూసెక్కుల నీటిని వైకుంఠపురం బ్యారేజ్‌కు మళ్లిస్తామన్నారు. మరో ఎత్తిపోతల పథకం నిర్మించి రాజధాని అవసరాలకు నీటిని వినియోగిస్తామన్నారు. వీటన్నింటి కోసం రూ.400 కోట్ల నిధులు ఖర్చు పెడతామన్నారు. అమరావతి రాజధానికి ఇక ముంపు ఉండబోదని ధైర్యంగా ప్రకటిస్తున్నానన్నారు. త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసిన జలవనరుల శాఖ ఇంజనీర్లు, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సిబ్బందిని సీఎం అభినందించారు. గుంటూరు చానల్‌ పొడిగింపు ప్రాజెక్టు పూర్తి చేస్తే కొత్తగా 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అంచనాల తయారీకి అయ్యే రూ.87 లక్షలకు సభా వేదిక మీద నుంచే శాంక్షన్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.489 కోట్ల నిధులు అవసరమౌతాయన్నారు. అలానే హెడ్‌ పంపింగ్‌ స్లూయిజ్‌కు రూ.13 కోట్లు మంజూరు చేశారు. ఆధునికీకరణకు రూ.350 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. వరికపూడిశెల లిఫ్టు ఇరిగేష్‌ ప్రాజెక్టుని త్వరలోనే చేపడతామన్నారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, రావెల కిషోర్‌బాబు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఫిలిప్‌ సీ థోచర్‌, ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, కలెక్టర్‌ కోన శశిధర్‌, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయారావు, ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ జేఆర్‌ పుష్పరాజ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ షేక్‌ జానిమూన్‌, దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ కోటేశ్వరరావు, మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ జియావుద్దీన్‌, మిర్చియార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, కృష్ణా పశ్చిమ డెల్టా పీసీ చైర్మన్‌ మైనేని మురళీ, ఎపెక్స్‌ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ అడ్మిన్‌ కె.శ్రీనివాస్‌, సీఈ ఆర్‌.సతీష్‌కుమార్‌, ఎస్‌ఈ ఎం.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
త్వరలో హరిశ్చంద్రాపురం ఎత్తిపోతల
సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. హరిశ్చంద్రాపురం వద్ద గోదావరి నీటిని నాగార్జునసాగర్‌ కాలువలకు మళ్లించే ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నాం. బ్యారేజ్‌ దిగువన చౌడవరం వద్ద మరో ఆనకట్ట నిర్మించబోతున్నాం. పట్టిసీమ ప్రాజెక్టు దండగని జగన్‌ మాట్లాడాడు. నేడు డెల్టాని సస్యశ్యామలం చేస్తున్న పట్టిసీమ నీటిని చూసి ఆయన ముఖం ఎక్కడ పెట్టుకొంటారరు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసులు వేయిస్తూ రాజధానికి అడ్డుపడుతున్నారు. అలానే వెలిగొండ ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
- మంత్రి దేవినేని ఉమా
 
 
వేగంగా రాజధాని నిర్మాణం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పరిపాలన, న్యాయ నగరాల్లో నాలుగు వేల అపార్టుమెంట్ల నివాసాలు వేగవంతంగా జరుగుతున్నాయి. కొండవీటి వాగు, పాలవాగుల డిజైన్లను నెదర్లాండ్స్‌ నిపుణులతో చేయించాం. వాళ్లు రాబోయే 100 ఏళ్లలో గరిష్టంగా 16 వేల క్యూసెక్కుల వరద వస్తుందని చెబితే తాము 22 వేల క్యూసెక్కులకు డిజైన్‌ చేశాం.
- మంత్రి పి.నారాయణ
 
 
అమరావతికి వరప్రదాయిని
అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకొంటోంది. కొండవీటి వాగుకు హఠాత్తుగా వచ్చే వరదతో ముంపు ఉంది. ఇది గమనించిన సీఎం తమకు ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పినా అనివార్య కారణాలతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఏడాదిన్నరలో పూర్తి చేశాం. ఇది అమరావతికి వరప్రదాయినిగా మారుతుంది.
- శశిభూషణ్‌కుమార్‌, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
 
 
అపర భగీరథుడు చంద్రబాబు
తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కొండవీటి వాగు ఈ ప్రాంత వాసులకు భవిష్యత్తులో వరప్రదాయినిగా నిలుస్తుందని అపర భగీరదుడు చంద్రబాబు రాజదాని అభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.
- ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌
Link to comment
Share on other sites

48 ‘ఎత్తిపోతల’కు నిధులు
ఐడీసీ ఛైర్మన్‌ రాంబాబు వెల్లడి

విజయవాడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 48 ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు కాగా, వీటి ద్వారా 47,045 ఎకరాలు సాగులోకి రానుందని రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) పాలకవర్గ ఛైర్మన్‌ నామన రాంబాబు తెలిపారు. విజయవాడలోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 28 ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.207 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వీటి ద్వారా 26,974 ఎకరాలు, నాబార్డు (ఆర్‌.ఐ.డి.ఎఫ్‌) నిధులు రూ.150 కోట్లతో నిర్మించే 19 ఎత్తిపోతల పథకాల ద్వారా 20,013 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. సమావేశంలో పాలకవర్గ డైరెక్టర్లు దేవినేని పురుషోత్తమనాయుడు, ముగలవసల రమేష్‌, చెమికల పురుషోత్తమరెడ్డి, ఐడీసీ జేఎండీ కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పింఛను సమస్య పరిష్కారానికి కృషి
ఐడీసీలో 1997 నుంచి 2003 సంవత్సరం వరకు అయిదు విడతలుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఉద్యోగులు టి.వి.రాఘవరావు నేతృత్వంలో తమకు పింఛను వర్తింప చేయాలని కోరుతూ నామనకు వినతి పత్రం సమర్పించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Link to comment
Share on other sites

మళ్లింపు జలాల్లో మా వాటా ఇప్పించాలి
గోదావరి బోర్డుకు ఏపీ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి నది నుంచి 240 టీఎంసీల జలాలను కృష్ణా పరీవాహకానికి తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తోందని, ఆ జలాల్లో తమ వాటా వచ్చేలా చూడాలని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)కు లేఖరాసింది. దీనిపై బోర్డు తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 225 టీఎంసీలు, తుమ్మిడిహట్టి బ్యారేజీ 20 టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతలు 100 టీఎంసీలు, తుపాకులగూడెం 50 టీఎంసీలు, తెలంగాణ తాగునీటి సరఫరా పథకం కింద 23.76 టీఎంసీలు, దేవాదుల ఎత్తిపోతలు 60 టీఎంసీలు, మరికొన్ని ఇతర ప్రాజెక్టులు కలిపి మొత్తం 450.31 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ ఆగస్టు తొమ్మిదో తేదీన ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ జీఆర్‌ఎంబీకి లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి గోదావరి నుంచి 240 టీఎంసీలను కృష్ణా పరీవాహకానికి మళ్లించేందుకు తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపడుతోందంటూ అందులో పేర్కొన్నారు. దిగువ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ మళ్లిస్తున్న నీటిలో వాటాను వచ్చేలా చూడాలని కోరారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...