Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
నదీగర్భాన జలసిరి.. నవ్వుతోంది చేలో వరి!
పాపాఘ్ని నదిలో భూగర్భ ఆనకట్టల నిర్మాణంతో సత్ఫలితాలు
పెరుగుతున్న భూగర్భ జలమట్టంతో బోర్లు, బావుల్లో జలకళ
ఆరుచోట్ల ప్రయోగాత్మకంగా నిర్మాణం.. రూ.26.36 కోట్ల వ్యయం
0.796 టీఎంసీల సామర్థ్యం.. 7795 ఎకరాలకు ప్రత్యక్ష లబ్ధి
4-5 మీటర్ల పైకి చేరిన పాతాళగంగ..
kdp-top1a.jpg
రూ.110 కోట్లతో మరో 16 నిర్మాణాలు నీటికి నడకలు నేర్పారు.. నదికి జీవం పోశారు.. చుక్కచుక్కనూ ఒడిసిపట్టి, భూగర్భపొరల్లో దాచిపెట్టి బంగారు భవిష్యత్తుపై భరోసా కల్పించారు.. బీడుబారిన భూముల్లో పచ్చదనాన్ని పెంపొందించి సీమలో మరో హరితవిప్లవానికి శ్రీకారం చుట్టారు.. ఒక్క ఆలోచన, ఒకే ఒక్క ప్రయోగం ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల గతిని మార్చేయగా.. వేలాది ఎకరాల సాగుకు అండగా నిలిచింది.. పాపాఘ్ని నదిలో పచ్చదనపు పరవళ్లకు కారణమైంది. ‘సుజలాం.. సుఫలాం’ ఉద్యమ సమయంలో జలవిజయ కథనం.
ఈనాడు - కడప

జిల్లాలో వ్యవసాయానికి అవసరమైన నీటికోసం వెంపర్లాడాల్సిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఎదురవడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది.. రూ.6 వేల కోట్లకు పైగా వెచ్చించి 92 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను జిల్లాలో నిర్మించినా వాటిలోకి నీరు చేరే పరిస్థితి లేకపోవడంతో సమస్యగా తయారైంది. జిల్లా మొత్తం భూగర్భం రాతినేల కావడంతో నీరు ఇంకడమన్నదీ గగనమే. వాగులు, వంకల్లో ప్రవహించిన వర్షపునీరంతా సోమశిల పాలవడం ఏళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్యకు ప్రత్యేక పద్ధతుల్లో పరిష్కారం కనుగొనేందుకు జిల్లా జలవనరుశాఖ అధికారులు యోచన చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌ ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కడప భూమిలో నీటిని ఇంకింపజేయలేని క్రమంలో పాతాళాన్నే జలాశయంగా మార్చాలని భావించి భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌) నిర్మాణానికి సంకల్పించారు. జడ్‌షీట్‌ ఫైలింగ్‌ విధానంలో ఆనకట్టల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించగా భూమిలో ఆనకట్ట కడితే నీళ్లెలా నిలుస్తాయంటూ విమర్శించారు. జిలా ఉన్నతాధికారులు తోడ్పాటు ఇవ్వడంతో నమ్మకంతో ఒట¨్టపోయిన పాపాఘ్ని నదిని ప్రయోగానికి ఎంచుకున్నారు. అందులో అధ్యయనం చేసి 6 చోట్ల డ్యాముల నిర్మాణం చేపట్టారు. రూ.26.36 కోట్ల వ్యయంతో 0.796 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మూడేళ్ల కిందట నిర్మాణాలు చేపట్టి ఇటీవల పూర్తిచేశారు. కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లోని చక్రాయపేట, వేంపల్లి, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లి మండలాల పరిధిలో ఆనకట్టలు ఏర్పాటయ్యాయి.

ఎక్కడెక్కడ కట్టారంటే.. : చక్రాయపేటలోని సుగాలితండా వద్ద తొలి సబ్‌సర్ఫేస్‌డ్యాం నిర్మించారు. రూ.3.53 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన దీని ద్వారా 770 ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతోంది. తక్కెలపల్లి వద్ద రూ.6.8 కోట్ల వ్యయంతో మరో ఆనకట్ట నిర్మించగా 1120 ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుంది.

* వేంపల్లె-చక్రాయపేట మధ్యన గండిక్షేత్రం వద్ద మరో భూగర్భ ఆనకట్ట నిర్మించారు. రూ.2.36 కోట్ల వ్యయంతో 1780ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా దీన్ని నిర్మించగా రెండు మండలాలకు ప్రయోజనంగా ఉంటోంది.

* వేంపల్లె వద్ద రూ.6.25 కోట్ల వ్యయంతో 1425 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూర్చడంతో పాటు.. వేంపల్లె, చింతలమడుగుపల్లి, ఫక్కీరపల్లి,కుమ్మరాంపల్లి గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఓ ఆనకట్ట నిర్మించారు.

* పెండ్లిమర్రి మండలం నందిమండలం వద్ద రూ.2.80 కోట్ల వ్యయంతో మరో ఆనకట్ట చేపట్టగా.. తద్వారా వేంపల్లె, పెండ్లిమర్రి మండలాల్లో 1880 ఎకరాల ఆయకట్టుకు నీటి వసతి కలగనుంది.

* వీరపునాయునిపల్లి మండలంలో యు.రాజుపాళెం వద్ద రూ.4.62 కోట్లతో నిర్మాణం చేపట్టగా.. 820 ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతోంది. అన్ని నిర్మాణాలతో మొత్తం 7795 ఎకరాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చాలనేది లక్ష్యం.

kdp-top1b.jpg

ఎలా కట్టారంటే.. : భూమిపై ఆనకట్ట నిర్మించాలంటే ముంపు పరిహారం ఇప్పించడం, భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు.. ఇలా చాలా తతంగం ఉంటుంది. ఇందుకు రూ.కోట్లలో నిధులు అవసరం. పాపాఘ్నిలో ప్రస్తుతం నిర్మించిన సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌ భిన్నమైనవి. వీటిని జడ్‌షీట్‌ ఫైలింగ్‌ విధానంలో నిర్మించారు. అంటే నదిలో ఆనకట్ట నిర్మించాలనుకున్న ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ నదికి అడ్డంగా కొంతమేర మట్టిని తొలగించారు. ఆ గోతిలో వరుసగా జడ్‌ షీట్‌లను యంత్రాల సాయంతో ఒకదానితో ఒకటి గొలుసు ఆకారంలో అమర్చారు. షీట్ల పైభాగాన్ని మట్టితో కప్పేసి ఉపరితలంపై కాంక్రీటు ఫైౖలింగ్‌ క్యాప్‌ వేశారు. అంటే ఇక్కడ ఉపరితలంపై వచ్చే నీరు దిగువకు వెళ్లి భూగర్భజలం గణనీయంగా పెరుగుతుంది.

మారిపోయిన రూపం : పాపాఘ్నిలో సబ్‌సర్ఫేస్‌డ్యాములు ఇటీవలే నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. ఒక్క తక్కెల్లపల్లి వద్ద కాంక్రీటు ఫైౖలింగ్‌ క్యాప్‌ వేయాల్సి ఉండగా నదికి నీరు రావడంతో అధికారులు వదిలేశారు. మిగిలిన అన్నిచోట్ల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. భూగర్భజలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు వట్టిపోయిన బోర్లు, బావుల్లోనూ జలసిరులు కనిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. సుమారు 4-5 మీటర్ల మేర నీటిమట్టం పెరిగినట్లు గుర్తించారు. డిజిటల్‌ స్కానింగ్‌, భూగర్భజలశాఖ ద్వారా మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాతాళ జలసిరులతో ఈ ప్రాంతం పచ్చదనం సంతరించుకుంటోంది. నదీపరివాహకంలో వరిపైర్లతో హరితసోయగాలు కనిపిస్తున్నాయి. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం.. ప్రత్యక్షంగా లబ్ధిపొందుతున్న 7795 ఎకరాల ద్వారా సుమారు 16,563 మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశముందని లెక్కగట్టారు. వార్షిక జీవీఏ రూ.51.24 కోట్లు సాధించవచ్చన్నది అంచనా.

మరో 16కు ప్రతిపాదనలు : ప్రస్తుతం పాపాఘ్నిలో నిర్మించిన 6 భూగర్భ ఆనకట్టలు సత్ఫలితాలను ఇస్తుండటంతో అధికారులు మరో 16 చోట్ల నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు రూ.110 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. పెన్నానదిలో 3, మాండవ్యలో 6, బాహుదాలో 4, చెయ్యేరులో 2, పాపాఘ్నిలో 1 చొప్పున నిర్మించాలన్నది లక్ష్యం. ప్రతిపాదనలు పంపించారు. పాపాఘ్నిలో సబ్‌సర్ఫేస్‌డ్యామ్స్‌ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వీటి నిర్మాణ తీరుతెన్నులు తెలుసుకుని ప్రశంసించడం గమనార్హం.

చాలా సంతోషంగా ఉంది : పాపాఘ్ని నదిలో ఏర్పాటు చేసిన సబ్‌సర్ఫేస్‌ డ్యాములు సత్ఫలితాలను ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భూగర్భజలమట్టం గణనీయంగా పెరగుతుండటం కళ్లముందే కనిపిస్తోంది. ఎండిపోయి, వట్టిపోయిన బోరు, బావుల్లో ఇప్పుడు నీళ్లు ఉబికి వస్తున్నాయి. రైతులు చక్కగా పంటలు సాగు చేసుకుంటున్నారు.  ఇప్పటివరకు 4-5 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. లోతుగా అధ్యయనం చేస్తున్నాం. మరో 16 చోట్ల నిర్మించేందుకూ ప్రతిపాదనలు సిద్ధం చేశాం.

-ప్రతాప్‌,  తెలుగుగంగ ఈఈ, సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌ సృష్టికర్త
Link to comment
Share on other sites

జలమ్-జాబులు..ఇవే మనల్ని గెలిపించబోతుంది

చెక్ డాంస్: 116 రోజలకి టార్గెట్ : 4209

టార్గెట్ April 23: 2724

నేటికి పూర్తయినవి : 3141

 

పంటకుంటలు: టార్గెట్ : 50866

టార్గెట్ April 23: 32913

నేటికి పూర్తయినవి : 74294

 

చెరువులు పూడిక తీత: టార్గెట్ : 1991

నేటికి పూర్తయినవి :494

 

http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/1632349/0db10c21-eb32-4c01-ad22-d962bfd0e00d

Link to comment
Share on other sites

మార్గం’ సుగమం
27-04-2018 02:18:06
 
636603922863879869.jpg
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పరుగులు
  • పురుషోత్తపట్నం పైపులైన్ల దారి మార్పు
  • అనవసరమైన వివాదాల నుంచి విముక్తి
అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలు ఉరకలెత్తేందుకు మార్గం సుగమం అయింది. ప్రార్థనా మందిరాలు, విలువైన భూములు, శ్మశానాలున్న స్థలాల వంటి అడ్డంకులు లేకుండా... పైప్‌లైన్‌ మార్గాన్ని మార్చేశారు. దీనివల్ల పైప్‌లైన్‌ నిడివి 6.03 కిలోమీటర్లు... వ్యయం రూ.75.82 కోట్లు పెరుగుతోంది. కానీ... అనవసర వివాదాలు లేకుండా వేగంగా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని రూ.1551.22 కోట్ల వ్యయంతో మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ చేపడుతోంది. మొత్తం పనులను 9 నెలల్లో పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. పైపులైన్లను వేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే, పలుచోట్ల విలువైన భూములు, ఉద్యాన వనాలు, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికల గుండా పైప్‌లైన్‌ వేయాల్సి వస్తోంది. రెండుచోట్ల జాతీయ రహదారిని కూడా దాటాల్సి ఉంది. దీనివల్ల న్యాయ వివాదాలు తలెత్తుతాయని... కాలయాపన తప్పదని అధికారులు గుర్తించారు. ఇలాంటి అడ్డంకులను తప్పిస్తూ... పైప్‌లైన్‌ మార్గాన్ని మార్చేశారు.
 
లక్ష్యం మేరకు నీళ్లు...
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి 2019లోగా ఏలేరులోకి గోదావరి జలాలను వీలైనంత త్వరగా ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదే జరగాలంటే శరవేగంగా పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి కావాలి. పాత పైపులైన్‌ దారి ఏలేరు పక్కనుంచి వెళుతుంది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటి ఉధృతికి పైపులైన్లు బయటకు వచ్చేయడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదం కూడా ఉంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం 1.8000 కిలోమీటర్ల వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని తరలించేందుకు నిర్మించే ఈ ఎత్తిపోతల పథకం స్టేజ్‌-1 ద్వారా స్టేజ్‌ -2లోని 57.885 కిలో మీటరు వద్ద ఏలేరులోకి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా పంప్‌ హౌస్‌లు, సివిల్‌, హైడ్రో మెకానికల్‌ పనులు, ఎలక్ట్రికల్‌ సబ్‌ స్టేషన్లు, ఎంఎస్‌ ప్రెజర్‌ మెయిన్స్‌, డెలివరీ సిస్టమ్‌ల నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ముందుగా తయారుచేసిన డిజైన్ల మేరకు పైపులైన్లు వేయడం సాంకేతికంగా కూడా సాధ్యం కాదని జల వనరుల శాఖ గుర్తించింది.
Link to comment
Share on other sites

As Rain guns Not yielding desired results #Chandrababu ropes in #Zeba on pilot basis in anatapur district

It works like a sponge,absorbs water and slowly release moisture back to plants as they need it

ఎకరాకు 5KG లు కావాలి..దానికి 2500Rupees Govt సబ్సిడీ.. రైతు 275Rupees చెల్లిస్తేచాలు

పైలెట్ ప్రాజక్ట్ కింద 4300హెక్టార్స్ లో Test

 

https://pbs.twimg.com/media/DbwJmUvV0AAW_Az.jpg

https://pbs.twimg.com/media/DbzE7EBVwAAvckR.jpg

Link to comment
Share on other sites

Guest Urban Legend

తుంగభద్ర జలాశయం, కుడి ఎగువ కాలువ పరిధిలోని, రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఒక సెకనుకు నాలుగు అడుగుల మేర ప్రవాహం వెళ్లేలా కాలువకు ఆకృతి ఇచ్చి ఆధునికరణ పనులను యుద్ద ప్రాతిపదిక చేస్తున్నారు. దీంతో సంబంధిత ఆయకట్టు రైతులకు 20 ఏళ్లపాటు త్రాగు, సాగునీటి కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు.

Db4DbBuUQAAMI04.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...