Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
నీటి పథకాలు పరుగులు
24-06-2018 02:20:58
 
  •  ప్రారంభానికి చాలావరకు సిద్ధం.. వడివడిగా జలాశయాలు
  •  ‘కొండవీటివాగు’తో రాజధాని ప్రాంతానికీ సమృద్ధిగా తాగునీరు
అమరావతి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర నిధులతో సంబంధం లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సొంత సొమ్ముతో శరవేగంగా పరుగులు తీయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే తరహాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ సాగు, తాగు నీటిని అందించే ప్రాజెక్టులనూ వడివడిగా పూర్తిచేస్తోంది. ఈ నెలలో, వచ్చే నెలలో వీటిలో చాలా పథకాలను ప్రారంభించనున్నారు. రాజధాని నగరం అమరావతి ప్రాంతంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొండవీటివాగు జలాశయాన్ని ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది.
  •  వంశధార స్టేజ్‌-2 ఫేజ్‌-2 పనులు నెలాఖరుకు పూర్తవుతాయి.
  •  అనంతపురం జిల్లా మారాల రిజర్వాయరు టన్నెల్‌ పనులు, చర్లోపల్లి రిజర్వాయరు, దాని టన్నెల్‌ నిర్మాణం పనులూ ఈ నెలాఖరుకు పూర్తవుతాయి.
  •  చిత్తూరు జిల్లా అడవిపల్లి ఎత్తిపోతల పథకం గేట్ల బిగింపు జోరుగా సాగుతోంది. పథకం పూర్తయితే.. 8.63 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.
  •  కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు సంబంధించి మెజారిటీ పనులను వచ్చే నెల 30నాటికి పూర్తి చేయాలని జల వనరుల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
  •  నెల్లూరు బ్రాంచ్‌ కెనాల్‌-సంగం బ్యారేజీ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ ప్రాజెక్టును జూలైలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఆగస్టులో ప్రారంభిస్తారు.
  •  చిత్తూరు జిల్లా మూలపల్లి రిజర్వాయరు వచ్చే నెల 28 నాటికి పూర్తవుతుంది.
  •  సోమశిల-స్వర్ణముఖి అనుసంధానం చేసే మేర్లపాక పథకాన్ని రూ.288 కోట్లతో అంచనావేశారు. పాలనామోదం రావాల్సి ఉంది.
  •  మల్లెమడుగు-బాలాజీ రిజర్వాయరు పనులకు అటవీ అనుమతులురావడమే తరవాయి! ఇవి డిసెంబరు నాటికి పూర్తవుతాయి.
  •  వేణగోపాలస్వామి రిజర్వాయరు పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయి.
  •  వంశధార-నాగావళి నదుల అనుసంధాన ప్రక్రియ కూడా మొదలైంది.
Link to comment
Share on other sites

అదనానికి పట్టేశారు!
బీటీపీ, పేరూరుకు కృష్ణా జలాలు తరలించే పనులు
రెండూ అంచనా కంటే అధికానికే గుత్తేదారుల సొంతం
ప్రభుత్వంపై రూ.41 కోట్ల భారం
ఈనాడు - అనంతపురం
23ap-story1a.jpg
రెండు ప్రాజెక్టులకు కృష్ణా జలాలను మళ్లించేందుకు అనువుగా రూ.908 కోట్ల పనులకు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. వీటిలో ప్రభుత్వ అంచనాను గుత్తేదారులు దాటేశారు. అంచనా కంటే అదనపు మొత్తానికే వ్యూహాత్మకంగా టెండర్లు వేసి, రెండు పనులనూ దక్కించుకున్నారు. ఫలితంగా సర్కారుపై అదనంగా రూ.41 కోట్ల మేర భారం పడనుంది. ఇది అనంతపురం జిల్లాలోని రెండు కీలక పనుల టెండర్లలో తాజాగా చోటుచేసుకున్న మతలబు.

జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గ పరిధి రామగిరి మండలంలోని ఎగువ పెన్నా జలాశయం(పేరూరు జలాశయం), రాయదుర్గం నియోజకవర్గ పరిధి గుమ్మగట్ట మండలంలోని భైరవానితిప్ప జలాశయాని(బీటీపీ)కి ఎగువన కర్ణాటకలో నిర్మాణాలు కారణంగా నీరు రాకుండా పోయింది. దీంతో హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చే కృష్ణా జలాల్లో కొంత ఈ రెండు జలాశయాలకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించి, తర్వాత ఉత్తర్వులిచ్చారు. హంద్రీ-నీవాలో భాగమైన జీడిపల్లి జలాశయానికి వచ్చే నీటిని తీసుకెళ్లాల్సి ఉంది. జీడిపల్లి జలాశయం నుంచి పేరూరుకు నీరు తరలించాలంటే 54 కి.మీ.కాల్వ తవ్వకంతోపాటు, 4 ఎత్తిపోతల పథకాలు, సోమరవాండ్లపల్లి, పుట్టకనుమల వద్ద చెరో జలాశయం నిర్మాణం, 116 వరకు కట్టడాలు నిర్మించాల్సి ఉంది. వీటన్నింటికీ కలిపి రూ.565 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. భైరవానితిప్పకు నీరు తరలించేందుకు 94 కి.మీ.కాల్వ తవ్వకం, 210 కట్టడాల నిర్మాణం, 14 ఎత్తిపోతలు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వీటిలో ఎత్తిపోతల పథకాలు కాక, మిగిలిన కాల్వ తవ్వకం, వాటిపై కట్టడాల నిర్మాణానికి సంబంధించి రూ.343 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు. ఈ రెండు పనులు కలిపి రూ.908 కోట్లతో టెండర్లు పిలిచారు.

23ap-story1b.jpg
రెండూ అదనమే..
పేరూరుకు నీరు తరలించేందుకు రూ.565 కోట్లతో పిలిచిన టెండర్లలో హెచ్‌ఈఎస్‌, మెగా ఇంజినీరింగ్‌ సంస్థలు పోటీపడ్డాయి. వీటి సాంకేతిక అర్హత పరిశీలనలో హెచ్‌ఈఎస్‌ అర్హత సాధించలేదు. మెగా ఒక్కటే బరిలో నిలిచింది. ఈ సంస్థ అంచనాకంటే 4.65 శాతం అదనపు మొత్తానికి టెండరు వేయగా,  ఇంజినీర్లు ఖరారు చేశారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.26.27 కోట్ల భారం పడనుంది.

* ఇక బీటీపీకి నీరు తరలించే పనులకు రూ.343 కోట్లతో టెండర్లు పిలవగా.. హెచ్‌ఈఎస్‌, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, ఆర్‌ఎంఎన్‌ ఇన్‌ఫ్రా, శ్రీసాయిలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్‌ టెండర్లు దాఖలు చేశాయి. ఆయా గుత్తేదారు సంస్థల సాంకేతిక అర్హత పరిశీలనలో ఆర్‌ఎంఎన్‌ ఇన్‌ఫ్రా, శ్రీసాయిలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్‌ అర్హత సాధించలేకపోయాయి. మిగిలిన రెండు సంస్థలూ అంచనా కంటే అధిక మొత్తానికి టెండర్లు వేశాయి. వీటిలో హెచ్‌ఈఎస్‌ 4.85 శాతం, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 4.32 శాతానికి టెండర్లు వేయటంతో ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు ఖరారయ్యాయి. దీనివల్ల ప్రభుత్వంపై రూ.14.81 కోట్ల మేర భారం పడుతోంది.

* మొత్తంగా ఈ రెండు పనుల్లో అంచనా కంటే అదనపు మొత్తానికి టెండర్లు వేసిన నేపథ్యంతో ప్రభుత్వంపై రూ.41.08 కోట్ల భారం పడుతోంది. ఖరారైన టెండర్ల తుది ఆమోదం కోసం హంద్రీ-నీవా ఇంజినీర్లు, కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌కు పంపారు.

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...