Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
Guest Urban Legend
1 minute ago, ask678 said:

Ninna oka bharata desa muddhu budda hindupur ki water levy annadu...kallu unte kanipisthayi chese works...over night lo ravali anni ante ivi emi pee kaadhu ga 

ilanti vaagudu enno chusam 

e sari ground lo jarugutunna works will speak ...irrigation vihsyam lo e sari TDP ni evadu noru terichi okka maata kuda matladaledu ...okati ara project pakkana pedithey jet speed lo veltunnayi 25 projects works

 

Link to comment
Share on other sites

కొత్త ప్రాజెక్టులకు ఏప్రిల్‌లో టెండర్ల ఖరారు
మొత్తం రూ.13,640 కోట్లతో 11 ప్రాజెక్టులకు కార్యాచరణ
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా రూ.13,640 కోట్ల విలువ చేసే దాదాపు 11 ప్రాజెక్టులకు కార్యాచరణ సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి అన్ని అంశాలు కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే ఇందులో కొన్నింటికి జలవనరులశాఖ అధికారులు పాలనామోదం ఇచ్చేశారు. మరికొన్ని పూర్తి స్థాయి ప్రాజెక్టులుగా సిద్ధమవుతున్నాయి. వీటిని ఆయా చీఫ్‌ ఇంజినీర్ల నుంచి రాష్ట్ర జలవనరులశాఖకు; అక్కడి నుంచి ఆర్థికశాఖకు వెళ్లి ప్రభుత్వ ఆమోదంతో జలవనరులశాఖ పాలనామోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా వేగంగా పూర్తి చేసి ఏప్రిల్‌ నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతస్థాయి ఆదేశాలు ఉన్నాయి.
వీటితోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూ.2,022 కోట్లతో తొలిదశకు ఇప్పటికే పాలనామోదం ఇచ్చి ఉన్నారు. ఇందులో కొంతమేర టెండర్లు పిలిచారు. మిగిలిన వాటికి టెండర్లు పిలిచి ఖరారు చేయాల్సి ఉంది. హిరమండలం జలాశయాన్ని రూ.1,055 కోట్లతో ఇచ్ఛాపురం హైలెవెల్‌ కాలువకు అనుసంధానం చేపట్టాలని ఇప్పటికే ఆలోచన ఉంది. దీనిని పూర్తిస్థాయి ప్రాజెక్టుగా సిద్ధం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ డీపీఆర్‌ త్వరగా పూర్తి చేయాలన్న సూచనలు అధికారులకు అందుతున్నాయి.

* గోదావరి-పెన్నా తొలిదశ డీపీఆర్‌ సిద్ధమవుతోంది.
* సత్యసాయిగంగ కాలువ నుంచి ఎత్తిపోతల తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమే. ఇప్పటికే సవరించిన అంచనాలు ఆమోదం పొందాయి.
* వేదవతి ప్రాజెక్టు కర్ణాటక, కర్నూలు సరిహద్దులో నిర్మించాల్సింది. డీపీఆర్‌ సిద్ధం కావాలి. కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
* కర్నూలు జిల్లాలోని ఏడు పశ్చిమ మండలాలకు హంద్రీనీవా నుంచి కాలువ ద్వారా నీటి మళ్లింపు. మొత్తం 1.243 టీఎంసీలు మళ్లించాలని యోచన. త్వరగానే చేపట్టే అవకాశం ఉంది. గుండ్రేవుల.. కర్నూలు జిల్లా వాసుల చిరకాల వాంఛ. ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతూ వస్తున్నందున ప్రజల్లో విశ్వసనీయత ఏర్పడటం లేదనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే డీపీఆర్‌ పూర్తయింది. పాలనామోదం ఇస్తే తక్షణం చేపట్టే అవకాశం ఉంది.

26ap-state9b.jpg
Link to comment
Share on other sites

ప్రాధాన్యం’లో మార్పు..  ప్రగతికి కూర్పు 
గాలేరు-నగరి సుజల స్రవంతి పనుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి 
ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటన 
తొలిదశ అసంపూర్తి నిర్మాణాలు పూర్తి.. రెండోదశలో పరుగుకు వీలు 
వచ్చే ఏడాది జూన్‌కు కడప జిల్లాలో పూర్తికి కృషి 
kdp-top2a.jpg

కడప, ఈనాడు : ‘ప్రాధాన్యం’లో మార్పులొచ్చాయి.. ప్రగతి దిశగా అడుగులు పడుతున్నాయి.. కరవుసీమలో జలసిరులు కురిపించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం దశాబ్దన్నర కిందట ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి మంచిరోజులు వస్తున్నాయి.. ఏళ్ల తరబడి అసంపూర్తి పనులకే పరిమితమైన ఆ బృహత్తర పథకం ప్రస్తుతం అభివృద్ధి పట్టాలెక్కింది. ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజెక్టుల జాబితాలోకి తీసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.  శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణానది మిగులు జలాలను తరలించి క్షామపీడిత ప్రాంతాలైన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2.25 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలనే ఉద్దేశంతో జీఎన్‌ఎస్‌ఎస్‌ కు రూపకల్పన చేశారు. 2004లో పురుడుపోసుకున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని రెండు దశలుగా విభజించారు. మొదటిదశలో ప్యాకేజీ-1 కింద గండికోట జలాశయం నిర్మాణం, గాలేరు-నగరి ప్రధాన కాల్వ 0.00 కి.మీ. నుంచి 24.330 కి.మీ. వరకు తవ్వకానికి రూ.344.110 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం గండికోట జలాశయం వరకు నిర్మాణం పూర్తయింది. ప్యాకేజీ-2 కింద 24.330 కి.మీ. వద్ద వామికొండ జలాశయం, 32.640 కి.మీ. వద్ద సర్వరాయసాగర్‌ నిర్మాణానికి సంకల్పించి రూ.315.17 కోట్లు కేటాయించారు. ఇక్కడ ప్యాకేజీ-2లో అనేక పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గాలేరు నుంచి నగరి వరకు మొత్తం 334 కి.మీ.మేర కాల్వ నిర్మాణం జరగాల్సి ఉండగా మొదటి దశలో రెండో ప్యాకేజీతో పాటు, రెండోదశ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మొత్తం 14 ప్యాకేజీల్లో కడప జిల్లాలో 7, చిత్తూరులో 7 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టగా.. రెండోదశలో 1, 2, 3.. ఇలా పలు ప్యాకేజీల టెండర్లు రద్దయ్యాయి. కొన్నిచోట్ల అటవీ అభ్యంతరాలతో గుత్తేదార్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ సమస్యతో పనులు అసంపూర్తిగా మారాయి. ప్రభుత్వం కూడా ప్రాజెక్టుపై శీతకన్ను వేసింది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా గండికోట వరకు మినహా మిగిలిన పనులు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇటీవల కడప జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎన్‌ఎస్‌ఎస్‌ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని మంత్రులు, అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే పనులను వేగవంతం చేయాలని అమరావతి నుంచీ పక్కా ఆదేశాలు అందాయి. ఇప్పటికే పరిపాలనానుమతులు రాగా  రూ.2525 కోట్ల నిధులు కేటాయింపులు జరిగాయి. వాటినే వినియోగిస్తూ 2019 జూన్‌ చివరికల్లా కడప సరిహద్దు వరకు జీఎన్‌ఎస్‌ఎస్‌ పనులు పూర్తిచేయాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో అధికారుల్లో ఉత్సాహం మొదలైంది. పనులు వేగవంతం చేసే దిశగా చొరవ చూపుతున్నారు. మొత్తంగా చాలా ఏళ్ల తర్వాత గాలేరు-నగరికి మోక్షం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Link to comment
Share on other sites

వేసవిలో సైతం సీబీఆర్ డ్యామ్ నుంచి పీబీసీ కాలువల ద్వారా #పులివెందులకు పరుగులు తీయనున్న కృష్ణా జలాలు.2004 నుండి 2009 వరకు తెలుగు దేశం గెలిచిన స్థానాల్లో కనీసం ఒక ఇటుక కూడా పెర్చలేదు మహమేత ఇదే నాయకుడికి రాజకీయ నాయకుడికి వున్న తేడా

https://pbs.twimg.com/media/DalybRAWkAEF6dU.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...