Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
  • 2 weeks later...

పనులపై నేడు కీలక భేటీ 
60 సి కింద తొలగించి నామినేషన్‌పై అప్పగింత! 
బ్యాంకు పూచీకత్తు లేకుండా అ‘ధనం’పై విన్నపాలు
ఈనాడు-అమరావతి: వెలిగొండ ప్రాజెక్టులో తొలి టన్నెల్‌ పనులు పాత గుత్తేదారు నుంచి తొలగించి టెండర్లు లేకుండా మరో గుత్తేదారుకు నామినేషన్‌పై అప్పగించే ప్రతిపాదనపై బుధవారం అమరావతిలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. తొలుత ఉన్నతాధికారులు ఈ అంశాన్ని చర్చించి ఆనక ముఖ్యమంత్రి వద్ద కూడా సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వెలిగొండ టన్నెళ్ల పనులు ఆలస్యం అవుతుండటంతో 60 సి కింద తొలగించి కొత్తగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకుముందే ‘ఈనాడు’లో పేర్కొన్నట్లు పోలవరం తరహాలో నామినేషన్‌ ప్రాతిపదికన పాత ధరలు.. కొత్త మొత్తాల్లో ఈ పని అప్పగించే వైనంపై చర్చ సాగుతోంది. ఈ పనుల ప్రధాన గుత్తేదారు సబీర్‌ ష్యూ ప్రసాద్‌ సంస్థ. ఎన్‌ఎస్‌సీ ఉపగుత్తేదారుగా పనులను చేపట్టింది. ఈ కంపెనీలో గతంలో రాజకీయ ప్రముఖులకూ భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు అదే కంపెనీ తమను ప్రధాన గుత్తేదారుగా రంగంపైకి తీసుకువస్తే తామే పాత ధరలకు పనులు చేస్తామని ప్రతిపాదిస్తోంది.
సబీర్‌ ష్యూ ప్రసాద్‌ కంపెనీ ఈ పనులను దాదాపు 9 శాతం తక్కువకు చేజిక్కించుకుంది. ఉపగుత్తేదారు రంగప్రవేశం చేయడంతో వారు మరింత తక్కువకు పనులు చేపట్టవలసి వస్తుంది. ఎప్పటినుంచో ఉపగుత్తేదారులే ఈ పనుల్లో భాగస్వాములవుతున్నారు. రూ.627.98 కోట్ల అంచనాతో నాడు చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే 80శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులకు అనేక పరిశీలనల అనంతరం రూ.285 కోట్లతో టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమయింది. 60సీ కింద తొలగించిన పనిని ఎల్‌ ఎస్‌ పద్ధతిలో తమకే అప్పగిస్తే తాము పాత ధరలకే పూర్తి చేస్తామని ఉపగుత్తేదారుగా ఉన్న ఎన్‌ఎస్‌సీ కంపెనీ ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం తాము ఉపగుత్తేదారుగా ఉండటం వల్ల అంచనా ధరలపై 15 నుంచి 16శాతం వరకు తక్కువ మొత్తాలకు చేయాల్సి వస్తోందని పేర్కొంటోంది. పాత ధరలతో మిగిలిన పని పరిమాణం ప్రకారం తమకు గంపగుత్త పద్ధతిలో చెల్లించాలని కోరుతోంది.
అధికారుల అభ్యంతరాలు: ఈ ప్రతిపాదనపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కొందరు అభ్యంతరాలు చెప్పినట్లు సమాచారం. ఉపగుత్తేదారుగా ఉన్న సంస్థనే ప్రధాన గుత్తేదారుగా ఎలా తీసుకురాగలమని అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయని, వారి నుంచి తొలగించి మళ్లీ వారికే ఎలా అప్పగించగలమని ప్రశ్నిస్తున్నారు. పాత ధరలకు, ఈపీసీ విధానంలో పని తొలగించినంత విలువ మొత్తానికి ఎవరైనా చేయడానికి వస్తే నామినేషన్‌పై అప్పగించడంలో తప్పు లేనప్పటికీ.. అన్ని వేళలా సమర్థనీయం కాదనే అభిప్రాయం ఉంది.
వెలిగొండ తొలి టన్నెల్‌ పనుల్లోనూ బ్యాంకు పూచీకత్తు లేకుండా జీవో 22, 63ల కింద మంజూరైన అధనపు మొత్తాలు ఇవ్వాలని గుత్తేదారు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. టన్నెల్‌ బోరింగుమిషను లోపల స్తంభించిపోవడం, అక్కడి భూభౌతిక జోన్‌ మార్పిడి, గట్టి రాయి తగలడం తదితర అంశాలకు సంబంధించి గుత్తేదారు ఎప్పుడో క్లెయిమ్‌లు సమర్పించారు. చర్చల అనంతరం రూ.58 కోట్ల చెల్లింపులకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. బ్యాంకు పూచీకత్తుపై ఈ మొత్తాలు ఇవ్వాలని జీవోల్లో పేర్కొన్నారు. ఇప్పుడు గ్యారంటీ లేకుండానే మొత్తాలు ఇవ్వాలని గుత్తేదారు కోరుతున్నారు. దీనిపైనా అధికారుల స్థాయిలో అభ్యంతరాలు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

‘గాలేరు-నగరి’కి కండలేరు నీరు 
నమూనాల్లో మార్పు 
రూ.551 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు 
ఆమోదం తెలిపిన సీఎం 
ఏడాదిలో పూర్తి చేసేందుకు సన్నాహాలు 
ఈనాడు - తిరుపతి
చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు రూపు మారనుంది. తొలుత కడప జిల్లాలోని రైల్వేకోడూరు వద్ద నుంచి సొరంగం ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలతో పనులు ప్రారంభించగా.. ఆ తర్వాత సమస్యలు ఎదురుకావడంతో దాన్ని పక్కనబెట్టారు. రైల్వేకోడూరు ప్రాంతం నుంచి లిఫ్ట్‌ ద్వారా తరలించి నీటిని మల్లెమడుగు రిజర్వాయర్‌కు తరలించాలని ప్రతిపాదించినా అది కూడా సాధ్యంకాదని నిర్ధరించారు. తాజాగా శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా నీటిని సోమశిలకు తరలించాలని ప్రతిపాదించారు. అక్కడి నుంచి కండలేరు జలాశయం ద్వారా పూండీ రిజర్వాయర్‌కు వెళ్లే మార్గం నుంచి మేర్లపాకకు.. అక్కడి నుంచి లిఫ్ట్‌ ద్వారా మల్లెమడుగు రిజర్వాయర్‌కు తరలించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం సుమారు రూ.551 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు తయారు చేశారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేయగా హైడ్రాజికల్‌ అనుమతులు లభించాయి. కొద్ది రోజుల్లోనే రాష్ట్రస్థాయిలోని అంచనాల కమిటీ ద్వారా ఆమోదముద్ర వేయించుకుని టెండరు ప్రక్రియ చేపట్టి ఏడాదిలో పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. 
ఇదీ ప్రతిపాదన: శ్రీశైలంలోని కృష్ణా వరద నీటిని సోమశిల డ్యాంకు.. అక్కడి నుంచి సోమశిల-కండలేరు వరద నీటి కాలువ ద్వారా కండలేరు జలాశయానికి తరలించనున్నారు. తర్వాత కండలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి లింక్‌ కాలువకు(ఎస్‌ఎస్‌ఎల్‌సీ) అనుసంధానం చేయనున్నారు. వాస్తవానికి 56 కి.మీ వరకు అటవీ సమస్య ఉండటంతో ఇక్కడ కాలువ పనులు చేపట్టలేదు. ఆ తర్వాత 56 కి.మీ నుంచి 107 కి.మీ వరకు ఇప్పటికే పనులు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో కండలేరు నుంచి పూండీ జలాశయానికి వెళ్లే కాలువ ద్వారా నీటిని తరలించనున్నారు. ఈ సమయంలో 34 కి.మీ వద్ద కాలువలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆల్తూరు రిజర్వాయరుకు అక్కడి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌ కాలువ ద్వారా మేర్లపాకకు కలపనున్నారు. మేర్లపాక చెరువు నుంచి లిఫ్ట్ల్‌ను ఏర్పాటు చేసి మల్లెమడుగు రిజర్వాయర్‌కు నీటిని తీసుకెళ్లనున్నారు. అక్కడి నుంచి మరో లిఫ్ట్‌ ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తరలించనున్నారు. 
ఎస్‌ఎస్‌ఎల్‌సీ నుంచి మల్లెమడుగుకు రూ.311 కోట్లు: ఎస్‌ఎస్‌ఎల్‌సీ నుంచి మల్లెమడుగు రిజర్వాయర్‌కు లిఫ్ట్‌ ద్వారా నీటిని తరలించేందుకే సుమారు రూ.311 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. మేర్లపాక నుంచి మల్లెమడుగు రిజర్వాయర్‌ వరకు సుమారు 50 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. మేర్లపాక ట్యాంక్‌ వద్ద పంపింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. మల్లెమడుగు నుంచి బాలాజీ రిజర్వాయర్‌కు లిఫ్ట్ట్‌ ద్వారా నీటిని తరలించేందుకు సుమారు రూ.240 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కాలువల కోసం సుమారు 20 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్‌ రెండు ప్రాంతాల్లోనూ పంపింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తిచేస్తే చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు సాగు నీటిని అందించడమే కాదు.. తిరుపతి నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులను తొలగించే ఆస్కారం ఉంది.

Link to comment
Share on other sites

రూ.వేయి కోట్లతో పరిశ్రమలు 
విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం 
చేసుకోనున్న తమిళ పారిశ్రామిక వేత్తలు
ఈనాడు, బెంగళూరు: చిత్తురు జిల్లాలో రూ.1000 కోట్ల పెట్టుబడులతో చిన్న, సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు తమిళనాడు పారిశ్రామికవేత్తలు సిద్ధమవుతున్నారు. త్వరలో విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఈ మేరకు అవగాహన ఒప్పందాల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కుదుర్చుకోనున్నారు. విశాఖ సదస్సు నేపథ్యంలో కర్ణాటక పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం బెంగళూరులో సమావేశమయ్యారు. అనంతరం చిత్తూరు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు బి.అనిల్‌కుమార్‌ రెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడారు.
తమిళనాడుకు చెందిన చెన్నై అంబత్తూరు ఆటోమొబైల్స్‌, అల్యూమినియమ్‌ అలుమిని, ప్లాస్టిక్‌ ఆసోసియేషన్ల సభ్యులు వరుసగా రూ.ఏడు వందలు, రూ.రెండు వందలు, రూ.వంద కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు సంసిద్ధులయ్యారన్నారు. క్లస్టర్‌ ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.‘చిత్తూరు జిల్లా తమిళనాడుకు దగ్గరలో ఉండటంతోపాటు రాజకీయ స్థిరత్వం, తక్కువ ధరలకు భూముల లభ్యత, ఆలస్యం లేకుండా అనుమతుల జారీ, కావాల్సినంత మానవ వనరుల లభ్యత తదితర కారణాల వల్ల చెన్నై పారిశ్రామికులు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారు’ అని వివరించారు. క్లష్టర్ల స్థాపనకు తగిన స్థలాల్ని ఎంపిక చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Link to comment
Share on other sites

1 hour ago, seemovie said:

The second line should be Velugodu Reservoir. Where is this document from?

thats ok le bro -

small spelling mistake tappa, achievement and impact tappu kaduga

vati mida avagahana vunna vallu tappa yevaru gurthinchaleru

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...