Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
వెలిగొండ.. వెనుకపడకుండా... 
సొరంగం పనికి ప్రత్యామ్నాయం 
రూ.755 కోట్ల అదనపు వ్యయం 
ఒంగోలు అర్బన్‌, న్యూస్‌టుడే 
pks-gen1a.jpg

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యామ్నాయ పని ద్వారా గడువులోపు జలాశయంలోకి నీటిని తీసుకోవటానికి ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. తొమ్మిది నెలల్లోగా సొరంగం పనులను పూర్తి చేయాలన్నది అధికారుల ముందున్న లక్ష్యం. ఈ ప్రాజెక్టు పనులపై సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయీ సంఘ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి జలాశయంలో ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలతో పాటు కనీస నీటి మట్టం నిల్వ సామర్థ్యం 10.27 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజా మార్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో రోజుకు 15 మీటర్ల లెక్కన పని చేస్తేనే గడువులోగా సొరంగం పూర్తవుతుంది. పనులు ప్రస్తుతం నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొదటి సొరంగంలో 18.82 కి.మీ.కు గాను 14.938 కి.మీ., రెండో సొరంగంలో 18.838 కి.మీ.కు గాను 10.665 కి.మీ. పని జరిగింది. జాప్యం నివారణకు కొన్ని మార్పులు ప్రతిపాదించారు. మొదట ఒప్పదం జరిగిన గుత్తేదారులకు కేటాయించిన పని నుంచి 3.6 కి.మీ. కుదించనున్నారు. రెండు సొరంగాలకు తాజాగా రూ.1,054 కోట్ల అంచనాలతో ఆకృతులకు అనుమతి తీసుకున్నారు. దీని ప్రకారం... సొరంగాల పైభాగంలో ఉన్న కొండ ప్రాంతంలో నుంచి దిగువకు నిలువుగా తవ్వకం పనులు చేపట్టనున్నారు. పాత అంచనాల్లోనే ఇలాంటి పని మొదలు పెట్టారు. దీనికే అంచనాలు పెరిగినందున కొత్తగా టెండర్లు పిలవనున్నారు. అలా చేపట్టే పని ఇప్పుడు జరుగుతున్న సొరంగాల వద్దకు చేరుకున్న తర్వాత శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకొనే మార్గం ఏర్పడుతుంది. తాజా పని కోసం ఈవోటీ క్రేన్‌ ఏర్పాటు చేశారు. కొల్లం వాగు వద్ద క్యాంపు కార్యాలయం కూడా నెలకొల్పారు. గుత్తేదారునికి అప్పగించిన 240 రోజుల్లో పని పూర్తి చేయాలి. కొత్త ఆకృతులను ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించింది. తదుపరి కార్యాచరణపై ప్రాజెక్టుల సీఈ ఎస్‌ఏ జబ్బార్‌ సోమవారం ఒంగోలులో తమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Link to comment
Share on other sites

ఎత్తిపోతల.. ఓ కల! 
కడప - చిత్తూరు జిల్లాల సరిహద్దులోని ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం 
అసంపూర్తిగా ఉన్న పంప్‌హౌస్‌ పనులు.. ‘యార్డు’ పనులూ అదేతీరు 
ఈనాడు, కడప - న్యూస్‌టుడే, చిన్నమండెం, రాయచోటి 
kdp-top2a.jpg

ఎత్తిపోతల పథకం వెక్కిళ్లు పెట్టిస్తోంది.. ఎంతకూ పూర్తికాని పనులతో ఇబ్బందికరంగా మారింది.. ఏళ్లు గడుస్తున్నా ఎంతకూ జలకల నెరవేరడం లేదు. ప్రత్యామ్నాయ పథక నిర్మాణంలోనూ పాత పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ‘ప్రత్యేక’ నిధులు వెచ్చించి పనులు చేపట్టినా పనులు సాగడం లేదు. హంద్రీ నీవా సుజలస్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) రెండోదశ పనుల్లో భాగంగా కడప - చిత్తూరు జిల్లాల సరిహద్దులో ప్రస్తుతం ఎత్తిపోతల పథకం నిర్మితమవుతోంది. చిన్నమండెం నుంచి పెద్దమండెం మండలాల పరిధిలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రదేశంలో తొలుత సొరంగం ద్వారా హంద్రీ నీవా కాల్వ నిర్మాణం చేపట్టాలని భావించారు. కడప జిల్లా చిన్నమండెం మండలం కోటగడ్డ కాలనీ నుంచి చిత్తూరు జిల్లా పెద్దమండెం మండలం నగరి వరకు 4 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇక్కడ అనేక అంశాలు ఇబ్బందికరంగా మారాయి. ప్రధానంగా మట్టిలో పటిష్ఠత లేకపోవడం (లూజ్‌ సాయిల్‌) కారణంగా సొరంగం తవ్వకానికి అవరోధం ఏర్పడింది. రెండు కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపిన అనంతరం ప్రతిబంధకాలు ఏర్పడటంతో పనులు నిలిపేశారు. ఇందుకు మొత్త్తం రూ.23.8 కోట్ల మేర వ్యయం జరిగినట్లు అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ఇంజినీరింగ్‌ వర్గాల

వైఫల్యం.. మట్టి నాణ్యతా పరీక్షల్లో నిర్లక్ష్యం వహించడంతో ప్రజాధనం దుర్వినియోగమైంది. రెండేళ్ల పాటు ఆగిపోయిన సొరంగం పనులు తిరిగి ప్రారంభం కాలేదు. ఓ దశలో గుత్తేదారు చేతులెత్తేయడం.. 20వ ప్యాకేజీలో ఆ పనులు రద్దు చేయడం జరిగాయి. చివరకు సొరంగం తవ్వినచోట పైభాగం కుంగిపోతుండటం బాధిత గ్రామాలు బిక్కుబిక్కుమంటూ బతుకెళ్లదీయడం పరిపాటైంది. ఈ స్థితిలోనే తెదేపా ప్రభుత్వం సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సొరంగం పనులకు ప్రత్యామ్నాయ పరిష్కారం వెదికింది. చివరకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ముందుకు పంపేందుకు సిద్ధపడింది.

ఇదీ పరిస్థితి.. : సొరంగం ప్రత్యామ్నాయంగా రూ.239.31 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా పెద్దమండెం మండలం గంగతాతగారిపల్లి నుంచి కడప జిల్లా చిన్నమండెం మండలం కోటగడ్డకాలనీ వరకు ఈ ఎత్తిపోతల నిర్మాణానికి ఏడాది కిందటే పూనుకొన్నారు. 4 కిలోమీటర్ల మేర ఎత్తిపోతల నిర్మించడానికి ముందుకు రాగా.. ఆ మేరకు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. ఇందులో రూ.189.55 కోట్లను కేవలం పనుల కోసమే వెచ్చిస్తున్నారు. ఎల్‌ఎఫ్‌ ప్రొవిజన్‌ కింద రూ.49.75 కోట్లను కేటాయించారు. ఈ పనుల్లో ప్రస్తుతం రూ.18 కోట్ల వ్యయంతో పంప్‌హౌజ్‌ నిర్మాణం జరుగుతోంది.   ఇప్పటివరకు రూ.12 కోట్లు ఖర్చుపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనుల్లోనే అంతులేని నిర్లిప్తత నెలకొంది. ఇప్పటివరకు మొదటిశ్లాబు పూర్తికాగా.. రెండోశ్లాబు ఇంకా ఆరంభం కాలేదు. మరో పదిరోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతుండగా దానిపై స్పష్టత కొరవడింది. రెండోశ్లాబు పనులు పూర్తయితే మోటార్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నది అధికారుల మాట. పంప్‌హౌస్‌ నుంచి కోటగడ్డకాలనీ వరకు పైపులైను వ్యవస్థ ఏర్పాటవుతోంది. ప్రస్తుతం కొంతమేర పనులు పూర్తికాగా.. ఇంకా పలుచోట్ల అనుసంధానించాల్సి ఉంది. ఇక్కడా భూసేకరణ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. రెండు జిల్లాల పరంగా కొందరు రైతులకు పరిహారం సొమ్ములు అందాల్సి ఉంది. చిత్తూరు సరిహద్దులోనే పలువురు రైతులు సమస్యను ‘ఈనాడు’ దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్తు ఉపకేంద్రం పరంగానూ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతానికి టవర్లు పూర్తికాగా యార్డు నిర్మాణదశలో ఉంది. ఓ రకంగా చూస్తే ఈ ఎత్తిపోతల రెండోదశలోనే కీలకం కానుంది. అలాంటి నిర్మాణంలో జాప్యం ఎక్కువవుతున్న క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

త్వరితగతిన పూర్తికి చర్యలు 
- వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు డీఈ 
ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వర్షాల వల్ల కొద్దిరోజులు పనులు ఆగాయి. మళ్లీ ఇప్పుడు పుంజుకున్నాయి. ప్రస్తుతం పంప్‌హౌస్‌ మొదటిశ్లాబు పూర్తియింది. రెండోశ్లాబుకు కసరత్తు జరుగుతోంది. వారం రోజుల్లో దాన్నీ చేపడతాం. యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

Link to comment
Share on other sites

 

 

9 ప్రాజెక్టులు సిద్ధం
22-12-2017 01:18:42
 
636495023309260458.jpg
  • ప్రారంభోత్సవమే తరువాయి
  • నెలాఖరులో మరో 4 పూర్తి
  • ప్రాధాన్య ప్రాజెక్టుల పరుగు
అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో... నిర్దిష్ట గడువులోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 28 ప్రాజెక్టులలో తొమ్మిది ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. మరో 4 ప్రాజెక్టులు ఈ నెలాఖరునాటికి పూర్తి కానున్నాయి. ప్రస్తుతం... ధవళేశ్వరం పరిధిలోని ఎర్రకాలువ ఆధునీకరణలో భాగంగా అనంతపల్లి బ్రిడ్జి నుంచి నందమూరు అక్విడెక్టు నిర్మాణం పూర్తి చేశారు.
 
పశ్చిమ గోదావరి జిల్లాలోని పోగొండ రిజర్వాయరు, కృష్ణా నదిపై రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ ఐడీసీ) నిర్మించిన పెదపాలెం ఎత్తిపోతల పథకం, చినసాన ఎత్తిపోతల పథకం, అనంతపురం జిల్లాలో జల వనరులశాఖ చీఫ్‌ ఇంజనీరు పరిధిలో నిర్మించిన మారాల రిజర్వాయరు, చెర్లోపల్లి రిజర్వాయరు, కర్నూలు జిల్లాలోని అవుకు టన్నెల్‌, గోరకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు (శ్రీ నరసింహరాయ సాగర్‌), సిద్దాపురం ఎత్తిపోతలు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి.
 
 
చిన్న చిన్న అడ్డంకులు...
అనంతపురం జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయరు వెనుకభాగాన మడకశిర బ్రాంచి కెనాల్‌ పనులు దాదాపు పూర్తయినా... భూ సేకరణ సమస్యలు తలెత్తాయి. ఇదే జిల్లాలోని పుట్టపర్తి వద్ద ప్రధాన కాలువ పనులు కూడా న్యాయ వివాదాలవల్ల ముందుకు సాగడంలేదు. చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశలో అడవిపల్లి రిజర్వాయరు పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. దీనికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
 
ఈ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశలోని కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులనూ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జల వనరుల శాఖ తిరుపతి చీఫ్‌ ఇంజనీరు చెబుతున్నారు. ఇందులో చిన్న పనులు మాత్రమే మిగిలాయని తెలిపారు. నెల్లూరు బ్యారేజీని వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
 
 
ఇప్పటికే 86 శాతం పనులు పూర్తయ్యాయని.. 14 శాతం సివిల్‌ పనులు మాత్రమే మిగిలాయని తెలిపారు. నెల్లూరు బ్యారేజీ పనులు కూడా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వానికి నివేదించారు. సంగం బ్యారేజీని ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని వివరించారు. పులికనుమ, పులకుర్తి ఎత్తిపోతల పథకాల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. గండికోట - చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు పనులు కూడా చివరి దశకు వచ్చాయి.
 
 
జీఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశలో రాష్ట్ర రహదారి-31 పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. గండికోట రిజర్వాయరులో 18.80 టీఎంసీలు నిల్వ చేస్తామని తెలిపారు. గుండ్లకమ్మ పనులకు భూ సేకరణ సమస్యలు తలెత్తాయని.. ఈ అంశం కొలిక్కివస్తుందని ప్రకాశం జిల్లా అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఎర్రం చిన్నపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం పూర్తికావొచ్చిందని నివేదించారు. వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2 పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇక... వంశధార-నాగావళి అనుసంధానానికి సంబంధించి భూసేకరణ కార్యక్రమం జోరుగా సాగుతోందని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దీనిని పూర్తి చేస్తామని చెబుతోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

సిద్దాపురం... కర్నూల్ జిల్లలో, 1919లో బ్రిటిష్ ప్రభుత్వం తవ్వించిన చెరువు... అప్పట్లో వెయ్యి ఎకరాలకు నీరందించింది.. ఎన్నో ఏళ్ళు పోరాటం ఫలితంగా ఇప్పుడు 21,300ఎకరాలను సస్యశ్యామలం చేయనుంది. 2006 ఏప్రిల్ 20న అప్పటి సీఎం వైఎస్ ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేసి వదిలేసారు.. ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన తర్వాత కూడా పనులు అవ్వలేదు.... ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తయ్యాయి. దాదాపు పదకొండున్నర ఏళ్ళు పట్టింది. రెండు ప్రధాన కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందించనున్నారు. ఈ పథకాన్నిసీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రైతులకు అంకితం చేయనున్నారు...


 


కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం రైతులకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ సిద్దాపురం ఎత్తిపోతల పధకం. సిద్దాపురం చెరువును 110 ఏళ్ల క్రితం రైతుల కోసమే తవ్విన చరిత్ర ఉంది. జిల్లాలో అతిపెద్ద చెరువగా పేరొందిన సిద్దాపురం చెరువును 1897-1907 మధ్య కాలంలో తవ్వినట్లు తెలుస్తోంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.52 టీఎంసీ. నల్లమలలో కురిసే వర్షాలపై ఆధారపడి చెరువు నిండితే ఆత్మకూరు మండలంలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే కాలక్రమంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపపుడు చెరువుకు నీరు చేరడం కష్టసాధ్యమయ్యేది. దీంతో ఆత్మకూరు మండలంలో గుక్కెడు తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడేది.

సిద్దాపురం చెరువు నిండితే మండలంలోని బావలు, బోర్లలో నీరు పుష్కలంగా చేరేది. ఏదో ఒక ఇబ్బందితో నీరు చేరని పక్షంలో ఆత్మకూరు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలుగు గంగ పధకం పనులు ప్రారంభమయ్యాక వెలుగోడు జలాశయం నుంచి సిద్దాపురం చెరువుకు నీరు తరలించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఆవస్యకత గమనించిన చంద్రబాబు, ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు.... ఎన్నో అవంతారాలను దాటుకుని, ప్రాజెక్ట్ పూర్తి చేసి, కర్నూల్ ప్రజలకి ఇవాళ అందించనున్నారు చంద్రబాబు...

Link to comment
Share on other sites

08 Jan 2018 - eenadu - dt edition

పెరిగిన జలాలు.. పచ్చగా పొలాలు 
సమృద్ధిగా వర్షాలు.. ఆపై హంద్రీ నీటితో విస్తృతంగా సాగు 
atp-top2a.jpg

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా గత ఏడాది మంచి వర్షాలు కురవడంతో దశాబ్దకాలంగా బీడుగా భూములన్నీ సాగులోకి వస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటికి, తాగునీటికి ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఎక్కడా చెరువుల్లోకి చుక్క నీరు చేరకపోవడంతో ఆయకట్టు భూములన్నీ బీళ్లుగా మారాయి. జిల్లాలోని 90 శాతం బోర్లు ఒట్టిపోయాయి. గత ఏడాది ముందస్తు వర్షాలు కురవకపోవటంతో రైతులు కొంత నిరాశ చెందినా.. ఆపై వరుణుడు కరుణించటంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. తాడిపత్రి, రాయదుర్గం, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో 500 నుంచి వెయ్యి అడుగుల లోతు వరకు పడిపోయిన భూగర్భ జలాలు చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం 100 నుంచి 150 అడుగుల్లోనే లభిస్తున్నాయి. హంద్రీనీటితో నిండిన చెరువుల పరిధిలో 50 నుంచి 100 అడుగుల్లోనే నీరు లభిస్తోంది.

కళకళలాడుతున్న పంటలు 
ఐదారేళ్లుగా కదిరి, ధర్మవరం, రాప్తాడు, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఏ పంటలు సాగుచేయలేని పరిస్థితి ఉండేది. గత ఏడాది కురిసిన వర్షాలు, ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల పంట కుంటలు, చెరువులు, వంకల్లోకి నీరు చేరింది. పంటలు సాగుకు నోచుకోకపోవడంతో ముళ్లపొదలతో బీళ్లుగా మారిన తమ పొలాలను కూడా రైతులు సాగులోకి తీసుకువచ్చారు. జిల్లాలో ప్రధానంగా రైతులు వేరుసెనగ, వరి సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో బోర్ల కింద వాటి సాగు ప్రశ్నార్థకంగా మారింది. బస్తాల కొద్దీ వరి ధాన్యాన్ని విక్రయించిన రైతులు కూడా దుకాణాల్లో వాటిని కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం  హెచ్‌ఎల్‌సీ, పీఏబీఆర్‌ పరిధిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వరి సాగు ఊపందుకుంది. ఉద్యాన పంటలు, కూరగాయల పంటలు, పూలతోటలు ఎక్కడ చూసినా కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత రబీకాలంలో వేరుసెనగ విస్తీర్ణం 30 వేల హెక్టార్లు కాగా.. 20 వేల హెక్టార్లలో వరి సాగుచేశారు. 1,22,653 హెక్టార్లలో అరటి, చీనీ, బొప్పాయి, సపోట, ద్రాక్ష తదితర పంటలు, 35,313 హెక్టార్ల విస్తీర్ణంలో టమోటా, బెండ, వంగ తదితర పంటలు సాగుచేస్తున్నారు. దీంతోపాటు 3665 హెక్టార్లలో లిల్లీ, బంతి, చేమంతి తదితర పూలతోటలు సాగుచేస్తున్నారు.

ఆదుకున్న హంద్రీనీవా 
జిల్లాలో ప్రారంభమయ్యే హంద్రీనీవా కాల్వ రాప్తాడు, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల మీదుగా సాగి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ పరిధిలో జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి జలాశయాలు ఉన్నాయి. ప్రస్తుతం జీడిపల్లి, గొల్లపల్లి జలాశయాలకు కృష్ణా జలాలను అందించారు. 
రాప్తాడు నియోజకవర్గంలోని 27 చెరువులకు, 75 చెక్‌డ్యాంలు, ధర్మవరం చెరువు, బుక్కపట్నం, కె.లోచర్ల చెరువులకు నీరందించారు. దీంతో ఆయా చెరువుల పరిధిలోని 25 వేల బోర్లు రీఛార్జి కావడంతో రైతులు వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. బుక్కపట్నం నుంచి చెర్లోపల్లి వరకు కాల్వ పనులు పూర్తి కాకపోవడంతో మారాల, చెర్లోపల్లి జలాశయాలకు నీరు అందించేందుకు అవకాశం లేకపోయింది.

మూడు ఇంచుల నీరు వస్తోంది 
వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. వ్యవసాయ బోర్లు ఒట్టిపోవడంతో నీటి కోసం ఐదు బోర్లు తవ్వించినా చుక్కనీరు పడలేదు. పదేళ్లుగా సాగుకు నోచుకోని భూములు హంద్రీనీవా నీటితో గ్రామ చెరువును నింపడంతో ఒట్టిపోయిన బోర్లు అన్నింటిలోనూ 2 నుంచి 3 ఇంచుల నీరు లభిస్తోంది. నాలుగెకరాల్లో వరి, రెండెకరాల్లో వేరుసెనగ సాగుచేశా. కరవు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు కూడా గ్రామానికి తిరిగి వచ్చి పొలాలను సాగు చేస్తున్నారు. హంద్రీనీవా వల్ల భవిష్యత్తులో రైతులకు మేలు జరుగుతుందన్న నమ్మకం కలిగింది.

- రామస్వామి, రైతు, చెన్నేకొత్తపల్లి

ఎనిమిదెకరాల్లో పంటల సాగు 
ఎనిమిది ఎకరాల పొలంలో రెండు వ్యవసాయ బోర్ల ద్వారా వివిధ రకాల పంటలు సాగుచేసేవాడిని. బోర్లలో నీరు అడుగంటడంతో అరకొరగా వస్తున్న నీటితో పంటలు సాగు చేయలేక పోయాను. హంద్రీనీవా నీటితోపాటు మంచి వర్షాలు కురవటంతో బోర్లలో నీరు పుష్కలంగా లభిస్తోంది. ప్రసుత్తం ఐదెకరాల్లో వేరుసెనగ, మూడెకరాల్లో వరిని సాగుచేస్తున్నా. వ్యవసాయంతోపాటు పశుపోషణ కూడా చేపట్టాను. గతంలో చేసిన అప్పులను కొంతమేర తీర్చగలుగుతున్నాను.

- వెంకటరెడ్డి, రైతు, చెన్నేకొత్తపల్లి
Link to comment
Share on other sites

ilaantivi max people ki share cheyyandi. Small projects but impact is more.

20+ such small projects near to completion which started in last 3-4 years.

These are apart from Pattiseema, Purushottamapatnam, Handri Neeva etc... big projects.

Polavaram kooda 2019-20 ki complete chesthe CBN & TDP will be remembered by people forever.

Link to comment
Share on other sites

ఎన్నికల్లోపు వెలుగొండ ద్వారా నీరందిస్తాం 
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావు 
pks-top2a.jpg

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: 2019 సార్వత్రిక ఎన్నికల్లోపు వెలుగొండ ద్వారా ప్రజలకు సాగు, తాగు నీరందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన ఆదివారం కర్నూలు జిల్లా ఆత్మకూరు వెళుతూ మార్గం మధ్యలో పెద్దదోర్నాలలో వెలుగొండ అతిథి గృహంలో అల్పాహార విందు కోసం ఆగారు. ఈ సమయంలో ఆయనకు సీఈ జబ్బార్‌, ఎస్‌ఈ రెడ్డయ్య వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణానదిలోని కొల్లంవాగు వద్ద జరుగుతున్న హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు చిత్రాలను చూపించారు. సంక్రాంతి తర్వాత వచ్చి ఆ పనులు పరిశీలిస్తానని వారితో మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తీగలేరు కాలువను పొడిగించాలని, నాగార్జున సాగర్‌ కాలువ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించాలని విన్నవించారు. అందుకు మంత్రి స్పందించి ఈ ఏడాది చివరిలోపు వెలుగొండ తొలిదశ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం సొరంగాల పనులు చేస్తున్న గుత్తేదారులు వేగవంతంగా పనులు చేయకపోవడంతో వారిని తొలగిస్తున్నామని.. వారంలోపు టెండర్లు వేయించి త్వరితగతిగా పనులు జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో తీగలేరు కాలువ పొడిగింపు పనులకు ఈ నెల చివరిలోపు శంకుస్థాపన చేస్తామన్నారు. నిర్వాసితులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీని తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని.. త్వరలో వారి సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరులకు సంబంధించిన చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. మంత్రిని కలిసిన వారిలో ఎన్‌ఎస్పీ డీజీఎం రామ్మోహనరావు, పెద్దదోర్నాల, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండలాల తెదేపా అధ్యక్షులు అంబటి వీరారెడ్డి, వెన్నా వెంకటరెడ్డి, షేక్‌ జిలాని, పుల్లలచెరువు ఎంపీపీ సుందరరావు, పార్టీ జిల్లా నాయకుడు శాసనాల వీరబ్రహ్మం, కాసా రఘనాధరెడ్డి, మహేశ్వరరెడ్డి, చిన్నకోటిరెడ్డి తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

అన్నమయ్య ఆయకట్టుకు భరోసా 
కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎంపిక 
వెలిగల్లు ప్రాజెక్టు ఆయకట్టుకూ అభయం 
చివరి పొలానికి నీరివ్వాలని లక్ష్యం 
రూ.66 కోట్లకు నివేదిక.. త్వరలో  నిధుల విడుదల 
kdp-gen1a.jpg

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : జలవనరుల శాఖ పర్యవేక్షణలో నిర్మించిన జలాశయాల కింద ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. చివరి ఆయకట్టుకు సేద్యపు జలాలు అందించాలి. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించేందుకు బృహత్తర ఆశయంతో ముందడుగు వేశారు. పూర్తి స్థాయిలో రైతుల అవసరాల తీర్చేలా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇంతకాలం రూ.కోట్లు గుమ్మరించినా నీటి ప్రవాహంలో తలెత్తే అటంకాలను కాసుల కష్టంతో విస్మరించారు. తాజాగా కేంద్రం భరోసా ఇవ్వడంతో జిల్లాకు చెందిన రెండు మధ్య తరహా జలాశయాలను ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఉన్నతాధికారి శశిభూషన్‌కుమార్‌ ఉత్తర్వు 14 జారీ చేశారు. 
రాజంపేట మండలం బాదనగడ్డ గ్రామం సమీపంలో బాహుదా నదిపై అన్నమయ్య జలాశయాన్ని నిర్మించాలని నాలుగు దశాబ్ధాల కిందట ప్రతిపాదించారు. 1976 ఏప్రిల్‌ 21న 8.25 కోట్లతో చేపట్టాలని అనుమతిచ్చారు. 2.241 శతకోటి ఘనపుటడుగుల నీరు నిల్వ చేయాలని పనులు చేపట్టారు. 18 గ్రామాలకు తాగునీరు, రాజంపేట, పుల్లంపేట మండలాల్లోని 10,236 ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రణాళికను రూపొందించారు. 1996-97 నాటికి రూ.60.44 కోట్ల అంచనాతో ఆమోదించారు. 2001 జనవరి 4న అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2003 అక్టోబరు 30న కుండపోత వర్షాలు కురవడంతో వరద ఉద్ధృతికి మొదటి గేటు కొట్టుకుపోయింది. 2008-09లో రూ.98.22 కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. 2011లో రూ.102.36 కోట్లకు పెంచారు. గత దశాబ్ధకాలంలో చూస్తే సగం ఆయకట్టుకు నీరివ్వలేని దైన్యం. 2016లో వచ్చిన వరదలతో 34 టీఎంసీల నీటిని దిగవ ప్రాంతంలోని నదిలోకి వదిలేశారు. ఈ నీరంతా సోమశిల జలాశయంలోకి చేరింది. రాజంపేట పురపాలికకు 0.12 టీఎంసీలు, పుల్లంపేట తాగునీటి పథకానికి 0.10 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. రాజంపేట మండలంలో ఆకేపాడులో 821.50 ఎకరాలు, కొత్తపల్లి 854.34, కొత్తపల్లి ఉపకాల్వ-2లో 690.96, హస్తవరం 836.54, బహిరాజుపల్లి 170.93, మన్నూరు 1,384.40, అనంతసముద్రం 586.80, రాజంపేట 611.10, ఊటుకూరు 372.20, మిట్టమీదపల్లి 1,354.17, గోపమాంబపురం 370.98, పుల్లంపేట మండలం పుల్లంపేట 1,738.68, అనంతయ్యగారిపల్లి 444.03 ఎకరాలకు నీరందించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎప్పుడూ పూర్తిస్థాయిలో నీరివ్వలేదు. కాల్వలతోపాటు ఆరు చెరువులకు మళ్లించాల్సి ఉంది. ప్రధాన, ఉపకాల్వలు సక్రమంగా లేకపోడంతో పూడిక చేరింది. కొన్నిచోట్ల ఆనవాళ్లు చెదిరిపోయాయి. ఆరేడు సంవత్సరాలుగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిధులిస్తోంది. మరమ్మతులు, నిర్వహణకు కాసుల కష్టం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఐఎస్‌బీఐజీ పథకం (ఇన్‌సెంటివ్‌వైజేషన్‌ ఫర్‌ బ్రిడ్జింగ్‌ గ్యాప్‌) అన్నమయ్య జలాశయాన్ని తాజాగా ఎంపిక చేశారు. ఇక్కడ అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు, నవీకరణ చేయడానికి రూ.30 కోట్లు నిధులు కావాలని అడిగినట్లు కార్యనిర్వాహక సాంకేతిక నిపుణుడు రమేష్‌ ‘న్యూస్‌టుడే’కి చరవాణిలో తెలిపారు. ఒకే ఏడాదిలో ఇస్తారా, ఐదేళ్లపాటు ఖర్చు చేయాలని ఉత్తర్వులిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

వెలిగల్లు మహర్దశ 
కరవు కాటకాలతో నిత్యం అవస్థలు పడుతున్న రైతుల కన్నీటి ఘోషకు శాశ్వత పరిష్కారం చూపాలని పాపఘ్ని నదిపై వెలిగల్లు జలాశయాన్ని నిర్మించారు. 4.64 టీఎంసీల నిల్వ సామర్థ్యం. 24 వేల ఎకరాలకు నీరివ్వాలి. 2008 డిసెంబరు 23న అప్పటి సీఎం వైఎస్‌ జాతికి అంకితం చేశారు. కుడి కాల్వ పొడవు 57.15 కి.మీ. 23,400 ఎకరాలకు, ఎడమ కాలువ 6 కి.మీ చేపట్టి 600 ఎకరాలకు సాగునీరు అందించాలని రూపకల్పన చేశారు. ఆంగ్లేయుల కాలంలోనే మెకంజీదార్‌ సర్వే చేయించారు. 1955లో అప్పటి దేశ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఎదుట అప్పటి అనంతపురం కమ్యూనిస్టు నేత తరిమెళ్ల నాగిరెడ్డి ప్రత్యక్ష ఆందోళన చేయడంతో ఈ పథకంపై ఆలోచన చిగురించింది. 1984-85లో సీనియర్‌ నేత ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదన మేరకు అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రాథమిక సర్వే చేయాలని నిర్ణయించింది. 1987-88లో తొలి ప్రతిపాదన రూ.35 కోట్లు కావాలని నివేదించారు. 1989లో రూ.52 కోట్లకు పెంచారు. 1994-95లో రూ.131.82 కోట్లకు పెరిగింది. 1995 నవంబరు 29న సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. 1998-99 నాటికి రూ.184 కోట్లకు అంచనాలు పెరిగాయి. 2002 డిసెంబరు 28న రూ.129.65 కోట్లకు ఆమోదం తెలిపారు. 2006 సెప్టెంబరు 29న ఉత్తర్వు 75 జారీ చేసి రూ.208.72 కోట్లకు పచ్చజెండా ఊపారు. 1995 నుంచి 2003 వరకు సాధారణ రాష్ట్ర ప్రణాళిక నిధులు ఖర్చు చేశారు. 2006 తర్వాత ప్రధానమంత్రి ప్యాకేజీలో ఎంపిక చేశారు. 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్ర వాటా ఖర్చు చేయాలని నిర్ణయించారు. 2008 డిసెంబరులో ఈ జలాశయాన్ని నాటి సీఎం వైఎస్‌ జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ఆరేడు ఏళ్లపాటు నీరు పెద్దగా చేరలేదు. 2015, 2016లో కురిసిన భారీ వర్షాలతో నీరు చేరింది. ఆయకట్టుకు నీరివ్వాలని యత్నిస్తే క్షేత్రస్థాయిలో అడ్డంకులెన్నో. అందుకే పచ్చని పంటలు సాగు చేసుకునే భాగ్యం లేకుండాపోతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎస్‌బీఐబీ పథకంలో ఎంపిక చేయాలని జిల్లా నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. మిగతా పనులు చేయాలంటే కనీసమంటే రూ.36 కోట్లు నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు ఈఈ గిరి ‘న్యూస్‌టుడే’కి తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) రూపొందించి అందజేస్తామన్నారు. 
* రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రాజెక్టులను ఎంపిక చేయగా మన జిల్లా నుంచి రెండు జలాశయాలకు ఈ అవకాశం దక్కింది. రెండింటికి కేంద్రం నిధులు రూ.66 కోట్లు రానున్నాయి. కేంద్రప్రభుత్వం కరుణిస్తే దుర్భిక్ష ప్రాంతంలోని బీడు భూములకు నీరందిస్తే పచ్చని పంటలతో సస్యశ్యామలం కానుంది.

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

తరగని జలం... తరతరాలకు బలం 
ఇక కృష్ణమ్మ పరవళ్లు మున్ముందుకు... 
పుట్టపర్తి వద్ద శరవేగంగా కాలువ నిర్మాణం 
నెలాఖరుకు అపరిష్కృత పనులన్నీ పూర్తి 
మారాల, చెర్లోపల్లె జలాశయాలకూ నీరు 
నెరవేరనున్న జిల్లావాసుల కల 


atp-top2a.jpg
అనంత జీవనాడి అనగానే ఠక్కున చెప్పే పేరు... తుంగభద్ర ఎగువ కాల్వ (హెచ్చెల్సీ). ఈ ఖ్యాతిని మున్ముందు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కూడా సొంతం చేసుకోనుంది. ఇప్పటికే హంద్రీనీవా ద్వారా జిల్లాకు వస్తున్న కృష్ణమ్మ జలాలు... తాగునీటి కష్టాలను, కొంతమేర సాగు ఇక్కట్లను తీరుస్తున్నాయి. ఈ పథకంలో ఇప్పటి వరకు జిల్లాలో రెండు జలాశయాలకే నీరు చేరుతుండగా... మరో రెండు జలాశయాల్లో కృష్ణమ్మ పరవళ్లు ఈదఫా ఉండవని అంతా భావించారు. అయితే పుట్టపర్తి వద్ద భూసేకరణకు మార్గం సుగమం కావడం, అక్కడ అపరిష్కృత పనులు మొదలు కావడంతో జిల్లావాసుల కల త్వరలో నెరవేరే అవకాశం కనిపిస్తోంది.

ఈనాడు - అనంతపురం: హంద్రీనీవా మొదటి దశ జీడిపల్లి జలాశయంతో ముగుస్తుంది. అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది. ఇందులో భాగమైన మడకశిర బ్రాంచి కాల్వ పరిధిలో గొల్లపల్లి జలాశయం ఉంది. ఇప్పటి వరకు జీడిపల్లి, గొల్లపల్లి జలాశయాలకు మాత్రమే కృష్ణమ్మ వస్తోంది. అయితే బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయం, కదిరి మండలంలో ఉన్న చెర్లోపల్లె జలాశయాలకు నీటి ప్రవాహం ఈ ఏడాది కూడా ఉండదనే సందేహాలు ఉండేవి. పుట్టపర్తి పరిధిలోని కమ్మవారిపల్లె వద్ద ప్యాకేజీ-9బిలో భాగమైన హంద్రీనీవా ప్రధాన కాల్వ కి.మీ. 340.450 నుంచి 340.950 వరకు 500 మీటర్ల మేర కాల్వ పనులు జరగలేదు. అక్కడ భూసేకరణ సమస్య తలెత్తడంతో చాలా కాలంగా పనులు ఆగిపోయాయి. పరిహారం విషయంలో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందారు. అయితే ఈ సమస్య కొంత కొలిక్కి రావడంతో ఇటీవల కాల్వ పనులు ఆరంభించారు.

నెలాఖరుకు లక్ష్యం.. 
పుట్టపర్తి వద్ద పెండింగ్‌ ఉన్న కాల్వ పనిలో భాగంగా 1.86 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వి తీయాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి కాల్వ పూర్తికావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో రోజుకు 6,700 క్యూబిక్‌ మీటర్లు చొప్పున మట్టి తీస్తున్నారు. జేసీబీలు, టిప్పర్లు తదితర యంత్రాలు, వాహనాలు కలిపి మొత్తం 25 వరకు అక్కడ పనిచేస్తున్నాయి. వీటితో నిరంతరం పనిచేయిస్తే 20 రోజుల్లో ఈ 500 మీటర్ల కాల్వ పనులు పూర్తవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక బుక్కపట్నం వద్ద ప్యాకేజీ-10బిలో భాగంగా 358.150 కి.మీ నుంచి 360.250 కి.మీ వరకు సొరంగం పనులు జరుగుతున్నాయి. ఇందులో 10 మీటర్ల మేర మినహా మిగిలిన సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన 10 మీటర్ల పనులు ఈ నెల 20 నాటికి పూర్తిచేయనున్నారు.

దిగువకు పరవళ్లు... 
పుట్టపర్తి వద్ద 500 మీటర్ల కాల్వ పనులు పూర్తికావడం, బుక్కపట్నం వద్ద సొరంగం పనులు పూర్తయితే కృష్ణమ్మ పరవళ్లు మున్ముందుకు వెళ్లనున్నాయి. ముందుగా బుక్కపట్నం మండలంలోని హంద్రీనీవా ప్రధాన కాల్వలోని 371.040 కి.మీ. వద్ద సిద్ధమైన మారాల జలాశయానికి నీరు చేరనుంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్‌ పనుల్లో 90 శాతం వరకు పూర్తయ్యాయి. 0.464 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ జలాశయాన్ని తొలిసారిగా నీటితో నింపనున్నారు. ఆ తర్వాత ప్రధాన కాల్వలోని 400 కి.మీ వద్ద నుంచి పుంగనూరు బ్రాంచి కాల్వ మొదలవుతుంది. ఇందులోని ప్యాకేజీ-26బిలో భాగంగా కదిరి మండలంలో చెర్లోపల్లి జలాశయం నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ కూడా దాదాపు 86 పనులు జరుగుతున్నాయి. ఇక్కడి జలాశయ మట్టికట్ట, తదితర పనులను గుత్తేదారు సంస్థ శరవేగంగా చేస్తోంది. 1.425 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయానికి కూడా త్వరలో కృష్ణమ్మను తీసుకెళ్లనున్నారు. దీంతో హంద్రీ-నీవాలో భాగంగా జిల్లాలోని జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి జలాశయాలకు నీరిచ్చినట్లు అవుతుంది.

ఉత్సవాల నాటికి జలకళ... 
మరోవైపు మడకశిర బ్రాంచి కాల్వలలో కృష్ణమ్మ గలగలలు కనిపించేలా ఇంజినీర్లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వచ్చే నెల 24, 25 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరిగ్గా ఆ సమయానికి లేపాక్షి వరకు మడకశిర బ్రాంచి కాల్వలో నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. హంద్రీనీవా రెండో దశలోని ప్రధాన కాల్వ 310 కి.మీ నుంచి మడకశిర బ్రాంచి కాల్వ మొదలవుతుంది. అక్కడి నుంచి 172 కి.మీ. మేర ఈ మడకశిర బ్రాంచి కాల్వ ఉండగా, ఇందులో గొల్లపల్లి జలాశయం వరకు ఇప్పుడు కృష్ణమ్మ చేరుతోంది. అక్కడి నుంచి లేపాక్షి వరకు ఫిబ్రవరిలో నీటిని తీసుకెళ్లనున్నారు. మధ్యలో హిందూపురం, సోమందేపల్లి వద్ద రైల్వే టన్నెల్‌ పనులు పెండింగ్‌లో ఉండగా... వీటిలో హిందూపురం వద్ద పనులు పూర్తయ్యాయి. త్వరలో సోమందేపల్లి వద్ద పనులు కూడా పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి నాలుగో వారానికి లేపాక్షి వరకు నీటిని తీసుకెళ్తామని జలవనరులశాఖ ముఖ్య ఇంజినీర్‌ (ప్రాజెక్ట్స్‌) సుధాకర్‌బాబు ‘ఈనాడు’కు తెలిపారు. హిందూపురం సమీపంలోని భూసేకరణ సమస్య కొలిక్కి వస్తే, అదే సమయానికి హిందూపురం వరకు కూడా మడకశిర బ్రాంచి కాల్వలో నీటిని తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వివరించారు.

Link to comment
Share on other sites

ఇంపుగా జలం.. ఇంకేల భయం! 
భైరవానితిప్ప, పేరూరుకు మహర్దశ 
రెండు జలాశయాలకు కృష్ణా జలాలు 
రూ.1,600 కోట్లకుపైగా అంచనా వ్యయం 
పది రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వుల జారీ... 
atp-top1a.jpg

‘‘జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ దాదాపు ముగింపు దశకు వస్తున్నాయి. నేను మాటిచ్చిన రెండు జలాశయాలకు నీటి తరలింపుపై ప్రాజెక్టులు మాత్రం పట్టాలెక్కలేదు. వీటిపై కూడా ఇదే నెలలో ఉత్తర్వులు ఇచ్చి.. పనులు శరవేగంగా పూర్తయ్యేలా దృష్టి సారిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ధర్మవరం జన్మభూమి సభలో ప్రకటించారు. దీంతో భైరవానితిప్ప, పేరూరు జలాశయాలకు మున్ముందు మంచి రోజులు రానున్నాయి. ముఖ్యమంత్రి చొరవతో బుక్కపట్నం చెరువుకు మాదిరి తమకూ పుష్కలంగా జలాలు వస్తాయనీ.. భవిత బంగారుమయం అవుతుందని ప్రజల ఆనందానికి హద్దు లేకుండా ఉంది.’’

ఈనాడు - అనంతపురం

రాయదుర్గం పరిధిలోని గుమ్మఘట్ట మండలంలో ఉన్న భైరవానితిప్ప జలాశయం (బీటీపీ), రాప్తాడు పరిధిలోని రామగిరి మండలంలోని అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్ట్‌కు (పేరూరు) మంచిరోజులు వచ్చాయి. ఎగువన కర్ణాటకలో చేపట్టిన నిర్మాణాలతో ఈ రెండు జలాశయాలకు నీరు రావడమే గగనమైంది. దీంతో వీటికి నీరు ఇవ్వాల్సిన ఆవశ్యకతను ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. 2016 ఆగస్టులో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం ప్రకటన చేశారు. హంద్రీనీవా ద్వారా జీడిపల్లి జలాశయానికి వచ్చే నీటిని అటు బీటీపీ,  ఇటు పేరూరుకు తీసుకెళ్తామని ప్రకటించారు. అక్కడి వరకు కాల్వలు, మధ్యలో అవసరమైన చోట ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తామన్నారు. సీఎం ప్రకటన తర్వాత ఈ నీటి తరలింపు ప్రాజెక్టులపై ఎన్నో కసరత్తులు జరిగాయి. వాస్తవానికి ఏవైనా నీటిపారుదల ప్రాజెక్టులు మంజూరుకు ఉన్నతాధికారులు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. చేపట్టబోయే కొత్త ప్రాజెక్ట్‌ రాష్ట్ర బడ్జెట్‌లోని జల వనరుల శాఖకు కేటాయించే బడ్జెట్‌ కోటా లోపే ఉంటుందా అనేది చూస్తారు. అలాగే వెచ్చించిన నిధులతో ఎంత ప్రయోజనం (కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో-సీబీఆర్‌).. అంటే ప్రాజెక్టుకు ఖర్చు చేసే నిధులు ఎక్కువ, ప్రయోజనం పొందే ఆయకట్టు తక్కువగా ఉండకూడదు. ఇంకా బడ్జెట్‌ ఎక్కువగా ఉంటే ఆర్థిక శాఖ వద్ద దస్త్రం ఆగిపోతుంది. అయితే ఈ ప్రాజెక్టులు దాదాపు అన్ని అవాంతరాలు దాటాయి.

వలసలు ఆపేందుకు అడుగు... 
వేదవతి నదిపై గుమ్మఘట్ట మండలంలో నిర్మించిన బీటీపీ ప్రాజెక్టుకు ఎగువన కర్ణాటకలో నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో నీరు రావడంలేదు. దీంతో ఈ ప్రాంతంలో సాగు కనుమరుగై... భూగర్భ జలం కూడా దిగువకు చేరింది. ఫలితంగా ఇక్కడ వలసలు అధికంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో జీడిపల్లి నుంచి ఉప్పొంక వరకు 28 కి.మీ. మేర 8 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తీసుకెళ్లి.. అక్కడి నుంచి 32.625 కి.మీ. మేర గ్రావిటీపై బీటీపీకి నీరు తరలించాలని ఇంజినీర్లు ప్రణాళిక రూపొందించారు. ఇదంతా మొదటి దశగా పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే ఉప్పొంక నుంచి కుందుర్పి వరకు మరో కాల్వ, ఆరు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తీసుకెళ్లి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చెరువులను నింపాలనే ప్రతిపాదన కూడా తయారు చేశారు. దీనిని రెండో దశగా పేర్కొంటున్నారు. మొదటి దశకు దాదాపు రూ.969 కోట్ల వరకు అవసరమని తుది అంచనా వేశారు. ఇందులో రెండో దశకు కూడా మరో రూ.350 కోట్లు వ్యయం కానుంది. ఈ ప్రాజెక్ట్‌తో బీటీపీకి 2 టీఎంసీల నీరు, చెరువులకు 1.7 టీఎంసీల నీరు అందుతుంది. చెరువుల కింద మరో 10 వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. ప్రస్తుతం మొదటి దశకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తోంది. ఇందులో ప్రయోజనం పొందే ఆయకట్టు కంటే అంచనా వ్యయం ఎక్కువగా ఉండటంపై ఆర్థిక శాఖ మోకాలడ్డింది. అయితే ఈ ప్రాంతంలో కరవు నుంచి, వలసల నుంచి మోక్షం లభించాలంటే ఈ ప్రాజెక్ట్‌ అవసరమని మంత్రి కాలవ శ్రీనివాసలు బలంగా వినిపించిన వాదన ఫలించింది. చివరకు ఆర్థికశాఖ వద్ద దస్త్రం ఆమోదం పొందగా, ఇప్పుడు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చినట్లు తెలిసింది. దీనికి ఈ నెల 24న సీఎం ఉత్తర్వులిచ్చే అవకాశం ఉంది. 
రూ.810 కోట్లతో సాకారం... 
రామగిరి మండలంలోని పెన్నానదిపై నిర్మించిన పేరూరు ప్రాజెక్ట్‌కు కూడా ఎగువన కర్ణాటక చేపట్టిన కట్టడాల కారణంగా ఏళ్లుగా నీళ్లు రావడం లేదు. గతంలో కర్ణాటకలోని పరగోడు, నాగలమడుగు వద్ద కర్ణాటక చేపట్టిన కట్టడాలకు వ్యతిరేకంగా పరిటాల రవీంద్ర పెద్ద ఉద్యమాలే చేశారు. పేరూరు ప్రాజెక్ట్‌ పరిధిలోని రైతులు, ప్రజలతో కలిసి వెళ్లి అక్కడి కట్టడాలను అడ్డుకునే యత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో రవితోపాటు, అనేక మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. చివరకు ఆ కట్టడాలతో పేరూరు ప్రాజెక్ట్‌ బోసిపోయింది. ఈతరుణంలో ప్రాజెక్ట్‌కు జీడిపల్లి నుంచి కృష్ణా జలాలు అందించి పునరుజ్జీవం పోయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు జీడిపల్లి నుంచి 54 కి.మీ. మేర కాల్వ తవ్వకం, నాలుగు చోట్ల ఎత్తిపోతల పథకాలు, మధ్యలో ఉన్న కొన్ని చెరువులను మినీ జలాశయాలుగా మార్చి కృష్ణమ్మను పేరూరుకు తీసుకెళ్లనున్నారు. ఇందుకు రూ.810 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. బెళుగుప్ప, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లె, రామగిరి మండలాల మీదగా ఈ కాల్వ వెళ్తుంది. ఈ దస్త్రం ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత పరిపాలన పరమైన ఆమోదం, అటుపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ తంతు అంతా పది రోజుల్లో ముగించి పరిటాల రవి వర్ధంతి అయిన ఈ నెల 24 నాటికి ఉత్తర్వులిస్తామని స్వయంగా సీఎం ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ కూడా జలకళ సంతరించుకునే అవకాశం లభించింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఈ బీటీపీ, పేరూరుకు టెండర్లు పిలిచి, పనులు ఆరంభించేందుకు శంకుస్థాపన కూడా చేయనున్నారు.

రాయదుర్గానికి ఎంతో కీలకం 
- కాలవ శ్రీనివాసులు, మంత్రి 
భైరవానితిప్ప జలాశయానికి ఎలాగైనా మళ్లీ నీరు వచ్చేలా చూడాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్నా. అప్పుడే రాయదుర్గంలో కొంత వరకు వలసలు ఆపే వీలుంది. నీరొస్తే పంటలు పండటమే కాక వేల బోర్లు రీఛార్జి అవుతాయి. వాస్తవానికి కృష్ణా ట్రిబ్యునల్‌లో బీటీపీకి 4.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. వేదవతి నది కృష్ణా బేసిన్‌లో ఉండటమే దీనికి కారణం. అలాగే ప్రస్తుతం హంద్రీనీవా మొదటి దశ కాల్వ విస్తరణతోపాటు, ప్రస్తుతం మల్యాల నుంచి తీసుకుంటున్న నీరు, ఇకపై ముచ్చుమర్రి నుంచి కూడా నీటిని తేనుండటంతో తక్కువ రోజుల్లో ఎక్కువ నీరు జిల్లాకు వస్తుంది. అందులో బీటీపీకి కూడా తరలించే వీలుంది.

రవి చిరకాల స్వప్నం 
- పరిటాల సునీత, మంత్రి 
పేరూరు ప్రాజెక్ట్‌కు నీరు వచ్చేలా చూడాలనేది పరిటాల రవి చిరకాల కోరిక. మా ప్రాంతం ఎడారి కాకుండా చూడాలంటే ఈ ప్రాజెక్ట్‌కు నీరురావాలని ఆయన ఎంతో ప్రయత్నాలు చేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టిసారించాం. ముఖ్యమంత్రి కూడా గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఈ జలాశయానికి వచ్చినప్పుడు నీరిస్తామని ఇచ్చిన హామీ మేరకు జీడిపల్లి నుంచి నీటి తరలింపునకు వీలుగా ప్రకటన చేశారు. ఇప్పుడు అవసరమైన అన్ని ఆమోదాలు తెలిపి, ఉత్తర్వులు ఇవ్వనుననారు. వీలైనంత త్వరగా ఈ కాల్వ పనులు పూర్తయ్యేలా చూస్తాం. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలు, రైతుల కళ్లలో ఆనందం చూస్తాం.

భైరవానితిప్ప 
* ఎక్కడుంది: గుమ్మఘట్ట మండలం 
* ఏ నదిపై...: వేదవతి 
* ఎప్పుడు నిర్మించారు: 1962 
* నీటినిల్వ సామర్థ్యం: 2 టీఎంసీలు 
* ఆయకట్టు: 12,000 ఎకరాలు 
* కృష్ణమ్మ వస్తే: ఆయకట్టుకు,

104 చెరువులకు నీరు 
అప్పర్‌ పెన్నార్‌ (పేరూరు) 
* ఎక్కడుంది: రామగిరి మండలం 
* ఏ నదిపై...: పెన్నా 
* ఎప్పుడు నిర్మించారు: 1959 
* నీటినిల్వ సామర్థ్యం: 1.8 టీఎంసీలు 
* ఆయకట్టు: 10,500 ఎకరాలు 
* కృష్ణమ్మ వస్తే: ఆయకట్టుకు నీరు, 
30-40 కి.మీ.మేర భూగర్భజలం పెంపు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...