Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
లాహిరి.. లాహిరిలో..
12-10-2018 08:39:26
 
636749303678928400.jpg
  • నేటి నుంచి సాగర్‌ - శ్రీశైలం లాంచీ ప్రయాణం
  • వారంలో రెండు రోజులు మాత్రమే..
  • ఏర్పాట్లు పూర్తి చేసిన పర్యాటక శాఖ
 విజయపురిసౌత్‌: చుట్టూ నీరు.. అడవుల నడుమ పచ్చని కొండలు.. పక్షుల కిలకిలరావాలు.. వీటి మధ్య లాంచీ ప్రయాణం సిద్ధమైంది. నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు ఆరుగంటల లాంచీ ప్రయాణం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర టూరిజం శాఖ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లాంచీలో అంతదూరం ప్రయాణించాలంటే సాగర్‌ నీటి మట్టం 565 నుంచి 570 అడుగులు ఉండాల్సిందే. అంతకుమించి తగ్గితే దారిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నీరు సాగర్‌లో సమకూరింది. దీంతో శుక్రవారం నుంచి నాగసిరి లాంచీని అధికారులు ఏర్పాటు చేశారు. పర్యాటకుల రక్షణ నిమిత్తం లాంచీలో లైఫ్‌ జాకెట్లు ఇతరత్రా భద్రతా చర్యలు తీసుకున్నారు.
 
బుకింగ్‌ ఇలా...
htrthh.jpgనీటిమట్టం తగ్గేలోగా వీలైనంత మంది పర్యాటకులకు ఈఅవకాశం కల్పించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌లో ఏపీటీడీసీ.ఇన్‌కు లాగినై గానీ, ఫోన్‌: 08642242357కు ఫోన్‌ చేసి గానీ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లాంచి సామర్థ్యం వందమంది కావడంతో బుకింగ్‌ను బట్టి లాంచీస్టేషన్‌ అధికారులు తదనుగుణ సమాచారమిచ్చి ప్రయాణాన్ని ఖరారు చేస్తారు. ప్రతి బుధ, శుక్ర వారాల్లో ఉదయం 10 గంటలకు విజయపురిసౌత్‌ లాంచీ స్టేషన్‌ నుంచి బయలుదేరి తరువాతి రోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి లాంచీ ఇక్కడకు చేరుకుంటుంది.
 
ప్రత్యేక ప్యాకేజీ
ఇక్కడి నుంచి 110 కి.మీ.లు దూరంలో ఉన్న శ్రీశైలంకు లాంచీలో ఆరు గంటల సమయం పడుతుంది. బస చేయడానికి, దైవదర్శనంకు ప్యాకేజీ ఏర్పాటు చేశారు. శ్రీశైలం వరకు అయితే.. మధ్యాహ్న భోజన సదుపాయం కలిపి ఒకొక్కరికి రూ.1,290గా, తిరుగు ప్రయాణం కూడా చేస్తే భోజనం, బసతో కలిపి పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,800గా ప్యాకేజీ నిర్ణయించారు. శ్రీశైలంలో దైవదర్శనానికి పర్యాటకులే టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది.
 
రద్దీని బట్టి మరో లాంచీ
hthererg.jpg
Link to comment
Share on other sites

  • 2 weeks later...

గుత్తి కోట అధికార పోరాటానికి కేంద్రం మరియు మధ్యయుగ కాలంలో అనేక యుద్ధాలు జరిగాయి. కోట హిందూ-ఇస్లామిక్ శిల్పకళకు సమ్మేళనం.గతంలో ఈ ప్రాంతాన్ని గౌతంపురి అని పిలిచేవారు, తరువాత గుత్తి అని పేరు మార్చారు.

https://pbs.twimg.com/media/DqLO6ZYV4AApCQo.jpg

https://pbs.twimg.com/media/DqLO6ZiVAAAya0v.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...