Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
పర్యాటక అభివృద్ధికి.. మీనమేషాలు!
09-01-2019 13:12:07
 
636826363277080846.jpg
  • ఆదరణ ఉన్నా వసతుల కల్పనలో వెనుకబాటు
  • భవానీ ద్వీపం, సూర్యలంకలో పెరగని కాటేజీలు
  • బోటింగ్‌ విభాగంపై ప్రత్యేక దృష్టి అవసరం
  • ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమింగ్‌పై దృష్టి సారించాలి
కృష్ణానదికి ఇరువైపులా ఇటు విజయవాడ.. అటు గుంటూరు వరకు ఉన్న ప్రాంతం పర్యాటకానికి కేంద్ర స్థానంగా ఉంటోంది. ఈ ప్రాంతంలో పర్యాటక కలాపాలు, పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నా అందుకు తగిన విధంగా పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పర్యాటక వసతులు కల్పించలేకపోతోంది. గడిచిన కొంత కాలంగా ఈ సంస్థ సొంతంగా అడుగులు ముందుకు వేయలేకపోతోంది. గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏపీటీడీసీ ఇప్పుడు నామమాత్రంగా మారింది.
 
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలు విజయవాడ డివిజన్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్నాయి. పర్యా టకాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించటానికి పర్యాటక శాఖ, బీఐటీసీ, ఏపీటీఏ, జిల్లా టూరిజం కమిటీలు ఉన్నప్పటికీ.. పర్యా టకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)పై ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి. ఆయా సంస్థలు భవానీ ఐలాండ్‌ డెవలప్‌మెంట్‌, క్యాపిటల్‌ బ్రాండింగ్‌ కల్పించటానికి మెగా ఈవెంట్స్‌, ఫెస్టి వల్స్‌ వంటి వాటిపై దృష్టి సారించినా.. ఏపీ టీడీసీ మాత్రం పర్యాటకుల సదు పాయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. రెండు జిల్లాల్లో పర్యాటకులకు వసతులు కల్పించటం ద్వారా సగటున నెలకు రూ.1.14 కోట్ల ఆదాయం వస్తోంది. మరికొన్ని నిధులు ఖర్చుపెట్టి మరిన్ని వసతులు కల్పించటం ద్వారా ఆదాయం గణనీయంగా పెంచుకోనే అవకాశం ఉంది.
 
రికార్డు స్థాయిలో ఆదాయం
4awberqw.jpgరెండు జిల్లాల్లో డిసెంబరు నెలలో రికార్డు స్థాయిలో రూ.1.54 కోట్ల ఆదాయం స మకూరింది. భవానీ ఐల్యాండ్‌కు రూ.40 లక్షలు, హరిత బెర్మ్‌పార్క్‌కు రూ.44 లక్షలు వెరసి రూ.84 లక్షల మేర వచ్చింది. మరో రూ.28 లక్షల మేర బోటింగ్‌ కార్యకలాపాల ద్వారా సమకూరింది. బాపట్లలోని సూ ర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌కు రూ.32 లక్షలు, అవ ురావతికి రూ.11 లక్షల మేర ఆదాయం వ చ్చింది. పర్యాటక కలాపాలు పెరగటం, పర్యా టకుల సంఖ్య పెరగటం వల్లే ఈ ఆదాయం సమకూరటం విశేషం. వారాంతాల్లో భవానీ ఐల్యాండ్‌, హరిత బెర్మ్‌పార్క్‌లకే రెండు వేల మంది పర్యాటకులు వస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతి ఆదివారం ఐదు వేల మంది పైగా వస్తున్నారు.
 
కాటేజీల సంఖ్య పెరగాలి
హరిత బెర్మ్‌పార్క్‌లో 30 సూట్లు, సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌లో 27 సూట్లు ఉన్నాయి. ఈ కాటేజీలకు సగటున 60 - 70 శాతం, వారాంతాలు, ప్రత్యేక సందర్భాల్లో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. భవానీ ఐల్యాండ్‌లో బీఐటీసీ నేతృత్వంలో రివర్స్‌ హౌస్‌ కాటేజీ, సింహం, జిరాఫీ ఆకారాల్లో మూడు కాటేజీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి త్వరలో ఏపీటీడీసీ నిర్వహణ చేతికి వస్తాయి. నాలుగు ట్రీ టాప్‌ కాటేజీలు కూడా ఉన్నాయి. కాటేజీలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.
 
చెక్‌ అవుట్‌ పద్ధతిలో..
ఏపీటీడీసీ విజయవాడ డివిజన్‌ ఇటీవల వీలైనంత ఎక్కువమందికి వసతి సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు చెక్‌ అవుట్‌ పె ట్టింది. మధ్యాహ్నం, సాయంత్రం సూట్లను తీసుకున్నా ఉదయం 9 గంటలకు చెక్‌ అవుట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యలకు చెక్‌ పెట్టాలంటే అదనపు కాటేజీలను నిర్మించాల్సిన అవసరం ఉంది. హరిత బెర్మ్‌పార్క్‌లో ఎన్‌హెచ్‌ - 65 వెంబడి జీ ప్లస్‌ 2 విధానంలో భారీ కాటేజీల నిర్మాణం చేయటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. భవానీ ఐల్యాండ్‌, సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌, అమరావతిలలో అదనపు కాటేజీల నిర్మాణం చేపట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. సూర్యలంకలో రెండు సూట్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.
 
బోటింగ్‌ విభాగంపై దృష్టి సారించాలి
Untitled-27.jpgహరిత బెర్మ్‌పార్క్‌, భవాని ఐలాండ్‌లకు ఉమ్మడి బోటింగ్‌ యూనిట్‌ ఉంది. సగటున బోటింగ్‌ యూనిట్‌ 80 నుంచి 90 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. మొత్తంగా కృష్ణానదిలో విహారం చేయటానికి 343 సీటింగ్‌ సామర్ధ్యం మాత్రమే ఉంది. కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే ఐదొందల సీటింగ్‌ కెపాసిటీకి తగిన వ్యవస్థ ఉండాలి. దీనికి అనుగుణంగా రెండు మెకనైజ్డ్‌ బోట్లకు టెండర్లు పిల వటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటి సామర్ధ్యం మరో 100 సీట్లకు ఉంటుంది. భవి ష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 250 సీటింగ్‌ అవసరాలకు సరిపడా బో ట్లను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది.
 
వీటిపై దృష్టి సారించాలి..
హరిత బెర్మ్‌పార్క్‌లోని బార్‌ ద్వారా ఏపీటీడీసీ సగటున రోజుకు 20 వేల వ్యాపారం జరుగుతోంది. రెస్టారెంట్ల ద్వారా మొత్తం ఆదాయంలో 20 శాతం పైగా వాటా ఉంటోంది. రెస్టారెంట్లను ఆధునికీకరణ చేయాల్సి ఉంది. ఫుడ్‌కోర్టులు, ఫుడ్‌స్టాల్స్‌ను కూడా సొంతంగా ఏర్పాటు చేసే అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. గేమింగ్‌కు సంబంధించి ద్వీపంలో స్పైడర్‌నెట్‌, జిప్‌లైర్‌, సైక్లింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, బంపర్‌ వంటి ఆటల ని ర్వహణను ప్రైవేటుకు అప్పగించారు. వీటిలో చిన్నపాటి గేమ్స్‌కు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వసుతన్నాయి. వీటిని ఏపీటీడీసీ స్వయంగా ఏర్పాటు చేయటంతో పాటు, మరిన్ని వినోద ప్రదమైన గేమింగ్‌కు అవకాశం క ల్పించాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

ఏపీ పర్యాటక విధానం అద్భుతం

 

అయిదేళ్లలో ఆ రంగంలో అగ్రగామిగా అవతరిస్తుంది
అక్కడ దార్శనిక నాయకత్వం ఉంది
కేంద్ర పర్యాటకశాఖ సంయుక్త కార్యదర్శి సుమన్‌ భల్లా ప్రశంస
ఈనాడు - దిల్లీ

చ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ దేశ పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలవబోతోందని కేంద్ర పర్యాటకశాఖ సంయుక్త కార్యదర్శి సుమన్‌భల్లా పేర్కొన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేని అద్భుతమైన పర్యాటక విధానాన్ని ఆ రాష్ట్రం తీసుకొచ్చిందని ప్రశంసించారు. పెట్టిన పెట్టుబడులకు దీర్ఘకాల ప్రతిఫలం పొందాలంటే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన తరుణమన్నారు. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులపై ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో శుక్రవారం  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘2017లో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య కోటి దాటింది. 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి కోటి మంది విదేశీ పర్యాటకులు రావడం చాలా తక్కువ. మనదేశంలోని ఒక నగరంతో సమానంగా ఉండే దుబాయ్‌కి యేటా 1.30 కోట్ల మంది విదేశీ పర్యాటకులు రాకపోకలు సాగిస్తున్నారు. దుబాయ్‌ కంటే వంద రెట్లు ఎక్కువ వృద్ధిసాధించడానికి మన దగ్గర అవకాశం ఉంది. ఇందుకోసం మన దృక్పథాన్ని, విధానాలను పూర్తిగా మార్చుకోవాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఇది సాధించగలం. ప్రస్తుత రుణ విధానం, వాటిపై విధిస్తున్న వడ్డీ అంత ఆశాజనకంగా లేదు. దాని గురించి కొంత ఆలోచించాలి. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ అద్భుతం. దార్శనిక నాయకత్వంలో స్పష్టమైన విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ ముందుకెళ్తోంది. 21రోజుల్లో అన్ని అనుమతులూ కచ్చితంగా ఇస్తామని ధైర్యంగా చెప్పగలిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. ప్రస్తుతం అక్కడ బలమైన ప్రభుత్వం, నిబద్ధతగల అధికార యంత్రాంగం ఉంది. భవిష్యత్తులో అద్భుతమైన సౌభాగ్యాన్ని చూస్తారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున ఇప్పటికే రూ.300 కోట్ల ప్రాజెక్టులు మంజూరుచేశాం. బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌కు ఇప్పుడు రూ.100 కోట్లు మంజూరయింది.’’ అని సుమన్‌ భల్లా అన్నారు.

2021 నాటికి 25వేల హోటల్‌ గదుల నిర్మాణమే లక్ష్యం
విజయవాడలో మూడు స్టార్‌బక్స్‌ ఔట్‌లెట్లు తెరవనున్నట్లు ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ తెలిపారు. బాపట్లలో గోల్డన్‌శ్యాండ్స్‌ సంస్థతో కలిసి ఐటీసీ సంస్థ కొత్తగా 200 హోటల్‌ గదులు నిర్మించడానికి సుముఖత వ్యక్తం చేసిందన్నారు. దీనివల్ల రూ.100 కోట్ల పెట్టుబడి వస్తుందన్నారు. ఏపీసీఆర్‌డీఏ అసిస్టెంట్‌ కమిషనర్‌ షాన్‌మోహన్‌ మాట్లాడుతూ అమరావతిలో టూరిజం సిటీ నిర్మాణం కోసం 11వేల ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ఏపీ పర్యాటక శాఖ డైరెక్టర్‌ హిమాన్షుశుక్లా మాట్లాడుతూ 2021కల్లా ఏపీలో 25వేల హోటల్‌ గదులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో కొత్తగా పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించేవారికి, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను 50%మేర విస్తరించేవారికి రాష్ట్ర జీఎస్‌టీలో కొంతభాగాన్ని తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన దస్త్రం ఆర్థికశాఖ పరిశీలనలో ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీఈడీబీ ఓఎస్‌డీ భావనా సక్సేనా, ఐటీసీ డైరెక్టర్‌ నకుల్‌ ఆనంద్‌ తదితరులు మాట్లాడారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...